తెలంగాణ రాజకీయాలలో ట్విస్టులపై ట్విస్టులు ..ఫామ్ హౌస్ కేసును బయటకు తీస్తున్న రేవంత్.. నాగపూర్ రోడ్ షోలో సీఎం రేవంత్- నాందేడ్ లో షబ్బీర్ అలీ ప్రచారం.. ఉర్స్ షరీఫ్ కు ముఖ్య అతిథిగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి.. హైదరాబాదులో నటి కస్తూరి అరెస్టు.

తెలంగాణ రాజకీయాలలో ట్విస్టుల పై ట్విస్టులు..
హైదరాబాద్:
తెలంగాణ రాజకీయాలు ఢిల్లీ మీదుగా మళ్లీ హైదరాబాద్ చేరుకున్నాయి. రేవంత్, పొంగులేటిని జైలుకు పంపిస్తా అని కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి ఓ టెండర్ల అంశంపై కేంద్ర మంత్రి ఫిర్యాదు చేశారు. టెండర్లలో అవినీతి గురించి చెప్పాలంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అనేకానేక టెండర్ల గురించి.. కథలు కథలుగా కాంగ్రెస్ నేతలు చెబుతారు. ఇంత మాత్రానికే రేవంత్, పొంగులేటిని జైలుకు పంపుతారా అన్నది సందేహం. అసలు విషయం మాత్రం కేటీఆర్ జైలుకు వెళ్లకుండా బీజేపీ నేతలతో మాట్లాడుకుని వచ్చారని కాంగ్రెస్ నేతలంటున్నారు.
తెలంగాణలో ప్రభుత్వం కాంగ్రెస్‌దే అయినా ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్ని అరెస్టు చేయాలంటే బీజేపీ అనుమతి తప్పని సరి. గత ప్రభుత్వంలో అవినీతి అంటూ కేసులు పెట్లాలంటే గవర్నర్ అనుమతి ఉండాలి. కేటీఆర్ ప్రభుత్వానికి సంబంధం లేని తప్పులు చేసి ఉంటే అవినీతి చేసి ఉంటే.. కేసులు పెట్టి అరెస్టు చేయడానికి గవర్నర్ పర్మిషన్ అక్కర్లేదు.కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపైనా చర్యలు తీసుకునేందుకు గవర్నర్ అనుమతి కోసం కాంగ్రెస్ ఎదురు చూస్తోంది.
ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో రూ. 55 కోట్లు లెక్కాపత్రం లేకుండా పంపేశారు. అంటే.. ఆ నగదు దొంగతనానికి గురయిందని అనుకోవచ్చు. ఏసీబీ అధికారుల దర్యాప్తులో ఇది కేటీఆర్ నోటి మాట ద్వారా ఇచ్చారని తేల్చారు. అందుకే ఆయనను ప్రశ్నించేందుకు అవకాశం కావాలని దరఖాస్తు చేశారు. గవర్నర్ అనుమతి ఇస్తే అరెస్టు కూడా చేసుకోవచ్చు. ఇంకా అక్కడ్నుంచి అనుమతి రాలేదు. రాకపోతే బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ల అగ్రెసివ్ గా ఎదురుదాడి చేస్తుంది. వస్తే కేటీఆర్ ను వెంటనే జైల్లో వేస్తారు. అంతటితో అది ఆగదు. ప్రస్తుతం బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయాలతో వారిని అలా వదిలేయకూడదని రేవంత్ అనుకుంటారు. అందుకే వచ్చే వారంలో తెలంగాణ రాజకీయాలు కీలక మలుపులు తిరిగే అవకాశం ఉంది.
👉ఫామ్ హౌస్ కేసును బయటకు తీస్తున్న రేవంత్ !😯😯
హైదరాబాద్..
