👉బి ఆర్ ఎస్ పై ధ్వజమెత్తిన సీఎం రేవంత్ రెడ్డి..పది నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్ధమైందని ఒకాయన మాట్లాడుతుండు..?
మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు,తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేం లేదు..
ఈ పది నెలల్లో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు, రైతులు రైతు రుణమాఫీతో రుణ విముక్తులయ్యారు.
1కోటి 5లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో లబ్ది పొందారు.నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది..49 లక్షల 90వేల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్నారు.రూ.500లకే మా ఆడబిడ్డలు వంటగ్యాస్ సిలిండర్ అందుకోగలుగుతున్నారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10లక్షల వరకు ఉచిత వైద్యం అందుకోగలుగుతున్నారు.21వేల మంది టీచర్లు పదోన్నతులు పొందగలిగారు..35వేల మంది టీచర్ల బదిలీలు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిది..కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం, ప్రగతి భవన్ కట్టుకుండు కానీ.. రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించలేదు.మా ప్రభుత్వం రాగానే 100 నియోజవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం..విద్యనే తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తుందని నిరూపిస్తున్నాం..ఎన్ని అడ్డంకులు సృష్టించినా 563 గ్రూప్ ఉద్యోగాలకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించాం..త్వరలో వారికి నియామకపత్రాలు అందించి.. వారిని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేస్తాం..పది నెలల్లో రైతులు, నిరుద్యోగులను ఆదుకున్నాం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నాం..
తెలంగాణ పునర్నిర్మాణంలో ఇవన్నీ చేసాం..మీరు లేకపోయినా ఏం బాధలేదు.. మీతో ప్రజలకేం పని లేదు.. తెలంగాణ సమాజం నిన్ను మరిచిపోయింది.ఇప్పటికైనా మీలో మార్పు రావాలి.. ప్రభుత్వం చేసే మంచి పనులకు మద్దతు ఇవ్వండి.. లోపాలు ఉంటే సలహాలు ఇవ్వండి..బడి దొంగలను చూసాం కానీ.. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఉన్న విచిత్ర పరిస్థితి తెలంగాణలో చూస్తున్నాం..
👉 అట్టడుగు వర్గాల ప్రయోజనాలకు ఆటంకంగా బీఆర్ఎస్..బీఆర్ఎస్ వైఖరిని బీసీ సంఘాలు నిలదీయాలని సీతక్క పిలుపు..బీజేపీ బీ టీంగా కేసీఆర్ అండ్ కో..అందుకే ప్రజా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం..అప్పుడు అణచి వేత..ఇప్పుడు అవాస్తవాలు..బీఆర్ఎస్ చేసిన అప్పులూ వడ్డీలకే రూ. 54 వేల కోట్లు..సామాజిక న్యాయాన్ని, లౌకిక వాదాన్ని నిలబెట్టేందుకే ఎన్నికల ప్రచారం
👉బీఆర్ఎస్ పై మంత్రి సీతక్క ఫైర్*
బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంపై పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. అట్టడుగు వర్గాల ప్రయోజనాలకు ఆటంకంగా బీఆర్ఎస్ మారిందని, అందుకే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు బీఆర్ఎస్ అడ్డుపడుతుందని ఫైర్ అయ్యారు. సోమవారం నాడు సచివాలయంలో తనను కలసిన మీడియా ప్రతినిధులతో మంత్రి సీతక్క మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు, మహారాష్ట్ర ఎన్నికలు, కుల గణన వంటి అంశాలను ప్రస్తావించారు.
