👉గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు..
న్యూయార్క్: బిలియన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై న్యూయార్క్‌లో కేసు నమోదైంది. గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురు ఇందులో నిందితులుగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీరు 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్లు లంచాలు చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా రుణాలు,బాండ్లను సేకరించినట్లు అధికారులు అభియోగాలు మోపారు.
👉అమెరికాతో అంత ఈజీ కాదు!: భారత్ లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతం అదానీ, మరో ఏడుగురితో కలిసి అధికారులకు లాంచాలు ఆఫర్ చేశారని.. ఇదే సమయంలో బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించారని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ) ఆరోపిస్తోంది..ఈ ఆరోపణల్లో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండటంతో ఆ దేశం దర్యాప్తు ప్రారంభించింది. ఈ సందర్భంగా స్పందించిన జస్టిస్ డిపార్ట్ మెంట్ డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ లీసా హెచ్ మిల్లర్… ప్రపంచంలో ఏమూలైనా అమెరికా చట్టాలను ఉల్లంఘించినా సహించబోమని వెల్లడించారు. ఈ వ్యవహారంలో అమెరికాలోని ఫారెన్స్ కరెప్ట్ ప్రాక్టిసెస్ యాక్ట్ ఉల్లంఘన జరిగినట్లు ఆ దేశ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఈ యాక్ట్ లక్ష్యం ఏమిటంటే.. అమెరికా కంపెనీలు, వ్యక్తులు విదేశాల్లో అవినీతి పనుల్లో భాగం కాకుండా చూడటమే. దీని ఉల్లంఘనను ఆ దేశం తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది. ***వాస్తవానికి భారత్ లో అదానీకి అడ్డేమీ లేదని అంటుంటారు! కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం ఆయన ఆడింది ఆట, పాడింది పాట అంటూ విపక్షాలు ఆరోపిస్తుంటాయి! దీనిలో ఎంత వాస్తవం.. మరెంత అవాస్తవం అనేది దాదాపు అందరికీ తెలిసిందే అనేది మరో కీలక వ్యాఖ్యానం! అయితే… అది అమెరికా.. పైగా అమెరికా న్యాయ శాఖను పునర్నిర్మిస్తానని ప్రతినబూనిన డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన పరిస్థితి! దానికి తోడు అక్కడ అదానీ & కో చేసిన చట్ట ఉల్లంఘన తీవ్రమైన నేరం. మరి ఈ వ్యవహారం ఎలాంటి కన్ క్లూజన్ కి వస్తుందనేది వేచి చూడాలి! ఈ నేరం నిరూపితమైతే అదానీ అమెరికాలో శిక్ష అనుభవించాల్సి వస్తుందని అంటున్నారు!
**ఇందులో భాగంగా… 20 ఏళ్లలో అదానీ, దాని అనుబంధ సంస్థలు 2 బిలియన్ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందడం కోసం భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్లు లంచాలు ఆఫర్ చేసినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. దీంతో.. గౌతం అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానితో పాటు మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. డాలర్ డినామినేషన్స్ బాండ్ల జారీ నిలివేత!: ఈ సందర్భంగా స్పందించిన అదానీ సంస్థ… యునైటెడ్ స్టేస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్, యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ & ఎక్స్ఛేంజ్ కమిషన్ లు మా బోర్డు సభ్యులు గౌతం అదానీ, సాగర్ అదానీకి వ్యతిరేకంగా క్రిమినల్ నేరారోపణలు జారీచేశాయని.. ఇదే సమయంలో వినీత్ జైన్ పై కూడా అటువంటి నేరారోపణలు చేసిందని వెల్లడించింది. ఈ పరిణామాల నేపథ్యంలో.. మా అనుబంధ సంస్థలు ప్రస్తుతం ప్రతిపాదిత యూఎస్డీ డినామినేటెడ్ బాండ్ ఆఫర్లను కొనసాగించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు గురువారం స్టాక్ మార్కెట్ కు అందజేసిన ఫైలింగ్ లో పేర్కోంది. ఈ ఆఫర్ విలువ 600 మిలియన్ డాలర్లు. **భారీగా పతనమైన అదానీ షేర్లు!: ఈ పరిణామల నేపథ్యంలో అదానీ గ్రూపులోని పలు కంపెనీల షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఇందులో భాగంగా… అదానీ ఎంటర్ ప్రైజెస్ 20%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 20%, అదానీ గ్రీన్ ఎనర్జీ 18%, అదానీ పోర్ట్స్ 15%, అదానీ టోటల్ గ్యాస్ 15%, అదానీ పవర్ 14%, అదానీ సిమెంట్స్ 12%, అదానీ విల్మార్ 10% నష్టపోయాయి. మొత్తంగా గ్రూపు కంపెనీల మార్కెట్ విలువ రూ.14.28 లక్షల కోట్ల నుంచి రూ.12.42 లక్షల కోట్లకు పడిపోయినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో.. ఈ గ్రూపులో పెట్టుబడిదారు అయిన అమెరికాకు చెందిన జీక్యూజీ పార్టర్నర్స్ కి సంబందించిన షేర్లు కూడా ఏకంగా 25% కుంగినట్లు తెలుస్తోంది. భారత్ లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతం అదానీ, మరో ఏడుగురితో కలిసి అధికారులకు లాంచాలు ఆఫర్ చేశారని.. ఇదే సమయంలో బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించారని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ) ఆరోపిస్తోంది. అయితే… ఈ ఆరోపణల్లో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండటంతో ఆ దేశం దర్యాప్తు ప్రారంభించింది. ఈ సందర్భంగా స్పందించిన జస్టిస్ డిపార్ట్ మెంట్ డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ లీసా హెచ్ మిల్లర్… ప్రపంచంలో ఏమూలైనా అమెరికా చట్టాలను ఉల్లంఘించినా సహించబోమని వెల్లడించారు. ఈ వ్యవహారంలో అమెరికాలోని ఫారెన్స్ కరెప్ట్ ప్రాక్టిసెస్ యాక్ట్ ఉల్లంఘన జరిగినట్లు ఆ దేశ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఈ యాక్ట్ లక్ష్యం ఏమిటంటే.. అమెరికా కంపెనీలు, వ్యక్తులు విదేశాల్లో అవినీతి పనుల్లో భాగం కాకుండా చూడటమే. దీని ఉల్లంఘనను ఆ దేశం తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది. వాస్తవానికి భారత్ లో అదానీకి అడ్డేమీ లేదని అంటుంటారు! కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం ఆయన ఆడింది ఆట, పాడింది పాట అంటూ విపక్షాలు ఆరోపిస్తుంటాయి! దీనిలో ఎంత వాస్తవం.. మరెంత అవాస్తవం అనేది దాదాపు అందరికీ తెలిసిందే అనేది మరో కీలక వ్యాఖ్యానం! అయితే… అది అమెరికా.. పైగా అమెరికా న్యాయ శాఖను పునర్నిర్మిస్తానని ప్రతినబూనిన డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన పరిస్థితి! దానికి తోడు అక్కడ అదానీ & కో చేసిన చట్ట ఉల్లంఘన తీవ్రమైన నేరం. మరి ఈ వ్యవహారం ఎలాంటి కన్ క్లూజన్ కి వస్తుందనేది వేచి చూడాలి! ఈ నేరం నిరూపితమైతే అదానీ అమెరికాలో శిక్ష అనుభవించాల్సి వస్తుందని అంటున్నారు!