ఫోన్ ట్యాపింగ్ అంశంలో బీజేపీ నేతల్ని కేసీఆర్ ఇరికించిన ఫామ్ హౌస్‌ కేసును రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా బయటకు తీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ నలుగురు మాజీ ఎమ్మెల్యేలతో పాటు మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇందులో చిరుమర్తి లింగయ్య తనకు అనారోగ్యమని చెప్పి డుమ్మాకొట్టారు. కానీ ఇవాళ కాకపోతే రేపు ఆయన హాజరు కావాల్సి ఉంటుంది. మిగిలిన వారినీ ప్రశ్నించనున్నారు. వారు ఫామ్ హౌస్ కేసులో ఫీల్డ్ లో ఉన్న నలుగురు మాజీ ఎమ్మెల్యేలే.
ఫామ్ హౌస్ కేసు సీబీఐకి వెళ్లింది. ఆ కేసు విచారణ మాత్రం సీబీఐ చేయడం లేదు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. సీబీఐ విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. కానీ విచారణ వద్దన్నట్లుగా ఆదేశాలిచ్చింది. దాంతో సీబీఐ సైలెంట్ అయిపోయింది. అది కేవలం ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు. ట్యాపింగ్ వరకూ రాలేదు. ఇప్పుడు రేవంత్ ట్యాపింగ్ కోణంలో ఆ కేసును వెలుగులోకి తెస్తున్నారు. ఆ కేసు మొదట ట్యాపింగ్‌తో ప్రారంభమయిందని బీఆర్ఎస్ లో గుసగుసలు ఉన్నాయి.
ట్యాపింగ్ చేసి దొరికిపోయిన పోలీసులు కూడా అదే స్టేట్ మెంట్ ఇచ్చారు. ట్యాపింగ్ చేస్తున్న సమయంలో బీజేపీతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేల గురించి తెలిసిందని వారిని ట్రాప్ చేసి.. బీజేపీ పెద్దల్ని ఇరికించేందుకు కేసీఆర్ కుట్ర ఉన్నారని అంటున్నారు. కేసీఆర్ అధికారికంగా చాలా కీలకమైన డాక్యుమెంట్లు రిలీజ్ చేశారు. అవి ట్యాపింగ్ చేసి సేకరించినవేనని అంటున్నారు. ఈ క్రమంలో ఈ నలుగురు ఎమ్మెల్యేల విచారణ తర్వాత వేరే కోణంలో ఫామ్ హౌస్ కేసు వెలుగులోకి రానుంది.
దీన్ని ఇప్పుడు బయటకు తీసుకు రావడం వెనుక రేవంత్ వ్యూహాత్మక ప్రయత్నాలు ఉన్నాయని అంటున్నారు. కేసీఆర్, కేటీఆర్ లపై చర్యలు తీసుకోకుండా బీజేపీ అడ్డుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదు. ఈ క్రమంలో కేసీఆర్, కేటీఆర్ ఎంత ప్రమాదకర వ్యక్తులో గుర్తు చేయాలని అనుకుంటున్నారని బీఎల్ సంతోష్ ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక విమానంలో పోలీసుల్ని పంపారనే సంగతిని మర్చిపోవద్దని రేవంత్ గుర్తు చేయబోతున్నారని అనుకోవచ్చు.
👉 నాగ్ పూర్ రోడ్ షో లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ..
👉ఈరోజు నాందేడ్ నార్త్ నియోజకవర్గం పీర్ బుర్హన్ నగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
నాందేడ్ నార్త్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ సత్తార్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని షబ్బీర్ అలీ ప్రజలను కోరటం జరిగింది.
👉 ఉర్స్ షరీఫ్ కు ముఖ్య అతిథిగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డికి ఆహ్వాన పత్రిక ||*
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 128 డివిజన్ HMT కాలనీ వాసులు ఉర్స్ షరీఫ్ కు ముఖ్య అతిథిగా పాల్గొనాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు. కార్యక్రమంలో 127 మాజీ వర్డ్ మెంబర్ భాస్కర్ రెడ్డి,ఖదీర్,బాబుమియ తదితరులు పాల్గొన్నారు.. స్టేట్ ఇంచార్జ్ హైదర్ అలీ
👉నటి కస్తూరి అరెస్ట్‌.. హైదరాబాద్ లోని
గచ్చిబౌలిలో అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు.
తెలుగు మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కస్తూరి.
కస్తూరిని చెన్నైకి తరలిస్తున్న పోలీసులు.

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?