కిషన్ రెడ్డి టార్గెట్‌గా సీఎం రేవంత్ ఘాటు విమర్శలు..పరీక్ష పేరుతో వేల కోట్లు దోపిడీ చేస్తున్న నారాయణ యాజమాన్యాలు..ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ వేస్తా ..అబద్దపు హామీలు నమ్మి ఓట్లేస్తే భస్మాసుర హస్తం కాటేస్తుంది: ..మూసీ మే లూటో.. ఢిల్లీ మే బాటో.. రేవంత్ స‌ర్కార్‌పై కేటీఆర్ ధ్వ‌జం..గాంధీ ఆస్పత్రిలో ఆర్నెళ్ళుగా పని చేయని ఎక్స్-రే యంత్రాలు..మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ సీఐ.. కల్తీలో హైదరాబాద్ నెంబర్ వన్..తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ. ఢిల్లీ చేరుకున్న లగచర్ల బాధితులు..స్మార్ట్ మీటర్లకు. వ్యతిరేకంగా ఉద్యమిద్దాం.. ఏపీ రైతు సంఘం . ఖమ్మం మెడికల్ కాలేజీలో విద్యార్థికి గుండు కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్..మాజీ మంత్రి బాలినేనితో ఎం.ఎన్.రెడ్డి భేటీ..

👉బీజేపీ నేతల బస్తీ నిద్రపై స్పందించిన సీఎం రేవంత్‌
కిషన్ రెడ్డి టార్గెట్‌గా సీఎం రేవంత్ ఘాటు విమర్శలు
సబర్మతి ప్రక్షాళనపై కిషన్‌ ఎందుకు ప్రశ్నించలేదు
గుజరాత్ మోడల్ దేశానికి ఆదర్శమంటున్నారు
మూసీ ప్రాజెక్ట్‌కు మాత్రం ఎందుకు అడ్డుపడుతున్నారు
మూసీ ప్రాజెక్ట్‌ వద్దంటున్నారంటే..
గుజరాత్ మోడల్ ఫెయిల్ అయ్యిందా-సీఎం రేవంత్‌
మూసీని బాగుచేయడం బీజేపీకి ఇష్టం లేదు
మహారాష్ట్ర ప్రజలను మోసంచేసేలా షిండేను వాడుకున్నారు
తెలంగాణలో కిషన్‌రెడ్డిని వాడుకుంటున్నారు-రేవంత్

👉 పరీక్ష పేరుతో వేల కోట్లు దోపిడీ చేస్తున్న నారాయణ యాజమాన్యాల పై చర్యలు తీసుకోవాలి.
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యాదర్శి ఎద్దు రాహుల్, వీరపోగు రవి.
కడప జిల్లా లో ఉన్నటి వంటి కార్పొరేట్ నారాయణ పాఠశాల లు టాలెంట్ టెస్ట్ పరీక్ష పేరుతో వేల కోట్ల రూపాయలు వసూలు చేసి పరీక్ష నిర్వహిస్తుండ గా ఆదివారం అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, కార్యదర్శులు ఎద్దు రాహుల్, వీరపోగు రవి
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..
రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ విద్యాసంస్థలు టాలెంట్ టెస్ట్ అనే పేరుతో విద్యార్థులకి ఎక్కువ మార్కులు వస్తాయని వేల కోట్ల రూపాయలు వసూలు చేసి విద్యార్థులకిఅన్యాయం చేస్తున్నారు. తల్లి దండ్రులకి ఎక్కువ మార్కులు వస్తాయని,ప్రైజ్ లు ఇస్తామని, హైయెర్ క్లాస్ కి ప్రమోట్ చేస్తామని మయా మాటలు చెప్పి వసూలు చేస్తున్నారు. ఈ విదంగా జరుగుతుంటే జిల్లా లోని విద్యాశాఖ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోక పోవడం లో లోపం ఏమిటో?ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలియాల్సి ఉంది . ఇప్పటి కైనా కూడా నారాయణ విద్యాసంస్థల లై చర్యలు తీసుకోవాలని అని డిమాండ్ చేసారు. లేని పక్షం లో పెద్ద ఎత్తున ఆందోళన లు చెప్పడతాం అని అన్నారు. ఈ కార్యక్రమం లో మోహన్ లు పాల్గొన్నారు.
👉 ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఎస్తా ||*
*హైదరాబాద్:*▪️ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా.
▪️మీ అమ్మ, నాన్నను చంపేస్తా.
