వైసిపి పోస్టుల వెనుక ఉన్నది ఎవరో బయటపెట్టిన వర్రా?..సజ్జల భార్గవ్ రెడ్డికి బిగ్ షాక్..!..లుకౌట్ నోటీసులు జారీ..మాజీమంత్రి విడుదల రజిని, ఆమె పిఏ లపై ఫిర్యాదు..నటి శ్రీరెడ్డిపై బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు..రఘురామకృష్ణరాజును కేసులోరిటైర్డ్ ఏఎస్పీ విజయ్‌పాల్‌ను విచారించిన పోలీసులు..యువకుడి సెల్ఫీ సూసైడ్ వీడియో కలకలం…మంత్రి నారా లోకేష్‌తో చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు మర్యాదపూర్వక భేటీ.. చిత్తు కాగితాలు ఏరుకుంటూ దొంగతనాలు..గిద్దలూరు ప్రజల జీవితాలలో వెలుగులు నింపడమే నా బాధ్యత-హైకోర్టు అడ్వకేట్ మదిరే..మానవత్వం చాటుకున్న నందిగామ ఏసిపి తిలక్.. యెలుగూరి వారి వివాహ మహోత్సవం లో మాజీ ఎమ్మెల్యే అన్నా ..కంభం లో 16 క్వార్టర్ల అక్రమ మద్యం స్వాధీనం..

👉 వైసిపి పోస్టుల వెనుక ఉన్నది ఎవరో బయటపెట్టిన వర్రా..
ఏపీలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా.. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై తీసుకుంటున్న చర్చల గురించే చర్చ అని చెప్పినా అతిశయోక్తి కాదేమో. ఆ స్థాయిలో ఉంది ఇప్పుడు వ్యవహారం. ఈ విషయంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
అవును… సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. అవినాష్ రెడ్డి పాత్ర కీలకంగా మారిందని అంటున్నారు! ఈ సందర్భంగా వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలంపై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కీలక విషయాలు వెల్లడించారు.
ఇందులో భాగంగా… ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ బండి రాఘవరెడ్డి ద్వారా సమాచారం అందుకొని, తాను ఆ పోస్టులు పెట్టినట్లు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి చెప్పినట్లు డీఐజీ ప్రవీణ్ వెల్లడించారు. ఈ సూచనల మేరకే విజయమ్మ, షర్మిల, వివేకా కుమార్తె సునీతపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు చెప్పారని తెలిపారు.ఈ కేసులో వర్రా రవీందర్ రెడ్డితో పాటు అతడు పారిపోవడానికి సహకరించిన సుబ్బరెడ్డి, ఉదయ్ లను పోలీసులు సోమవారం కడపలో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. చంద్రబాబు, పవన్, హోంమంత్రి అనిత సహా పలువురు ప్రముఖుల కుటుంబ సభ్యులే లక్ష్యంగా అసభ్య పోస్టులు పెడుతున్నారని.. ప్రవీణ్ వెల్లడించారు.
ఇదే సమయంలో… ఇలాంటి వారిని సుమారు 400 మందిని నియమించుకుని, వారి కార్యకలాపాల కోసం 40 సోషల్ మీడియా టీమ్ ని ఏర్పాటు చేసుకున్నారని.. కంటెంట్ ప్రసారాల కోసం సుమారు 40 యూట్యూ ఛానల్స్ కూడా నడిపారని అంటున్నారు. ఈ క్రమంలో… వీరంతా తాడేపల్లిలోని పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ మూడో అంతస్తులో కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారని అంటున్నారు.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచగా.. విచారణ అనంతర అతడికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. విచారణ సందర్భంగా పోలీసులు తనను తీవ్రంగా కోట్టారని వర్ర రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో… అతడికి కడప రిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.
👉సజ్జల భార్గవ్ రెడ్డికి బిగ్ షాక్..!*లుకౌట్ నోటీసులు జారీ..*
*అమరావతి : సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కడప పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 8న పులివెందులలో వర్రా రవీంద్రారెడ్డితో పాటు సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఏపీలో భార్గవ్ రెడ్డిపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో విదేశాలకు పారిపోతారనే అనుమానంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వీరిద్దరి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.
