రుషికొండ ప్యాలెస్ చూసి నాకు కళ్ళు తిరిగాయి : చంద్రబాబు..గాడిద పాల పేరుతో ఏపీ, తెలంగాణలో రూ.100 కోట్ల మోసం….ఏపీలో ఈ నెల 25 నుంచి సేవలు నిలిపివేస్తాం: 108 ..కడప ఎస్పీ విద్యాసాగర్ ను కలిసిన వివేకా కుమార్తె సునీత..వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై సెర్చ్ వారెంట్…మ‌ళ్లీ ముద్ర‌గ‌డ లేఖ‌ల ప‌ర్వం – చంద్ర‌బాబు టార్గెట్ గా ఉత్త‌రం..ఒంగోలులో DLDO సస్పెండ్.. మహాసేన రాజేష్‌పై కేసు నమోదు..అమాయక ప్రజలను టార్గెట్ చేసి డబ్బుల కోసం సైబర్ మోసం…

👉ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు : రూ.9,74,556 కోట్లు.*
*కాదని ఎవడైనా అంటే, అసెంబ్లీకి రండి.. తేల్చుతా.. సీఎం చంద్రబాబు.. *ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు :*
*గవర్నమెంట్ debt – రూ.4,38,278 కోట్లు.*
*పబ్లిక్ అకౌంట్ లియబిలిటీస్ – రూ.80,914 కోట్లు.
**కార్పొరేషన్ debt – రూ.2,48,677 కోట్లు.*
*సివిల్ సప్లైస్ కార్పొరేషన్ – రూ.36,000 కోట్లు.*
*పవర్ సెక్టార్రూ.34,267 కోట్లు*
*అవుట్ స్టాండింగ్ డ్యూస్టువెండార్స్ అన్ని స్కీమ్స్ రూ.1,13,244 కోట్లు.*
*అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ – రూ. 21,980 కోట్లు.*
*నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ – రూ.1,191 కోట్లు.*ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు : రూ.9,74,556 కోట్లు.*
👉రుషికొండ ప్యాలెస్ చూసి నాకు కళ్ళు తిరిగాయి : చంద్రబాబు.*
*అడవి పందుల లాగా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు.*
*పెట్టుబడులు పెడదామని వచ్చిన వారిని తరిమికొట్టారు.*
*ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు.*
*ఆ ప్యాలెస్ లో కుటుంబ సభ్యులకు కూడా ఆఫీసులు కట్టారు.*
*అంతటి అరాచక పాలన భరించలేక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఏపీకి వచ్చినాలుగైదు నెలలు ఉండి NDA ని గెలిపించి వెళ్లారు.*ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
👉గాడిద పాల పేరుతో ఏపీ, తెలంగాణలో రూ.100 కోట్ల మోసం..
ఒక్కో గాడిదను రూ.1.5 లక్షలకు విక్రయించిన చెన్నైకి చెందిన ‘డాంకీ ప్యాలెస్..
లీటర్ గాడిద పాలను తామే రూ.1 వెయ్యికి కొంటామన్న ‘డాంకీ ప్యాలెస్’..
ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయన్న బాధిత రైతులు
గాడిద పాల ఉత్పత్తి పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది. చెన్నైకి చెందిన ఓ సంస్థ తెలంగాణ, ఏపీ సహా నాలుగు రాష్ట్రాల రైతులను మోసం చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో రూ.100 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు. గాడిద పాల ఉత్పత్తి పేరుతో మోసపోయిన రైతులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.
‘డాంకీ ప్యాలెస్’ అనే చెన్నై సంస్థ ఒక్కో గాడిదను రూ.1.5 లక్షలకు తమకు విక్రయించిందని, లీటర్ గాడిద పాలను రూ.1,000కి కొనుగోలు చేస్తామని చెప్పిందని బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. మూడు నెలల పాటు గాడిద పాలను కొనుగోలు చేసి నమ్మకం కలిగించినట్లు చెప్పారు. అయితే గత 18 నెలలుగా గాడిద పాలకు డబ్బులు ఇవ్వడం లేదని వారు వాపోయారు.
