👉మెగా డీఎస్సీపై మంత్రి లోకేష్ క్లారిటీ..
అమరావతి : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా డీఎస్సీపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు..తెలుగుదేశం ఆవిర్భావం తరువాత 11 డీఎస్సీలు వేశారని.. లక్షా 50 వేల మంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారని తెలిపారు. ఇందులో 9 డీఎస్సీలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినవే అని చెప్పుకొచ్చారు..
👉 ఏపీ ఉపాధ్యాయులపై కేసులు ఎత్తివేత..
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది..గత ప్రభుత్వంలో హక్కుల కోసం టీచర్లు రోడ్డెక్కారని.. గత ప్రభుత్వం టీచర్లపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉన్నామని.. ఆంధ్రప్రదేశ్ మోడల్ ఎడ్యుకేషన్‌లో ఉపాధ్యాయుల్ని భాగస్వామ్యం చేస్తామని చెప్పారు.
ఉపాధ్యాయుల విధులపై జీవో 117కు ప్రత్యామ్నయాలు పరిశీలిస్తున్నామని.. ఉపాధ్యాయులను బోధనా విధులకు మాత్రమే పరిమితం చేస్తామని తెలిపారు.
ఉపాధ్యాయులతో చర్చలకు సిద్ధమన్నారు. ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకోడానికి కేటాయించామన్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో 6 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారన్నారు మంత్రి.
**వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి కీలక ప్రకటన చేశారు. డీఎస్సీ విషయంలో న్యాయపరంగా చిక్కులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. డీఎస్సీపై లీగల్ ఒపినియన్ తీసుకుంటున్నామని.. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోపు డిఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నామన్నారు. డీఎస్సీకి సంబంధించి కొన్ని విషయాల్లో స్పష్టత రావాల్సి ఉందని.. న్యాయపరంగా ఎలాంటి వివాదాలు తావు లేకుండా నోటిఫికేషన్ ఇస్తామన్నారు.** 1994 నుంచి డీఎస్సీపై, గతంలో డీఎస్సీలపై పడిన కేసును తెప్పించుకుని పరిశీలిస్తున్నామని.. పకడ్బందీగా నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.
గత ఐదేళ్లలో ఉద్యోగ నియమకాలు సున్నా.. డీఎస్సీ ద్వారా ఒక్క పోస్టు భర్తీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే మొత్తంగా 15సార్లు డీఎస్సీ నిర్వహించామన్నారు. ప్రస్తుతం కూటమి సర్కార్ మెగా డీఎస్సీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందని.. ఉపాధ్యాయ నియామకాల్లో వయో పరిమితి పెంపు డిమాండ్‌ను పరిగణలోకి తీసుకున్నట్లు చెప్పారు. అన్ని శాఖల మధ్య ఫైల్ సర్క్యూలేషన్‌లో ఉందని.. ఎంత వయోపరిమితి పెంచుతామనేది త్వరలోనే స్పష్టత ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీకి కట్టుబడి డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేశారన్నారు. మెగా డీఎస్సీ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు మంత్రి లోకేష్.
*మరోవైపు రాష్ట్రంలో 20 నుంచి 30 కిలోమీటర్ల మధ్య డిగ్రీ కళాశాల ఉండాలనే నిబంధన ఉందన్నారు మంత్రి. గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్ధులకు టెక్ట్స్ బుక్స్ కూడా ఇవ్వలేదని.. ఇంటర్మీడియట్ ఎడ్యూకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్‌కు చాలా తేడా ఉంటుందన్నారు. ఈ ఏడాది 10 శాతం అడ్మిషన్లు పెరిగాయని.. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు నారాయణ కాలేజీలతో పోటీ పడేలా నడుపుతామన్నారు. అంతేకాదు రాష్ట్రంలో స్కూల్‌లకు ర్యాంకింగ్ మెకానిజం పెడదామనే ఆలోచన ఉందని..డిసెంబర్ మొదటి వారంలో పిటీఎం నిర్వహిస్తున్నామని.. సభ్యులు కూడా పాల్గొనాలని కోరారు లోకేష్.