వైసీపీ సోషల్ మీడియాలో కీలకమైన వ్యక్తి సజ్జల భార్గవ్ రెడ్డి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపులు చేపట్టారు. సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి.. ఈ ఇద్దరికి లుకౌట్ నోటీసులు పంపారు. దాదాపు వారం రోజుల నుంచి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరిపైన నిఘా పెట్టిన పోలీసులు.. ఇప్పటికే పులివెందుల ప్రాంతానికి చెందిన వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు. సజ్జల భార్గవ్ ఆదేశాలతోనే తాను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టానని రవీంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. దీని ఆధారంగా పోలీసులు భార్గవ్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
మరోవైపు గుంటూరు నుంచి ముందస్తు బెయిల్ కోరారు సజ్జల భార్గవ్. దీంతో అతడికి లుకౌట్ నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి పోలీసులకు ఎదురైంది. తనకున్న నెట్ వర్క్ ఆధారంగా సజ్జల భార్గవ్ విదేశాలు వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించిన పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. వర్రా రవీంద్రారెడ్డిని అడ్డం పెట్టుకుని సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల పెట్టే విషయంలో కీలక పాత్ర పోషించిన సజ్జల భార్గవ్, అర్జున్ రెడ్డిలను.. పులివెందులలో నమోదైన కేసు ఆధారంగా వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తామన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారందరిని పోలీసులు టార్గెట్ చేశారు. వారిని అరెస్ట్ చేసే పర్వం కంటిన్యూ అవుతోంది.
👉మాజీమంత్రి విడుదల రజిని మరియు ఆమె పిఏ లపై పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు..*రామకృష్ణ,ఫణీంద్ర,అప్పటి చిలకలూరిపేట సిఐ సూర్యనారాయణలపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడైన పిల్లి కోటి మరియు చిలకలూరిపేటకి చెందిన పలువురు టీడీపీ శ్రేణులు*
*వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తమను దారుణంగా వేదించి తీవ్రంగా కొట్టారని ఫిర్యాదు చేసిన బాధితుడు*
*కొట్టి చిత్రహింసలకు గురి చేసి ఆ దృశ్యాలను లైవ్ లో చూస్తూ నాటి స్థానిక శాసనసభ్యురాలు, మాజీ మంత్రి అయిన విడదల రజనీ పైశాచిక ఆనందం పొందారని టీడీపీ శ్రేణుల ఆరోపణ*..*తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తే చంపేస్తామని బెదిరించారు**విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఎస్పీ శ్రీనివాసరావుని కోరిన బాధితులు..
👉రఘురామకృష్ణరాజును హింసించారన్న కేసులో రిటైర్డ్ ఏఎస్పీ విజయ్‌పాల్‌ను విచారించిన పోలీసులు పోలీసులు..*ఉ.11గంటల నుంచి సా.6గంటల వరకు సాగిన విచారణ..*విచారణ అనంతరం విజయ్‌పాల్‌ను పంపించేసిన పోలీసులు..*మరోసారి విజయ్‌పాల్‌ను పోలీసులు విచారించే అవకాశం.*
👉 కర్నూలు జిల్లా కోసిగిలో గ్రామ సర్పంచ్ మరో ఇద్దరు వైసీపీ కార్యకర్తలతో కలిసి 8వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం చేసారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారు.
👉యెలుగూరి వారి వివాహ మహోత్సవనికి హాజరుఆయిన మాజి ఎమ్మెల్యే అన్నా..
*మార్కాపురం టౌన్ మాధవి గ్రాండ్ ఇన్ నందు శివప్రసాద రావు, లక్ష్మీల కుమార్తె వివాహానికి హాజరు అయి నూతన వధూవరులు అయిన వినీల,నాగార్జునలను ఆశీర్వదించిన మాజి ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి ఎస్ రహమాన్..
👉 హలో ఫ్రండ్స్ జర భద్రం…..చిత్తు కాగితాలు ఏరే వాళ్ళు లాగా వస్తారు..ఎవరూ లేని ఇల్లు సెలెక్ట్ చేస్తారు..తరువాత ఇల్లు మొత్తం కొల్ల గోడతారు…పోలీసులు ఏమి చెబుతున్నారంటే!*
చిత్తు కాగితాలు ఏరుకుంటుంటారు..
రోజుకో ఏరియాలో బాటిల్స్, చెత్త సేకరిస్తుంటారు..
అయితే, వేస్ట్ ఏరుకుంటూనే మాటు వేస్తారు..
ఆ ఏరియాలోని తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తారు..
అనుమానం రాకుండా ఆ ఇంట్లోకి చొరబడతారు..
తాళాలు పగులకొట్టి అందినకాడికి దండుకుంటారు..
ఇదంతా చేసేది ఎవరుకుంటున్నారా.. చేయి తిరిగిన చోరులు.. మగవాళ్లేనేమో అనుకంటున్నారా? అయితే మీ ఊహా కరెక్ట్ కాదు..