▪️హైదరాబాద్ హయత్ నగర్ లో యువతిపై లైంగిక వేధింపులు గతంలో విజయ్ తో స్నేహం చేసిన యువతి అనేక సార్లు యువతిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన విజయ్.
▪️విజయ్ చేతిలో మరో ముగ్గురు యువతులు కూడా మోసపోయారని చెప్పిన బాధితురాలు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో విజయ్ పై యువతి ఫిర్యాదు.
👉 *అబద్దపు హామీలు నమ్మి ఓట్లేస్తే భస్మాసుర హస్తం కాటేస్తుంది: కేటీఆర్‌*
సన్నాలకు బోనస్‌పై కాంగ్రెస్‌ సర్కార్‌ సవాలక్ష కొర్రీలు పెట్టడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దపు హామీలు నమ్మి ఓట్లేస్తే భస్మాసుర హస్తం కాటేస్తుందన్నారు. 420 హామీల కాంగ్రెస్‌ పాలనో రైతుభరోసా రూ.15 వేలు రాలేదని, రూ.2 లక్షల రుణమాఫీ కాలేదని, 24 గంటల ఉచిత కరెంటు మాయమైందని విమర్శించారు. పంటల కొనుగోళ్లు చెయ్యలేదని, వరి ధాన్యం క్వింటాలుకు బోనస్‌ రూ.500 ఇయ్యలేదన్నారు. జాగో తెలంగాణ అంటూ ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు
👉మూసీ మే లూటో.. ఢిల్లీ మే బాటో.. రేవంత్ స‌ర్కార్‌పై కేటీఆర్ ధ్వ‌జం*
మూసీ మే లూటో…ఢిల్లీ మే బాటో అనే విధంగా ఉన్నది కాంగ్రెస్ నేతల తీరు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ ఉండాలంటే ఢిల్లీకి మూటలు పంపాలి.. అందుకే మూసీలో డబ్బులు లూటీ చేసి, బ్యాగులు ఢిల్లీకి పంపుతున్నాడ‌ని కేటీఆర్ విమ‌ర్శించారు. రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు బీఆర్ఎస్‌లో చేరిన సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
రేవంత్ రెడ్డి పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటింది. ఢిల్లీ వాళ్లకు కోపం వస్తే పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియదు. రాహుల్ గాంధీకి డబ్బులు కావాలి. ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. వాళ్లకు డబ్బులు పంచాల్సిందే. అందుకే మూటలు పంపే పనిలో ఉన్నారని కేటీఆర్ విమ‌ర్శించారు.
తెలంగాణలో పదేళ్లలో భారీగా భూముల ధరలు పెరిగాయి. అప్పుడు మేము పారదర్శకంగా భూముల వేలం వేస్తే ఒక ఎకరాకు వందకోట్లు పోయింది. అప్పుడు కూడా అందులో స్కాం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశాడు. ఓఆర్ఆర్ లీజును ఒక సంస్థకు రూ. 7 వేల కోట్లకు ఇస్తే లక్ష కోట్లు వచ్చేదాన్ని రూ. 7 వేల కోట్లే ఇచ్చారన్నాడు. మరీ ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్ నువ్వే కదా? ఆ టెండర్ రద్దు చేసి రూ. లక్ష కోట్లు తీసుకురా. నేను కోకాపేట భూముల్లో అవినీతి చేశానని అన్నావ్. విచారణ జరుపు. తప్పు చేస్తే శిక్ష వేయ్ అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ స‌వాల్ విసిరారు
👉 గాంధీ ఆస్పత్రిలో ఆర్నెళ్ళుగా పని చేయని ఎక్స్-రే యంత్రాలు..
గాంధీ ఆస్పత్రిలో ఆర్నెళ్ళుగా పని చేయని ఎక్స్-రే యంత్రాలు
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 6 నెలలుగా ఎక్స్-రే యంత్రాలు పని చేయట్లేదు. ఆస్పత్రి మొత్తం 5 యంత్రాలు ఉండగా.. అందులో నాలుగు మూలన పడ్డాయి. ఒకే యంత్రం పనిచేస్తుండటంతో ఐపీ, ఓపీ విభాగాలకు చెందిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఓపీకి వచ్చే రోగులు బయట ఎక్స్రేలు తీయించుకుంటున్నారు. హైదరాబాద్ లో అర్ధరాత్రి ప్రమాదాలకు గురైన వారు దాదాపు 150 మంది వరకు అంబులెన్స్ ల్లో గాంధీకి వస్తుంటారు…
: TGSET 2024 ఫలితాలు విడుదల
TGSET 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(TGSET) 2024 ఫలితాలను ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగారంతో కలిసి ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల నిమిత్తం ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం 33,494 మంది దరఖాస్తు చేసుకోగా 26,294 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో 1,884 మంది అర్హత సాధించారు. ఫలితాల కోసం అభ్యర్థులు
👉 కల్తీలో హైదరాబాద్ నంబర్ 1..!!!😱😱😱
ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఐటీలో నెంబర్ 1, జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలో జాతీయ స్వచ్ఛ అవార్డులు పొందడంలో నెంబర్ 1..
