నెత్తురంటిన చేతులు ఎవరివి మోడీజీ..వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..ఫోన్‌ ట్యాపింగ్ కేసులో సంచలన ట్విస్ట్‌….వికారాబాద్ కలెక్టర్‌పై దాడిలో కుట్రకోణం ఉంది- ఐజీ సత్యనారాయణ..సర్కార్‌కు సవాల్‌గా మారిన కులగణన సర్వే..

👉*నెత్తురంటిన చేతులు ఎవరవి?..మోదీ జీ..?
రిజర్వేషన్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా..? రిజర్వేషన్లకు కాంగ్రెస్ ఎట్లా వ్యతిరేకం మోదీజీ ..
తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పోరేషన్ చైర్మన్..జంగా రాఘవ రెడ్డి.. *రిజర్వేషన్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా..? రిజర్వేషన్లకు కాంగ్రెస్ ఎట్లా వ్యతిరేకం మోదీ ..?* *దేశ విభజన నాటి మత కల్లోలా నుంచి , ఆహమ్మదాబాద్, ముంబై, ఈ మోదీ-షా ల కాలం నాటి అమానుషమైన గుజరాత్ జాతి హత్యాకాండ.. మణిపూర్ మంటల వరకూ.. నెత్తురంటిన చేతులు ఎవరివి మోదీ మీవీ కావా..? మీ ఆర్.ఎస్.ఎస్ వి కదని చెప్పే దైర్యం ఉందా.. అని తెలంగాణ ఆయిల్ ఫాట్ కార్పోరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఒక బహిరంగ సభలో ఆరోపించారు..
*మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భారత దేశ ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతీయ సమాజాన్ని కులాల పేరిట చీల్చాలని కాంగ్రెస్‌ చూస్తోందని మాట్లాడడం ‘బాబూ దేవతలక్కూడా మోదీ నాట్యం నే ర్పుతారనిపిస్తుంది”……*
ఈ పదేళ్ల బీజేపీ మోదీ-షాల పాలన లో భారత దేశ ప్రజల మధ్య వ్యవస్థాపరంగానే అనైక్యతను కొనసాగిస్తూ దేశాన్ని గుజరాతి వ్యాపారులు అంబానీ-ఆదానిల వంటి పిడికెడు గుత్త పెట్టుబడి దార్లకు దేశంలోని వనరులను… కార్మికుల శ్రమను కారుచౌకగా దోచిపెట్టేందుకు అణిచివేతలను కోనసాగిస్తున్నది మోదీ-షాలన్నది నిజం కదా..? ఇందుకు కుల వ్యవస్థను ఉపయోగించుకున్నది నిజం కాదా..? . సృష్టికర్త అయిన దేవుడు తన ముఖము నుండి బ్రాహ్మణులను భుజముల నుండి క్షత్రియులను తొడల నుండి వైశ్యులను పాదముల నుండి శూద్రులను పుట్టించాడు అంటూ పురాణ కథలను వినిపిస్తూ నేటి ఆధునిక యుగములో ఎలక్ట్రానిక్ మీడియాను ఉపయోగించుకొని కుల భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నది దేశభక్తి గురించి తెగ రెచ్చిపోతూ మాట్లాడే ఆర్.ఎస్.ఎస్ కు పూసిన పువ్వే కదా మోదీ.. భారత ప్రజల ప్రీయతమ నాయకుడిగా..భావి భారత సమాజ ఆశజ్యోతిగా అవిర్భవిస్తున్న రాహుల్ గాంధీ భారత ప్రజానీకం ముందు పెడుతున్న ప్రశ్నలు దేశభక్తి గుత్త సొతంతైనట్టు మాట్లాడే మనువాదులకి ప్రతినిధిని భారతీయ జనతాపార్టీ దాని తల్లి ఆర్.ఎస్.ఎస్ గుండెళ్లో గుచ్చుకుంటున్నాయి కనుకనే మోదీ పెడబొబ్బలు పెడుతున్నరు.
లౌకికవాదం.. రాజ్యంగం ను కాపాడాలని ప్రేమ ను పంచుతూ కాన్యకుమారి నుంచి కాశ్మీర్ వరకు…. దేశం మొత్తం భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ రాజకీయ లబ్ధి కోసం ఒక కులాన్ని మరో కులంపైకి ఉసిగొల్పుతూ ప్రమాదకర క్రీడ ఆడుతున్నారని ప్రధాని హోదాలో మోదీ పచ్చి అబద్దాలు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు కదా…?
