👉 అసెంబ్లీ సమావేశాలు ఎవరి కోసమూ ఆగవని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బీఏసీ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడం చర్చకు వచ్చింది. దీనిపై స్పందించిన సీఎం.. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని, ఎవరి కోసమో కాదని అన్నారు. ప్రజా సమస్యలపై బాధ్యతాయుతమైన చర్చ జరగాలన్నారు. బీఏసీ సమావేశంలో రుషికొండ ప్యాలె స్‌పై చర్చ జరిగింది. రుషికొండ ప్యాలె్‌సను సీఎం అధికారిక నివాసంగా పేర్కొంటూ జీవో విడుదలైందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. జీవో ఇచ్చినందున మనం రుషికొండ ప్యాలె్‌సను ఉపయోగించుకునే అవకాశం ఉందని సరదాగా అన్నారు. చంద్రబాబు స్పందిస్తూ… ‘ఆ ముఖ్యమంత్రి లేరుగా’ అంటూ నవ్వుతూ బదులిచ్చారు.
👉 చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ శాఖకు బడ్జెట్: మంత్రి అనిత,
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ శాఖకు బడ్జెట్: మంత్రి అనిత..‘రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ శాఖకు బడ్జెట్‌లో రూ. 8,495 కోట్లు కేటాయించాం’ అని హోంమంత్రి అనిత అన్నారు. సోమవారం ఆమె మాట్లాడారు. ‘గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని పట్టిపీడించిన మాదకద్రవ్యాలను రాష్ట్రంలో లేకుండా చేసేందుకు నిబద్ధతతో పనిచేస్తున్నాం. శ్రీకాకుళం, చిత్తూరు, ప్రకాశం, రాజమహేంద్రవరంలో కొత్తగా 4 స్పెషల్ పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు చేస్తాం’ అని అనిత పేర్కొన్నారు.
👉 పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ : జనసైనికులు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ నుంచి వచ్చిన నాయకులను మంగళగిరి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. ఏ ఆశ లేని సమయంలో పార్టీకి అండగా నిలిచేందుకు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ జనసేనలో చేరారని తెలిపారు.
👉పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. పోసానిపై పోలీసులకు ఫిర్యాదు,.ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన కుటుంబీకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు పోసానిపై చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్పీ నరసింహ కిషోర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. గత ప్రభుత్వ హయాంలో పోసాని అనేకసార్లు పవన్‌తో పాటు, జనసేన కార్యకర్తలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలంతో దూషించినా అప్పట్లో పోలీసులు చర్యలు తీసుకోలేదని తెలిపారు.
👉హైదరాబాద్‌లోని బార్‌లపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు..హైదరాబాద్ నగరంలోని పలు బార్ అండ్ రెస్టారెంట్లపై ఇవాళ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దాడులు జరిపింది. విద్యానగర్‌లోని కింగ్స్ బార్ అండ్ రెస్టారెంట్‌తోపాటు చిక్కడపల్లిలోని మధిరాలయ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని వింటేజ్ బార్లలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. అత్యధికంగా రూల్స్‌కు విరుద్దంగా నిర్వహిస్తున్న బార్‌గా కింగ్స్ బార్ అండ్ రెస్టారెంట్‌ను అధికారులు గుర్తించారు. బార్‌లోపల అపరిశుభ్రంగా ఉందని, కిచెన్‌లో ఏర్పాటు చేసిన చిమ్నీ, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు జిడ్డుతో కనిపించాయి. వాటిని కొన్ని సంవత్సరాలుగా క్లీన్ చేయకపోవడాన్ని అధికారులు గుర్తించారు..అలాగే వాషింగ్ ప్రాంతమంతా అపరిశుభ్రంగా ఉండటం, రిఫ్రిజిరేటర్లలో వెజ్, నాన్ వెజ్ పదార్థాలను కలిపి ఉండటం అధికారులు రికార్డు చేశారు. ఇక హెల్త్, పెస్ట్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన ఏ ఒక్క రికార్డు కూడా మెయింటెయిన్ చేయటం లేదని అధికారుల తనిఖీల్లో తేలింది. బెంగళూరు, చెన్నై నుంచి వచ్చే చికెన్ వేస్టేజ్‌ని హైదరాబాద్‌లోని బార్ అండ్ రెస్టారెంట్లకు సప్లయ్ చేస్తున్నట్టు ఇటీవలి దాడుల్లో బయటపడింది. కింగ్స్ బార్‌తో పాటు పలు బార్ల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉండటంతో అధికారులు ఆయా బార్లకు నోటీసులు జారీ చేశారు. దాడుల సందర్భంగా సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షలకు పంపారు.
