మోదీజీ ఎరుపంటే ఎందుకంత భ‌యం?..మణిపూర్‌లో జరిగినట్టే లగచర్లలో జరుగుతోంది-కేటీఆర్ .. ఆసుపత్రిలో చిందులేసిన వైద్యులు(యూపీ)..లగచర్ల కలెక్టర్‌పై దాడి ఘటనలో డీఎస్పీపై బదిలీ వేటు..పోలీసుల అదుపులో బీఆర్ఎస్ సోషల్ మీడియా డైరెక్టర్..గురుకుల వసతి గృహంలో 25 మంది విద్యార్థులకు అస్వస్థత (నెల్లూరు జిల్లా)..రౌడీ ముకలతో భూ కబ్జా చేస్తున్న – గోడౌన్ యజమాని (తిరుపతి)..పోలవరం జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన ఏ పీ ఈ ఆర్ సి చైర్మన్..మ్యాపుల ఆధారంగా డ్రైన్లు శుభ్రపరచండి *విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు..స్కూల్ విద్యార్థుల మధ్య ఘర్షణ..తోటి విద్యార్థిని హత్య చేసి బావిలో పడేసిన విద్యార్థులు..విద్యార్థునిల జడలు కత్తిరించిన ఉపాధ్యాయులు.. హైదరాబాద్‌లో మైనర్ బాలిక దారుణ హత్య..అపోహలు సృష్టిస్తున్న ప్రతిపక్షాలు..సమర్థవంతంగా దీపం-2 పథకం అమలు-మంత్రి నాదెండ్ల మనోహర్..

👉మోదీజీ ఎరుపంటే ఎందుకంత భ‌యం?*
మీ ర‌క్తం ఎరుపే క‌దా
మహారాష్ట్ర ఎన్నికల చివ‌రి రోజు ప్రచారంలో మంత్రి సీత‌క్క విస్తృత ప్ర‌చారం..
మహారాష్ట్ర ఎన్నికల‌ ప్రచారంలో భాగంగా ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాకు పొరుగున ఉన్న బ‌ల్లార్షా, చంద్రపూర్ , రజురా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి డాక్ట‌ర్ ధ‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క సోమ‌వారం నాడు
👉గుంటూరులో దారుణం*..
*స్కూల్ విద్యార్థుల మధ్య ఘర్షణ. తోటి విద్యార్థిని హత్య చేసి బావిలో పడేసిన విద్యార్థులు..
తొమ్మిదవ తరగతి చదువుతున్న షేక్ సమీర్ కు ఇతర విద్యార్థుల మధ్య సెక్షన్ ల వివాదంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ..గత నెల అక్టోబర్ 21న ఈతకు తీసుకువెళ్లి కొట్టి చంపి బావిలో పడేసినట్లు సమాచారం..
బాలుడు మృతదేహాన్ని తీసి తల్లిదండ్రులకు అప్పగించిన అధికారులు ..నెలరోజులైనా ఎటువంటి చర్యలు తీసుకుపోవడంతో వెలుగు చూపించిన ఘటన..తమకు న్యాయం చేసి తమ కుమారుడుని చంపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న మృతుడు తల్లిదండ్రులు
👉 అల్లూరు జిల్లా *23 మంది విద్యార్థునిల జడలు కత్తిరించిన ఉపాధ్యాయులు..
జుట్టు విరబోసుకుని తిరుగుతున్నారనే కారణంతో 23 మంది విద్యార్ధినుల జుట్టు కత్తిరించిన ఉపాధ్యాయులు.
అల్లూరి జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల కాలేజీలో చోటుచేసుకున్న అమానుష ఘటన..
కార్తీక పౌర్ణమి రోజున తల స్నానం చేసి జుట్టు విరబోసుకుని రావడంతో.. పనిష్మెంట్‌లో భాగంగా జుట్టు కట్ చేసిన ఉపాధ్యాయులు.
ఆ 23 మంది విద్యార్ధినుల ఉదయం ప్రతిజ్ఞకు కూడా హాజరు కాలేదని.. అందుకే పనిష్మెంట్ ఇచ్చామంటున్న ఉపాధ్యాయులు దీంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమయిన వారి తీరుపై తల్లిదండ్రులు
👉 హైదరాబాద్‌లో మైనర్ బాలిక దారుణ హత్య
మియాపూర్ – టేక్ అంజయ్య నగర్‌కి చెందిన ఓ (17) యువతి నెల 8న అదృశ్యం
తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ పరిసర ప్రాంతాలలో ఐశ్వర్య డెడ్ బాడీ గుర్తించిన పోలీసులు
అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చని అనుమానం
ఐశ్వర్యకు ఇంస్టాగ్రాంలో పరిచయమైన ఉప్పుగూడకు చెందిన యువకుడు హత్య చేసి ఉంటాడని పోలీసుల అనుమానం.
