👉 ఆదాని గ్రూపుపై తక్షణమే కేసు నమోదు చేయాలి..
అవకతవకలపై స్వతంత్ర సంస్థతో పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలి : సీపీఐ(ఎం)డిమాండ్– మోడీ ప్రభుత్వం ఇక ఇప్పుడు ఏ తెర చాటునా దాక్కోలేదంటూ వ్యాఖ్య
అదానీ గ్రూపు పాల్పడిన అవకతవకలన్నింటిపై స్వతంత్ర సంస్థతో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని, అమెరికా ప్రాసిక్యూటర్లు అందజేసిన ఆధారాల ప్రాతిపదికన అదానీపై వెంటనే కేసు నమోదు చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన జారీ చేసింది.గౌతమ్ అదానీ మరో ఆరుగురిపై అమెరికా కోర్టులో అక్కడి న్యాయశాఖ దాఖలు చేసిన నేరారోపణ పత్రంలో కేంద్ర, రాష్ట్ర స్థాయిలో భారత ప్రభుత్వ అధికారులకు ముడుపులు చెల్లించడంలో గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీలకు ప్రమేయం వుందంటూ తీవ్రమైన నేరాభియోగాలు వున్నాయి.
సౌర విద్యుత్ సరఫరా కోసం రాష్ట్రాలు లేదా ప్రాంతీయ విద్యుత్ పంపిణీ కంపెనీలతో విద్యుత్ విక్రయానికి సంబంధించి అక్రమ ఒప్పందాలతో ముందుకు సాగడానికి భారత ప్రభుత్వ అధికారులకు రూ.2,029 కోట్లు ఇవ్వజూపారని లేదా ఇస్తామని హామీ ఇచ్చారని ఆ అభియోగ పత్రం పేర్కొంటోంది. అదానీలు అమెరికా ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించారనే ఆరోపణలపై అమెరికాలో ఈ కేసు నమోదైంది. ప్రభుత్వ అధికారులకు ఇవ్వజూపిన, వాగ్దానం చేసిన ముడుపులకు సంబంధించిన నిర్దిష్ట వివరాలను అందజేసిన సాగర్ అదానీ నుంచి సాక్ష్యాధారాలను కూడా సేకరించినట్టు అభియోగపత్రం పేర్కొంది.
”ముడుపుల పత్రాలు గుర్తించినవి : (1) రాష్ట్రం లేదా ప్రాంతం కోసం ప్రభుత్వ అధికారులకు ఇవ్వచూపిన ముడుపులు (2) ఇస్తామని చెప్పిన ముడుపుల మొత్తం (3) ఈ ముడుపులు ముట్ట జెప్పినందుకు లేదా ఇస్తామని హామీ ఇచ్చినందుకు ప్రతిఫలంగా రాష్ట్రం లేదా ప్రాంతం కొనుగోలు చేయడానికి అంగీకరించిన సౌర విద్యుత్ మొత్తం. చాలా సందర్భాల్లో, మొత్తంగా ఇవ్వచూపిన ముడుపుల మొత్తంలో ఒక్కో మెగావాట్ రేటు ఎంత వుందో కూడా ముడుపుల పత్రాలు గుర్తించాయి. అలాగే ఈ లంచాలు అందుకునే ప్రభుత్వ అధికారులకు సంబంధించిన సంక్షిప్త నామాలు కూడా వున్నాయి.
ఒక్కో రాష్ట్రంలో, ప్రాంతంలో ప్రభుత్వ అధికారుల మధ్య పంపిణీ చేయాల్సిన ముడుపుల మొత్తం కూడా వుంది.” ఇంత పెద్ద ఎత్తున లంచాలకు పాల్పడడం, పైగా అదానీలు, ప్రభుత్వ అధికారులను తమ అధీనంలో వుంచుకోవడం, ఇదంతా కూడా భారత్‌లో కాకుండా అమెరికాలో వారి నేర న్యాయ వ్యవస్థ ద్వారా బయటపడడం సిగ్గుచేటైన విషయం. అంతేకాకుండా ఇటువంటి అక్రమ, నేరపూరితమైన కార్యకలాపాలు చేపట్టేందుకు గౌతమ్ అదానీకి, ఆయన వ్యాపార సామ్రాజ్యానికి మోడీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రక్షణగా నిలుస్తున్నది. హిండెన్‌బర్గ్ వ్యవహారంలో తలెత్తిన ఆరోపణలపై ఎలాంటి విచారణ లేదా ప్రాసిక్యూషన్ జరగ కుండా అదానీకి ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి రక్షణగా నిలిచారు.
