👉 కాలేజీ ఫీజు చెల్లించే స్థోమత లేదని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య😱😱😱
హైదరాబాద్ – నిజాంపేటలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న జస్వంత్ గౌడ్(17) అనే విద్యార్థి కాలేజీ ఫీజు చెల్లించే స్థోమత మనకు లేదని సూసైడ్ లెటర్ రాసి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని.. శ్రీ చైతన్య కాలేజీ ముందు బైఠాయించి పలు విద్యార్థి సంఘాల ధర్నా.. అడ్డుకున్న పోలీసులు.
👉తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్.*
*టీడీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ మాజీ సలహాదారు ఎస్.రాజీవ్ కృష్ణ.*
*రాజీవ్ కృష్ణతో పాటు టీడీపీలో చేరిన పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు..*పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్.*
👉 పల్నాడు జిల్లా నరసరావుపేట,వినుకొండలో పోసాని కృష్ణమురళిపై పిర్యాదు..సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు నాయుడు,డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు పైఅసభ్య పదజాలంతో పోస్టులు పెట్టారని పిర్యాదు..పోసాని కృష్ణ మురళిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు..పోసానిపై ఫిర్యాదు చేసిన పలువురు లాయర్లు,టీడీపీ నేతలు .
👉*వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ సి సి చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి*
*ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ ఇవ్వాళ వైసిపి నే – వైఎస్ షర్మిలా రెడ్డి*..*ప్రజలు మిమ్మల్ని ఓడించాలని కూటమి ఓట్లు వేశారు – వైఎస్ షర్మిలా రెడ్డి*
*మీకు 11 సీట్లు వచ్చినా..38 శాతం వచ్చినా అసెంబ్లీ వెళ్ళలేదు*..మాకు సీట్లు రాక మేము అసెంబ్లీ వెళ్ళలేదు*
*మీకు మాకు ఏంటి తేడా – వైఎస్ షర్మిలా రెడ్డి*
*జగన్ పుట్టక ముందు నుంచే ఉంది కాంగ్రెస్ పార్టీ –
*కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత జగన్ కి లేదు – వైఎస్ షర్మిలా రెడ్డి..-జగన్ సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ కి కాదు-రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి-మాకు ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది పక్కన పెట్టండి
-మీకు 38 శాతం ఓట్లు వచ్చాయి కదా -జగన్ పార్టీకి 11 సీట్లు వచ్చాయి కదా-మరి అసెంబ్లీ ఎందుకు వెళ్ళడం లేదు ?-ఎంఎల్ఏలు గా ఉండి ఎందుకు అసెంబ్లీ వెళ్ళడం లేదు ?
-ఎందుకు వెళ్ళడం లేదు అని అడిగితే మమ్మల్ని ఇన్ సిగ్నిఫి కెంట్ పార్టీ అంటారా ?
-రాజీనామా చేయాలి అంటే మాకు 1.7 శాతం అంటారా ?
-జగన్ గారికి సూటి ప్రశ్న ? -మీకు 38 శాతం ఓట్లు వచ్చాయి కదా…వచ్చి ఏం చేస్తున్నారు ? -11 సీట్లు గెలిచి ఏం చేస్తున్నారు ?
-మాకు ఓట్లు రాలేదు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళలేదు
-మీకు 11 సీట్లు వచ్చి కూడా అసెంబ్లీ కి వెళ్ళలేదు
-మీకు మాకు ఏంటి తేడా ?..జగన్ గారు సమాధానం చెప్పండి-కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ -జగన్ పుట్టక ముందు నుంచి ఉంది-వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఎంతో సేవ చేశారు
-వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉండి ప్రాణత్యాగం చేశారు
-అటువంటి పార్టీని చిన్న చేసి మాట్లాడుతారా ?
-మీరు మాట్లాడాలి అనుకుంటే మీ గురించి చెప్పండి.
