👉మోడీజీ ప్లీజ్ అంటూ ..విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయవద్దని పదిలక్షల పోస్టు కార్డులతో ! పోస్టు కార్డు గుర్తుందా అంటే ఈనాటి తరం చెప్పలేదేమో. ఎందుకంటే పోస్టాఫీసు కూడా ఎక్కడ ఉందో తెలియని జనరేషన్ నడుస్తోంది. పోస్టు కార్డు గుర్తుందా అంటే ఈనాటి తరం చెప్పలేదేమో. ఎందుకంటే పోస్టాఫీసు కూడా ఎక్కడ ఉందో తెలియని జనరేషన్ నడుస్తోంది. ఆఖరుకు ఉద్యోగాలకు ఉన్నత కోర్సులలో చేరేందుకు దరకాస్తులు అన్నీ ఆన్ లైన్ లోనే జరిగిపోతున్న వేళ పోస్ట్ మ్యాన్ తో పోస్ట్ ఆఫీసుతో పని లేకుండా పోతోంది. అయినా సరే పోస్టు ఆఫీసుకు ఒక చరిత్ర ఉంది. పోస్టు కార్డుకు బరువైన ఎమోషన్ ఉంది. కొన్ని వందల సార్లు ఫోన్ లో మాట్లాడినా లేని రాని ఎమోషన్ ఒక్క పోస్ట్ కార్డుతో వస్తుంది. అందులోని రాత దశాబ్దాల వెనక్కి తీసుకెళ్ళి మధుర జ్ఞాపకంగా కూడా మదిలో ఉంచగలదు. అంతే కాదు అవతల వారి బాధలు విన్నపాలు కూడా వారి బరువైన హృదయాన్ని అనువదించి చేరాల్సిన చోటుకు ఆ వినతులను చేర్చగలదు. అందుకే విశాఖ ఉక్కు ఉద్యమంలో సరికొత్త మలుపులుగా పోస్టు కార్డు ని వారధిగా చేసుకుని వినూత్న ఉద్యమానికి తెర తీశారు. ఉత్తరాంధ్రా ప్రజా సంస్థ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉక్కు ఉద్యమకారుడు, మాజీ మంత్రి, స్వాతంత్ర సమరయోధుడు, విశాఖకే తలమానికం లాంటి ప్రజా నాయకుడు అయిన తెన్నేటి విశ్వనాధం వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం విశాఖ బీచ్ లో చేపట్టిన పోస్టు కార్డు ఉద్యమానికి మంచి స్పందన లభించింది. ప్రధాని మోడీజీ అంటూ విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలనై కోరుతూ ఏకంగా పది లక్షల పోస్టు కార్డులతో భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఉత్తరాంధ్రాలో ఉన్న ప్రతీ కుటుంబం నుంచి ఒక పోస్టు కార్డు ప్రధానమంత్రి కార్యాలయానికి చేరేలా ఉత్తరాంధ్రా ప్రజా సంస్థ చర్యలు తీసుకుంటోంది. ఇంటింటికీ సంస్థ ప్రతినిధులు వెళ్ళి వారి నుంచి పోస్టు కార్డుల ద్వారా విశాఖ ఉక్కు ఆవశ్యకతను ప్రధానికి తెలియచేస్తారు. విశాఖ ఉక్కు త్యాగాల పునాదుల మీద ఏర్పడిందని దానిని ప్రైవేట్ పరం చేయవద్దు అని కోరుతూ విన్నపాలతో కూడిన పోస్టు కార్డులను లక్షలల్లో పంపిస్తారు. దానివల్ల ఉత్తరాంధ్రా ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో ప్రధానికి నేరుగా తెలిసే అవకాశం ఉందని ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. పది లక్షల పోస్టు కార్డులు ప్రధాని ఆఫీసుకు పంపిస్తామని దీని వల్ల ఉత్తరాంధ్రా సెంటిమెంట్ గా విశాఖ ఉక్కు ఎలా ఉందో వారికి అర్థం అవుతుందని అంటున్నారు. ఇక జనవరి 27న విశాఖ నడిబొడ్డున లక్ష మందితో భారీ సభను నిర్వహించడం ద్వారా విశాఖ ఉక్కుని కాపాడుకునేందుకు చూస్తున్నారు. ఇదిలా ఉంటే విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేసే ఆలోచన లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసరాజు ప్రకకటించారు. విశాఖ ఉక్కుని లాభాల బాటలో నడిపేందుకు ప్రభుత్వం చూస్తోందని ఆయన అంటున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రం నిబద్ధతతో ఉందని ఆయన చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేయవద్దంటూ పది లక్షల పోస్టు కార్డులు ఒకేసారి కేంద్రానికి చేరితే కేంద్రం స్పందన ఎలా ఉంటుంది అన్నది కూడా చర్చగా ఉంది. ఒక ఉద్యమం కోసం పది లక్షల పోస్టు కార్డులు పంపించడం అన్నది ప్రపంచ రికార్డు అని ఉక్కు ఉద్యమ కారులు అంటున్నారు.