మోడీ ప్రభుత్వం ఇక ఇప్పుడు ఏ తెర చాటునా దాక్కోలేదు. అమెరికాలోని ప్రాసిక్యూషన్ అందజేసిన సమాచారం ఆధారంగా కేసు నమోదు చేయాల్సిందిగా తక్షణమే సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలి. ప్రభుత్వ అధికారులకు ముడుపులు ఇవ్వడమనేది సిబిఐ పరిధిలో వున్న అవినీతి నిరోధక చట్టం కిందకు వస్తుంది. అదానీ గ్రూపు కంపెనీలు పాల్పడిన తప్పులు, అవకతవకలన్నింటినీ వెలికితీయడానికి స్వతంత్ర సంస్థతో పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టడం తక్షణావసరమని పొలిట్‌బ్యూరో పేర్కొంది.
👉 ఒంగోలు నగరంలో స్మార్ట్ మీటర్లు విధానాన్ని, వ్యతిరేకిస్తూ *సిపిఎం పార్టీ* ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో వ్యాపారస్తులు షాపుల దగ్గర రాష్ట్ర ప్రభుత్వం *అదాని కంపెనీకి అనుకూలంగా ఉన్న స్మార్ట్ మీటర్లు విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఒంగోలు నగరంలో సిపిఎం పార్టీ ఒంగోలు నగర కమిటీ నాయకత్వం అడ్డుకోవడం జరిగింది.కార్యక్రమంలో సిపిఎం పార్టీ ఒంగోలు నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు,నగర్ కార్యదర్శి వర్గ సభ్యులు జీ రమేష్ ,తంబి శ్రీనివాసులు నగర నాయకులు ఎస్ డి హుస్సేన్, టీ మహేష్ దారా వెంకటేశ్వర్లు, పి సుబ్బారావు, రాంబాబు భగత్ సింగ్ రాజు,వెంకట్రావు,వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.
👉జగన్ ఆంధ్ర రాష్ట్రాన్ని బ్లాంక్ చెక్ లా అదానీ కి రాసి ఇచ్చారు*..ఆంధ్రప్రదేశ్ ను “అదానీ ప్రదేశ్ “గా మార్చారు*
1750 కోట్ల లంచాలకు ఆంధ్ర ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టారు..*జగన్ అవినీతి ప్రపంచానికి తాకింది. ఇది YSR కుటుబానికి, రాష్ట్రానికి అవమానం..*అదానీ తో జగన్ చేసుకున్న ఒప్పందాలు అన్నింటిపై విచారణ జరగాలి..
*ఏపీలో అదానీ గ్రూప్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి*
ఏపీ సి సి చీఫ్..వైఎస్ షర్మిలా రెడ్డి..హైదరాబాద్
-అగ్రరాజ్యం బయట పెట్టే దాక అదానీ, జగన్ లంచాల గురించి తెలియలేదు
-ఇక్కడ ఉన్న ప్రభుత్వ శాఖలు ఏం చేస్తున్నట్లు ?
-అంతర్ జాతీయ స్థాయిలో మన దేశ అవినీతి గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది
-ఇది మన దేశానికి అవమానం
-అదానీ దేశ పరువు తీస్తే… జగన్ ఆంధ్ర రాష్ట్రం పరువు తీశాడు..ఒక్క డీల్ లో 1750 కోట్లు లంచమా ?