-రాష్ట్ర ప్రజలకు మీరు చేసిన మోసాల గురించి మాట్లాడండి
-అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు
-జనాలను చంపి డోర్ డెలివరీ చేశారు
-పోలీసు వ్యవస్థను కుక్కల్లా వాడుకున్నారు
-కాదంబరి లాంటి మహిళలను వేధించారు
-మీ అరాచకాలు, మాఫీయాలు తట్టుకోలేక ప్రజలు మిమ్మల్ని ఓడించారు -ఒకప్పుడు వైఎస్ఆర్ కొడుకు కి అవకాశం ఇవ్వాలని 151 సీట్లు ఇచ్చారు-ఇప్పుడు అదే ప్రజలు మిమ్మల్ని ఓడించి 11 సీట్లకు పరిమితం చేశారు-ఈ 11 మందిని ఎందుకు గెలిపించాం అని అనుకుంటున్నారు-ప్రజలు ఈ సారి ప్రభుత్వాన్ని మార్చాలి అనుకున్నారు-అందుకే మాకు ఓట్లు పడలేదు.
-కాంగ్రెస్ కి ఆదరణ లేదు అనేది అబద్ధం
-దేశంలో కాంగ్రెస్ మళ్ళీ ఎదుగుతుంది
-రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా అధికారంలో ఉండి ఉంటే.. రాష్ట్ర సమస్యలు అన్ని తీరేవి.
-హోదా వచ్చేది…పోలవరం పూర్తి అయ్యేది
-ప్రజలు మిమ్మల్ని దింపాలని అనుకున్నారు
-అందుకే ఓట్లన్నీ చంద్రబాబు కి వేశారు
-బడ్జెట్ మీద మీరు పెట్టాల్సింది ప్రెస్ మీట్ కాదు.
-మెంబర్ ఆఫ్ అసెంబ్లీ గా మీరు సభలో మాట్లాడాలి.
-ఉన్న 11 సీట్లను కూడా మీరు మిగిల్చుకొనే లా లేరు
-ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ కాంగ్రెస్ కాదు… వైసిపి
-వైఎస్ఆర్ లేని వైసిపి పార్టీ ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ
-అసెంబ్లీకి పోయే దైర్యం లేకుంటే రాజీనామాలు చేయండి
-రెఫరెండంగా మళ్ళీ ఎన్నికలకు వెళ్ళండి..గెలిపించినా అసెంబ్లీకి వెళ్ళమని చెప్పండి-రాజీనామాలు చేయండి
-అప్పుడు ఇన్ సిగ్నిఫికెంట్ ఎవరో…ఇంపార్టెంట్ ఎవరో తెలుస్తుంది..మీది ఒక మూర్ఖత్వం వాదన..పోలీసు వాళ్ళను విజ్ఞప్తి చేస్తున్నాం..సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా అసభ్యకరంగా ప్రవర్తించే వాళ్ళను అరెస్టు లు చేయాలి
-ఏ పార్టీలో ఉన్నా వదలొద్దు..ఇది పొలిటికల్ ఇష్యూ కాదు..ఇది సోషల్ ఇష్యూ
– సోషల్ ఇష్యూ గా పరిగణనలోకి తీసుకోవాలి.
– రాజకీయాలకు అతీతంగా పరిగణనలోకి తీసుకోవాలి.
– క్షమాపణలు అడిగినా క్షమించేది లేదు
– బూతులు పెట్టిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి
– అరెస్టు లు చేస్తున్నందుకు పోలిసుల వాళ్లకు ధన్యవాదాలు చెప్తున్న.. నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నీ
– నేను నేరుగా కేసు పెడితే రాజకీయం చేసినట్లు అవుతుంది అనుకుంటున్న..రాజకీయ రంగు పూసినట్లు అవుతుంది అనుకుంటున్న..రాజకీయాలకు అతీతంగా చర్యలు ఉండాలి.
👉ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్ ప్రతినిధులు భేటీ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్ ప్రతినిధులు గురువారం ఉదయం భేటీ అయ్యారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రివర్యుల క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారు ‘తమిళనాడులో చెన్నై, కోయంబటూరు, కాంచి, మధురై, చెంగల్పట్, మధురై, తిరువళ్ళూరు, తిరుత్తణి ప్రాంతాల్లో తెలుగువారు అధికంగా ఉన్నారు. వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. చెన్నైలో తెలుగు భవనం నిర్మాణం చేపట్టాల్సి ఉంది. జయలలిత గారు ఈ భవనం నిర్మాణానికి అంగీకారం తెలిపారని కాలక్రమంలో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భవనం నిర్మాణంపై చర్చించాల’ని విజ్ఞప్తి చేశారు. తమ ఫౌండేషన్ తరఫున చేస్తున్న సామాజిక సేవలను, తెలుగు భాష, సంస్కృతుల కోసం చేస్తున్న కృషిని వివరించారు. ఫౌండేషన్ చేస్తున్న సేవలను ఉప ముఖ్యమంత్రివర్యులు అభినందించారు. ఈ భేటీలో ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీ దేవరకొండ రాజు, ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు,ఎ.ఎం.మనోజ్, ప్రియా శ్రీధర్, బి.రఘు నాథ్ తదితరులు పాల్గొన్నారు.