**కుల గణన కోసం వచ్చే అధికారులను నిలదీయాలని కేటీఆర్ పిలుపు ఇవ్వడాన్ని మంత్రి సీతక్క తప్పుబట్టారు. కులగణనను అడ్డుకునేలా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ ను బీసీ సంఘాలు నిలదీయాలని విజ్నప్తి చేసారు. కులగణనకు అడ్డుపడుతున్న బీఆర్ఎస్ వైఖరిని కుల అన్ని కుల సంఘాలు ఎండగట్టాలని కోరారు. కుల గణనను అడ్డుకుంటే బీసీ ద్రోహిగా బీఆర్ఎస్ మిగిలిపోవడం ఖాయమని హెచ్చరించారు. విదేశాల నుంచి రప్పించి మరీ బీఆర్ఎస్ కుటుంబ సర్వే చేసి ప్రజలకు నయా పైసా ప్రయోజనం చేయలేదన్నారు. సామాజిక వర్గాల వారిగా జనాభా లెక్క తేలితేనే సంక్షేమ వాటా సాధ్యమవుతుందన్నారు. తాము చేపట్టిన ఇంటింగి సమగ్ర సర్వేను బహిష్కరించడం అంటే తమ హక్కులను, అభివృద్దిని వదులుకోవడమే అవుతుందన్నారు సీతక్క. మేమెంతో.. మాకంత అన్న నినాదం నిజం కావాంటే సమగ్ర సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
క్లబ్బులు, పబ్బులు బంద్ అయ్యాక కొందరు నేతలు అరాచకంగా తయారయ్యారని, విజ్ఞత లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని సీతక్క మండిపడ్డారు. బీఆర్ఎస్ చెప్పుడు మాటలు నమ్మకుండా గత పదేండ్లలో జరిగిన నష్టాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి..ఎంత రుణ మాఫీ జరిగిందో ఆలోచించాలన్నారు. అట్టడుగు వర్గాలకు అందబోయే ప్రయోజనాలను అడ్డుకునేందుకే బీఆర్ఎస్ ఇంటింటి సర్వే ను వ్యతిరేకిస్తుందని సీతక్క చెప్పారు.
ఒక్క కేసీఆర్ కుటుంభానికి తప్ప ఏవరికీ లబ్ది జరగకూడదనే ఉద్దేశంతోనే ఇంటింటి సర్వేను బీఆర్ఎస్ అడ్డుకుంటుందని సీతక్క మండిపడ్డారు. ఇంటింటి సర్వే వద్దనుకుంటే ఎవరికి నష్టమో ప్రజలు ఆలోచించుకోవాలని మంత్రి సీతక్క సూచించారు.
మహారాష్ట్రలో బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు బీఆర్ఎస్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. కేసులు నుంచి తప్పించుకునేందుకు బీజేపీకి బీ టీం గా బీఆర్ఎస్ పనిచేస్తోందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి నుంచి పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అందులో భాగంగానే పదే పదే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజా ప్రభుత్వంపై విషం చిమ్ముతోందని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో చేతిలో చిల్లి గవ్వ లేకున్నా మహిళలు ఉచిత ప్రయాణాలు చేస్తున్నారని మంత్రి సీతక్క గుర్తు చేసారు. ఉచిత రవాణ పథకంపై దుష్ప్రాచారం చేస్తూ..
ఆటో డ్రైవర్లను ఉసి గొల్పి ధర్నాలు చేయిస్తుందని తెలిపారు. ఓలా, ఉబర్ క్యాబ్లు, బైక్ టాక్సిలకు ప్రగతి భవన్ లో పచ్చా జెండాలు ఊపి ప్రారంబించినప్పుడు ఆటో డ్రైవర్లు గుర్తుకు రాలేదా అని కేటీఆర్ ను ప్రశ్నించారు. కోట్లాదిమంది మహిళలకు అన్యాయం చేసేలా బీఆర్ఎస్ కుట్రలుల పన్నుతోందని ఫైర్ అయ్యారు.
*తమ హయాంలో రూ. లక్ష రూపాయలు కూడా పంట రుణమాఫీ చేయని బీఆర్ఎస్ ఇప్పుడు రైతులపై ప్రేమ కురిపించడం విడ్డూరంగా ఉందని మంత్రి సీతక్క ఎద్దేవ చేసారు. బీఆర్ఎస్ హాయంలో 20 లక్షల మంది రైతులకు పైసా రుణమాఫీ కాలేదని గుర్తు చేసారు. విడతల వారిగా చేసిన రుణ మాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదన్నారు. కానీ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం..కేవలం 27 రోజుల్లోనే 18 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసిందన్నారు మంత్రి సీతక్క. గత ప్రభుత్వం రుణ మాఫీ చేయకపోవడంతో ఎంతో మంది రైతులను బ్యాంకులు బ్లాక్ లిస్టు లో చేర్చడం, పలు సాంకేతిక సమస్యల కారణంగా మిగిలిన రైతులకు రుణ మాఫి ఆలస్యమవుతోందన్నారు. అయితే ఏక కాలంలో తాము పంట రుణ మాఫీ చేస్తుంటే బీఆర్ఎస్ సహించలేక అవాస్తవాలు ప్రచారం చేస్తుందన్నారు మంత్రి సీతక్క.
