👉అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పించే ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్.. మహారాష్ట్ర ఎన్నికల రంగంలో పాల్గొని ప్రచారం నిర్వహించి నాందేడ్ సౌత్ నియోజకవర్గంలో జరిగిన సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పించే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని,తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అసత్య ప్రచారం చేస్తుందని తెలంగాణలో ఇచ్చిన మాట ప్రకారం గ్యారెంటీలను పేదలకు అందజేస్తున్నామని, నిజాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చామన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ఎవరికైనా వివరాలు కావాలంటే ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని,
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల కాలంలోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు.
మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకం అందిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల మంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా లబ్ది పొందుతున్నట్లు వెల్లడించారు.
మహారాష్ట్రలో కూడా గెలిపివ్వండి గ్యారెంటీ అమలు బాధ్యత రాహుల్ గాంధీ తీసుకుంటారని,దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే ఎక్కువ అన్నదాతల ఆత్మహత్యలు జరిగాయన్నారు.
కేంద్ర,మహా రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచిపోయాయని తీవ్రస్థాయిలో విమర్శించారు.
**నల్లచట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు మేలు చేయాలని ప్రధాని మోదీ భావించారని ఫైర్ అయ్యారు.
మహాత్మా జ్యోతిరావు పూలే, బాలగాంగధర్ తిలక్, సావిత్రిబాయి పూలే, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ శివాజీ వంటి ఎందరో మహానుభావులు ప్రజల్లో చైతన్యం నింపారని గుర్తు చేశారు.
అటువంటి మహా ప్రజలను మోదీ మోసం చేస్తున్నారని విమర్శించారు.**ఈ రాష్ట్రానికి రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులను మోదీ గుజరాత్‌కు తరలించుకొని పోయారని ఆరోపించారు.ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఏఐసీసీ మైనారిటీ సెల్ చైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్ ఘరి నాందేడ్ ఎంపీ అభ్యర్థి రవీంద్ర వసంత్ రావు చవాన్ నాందేడ్ సౌత్ ఎమ్మెల్యే అభ్యర్థి మోహన్ రావు అంబడే పాల్గొన్నారు.
👉అన్నమయ్య జిల్లా//
తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో వీధి రౌడీళ్ళ ప్రవర్తిస్తున్న విద్యార్థులు..మెయిన్ గేటు వద్ద విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డుపై మూకుమ్మడిగా దాడి చేసి గాయపరచిన కళాశాల విద్యార్థులు.
విద్యార్థుల దాడిలో తీవ్ర గాయాలు అయిన సెక్యూరిటీ గార్డు శ్రీకాంత్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన స్థానికులు
విద్యార్థులపై కేసు నమోదు చేసిన ముదివేడు పోలీసులు.
గతంలో మాదిరి స్వేఛ్చగా బయటకు పంపివ్వడంలేదని కొత్తగా వచ్చిన సెక్యూరిటీ గార్డుపై దాడి చేశారని తెలుస్తోంది
👉👉బోరుగడ్డ అనిల్ మరో జైలు వీడియో షోషల్ మీడియా లో వైరల్..
గుంటూరు అరండల్ పేట పోలిస్ స్టేషన్ లో ఉన్న బోరుగడ్డ అనిల్ వ్యవహారం రోజుకొక వివాదం వెలుగుచూస్తుంది.
సోమవారం రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి మరో సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో రాత్రి పూట మైనర్ బాలుడు బయటినుంచి స్టేషన్ లోపలికి వచ్చి అనిల్ పక్కన కూర్చొని మాట్లాడుకున్నారు. ఆ మైనర్ బాలుడు ఎవరు.. ఎందుకు రాత్రి సమయంలో వచ్చాడనే కోణంలో పోలీసులు, ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు.
👉మంత్రి లోకేశ్ కృషితో రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
రూ. 65 వేల కోట్ల పెట్టుబడులకు రిలయన్స్ ఎనర్జీ సంసిద్ధత..
నేడు సీఎం చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం
వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మంత్రిగా లోకేశ్ లక్ష్యం..రాష్ట్రానికి పెట్టుబడుల కోసం మంత్రి నారా లోకేశ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్‌గా లోకేశ్ ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నారు. అమెరికా పర్యటనకు ముందు ముంబైలో రిలయన్స్ సంస్థతో జరిపిన చర్చలు ఫలవంతం అయ్యాయి. ఆయన కృషితో రాష్ట్రంలో రూ.65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సిద్ధమైంది. గుజరాత్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీలో మాత్రమే ఇంత పెద్దఎత్తున పెట్టుబడులకు సిద్ధమైంది. ఏపీలో 500 అధునాతన బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతోంది.
