👉 అత్యధిక కేసులు పరిష్కరించిన న్యాయ మూర్తిగా జస్టిస్ అమర్‌నాథ్ గౌడ్ రికార్డ్.
త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్‌కు యూకే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్.
తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్.
2017 నుంచి ఇప్పటివరకు 92వేల కేసులు పరిష్కరించిన జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్
👉కూటమి నేతలు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి: చంద్రబాబు వార్నింగ్.*
*అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.*
*సోషల్ మీడియాలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేస్తున్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తా వించారు.*
*వైసీపీ నాయకులు కొందరిని పోలీసులు అరెస్టు చేశారని, వారంతా సోషల్ మీడియాలో రెచ్చిపోయారని తెలిపారు.*
*అందుకే పోలీసులు వారిని అరెస్టు చేశారని చంద్రబాబు చెప్పారు. అయితే.. కేవలం వైసీపీ నేతలకే కాదని.. మహిళలను, ఇంట్లో వాళ్లను అవమానించేలా.. వారు నొచ్చుకునేలా ఎవరూ కామెంట్లు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు.*
*ఈ విషయంలో తాను పారదర్శకంగా ఉంటానని తెలిపారు. కూటమి నాయకులను కూడా ఉపేక్షించేది లేదన్నారు. అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు.*
*మహిళలను కించపరిచేలా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు.*
👉కాలువలో పసికందు మృతదేహం….*
గుంటూరు పొన్నూరు రహదారి బుడంపాడు కాలువ కల్వర్టు దగ్గర లభ్యం…
సంఘటన స్థలానికి చేరుకున్న నల్లపాడు పోలీసులు…
ఒక నెలలోపు వయసు బాలుడి మృతదేహం గుర్తించిన పోలీసులు…
నీటిలో కొట్టుకువచ్చిందా లేక ఎవరైనా తెచ్చి ఇక్కడ పడవేశారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు…
మృతదేహాన్ని రుద్రా ట్రస్ట్ ద్వారా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి శవగరానికి తరలింపు…
👉 ఎన్టీఆర్ కి ఏమి తెలుసు !..నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!..ఇప్పటికి నాలుగు దశాబ్దాల క్రితం అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి నాదెండ్ల అధికారంలోకి వచ్చారు అని నేటికీ విమర్శిస్తారు. తెలుగుదేశం పార్టీని నేనే రూపకల్పన చేశాను.. ఆ పార్టీని నేనే ఏర్పాటు చేశానని చెప్పుకుంటారు మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు. ఆయన గురించి తెలియాలీ అంటే 1984 ఆగస్టు సంక్షోభం ఎపిసోడ్ కి వెళ్లాల్సిందే. ఇప్పటికి నాలుగు దశాబ్దాల క్రితం అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి నాదెండ్ల అధికారంలోకి వచ్చారు అని నేటికీ విమర్శిస్తారు.
కానీ అది అన్న గారి విధానాల మీద తిరుగుబాటు అని నాదెండ్ల అనేక ఇంటర్వ్యూలలో చెప్పారు. ఇక లేటెస్ట్ గా ఆయన ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీని ఆ పార్టీ విధి విధాలను ఇంకా చెప్పాలంటే ఎన్నికల మేనిఫేస్టోని సైతం తానే తయారు చేశారు అని చెప్పారు. * ఆస్తిలో ఆడబిడ్డలకు సగం వాటా ఇవ్వాలని తాను టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాను అని అప్పటికి మూడు దశాబ్దాలుగా ప్లీడర్ గా పనిచేసిన తన అనుభవం నుంచి పుట్టిన విప్లవాత్మకమైన ఆలోచన అది అని నాదెండ్ల చెప్పారు ఆ తరువాత ఆ నిర్ణయమే మహిళలను చైతన్యవంతులుగా చేసింది అని అన్నారు అంతే కాదు పేదలకు కిలో రెండు రూపాయలకు బియ్యం పధకం సహా అనేక సంక్షేమ పధకాలకు కూడా తానే రూపకల్పన చేసి ఎన్నికల ప్రణాళికలో పెట్టాను అని అన్నారు. వీటన్నిటి గురించి ఎన్టీఆర్ కి ఏమి తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. **తానూ చంద్రబాబు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచామని అంటారని కానీ తననే వెన్నుపోటు దారుడిగా చిత్రీకరించడానికి కారణం తాను బయటవాడిని చంద్రబాబు సొంత ఇంటి వాడు కావడమే అని అన్నారు. టీడీపీ తాను ప్రారంభిస్తే ఎన్టీఆర్ బ్రెయిన్ చైల్డ్ అని న్యాయపరంగా పోరాటం చేశారని ఆయన వివరించారు. ఎంతో మంది సీఎంలు ఏపీకి చేసినా తన పేరే గుర్తుంచుకోవడానికి కారణం తాను వెన్నుపోటు పొడిచారు అని ప్రచారం చేయడమే అని నాదెండ్ల అన్నారు. ఇక దేశంలో కుల గణన డిమాండ్ మీద కూడా ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. కులగణన వల్ల ఇబ్బందులే వస్తాయని దేశం ఇంకా ముక్కచెక్కలు అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. కులాల భావన తీసివేయాలని ఆయన అన్నారు.