అసలు రాహుల్ గాంధీ ఎమంటున్నారు?? దేశాభివృద్ధి కోసం కులగణన చేయమనడం దేశాన్ని విభజించినట్టా..? రాహుల్ గాంధీ ఈ సమాజం ఎట్లుందో చూసుకోవాలని అడగడం తప్పా…? వాస్తవం ను ధైర్యంగా చెప్పడం దేశ ద్రోహమా..? భారత సమాజం ఎంటిదో తెలుసుకోకుండా.. భారత సమాజ ప్రగతి.. డెవలప్మెంట్ గురించి మాట్లాడమనేది దర్మార్గం కదా?? .
భారత సమాజంలో ఉన్న సమాజాన్ని అర్ధం చేసుకోకుండా ఫలితమెట్ల చెబుతవని ప్రశ్నీంచడం ఎస్సీ, ఎస్టీలు, బీసీల ఐక్యతను చెడగొట్టడమౌతోందా..?
ఈ దేశంలో దళిత్స్, ఆదివాసీస్, మైనార్టీస్, మహిళా… ఎక్కడ ఉన్నారని తెలుసుకోవడం తప్పా… ?
వీళ్ల డెవలప్మెంట్ జరిగితే సమాజం డెవలప్ అయినట్టని .. జ్యూడిషియరి, మీడియా, న్యాయవ్యవస్థ మొత్తం ఈ దేశం నడుస్తున్న ఫోర్త్ ఎస్టేట్ గురించి నాలుగు అంగాలు దేశంలో ఉన్నయి. ఈ నాలుగు అంగాలలో ఎవ్వని స్థానమెంటో తెలుసుకోమనడం…ఈ వర్గాలు ఎక్కడ ఉన్నయి తెలుసుకో. మీడియా లో ఆదివాసి యాంకర్ అనేవాళ్లు వున్నారా తెలుసుకో … బ్యూరోక్రసీలో ఉద్యోగస్తులలో ఎవరెంత మందో తెలుసుకోవడం దేశ విభజన దారీ తీస్తదా..?
ఈ దేశం లో కుల వర్గం గురించి మాట్లడకుండా .. కులం.. వివక్షత.. ఆర్ధిక అసమానతల గురించి పై రెండు వాటి గురించి మాట్లడకుండా భారత దేశ సమానత్వం గురించి మాట్లడడం.. డెవలప్ మెంట్ గురించి మాట్లడడం… ఆ వర్గాల అభ్యున్నతి గురించి మాట్లాడం అంత్యంత దుర్మార్గం… డొల్లతనమని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ గా ఈ దేశంలో ఉన్న నగ్నసత్యాన్ని మాట్లడితే ‘ఎస్సీ, ఎస్టీలు, బీసీల ఐక్యతను చెడగొట్టడమే…ప్రధాన ఎజెండా. ‘గిరిజన తెగల మధ్య చిచ్చు పెట్టాలన్నది కాంగ్రెస్‌ ఎజెండా. అని మోదీ గోబెల్స్ ప్రచారం చేస్తున్నడు. ఈ దేశంలో వాస్తవాల మీద కులగనన చేయకుంటే ఈ దేశంల ప్రజలు.. ప్రజాస్వామిక డెవలప్మెంట్ గురించి మాట్లాడేటోళ్లకు ప్రత్యామ్నాయం లేదని హెచ్చరించడం ఏవిధంగా జాతీ విద్రోహచర్యనో ఆర్.ఎస్.ఎస్.. బీజేపీ ప్రధాని మోదీనే చెప్పాలన్నారు.. కాంగ్రెస్ పార్టీ గా లోక్ సభ లో ఇండియా కుటమీ తరఫున ప్రతికపక్ష నేతగా ఈ దేశంలో అట్టడుగు వర్గాల అబ్యున్నతి గురించి ప్రొగ్రాం తీసుకుంటే అది ఒక ప్రజాస్వామిక పద్దతితో కొనసాగించాలని మాట్లాడుతుంటే దేశాన్ని విభజించడం ఎలా అవుతుంది..? ఈ వ్వవస్థ గురించి మాట్లాడుతూ భారత సమాజం ఎదుర్కొంటున్న రుగ్మాతలకు పరిష్కారం కోసం ఎక్స్రే వంటి కులగణన చేయమని డిమాండ్ చేస్తూ తెలంగాణలో ప్రభుత్వంతో కుల గణన ప్రారంభించడం ఏ విధంగా తప్పో ప్రజల ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. అందులో మేధావులు.. పౌర సమాజం.. కుల సంగాల ప్రతినిధులు.. సమాజీక కార్యకర్తలలో సంభాషణ జరిపడంతో ఈదేశంలోని దేశంలో బీజేపీ కి పొలిటికల్ ప్రత్యామ్నాయం ప్రోగ్రమని…. ఇది ఇలా డెమోక్రటిక్ ప్రాసేస్ కోనసాగిస్తే ఈదేశంలో మనువాదుల ప్రతినిధి పార్టీ భారతీయ జనతాపార్టీ దాని నాయకుడి మోధీ-షాల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నయి.. ఆర్.ఎస్.ఎస్ పునాదులు కదులుతున్నయి..*జాతీయ కాంగ్రెస్ పార్టీ లౌకివవాద పార్టీ ..ఈ దేశానికి స్వాతంత్య్రం తేవడమే కాదు* ..