అమెరికా పర్యటనకు ముందు ముంబైలో పలువురు పారిశ్రామిక వేత్తలతో లోకేశ్ భేటీ అయ్యారు. ఆ సమయంలో రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ, రిలయన్స్ క్లీన్ ఎనర్జీకి నేతృత్వం వహిస్తున్న అనంత్ అంబానీని కూడా కలిశారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ రంగాలకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్రంలో పెట్టబడులకు సంబంధించి అనంత్ అంబానీ, లోకేశ్ మధ్య అప్పుడే ఓ అవగాహన కుదిరింది. రాష్ట్రంలో పెట్టుబడులకు పూర్తిస్థాయి రోడ్ మ్యాప్‌తో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో అమరావతిలో ఏపీ పరిశ్రమల శాఖ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు.
లోకేశ్ కృషితో ఇప్పటికే ఏపీలో సౌర, పవన విద్యుత్ రంగంలో రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు టాటా పవర్ ముందుకు వచ్చింది. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం ఎటువంటి హడావుడి లేకుండా లోకేశ్ జరుపుతున్న చర్చలపై దేశవ్యాప్తంగా పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. స్టీల్ దిగ్గజం ఆదిత్య మిట్టల్‌తో ఒక్క వీడియో కాన్ఫరెన్స్‌తో రూ. 1.4 లక్షల కోట్ల పెట్టుబడిని ఖరారు చేయడం, తాజాగా రిలయన్స్ పెట్టుబడులపై ఏపీ పారిశ్రామక వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. రిలయన్స్ పెట్టుబడులతో రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,50,000 మంది ఉపాధి అవశాకాలు లభించనున్నాయి.
క్లీన్ ఎనర్జీ రంగంలో పెట్టబడులు పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రయత్నిస్తోందని తెలుసుకున్న లోకేశ్ వారిని రాష్ట్రానికి రప్పించేందుకు ఒక మిషన్ మోడ్‌లో పనిచేశారు. ముంబైలో చర్చల తర్వాత కేవలం 30 రోజుల వ్యవధిలోనే పెట్టుబడులు కార్యరూపం దాల్చాయి. ‘ఏపీ ప్రభుత్వ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్’కు ఈ పెట్టుబడులే నిదర్శనం. అనేక ప్రోత్సాహకాలతో ఏపీ ప్రభుత్వం క్లీన్ ఎనర్జీ పాలసీని తీసుకువచ్చింది. క్లీన్ ఎనర్జీ రంగంలో పెట్టబడులు తీసుకువచ్చి, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు మంత్రి లోకేశ్ కృషి చేస్తున్నారు.
👉బాధిత తెలుగుదేశం కార్యకర్తకు మంత్రి నారా లోకేష్ తో మాట్లాడించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే NER*
*_అండగా ఉంటానని భరోసా ఇచ్చిన మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే NER_*
*పరామర్శించిన ఎమ్మెల్యే తనయుడు తేజ*
సోమవారం ఉదయం జి సిగడాం గ్రామంలో పొలం గట్లు వద్ద జరిగిన వైసిపి కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడి రాజాం లో ఒక ప్రవైట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయిని సూరి రెడ్డి , వెంకటరెడ్డి లను పరామర్శించిన ఎమ్మెల్యే తనయుడు తేజ బాబు..జరిగిన సంఘటనను ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు(NER) విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకొని వెళ్లడమే కాకుండా బాధిత కార్యకర్తలను ఫోన్ లో పరామర్శించి ధైర్యం చెప్పి, అండగా ఉంటానని హామీ ఇచ్చిన మంత్రి, ఎమ్మెల్యే..
మెరుగైన చికిత్స కోసం తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా ఆదేశించిన ఎమ్మెల్యే NER.
పరామర్శించిన పలువురు కూటమి నాయకులు.
👉షారుక్ ఖాన్ కు బెదిరింపులు.. నిందితుడు అరెస్ట్..
షారుక్ ఖాన్ కు బెదిరింపులు.. నిందితుడు అరెస్ట్
బాలీవుడ్ హీరో షారక్ ఖాన్ ను చంపేస్తానంటూ ఇటీవల ఓ దుండగుడు బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన ముంబయి పోలీసులు ఆ వ్యక్తిని ఛత్తీస్‌గఢ్ కు చెందిన ఫైజాన్ ఖాన్ గా గుర్తించారు.ఈ క్రమంలోనే తాజాగా ముంబయి పోలీసులు ఛత్తీస్‌గఢ్ కు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ విషయమై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
👉 సైబర్ క్రైమ్ మోసాల బారిన పడకుండా జాగర్తపడండి..
1.TRAI మీ ఫోన్‌ను ఎలా డిస్‌కనెక్ట్ చేయబోతోంది అనే దాని గురించి మీకు కాల్ చేస్తే, ప్రతిస్పందించవద్దు. ఇది ఒక స్కామ్.