👉 ఆలస్యంగా వస్తే … జట్టు కత్తిరిస్తా … అధికారి పై చర్యలు శూన్యం😯😯😯
*విశాఖపట్నం ,జి. మాడుగల:*
▪️పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించిన కేజీబీవీ హాస్టల్ ఇంచార్జ్.
▪️విశాఖపట్నం – జి. మాడుగల కేంద్రంలోని కేజీబీవీలో పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని హాస్టల్ ఇంచార్జ్ ప్రసన్న కుమారి ఏకంగా 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించింది.
▪️పాఠశాలకు ఆలస్యంగా వచ్చనంత మాత్రాన జట్టు కత్తిరించడం ఏంటని విద్యార్థినుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
▪️ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఇంచార్జ్ ప్రసన్న కుమారిని విధుల నుంచి వెంటనే తప్పించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.
👉 మణిపూర్‌లో జరిగినట్టే లగచర్లలో జరుగుతోంది-కేటీఆర్
గిరిజనుల భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు
అణగారిన వర్గాల గురించి రాహుల్ మాట్లాడుతున్నారు
మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో..
ఇలా ఎందుకు జరుగుతోంది-కేటీఆర్
ఈ అంశాన్ని బీఆర్ఎస్ తరపున రాజ్యసభలో లేవనెత్తుతాం
రాహుల్ గాంధీ ఇప్పటికైనా ఈ అంశాన్ని పట్టించుకోవాలి
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కొడంగల్‌లో దౌర్జన్యం
-మాజీ మంత్రి కేటీఆర్
👉అమరావతి*
విష ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు
నేటికి 40 లక్షల మంది గ్యాస్ బుకింగ్
30 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీ
కావాలనే దీపం-2 పథకంపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్న ప్రతిపక్షాలు..సమర్థవంతంగా దీపం-2 పథకం అమలు-మంత్రి నాదెండ్ల మనోహర్..
అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు..లబ్ధిదారుల జీవితాల్లో కూటమి ప్రభుత్వం దీపం-2 పథకం ద్వారా వెలుగులు నింపాలని చూస్తుంటే..కొందరు మాత్రం అపోహల ద్వారా ప్రజల జీవితాలు అంధకారంలో మగ్గేలా చేస్తున్నారు.
సోమవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం
సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు దీపావళి కానుకగా దీపం-2-పథకం 31 అక్టోబర్, 2024 న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శ్రీకాకుళం జిల్లాలో దీపం పథకాన్ని ప్రారంభించారు.
ఏపీలో సూపర్ సిక్స్ హామీ నిలబెట్టుకుంటున్న కూటమి సర్కార్. రాష్ట్రంలో ఉన్న ఒక కోటి 55 లక్షల మంది గ్యాస్ కార్డుదారులకు అర్హత ఉండేవిధంగా ఈ పథకం రూపొందించడం జరిగింది.
దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం …మొదటి విడతకు అయ్యే ఖర్చు రూ.894 కోట్ల మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు అందజేయడం జరిగింది.