తెలంగాణ లో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నట్లు సీతక్క తెలిపారు. సామాన్యుల గృహాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఆలోచన బీఆర్ఎస్ చేయలేదని, తాము మాత్రం 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు.
మహిళలకు వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తూ.. వారిని ఆర్దికతంగా బలోపేతం చేస్తున్నామన్నారు. మహిళలకు బీఆర్ఎస్ ఎగ్గోట్టిన వడ్డీలను సైతం తాము బ్యాంకులకు చెల్లించినట్లు గుర్తు చేసారు. బీఆర్ఎస్, దాని మిత్రపక్షం బీజేపీలు కలిసి రూ. 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను రూ.1200 కి పెంచగా..తమ ప్రభుత్వం పేదల వంటింటి భారాన్ని తగ్గించేందుకు రూ. 500 కే సిలిండర్ అందిస్తున్నామన్నారు. పదేళ్లలో లక్ష ఉద్యోగాలు సైతం బీఆర్ఎస్ ఇవ్వకపోతే..తాము కేవలం ఆరు మాసాల్లోనే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఐదేల్ల కాలం కోసం ప్రజలు తమను ఎన్నుకున్నారని, ఈ ఐదేల్లలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హమీ ఇచ్చారు. గూడు లేని పేదలకు కాంగ్రెస్ గత ప్రభుత్వాలు లక్షల ఇండ్లు ఇచ్చాయని అదే తరహాలో ఇప్పుడు కూడా రూ. 5 లక్షలతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తుందన్నారు.
👉అధికారంలో ఉన్నప్పుడు అణచివేత..విపక్షంలో ఉన్నప్పుడు అవస్తవాలు చెప్పడమే బీఆర్ఎస్ నైజమని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఎంత ఉప్పు తింటే అంత దూప అన్నట్టుగా.. గత ప్రభుత్వం చేసిన రూ. 7 లక్షల కోట్ల అప్పులకు ఇప్పటికే రూ. 54 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ఎన్నో హమీలిచ్చి మోసం చేసిందని సీతక్క గుర్తు చేసారు. దళితున్ని సీఎం చేయలేదు…దళితులకు మూడెకరలా భూమి పంపిణి చేయకుండా..సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ తెలంగాణ మీద విషం చిమ్ముతోందన్నారు. అసత్య ప్రచారం చేసే విపక్షం ఉండటం తెలంగాణ దౌర్భాగ్యమన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ టిల్లుగా వ్యవహరిస్తున్నారని, వాస్తవాలు తెలుసుకోకుండా పోస్టులు పెడుతూ మాజీ మంత్రి హరీష్ రావు గౌరవం పొగొట్టుకుంటున్నారని సీతక్క ఎద్దేవ చేసారు.
బీఆర్ఎస్ హయాంలో తాలు, తరుగు పేరుతో రైతులను నిండా ముంచిన మిల్లర్ల పట్ల తాము కఠినంగా వ్యవహరిస్తుంటే…మిల్లర్లతో కుమ్మక్కైన బీఆర్ఎస్ రాష్ట్రంలో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తుందని సీతక్క మండి పడ్డారు. ధర్నా చౌక్ లు ఎత్తేసిన బీఆర్ఎస్ పెద్దలు ధర్నాలకు దిగడం విడ్డూరంగా ఉందన్నారు.