👉 అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత,ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్..ఎన్ని సార్లు ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని, అదానీ వైపేనా?..అఖండ భారతంలో అదానీకో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా?..ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ.. ఆధారాలు ఉన్నా అదానీని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా” అని ప్రధానిని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత
👉 కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం – కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం – ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అనేది కూటమి ప్రభుత్వ నినాదం – అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రణాళికలు చేస్తున్నాం – విశాఖను ఐటీ హబ్ చేసేందుకు డేటా సెంటర్ పాలసీ రూపకల్పన – మూడు నెలల్లో విశాఖలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేస్తుంది – విశాఖలో ఐటీ ఎకో సిస్టం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు – ఐటీ కంపెనీలు రావాలంటే మౌలిక సౌకర్యాలు ఉండాలి – భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వేగంగా నిర్మిస్తున్నాం – వేలాది హోటళ్లు కూడా ఏర్పాటు కావాల్సి ఉంది – పర్యాటక విధానం కూడా రూపొందించాం – పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పించాలని నిర్ణయం – విశాఖలో ఆఫీస్ స్పేస్, నివాస స్థలాల కోసం స్థిరాస్తి సంస్థలతో చర్చలు – పెండింగ్ ప్రోత్సాహకాల కోసం బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించాం – అసెంబ్లీ సమావేశాల తర్వాత ఐటీ కంపెనీలకు ప్రోత్సాహకాలు – స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై దృష్టి పెట్టాలని టీసీఎస్ చంద్రశేఖరన్ చెప్పారు – ఏపీలో 700 కంప్రెస్డ్ బయో గ్యాస్ యూనిట్లకు రిలయన్స్ హామీ –
👉 నల్గొండ : డిఈవో భిక్షపతి లీలలు..రెండిళ్ల పూజారి అవతారమెత్తిన భిక్షపతి….బార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భిక్షపతి..
భార్యకు తెలియకుండా ప్రియురాలికి ముగ్గురు పిల్లల సంతానం..ప్రియురాలితో ఉండగా డీఈవో భిక్షపతిని రెడ్ హ్యాండెడ్ పట్టుకున్న బార్య…కొంతకాలంగా కోర్టులో నడుస్తున్న భిక్షపతి దంపతుల వివాదం..భార్యకు విడాకులు ఇవ్వకుండానే ప్రియురాలిని పెళ్లి చేసుకోవడంపై ఆగ్రహం..కొంతకాలంగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా డీఈవో భిక్షపతి..మహిళా ఉపాధ్యాయులపై లైంగిక వేదింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు..తనకు లొంగకుంటే వేదింపులకు గురిచేసి సస్పెండ్ చేస్తారనేది భిక్షపతి పై ఉన్నతాధికారులకు పిర్యాదులు..రాజకీయ పలుకుబడితో నల్గొండలో ఏళ్లుగా తిష్టవేసిన భిక్షపతి..భిక్షపతి వ్యవహారంపై మహిళా సంఘాల ఆగ్రహం….
👉తిరుపతి జిల్లా..గూడూరు నియోజక వర్గం.. వాకాడు.
*💥అక్రమ సంబంధం కారణం గా వ్యక్తి దారుణ హత్య*💥
👉అతికిరాతకంగా,అత్యంత పాశవికంగా మీసాలు తీసి,గుండు కొట్టి క్రూరంగా హింసించి కొట్టి చంపిన నిందితులు*
*👉ఒక ప్రముఖ రౌడీ షీటర్ కనుసన్నల్లో హత్య జరిగిందని జోరుగా ప్రచారం*
*👉ప్రధాన నిందితుడిని కాపాడేందుకు కేసు వ్యవహారం,పూర్వాపరాలు మొత్తం మార్చే ప్రయత్నం లో పోలీసులు వున్నట్టు జోరుగా ప్రచారం*
*👉రౌడీ షీటర్ ను కాపాడేందుకు బడా వ్యాపార వేత్తలు , రాజకీయనాయకులు,ప్రజా ప్రతినిదులు ప్రయత్నం*
*👉గూడూరు పోలీసు సబ్ డివిజన్ లో మూడు హత్యలు ఆరు నేరాలతో వెలిగిపోతున్న నేర గాళ్ళు..*
*👉ప్రజల్లో నమ్మకం కోల్పోతున్న పోలీసు వ్యవస్థ..రాజ్యమేలుతున్న రౌడీ వ్యవస్థ*
*👉గూడూరు పోలీసు సబ్ డివిజన్ లో మూడు నెలల్లో ఎన్నో హత్యలు,మరెన్నో దాడులు..వెలుగు లోకి గోరంత,రానివి కొండంత..