👉 ఏపీ శాసనమండలి రేపటికి వాయిదా..
మండలిలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి చర్చ. అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని అవమానించారని తీవ్ర స్థాయిలో లోకేశ్ ఆగ్రహం. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించిన లోకేష్. గతంలో సంఖ్యాబలం తక్కువ ఉన్నా.. చంద్రబాబు సభకు వచ్చారు. నా తల్లిని అవమానించిన తర్వాతనే.. చంద్రబాబు సభకు రాలేదు అని మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
👉మంత్రి నారా లోకేష్ కు శ్రీ రెడ్డి బహిరంగ లేఖ?
లోకేష్ అన్న నన్ను క్షమించండి అని కోరుతూ నటి శ్రీరెడ్డి మంత్రి లోకేష్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు. అలాగే మాజీ సీఎం వైఎస్ జగన్‌కు, ఆయన సతీమణి భారతిని ఉద్దేశించి కూడా శ్రీరెడ్డి మరో బహిరంగ లేఖ రాశారు. వేర్వేరుగా రాసిన ఈ బహిరంగ లేఖలను ఆమె తన ఎక్స్ ఖాతా ద్వారా నెటిజెన్స్‌తో షేర్ చేసుకున్నారు.
మంత్రి లోకేష్‌కు రాసిన బహిరంగ లేఖ విషయాని కొస్తే… చంద్రబాబు నాయుడును, ఆయన కుటుంబసభ్యులను దూషించింనందుకు క్షమాపణలు చెబుతున్నట్లు ఆమె ఆ లేఖలో పేర్కొ న్నారు. అంతేకాకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంస్థలు, అనుబంధ మీడియా సంస్థలకు తాను హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.
తన జుగుస్పాకరమైన బాషతో విమర్శలు చేసి మీ మనసులు ఎంతగా నొప్పించానో ఇప్పుడే అర్థమవుతోందన్నారు. ఏదైనా తన దాకా వస్తే కానీ తెలియదనే విషయం తనకు కూడా ఇప్పుడే అర్థమైందని అన్నారు.
గత వారం రోజులుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో తన గురించి చేస్తోన్న కామెంట్స్, పోస్టులు తనను ఎంతగానో మనోవేధనకు గురిచే శాయన్నారు. టీడీపీ నేతలు, అభిమాను లు సోషల్ మీడియాలో తన గురించి చేస్తోన్న పోస్టులు, కామెంట్స్ చూసి తాను నిద్రాహారాలు కూడా మానేశానని తెలిపారు.
ఇదంతా జరిగాకే తాను ఎంత తప్పు చేశానో, మిమ్మల్ని ఎంత బాధపె ట్టానో తెలిసొచ్చిందని శ్రీరెడ్డి తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
👉వైసీపీని వదలని సునీత? అవినాష్ మెడకి బిగుస్తున్న ఉచ్చు?😱😱😱
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినవారిని ఏపీ సర్కార్ వెంటాడుతున్న సంగతి తెలిసిందే.
ఈ సమయంలో వైఎస్ జగన్ మరో సోదరి, మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత ఎంట్రీ ఇచ్చారు. ఆమె మరోసారి అవినాష్ రెడ్డి లక్ష్యంగా ముందుకు కదులుతున్నారని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినవారిలో వర్రా రవీందర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఈయనపై రాష్ట్రవ్యాప్తంగా సుమారు 34 కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో ఈయన సాగించిన అరాచకం అని అంటున్నారు. తాజాగా సునీత ఎంట్రీ ఇచ్చారు. వర్రా రవీందర్ రెడ్డిపై ఆమె పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు! తనను అత్యంత దారుణ పదాలతో దూషించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే సమయంలో వైసీపీకి చెందిన మరో సానుభూతిపరుడు ఉదయ్ పైనా ఆమె ఫిర్యాదు చేసారు.