👉రాజ్యాంగం రెడ్‌బుక్‌ని అర్బన్ నక్సలిజంతో పోలుస్తారా… అంటూ ప్రధాని మోదీ, బీజేపీలను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రశ్నించారు. అటువంటి ప్రతినే 2017లో ప్రధాని మోదీ అప్పటి రాష్ట్రపతి కోవింద్‌కి ఇచ్చారని గుర్తుచేశారు. అందుకు సంబంధించిన ఫొటోని ఖర్గే విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. నవంబరు 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మహా వికాస్ అఘాడీ(ఎంవీయే) మేనిఫెస్టో ఆదివారం విడుదల చేసిన ఆయన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ… ఈ వ్యాఖ్యలు చేశారు. వివిధ సామాజిక వర్గాల స్థితిగతులను తెలుసుకుని వెనుకబడిన వర్గాల వారికి లబ్ధి చేకూర్చేందుకే కాంగ్రెస్ కులగణన చేయాలని డిమాండ్ చేస్తుందే తప్ప ప్రజలను విభజించేందుకు కాదన్నారు. అలాగే రెడ్‌బుక్ రాజ్యాంగ ప్రతిని చూపిస్తూ ప్రధాని మోదీ, బీజేపీ చెబుతున్నట్లు అది ఖాళీ పుస్తకం కాదన్నారు. ప్రధానిని మళ్లీ ప్రాథమిక పాఠశాలలో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. కాగా రెడ్‌బుక్ చేతబూని రాహుల్‌గాంధీ అర్బన్ నక్సల్స్, అరాచక శక్తుల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల ఆరోపించారు.
👉అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది జగన్ తీరు: వైఎస్ షర్మిల.. *అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారాం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసింది..ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది..ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనం..*హోదా లేకున్నా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే పలుమార్లు ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించారు..*అసెంబ్లీకి వెళ్లే దమ్ము, ధైర్యం లేకుంటే వైసీపీ శాసనసభాపక్షం మొత్తం రాజీనామాలు చేయండి.*
*’ఎక్స్’ వేదికగా ట్వీట్ చేసిన వైఎస్ షర్మిల*
👉హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరు పక్షాలు అంగీకరించకపోవడంతో మధ్యవర్తిత్వం నుంచి వైదొలుగుతున్నట్లు ఖతార్ ప్రకటించింది. అమెరికా తాజా సూచన మేరకు దోహాలో కార్యకలాపాలు ముగించాలని ఖతార్ హమా్‌సకు సూచించినట్లు సమాచారం. 2012లో అమెరికా సూచనమేరకే దోహాలో హమాస్ కార్యకలాపాలకు ఖతార్ అంగీకారం తెలిపింది. అయితే హమా్‌సను వెళ్లిపొమ్మన్నట్లు వస్తున్న కథనాలను ఖతార్ అధికార వర్గాలు తోసిపుచ్చాయి. మరోవైపు, గాజా, లెబనాన్‌లో కాల్పుల విరమణ కోసం యూఏఈ, కువైట్ పిలుపునిచ్చాయి.
👉బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు..బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు..మహారాష్ట్రకు చెందిన మాజీ మంత్రి, ఎన్‌సీపీ సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సిద్ధిఖీపై కాల్పులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న షూటర్ శివకుమార్‌తోపాటు మరో నలుగురిని ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా, అక్టోబరు 12న బాబా సిద్ధిఖీని హత్య చేసిన సంగతి తెలిసిందే.