** కులాల ప్రస్తావన లేకుండా కూడా పేదలకు అన్నీ అందించవచ్చు అని అన్నారు. అంతే కాదు భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల కూడా ఏమీ ఉపయోగం లేదని అన్నారు. **ఒక రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా మారినా ప్రజలకు ఏమి ఒనగూడిందని ఆయన ప్రశ్నించారు. ఖర్చులు ఎక్కువగా పెరగడం తప్పించి ఏమీ లాభం లేదని అన్నారు **దేశ తొలి ప్రధాని నెహ్రూ కేవలం ఒక్కరే అంబాసిడర్ కారులో పార్లమెంట్ కి వెళ్ళడం తాను చూశాను అని ఈ రోజున ఒక సర్పంచుకు కి కూడా భారీ భద్రత కల్పిస్తూ అనవసరం ఖర్చులు పెంచుతున్నారని అన్నారు. వీటిని అభివృద్ధి వైపు మళ్ళిస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. దేశంలో ఆర్ధిక పరిస్థితులను మెరుగుపరచేందుకు పాలకులు చర్యలు తీసుకోవాలి తప్ప కులాలను చూసి చేయాలనుకోవడం కాదని అన్నారు. **సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఒక్కటి చేసారని, కానీ ఈ రోజున మళ్లీ కుల భావన తో పాటు అనేక ఇతర అంశాల వల్ల దేశం విచ్చిన్నం అవుతుందని నాదెండ్ల ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఏ పార్టీలో ప్రస్తుతం లేనని బీజేపీ సభ్యత్వం ప్రధాని మోడీ ఆహ్వానం మేరకే తీసుకున్నాను తప్పించి మరేమీ లేదని అన్నారు. తాను ఇపుడు రాజకీయ స్వేచ్చా జీవిని అని ఆయన అన్నారు. బీజేపీలో కూడా ఏ పదవులూ తాను అడగలేదని అన్నారు. బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ గా కూడా తనకు బీజేపీ అవకాశం ఇచ్చినా తాను వద్దని సున్నితంగా తిరస్కరించానని నాదెండ్ల చెప్పారు..
👉తాడేపల్లి లో రాజ్యసభ సభ్యులు మాజీ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు TTD మాజీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి ని మర్యాదపుర్వకముగా
కలసిన మాజీ మంత్రివర్యులు కొండపి నియోజకవర్గ సమన్వయ కర్త YSR కాంగ్రెస్ పార్టీ PAC కమిటి సభ్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్
👉 బంగారు బాల్యం కోసం బాటలు వెయ్యాలి… ఎం యి ఓలు వై పాలెం…వై పాలెం బంగారుబాల్యం 3వ రోజు “మన కోసం మనం,” కార్యక్రమంలో భాగంగా 16.11.2024 తేదీన వై పాలెం మండలంలోని ZP హై స్కూల్, KGBV నందు జరిగిన సభలో ముఖ్య అతిథిలుగా ఎం యి ఓ లు పాల్గొని బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలికల రక్షణ వంటి కార్యక్రమాలపై వ్యాస రచన, డిబెట్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి . వాటి పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఆంజనేయులు మాట్లడుతూ విద్యా హక్కు, నాణ్యమైన విద్య,ను పొందడం బాలల హక్కు అన్నారు. లింగఆసమానత్వం, బాల కార్మిక వ్యవస్థ బాల్య వివాహాలు మొదలగు వాటి వలన బంగారు బాల్యం కుంటుపడుతుందని ఎం యి ఓ విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. meo 2మల్లు నాయక్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా అన్ని పాఠశాలలు,కళాశాలల లో బంగారు బాల్యం సాకారం అవుతుందన్నారు. మండల విద్యాశాఖధికార్ల తో పాటు ప్రధానోపాధ్యాయులు పిచ్చి రావు, తిరుమల దేవి,ఉపాధ్యాయులు నంద గోపాల్, మురళీ, బాలు నాయక్ తల్లిదండ్రులు, పాల్గొన్నారు- తదనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులు అందచేశారు.
👉సెమీ క్రిస్మస్ సందర్భంగా పెద్ద దోర్నాల ఏబీఎం. యూత్ ఆధ్వర్యంలో క్రికెట్..
ప్రకాశం జిల్లా…!!!