వచ్చిన స్వాతంత్ర్య ఫలాలను పేదలకు,దక్కేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు. గరిబ్ హఠావో..రాజభరణాల రద్దు..భూమల పంపకాలు..
*అంబెడ్కర్ వంటి మహానుభావునీతో రాజ్యాంగం రచన చేయడానికి కాంగ్రెస్ అవకాశం కల్పించింది.*_
*రిజర్వేషన్లు వంటి వాటితో పేదల బతుకులలో* *మార్పు.పేద,ధనిక ,కులం,మతం తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి ప్రజలను దేవుళ్ళను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనన్నారు. రిజర్వేషన్లు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ని పట్టుకొని రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని మోధీ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నడు
*ఇవాళ ప్రతి పార్టీ ,ప్రతి రాజకీయ నాయకులు 5 ఏళ్ల ఒకసారి పేదల ఇండ్లకు వచ్చి బ్రతిమాలి ఓటు అడుగుతున్నారంటే అది అంబెడ్కర్ ద్వారా అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు .
👉వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
హైదరాబాద్ : వికారాబాద్ కలెక్టర్ దాడి ఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కలెక్టర్ పై దాడిని ప్రతీ ఒక్కరూ ఖండిస్తున్నారు. ఇప్పటికే పలు పార్టీల నాయకులు, ఉద్యోగులు ఈ దాడిని తప్పుపట్టారు. తాజాగా దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కలెక్టర్ పై దాడిని తీవ్రంగా ఖండించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ దాడి వెనుక ఎంత వారున్నా ఊచలు లెక్క పెట్టాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. దాడులు చేయించిన వారిని, చేసిన వారిని ఎవరినీ వదలమని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఆయన బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఇలాంటి దాడులు బీఆర్ఎస్ పార్టీ నేతలపై జరిగితే కేటీఆర్ సమర్థిస్తారా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అధికారులపై దాడులను బీఆర్ఎస్ ఎందుకు ఖండించదు అని ఆయన ప్రశ్నించారు. దాడి చేసిన వారిని ఎలా పరామర్శిస్తారు..? అంటే దాడులను ప్రోత్సహించేందుకే పరామర్శలా? అని బీఆర్ఎస్ నేతలను నిలదీశారు రేవంత్ రెడ్డి.
ఫార్ములా ఈ-రేస్ స్కామ్ పై కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్కామ్ నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. తెలంగాణ గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్ పై చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అవినీతి పార్టీ అయిన బీజేపీని అంతం చేస్తామన్న కేటీఆర్.. ఇప్పుడు బీజేపీ నేతలను ఎలా కలుస్తున్నారని ప్రశ్నించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని చెప్పడం బీజేపీకి సహకరించినట్లు కాదా అని నిలదీశారు. అమృత్ టెండర్లలో అవినీతి జరగలేదని స్వయంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందుల ఉపేందర్ రెడ్డి చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు.
👉ఫోన్‌ ట్యాపింగ్ కేసులో సంచలన ట్విస్ట్‌..😲😲😲
*మరికొందరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు..!
*హైదరాబాద్..