‘డాంకీ ప్యాలెస్’ సంస్థ తమకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు తమకు న్యాయం చేయాలని బాధితులు మొర పెట్టుకున్నారు.
గుంటూరు జిల్లాకు చెందిన సాయిబాబు అనే బాధితుడు మాట్లాడుతూ… ‘డాంకీ ప్యాలెస్’ గురించి చెబితే తాను రూ.56 లక్షలు ఇన్వెస్ట్ చేశానని… తమకు మూడు నెలల పాటు డబ్బులు ఇచ్చారని, కానీ ఆ తర్వాత నుంచి ఇవ్వలేదన్నారు. తమ ఆందోళనపై ఏపీ మంత్రి లోకేశ్ స్పందించాలని కోరారు. తెలంగాణ నుంచి కేటీఆర్ ఈ ఘటనపై స్పందించారని తెలిపారు.
👉ఏపీలో ఈ నెల 25 నుంచి సేవలు నిలిపివేస్తాం: 108 సిబ్బంది..ఏపీలో 108 వాహనాల సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఈ నెల 25 నుంచి సేవలు నిలిపి వేస్తామని 108 ఒప్పంద ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్ తిరుపతి ప్రెస్ క్లబ్ లో తెలిపారు.
మేము పడుతున్న సమస్యల పై ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి పలుమార్లు
విన్నవించామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర 108 సంఘ నేతలు మహేష్, మునిరాజ, రాజేష్, సునీల్, కేశవులు,సుధాకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
👉కడప ఎస్పీ విద్యాసాగర్ ను కలిసిన వివేకా కుమార్తె డాక్టర్ సునీత..
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ..
తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సునీత
హంతకులకు శిక్ష పడేందుకు పోలీసులు సహకరించాలని విజ్ఞప్తి
తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుదీర్ఘకాలంగా న్యాయం కోసం పోరాడుతున్న డాక్టర్ సునీతారెడ్డి నేడు కడప ఎస్పీ విద్యాసాగర్ ను కలిశారు. వివేకా హత్య కేసు గురించి ఎస్పీకి వివరించారు. వివేకా హంతకులకు శిక్ష పడేలా పోలీసులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి అభ్యంతరకర పోస్టులపైనా సునీత ఎస్పీతో చర్చించారు. అనంతరం, కడప నుంచి హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు.
విద్యాసాగర్ కు ముందు కడప ఎస్పీగా వ్యవహరించిన హర్షవర్ధన్ రాజును కూడా సునీత గత ఆగస్టులో కలిశారు. మొదట హోంమంత్రి అనితను కలిసిన అనంతరం, సునీత అప్పటి ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసి తండ్రి హత్య అంశంపై మాట్లాడారు.
కాగా, హోంమంత్రి అనితను కలిసిన సమయంలో… వివేకా హంతకులకు స్థానిక పోలీసుల అండ లభిస్తోందని సునీత ఆవేదన వెలిబుచ్చారు. సీబీఐ విచారణకు పోలీసుల సహకరించేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
👉మ‌ళ్లీ ముద్ర‌గ‌డ లేఖ‌ల ప‌ర్వం – చంద్ర‌బాబు టార్గెట్ గా ఉత్త‌రం*
*కాకినాడ*
కొంతకాలం తన లేఖలకు గ్యాప్ ఇచ్చిన వైసీపీ నేత, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డి మరోసారి లెటర్లు రాయడం షురూ చేశారు. నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు నేడు లేఖ రాశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అందులో ప్రస్తావించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేయడం మీకు తగునా? అని ప్రశ్నించారు. సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి అని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోకపోవడం అన్యాయం అని పేర్కొన్నారు. అలాగే రెడ్‌బుక్‌ను ఉద్దేశిస్తూ లేఖలో పలు ఆరోపణలు చేశారు.