👉 ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ అధికారి మృతి
ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ అధికారి మృతి
జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు, జవాన్ల మధ్య కాల్పుల మోత మోగింది. కిశ్త్‌వాడ్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ ఆర్మీ అధికారి మృతిచెందాడు. మరో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల కిశ్త్‌వాడ్ జిల్లాలో ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి హతమార్చారు. దీంతో వారిని పట్టుకునేందుకు బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరిగాయి.
👉తాడిపత్రి టౌన్ లో అర్థరాత్రి గంజాయి బ్యాచ్ హల్చల్* అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ కృష్ణాపురం 5వ రోడ్డులో ఆదివారం రాత్రి గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. కొందరు యువకులు గంజాయి సేవించి ఇరగ వేస్తూ బైకులపై తిరుగుతూ హల్చల్ చేశారు. ఇదేమిటని ప్రశ్నించిన కాలనీవాసులపై దాడికి తెగబడ్డారు ఒక బైక్ ధ్వంసం చేశారు. కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుటా హుటిన పోలీసులు కృష్ణాపురం ఐదవ రోడ్డు కాలనీకి వెళ్లి విచారణ చేపట్టారు.
👉ఉ.10:30 గంటలకు వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావద్దని నిర్ణయం
జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు వైసీపీ నిరసన
మాక్ అసెంబ్లీ నిర్వహించనున్న వైసీపీ ఎమ్మెల్యేలు
కౌన్సిల్‌కు మాత్రమే హాజరుకానున్న YCP ఎమ్మెల్సీలు
👉 మైనారిటీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన టీ-ప్రైమ్ పథకం అమలుకు మార్గదర్శకాలను ఖరారు చేయాలని తెలంగాణ చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ (టెక్‌టీప్) వ్యవస్థాపక డైరెక్టర్ అబూ ఫతేసయ్యద్ బందగి బాషా రియాజ్ ఖాద్రీ డిమాండ్ చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆరేళ్ల క్రితం ప్రకటించిన టీప్రైమ్ స్కీమ్ కేవలం కాగితాలకే పరిమితమైందని ఆయన పేర్కొన్నారు. దళితుల తరహాలోనే మైనారిటీ వర్గాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని టెక్‌టీప్ చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి పంపిన లేఖలో విజ్ఞప్తి చేశారు.
👉సుప్రీంకోర్టు సీజేఐగా 11న సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం.. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణం చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రస్తుత చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం ఆదివారంతో ముగిసింది. ఆయన స్థానంలో సుప్రీంకోర్టు సీజేఐగా ఎంపికైన జస్టిస్ సంజీవ్ ఖన్నా 2019 జనవరి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు. 2025 మే రెండో వారం వరకూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా వ్యవహరిస్తారు.
ఖన్నా కుటుంబ సభ్యుల నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన సంజీవ్ ఖన్నా మూడో వ్యక్తి. అంతకు ముందు ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పని చేసిన దేవీరాజ్ ఖన్నా కొడుకే సంజీవ్ ఖన్నా. సుప్రీంకోర్టు జస్టిస్ హెచ్ఆర్ ఖన్నాకు సమీప బంధువు. జస్టిస్ సంజీవ్ ఖన్నా పలు చారిత్రక తీర్పులు ఇచ్చిన వారిలో ఒకరు. ఈవీఎంల పవిత్రతతోపాటు ఎన్నికల బాండ్ల రద్దు, 370 ఆర్టికల్ రద్దు, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ వంటి కేసుల్లో తీర్పులు ఇచ్చారు.
1960 మే 14న జన్మించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయవిద్యను అభ్యసించారు. నేషనల్ లీగల్ సర్వీస్ అధారిటీ (ఎన్ఏఎల్ఎస్ఏ) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా పని చేశారు. 1983లలో న్యాయవాదిగా ఢిల్లీ బార్ కౌన్సిల్ లో పేరు రిజిస్టర్ చేసుకున్నారు. తొలుత తీస్ హజారీ కాంప్లెక్సులోని జిల్లా కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. సుదీర్ఘకాలం ఆదాయం పన్ను విభాగం సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ గా కొనసాగిన సంజీవ్ ఖన్నా.. 2004లో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ స్టాండింగ్ కౌన్సిల్ (సివిల్)గా నియమితులయ్యారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన సంజీవ్ ఖన్నా.. తదుపరి ఏడాది శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు.