👉తెలంగాణలో IAS, IFS అధికారుల బదిలీ
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 13 మంది IASలు, 8 మంది IFS అధికారులను బదిలీ చేసింది.
👉🏻టూరిజం కల్చరల్ సెక్రటరీ – స్మితా సబర్వాల్
👉🏻బీసీ వెల్ఫేర్ సెక్రటరీ – శ్రీధర్
👉🏻మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ – అనితా రామచంద్రన్
👉🏻GHMC కమిషనర్ – ఇలంబర్తి
👉🏻ట్రాన్స్‌కో సీఎండీ – కృష్ణ భాస్కర్
👉🏻ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ – సురేంద్ర మోహన్
👉 వైయస్ ఆర్ జిల్లా*…వైయస్సార్సీపి కార్యకర్త శ్రీకాంత్ రెడ్డి పై రాళ్లతో, రాడ్లతో దాడి*..
*శ్రీకాంత్ రెడ్డికి తీవ్ర గాయాలు*.
*శ్రీకాంత్ రెడ్డి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి ప్రధాన అనుచరుడు*
*వేంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలింపు*…
*వేంపల్లిలో ఉద్రిక్త వాతావరణం*
👉హైదరాబాద్ సిటీ:* జీహెచ్‌ఎంసీ రెగ్యులర్ కమిషనర్(GHMC Regular Commissioner)గా ఇలంబరిదిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా శాఖ కమిషనర్‌గా ఆయన స్థానంలో సురేంద్రమోహన్(Surendra Mohan)కు బాధ్యతలు అప్పగించింది.గత కమిషనర్ ఆమ్రపాలి స్థానంలో 2005 బ్యాచ్‌కు చెందిన ఇలంబరిది(Ilambaridi)కి బల్దియా కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగిస్తూ గతనెల 18న ఉత్తర్వులు వెలువరించగా, తాజాగా రెగ్యులర్‌గా నియమించింది. ప్రస్తుతం జార్ఖండ్ ఎన్నికల విధుల్లో ఉన్న ఆయన ఈనెల 13న పోలింగ్ తర్వాత నగరానికి వచ్చే అవకాశముంది.
👉మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మధ్య ‘మాటల యుద్ధం’ నడుస్తోంది. ఒవైసీది రజాకార్ల సంతతి అని ఫడ్నవీస్ తాజాగా విమర్శలు సంధించారు. ‘ఒవైసీ రజాకార్ల వారసుడు. రజాకార్లు మరఠ్వాడా ప్రజలను హింసించారు’ అని అన్నారు. మహారాష్ట్రలో ‘ఓటు జిహాద్’ మొదలైందని శనివారం ఫడణవీస్ చేసిన వ్యాఖ్యలతో ఈ మాటల యుద్ధానికి తెరలేచింది. ‘ఓటు జిహాద్’ను ‘ఓటు ధర్మయుద్ధం’తో ఎదుర్కోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. దీనికి ఒవైసీ స్పందిస్తూ తమ పూర్వీకులు బ్రిటీషు పాలకులపై జిహాద్ చేస్తున్నప్పుడు ఫడణవీస్ పూర్వీకులు తెల్లదొరలకు ‘ప్రేమలేఖలు’ రాసేవారని విమర్శించారు.
