మణిపూర్ లో మళ్లీ మంటలు?..నారా రామ్మూర్తి నాయుడు పార్థీవదేహానికి సీఎం చంద్రబాబు నివాళి.. సజ్జల కబంధహస్తాల్లోనే వైసీపీ !.. శివుడికే …శఠగోపం (మహానంది)..లంచం తీసుకుంటూ సిబిఐకి చిక్కిన విశాఖ రైల్వే డిఆర్ఎం ..అక్రమ రేషన్ బియ్యం పట్టివేత (కొమరోలు)..కంభం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటంలో పూర్తి బాధ్యత తీసుకుంటా – ఏపీటీడీసీ డైరెక్టర్ స్వరూప దేవి.. ఘనంగా ఎమ్మెల్యే కందుల బర్త్ డే..

👉మణిపూర్ లో మళ్లీ మంటలు?*
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మరోసారి అట్టుడుకుతుంది మణిపూర్ లో హింస మళ్ళీ చెలరేగింది. ఇంఫాల్ లో ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల ఇళ్లపై కొందరు దుండగులు, దాడి చేశారు.
ఇళ్లకు నిప్పు పెట్టారు. దాడుల నేపథ్యంలో ఐదు జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. మణిపూర్ లోని పలు చోట్ల ఇంటర్నేట్ సేవలను నిలిపివేసింది. జిరిబామ్ జిల్లాలో అనుమా నాస్పదంగా మరణించిన ముగ్గురు వ్యక్తులకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనకారులు నిరసనలకు దిగారు.24గంటల్లో హంతకులను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సీఎం బిరెన్ సింగ్ అల్లుడి ఇళ్లతో సహా ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు నిరసనకారులు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత ఇళ్లకు నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. భద్రత దళాలు ఆందోళన కారులపై టియర్ గ్యాస్ ప్రయోగించి చెదరగొట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
👉నారా రామ్మూర్తి నాయుడు పార్థీవదేహానికి సీఎం చంద్రబాబు నివాళి..*లోకేశ్, బ్రాహ్మణి, మనవడుతో కలిసి నివాళులర్పించిన చంద్రబాబు.. *తమ్ముడి కుటుంబాన్ని ఓదార్చిన ముఖ్యమంత్రి..*మధ్యాహ్నం 3 గంటలకు రామ్మూర్తినాయుడి అంత్యక్రియలు..*అధికార లాంఛనాలతో రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు పూర్తి!*

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించారు.చంద్రబాబు నాయుడు తమ స్వగ్రామమైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలో తమ తల్లిదండ్రుల సమాధుల చెంతనే సోదరుడి అంత్యక్రియలు పూర్తిచేశారు.
రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో నారావారిపల్లికి తరలివచ్చారు. అన్ని పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు,చంద్రబాబు సన్నిహిత మిత్రులు,నందమూరి కుటుంబానికి చెందిన ప్రముఖులు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు హాజరయ్యారు.
రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల సమయంలో తన తండ్రిని చివరిసారి చూసుకుంటూ నారా రోహిత్ వెక్కివెక్కి ఏడవడం అందరినీ కంటతడి పెట్టించింది. మా నాన్న మా కోసం ఎంతో చేశారంటూ నారా రోహిత్ అభిప్రాయ పడ్డారు. ఎక్స్ ద్వారా నారా రోహిత్ విడుదల చేసిన ఓ ఎమోషనల్ నోట్ ఆయనకు తండ్రి మీదున్న ప్రేమకు సాక్ష్యంగా నిలిచింది.
సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అంతిమ నివాళి అర్పించారు.చంద్రబాబు స్వగ్రామమైన నారావారి పల్లికి రామ్మూర్తి నాయుడు పార్థివదేహాన్ని తీసుకొచ్చారు.అనంతరం అక్కడికి వివిధ పార్టీల నేతలు,సినీ,వ్యాపార,రాజకీయ రంగ ప్రముఖులు అక్కడికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. వారితోపాటు మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, నారా లోకేశ్, బ్రాహ్మణి,సినీ నటులు మోహన్ బాబు,మంచు మనోజ్, పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు నివాళి అర్పించారు.
👉శివుడికే …శఠగోపం 😱😱😱
*మహానంది:*▪️మహానంది ఆలయంలో ఉద్యోగులు చేతి వాటం..చూసీ చూడనట్లు వ్యవహరించిన ఆలయ పెద్దలు …కార్తీక మాస సమయంలో భారీ స్కాం.