బీఆర్ఎస్ పాలనలో సీఎం, మంత్రులు సచివాలయానికి రాలేదని..ఏనాడు ప్రజలకు అందుబాటులో లేరని సీతక్క గుర్తు చేసారు. కానీ తాము మాత్రం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాట్లు తెలిపారు. దేశంలో సామాజిక న్యాయాన్ని, లౌకిక వాదాన్ని గెలిపించేందుకు ఇతర రాష్ట్రాల్లో తాము ప్రచారం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో రాజకీయ పర్యటనలు చేస్తే..తాము రాజ్యంగ పరీరక్షణ కోసం, కుల గణన కోసం పనిచేసే శక్తుల విజయాన్ని కాంక్షించి సొంత ఖర్చులతో తాము పర్యటిస్తున్నామన్నారు. మేమేంతో మాకంత అన్న నినాదాన్నినిజం చేసేందుకు సామాజిక విప్లకారుడిలా రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా చేస్తున్న పోరాటానికి మద్దతుగా తమ ప్రచారం కొనసాగుతుందన్నారు.
👉బాసర IIT లో విద్యార్థిని మృతిపై తల్లిదండ్రుల ఆందోళన..?
మేము రాకముందే శవాన్ని హాస్పిటల్ మార్చురీకి ఎందుకు తీసుకొచ్చారని పోలీస్ గల్లా పట్టుకొని నిలదీసిన స్వాతి ప్రియ తల్లి తమ కూతురు ర్యాగింగ్‌కు బలైందంటూ.. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు దానికి పోలీసులు సహకరిస్తున్నా రంటూ ఆవేదన.. తెలంగాణ ఇంచార్జ్ హైదర్ అలీ..
👉 ఎన్టీఆర్ జిల్లా నందిగామ: పెనుగంచిప్రోలు గ్రామంలో దారుణ ఘటన..?వీధి కుక్కల దాడిలో(2) చిన్నారి బాలుడుకు గాయాలు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు…చికిత్స పొందుతూ బాలుడు మృతి…
పెనుగంచిప్రోలు గ్రామంలో తూఫాన్ కాలనీకి చెందిన బాల తోటి ప్రేమ్ కుమార్ (2) బాలుడు ఆరుబయట ఆడుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా 10 వీధి కుక్కలు దాడి చేసి బాలుడిని పంట పొలాల్లోకి లాక్కొని వెళుతుండగా…
అది చూసిన స్థానికులు అరుపులు కేకలు వేయగా కుక్కలు బాలుడిని వదిలేసి వెళ్లాయి.
ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మార్గమధ్యలోని బాలుడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు,గ్రామంలో వీధి కుక్కలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయని గ్రామ పంచాయితీ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోక పోవడంతో ఈ ఘటన జరిగినట్లుగా బాధిత తల్లిదండ్రులు తెలిపారు.. స్టేట్ కోఆర్డినేటర్ ఎస్ రజాక్ భాష..
👉 మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ ను మర్యాదపూర్వకముగా కలసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కొండపి నియోజకవర్గ సమన్వయ కర్త YSR కాంగ్రెస్ పార్టీ PAC కమిటి సభ్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్..
👉 ఒంగోలు రామ్ నగర్ లోని మాగుంట కార్యాలయంలో బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి శాస్త్రి నిర్వహించిన పార్వతీ పరమేశ్వరుల దర్బార్ సేవలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తాత ప్రసాద్ , మల్లికార్జున్ రెడ్డి బెల్లం సత్యం బద్ది రెడ్డి , మరియు నాయకులు కార్యకర్తలుపాల్గొన్నారు.
👉జనాబ్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఒంగోలులోని పాత మార్కెట్ సెంటర్ లో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత , జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా,ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , సోషల్ వెల్ఫేర్ డి డి లక్ష్మీ నాయక్ , కఫిల్ బాషా , హనీఫ్ ఖాన్, ఆరిఫా ఆదాం షఫీ షేక్. సైదా, ఖలీఫాతుల్లా బాషా,అయినాబత్తిన ఘనశ్యాం తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇంచార్జ్ ఎస్ రహమాన్..
👉అక్రమ మద్యం పట్టివేత .