👉 తప్పుడు ప్రచారం వద్దు.. మండలిలో హోమ్ మినిస్టర్ ఉగ్రరూపం..
చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేయవద్దని వైసీపీ ఎమ్మెల్సీలకు హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. గురువారం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ వరుధు కళ్యాణి మాట్లాడుతూ.. ఉచిత గ్యాస్ సిలిండర్లు రెండు ఎగ్గొట్టారంటూ చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే ప్రయత్నం చేశారు.
ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం అమలు చేస్తు్న పథకాలపై తప్పుడు ప్రచారం చేయవద్దంటూ వైసీపీ నేతలకు మంత్రి అనిత్ సూచించారు. అలాగే తమ ప్రభుత్వం ఈ పథకాల కోసం బడ్జెట్‌లో ఎంత కేటాయించారనే విషయాన్ని సైతం ఆమె సోదాహరణగా వివరించారు.
👉 ఏడు కోట్లు విలువైన ఏనుగు దంతాలతో బొమ్మల స్మగ్లింగ్..
చెన్నై నగరంలో స్మగ్లింగ్ సంబంధించిన ఓ విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనలో సుమారు 7 కోట్లు పైగా విలువ చేసే ఏనుగు దంతాలతో తయారు చేసిన 4 ఏనుగు బొమ్మలను స్వాదినం చేసుకున్నారు చెన్నై అటవీశాఖ అధికారులు..
నగరంలోని విల్లుపురం కొత్త బస్ స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ బొమ్మలకు సంబంధించి బేరమాడి విక్రయిస్తుండగా అటవీశాఖ అధికారులు, విల్లుపురం పోలిసు అధికారులు అరెస్టు చేసారు. ఈ ఘటనలో చెన్నై, తిరుచ్చి, తంజావూరు, దిండిగల్, ధర్మపురి జిల్లాలకు చెందిన 12 మంది స్మగ్లర్లు అరెస్టు అయినట్లు అధికారులు తెలిపారు.ఈ ఘటనలో భాగంగా గత కోంత కాలంగా పెద్ద సంఖ్యలో ఎనుగులు బొమ్మలను పెద్ద ఎత్తున సంపన్న కుటుంబాలకు తిరుచ్చికి చెందిన ముఠా విక్రయిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. ఏనుగులను చంపి వాటి దంతాలతో బొమ్మలను చేసి విక్రయిస్తోంది సదరు ముఠా. దీని వెనుక అతి పెద్ద స్మగ్లర్లు ఉన్నట్లు గుర్తించారు పోలిసులు. అతి త్వరలో ఇందుకు సంబంధించిన అక్రమార్కులను కనిపెడ్తామని అధికారులు అన్నారు.
👉 వైకాపా పాలనలో ఆర్థిక వ్యవహారాలపై కాగ్ నివేదిక
అమరావతి: వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక వ్యవహారాలను కాగ్ నివేదిక బయటపెట్టింది. 2023-24లో రూపాయిలో 52 పైసలు పన్ను వసూళ్ల ద్వారా వచ్చాయని పేర్కొంది..
రూపాయిలో 30 పైసలు రుణాల ద్వారా తెచ్చారని కాగ్ వెల్లడించింది. స్థానిక సంస్థలకు రూపాయిలో 9 పైసలే చెల్లించారని తెలిపింది. మూలధన వ్యయంగా 9 పైసలే ఖర్చు చేశారని నివేదికలో పేర్కొంది..
”చెల్లించిన అప్పు రూపాయిలో 7 పైసలే ఉంది. 2023-24లో రాష్ట్ర సొంతపన్ను ఆదాయం రూ.922 కోట్లు. శాసనసభ అనుమతి లేకుండా విద్యాశాఖలో రూ.249 కోట్లు ఖర్చు చేశారు. 2023 ఏప్రిల్‌లో ఆర్‌బీఐ వద్ద రాష్ట్ర నిల్వ రూ.19కోట్లు లోటు ఉంది” అని కాగ్ నివేదికలో వెల్లడించింది..