వర్రా రవీందర్ రెడ్డికి పోస్టులు పెట్టమని ఆర్డర్ వేసింది అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి అని చెబుతున్న వేళ… రాఘవరెడ్డి అరెస్టు తర్వాత విచారణలో భాగంగా కీలక విషయాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమయంలో… ఈ వ్యవహారం ఎంపీ అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకోవడం కంఫర్మ్ అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం పరారీలో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పట్టుకొని విచారిస్తే ఆయన ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో మరింత కీలకంగా మారనుందని అంటున్నారు. అయితే ఇప్పటికే… వర్రా రవీందర్ రెడ్డి చెప్పిన అంశాలతో నేరుగా ఎంపీ అవినాష్ పై ఫిర్యాదు చేసేందుకు సునీత సిద్ధమయ్యారని చెబుతున్నారు.
సోషల్ మీడియా పోస్టులపై వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. షర్మిల, విజయమ్మ, సునీత లపై పెట్టిన పోస్టుల వెనుక అవినాష్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డి తనకు కంటెంట్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. రాఘవరెడ్డికి అవినాష్ రెడ్డి బ్రీఫింగ్ ఇస్తుంటే ఆయన డైరీలో నోట్ చేసుకునేవారని తెలిపారు! సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్టుల వెనుక అవినాష్ రెడ్డి సూచనలు కీలక పాత్ర పోషించాయని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారని అంటున్నారు.
**కడప జిల్లా…..*మైదుకూరు చాపాడు మండపంలో..
👉 *మారువేషంలో వెళ్లి అవినీతి అధికారి ఆట కటించిన.. కరుణాకర్ యాదవ్*
👉 *కొంత మంది అవినీతి అధికారుల వల్ల గౌరవ ప్రదమైన పోలీస్ శాఖ కు అపకీర్తి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసిన.. కరుణాకర్ యాదవ్*
👉 *బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేసిన అధికారి*
👉 *ఫిర్యాదు దారులు న్యాయం చేయాలని స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే 10,000 వేలు లంచం ఇవ్వాలని కోరిన అధికారి.👉 *5 వేలు యూపిఐ ద్వారా పంపిన బాధితుడు👉ఎస్.ఐ మరియు రైటర్ బాలయ్య పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు*
👉లంచం ఇవ్వకుంటే ఫిర్యాదుదారులకు న్యాయం జరగని వైనం..👉 *అవినీతి కి అడ్డాగా మారిన కడపజిల్లా చాపాడు పోలీస్ స్టేషన్..👉 లంచం ఇవ్వకుంటే సివిల్,లంచం ఇస్తే క్రిమినల్ మరో కొత్త విధానం?*
👉 *పోలీస్ స్టేషన్ లో పైసా ఇవ్వనిదే బాధితులకు న్యాయం జరగని వైనం.*
👉 *ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి లేకుండా సి.ఎం చంద్రబాబు గట్టి చర్యలు తీసుకోవాలని కోరిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ &జై భీమ్ రావ్ భారత్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కరుణాకర్ యాదవ్.*
👉 *అవినీతి అధికారులు మాట విని,సిబ్బంది జీవితాలను బలి చేసుకోవద్దని ఇటీవల ప్రెస్ నోట్ ద్వారా కోరిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ &జై భీమ్ రావ్ భారత్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కరుణాకర్ యాదవ్.*
👉 *మార్పు రాని సిబ్బందికి ఇటువంటి పరిణామాలే ఉంటాయని తెలిపిన కరుణాకర్ యాదవ్*
👉 *ఫిర్యాదు దారుల పట్ల కొంతమంది పోలీసు దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదని కోరిన కరుణాకర్ యాదవ్.*
కడపజిల్లా….