నంద్యాల మహానంది ఆలయంలో టికెట్ల గోల్ మాల్.
ఒకే టికెట్ నెంబర్ పై పలు శీఘ్రదర్శన టికెట్లు.ఆలయ ఆదాయానికి గండి కొట్టిన అక్రమార్కులు కార్తీక మాస రద్దిని దృష్టిలో పెట్టుకొని దందాకు తెరలేపిన అక్రమార్కులు..
మహానంది ఆలయ పర్యవేక్షకుడు కాకర్ల శివ ఎస్పీకి ఫిర్యాదు వివరణ ఇచ్చిన ఆలయ ఈవో.
👉లంచం తీసుకుంటూ సిబిఐకి చిక్కిన విశాఖ రైల్వే డిఆర్ఎం
విశాఖ జిల్లా వాల్తేర్ రైల్వే డివిజన్ డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు చిక్కాడు. ప్రస్తుతం సెలవులో ఉన్న సౌరభ్ ప్రసాద్ లంచం డబ్బును ముంబైలో తన ఇంటికి వచ్చి ఇవ్వాలని సూచించాడు. దాంతో కాంట్రాక్టర్ ముంబై వెళ్లి రూ.25 లక్షలు లంచం ఇస్తుండగా, సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇదే క్రమంలో ఇటు విశాఖలోని డీఆర్ఎం బంగ్లాలో సీబీఐ శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ సీబీఐ సోదాలు జరిపింది. ఢిల్లీ, విశాఖకు చెందిన రెండు బృందాలు ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. లంచం తీసుకుంటూ దొరికిపోయిన డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.. స్టేట్ ఇంచార్జి రెహమాన్..
👉అక్రమ రేషన్ బియ్యం పట్టివేత*
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఇస్లాంపేటలో అక్రమంగా నిలువ ఉంచిన 25 బస్తాల రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఓ ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిలువ ఉంచారన్న సమాచారంతో తహశీల్దార్ భాగ్యలక్ష్మి ఎన్ఫోర్స్మెంట్ డిటి స్వాతిని రేషన్ బియ్యాన్ని సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో అక్కడికి చేరుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 25 బస్తాల రేషన్ బియ్యం (50 కేజీలవి) స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యం నిలువ ఉంచిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
👉సజ్జల కబంధహస్తాల్లోనే వైసీపీ !..
వైసీపీ లీడర్లు, క్యాడర్లు ఇక పూర్తిగా నమ్మకం వదిలేసుకోవచ్చు. ఎవరు అయితే తమ పార్టీని పాతాళంలో పడిపోవడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారో ఆయన చేతికే పార్టీని అప్పగించేశారు జగన్. ఆయన దగ్గరకు రాకుండా చేయండి మహా ప్రభో అని వేడుకుంటున్నా జగన్ మాత్రం పట్టించుకోవడంలేదు. తాజాగా ఆయనకే వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా పదవి ప్రకటించేశారు.
*మొత్తంగా ఆరుగురు రెడ్లు – ఒక్క బొత్స*
ఇంతకు ముందు ఆరుగురు రీజినల్ కోఆర్డినేటర్లను ప్రకటించారు. ఇందులో విజయసాయిరెడ్డి,సుబ్బారెడ్డి లాంటి ఐదుగురు రెడ్లు, ఒక్క బొత్స ఉన్నారు. వీరందరికి హెడ్డుగా సజ్జల ఉంటారు. అంటే ఈ ఆరేడుగురే మొత్తం పార్టీని నడిపిస్తారు. జగన్ చేసేదేమీ ఉండదు. ఆయనకు ఏ అంశంపైనా పూర్తి అవగాహన ఉండకుండా చేయాల్సిన రాజకీయాలు సజ్జల చేస్తూంటారు. సజ్జల ఏది చెబితే అది చేయాల్సిందే. ఇప్పుడు పార్టీలోనూ అదే పరిస్థితి.