సూపర్ సిక్స్ హామీల అమలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా సాధనపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. దొంగ సూపర్ సిక్స్ హామీలు తలుచుకుంటే భయమేస్తుందన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికి పనిచేస్తున్నారని విమర్శించారు. అమాయకులను జైల్లో పెట్టి కొట్టించకూడదంటూ ముద్రగడ సూచనలు చెబుతూ లేఖ రాశారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకే.. సోషల్ మీడియా కేసులు, రెడ్ బుక్ వేధింపులు అంటూ లేఖలో ఆరోపణలు గుప్పించారు.
👉నెల్లూరు జిల్లా :
వలెటివారిపాలెం మండలం అంకభూపాలాపురం గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన.
పాలకీటీ భావన (15) అనుమానస్పద రీతిలో గత సోమవారం ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య.
విషయం బయటకు చెప్పకుండా అంత్యక్రియలు చేసిన తల్లితండ్రులు.
ఏ. పి.మోడల్ స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న భావన.
అదే స్కూల్ లో ఇంటర్ చదువుతున్న విద్యార్థి పై అనుమానం వ్యక్తం చేస్తున్న భావన కుటుంబ సభ్యులు.
👉ఒంగోలులో DLDO సస్పెండ్*
* ప్రకాశం జిల్లాలో ఓ కీలక అధికారిణి సస్పెండ్ అయ్యారు
* ప్రస్తుతం ఒంగోలు డీఎల్డీవోగా ఉన్న ఉషారాణి గతంలో డీపీవోగా పనిచేశారు
* ఇటీవల గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీలు జరిగాయి
* ఇందులో ఆమె అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి
* దీంతో కలెక్టర్ తమీమ్ అన్సారియా విచారణకు ఆదేశించారు
* ఆ నివేదిక ఆధారంగా ఆమెను ప్రభుత్వానికి సరెండ్ చేయగా.. తాజాగా ఆమెను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు
*రోజురోజుకూ పెరుగుతున్న ఫైనాన్స్ వ్యాపారుల ఆగడాలు * దాడులు*,*
👉 *అత్యాచారయత్నానికి దిగుతున్న వ్యాపారుల అనుచరులు*
👉 *కేసు పెట్టాలంటే రాజీ చేసుకోవాలంటున్న కొందరు పోలీసులు*
👉 *చర్యలు తీసుకోవడంలో పోలీసుల విఫలం*
* 👉 *కొందరు పోలీసుల తీరుపై యువ ఐపీఎస్ అధికారి సీరియస్* పేదల కోసం గృహ నిర్మాణం:
గ్రామాల్లో పేదలకు 3 సెంట్ల భూమి, పట్టణాల్లో 2 సెంట్ల భూమి ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అప్పగించనున్నారు.
గృహ ప్రవేశాలు:
డిసెంబరులో లక్ష ఇళ్లలో గృహ ప్రవేశాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పారిశ్రామిక జోన్ల అభివృద్ధి:
నక్కపల్లి, కొప్పర్తి పారిశ్రామిక జోన్లకు రూ. 10 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
అభివృద్ధి పథం:
ఒక్కసారిగా అన్ని పనులు చేయలేమని, దశలవారీగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
**తాడేపల్లి లో రాజ్యసభ సభ్యులు మాజీ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు TTD మాజీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి ని మర్యాదపుర్వకముగా కలసిన మాజీ మంత్రివర్యులు కొండపి నియోజకవర్గ సమన్వయ కర్త YSR కాంగ్రెస్ పార్టీ PAC కమిటి సభ్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్
👉”వాట్ ఈస్ దిస్..!..”జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాల శాడిజం.. కడప జిల్లా..