చిత్తు కాగితాలు ఏరుకుంటూనే తాళం వేసిన ఇళ్లలో చోరిలకు పాల్పడుతుంది ఇద్దరూ మహిళలు..😱😱😱
వీరిని గుర్తించిన తెనాలి పోలీసులకు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు..గుంటూరు జిల్లా..తెనాలి..
రామలింగేశ్వర వీథిలోని పేటలోని తోట వారి వీధి.. ఇదే ఏరియాలోని మల్లిఖార్జున శర్మ ఘనాపాఠి వారి ఇల్లు ఉంది.. అయితే.. ఎప్పటిలాగే శర్మ.. యజ్ఞం నిర్వహించేందుకు గత నెల 31వ తేదీన ఊరెళ్లారు. అయితే తర్వాత రోజు ఇంటి గ్రిల్స్ తీసి ఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చిన శర్శకు విషయం చెప్పారు. వెంటనే వచ్చిన ఆయన ఇంటి తలుపులు తీసి విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరి చేసినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. నిన్న అదే ఏరియాలో చిత్తు కాగితాలు ఏరుకుంటున్న బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లికి చెందిన రోశమ్మ, మహంకాళిలను అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకున్నారు.
అయితే.. మీ మీ ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెనాలి డిఎస్పీ జనార్ధన రావు చెప్పారు. ఇటువంటి చోరీలను మొదటి రెక్కి చేసి తర్వాత సీన్ లోకి వస్తారని విచిత్ర వేషధారణలో తిరుగుతన్న వారిపై అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.
👉ఎన్టీఆర్ జిల్లా నందిగామ..
*మానవత్వం చాటుకున్న నందిగామ ఏసిపి తిలక్*
*వత్సవాయి మండలం గోపినేనిపాలెం గ్రామానికి చెందిన వృద్ధురాలు లక్ష్మీ నరసమ్మ తమ కుటుంబ సభ్యులు ఎవరు తనను సరిగ్గా చూడటం లేదని తన కుటుంబ సభ్యుల వల్ల తనకున్న ఇబ్బందులను ఏసిపి కి తెలియజేయడానికి ఏసిపి కార్యాలయానికి వచ్చిన వృద్ధురాలు..
*వృద్ధురాలు నడవలేని పరిస్థితుల్లో ఉందని తెలుసుకుని వెంటనే ఏసీబీ తిలక్ వృద్ధురాలు ఉన్న ఆటో వద్దకే వచ్చి ఆమె సమస్యను విన్నారు వృద్ధురాలి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు వెంటనే వృద్ధురాలు లక్ష్మీ నరసమ్మ సమస్యను పరిష్కరించాలని వత్సవాయి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు*
*వృద్ధురాలు ప్రయాణ ఖర్చులు కూడా ఆటో డ్రైవర్ కు అందజేసిన ఏసిపి*
*ఎసిపి తిలక్ తన సమస్యను విని వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వృద్ధురాలు సంతోషంతో ఇంటికి వెనుతిరిగారు*
👉 ప్రకాశం జిల్లా ముండ్లపాడు గ్రామంలో జరిగిన గ్రామసభలో ముండ్లపాడు తెలుగుదేశం పార్టీ యువనాయకుడు కురుకుందు సాంబశివ నాయుడు మరియు గ్రామస్థులు కలిసి ముండ్లపాడు, బురుజుపల్లె వెంకటాపురం గ్రామాల్లో ఉన్న హిందూ స్మశాన వాటికలు దురాక్రమణకు గురయ్యాయని , వెంటనే దురాక్రమణలను తొలగించి ఆక్రమనదారులపై చర్యలు తీసుకోవాలని గిద్దలూరు తహసీల్దార్ యం. ఆంజనేయరెడ్డి కి వినతిపత్రం సమర్పించారు.సానుకూలంగా స్పందించిన తహసీల్దార్ వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
👉నెల్లూరు జిల్లా.. ముత్తుకూరు మండలం.
*మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పై ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు…*
కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారిస్తున్న ముత్తుకూరు సిఐ రావినాయక్..
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి అవినీతిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో కాకాని పెట్టిన పోస్ట్ పై ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..
👉నటి శ్రీరెడ్డిపై బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు*
*చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అనితలపై సోష‌ల్‌మీడియాలో అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని సీఐకి ఫిర్యాదు చేసిన టీడీపీ రాష్ట్ర మ‌హిళా కార్య‌ద‌ర్శి మ‌జ్జి ప‌ద్మ‌* *బీఎన్ఎస్‌ సెక్షన్లు 196, 353, 79, 67 కింద శ్రీ‌రెడ్డిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు సీఐ తెలిపార‌న్న ప‌ద్మ‌..