వాకాడు మండలం దుగ్గరాజుపట్నం నుండి మల్లం వెళ్లే దారిలో రోడ్డు పక్కన అనిత్ రెడ్డి మృతదేహం..
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వివరాల మేరకు గూడూరు శివాలయం వీధికి చెందిన కొండా అనిత్ (రెడ్డి 24)(స్వగ్రామం విడవలూరు మండలం ఊటుకూరు గ్రామం) అనే యువకుడు ఒక యువతితో అక్రమ సంబంధం కలిగి వున్న కారణంగా ఈ దారుణ హత్య జరిగిందని.. ఈ హత్య వెనకాల వున్న ప్రదాన రౌడీ షీటర్ వుండడం అతనికి రాజకీయంగా అండదండలు పుష్కలంగా వుండడం తో నిందితుడిని కాపాడేందుకు కేసు మొత్తం తప్పు దోవ పట్టించేందుకు నిజాలు దాచిపెట్టి పోలీసులు ఇప్పటికే ఒక కథ అల్లుకున్నట్టు జోరుగా ప్రజల్లో ప్రచారం జరుగుతుంది….కానీ పోలీసులు హత్య కేసుకు సంబంధించి విచారణ చేసి వాస్తవాలు వెలుగులోకి తీసుకు రావాలని ప్రజలు కోరుతున్నారు,మంచి పోలీసు అధికారిగా పేరు తెచ్చుకున్న తిరుపతి జిల్లా SP సుబ్బరాయుడు ఈ హత్య వ్యవహారం పై ఓ కన్నేయాయాలని,ప్రజలు కోరుతున్నారు….
*వాకాడు మండలం దుగ్గరాజు పట్నం నుండి మల్లాం వెళ్లే రోడ్డు పక్కన కనిపించిన కొండా అనిత్ రెడ్డి మృతదేహం..
*కిరాతకంగా హత్య..*సగం మీసం తీసి, గుండు కొట్టి,మర్మాంగాలు పై దాడి చేసి,కళ్ళు పొడిచి …..*
👉 ఉరి వేసుకున్న మహిళకు సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన కానిస్టేబుల్..మహబూబాబాద్‌కి చెందిన ఓ మహిళ కుటుంబ కలహాలతో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ రాంబాబు CPR చేసి మహిళ ప్రాణాలను కాపాడారు.
చికిత్స నిమిత్తం ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు….
👉 కడప జిల్లా . చాపాడు మండలం ద్వారకానగరం వద్ద 40 నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..
కారు ఢీకొనడంతో బాలిక మృతి..మృతురాలు ద్వారకా నగరానికి చెందిన సుమతి(15).
👉 కడప జిల్లా…కాశినాయన మండలం కత్తెరగండ్ల గ్రామపంచాయతీ చెన్నవరం-పాపిరెడ్డిపల్లి మధ్యలో గుర్తు తెలియని మహిళ హత్య…
హత్య కబడిన మహిళ శరీరంపై ఎటువంటి వస్త్రాలు లేకపోవడంతో అత్యాచారం చేసి హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు…
హత్య కాబడిన మహిళ ఎవరు అనే ఆనవాళ్లు లేకుండా తలపై రాళ్లతోనుజ్జు నుజ్జు…
సుమారు ఆ మహిళకు 30 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండవచ్చు అని అనుమానం…
👉పాతబస్తీలో అర్ధరాత్రి యువకుడి దారుణ హత్య*
హైదరాబాద్:నవంబర్ 21
అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ పాతబస్తీలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు హత్యకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఫాతిమా నగర్ వట్టే పల్లి వద్ద సాజిద్ అనే వ్యక్తిని తన ఇంటి వద్ద పాత కక్షలతో సిద్ధిక్ అనే వ్యక్తి కత్తులతో దాడి చేసి హత్య చేసాడు.