-జగన్ గారు మీకు ఆంధ్రరాష్ట్ర ప్రజల ప్రయోజనాలు గుర్తుకు రాలేదా ?-మీకు లంచాలు… ఇక్కడ డిస్కం లకు నష్టాలు
-మీకు1750 కోట్లు లంచాలు..ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన 17 వేల కోట్ల సర్దుబాటు చార్జీలు..మీ లంచాల కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీ కి తాకట్టు పెడతారా ?..👉గుజరాత్ లో ఇదే అదానీ యూనిట్ కి 1.99 పైసలు అమ్ముతున్నాడు
-ఆంధ్రలో మాత్రం 2.49 పైసలకు అగ్రిమెంట్ చేసుకున్నారు
-1750 కోట్ల లంచం తీసుకొని ప్రజల నెత్తిన అదానీ పవర్ భారాన్ని మోపారు
-25 ఏళ్లు డీల్ కి పడే ప్రజలపై పడే భారం లక్ష కోట్లు
-ఈ లక్ష కోట్లు అధనికి దోచుపెట్టే కుట్రలో మీ లంచం ఎంత ?..లంచాలు ఇస్తే ప్రజల మనోభావాలను తాకట్టు పెడతారా? -జగన్ అవినీతి పరుడు అని ప్రపంచం మొత్తం చర్చ-ఇది వైఎస్ఆర్ కుటుంబానికి, రాష్ట్రానికి అవమానం
-ప్రజలు 5 ఏళ్లు అధికారం ఇస్తే దాన్ని దుర్వినియోగం చేశారు-1750 కోట్ల లంచాలకు ఆశ పడి జగన్ రిప్యూటేశన్ ను తాకట్టు పెట్టాడు-అదానీ తో ఇదొక్కటే కాదు… ఇక్కడ జరిగిన ప్రతి డీల్ లో లంచాలు తీసుకొని ఉంటాడు
-ప్రతి డీల్ లో లంచాలు తీసుకున్నాడు -ఎటువంటి దర్యాప్తులు లేవు కాబట్టి బయటపడటం లేదు
-రాష్ట్రాన్ని అదానీ కి జగన్ తాకట్టు పెట్టాడు -గంగవరం పోర్టు ను అప్పనంగా అమ్మేశాడు -కేవలం 640 కోట్లకు అదానీ కి కట్టబెట్టారు -30 ఏళ్ల తర్వాత గంగవరం పోర్ట్ ప్రభుత్వానికి చెందాలి -10 శాతం ఉన్న వాట ను అమ్మేశారు -9 వేల కోట్ల విలువ జేసే 10 శాతం వాట ను కేవలం 640 కోట్లకు అమ్మడం ఏంటి ?
-ఇలా అమ్మితే ఎంత కామేశన్ తీసుకున్నారు ?
– కృష్ణపట్నం పోర్టు బెదిరించి అదానీ కి ఇప్పించారు
– రాష్ట్రం మొత్తం కోల్ సప్లై చేసే కాంట్రాక్టు అదానీ కి ఇచ్చారు- బీచ్ శాండ్ కాంట్రాక్టు మొత్తం అదానీ చేతుల్లో పెట్టారు – విశాఖ లో సబ్ మెరైన్ కాంట్రాక్టు కూడా అదానీ చేతుల్లో పెట్టాలని అనుకున్నారు
– అదానీ కి ఇచ్చిన కాంట్రాక్టు లకు ఎంత లంచం తీసుకున్నారు ? – చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది – విద్యుత్ కొనుగోలు అగ్రిమెంట్ ను రద్దు చేయండి
– అదానీ కంపెనీని ఏపిలో బ్లాక్ లిస్ట్ లో పెట్టండి
– జగన్ కుదుర్చుకున్న ఒప్పందాలను రివ్యూ చేయాలి
– ఈ దేశంలో వందల కొద్ది మోదాని స్కాం లు ఉన్నాయి
– దేశం మొత్తం ఇంత స్కాం లు జరుగుతున్నా మోడీ చర్యలు లేవు
– ఇప్పుడు అమెరికా అదానీ అరెస్టు వారెంట్ ఇచ్చింది
– ఇప్పటికైనా మోడీ స్పందించాలి
– అదానీ పై చర్యలు తీసుకోవాలి
– లేకుంటే మోడీ కూడా అదానీ అవినీతిలో భాగం
– అదానీ గత 10 ఏళ్లలో బాగా ఎదిగాడు.