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 16 న శనివారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ లకు కడప నగరంలోని పెద్ద దర్గా ఉరుసు నేపథ్యంలో సెలవు ప్రకటించిన విద్యాధికారులు…
విద్యార్థుల కు సెలవు ప్రకటించి ఉపాధ్యాయులకు స్కూల్ లకు హాజరు కావాలని ఆదేశాలు.. ‘నాగరికత’ గురించి పాఠ్యంశాలు చెప్పే ఉపాధ్యాయులు.. ‘అనాగరికం’గా వ్యవహరించడంపై భగ్గుమన్న ప్రైవేట్ ఉపాధ్యాయ లోకం..ప్రతిసారి ఇదే తంతు.. ఇచ్చేది అతి తక్కువ వేతనం.. చేయించుకునేది వెట్టి చాకిరీ..
ఇదెక్కడి బానిసత్వం..! అంటూ ప్రైవేట్ ఉపాధ్యాయ వర్గాల గగ్గోలు..
‘స్టూడెంట్’ సెంట్రిక్ విద్యా వ్యవస్థ… నేడు స్టూడెంట్ లకు సెలవు ఇచ్చినా ఉపాధ్యాయ సెంట్రిక్ గా మారిన వైనం…
విద్యార్థులే స్కూల్ కు రానపుడు ఉపాధ్యాయులతో పనేంటి.? బ్రిటిష్ రాజ్య బానిస విధానాలు ఇంకా కొనసాగుతున్నాయేమో?.. నని అనుమానాలు.. సంబందిత విద్యా శాఖ అధికారులు నిద్ర పోతున్నారా.. లేదా నిద్ర నటిస్తున్నారా..? అని ప్రశ్నిస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయ వర్గాలు…
నాగరిక ప్రపంచం లో అనాగరికంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు..వీరికి నాగరికత గురించి బోధించే వారు లేరా..? అని ప్రశ్నిస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులు..
ఈ పరంపరకు అడ్డుకట్ట లేదా..?.. ఇంకెన్నాళ్లీ బానిస బ్రతుకులు..?
👉కేటుగాళ్ల చేతిలో మోసపోయిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తండ్రి..😱😱😱
దిశా పటానీ తండ్రి జగదీశ్ సింగ్ పటానీకి రూ.25 లక్షలకు కుట్టుటోపి పెట్టిన మోసగాళ్లు
యూపీ ప్రభుత్వంలో ఉన్నత పదవి ఇస్తామని నమ్మించి నగదు తీసుకున్న కేటుగాళ్లు
డీఎస్పీగా పనిచేసి రిటైర్ అయిన జగదీశ్ సింగ్ పటానీ
👉**మహాసేన రాజేష్‌పై కేసు నమోదు..*
టీడీపీ నేత మహాసేన రాజేష్‌పై కేసు నమోదు..
మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసుల చర్యలు..
మార్ఫింగ్ ఫోటోలతో పోస్టులు పెట్టారన్నారు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలానికి చెందిన టీడీపీ అధికార ప్రతినిధి సరిపెళ్ల రాజేష్ (మహాసేన రాజేష్)పై కేసు నమోదైంది.
ఆయన అనుచరులు రంజిత్‌మెహర్‌ (రాజోలు), యెల్లమిల్లి పండు (తూర్పుపాలెం), బోడపాటి చక్రి (తుని), వీరవల్లి ఏసుబాబు (భీమవరం), పృథ్వీరాజ్‌లపై డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
సోషల్ మీడియాలో తనపై జనవరి, ఫిబ్రవరిల్లో అనుచిత పోస్టులు చేశారని శంకరగుప్తంకు చెందిన నేతల శాంతి ఈ నెల 12న ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కేసుకు సంబంధించి మార్ఫింగ్‌ ఫొటోలపై స్పష్టత కోసం ఫేస్‌బుక్‌కు ఫిర్యాదు చేశామని.. వివరాలు వచ్చాక చర్యలు తీసుకుంటాము అన్నారు.