పెద్ద దోర్నాలలోని అటవీ శాఖ అతిథి గృహం వద్ద గల క్రీడా మైదానంలో నవంబర్ నెల 25వ తేదీన సెమీ క్రిస్మస్ వేడుకలు పురస్కరించుకొని ఏబీఎం. యూత్ సభ్యులు స్నేహపూర్వకమైన క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీఎం. చర్చి సంఘ కాపరి ఎం,కృపాకర్ సంఘ సెక్రటరీ, డోలు దేవదానం (బాబు ) రిబ్బన్ కత్తిరించి క్రికెట్ క్రీడను ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ లో గెలుపొంది ప్రత్యేక ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు సెమీ క్రిస్మస్ రోజున మేమెంటో, షీల్డ్ అందజేయడం జరుగుతుందని తెలియజేశారు, కార్యక్రమంలో ఏబీఎం యూత్ సభ్యులు పందిటి కిషోర్ బాబు, కటికల కాశీం, ఎలకపాటి చిన్న లక్ష్మయ్య, డోలు వినయ్, కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
👉జార్జి బీఫార్మసీ కళాశాలలో ఘనంగా 20వ గ్రాడ్యుయేషన్ డే..
ప్రకాశం జిల్లా మార్కాపురం.
స్థానిక జార్జ్ బీఫార్మసీకళాశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే జరిగిన కార్యక్రమంలో 2024 సంవత్సరం బి ఫార్మసీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రొవిజినల్ పట్టా ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ డి వి మూర్తి హాజరై మాట్లడుతూ ఫార్మసీ రంగంలో వివిధ అభివృద్ధిి కార్యక్రమాల గురించి చెబుతూ ప్రపంచంలో ఎక్కడలేనటువంటి కష్టమైసేడ్ మెడిసిన్స్ అవసరానుసారమైన మందుల గురించి వివరించారు యాంటీబయస్ బయోటిక్స్వాడమని సూచించారు జపాన్లో ప్రస్తుతం వాడుతున్నటువంటి ట్రస్ట్ మెడిసిన్ విధానాన్ని వివరించారు కార్యక్రమంలో అతిధి కళాశాల పూర్వవిద్యార్థి ఎన్ యం ఐ యం ఎస్ యూనివర్సిటీ ముంబై హెచ్ ఓ డి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మసోటిక్స్ డాక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ మందుల తయారీలో క్వాలిటీ ప్రమాణాలను పాటించాలని దానికి తగిన నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు మరియు తన పూర్వ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు కళాశాల చైర్మన డాక్టర్ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ విద్య యొక్క ప్రాముఖ్యతను ఫార్మసీ యొక్క అనుబంధ విభాగాలను ఫార్మసీ ఎంబీఏ మరియు ఇతర అనుబంధ విషయాల గురించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర రాజా జయ రావు డాక్టర్ పి శ్రీకాంత్ డాక్టర్ సునీత డాక్టర్ భాస్కర్ డాక్టర్ రఘువీర్ డా.రాజ్ కుమార్ ముజీబ్ కృపాల్ బాలు బంక రాజు శేషయ్య విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
*👉వరుస బైక్ దొంగతనాలు మరియు గంజాయి అమ్మకమునకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్టు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు*.
*౩౩ మోటార్ సైకిళ్లు మరియు 4 కేజీల గంజాయి స్వాదీనం చేసుకోవడమైనది.Total Worth;- (Property Lost & Recovered Rs. 26,00,000/-)*
*కేసును ఛేదించుటలో ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులు మరియు సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ *.
కేసులోని ముగ్గురు నిందితుల అరెస్టు మరియు వారి వద్ద నుండి బైకులు మరియు గంజాయి స్వాధీనంపై ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వివరాలను వెల్లడించారు.
*అరెస్టయిన నేరస్తుల వివరాలు*:
1)కుంచాల శివప్రసాద్ S/o మల్లికార్జున, 23 సం, వడ్డెర కులం, బండపాలెం, కందుకూరు టౌన్. (సేలం PS లో NDPS కేసు వున్నది)
2)ఉప్పు శ్రీకాంత్,, S/o రమేష్, 21 సం, వడ్డెర కులం, దూబగుంట గ్రామం, కందుకూరు మండలం, ప్రస్తుతం చందానగర్, శాంతినగర్, హైదరాబాద్.
3)సహౌద్దీన్ సర్దార్ S/o సహాచెన్ సర్దార్, 37 సం, ముస్లిం కు Nలము, పొచ్వాకాకు డైమండ్ హౌరా, కోల్కతా సిటీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, ప్రస్తుతము కొనిజేడు బస్టాండ్ సెంటర్, ఒంగోలు టౌన్.
