👉కేటీఆర్ జైలుకే.. మనసులో మాట బయటపెట్టిన సీఎ రేవంత్* ఘు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌నుద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో వేములవాడలో నిర్వహించిన ప్రజా విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. మిడ్‌మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. కొన్నేళ్లుగా వాయిదా పడుతూవస్తున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. తమ మంత్రులు ఎప్పటికప్పుడు ప్రాజెక్టులపై సమీక్షిస్తారని చెప్పారు. ప్రజలకు మంచి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. అదే సమయంలో కేటీఆర్ లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అభివృద్ధి ప్రాజెక్టుల కోసం సేకరించే భూమికి రైతులకు రెండు రెట్ల పరిహారం ఇస్తామన్నారు. భూములు తీసుకుని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలా పరిహారం ఇవ్వకుండా తప్పించుకోమన్నారు. భూమి మార్కెట్ ధర రూ.10 లక్షలు ఉంటే రూ.30 లక్షల పరిహారం ఇస్తామన్నారు. నష్ట పరిహారం ఎక్కువ ఇస్తే భూయజమానులు తమ భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తారన్నారు. పరిశ్రమలు రావాలంటే భూసేకరణ చేయాల్సిందేనన్నారు. తెలంగాణకు పరిశ్రమలు వద్దని బీఆర్‌ఎస్ కోరుకుంటుందా అని సీఎం ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉంటూ కుట్రలు చేశారంటూ కేటీఆర్‌పై రేవంత్ మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సక్రమంగా పరిహారం ఇవ్వలేదన్నారు. కుట్రలు చేసిన కేటీఆర్ ఊచలు లెక్కపెడతారంటూ హెచ్చరించారు. కేటీఆర్ చేసిన కుట్రలను గమనిస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు. ఎంత ఎగురుతావో ఎగురంటూ చురకలంటించారు. కేటీఆర్ తన వైఖరి మార్చుకోవాలని రేవంత్ పరోక్షంగా సూచించారు.
కేటీఆర్ vs రేవంత్..
తెలంగాణ రాజకీయం గత కొద్దిరోజులుగా రేవంత్ వర్సెస్ కేటీఆర్‌గా నడుస్తోంది. ఓవైపు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, అసమర్థ పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే.. అధికారంలోకి వచ్చిన ఏడాదవుతున్నా సీఎం రేవంత్‌కు పాలన చేతకావడంలేదని బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది. రేవంత్ రెడ్డిని బీఆర్‌ఎస్ టార్గెట్ చేయగా.. కేటీఆర్‌ను కాంగ్రెస్ టార్గెట్ చేస్తోంది. రెండు పార్టీల కంటే ఇద్దరు వ్యక్తుల మధ్య వార్‌గా తెలంగాణ రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఊచలు లెక్కపెట్టాల్సి వస్తోందంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి..
👉గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు!!!
న్యూయార్క్: బిలియన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై న్యూయార్క్‌లో కేసు నమోదైంది. గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురు ఇందులో నిందితులుగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీరు 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్లు లంచాలు చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా రుణాలు, బాండ్లను సేకరించినట్లు అధికారులు అభియోగాలు మోపారు.
👉నడిరోడ్డు పై లాయర్ దారుణ హత్య..చిత్తూరు జిల్లా..
తమిళనాడు.. కృష్ణగిరి జిల్లా హోసూరులో దారుణ ఘటన..నడిరోడ్డు పై లాయర్ దారుణ హత్య..
లాయర్ కన్నన్ ను కొడవలితో నరికి చంపిన ఆనంద్ అనే వ్యక్తి..ఆనంద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది..
👉దారుణం మళ్లీ మళ్లీ అదే నిర్లక్ష్యం.. పిల్లల ప్రాణాలు అంటే లెక్క లేదా???
విద్యార్దులకు ఆసుపత్రిలో ఇచ్చిన టిఫిన్లో సైతం పురుగులు..
నారాయణపేట మాగనూర్ హైస్కూల్ ఫుడ్‌పాయిజన్ ఘటనలోని విద్యార్థులను మహబూబ్ నగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే..ఈరోజు ఉదయం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇచ్చిన ఉప్మా టిఫిన్లో సైతం పురుగులు వచ్చాయి.అది చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బందితో గొడవకు దిగారు.