సంచలనం రేపిన ఫోన్ టాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు రావడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. చార్జిషీటు దాఖలు చేసినా నాలుగు నెలల తర్వాత ఈ కేసులో పొలిటికల్ లీడర్లను పోలీసులు టచ్ చేశారు. అయితే ఎమ్మెల్యేలకు ఫోన్ టైపింగ్ కేసుతో ఉన్న సంబంధాలపై సర్వత్ర చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు ఈ కేసులో పోలీస్ అధికారులను మాత్రమే అరెస్టు చేశారు. మరో ఇద్దరు విదేశాల్లో తలదాచుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు పోలీసుల ముందుకు వచ్చి సహకరిస్తేనే ఇందులో రాజకీయ నాయకుల పేర్లు బయటపడే అవకాశం ఉంది. అప్పుడే రాజకీయ నేతలను పోలీసులు విచారణకు పిలుస్తారు అని ముందు నుండి నడుస్తున్న వాదన. కానీ అనుహ్యాoగా ఆ ఇద్దరు విదేశాల్లోనే ఉన్నప్పటికీ పోలీసులు పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇవ్వడం ఇప్పుడూ సంచలనంగా మారింది.
అయితే ఫోన్ టాపింగ్ కేసులో అప్పటి ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నవంబర్ రెండో వారంలో తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య తోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు ఈ నోటీసులు జారీ చేశారు. అయితే టాపింగ్ కేసు విచారణ సందర్భంగా అప్పటి ప్రతిపక్షాలకు సంబంధించిన డబ్బును సీజ్ చేసే విషయంలో ఇప్పుడు అరెస్టు అయిన పోలీసుల పాత్ర ఉంది. వీటితోపాటు అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పోలీస్ వాహనాల్లో డబ్బులు సైతం వెళ్ళినట్లు చార్జిషీట్లోనూ దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.
అయితే ఇప్పుడు నోటీసులు అందుకున్న మాజీ ఎమ్మెల్యేలే పోలీసుల సహాయంతో డబ్బుల సంచులను ఎన్నికలకు తరలించినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. దీంతో వీరి స్టేట్‌మెంట్ రికార్డ్ తోపాటు వీరి పాత్ర పైనా పోలీసులు విచారించాల్సిన ఉంది. అందులో భాగంగానే వీరికి నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. నవంబర్‌ 14వ తేదీన చిరుముర్తి లింగయ్య జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు విచారణకు హాజరుకానున్నారు.
కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పలువురు ప్రతిపక్ష నేతలతో పాటు సెలబ్రెటీలు, బిల్డర్లు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు గుర్తించిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోగా.. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న జ్యుడిషియల్ రిమాండ్‎లో భాగంగా ప్రస్తుతం జైల్లో ఉన్నారు.
👉సర్కార్‌కు సవాల్‌గా మారిన కులగణన సర్వే..*
*సమాచారం సేకరించేందుకు వెళ్లిన వారిపై జనం గరం!
*హైదరాబాద్
కులగణన అంటూ ప్రభుత్వం.. అయితే అన్ని వివరాలు ఎందుకని ప్రజలు.. ఇలా తెలంగాణ సర్కార్‌ చేపట్టిన సర్వేకు కష్టాలు తప్పడం లేదు. కులగణన పేరుతో కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు అడగడంపై పబ్లిక్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వేపై ప్రజల్లో చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సర్వే కోసం రూపొందించిన ఫార్మాట్ విషయంలో అభ్యంతరాలు తెలుపుతున్నారు జనాలు. సర్వే ఫామ్‌లో నేరుగా 56 ప్రశ్నలు ఉన్నాయి. సబ్‌గా టైటిల్‌గా ఉన్న ప్రశ్నలు లెక్కిస్తే 70కి పైగా అవుతున్నాయి. ఈ ప్రశ్నల్లో చాలావరకు వ్యక్తిగత సమాచారాన్ని అడగటంపై ప్రజలు డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఆస్తులు.. ఉద్యోగస్తుల జీతభత్యాలకు సంబంధించిన ప్రశ్నలు ఉండటంపై పబ్లిక్ మండిపడుతున్నారు. అన్ని వివరాలు ఎందుకు ఇవ్వాలంటూ ఎన్యుమరేటర్లను ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా కాన్ఫిడెన్షియల్‌గా ఉండే ఆస్తులను ఎలా బహిర్గతం చేస్తామంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తులు, జీతభత్యాల వివరాలను పూర్తిగా చెప్తే ఏమవుతుందో అని భయం వెంటాడుతోంది. మరోవైపు ఈ పూర్తి సమగ్ర సమాచారంతో.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కోత విధిస్తారేమోనని అనుమానం వ్యక్తమవుతోంది.