ఇక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా వైదొలుగుతున్న డీవై చంద్రచూడ్ శుక్రవారం నలుగురు న్యాయమూర్తుల బెంచ్ కు సారధ్యం వహించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎనిమిదేండ్ల చరిత్రలో రికార్డు స్థాయిలో 38 రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేశారు. గత రెండేండ్లుగా 21,358 కేసుల్లో బెయిల్ తోపాటు 1.07 లక్షల కేసులను పరిష్కరించారు. చివరి పనిదినం శుక్రవారం తన కెరీర్ లో చేపట్టిన విషయాలను వెల్లడించారు. జస్టిస్ చంద్రచూడ్ సేవలను సీజేఐగా ఎంపికైన జస్టిస్ రాజీవ్ కన్నా, అటార్నీ జర్నల్, సొలిసిటర్ జర్నల్, సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కపిల్ సిబాల్ ప్రశంసించారు.
👉కడప జిల్లా…
వైసీపీ సోషల్ మీడియా వర్రా రవీంద్ర అరెస్ట్..
కడప సికే దీన్నే పోలీస్ స్టేషన్ లో వర్రా రవీంద్ర..
ఈరోజు కడప కోర్ట్ లో హాజరు పరిచే అవకాశం…
వర్రా రవీంద్ర తో పట్టు మరో ఇద్దరు అరెస్ట్.. వాళ్లు ఎవరన్నది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
👉సీసీ టీవీ ఫుటేజీ లీకేజీ వ్యవహారంలో టెక్నీషియన్ & విలేకరిపై కేసు*గుంటూరు :
*డేటా చౌర్యం – దుర్వినియోగంపై విచారణ*
గుంటూరులోని అరండల్ పేట ఠాణాలో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కు పోలీసులు రాచమర్యాదలు చేసిన ఘటనలో సీసీటీవీ ఫుటేజీ లీకేజీకి సంబంధించి టెక్నీషియన్తో పాటు ఓ దినపత్రిక విలేకరిపై కేసు నమోదు చేసిన పోలీసులు.రిమాండ్ ఖైదీ అనిల్ కుమార్ అరండల్ పేట పోలీస్ స్టేషన్లో బల్లపై దిండు, దుప్పటి సమకూర్చి పడుకోబెట్టడం, రౌడీషీటర్ కుర్చీలో కూర్చొని.. పోలీసులతో గట్టిగా మాట్లాడిన సీసీ కెమెరా ఫుటేజీని అరండల్పేటకు చెందిన టెక్నీషియన్ శేషగిరిరావు అలియాస్ శేషు ఓ దినపత్రిక విలేకరి అరుణ్ కుమార్ కు ఇచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఎస్పీ సతీష్ కుమార్ లు కేసు నమోదుచేయాలని పోలీసుల్ని ఆదేశించారు.దీంతో ఎస్సై కృష్ణబాజి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
👉 జర్నలిస్టుల పై అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ పోలీసులకు వినతిపత్రం ఇచ్చిన కడప జర్నలిస్టులు..
వేంపల్లి రిపోర్టర్ చిన్న దస్తగిరి రెడ్డి పై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని తెలుగు జర్నలిస్ట్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో జిల్లా ఆడిషనల్ (అడ్మిన్) ఎస్పీ ప్రకాష్ బాబుకు వినతి పత్రం అందజేసిన జర్నలిస్టులు..
సమగ్ర విచారణ చేసి న్యాయం చేస్తామని జర్నలిస్టులకు హామీ ఇచ్చిన జిల్లా అడిషనల్ ఎస్పి ప్రకాష్ బాబు..
ఈ కార్యక్రమంలో తెలుగు జర్నలిస్ట్ ఫోరమ్ జిల్లా కన్వీనర్ ఉప్పు శ్రీకాంత్, కో కన్వీనర్ కృష్ణమూర్తి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కో కన్వీనర్ రామచంద్ర, సలహాదారులు సుధీర్ కుమార్, పలువురు కమిటీ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
👉అత్తాపూర్‌లో దారుణం..*
ఇంటి అద్దె కట్టలేదని కుటుంబంపై కత్తితో దాడి చేసిన యజమాని కుటుంబం.యజమాని దాడిలో యువతి చేతికి, తలకు కత్తిపోట్లు.. తీవ్రగాయాల పాలైన యువతిని హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.హసన్ నగర్ – గత కొన్ని రోజులుగా ఇంటి అద్దె చెల్లించకుండా ఉంటున్న ఓ కుటుంబం.అద్దె చెల్లించడం లేదంటూ కరెంటు కట్ చేసిన యజమాని.. దీంతో ఇరువురి మద్య ఘర్షణ.యజమానిపై దాడికి యత్నించిన కుటుంబం.. కోపంతో అద్దెకు ఉంటున్న కుటుంబంపై కత్తితో దాడి చేసిన యజమాని కుటుంబం.కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న అత్తాపూర్ పోలీసులు.