వివరాల్లోకి వెళితే…ఫిర్యాదుదారుడు తనకు న్యాయం కోసం వారం రోజులుగా తన ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలని చాపాడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు.ఫిర్యాదుకు అధికారులు స్పందించలేదు.మనోవేదనకు గురి అయిన బాధితుడు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ &జై భీమ్ రావ్ భారత్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కరుణాకర్ యాదవ్ ను ఆశ్రయించారు.బాధితుడి వెంట మారువేషంలో కరుణాకర్ యాదవ్ వెళ్లారు.ఫిర్యాదు ఇచ్చిన పిటిషన్ ను ఇలా కాదంటూ అలా రాయండి,ఇలా రాయండి అటూ కుంటి సాకులు పెట్టారు.కాసేపటికి ఎస్.ఐ 10వేలు రైటర్ చేతికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది.ఆ విషయానికి సరే అని యూపిఐ ద్వారా బాధితుడి మొబైల్ ద్వారా రైటర్ బాలయ్య కి 10వేలు వేయగా అమౌంట్ తక్కువగా ఉండటంతో ఫెయిల్ రావడం జరిగింది. తర్వాత వెంటనే 5వేలు యూపిఐ వేయడం జరిగింది.కొంత మంది అవినీతి అధికారుల వల్ల గౌరవ ప్రదమైన పోలీస్ శాఖ కు అపకీర్తి వస్తుందని కరుణాకర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.లంచం ఇవ్వకుంటే సివిల్,లంచం ఇస్తే క్రిమినల్ అంటూ మరో కొత్త విధానం ను కొంతమంది ఎంచుకోవడం సర్వసాధారణం గా మారింది.చాపాడు పోలీస్ స్టేషన్ లో పైసా ఇవ్వనిదే బాధితులకు న్యాయం జరగడం లేదని అక్కడ విచారణ లో తేలిందని కరుణాకర్ యాదవ్ తెలిపారు.ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి లేకుండా సి.ఎం చంద్రబాబు గారు గట్టి చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ &జై భీమ్ రావ్ భారత్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కరుణాకర్ యాదవ్ తెలిపారు.ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
**వాసవి విద్యానికేతన్ లో ఘనంగా బాలల దినోత్సవం .
బాలల దినోత్సవం సందర్భంగా స్థానిక వాసవి విద్యానికేతన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన నాటికలు ఆటలు పాటలతో అందరినీ అలరించారు. పాఠశాల కరస్పాండెంట్ గోళ్ళ సుబ్బారత్నం ఈ సందర్భంగా కీర్తిశేషులు మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఘనతను గురించి అందరికీ వివరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలలో విజేతలైన వారికి బహుమతులను పంపిణీ చేశారు.ప్రిన్సిపాల్ ఎల్ ఎన్ కిరణ్ వర్మ, డైరెక్టర్ గోళ్ళ కల్పన దేవి ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.
👉*గురుకుల పాఠశాలలో ఆకట్టుకున్న బంగారు బాల్యం వారోత్సవాలు
కంభం: స్థానిక బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో గురువారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బంగారు బాల్యం వారోత్సవ్ కార్యక్రమాన్ని ఎంపీపీ చేగిరెడ్డి.తులసమ్మ, తహసీల్దార్ కిరణ్,ఎంపీడీవో వీరభద్రాచారి, ఎంఈవో-2 శర్వాణి లు ప్రారంభించారు. ముందుగా చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బంగారు బాల్యంపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా ఎంపీపీ తులసమ్మ మాట్లాడుతూ చేయి చేయి కలిపి నడిచే ఐకమత్యాన్ని బాల్యం నుండే అలవర్చుకోవాలని, సమస్యలను అధిగమించి హక్కులను సాధించే ధైర్యాన్ని సొంతం చేసుకోవాలంటూ బాల్యం విలువలను,బంధాలను,బాధ్యతలను విద్యార్థులకు వివరించారు.ఎంఆర్ఓ కిరణ్ మాట్లాడుతూ బాల్యం మరలిరాని, మరపురాని ఓ మధుర జ్ఞాపకమనీ, చదువే సామాజిక స్థితికి ప్రతీక అని, చదువును మధ్యలో ఆపకుండా కొనసాగించాలని అన్నారు. ప్రభుత్వం ఉచితంగా కల్పించిన విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ బాల్యాన్ని ఆస్వాదించాలని అన్నారు. ఎంపీడీవో వీరభద్రాచారి మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ,బాల్య వివాహాల నిర్మూలన ప్రధాన అంశంగా బంగారు బాల్యం వారోత్సవాలను ప్రారంభించామనీ. సమాజంలో బంగారు బాల్యం ఆవిష్కృతం కావాలంటే అది విద్య ద్వారానే సాధ్యమని అన్నారు. మిన్ను విరిగినా,భూమి కృంగినా,సముద్రాలు ఉప్పొంగినా సంకల్పాన్ని వీడని మహనీయుల సాహసాలే స్ఫూర్తిగా ముందడుగు వేయాలంటూ బాలికలలో ధైర్యాన్ని నింపారు. ఎంఈఓ-2 శర్వాణి మాట్లాడుతూ చదువుతో బాటు సంస్కారం అలవర్చుకోవాలని, బాలికలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంశంలో అవగాహన కలిగివుండాలని, రుతు శుభ్రత (మెన్స్ట్రువల్ హైజిన్)అంశాలను తెలుసుకోవాలని అన్నారు. వేధింపులు, అత్యాచారాలను ఎదుర్కునే సాహసాన్ని కలిగిఉండాలని, బాల్యం నుండే అన్ని రంగాలలో సమగ్ర అవగాహన అవసరమని అన్నారు.అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన జాతీయ నాయకుల వేషధారణలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చేగిరెడ్డి.తులసమ్మ, ఎంఆర్ఓ కిరణ్, ఎంపీడీవో వీరభద్రాచారి, ఎంఈఓ-2 శర్వాణి, ప్రిన్సిపాల్ చాముండేశ్వరి, డిఆర్డీవో ఏరియా కోఆర్డినేటర్ కె.లక్ష్మీరెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేక్ అక్తర్ రసూల్, సిఆర్పీలు మురళి మోహన్,ఏపిఎం, ఏ ఎం ఎం లు పాల్గొన్నారు.