వృద్ధాప్య పెన్షన్లు, రేషన్ కార్డులకు అనర్హత విధిస్తారేమోనన్న ఆందోళనలో ఉన్నారు జనం. అందుకే సర్వే విషయంలో ప్రజల నుంచి అంత సానుకూలత వ్యక్తం కావడం లేదనే టాక్ వినిపిస్తోంది. గతంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఉండగానే మళ్లీ కొత్తగా సర్వే చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ కుల సర్వేనే చేయాలనుకుంటే ఈ వ్యక్తిగత ఆదాయానికి సంబంధించిన ప్రశ్నలు ఏంటి అంటూ నిలదీస్తున్నారు.
*సర్కారు పెద్దలు రంగంలోకి*
కులగణన పేరుతో చేస్తున్న ఇంటింటి సర్వేపై ప్రజల నుంచి భిన్నమైన వాదన వినిపిస్తుండటంతో సర్కారు పెద్దలు రంగంలోకి దిగుతున్నారు. బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా రంగంలోకి దిగి సర్వే పట్ల ప్రజలు అనుమానం పడాల్సిన అవసరం లేదంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.
మంత్రి హుస్నాబాద్ పట్టణంలో ఎన్యుమరేటర్స్‌తో కలసి స్వయంగా సర్వేలో పాల్గొని వివరాలు నమోదు చేశారు. ప్రజా ప్రతినిధులు ఇంటింటి కుటుంబ సర్వేలో భాగస్వామ్యులు కావాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. సర్వే ద్వారా మీ కుల బలమెందో తెలిస్తే సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక వేయడానికి అవకాశం ఉంటుందని సర్వేకు సహకరించాలని కోరుతున్నారు. ఈ సమగ్ర సర్వే ద్వారా ఎవరెంతో వారికంత ఆలోచనలతో తేడాలు సరిచేయడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు.
*ఏదో కహాని ఉందని..*
ప్రభుత్వం వివరణ ఎలా ఉన్నా.. ప్రజలు మాత్రం ఎన్యుమరేటర్లకు అన్ని వివరాలు చెప్పడం లేదు. కొందరు అయితే కనీస వివరాలు ఇచ్చేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. ఉద్యోగాలు, జీతాలు, అకౌంట్‌ నెంబర్లు, ఆస్తుల వివరాలు అడగటం వెనక ఏదో కహాని ఉందని మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలనే అమలు చేయకుండా ఇప్పటికే వస్తున్న పథకాలకు కోత పెట్టే కుట్ర జరుగుతుందంటూ జనం తిట్లదండకం అందుకుంటున్నారు. వ్యక్తిగత ఆస్తులు ఆదాయం వంటి అంశాలను సర్వే నుంచి పక్కన పెట్టాలని కోరుతున్నారు.
ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలను కూడా ప్రజల్లో పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదట. ఎన్యుమరేటర్లు అడిగిన ప్రశ్నలకు ఇష్టమనిపిస్తే సమాధానం చెప్తున్నారట. లేకపోతే లైట్ తీసుకుంటున్నారట. కొందరు అయితే అన్ని వివరాలు ఇస్తున్నారు. ఇదేంటి సర్వే అన్నప్పుడు అందరి దగ్గర అన్ని వివరాలు తీసుకోవాలి కదా. కొందరు వివరాలు ఇవ్వడం లేదు. మరికొందరి దగ్గర అన్ని వివరాలు తీసుకుంటున్నారు ఇదెక్కడ లెక్క అంటూ పబ్లిక్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వే కష్టాలను ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
👉 వికారాబాద్ కలెక్టర్‌పై దాడిలో కుట్రకోణం ఉంది- ఐజీ సత్యనారాయణ..
వికారాబాద్ : వికారాబాద్ కలెక్టర్ పై దాడి ఘటనలో కుట్రకోణం దాగి ఉందన్నారు హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్య నారాయణ. బీఆర్ఎస్ నేత సురేశ్ కావాలనే కలెక్టర్ ను గ్రామంలోకి తీసుకెళ్లారని, ఇందులో పోలీసుల వైఫల్యం ఎక్కడా లేదన్నారు. దాడి కేసులో ఇప్పటికే 20మందిని అరెస్ట్ చేశామని, ఇప్పటికే 3 నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ప్రస్తుతం సురేశ్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లుగా ఐజీ సత్యనారాయణ చెప్పారు. వికారాబాద్ కలెక్టర్ తో పాటు అధికారులపై దాడి చేసిన కేసును పోలీసు శాఖ సీరియస్ గా తీసుకుందని ఐజీ వెల్లడించారు.