👉నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా టిడిపి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది, దీంతో పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు, ఈ సందర్భంగా వైసీపీకి చెందిన కార్యకర్తలు, నేతలు భారీగా కాకాని గోవర్ధన్ రెడ్డికి సంఘీభావంగా కాకాని వెంట నడిచారు….*
👉ఆర్జీయూకేటీలో విద్యార్థిని ఆత్మహత్య?..
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ లో ఈరోజు ఉదయం విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య కు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన సాయి ప్రియ పీయూసీ రెండో సంవత్సరం చదువుతోంది. ఇద్దరు స్నేహితులతో కలసి క్యాంపస్ వసతి గృహం లోనే ఉంటుంది. సోమవారం ఉదయం తన ఇద్దరు స్నేహితురాళ్లు అల్పాహారం కోసం వెళ్లగా.. గదిలో సాయి ప్రియ మాత్రమే ఉంది. వారు తిరిగి వచ్చే చూసేసరికి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి చేతిలో ఓ సూసైడ్ నోట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్జీయూకేటీకి ఇటీవల నూతన ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్ నియామకం తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం తొలిసారి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
👉ఒంగోలు లో అబుల్ కలాం అజాద్ జయంతి కి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కలెక్టర్ .ఎం పి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తదితరులు.
👉 *పొదిలి సర్కిల్ పరిధిలోని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఆధ్వర్యంలో అక్రమంగా మద్యం బెల్టు విక్రయిస్తున్న ఒక మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకొని వీరి వద్ద నుండి సుమారు 100 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ అధికారులు వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమారి,ఎస్సై సైమన్ సిబ్బంది తదితరులు*
👉హెడ్ కానిస్టేబుల్ హఠాన్మరణం*
వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు అసెంబ్లీలో నారా భువనేశ్వరి పై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆ మాటలను ఖండిస్తూ తమ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానంటూ అప్పట్లో ధైర్యంగా వాయిస్ మెసేజ్ ఇచ్చిన ఒంగోలు కు చెందిన హెడ్ కానిస్టేబుల్ (HC624) కె. విజయ్ కృష్ణ గుండెపోటుతో మృతి.
👉కుటుంబానికి అండగా..
మార్కాపురం మండలం కొట్టాలపల్లెలో మృతి చెందిన కానిస్టేబుల్ వేముల మస్తాన్ మృతదేహానికి పూల మాల నివాళులు అర్పించిన సీఐ సుబ్బారావు,ఎస్సై సైదుబాబు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు మస్తాన్ కుటుంబ సభ్యులకు 1.5 లక్షల చెక్కు మరియు 15వేల నగదు అందజేసిన పోలీసులు.కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ.
👉ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్న నాయబ్ రసూల్..
జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా
విజయవాడ నగరంలోని శ్రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉర్దూ భాషోధ్యాపకులు నాయబ్ రసూల్ ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుఉన్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్,అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ఆయనకు అభినందనలు తెలియజేశారు. డివిజన్ ఇంచార్జ్ అస్లాం బేగ్.
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయవద్దని పదిలక్షల పోస్టు కార్డులతో ..రాజ్యాంగం రెడ్‌బుక్‌ని అర్బన్ నక్సలిజంతో పోలుస్తారా..అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది జగన్ తీరు: షర్మిల..వైసీపీ సోషల్ మీడియా వర్రా రవీంద్ర అరెస్ట్..సీసీ టీవీ ఫుటేజీ లీకేజీ వ్యవహారంలో టెక్నీషియన్ & విలేకరిపై కేసు..అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ పోలీసులకు వినతిపత్రం ఇచ్చిన కడప జర్నలిస్టులు..ఆర్జీయూకేటీలో విద్యార్థిని ఆత్మహత్య?.. పొదిలిలో అక్రమ మద్యం స్వాధీనం..ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్న నాయబ్ రసూల్.
Recent Posts