*గ‌త ప్ర‌భుత్వంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పైనే కాక వారి కుటుంబాల‌పై కూడా సోష‌ల్‌మీడియాలో శ్రీ‌రెడ్డి చెప్ప‌రాని వ్యాఖ్య‌లు చేసిందని, ఆమెను స్త్రీ జాతి నుంచి వెలేస్తున్నామ‌ని వెల్ల‌డి*
👉యువకుడి సెల్ఫీ సూసైడ్ వీడియో కలకలం..😱😱😱
రైలు పట్టాలపై పడుకుని వీడియో తీసుకున్న నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన షేక్ మదార్ వలీ అనే యువకుడు..
నరసరావుపేట రూరల్ సీఐ పసుపులేటి రామక్రిష్ణ, బాబు అనే కానిస్టేబుల్ తనను తప్పుడు కేసులో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన..
కేసు లేకుండా చేయాలంటే తనకు ఐదు లక్షల రూపాయలు లంచంగా ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయిన బాధితుడు..
అంత డబ్బు తన వద్ద లేదని, తనకి చావే శరణ్యం అని భావించి రైలు పట్టాలపై తల పెట్టి చనిపోతున్నానని వీడియోలో మదార్ వలీ వెల్లడి
👉మంత్రి నారా లోకేష్‌తో చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు మర్యాదపూర్వక భేటీ..
రాష్ట్ర విద్య, ఐటీ, ఆర్టీజీ వ్యవహారాల శాఖమంత్రి నారా లోకేష్‌తో అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్‌విప్‌, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు బుధవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అత్యంత కీలకమైన చీఫ్‌ విప్ పదవిని తనకు ఇచ్చినందుకు ఈ సందర్భంగా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. తన సతీమణి లీలావతితో అసెంబ్లీ ఆవరణలోని మంత్రి లోకేష్‌ కార్యాలయంలో ఆయనను కలసి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు జీవీ దంపతులు. పుష్పగుచ్ఛం అందించి వేంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు. ఎంతో నమ్మకంతో తనపై పెట్టిన బాధ్యతను వందశాతం అంకితభావంతో నిర్వహిస్తానని ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌కు హామీ ఇచ్చినట్లు తెలిపారు చీఫ్‌ విప్ జీవీ ఆంజనేయులు.
👉 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ను రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం రాజ్ భవన్ లో గవర్నర్ ను మంత్రి ఫరూక్ కలిశారు.
👉 హీరోయిన్ అనన్య నాగళ్ల గొప్ప మనసు ..
టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల మరోసారి మంచి మనసు చాటుకున్నారు. హైదరాబాద్లోని బస్టాండ్ పరిసరాల్లో చలిలో నిద్రిస్తున్న ప్రయాణికులు, అనాథలు, పేదలకు ఆమె దుప్పట్లు పంచారు. స్వయంగా ఆమెనే వారికి దుప్పట్లు కప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. కాగా వరదల సమయంలోనూ అనన్య రెండు రాష్ట్రాలకు కలిపి రూ.5లక్షలు ఇచ్చారు
👉 గిద్దలూరు ప్రజల జీవితాలలో వెలుగులు నింపడమే నా బాధ్యత…*చంద్రారెడ్డి పల్లి గ్రామంలో వీధి లైట్ల ఏర్పాటు…
*మదిరె రంగ సాయి రెడ్డి,* ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు..ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల పరిధిలోని చంద్రారెడ్డి పల్లి గ్రామంలో తన సొంత నిధులతో ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు మదిరె రంగ సాయి రెడ్డి గ్రామం మొత్తం వీధి లైట్లు ఏర్పాటు చేశారు.
ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలనే మంచి మనస్సుతో ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని గ్రామ సర్పంచ్ లక్ష్మి ప్రసన్న మరియు గ్రామ ప్రజలు కొనియాడారు..
👉16 క్వార్టర్ల అక్రమ మద్యం స్వాధీనం..

పట్టణంలోని ఒక వ్యక్తి వద్ద 16 (180ఎం ఎల్) అక్రమ మద్యం సీసాలను కంభం ఎస్సై బి నరసింహారావు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ మద్యం ఎవరైనా చట్టవిరుద్దంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.కార్యక్రమంలో ఆయనతో పాటు కంభం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?