మరోవైపు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ను కించపరిచేలా పోస్టు పెట్టిన కేసులో శాంతి భర్త నానిపై ఇటీవల రాజోలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
తన పేరిట ఎవరో నకిలీ ఖాతాలు తెరిచారని, ఆ పోస్టులతో తనకు సంబంధం లేదని చెబుతున్నారు మహాసేన రాజేష్.

👉 టెక్నాలజీ తెలిసిన ఐటీ ఉద్యోగులు కూడా.. సైబర్ భూతానికి బలవుతున్నారు.. డిజిటల్ కాల్ తో రూ. కోటి కోల్పోయిన యువతి!*
సైబర్‌ నేరాలు రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతున్నాయి.
రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకొని సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.
అమాయకులను మోసం చేస్తూ డబ్బులు కాజేస్తున్నారు.
అయితే ఈ మోసాల బారిన ఏదో చదువులేని వారు మాత్రమే పడుతున్నారు అనుకుంటే పొరబడినట్లే.
టెక్నాలజీపై మంచి అవగాహన ఉన్న ఐటీ ఉద్యోగులు సైతం బాధితులుగా మారడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం దేశంలో డిజిటల్ అరెస్ట్‌కు సంబంధించిన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మీకు వచ్చిన కొరియర్‌లో డ్రగ్స్‌ ఉన్నాయని, డిజిటల్‌ అరెస్ట్‌ చేశామని కొందరు పోలీసుల పేరుతో పేరు చేస్తారు.
ఏటూ కదలకుండా వీడియోకాల్‌లోనే ఉండాలని బెదిరిస్తారు.
చివరికి డబ్బులు ఇస్తే వదిలేస్తామని బెదిరిస్తుంటారు.
డిజిటల్‌ అరెస్ట్‌ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదే. ఈ అంశం ఎంత సీరియస్‌గా మారిందంటే. మొన్నటికి మొన్న ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం మన్‌కీ బాత్‌లో డిజిటల్‌ అరెస్ట్‌ గురించి ప్రస్తావించారు.
అయితే ఎవరెన్ని రకాలుగా అవగాహన చేపడుతున్నా నేరాలు మాత్రం ఆగడం లేదు.
తాజాగా గుండూరుకు చెందిన ఓ యువతి ఏకంగా రూ. 1.25 కోటి పోగొట్టుకున్న సంఘటన అందరినీ షాక్‌కి గురి చేసింది.
వివరాల్లోకి వెళితే..
విజయవాడలోని గాయత్రి నగర్‌కు చెందిన యువతి (25) హైదరాబాద్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుంటారు.
ఈ క్రమంలోనే వీకెండ్‌ కావడంతో శుక్రవారం విజయవాడకు వచ్చారు.
ఇలా ఉండగానే ఉదయం 10.30 గంటలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి యువతికి ఫోన్‌ వచ్చింది.
ఫోన్‌ లిఫ్ట్‌ చేయగానే తాము ముంబయి పోలీసులమని పరిచయం చేసుకన్నారు.
మీకు వచ్చిన కొరియర్‌లో డ్రగ్స్‌ ఉన్నాయని, డిజిటల్‌ అరెస్టు చేస్తున్నామంటూ భయపెట్టారు.
ఒకవేళ అరెస్ట్‌ చేయొద్దంటే వెంటనే డబ్బులు చెల్లించాలని బెదిరించారు.
దీంతో ఏం చేయాలో తెలియక ఆగంతకుడు చెప్పిన అకౌంట్‌లోకి యువతి రూ. 1.25 కోట్లు పంపించారు.