👉 ఏలూరు లో కన్నబిడ్డపై తల్లి క్రూరత్వం.. భోజనం పెట్టకుండా నిత్యం కొడుతూ గది బందించి నిత్యం నరకం*చూపిస్తున్న వైనం *అమ్మ అన్నపదానికి అర్ధం మరచిన ఓ తల్లి కన్నకూతరును హింసించింది అమ్మతనానికి మాయని మచ్చ తెచ్చింది .ఈ సంఘటన ఏలూరు జరిగినది* ఏలూరు లో తండ్రి చనిపోయిన తరువాత శ్రీలత కి కష్టం మొదలు అయ్యాయి.ఆకలేసినప్పుడు అన్నం పెట్టదా అమ్మ. ఇద్దరు తమ్ముళ్లు లు ఉన్న 39 శ్రీ లత వీళ్లకు భారం అయినది. అమ్మాయి పెద్ద తమ్ముడు నారాయణ శర్మ మంగళవారం కొత్త బస్టాండ్ ఆంజనేయస్వామి గుడిలో అర్చన చేస్తాడు,అమ్మ పేరు రాజ్యలక్ష్మి .*ఈ ఘోరం ఏలూరు లో విద్యావికాస్ దగ్గర జరుగుతోందట*
👉 కోల్‌కతా హత్యాచారం కేసు.. నిందితుడి సంచలన
ఆరోపణలు..
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యురాలు హత్యాచారానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. డాక్టర్ హత్య కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. కోర్టు నుంచి పోలీసులు అతడిని తరలిస్తుండగా ‘కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ కుట్ర చేసి నన్ను ఇందులో ఇరికించారు’ అని మీడియాతో అరుస్తూ చెప్పారు.
👉బెల్ట్ షాపుపై దాడులు నిర్వహించిన కంభం ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్
•10 క్వార్టర్ బాటిళ్లు సీజ్.. ఒకరు అరెస్టు…_
*కంభం:* ప్రకాశం జిల్లా కంభం మండలం దేవనగరం గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బెల్ట్ షాపుపై ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జి.ప్రశాంతి అనే మహిళను అదుపులోకి తీసుకుని ఆమె వద్ద నుండి 10 క్వార్టర్ (180 ఎంఎల్) బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కొండారెడ్డి మాట్లాడుతూ ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహించినా, అక్రమంగా మద్యం తరలించినా, అక్రమంగా మద్యం కలిగి ఉన్నా, అమ్మినా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ వారికి వెంటనే సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
👉మార్కాపురం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఉపాధి హామీ పథకం సిబ్బంది నిరసన. పర్చూరులో ఏపీఓపై జరిగిన దాడిని ఖండించిన ఉద్యోగులు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరిన ఏపీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు జీవరత్నం.
👉వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసులో సంచలన విషయాలు
దాడి చేసేలా జనాలను రెచ్చగొట్టిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు..దాడి చేసేందుకు కుట్ర చేసిన వ్యక్తిని సురేష్ గా గుర్తించిన పోలీసులు..పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సురేష్..దాడి జరిగే కొన్ని గంటల ముందు పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు మాట్లాడిన సురేష్..
సురేష్ తో మాట్లాడుతూ 6 సార్లు కేటీఆర్ తో ఫోన్లో మాట్లాడిన పట్నం నరేందర్ రెడ్డి..సురేష్ పై ఇప్పటికే రేప్ కేసుతో సహా పలు కేసులు..చెల్లెలి వరస అయ్యే అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడినందుకు రేప్ కేసు నమోదు..సురేష్ పై కేసులు తొలగించేలా సహాయం చేసిన
పట్నం నరేందర్ రెడ్డి.
👉పంటల బీమా తో రైతుకు ధీమా*.. వ్యవసాయ శాఖ వారి పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా కంభం మండలంలో ఎర్రబాలెం సచివాలయానికి సంబంధించినటువంటి లింగాపురం, జంగంగుంట్ల గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా రైతులకు ప్రస్తుతం రవి పంటలకు అవసరమైనటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి తెలియజేయడం జరిగింది అలాగే వరి మొక్కజొన్న ఉలవ శనగ మిరప పంటలను పరిశీలించడం జరిగింది.
అసెంబ్లీ సమావేశాలు ఎవరి కోసమూ ఆగవని ముఖ్యమంత్రి చంద్రబాబు..పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు..వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసులో సంచలన విషయాలు.. పోసానిపై పోలీసులకు ఫిర్యాదు,.హైదరాబాద్‌లోని బార్‌లపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు..హైదరాబాద్‌లోని బార్‌లపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు..కోల్‌కతా హత్యాచారం కేసు.. నిందితుడి సంచలన ఆరోపణలు.. ఉపాధి హామీ పథకం సిబ్బంది నిరసన..పంటల బీమా తో రైతుకు ధీమా.
Recent Posts