2.మీరు FedEx ద్వారా ప్యాకేజీ గురించి పిలిచి, 1 లేదా మరేదైనా నొక్కమని అడిగితే, ప్రతిస్పందించవద్దు. ఇది ఒక స్కామ్.
3.ఒక పోలీసు అధికారి మీకు ఫోన్ చేసి మీ ఆధార్ గురించి మాట్లాడితే, స్పందించకండి. ఇది ఒక స్కామ్.
4.మీరు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉన్నారని వారు మీకు చెబితే, స్పందించవద్దు. ఇది ఒక స్కామ్.
5.మీ కోసం ఉద్దేశించిన లేదా మీరు పంపిన ప్యాకేజీలో డ్రగ్స్ కనుగొనబడిందని వారు మీకు చెబితే, ప్రతిస్పందించవద్దు. ఇది ఒక స్కామ్.
6.మీరు ఎవరితోనూ చెప్పలేరని వారు చెబితే, వారి మాట వినవద్దు. 1930లో సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వండి.
7.వారు WhatsApp లేదా SMS ఉపయోగించి మిమ్మల్ని సంప్రదిస్తే, ప్రతిస్పందించవద్దు. ఇది ఒక స్కామ్.
8.ఎవరైనా మీకు కాల్ చేసి, వారు పొరపాటున మీ UPI IDకి డబ్బు పంపారని మరియు వారు తమ డబ్బును తిరిగి ఇవ్వాలని కోరితే, ప్రతిస్పందించవద్దు. ఇది ఒక స్కామ్.
9.ఎవరైనా మీ కారు లేదా మీ వాషింగ్ మెషీన్ లేదా మీ సోఫా కొనుగోలు చేయాలనుకుంటున్నారని చెబితే మరియు వారు సైన్యం లేదా CRPF నుండి వచ్చారని మరియు వారి ID కార్డును మీకు చూపిస్తే, ప్రతిస్పందించవద్దు. ఇది ఒక స్కామ్.
10.ఎవరైనా Swiggy లేదా Zomato నుండి కాల్ చేస్తున్నారని మరియు మీరు 1 లేదా మరేదైనా నొక్కడం ద్వారా మీ చిరునామాను నిర్ధారించాలని చెబితే, ప్రతిస్పందించవద్దు. ఇది ఒక స్కామ్.
11.ఆర్డర్ లేదా రైడ్ లేదా మరేదైనా రద్దు చేయడానికి OTPని షేర్ చేయమని వారు మిమ్మల్ని అడిగితే, ప్రతిస్పందించవద్దు. ఇది ఒక స్కామ్. ఎట్టి పరిస్థితుల్లోనూ, మీ OTPని ఎవరితోనూ ఫోన్‌లో పంచుకోవద్దు.
12.వీడియో మోడ్‌లో ఎటువంటి కాల్‌లకు సమాధానం ఇవ్వవద్దు.
13.గందరగోళంగా ఉంటే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆ నంబర్‌ని బ్లాక్ చేయండి.
14.నీలం రంగులో వ్రాసిన ఏ లింక్‌ను ఎప్పుడూ నొక్కకండి.
15.మీకు అత్యున్నత పోలీసు, CBI, ED లేదా IT డిపార్ట్‌మెంట్ నుండి నోటీసు వచ్చినప్పటికీ, ఆఫ్‌లైన్‌లో ధృవీకరించండి.
16.అటువంటి లేఖలు అధీకృత ప్రభుత్వ పోర్టల్‌ల నుండి వచ్చాయో లేదో ఎల్లప్పుడూ తనిఖీ చేయండి.
డిజిటల్ పరిశుభ్రత విషయంలో, మీ చిరునామా, స్థానం, ఫోన్, ఆధార్, PAN, DoB లేదా ఏదైనా వ్యక్తిగత వివరాలను ఫోన్ లేదా సందేశాల ద్వారా ఎవరితోనూ పంచుకోవద్దు. కాల్‌లో మీ పేరును గుర్తించడానికి కూడా నిరాకరించండి. వారు మీకు కాల్ చేసినందున, వారు మీ పేరు, నంబర్ మరియు మీరు ‘ధృవీకరించాలని’ కోరుకునే ఏవైనా వివరాలను తెలుసుకోవాలని వారికి చెప్పండి. వారు మీ వివరాలను కలిగి ఉన్నప్పటికీ, నిర్ధారించవద్దు లేదా తిరస్కరించవద్దు లేదా ఏదైనా సంభాషణలో చిక్కుకోవద్దు. కేవలం డిస్‌కనెక్ట్ చేసి బ్లాక్ చేయండి.