‘పోలీసు వైఫల్యం అనేది కరెక్ట్ కాదు. ప్రజాభిప్రాయానికి సంబంధించి 140 మంది ఫోర్స్ తో, ముగ్గురు డీఎస్పీలతో బందోబస్తు ఏర్పాటు చేశాం. 12.50 గంటలకు లగచెర్లకు చెందిన సురేశ్ అనే రైతు ముగ్గురితో అక్కడికి వచ్చాడు. కలెక్టర్ ను రిక్వెస్ చేశాడు. మీరు ఇక్కడుంటే కాదు.. వికారాబాద్ నుంచి వచ్చిన వాళ్లు లగచెర్లకు వస్తే రైతులు చాలా సానుకూలంగా ఉంటారు. మీరు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారో దానికి చాలా సానుకూలంగా స్పందిస్తారని సురేశ్ నమ్మించాడు. దాంతో కలెక్టర్ ఓకే చెప్పారు. ప్రజలతో మమేకమై, ప్రజల ద్వారా మాట్లాడి ముందుకు వెళ్లాలని అనుకున్నారు. సురేశ్ చెప్పినట్లే గ్రామానికి వెళ్లిపోయారు.
అయితే అక్కడ గ్రామస్తుల కోపంగా ఉంటారు, ఎమోషనల్ గా ఉంటారు. కొంచెం అనుమానంగా ఉందని పోలీసులు కలెక్టర్ తో చెప్పారు. అయితే, రైతులు, ప్రజలు మన వాళ్లే. వారితో మమేకం అవ్వకుంటే ఎలా? బలవంతంగా కాదు. ప్రజల మన్ననలతోనే, ప్రజల అభిప్రాయలతోనే, వారి ఇష్టంతోనే మనం ముందుకు తీసుకెళ్లాలి అనే దృక్పథంతో కలెక్టర్ బయలుదేరి వెళ్లారు. కలెక్టర్ స్పీడ్ గా ముందుకు వెళ్లే సరికి.. ఆయన వెంట ముగ్గురు డీస్పీలు కూడా వాహనాల్లో పరిగెత్తారు. వెనకాల మిగతా ఫోర్స్ వచ్చేలోగానే.. ఇది జరిగిపోయింది. కలెక్టర్ అక్కడికి వెళ్లగానే.. వాళ్లు దాడికి పాల్పడ్డారు. కలెక్టర్ వెళ్లి రెండు నిమిషాల వ్యవధిలోనే ఆయనపై అటాక్ చేశారు.
ముఖ్యంగా కడా ఛైర్మన్, అడిషనల్ కలెక్టర్ ను వారు టార్గెట్ చేశారు. ముందస్తు ప్రణాళికతో, వెల్ ప్లాన్డ్ తోనే దాడికి పాల్పడ్డారు. ఇందులో కుట్రకోణం కూడా ఉంది. పోలీసులు వద్దని చెప్పి.. సానుకూల దృక్పథంలో కలెక్టర్ వెళ్లారు. అయినప్పటికీ.. కర్రలు, రాళ్లతో దాడి చేయడం దారుణం. ఇందులో ముందస్తు ప్రణాళిక ఉంది. కుట్రకోణం ఉంది. ఈ ఘటనలో 20 మంది ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించుకున్నాం. సురేశ్ అనే వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ చాలా బ్యాడ్ గా ఉంది. ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం.
ప్రస్తుతం అతడు ఏ1గా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్నాడని తెలిసింది. యూత్ లీడర్ గా ఉన్నాడు. వికారాబాద్ కలెక్టర్ పై దాడి ఘటన, అంతకుముందు జరిగిన ఒక కిడ్నాప్ కేసులో సురేశ్ కాల్ డేటాతో పాటు.. దాడిలో యాక్టివ్ గా ఉన్న వారి కాల్ డేటాను అనలైజ్ చేస్తున్నాం. నాలుగు దర్యాఫ్తు బృందాలు పని చేస్తున్నాయి. ఈ ఘటనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతటి వారున్నా, ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదు. ఈ ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. సైబర్ క్రైమ్ టీమ్ కూడా కంటిన్యూ యాక్షన్ తీసుకుంటూనే ఉన్నారు” అని ఐజీ సత్యనారాయణ తెలిపారు.

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?