బిర్యానీలకు ఫేమస్ అయిన హైదరాబాద్ బిర్యానీలో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్టు గుర్తింపు..
కల్తీలతో దెబ్బతింటున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్
19 నగరాల్లో సర్వే చేసి తెలిపిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో..గడిచిన రెండు నెలల వ్యవధిలో 84 శాతం ఫుడ్ పాయిజన్ కేసులు..సిటీ హోటల్స్‌లో కనీసం నాణ్యత పాటించడం లేదన్న క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 62 శాతం హోటల్స్‌లో కాలం చెల్లిన ఆహార పదార్థాలుసెంట్రల్ బ్యూరో సర్వేతో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్.
👉మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ సీఐ..*
గ్రూప్ 3 పరీక్ష రాసేందుకు జీడిమెట్ల గౌతమీ కాలేజీకి వెళ్లిన విద్యార్థిని..అయితే.. తన ఎగ్జామ్ సెంటర్ బాలానగర్ లోని గీతాంజలి కాలేజీ అని తెలుసుకుని ఏం చేయాలో తెలియని స్థితిలో.. విద్యార్థిని..తమ వాహనంలో విద్యార్థిని పరీక్ష కేంద్రానికి చేర్చిన జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్..సకాలంలో విద్యార్థిని ఎగ్జామ్ సెంటర్ కు చేర్చిన సీఐ శ్రీనివాస్ పై ప్రశంసలు
👉 తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ..
జీవో 41 ద్వారా కొత్త ఈవీ పాలసీ అమలు..
ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయిపు..
హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నాం.. ఢిల్లీలా హైదరాబాద్‌లో కాలుష్యం సమస్య తలెత్తకూడదు. -మంత్రి పొన్నం ప్రభాకర్
👉ఢిల్లీకి చేరుకున్న లగచర్ల బాధితులు..*
*రేపు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు..*
ఢిల్లీకి చేరుకున్న లగచర్ల బాధితులు రేపు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు లగచర్ల ఫార్మా బాధితులు తమ న్యాయ పోరాటాన్ని ఉధృతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అరాచక కాండపై ఇప్పటికే రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన బాధితులు.. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే వారు ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి ఆదివారం ఉదయం వారు ఢిల్లీ వెళ్లారు. సోమవారం నాడు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలవనున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి సర్కార్‌ పోలీసులపై ఫిర్యాదు చేయనున్నారు.
👉 ఖమ్మం మెడికల్ కాలేజీలో విద్యార్థికి గుండు కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్
ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదివే ములుగుకు చెందిన ఓ విద్యార్థి చైనా వారిలా కటింగ్ చేయించుకొని కాలేజీకి వెళ్ళాడు. అది చూసి సెకండ్ ఇయర్ విద్యార్థులు మెడికల్ కాలేజీలో చదువుతూ ఇలా కటింగ్ చేపించొద్దని చెప్పడంతో, ఆ విద్యార్థి సెలూన్‌కు వెళ్లి జుట్టు ట్రిమ్ చేయించుకున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్(సర్జన్) ఆగ్రహించి విద్యార్థిని సెలూన్‌కు తీసుకెళ్లి ఏకంగా గుండు గీయించాడు.. ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్ కావడంతో, ర్యాగింగ్ నిర్ములించాల్సిన ప్రొఫెసరే, ర్యాగింగ్ చేయడమేంటని విమర్శలు వచ్చాయి.
విద్యార్థి ఫిర్యాదుతో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను హాస్టల్ విధుల నుంచి తప్పించామని.. ఈ ఘటనను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకెళ్లి విచారణకు ఫోర్‌మెన్ కమిటీని నియమించామని ప్రొఫెసర్ తెలిపారు.
👉స్మార్ట్ మీటర్లకు. వ్యతిరేకంగా ఉద్యమిద్దాం. ఏపీ రైతు సంఘం .
నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో స్మార్ట్ మీటర్లను ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం అంతే కోట వీధిలోని యూనియన్ బ్యాంకు సమీపంలోని కాంప్లెక్స లో బిగించిన స్మార్ట్ మీటర్లను పరిశీలించడం జరిగింది. అనంతరం ఏపీ రైతు సంఘం జిల్లా సమితి సభ్యులు పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. కూటమి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2024 ఎన్నికల కంటే ముందు వైఎస్సార్ ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల బిగియడానికి సిద్ధంగా ఉన్న సమయంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తే అడ్డుకుంటామని అవసరమైతే మీటర్లను తగలబెడతామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు ఈరోజు అధికారంలోకి వచ్చిన ఐదు నెలలకే. ప్రజల పైన వినియోగదారుల పైన స్మార్ట్ మీటర్లు బిగించడానికి సిద్ధంగా ఉందని దాదాపు 6 72 కోట్లు దీనికి అదనంగా 12 వేల కోట్లు మొత్తం 18 వేల కోట్ల రూపాయలు ప్రజల పైన భారం వేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎన్నికల హామీలో భాగంగా మేము అధికారంలోకి వస్తే 30% తగ్గిస్తామని ఇప్పుడు గెలిచిన వెంటనే హామీని తుంగలో తొక్కి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు ఉమ్మడి రాష్ట్రంలోనే 2000 సంవత్సరంలో 9,000 కోట్లు పెంచిన సందర్భంగా వామపక్షాలు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి చంద్రబాబును గద్దె దించి ముగ్గురు అమరవీరుల ప్రాణ త్యాగాల ఫలితంగా ఇంతవరకు చార్జీలు పెంచలేదన్నారు నేడు మళ్ళీ స్మార్ట్ మీటర్ల పేరుతో ఈరోజు మీటర్లు బియ్యడానికి ప్రయత్నిస్తున్నారని దీనివలన రైతులకు ఉచిత విద్యుత్తు మంగళం పాడేదానికి ప్రయత్నం చేస్తున్నారని ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్తు అందని ద్రాక్ష లాగా. మారిందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ఇచ్చినటువంటి హామీలో భాగంగా స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరో విద్యుత్తు పోరాటం నిర్వహించాల్సి వస్తుందని అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మీటర్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేకపోతే వామపక్ష రైతు సంఘాలతో ప్రజలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కాటేపోగు స్వామ న్న. పాల్గొన్నారు
👉ఢిల్లీ రవాణా శాఖ మంత్రి రాజీనామా?*
న్యూ ఢిల్లీ:నవంబర్ 17
దిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోత్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కేజ్రీవాల్‌ కు లేఖ పంపారు. దిల్లీ ప్రభుత్వం అసంపూర్తి వాగ్దానాలు చేస్తోందని.. రాష్ట్రంలో పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోం దని కైలాష్ గహ్లోత్‌ ఈ లేఖలో ఆరోపించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే తన రాజీనామాకు కారణమని పేర్కొన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. తన రాజీనామాలో… యమునాను శుభ్రపర చడం, కేజ్రీవాల్ బంగ్లా నిర్మాణం అంశాన్ని కూడా లేవనెత్తారు. గత ఎన్నికల్లో యమునా నదిని శుభ్రం చేస్తామని హామీ ఇచ్చామని, అయితే యమునా నదిని శుభ్రం చేయలేకపోయామని గెహ్లాట్ పేర్కొన్నారు.
ఢిల్లీ ప్రభుత్వం కేంద్రంపై పోరాటంలో ఎక్కువ సమయం గడిపితే ఢిల్లీకి నిజమైన పురోగతి ఉండదని ఇప్పుడు స్పష్టమైంది. ఆప్ నుంచి విడిపోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.” అని కైలాష్ గెహ్లాట్ లేఖలో రాసుకొచ్చారు.
కేజ్రీవాల్‌కు మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. మంచి రాజకీయ ప్రయాణానికి తోడ్పాటును అందించిన తన పార్టీ సహచరులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా.. కైలాష్ గెహ్లాట్ రాజీనామాను ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఆమోదించారు.
👉ఖమ్మం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..
మెడికల్ విద్యార్థి హెయిర్ స్టయిల్ పై తలెత్తిన వివాదం ..