*స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు వివరాలు* :
ఎ) సుమారు 4 కేజీల గంజాయి (విలువ -20,000/-).బి) 33 మోటార్ సైకిల్ లు
*మోటార్ సైకిల్ వివరాలు* :
1) ప్రకాశం జిల్లా కు చెందిన 15 మోటార్ సైకిల్ లు
2) బాపట్ల జిల్లా -01
3) పల్నాడు జిల్లా -01
4) నెల్లూరు జిల్లా -16
మొత్తం 33 మోటార్ సైకిల్ వీటి విలువ 25,80,000/-.
*స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు మొత్తం విలువ – Rs.26,00,000/-*
ఒంగోలు పట్టణంలో మోటార్ సైకిళ్లు దొంగతనం చేస్తున్న వారిపై పోలీస్ వారు నిఘా ఉంచి, ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలు మేరకు ఒంగోలు డి.ఎస్.పి ఆర్. శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఒంగోలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజు మరియు వారి సిబ్బందితో కలసి CSR శర్మ కాలేజి జంక్షన్ దగ్గర 3 వ్యక్తుల కదలికలను గురించి సమాచారం అందగా సిబ్బంది అందరు పై ప్రదేశానికి చేరుకున్నారు. అంతట పోలిస్ వారిని చూసి వారు పారిపోవటానికి ప్రయత్నించగా అంతటా పోలీసువారు వారిని అదుపులోకి తీసుకోని విచారించగా వారి వద్ద 4 Kg ల గంజాయిని స్వాధీనం చేసుకొని పూర్తి స్ధాయిలో విచారించగా వారు 33 మోటార్ సైకిల్ లు దొంగతనము చేసినట్లు మధ్యవర్తుల సమక్షంలో అంగీకరించినారు.
తేది 15.11.2024 17.30 గంటలకు ఒంగోలు పట్టణం లోని CSR శర్మ కాలేజి జంక్షన్ వద్ద A1 అయిన కుంచాల శివప్రసాద్ ను, A2-ఉప్పు శ్రీకాంత్ ను మరియు A3 అయిన సహౌద్దీన్ సర్దార్ నిందితులను ప్రత్యేక బృందం అరెస్టు చేసి పైన పేర్కొన్న విధంగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
*అభినందన*: ద్విచక్రవాహనాల దొంగతనం కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాగైనా ఛేదించాలనే పట్టుదలతో కృషి చేసిన ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు , ఒంగోలు వన్ టౌన్ సిఐ వై. నాగరాజు, ASI K.సురేష్, ASI షేక్ నాయబ్ రసూల్, HC M.సాయి, HC జి.విజయ కుమార్, కానిస్టేబులు M.అనిల్ లను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి ప్రశంస ప్రతాలను మరియు రివార్డ్ లను ప్రకటించారు.
👉డీజిల్ ట్యాంకు లీక్ అవుతున్న పట్టించుకోని ఆర్టీసీ సిబ్బంది..!!!
గిద్దలూరు డిపోకు చెందిన సర్వీస్ నెంబర్ 9951 గిద్దలూరు to హైదరాబాద్ బస్సు డీజిల్ లీక్ అవుతుండటం వలన రాత్రి 3గంటలకు మల్లేపల్లి బస్ స్టాప్ లో ఆపి వేసి అక్కడ నుండి 7కిలోమీటర్లు దూరంలో ఉన్న దేవరకొండ డిపో కు తరలించారు అక్కడ రిపేర్ చేసి 4.40 నిమిషాలకు బయలు దేరింది.గంట 40నిమిషాలు ప్రయాణికులు బస్ లొనే ఇబ్బందులు పడ్డారు. ట్యాంకుకు లీకేజీ పరిశీలించే విషయంలో సిబ్బంది నిర్లక్ష్య వైఖరి పట్ల ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదృష్టవశాత్తు డిపోకు సమీపంలో ఈ ఇలా జరగడంతో సరిపోయింది లేకుంటే మార్గమధ్యంలోని అడవిలో ఆగిపోయే ఉంటే ప్రయాణికులు ఇంకా ఎక్కువగా సమస్యలను ఎదుర్కొనే దుస్థితి ఏర్పడేదని ప్రయాణికులు వాపోయారు.
అత్యధిక కేసులు పరిష్కరించిన న్యాయ మూర్తిగా జస్టిస్ అమర్‌నాథ్ గౌడ్ రికార్డ్…ఎన్టీఆర్ కి ఏమి తెలుసు !..నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!..జార్జి బీఫార్మసీ కళాశాలలో ఘనంగా 20వ గ్రాడ్యుయేషన్ డే….వరుస బైక్ దొంగతనాలు మరియు గంజాయి అమ్మకమునకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు*. సెమీ క్రిస్మస్ సందర్భంగా పెద్ద దోర్నాల ఏబీఎం. యూత్ ఆధ్వర్యంలో క్రికెట్..డీజిల్ ట్యాంకు లీక్ అవుతున్న పట్టించుకోని ఆర్టీసీ సిబ్బంది..
Recent Posts