దీపం -2 పధకం క్రింద అర్హులైన కుటుంబాలు వారు తమ మొదటి సిలిండర్ పొందడం కోసం అక్టోబర్ 29వ తేదీ నుంచి 31 మార్చి 2025 వరకూ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఉచిత సిలిండర్ కావాల్సిన వారు సాధారణ పద్ధతిలో ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల లోపు గ్యాస్ డెలివరీ ఇస్తారు.ఆ తర్వాత సిలెండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో తిరిగి జమ చేస్తారు.*
*ఒక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తారు. అయితే వీటిని ఒకేసారి కాకుండా నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తారు.*
ప్రతి ఏడాది ఏప్రిల్ – జూలై (01), ఆగష్టు –నవంబర్ (01), డిసెంబర్ –మార్చి (01) మధ్య మూడో సిలెండర్ బుక్ చేసుకోవచ్చు
*ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలు*
1)ఎల్.పి.జి.కనెక్షన్ కలిగి ఉండటం
2) రైస్ కార్డ్,
3) చెల్లుబాటు అయ్యే ఆథార్ కార్డు
4). ఆధార్ కార్డుతో రైస్ కార్డుతో అనుసంధానం అయి ఉండాలి…
*ఎటువంటి సమాచారం లోపం ఉన్న టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు …*
👉 మ్యాపుల ఆధారంగా డ్రైన్లు శుభ్రపరచండి
*విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు*
మ్యాప్ ల ఆధారంగా డ్రైన్ లు పరిశుభ్రపరచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా 9వ డివిజన్ బెంజ్ సర్కిల్ నుండి స్క్రూ బ్రిడ్జ్ వరకు సర్వీస్ రోడ్లో కమిషనర్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సైడ్ డ్రైన్లో పూడికలను ఎప్పటికప్పుడు తీసివేయాలని, వర్షపు నీటి నిలువలు రోడ్డుపైన నిలువకుండా ఉండేందుకు సైడ్ కాలవలను పరిశుభ్రంగా ఉంచాలని, డ్రైన్ క్రాసింగ్ ఉన్నచోట ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిశుభ్రపరచాలని, ప్రతి డివిజన్లో డ్రైన్ లను మ్యాప్ల ఆధారంగా పరిశుభ్రపరుస్తూ ఒక డివిజన్లో ఉన్న డ్రైన్లు అన్నిటినీ పరిశుభ్రపరిచేటట్టు చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేసుకుంటూ ఎప్పటికప్పుడు వ్యర్ధాలను తీసివేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్. శ్రీనాథ్ రెడ్డి, ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్ (ప్రాజెక్ట్స్) పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జి సామ్రాజ్యం, వెంకటేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
👉పోలవరం జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన ఏ పీ ఈ ఆర్ సి చైర్మన్*
*పనుల పురోగతిని వివరించిన ఏ పీ జెన్ కో డైరెక్టర్ సుజయ కుమార్* *అంగలూరు/పోలవరం,
పోలవరం జల విద్యుత్ కేంద్రాన్ని సోమవారం ఆంధ్ర ప్రదేశ్ ప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఇంచార్జి చైర్మన్ ఠాకూర్ రామ సింగ్ సందర్శించారు. ఆయన వెంట కమిషన్ సభ్యుడు పీ. వెంకట రామ రెడ్డి ఉన్నారు. పోలవరం బహుళార్ధసాధక ప్రాజెక్ట్ నుంచి జల విద్యుత్ కేంద్రానికి నీటిని తరలించేందుకు నిర్మిస్తున్న కాలువ, విద్యుత్ కేంద్రం సర్వీస్ బే, ఇతర నిర్మాణాలను వారు పరిశీలించారు. ఏ పీ ఈ ఆర్ సి చైర్మన్ ఠాకూర్ రామ సింగ్ కు జల విద్యుత్ కేంద్రం పనుల పురోగతిని ఏ పీ జెన్ కో హైడెల్ విభాగం డైరెక్టర్ సుజయ కుమార్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు అంగర వివరించారు. పోలవరం జల విద్యుత్ కేంద్రాన్ని నిర్దేశిత సమయానికి పూర్తి చేయాల్సిందిగా నిర్మాణ సంస్థ ఎం ఈ ఐ ఎల్ ను కోరామని, సంస్థ అందుకు అనుగుణంగా పనులు చేస్తోందని వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రణాళికా బద్దంగా సివిల్, ఎలక్ట్రో మెకానికల్ పనులు చేస్తున్నామని ఎం ఈ ఐ ఎల్ సి ఓ ఓ సతీష్ బాబు ఏ పీ ఈ ఆర్ సి చైర్మన్ కు వివరించారు. ప్రాజెక్ట్ పనుల పట్ల చైర్మన్ సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు తెలిపారు. చైర్మన్ వెంట ఏ పీ జెన్ కో చీఫ్ ఇంజనీర్ సివిల్ వై కోటేశ్వర రావు, ఎస్ ఈ లు రామభద్ర రాజు, రవీంద్ర రెడ్డి, చంద్రశేఖర్, ఈ ఈ లు హనుమ, ప్రభాకర రావు, భీమాధాన రావు, సీతారాం, వ్యాప్కోస్ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ కొలగాని మూర్తి, . పోలవరం హైడెల్ ప్రాజెక్ట్ ఎం ఈ ఐ ఎల్ జనరల్ మేనేజర్ శంకర్ తదితరులు ఉన్నారు.