👉*సజ్జలపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత*
సజ్జల రామకృష్ణారెడ్డిపై పార్టీలో ఎవరిలోనూ సానుకూలత లేదు. ఆయనకంటూ ఓ ప్రత్యేక వర్గం పార్టీలో ఉంది. వారెవరూ పార్టీ కోసం పని చేయరు. క్షేత్ర స్థాయిలో పని చేసేవారిని సజ్జల రామకృష్ణారెడ్డి… పార్టీ ద్వారా పని చేసి డబ్బు సంపాదించుకునే వ్యక్తులుగా చూస్తారు. ఎవరికైనా పదవులు అయినా మరొకటి అయినా చివరికి జగన్ ను కలవాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి చూపించే ప్రయారిటీ వేరుగా ఉంటుంది. ఆయనపై పార్టీలో 70 శాతం వ్యతిరేకత ఉంటుంది.ఆయన నీడ జగన్ పై పడకపోతే చాలని అనుకుంటూ ఉంటారు.కానీ జగన్ మాత్రం ఆయనను వదల్లేని పరిస్థితుల్లోకి పడిపోయారు.
*ఇక కోటరీదే పార్టీ*
ఇక వైసీపీ పార్టీ జగన్ చుట్టూ ఉన్న కోటరీలోకే వెళ్లిపోయి నట్లయింది.జగన్ వద్దకు వెళ్లేందుకు ఎవరికీ యాక్సెస్ ఉండదు.సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫీసు నుంచి వచ్చే ఆదేశాలతో పార్టీ నేతలు మీడియాతో మాట్లాడతారు. జగన్ దగ్గరకు కూడావెళ్లలేరు.మొత్తంగా జగన్ తన కోటరీని నమ్ముకోవద్దని వారిని దూరం పెట్టాలని క్యాడర్ కోరుకుంటు న్నారు.కానీ జగన్ మాత్రం తనకు క్యాడర్ కన్నా కోటరీనే ముఖ్యమని తేల్చారు.ఇక పార్టీ క్యాడర్,లీడర్లు తాము ఏం చేయాలో తేల్చుకునేందుకు రెడీ అయ్యే అవకాశం ఉంది*
👉కంభం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటంలో పూర్తి బాధ్యత తీసుకుంటా – ఏపీటీడీసీ డైరెక్టర్ గంటా స్వరూప దేవి*..
చారిత్రాత్మక కంభం చెరువును, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు,తాము పూర్తి బాధ్యతను తీసుకుంటున్నట్లు, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, గంటా స్వరూప దేవి పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం చెరువు కట్టమీద, శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన, బలిజల కార్తీక వనభోజనం మహోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ,కంభం చెరువును చూస్తుంటే తమకు, గోదావరి, పాపికొండలు గుర్తుకు వస్తున్నాయని, దీనిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే, ఈ ప్రాంతం వారికి ఎన్నో ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నూకసాని బాలాజీ, మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలి తదితరుల సహకారంతో, వచ్చే వనభోజనాలలోగా ఒక కొలిక్కి తీసుకువస్తానని ఆమె హామీ ఇచ్చారు. కంభం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి అనేది, ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అని తాము అర్థం చేసుకున్నామన్నారు.
బలిజ సంఘం అధ్యక్షులు తోట కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ కుప్ప రంగనాయకులు, అర్థవీడు మండలాధ్యక్షుడు మేడూరి వెంకటరావు, బేస్తవారిపేట మండల అభివృద్ధి అధికారి ఆకుల వెంకట రంగనాయకులు, కొమరోలు పంచాయతీ ఈవో, దేవరశెట్టి బ్రహ్మయ్య, కంభం మండల టిడిపి అధ్యక్షులు, తోట శ్రీనివాసరావు,గిద్దలూరు నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు, తోట మహాలక్ష్మి,ఇంకా కంభం,బేస్తవారిపేట,అర్ధవీడు మండలాలకు చెందిన,పలువురు సర్పంచులు,మాజీ సర్పంచులు పాల్గొన్నారు.. డివిజన్ ఇంచార్జి అస్లాం బేగ్
👉మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పుట్టినరోజు సందర్భంగా పొదిలిలో రాష్ట్ర కార్యదర్శి గుడిపూడి భాస్కర్ మాజీ ఎంపిటిసి మాధవి ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద భారీ కట్ చేశారు.కందుల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పొదిలి పట్టణ అధ్యక్షులు ముల్లా కుద్దూస్ డాక్టర్ ఇమాంస,ఆర్యవైశ్య నాయకులు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

👉మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పుట్టినరోజు సందర్భంగా బెల్లంకొండ కాలేజీ అధినేతలు బెల్లంకొండ శ్రీనివాస్ బెల్లంకొండ విజయలక్ష్మి శ్రీనివాసులు ఆధ్వర్యంలో బెల్లంకొండ నగర్ లోని వారి నివాసం వద్ద ముఖ్యఅతిథిగా కందుల రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. భారీ కట్ చేశారు కందుల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?