ఈ సందర్భాలలో మరియు ఇలాంటి వాటిలో ప్రతి ఒక్కటి, మిమ్మల్ని మీరు రక్షించుకునే విధానం చాలా సులభం: కాల్ కట్ చేయండి, నంబర్‌ను నోట్ చేసి బ్లాక్ చేయండి. కాల్ సమయంలో ఎటువంటి నంబర్లను నొక్కవద్దు; వారి మాట వినవద్దు. కాల్ కట్ చేసి, నంబర్‌ను బ్లాక్ చేయండి. గుర్తుంచుకోండి, వారు మీపై ఒత్తిడి తెచ్చినా, మిమ్మల్ని భయపెట్టినా లేదా వెంటనే చర్య తీసుకోమని లేదా ప్రతిస్పందించమని బలవంతం చేస్తే, అది స్కామ్.
సైబర్ మోసగాళ్లు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి & ఫ్లీస్ చేయడానికి విభిన్నమైన కార్యనిర్వహణలతో వస్తారు.
👉కుటుంబాల ఆదరణ నోచుకోక లేని వ్యక్తి పట్ల మానవత్వం చూపించిన ఖిద్మత్_ఎ_ఖల్క్_చారిటబుల్ చిల్డ్రన్స్ ట్రస్ట్..పుట్టపర్తి పట్టణ #సీఐ సునీత సహకారంతో సిబ్బంది నరసింహ, నాగార్జున
● రోడ్లపై సంచరిస్తున్న వారిని చేరదీసి ఆదరించి మానవత్వాన్ని చాటుకొనే వినూత్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన #ఖిద్మత్_ఎ_ఖల్క్_చారిటబుల్ _ట్రస్ట్ ..
● పుట్టపర్తి పట్టణం లో మతిస్థిమితం లేని వ్యక్తి రోడ్డుపై అనాధగా తిరుగుతున్నాడు ఇది గమనించి పోలీసు వారు షామీర్ కి తెలియజేయడంతో ఆ వ్యక్తికి కటింగ్, స్నానం చేయించారు .నూతన_బట్టలు నరసింహ, నాగార్జున చేతుల మీదుగా ఆ వ్యక్తికి తోడగడం జరిగింది మానవత్వాన్ని చాటుకున్న ఖిద్మత్_ఎ_ఖల్క్_చారిటబుచిల్డ్రన్ ట్రస్ట్ సభ్యులు .
●యాచకుల పట్ల సేవానిరతిని చాటిన #ఖిద్మత్_ఎ_ఖల్క్_చారిటబుల్_ట్రస్ట్ షామీర్, పోలీస్ సిబ్బంది నరసింహ,నాగార్జున, షమీముల్లా, జావీద్, ధన్యవాదాలు తెలిపారు.
👉నగరపంచాయతీ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన సబ్ కలెక్టర్*..గిద్దలూరు లో అధికారుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసిన సబ్ కలెక్టర్…చెత్తాచెదారం పేరుకు పోయి దుర్వాసన వస్తే ప్రజలకు రోగాలు రావా???
పట్టణంలో పారిశుద్ధ్య తీరుపై అసహనం వ్యక్తం చేసిన సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్
👉ఒంగోలు సంతపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ ప్రాంగణంలో బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి శాస్త్రి నిర్వహించిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి,తాతా ప్రసాద్ బద్ది రెడ్డి మరియు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
👉దొనకొండ లోని నరసింహనాయుడని పాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పేద ప్రజలకి 100 దుప్పట్లు, 100 కేజీలు కందిపప్పు,మరియు అన్నదానం జరిపించడం జరిగినది ఈ కార్యక్రమంలో నాగులపాటి శివ కోటేశ్వరరావు,శృంగారుపు నాగ సుబ్బారెడ్డి l,కొత్తo రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్టాఫ్ రిపోర్టర్ షేక్ రహిమాన్..
👉 ఒంగోలు లో సమత వృద్ధ ఆశ్రమం లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి పుట్టినరోజు సందర్బంగా వాసని అంకబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వృద్ధలకు పండ్లు పంపిణీ చేసి అన్నదానం చేయడం జరిగింది.
👉కంభం దొనకొండ దర్శి తాళ్లూరు తదితర పట్టణాలలో సైతం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పించే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ -తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్..బోరుగడ్డ అనిల్ మరో జైలు వీడియో వైరల్..అంగళ్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో వీధి రౌడీళ్ళ ప్రవర్తిస్తున్న విద్యార్థులు..మంత్రి లోకేశ్ కృషితో రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి..సైబర్ క్రైమ్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు.. షారుఖ్ ఖాన్ కు బెదిరింపులు.. ఘనంగా ఎంపీ మాగుంట తనయుడి జన్మదిన వేడుకలు.. గిద్దలూరు నగరపంచాయతీ అధికారుల తీరుపై సబ్ కలెక్టర్ అసహనం..
Recent Posts