👉ఓ కుటుంబాన్ని బెదిరించి రూ. 70 వేలు తీసుకుంటుండగా యూట్యూబర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న.. హైదరాబాద్ పోలీసులు
యూట్యూబ్‌లో న్యూస్ చానల్ నిర్వహిస్తున్న తన్వీర్ అహ్మద్
ఓ కుటుంబం వీడియోలను పోస్టు చేసి రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్. లాడ్జీలో డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్న రెయిన్ బజార్ పోలీసులు
ఓ కుటుంబానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి డబ్బుల కోసం బెదిరిస్తున్న యూట్యూబర్‌ను హైదరాబాద్ రెయిన్ బజార్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడు తన్వీర్ అహ్మద్ (54) యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో ఓ న్యూస్ చానల్ నిర్వహిస్తున్నాడు. ఓ కుటుంబానికి సంబంధించి వీడియోను పోస్టు చేసిన తన్వీర్ ఆపై దానిని తన చానళ్ల నుంచి తొలగించాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని ఆ కుటుంబాన్ని డిమాండ్ చేశాడు.
దీంతో బాధిత కుటుంబంలోని లతీఫ్ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో తన్వీర్ బాధిత కుటుంబ సభ్యుడితో ఓ ఒప్పందానికి వచ్చాడు. రూ. 70 వేలు ఇస్తే వీడియోలను డిలీట్ చేస్తానని చెప్పాడు. దీంతో అతడు చెప్పిన లాడ్జీకి డబ్బుతో వెళ్లాడు. అక్కడ అప్పటికే కాపు కాసిన పోలీసులు బాధిత యువకుడి నుంచి తన్వీర్ రూ. 70 వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, తన్వీర్‌పై ఇప్పటికే నాలుగు కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
👉గుంటూరులో 5గురు గంజాయి విక్రయదారులు అరెస్ట్*
*2.750 కేజీల గంజాయి,37 డబ్బాలలో 555 గ్రాముల ద్రవపు గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం..