ఆ తర్వాత మోసపోయానని అర్థమై శుక్రవారం రాత్రి సైబర్ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
👉మోసం.. మోసం…మోసం….ఎక్కడ పట్టిన మోసం…అమాయక ప్రజలను టార్గెట్ చేసి డబ్బుల కోసం సైబర్ మోసం….రియల్ ఎస్టేట్ లో మోసం…ఇది ఇలా ఉంటే ప్రజలు వారి అవసరం కోసం డబ్బులు,గోల్డ్ ఇలా దాచుకున్న బ్యాంకులు మోసం..ఛీ ఛీ… ఏంది ఈ వ్యవస్థ.. పోలీసులు చెక్ పెడుతున్న ఆగని మోసాలు!*
మొన్న పల్నాడు జిల్లాలో జరిగిన బ్యాంక్ మోసం మరువక ముందే…ఇప్పుడు సత్యసాయి జిల్లా..మడకశిర గ్రామం లో ఉన్న గోల్డ్ లోన్ సంస్థ గోల్ మాల్ బయట పడింది..
బంగారం తాకట్టుపెట్టి అప్పులు తీసుకున్న కస్టమర్లు దగా పడుతున్నారు. బంగారం తాకట్టుపెట్టి తీసుకొన్న రుణం కంటే మూడురెట్లు అధికంగా వడ్డీ తీసుకుంటున్నారని కస్టమర్లు ఆందోళనకు దిగారు. ఎక్కువ వడ్డీలు వసూలు చేస్తున్నారంటూ నిరసన చేశారు. గోల్డ్‌ లోన్ కార్యాలయానికి తాళం వేశారు. దీంతో గోల్డ్ లోన్‌ ప్రతినిధులకు, కస్టమర్లకు మధ్య వాగ్వాదం జరిగింది
ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించిన ఇంకా బాకీ ఉందని చూపుతున్నారంటూ కస్టమర్లు లబోదిబోమంటున్నారు. గోల్డ్ లోన్‌లో పెట్టేటప్పుడు ఒక రూల్.. ఇప్పుడు మరో రూల్‌ పాస్ చేస్తున్నారని వాపోతున్నారు. ఎక్కడ లేని వడ్డీలు వసూలు చేస్తూ.. గోల్డ్ తిరిగి ఇవ్వడం లేదంటూ, గోల్డ్ లోన్ ప్రతినిధులు ఇబ్బందులు పెడుతున్నారంటూ కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
అధికారులు ఎంక్వైరీ చేసి.. తాకట్టులో ఉన్న తమ బంగారం విడిపించాలని వేడుకుంటున్నారు. గతంలో ఇదే సంస్థలో పని చేసిన మేనేజర్ డబ్బులు గోల్ మాల్ చేసి, కస్టమర్లను ఇబ్బందులు పాలు చేసి పరారయ్యాడని బాధితులు ఆరోపిస్తున్నారు.
👉 వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై సెర్చ్ వారెంట్
పులివెందుల: వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై పోలీసులు సెర్చ్ వారెంట్ జారీ చేశారు. ఈ మేరకు వైఎస్సార్‌ జిల్లా లింగాల మండలం అంబకపల్లిలోని రాఘవరెడ్డి ఇంటికి పులివెందుల పోలీసులు నోటీసు అంటించారు..
ఏ క్షణంలోనైనా ఇంట్లో సోదాలు చేయడానికి అనుమతి తీసుకున్నామని వారు తెలిపారు. వారం రోజుల నుంచి రాఘవరెడ్డి పరారీలో ఉన్నాడు. మరోవైపు వైకాపా సోషల్‌ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానంద రెడ్డికి పోలీసుల 41-ఎ నోటీసులు జారీ చేశారు..
వైఎస్‌ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇచ్చిన కంటెంట్‌నే తాను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశానని వర్రా రవీందర్‌రెడ్డి ఇటీవల పోలీసులకు తెలిపారు. ఈ మేరకు రాఘవరెడ్డి కోసం అతడి స్వగ్రామం అంబకపల్లెలో నిఘాపెట్టి, పులివెందుల, లింగాల మండలాల్లో గాలిస్తున్నారు..

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?