మండలం లోని తురిమెళ్ల గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం అక్రమ మద్యం అమ్ముతున్న ఒక వ్యక్తిని కంభం మండలం ఎస్సై బి. నరసింహారావు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి వద్ద నుండి 15 (180ఎంఎల్) మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నరసింహారావు వెల్లడించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ మండలంలో ఎవరైనా బెల్టు షాపులు నిర్వహించిన, అక్రమ మద్యం అమ్మినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
👉పిచ్చి మొక్కలను తొలగించిన ఎస్సై వెంకటేశ్వర నాయక్..
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఎడమకల్లు, ముక్తాపురం గ్రామాల మధ్య రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను ఎస్ఐ వెంకటేశ్వర నాయక్ జెసిబి సహాయంతో సోమవారం తొలగించారు. ముఖ్యంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి మూలమలుపుల వద్ద అధికంగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించినట్లు ఆయన చెప్పారు. మంచు కాలం ప్రారంభం అయితున్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్త వహించాలని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపలని సూచించారు. ప్రమాదం జరిగే ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలలో ప్రమాదాలు నివారించే కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని ఎస్సై వెంకటేశ్వరా నాయక్ తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు..
👉రౌడీ షీటర్లకు వార్నింగ్ ఇచ్చిన ఎస్సై నరసింహారావు..
కంభం పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు, అనుమానాస్పద వ్యక్తులకు ఎస్సై నరసింహారావు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో ఎవరైనా చట్ట వ్యతిరేక అసాంఘిక కార్య కలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అట్టి వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనునిత్యం కంభం మండలం పోలీసు నిఘాలోనే ఉంటుందని ఆయన హెచ్చరించారు.. డివిజన్ ఇంచార్జి అసలం బేగ్..
👉 కడప జిల్లా…బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం…పేషెంట్లకు కాలపరిమితి అయిపోయిన మెడిసిన్ ఇస్తున్న సిబ్బంది…నిన్నటి రోజు జీతేష్ కూమార్ నాలుగు సంవత్సరాల అబ్బాయికి జలుబు దగ్గు గొంతు ఇన్ఫెక్షన్తో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యానికి తీసుకువెళ్లిన తల్లిదండ్రులు…ట్రీట్మెంట్ అనంతరం మెడిసిన్ స్లిప్ రాసించిన డాక్టర్…మందులు తీసుకొని ఇంటికి వెళ్లిన అబ్బాయి తండ్రి మందులు వేయగా అబ్బాయికి వామ్తింగ్స్ కావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చిన పేరెంట్స్….
ప్రభుత్వాసుపత్రిలో ఇచ్చిన సిరప్ ను చెక్ చేయగా ఎక్స్పైర్ అయినా సిరప్ వాళ్ళనే బాబుకు అస్వస్థత వచ్చిందని తెలిపిన తల్లిదండ్రులు…
👉ఏలూరు జిల్లా* చింతలపూడి యూనియన్ బ్యాంక్ వద్ద 4 లక్షల రూపాయలు అపహరణ..
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల గ్రామానికి చెందిన చెక్క శ్రీనివాస రావు అనే వ్యాపారి నాలుగు లక్షల రూపాయలు చింతలపూడి యూనియన్ బ్యాంక్ నుంచి విత్ డ్రా చేసి బయటకు వచ్చి తన మోటార్ సైకిల్ లో ఉంచగా అపహరించిన గుర్తు తెలియని దుండగులు .
సంఘటన స్థలంలో విచారణ చేపట్టిన చింతలపూడి ఎస్సై కుటుంబరావు.
బిఆర్ఎస్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క..వీధి కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు మృతి (పెనుగ్రంచిప్రోలు)..బాసర IIT లో విద్యార్థిని మృతిపై తల్లిదండ్రుల ఆందోళన..బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కాలం చెల్లిన మందులు ?..చింతలపూడి యూనియన్ బ్యాంక్ వద్ద 4 లక్షల రూపాయలు అపహరణ..పలు కార్యక్రమాలలో ఎంపీ మాగుంట.. కంభంలో అక్రమ మద్యం పట్టివేత
Recent Posts