గంజాయి మద్యం వ్యసనాలకు అలవాటు పడి అనతి కాలములోనే అత్యధిక డబ్బును సంపాదించాలని దురుద్దేశంతో కష్టపడకుండా గంజాయి అమ్మి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గుంటూరు నగరంలోని కొందరు వ్యక్తులు కలిసి విశాఖపట్నంలో దగ్గరలోని లంబసింగి వెళ్లి అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుండి గంజాయి ద్రవపు గంజాయి కొని తెచ్చి వారు సేవిస్తూ, తెలిసిన వ్యక్తులకు విక్రయిస్తూ వాటి ద్వారా వచ్చే డబ్బులతో జలసాలు చేయుచు కొందరు వ్యక్తులను పెడదోవ పట్టిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు
ఏపీలోని గుంటూరు నగరంలో గల నల్లపాడు పోలీస్స్టేషన్ పరిధిలో ఐదుగురు గంజాయి విక్రయదారులను అరెస్టు చేసినట్లు గుంటూరు దక్షణ మండల పోలీసు అధికారి బుధవారం నల్లపాడు పోలీసు స్టేషనులో తెలిపారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి మల్లికార్జునరావు నిందితుల వివరాలను వెల్లడించారు. గుంటూరు నగరంలోని స్వర్ణ భారతీయ నగర్ 21వ లైన్ కు చెందిన షేక్ అబ్దుల్ రెహమాన్, 13వ లైను ఏ బ్లాక్ కు చెందిన చిలుమల కరిష్మా, 12వ లైన్ కు చెందిన ములకతాళ్ళ సాయి, పెద్దకాకానికి చెందిన ప్రస్తుతం గుంటూరు నగరంలోని శ్రీనగర్ ఒకటవ లైన్ లో నివాసముండేపోలూరి దేవరాజు ఆనంద్,
ప్రకాశం జిల్లా పర్చూరు మండలం, ప్రస్తుతము గుంటూరు నగరంలోని ఎస్ వి ఎన్ కాలనీ నాలుగో లైన్ కు చెందిన చెన్నుపాటి లోకేష్లను బుధవారం కరిష్మా ఇంటి వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుండి 2.750 కేజీల గంజాయి,37 డబ్బాలలో 555 గ్రాముల ద్రవపు గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలను, లక్ష 50 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీరితోపాటు షేక్ ముజీబ్ షేక్ అహ్మద్ షేక్ రోషన్ షేక్ సైదా అలియాస్ కాళ్లు నల్ల మేకల సత్యసాయి గంతాల విజయ్ కుమార్ షేక్ అబ్బాస్ మంజు మనోహర్ చిల్లంగుల సుభాష్ లతోపాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు డి.ఎస్.పి తెలిపారు. సీఐ. కె. వంశీదర్, ఎస్ఐ. పి.జనార్ధన్, హెడ్ కానిస్టేబుల్ షేక్ మస్తాన్ వలీ,కానిస్టేబుళ్లు టి.సాంబశివరావు, కె. భిక్షు నాయక్, మహిళా కానిస్టేబుల్ ఎై. శ్రావణ సంధ్యలు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వీరందరికీ ప్రోత్సాహకాలు ప్రకటించి అభినందించారు.
**రబీ పంటలకు సూచనలు*
ప్రకాశం జిల్లా కంభం మండలం తురిమెళ్ళ , కంభం రైతు సేవ కేంద్రం నందు జిల్లా వనరుల కేంద్రం నుండి వ్యవసాయ అధికారి అయిన శైలజ తురిమిళ్ళ ఆర్ఎస్కే నందు మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏవో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల కాలంలో ఉన్నటువంటి పంటల యొక్క స్థితిగతుల గురించి తెలియజేస్తూ పంటల్లో వచ్చే తెగుళ్లను నివారించడానికి తగు సూచనలు తెలియజేశారు ఇంకా కంభం మండల వ్యవసాయ అధికారి స్వరూప మాట్లాడుతూ రైతు సోదరులు ఎక్కువగా పొగాకు పంటను సాగు చేస్తున్నారని ఈ పొగాకు పంట సాగు చేయటం వల్ల రైతుకు ఎక్కువ స్థాయిలో పెట్టుబడులు అవుతున్నాయని రైతులు చాలా నష్టపోతున్నారని పొగాకు పంటకు ప్రత్యామ్నాయంగా అపరాల పంటను సాగు చేసుకోవాలని తెలియజేశారు ఇంకా ఉద్యాన శాఖ అధికారి అయిన శ్వేత మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో మిరప పంటలో వచ్చేటటువంటి తెగుళ్ల గురించి చీడపీడల గురించి రైతు సోదరులకు వివరించారు ఇంకా ఉద్యాన శాఖలో ఉన్నటువంటి పలు స్కీముల గురించి క్లుప్తంగా వివరించారు
జగనన్న పై ధ్వజమెత్తిన షర్మిలక్క…వైసీపీని వదలని సునీత? అవినాష్ మెడకి బిగుస్తున్న ఉచ్చు..శ్రీ రెడ్డి బహిరంగ లేఖ..గుంటూరులో 5గురు గంజాయి విక్రయదారులు అరెస్ట్…మారువేషంలో వెళ్లి అవినీతి అధికారి ఆట కటించిన.. కరుణాకర్ యాదవ్..తూ గో జిల్లాలో వైసీపీకి భారీ షాక్.. పోసాని కృష్ణమురళిపై పిర్యాదు..కాలేజీ ఫీజు చెల్లించే స్థోమత లేదని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. కంభంలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు.
Recent Posts