విషయాన్నీ తెలుసుకున్న పోలీసులు.. ఆ తరవాత సంఘటన స్థలం చేరుకున్నారు. పోలీసులు సాజిద్ ని ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో మృతి చెందాడు. అయితే ఈ హత్యకి గల కారణాలు పాతకక్షలుగా ప్రాథమిక అంచనాగా పేర్కొన్నారు పోలీసులు.
ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి సిధ్దక్ కోసం పోలీసులు వెతుకుతు న్నారు. కేసుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హత్య కి గల కారణాలు అక్రమ సంబంధంగా మరో ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.ఫలక్ నామ ఎసిపి సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ సీసీ కెమెరాలు పరిశీలించారు.
👉ఎల్లనూరు ఏఈ ని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ
అసిస్టెంట్ ఇంజనీర్ రూరల్ తాడిపత్రి ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
నిర్లక్ష్యం వహించిన ఏ ఈ పై చర్య తీసుకోవాలని చనిపోయిన కౌలు రైతు రామాంజనేయ కుటుంబానికి 60 లక్షలు పరిహారం ఇవ్వాలని కోరుతూ ……
2024 నవంబర్ 20న అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలో దంతాలపల్లి గ్రామం వద్ద 11 కేవీ విద్యుత్ తీగల కిందపడి అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడుగు పల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు 39 ఆయన కుమారుడు రవి 13 వీరు విద్యుత్ తీగలుతాయి మృతి చెందారు వీరు వృత్తిరీత్యా కౌలు వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి రైతులు మృతి చెందడం వారి కుటుంబం తీవ్రం నష్టం .ఈ ప్రమాదం అక్కడ విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం వలన జరిగింది కూడా పట్టించుకోకుండా వ్యవహరించడం వల్ల ఈ ప్రమాదం సంబంధించింది .ఆ ప్రాంతంలో అసిస్టెంట్ ఇంజనీర్ బాధ్యతలు విస్మరించి నిర్లక్ష్య ధోరణి ఉండడం వల్లే ఇలాంటి ప్రమాదం జరిగినాయి కావున అసిస్టెంట్ ఇంజనీర్ ను తక్షణమే సస్పెండ్ చేసి
మృతి చెందిన రామాంజనేయులు కుటుంబానికి న్యాయం చేసే వారి కుటుంబానికి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వారి 60 లక్షలు ప్రభుత్వ పరిహారం ఇవ్వాలని వెంటనే చనిపోయిన కౌలు రైతు కుటుంబానికి పరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేయడం జరిగింది. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కార్యదర్శి రాజారాం రెడ్డి జిల్లా కమిటీ సభ్యురాలు శిరీష రైతు సంఘం మండల కమిటీ సభ్యులు ఆదినారాయణ పాల్గొన్నారు
గౌతం అదానీ, అతని మేనల్లుడు సాగర్ తోపాటు మరో ఏడుగురిపై కేసులు!!!..అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత,ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్.. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం..అక్రమ సంబంధం కారణంగా వ్యక్తి దారుణ హత్య! (గూడూరు)..ఉరి వేసుకున్న మహిళకు సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన కానిస్టేబుల్..పాతబస్తీలో అర్ధరాత్రి యువకుడి దారుణ హత్య…ఎల్లనూరు ఏఈ ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్..నల్గొండ డిఈవో భిక్షపతి లీలలు..
Recent Posts