విద్యార్థి ని ర్యాగింగ్ చేసిన తోటి విద్యార్థులు
మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ ఆఫీసర్ తీరుపై ఆగ్రహం
ఉన్నతాధికారులకు తెలియడంతో విచారణకు ఆదేశం
యాంటి ర్యాగింగ్ ఆఫీసర్ ను తొలగించిన ప్రిన్సిపల్
ఘటన పై విచారణకు త్రిసభ్య కమిటీ
నియామకం..
👉ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం.
రాత్రి ఉట్నూరు మండలంలోని వంకతుమ్మ అటవీ ప్రాంతంలో చాహకటి జంగు అనే రైతు యొక్క ఎద్దు పై దాడి చేసిన పెద్దపులి.
ఉట్నూర్ మండలంలోని చీమనాయక్ తండ, నాగపూర్ సరిహద్దు ప్రాంతంలో కనిపించిన పులి పాదముద్రలు.
సమీప గ్రామాల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పిస్తున్న అటవీశాఖ అధికారులు.
నార్నూర్ లేదా జైనూర్ మండలంలోకి ప్రవేశించే అవకాశం ఉందనీ సమాచారం.
👉గ్రూప్ -3 పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ, కలెక్టర్*
గద్వాల (నవంబర్ 17): జిల్లా కేంద్రంలో జరుగుతున్న గ్రూప్ III పరీక్షా కేంద్రాలను ఆదివారం జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు, కలెక్టర్ బీఎం సంతోష్ తోకలిసి పరిశీలించారు.
ఈరోజు గ్రూప్ III రాత పరీక్ష కు జరుగుతున్న దృష్ట్వా జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ తో కలిసి జిల్లా కేంద్రంలో పరీక్షా కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. పరీక్షా సరళిని, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ను పరిశీలించారు. జిల్లా కేంద్రంలో గల ప్రాక్టిసింగ్ హై స్కూల్, SVM డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రాలను సందర్శించారు.
పరీక్షా జరుగుతున్న తీరు , అభ్యర్థుల హాజరు, తదితర వివరాలు పరీక్ష కేంద్ర సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
వీరి వెంట డి .ఎస్పి సత్యనారాయణ, పోలీస్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
👉గంజాయి డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలు అక్రమ రవాణా, నిల్వలను గుర్తించేందుకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఐపీఎస్ ఆదేశాలు మేరకు ఆదివారం నిర్వహించిన జిల్లాలో సోంపేట సర్కిల్ పరిధిలోని సీఐ మంగారాజు, ఎస్ఐ పారి నాయిడు వారి పరిధిలో ఉన్న సాంపేట రైల్వే స్టేషన్ లో పోలీసు జాగిలంతో తనిఖీలు నిర్వహించి అనుమానం ఉన్న ప్రయాణికులు లగేజ్ బ్యాగాలు, దుకాణాలు తనిఖీలు నిర్వహించి, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు అక్రమ రవాణాను అరికట్టే చర్యలు చేపట్టారు.*
👉హైపర్సోనిక్ మిస్సెల్ ప్రయోగం సక్సెస్*
భారత ఆర్మీ కోసం కొత్తగా రూపొందించిన లాంగ్ రేంజ్
హైపర్సోనిక్ మిస్సైల్ను DRDO విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి నిన్న దీన్ని ప్రయోగించారు. ఈ హైపర్ సోనిక్ మిస్సైల్ 1500 KMకు పైగా దూరానికి పేలోడ్లను మోసుకెళ్ల గలదు. HYDలోని అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్సులో దీన్ని రూపొందించారు. ఇది హిస్టారికల్ మూమెంట్ అని, సైంటిస్టులను అందరినీ అభినందిస్తున్నానని
రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.
👉 మాజీ మంత్రి బాలినేనితో ఎం.ఎన్.రెడ్డి భేటీ..*
హైదరాబాద్..మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా జనసేన నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డిని హైదరాబాదు లోని ఆయన నివాసంలో ఆదివారం న ఎం.ఎన్.రెడ్డి మర్యాదపూర్వకంగా కలసి దుశ్యాలువతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఇటీవల జిల్లాలో జరిగిన పరిణామాలు,భవిష్యత్తులో పార్టీలో చేపట్టబోయే కార్యక్రమాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఒంగోలు నందు పార్టీ చేరికలపై చర్చించినట్టు సమాచారం.ఈ భేటీ లో ఎమ్.ఎన్ రెడ్డి తో పాటు,షేక్ అన్వర్ హుస్సేన్, గాయం మురళి కృష్ణారెడ్డి,ఈశ్వర్,సత్యనారాయణ తదితరులు ఉన్నారు..

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?