👉 బీజేపీకి షాక్.. ఢిల్లీ మేయర్ పీఠం ఆప్‌దే.. తాజాగా మేయర్ పీఠాన్ని సైతం అందుకోలేకపోయింది. మేయర్ పదవి కూడా ఆప్ ఖాతాలోనే చేరింది. ఢిల్లీలో మరోసారి బీజేపీకి షాక్ తగిలింది. కేంద్రంలో హ్యాట్రిక్ విజయం సాధించిన బీజేపీకి.. ఢిల్లీ మాత్రం చేజిక్కడం లేదు. ఇప్పటికే అసెంబ్లీని కోల్పోయిన బీజేపీ.. తాజాగా మేయర్ పీఠాన్ని సైతం అందుకోలేకపోయింది. మేయర్ పదవి కూడా ఆప్ ఖాతాలోనే చేరింది. దీంతో ఈ ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ చూపుతుందా అన్న ప్రశ్నలు అప్పుడే బీజేపీ నేతల్లో మొదలయ్యాయి. ఈసారి ఎలా అయినా ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి.. ఈ ఓటమి మరింత జీర్ణించుకోకుండా చేసింది. ఢిల్లీ నగర మేయర్ ఎన్నిక నిన్న హోరాహోరీగా సాగింది. మరోసారి బీజేపీ, ఆప్‌లు తలపడ్డాయి. ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ జరిగింది. ఉత్కంఠకు దారితీసిన ఈ ఎన్నికల్లో చివరకు ఆప్ అభ్యర్థి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. 256 ఓట్లలో 133 ఓట్లు ఆప్ అభ్యర్థి మహేశ్ ఖిచికి లభించగా.. ప్రత్యర్థి,బీజేపీ అభ్యర్థి కిషన్‌లాల్‌కు 130 ఓట్లు వచ్చాయి. మరో రెండు ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు. ఇక మేయర్ ఎన్నికల్లో ఓటమితో బీజేపీ డిప్యూటీ మేయర్ ఎన్నిక నుంచి తప్పుకుంది. ఫలితంగా డిప్యూటీ మేయర్ పదవి కూడా ఆప్ ఖాతాలోనే పడింది. చివరకు రవీందర్ భరద్వాజ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ ఎన్నికల్లో ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్, ఎన్‌డీ గుపా, బీజేపీకి చెందిన ఏడుగురు ఎంపీలు ఓటు వేశారు. మరోవైపు మేయర్, డిప్యూటీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కౌన్సిలర్ సబిలా బేగమ్ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఆప్ సాధించిన విజయం ఆ పార్టీకి మరింత బూస్టింగ్ ఇచ్చిందని చెప్పాలి. ఈ విజయం అధికార పార్టీకి భారీ ఊరటనిచ్చే విజయం అనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ఈ విజయాలు గొప్ప సంతోషాన్ని ఇచ్చాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే..ఆప్ తరఫున దళితుడైన మహేశ్ మేయర్ పీఠాన్ని అధిష్టించడంతో.. ఆప్ కౌన్సిలర్లు జై భీమ్ అంటూ నినదించారు. ఈ ఎన్నికల్లో 8 మంది కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. 8 మంది కౌన్సిలర్లు కూడా క్రాస్ ఓటింగ్ చేసినట్లు ఆప్ ఆరోపించింది. వారి ఓట్లతోనే బీజేపీ పెరిగిందని పేర్కొన్నారు. ఈ మేయర్ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే జరగాల్సి ఉన్నప్పటికీ.. ఆప్, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం, ఎన్నికలను కాంగ్రెస్ బాయికాట్ చేయడం వంటి కారణాలతో వాయిదా పడింది. ఎట్టకేలకు ఎన్నిక ప్రక్రియ ముగియడంతో ఆప్ సంబరాల్లో మునిగింది.
👉చీమకుర్తి రోడ్డు దుస్థితికి గ్రానైట్ అక్రమ రవాణా కారణం కాదా…?
– ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు మదిరె రంగ సాయి రెడ్డి..చీమకుర్తి ..ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్రానైట్ మాఫియా రెచ్చిపోతో చీమకుర్తి రోడ్డు దౌర్బాగ్య స్థితికి ఓ ప్రధాన కారణం అయ్యారు.దీని వల్ల ప్రకాశం జిల్లా పరిధిలోని అత్యధిక ప్రజలు జిల్లా కేంద్రానికి చేరే సమయంలో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కు బిక్కునా ఈ చీమకుర్తి రోడ్డులో ప్రయాణం చేస్తున్నారు.కొందరు గ్రానైట్ వ్యాపారులు అత్యాశతో అడ్డదారిలో స్లాబ్‌లను తరలించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతోంది.గ్రానైట్ ఫ్యాక్టరీలు విస్తరించి ఉన్న ప్రాంతాల్లోని యువకులు, అధికార పార్టీకి చెందిన కిందస్థాయి నేతలు ముఠాలుగా ఏర్పడి ఈ వ్యవహారాన్ని సాగిస్తున్నట్లు తెలుస్తుంది.
అధికారుల కదలికలను ఎప్పకప్పుడు పసిగడుతూ వారు తనిఖీలు చేపట్టని మార్గాల్లో రాయిని తరలిస్తున్నారు.
రాయల్టీ, ఎలాంటి పన్నులు చెల్లించకుండా రాయిని అక్రమంగా రవాణా చేస్తున్న కంటైనర్‌లకు పైలట్‌లుగా ఉండి ఎల్లలు దాటిస్తున్నారు.మైనింగ్ అధికారులకు అక్రమ గ్రానైట్ వాహనాలు పట్టుబడినప్పుడు కేసులు పెడుతున్నారు, ఫైన్ లు వేస్తున్నారు అయినప్పటికీ అక్రమ రవాణా అరికట్టలేక పోతున్నారు.గ్రానైట్ క్వారిల లైసెన్స్ లు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
👉 గిద్దలూరు డీఎఫ్ఓ గా బాధ్యతలు చేపట్టిన ఐ ఎఫ్ ఎస్ నిషా కుమారి ని మర్యాదపూర్వకంగా కలసిన సబ్ డి ఎఫ్ ఓ శ్రీకాంత్,సూపరిండెంట్ నరసయ్య,మరియు ఏపీ జె ఎఫ్ ఓ ఏ యూనియన్ అధ్యక్షుడు రంగారెడ్డి,ఉపాధ్యక్షుడు చాంద్ బాషా పాల్గొన్నారు.. డివిజన్ రీఛార్జ్ అసలం బేగ్
👉 ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన లో భాగంగా ఢిల్లీ లో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి స్వాగతం తెలిపిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ..
👉యువనాయకులు మాగుంట రాఘవరెడ్డిని మర్యాద పూర్వకంగా ఒంగోలు లోని మాగుంట కార్యాలయంలో కలిసిన ప్రకాశం జిల్లా మాజీ DCMS చైర్మన్ బెల్లం సత్యనారాయణ..
👉 నేడు కార్తీక పార్ణమి సందర్బంగా త్రిపురాంతకంలోని శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వారి మరియు శ్రీమత్ బాల త్రిపుర సుందరీ దేవి అమ్మవారి ఆలయం లో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమం లో పాల్గొన యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి , గుడి ఈ ఓ చెన్నకేశవరెడ్డి, ఎస్.వి సుబ్బారెడ్డి,వి.సి రెడ్డి, మరియు నాయకులు, అభిమానులు.
👉 యువనాయకులు మాగుంట రాఘవ రెడ్డిని మర్యాద పూర్వకంగా ఒంగోలు లోని మాగుంట కార్యాలయంలో కలిసిన ప్రకాశం జిల్లా DLDA మాజీ చైర్మన్ కుప్ప రంగనాయకులు .. జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రహమాన్..
ఏపీ ఉపాధ్యాయులపై కేసులు ఎత్తివేత..మెగా డీఎస్సీపై మంత్రి లోకేష్ క్లారిటీ….బీజేపీకి షాక్.. ఢిల్లీ మేయర్ పీఠం ఆప్‌దే..తప్పుడు ప్రచారం వద్దు.. మండలిలో హోమ్ మినిస్టర్ ఉగ్రరూపం..చీమకుర్తి రోడ్డు దుస్థితికి గ్రానైట్ అక్రమ రవాణా కారణం కాదా -ప్రజాసంకల్ప వేదిక ఆరోపణ.. సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎంపీ మాగుంట..
Recent Posts