👉రౌడీ ముకలతో భూ కబ్జా చేస్తున్న – గోడౌన్ యజమాని*
తిరుపతి జిల్లా వడమల పేట మండలం తిరుమన్యం గ్రామం లో రోసిరెడ్డి అనే రైతు తైలం చెట్లు సాగు చేసినారు. తన పంట చేతికి వస్తుందని ఆశపడ్డాడు ఇంతలో కాల యముడుగా గోడం యజమాని T. ఈశ్వర ప్రకాష్ అతని భార్య హేమలత కొంతమంది రౌడీ మూకులను పంపించి దౌర్జన్యం చేసి, కర్రలతో కొట్టి రైతును తన భార్యను పొలం నుంచి వెళ్లగొట్టారు. ఊరివాళ్లు పోలీస్ వారికి సమాచారం ఇవ్వగా పోలీస్ వారు వచ్చి రౌడీ మూకలను తరిమికొట్టారు. రైతును వివరణ కోరగా గోడం యజమాని పలు విధములుగా తన పొలమును నాకు అమ్మాలని లేకపోతే మీరు ఇలానే ఇబ్బందులు పడతారని నా గురించి నీకు తెలియదు నేను ఎటువంటి వాడని రాయచోటికి వచ్చి అడిగి చూడు నాపై ఎన్ని కేసులు అయినా పెట్టుకో ఎవరు వస్తారు చూస్తాను అని అన్నారు. ఈ వృద్ధ దంపతులు ఏ క్షణాన ఏం జరుగుతుందో అని ఈ వృద్ధ దంపతులు బిక్కుబిక్కుమని ఏడుస్తున్నారు. కావున ఈ వృద్ధ దంపతులకు ప్రభుత్వ పెద్దలు పోలీస్ శాఖ సహకరించి వారి భూమిని కాపాడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
👉నెల్లూరు జిల్లా… కొడవలూరు మండలం*
*💥నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గురుకుల వసతి గృహంలో 25 మంది విద్యార్థులకు అస్వస్థత…
వాంతులు విరోచనాలతో అనారోగ్యం పాలైన 25 మంది విద్యార్థులు…
విద్యార్థులకు అస్వస్థ సమాచారం అందుకున్న కోవూరు ఎమ్మెల్యే వేమి రెడ్డి ప్రశాంత్ రెడ్డి వైద్య బృందాన్ని గురుకుల వస్తు గృహానికి పంపారు..
👉ఆస్పత్రిలో చిందులేసిన వైద్యులు..😱😱😱
యూపీలోని ఝాన్సీ ఆస్పత్రి ప్రమాదంలో 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువకముందే వారణాసి ఆసుపత్రిలో రోగులను వదిలేసి సిబ్బంది డాన్స్ చేసిన వీడియో వైరలవుతోంది. ఓ ప్రమోషన్ పార్టీలో నర్సులు, డాక్టర్లు సాంగ్స్ పెట్టుకొని ఆస్పత్రిలోనే చిందులేశారు. పేషెంట్స్ ఉన్న చోట శబ్దాలు చేస్తూ ఇలా డాన్సులేయడంపై విమర్శలొస్తున్నాయి. అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
👉పోలీసుల అదుపులో బీఆర్ఎస్ సోషల్ మీడియా డైరెక్టర్..*
హైదరాబాద్: నవంబర్ 18
బీఆర్ఎస్ సోషల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ ను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..
2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ గా ఆయన పనిచేశారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 5న కూడా ఆయనను హైద్రా బాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించి విడిచిపెట్టారు.
ఆసిఫాబాద్ జిల్లా జైనూరు ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారని అభియోగాలు రావడంతో ఆయనను అప్పట్లో విచారించారు.
👉 రోడ్డుపై దొరికిన రెండు లక్షలు పోలీసులకు అందజేసి.. నిజాయితీ చాటుకున్న వ్యక్తి
లాలాపేటకు చెందిన ముద్దం సతీష్ యాదవ్ అనే వ్యక్తి సోమవారం ఉదయం లాల పేటలోని అయ్యప్ప స్వామి దేవాలయం మీదుగా నడుచుకుంటూ వెళుతుండగా రోడ్డు మార్గంలో రెండు లక్షల రూపాయలు కనబడ్డాయి.
వెంటనే లాలాగూడ పోలీసులను సంప్రదించి సదరు రెండు లక్షల రూపాయలు పోలీసులకు అప్పగించి తన నిజాయితీ చాటుకున్నాడు….
👉లగచర్ల కలెక్టర్‌పై దాడి ఘటనలో డీఎస్పీపై బదిలీ వేటు…*పరిగి డీఎస్సీ కరుణసాగర్‌ రెడ్డిని డీజీపీ ఆఫీస్‌కి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు… *కలెక్టర్‌పై దాడి నేపథ్యంలో డీఎస్పీని బదిలీ చేస్తూ ఉన్నతాధికారుల చర్యలు.
*పరిగి కొత్త DSPగా శ్రీనివాస్‌ నియామకం.*

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?