👉ఎమ్మెల్యేలను గెలిపించుకోలేని జగన్.. ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గుచేటు: షర్మిల*
అసెంబ్లీకి వెళ్లని జగన్ కు ఎమ్మెల్యే పదవి ఎందుకని ప్రశ్నించిన షర్మిల..
– కడప్ స్టీల్ ప్లాంట్ కు జగన్, అవినాశ్ ఏం చేశారని ప్రశ్న
– స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలకే పరిమితమయిందని వ్యాఖ్య
తన అన్న, వైసీపీ అధినేత జగన్ పై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష హోదాకు అవసరమైనంత మంది ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకోలేని జగన్… ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గుచేటని అన్నారు. అసెంబ్లీకి వెళ్లని జగన్ కు ఎమ్మెల్యే పదవి ఎందుకని ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం జగన్, కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఏం చేశారని నిలదీశారు. ఇలాంటి నాయకులను ఎన్నుకునే ముందు ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కేవలం శంకుస్థాపనలకే పరిమితమయిందని షర్మిల అన్నారు. పేదల కోసం, కడప ప్రాంతం అభివృద్ధి కోసం వైఎస్సార్ దీన్ని తీసుకొచ్చారని చెప్పారు. ఈ ప్లాంట్ ద్వారా 25 వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే అవకాశం ఉందని అన్నారు. వైఎస్ చనిపోయిన తర్వాత వచ్చిన నాయకులందరూ కడప స్టీల్ ప్లాంట్ ఊసే లేకుండా చేశారని విమర్శించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ కూడా కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని విస్మరించారని షర్మిల దుయ్యబట్టారు. మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటానని ఆస్కార్ లెవెల్లో జగన్ డైలాగులు చెప్పారని ఎద్దేవా చేశారు. పదేళ్లుగా కడప ఎంపీగా ఉన్న అవినాశ్ రెడ్డి స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంటులో ఏం చేశారని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ కేవలం శంకుస్థాపనలకే పరిమితమయిందని అన్నారు. ఇది శంకుస్థాపనల ఫ్యాక్టరీగా, టెంకాయలు కొట్టే ప్రాజెక్ట్ గా మారిందని చెప్పారు. ‘చేయాలి చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ’ అన్నట్టుగా తయారయిందని ఎద్దేవా చేశారు. మీడియా ముందు టెంకాయలు కొట్టి నిరసన వ్యక్తం చేశారు.
👉గత ప్రభుత్వ హయాంలో ఐఏఎస్ అవినీతి!!!
-విశాఖ భూములు కేటాయింపులో ఆ ఐఏఎస్ కు విల్లా బహుమతి???
విశాఖ పట్టణంలో వందల కోట్ల విలువైన భూములను గత ప్రభుత్వ హయాంలో ఓ ఐఏఎస్ అధికారి స్థానికంగా ఉండే ఓ స్వామీకి భూములు కేటాయింపులు చేపట్టడంలో కీలకపాత్ర పోషించారు. వందల కోట్లు విలువైన భూములు అప్పనంగా వచ్చి పడటంతో సదరు ఐఏఎస్ అధికారికి ఆ స్వామి బహుమతిగా అతి ఖరీదైన విల్లా బహుమతిగా అందజేశారు. ప్రస్తుతం ఇదే ఐఏఎస్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు చేపడుతున్నారు. సదరు ఐఏఎస్ కు విశాఖపట్నంలో మరికొన్ని ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాదులో ఉండే కుటుంబ సభ్యులకి బీఎండబ్ల్యూ కారు బహుమానంగా ఇచ్చింది ఎవర నే విషయంపై ఇటీవల నిఘవర్గాలు ఆరా తీసినట్టు సమాచారం. అటవీ సంస్థ కు సంబంధించిన కొంతమంది ఉద్యోగులు మాత్రం హైదరాబాదులో ఐఏఎస్ కుటుంబంలో పని చేస్తూ జీతాలు అటవీ శాఖ నుంచి తీసుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. సదరు ఐఏఎస్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు సంబంధిత ఐఏఎస్ పై విచారణ చేపట్టి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. వందల కోట్ల భూములు బదలాయింపు నేపథ్యంలో విశాఖపట్టణంలో విలాసవంతమైన భవనాలు, బీఎండబ్ల్యూ కార్ ఇచ్చింది ఎవరనే విషయంపై ఇప్పుడు చర్చ సాగుతోంది. అవినీతి ఆరోపణలు నేపథ్యంలో వాస్తవాలు వెలుగు లోకి వస్తే ఐఏఎస్ అవినీతికి ఏ విధంగా ఎలా పాల్పడ్డారని విషయాలు వెలికి తీసే అవకాశం ఉంది. అవినీతికి పాల్పడే ఐఏఎస్ ల పై చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ప్రజా ప్రభుత్వంపై ఉందని పలువురు కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. అవినీతికి పాల్పడే వారిపై చర్యలు చేపట్టడం ద్వారా పక్కదారి పట్టే మరి కొంతమంది అధికారులు ఇకమీదైనా పారదర్శకంగా వ్యవహరించే అవకాశం ఉంది.
👉కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యం..😱😱😱
వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిలు..
సాయంత్రం స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్లిన తల్లి దండ్రులకు పిల్లలు కానరాకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి వివేకానంద నగర్ లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 8వ తరగతి చదువుతున్న హారిక (14) మరియు లక్ష్మీ దుర్గ (13) విద్యార్థినిలు అదృశ్యం..
తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం రోజులాగే స్కూల్లో ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాలకు వదిలి తిరిగి సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన తల్లిదండ్రులకు తమ పిల్లలు కానరాకపోవడంతో స్కూల్ టీచర్ మరియు ప్రిన్సిపాల్ ను సంప్రదించడంతో ఇప్పుడే వెళ్లిందని చెప్పగా చుట్టుపక్కల ఉన్న దుకాణాలను వెతికి ఎంతసేపటికి కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా పోలీసు వారు దయచేసి తమ పిల్లల్ని క్షేమంగా తీసుకురావాలని వేడుకున్నారు.
👉రాయపర్తిలో భారీ దోపిడీ*..ఎస్‌బీఐలోకి చొరబడిన దుండగులు* ..గ్యాస్‌కట్టర్‌తో స్ట్రాంగ్ రూమ్, సేఫ్టీ లాకర్లను తెరిచిన దొంగలు.. *ప్రజలు కుదువబెట్టిన బంగారం అపహరణ…*వాటి విలువ దాదాపు రూ.14కోట్ల పైమాటేనని అంచనా* … ఆధారాలు లేకుండా సీసీ కెమెరాల డీవీఆర్ ఎత్తుకెళ్లిన వైనం…* దర్యాప్తు చేస్తున్న పోలీసులు..* వివరాలను గోప్యంగా ఉంచిన ఎస్‌బీఐ అధికారులు, పోలీసులు..
అర్ధరాత్రి విద్యు త్ సరఫరా నిలిపివేసి, గ్యాస్ కట్ట ర్ల కిటికీ గ్రిల్స్ తొలగించి బ్యాంకులోకి చొరబడి రూ.కోట్ల విలువైన డబ్బులను కొల్లగొట్టే చోరీలను మనం చాలా సిని మాల్లో చూశాం. అదే రీతిలో వరంగల్ జిల్లా రాయపర్తి మండలకేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంకులో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి సొత్తును అపహరించిన సంఘటన మంగళవారం జరిగింది. పోలీసులు, బ్యాంకు అధికారులు చెప్పిన వివరాలతో పాటు విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇవీ.. రాయ పర్తి మండలకేంద్రం శివారులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకును మంగళవారం ఉద యం తెరిచిన అధికారులు లోపలికి వెళ్లి చూసేసరికి లాకర్ రూం ఓపెన్ కావడం, అందు లోని సీక్రెట్ లాకర్ సైతం తీసి ఉండడంతో ఉలిక్కిపడ్డారు. వెంటనే ఎస్‌బీఐ ఉన్నతాధికారుల
గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు..కేటీఆర్ జైలుకే.. మనసులో మాట బయటపెట్టిన సీఎ రేవంత్.. నడిరోడ్డు పై లాయర్ దారుణ హత్య..కూకట్‌పల్లి లో ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యం..గత ప్రభుత్వ హయాంలో ఐఏఎస్ అవినీతి!!! -విశాఖ భూములు కేటాయింపులో విల్లా బహుమతి???..ఉప్మా టిఫిన్లో సైతం పురుగులు (నారాయణపేట)..రాయపర్తిలో భారీ దోపిడీ.
Recent Posts