– దేశంలో రెండో ధనవంతుడు
– ఇది మోడీ అండ లేకుంటే సాధ్యం కాదు
– అమెరికాలో అదానీ బండారం బయట పడటం ఈ దేశానికి అవమానం
– మోడీ నీ ఒక ప్రశ్న కు సమాధానం చెప్పాలని అడుగుతున్నాం
– ఇండియా – అమెరికా మధ్య ఒప్పందాలు ఉన్నాయి
– ఎక్కడ నేరస్తుడు పట్టుబడిన వెంటనే ఆ దేశానికి అప్పగించాలి
– మరి అదానీ నీ మోడీ అమెరికా కి అప్పగిస్తారా ?
– మోడీ నిర్ణయం ఎంటో తేల్చాలి
– మీ నిర్ణయం కోసం దేశ ప్రజలు అంతా చూస్తున్నారు..
👉 రేవంత్ ను కూడా విజ్ఞప్తి చేస్తున్న
– అదానీ విషయంలో పునరాలోచన చేయాలి..
– జగన్ గారు మొన్న ఒక వీడియో ప్లే చేశారు
– జగన్ కి నిజంగా చెల్లెలి మీద ప్రేమ ఉండి ఉంటే..
– బాలకృష్ణ లేదా ఆయన బిలింగ్ నుంచి తప్పుడు ప్రచారం జరిగింది అని తెలిసి ఉంటే….
– మీరు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా అన్నారు.. అప్పుడు గాడిదలు కాశారా?.. ఎందుకు బాలకృష్ణ మీద విచారణ జరిపించలేదు ?.. చెల్లెలి మీద ప్రేమ ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు
👉 నాకు అక్రమ సంబంధాలు అంట కట్టిన వాళ్ళు ఎవరో కూడా నాకు ఇప్పటికీ తెలియదు.. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్న.. గత 5 ఏళ్లుగా నీ సోషల్ మీడియా సైన్యం తో నాపై తప్పుడు ప్రచారం చేయించలేదా ?- మీకు అవసరం అనుకుంటే అందరినీ వాడుతారు.
– చివరికి నా వీడియో కూడా వాడుతారు
– అమ్మపై కేసు పెడతారు.. నాన్న పేరు సీబీఐ ఛార్జ్ షీట్ లో పెట్టిస్తారు మీకు మీరే సాటి జగన్ సార్..
👉పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలకతీర్పు వెలువరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్(ఖైరతాబాద్), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్ పూర్), తెల్లం వెంకటరావు( భద్రాచలం)పై అనర్హత విధించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్ పై విచారణ జరిపింది.*
అనర్హత విషయంలో నెలరోజుల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ సింగిల్ బెంచ్ తీర్పు వెలువరించింది.
ఈ తీర్పుపై అసెంబ్లీ సెక్రటరీ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. దీనిపై వాదోపవాదాలు విన్న హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక అంశాలతో కూడిన తీర్పును వెలువరించింది. అనర్హత నిర్ణయం తీసుకుంటే ఎన్ని రోజుల్లో తీసుకోవాలి అనేది అసెంబ్లీ స్పీకర్ విచక్షణాధికారం అని.. ఇందుకు ఇంత టైం అంటూ ఏమీ లేదంటూ హైకోర్టు ధర్మాసనం తీర్పు వెల్లడించింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్ణత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేసిన.. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం.. పై విధంగా తీర్పు వెల్లడించింది. ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు ఎలాంటి సమయం.. గడువు లేదని.. టైం బాండ్ అంటూ లేదంటూ వ్యాఖ్యానించింది హైకోర్టు ధర్మాసనం. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది హైకోర్టు బెంచ్.
👉కొంపముంచిన ఎలక్ట్రానిక్ బైక్?😯😯😯
జగిత్యాల జిల్లా :నవంబర్ 22
నిన్న జగిత్యాల జిల్లాలో ఎలక్ట్రిక్ బైక్ పేలిన ఘటన పాఠకులకు తెలిసిందే.. జగిత్యాల రూరల్ మండ లం బాలపెల్లి గ్రామానికి చెందిన భేతి తిరుపతి రెడ్డి కొద్దిరోజుల క్రితం ఎలక్ట్రి టిక్ బైక్ కొనుగోలు చేశాడు.. వ్యవసాయ పనుల కోసం.. ఈ బైక్ ను వినియోగిస్తున్నాడు..
అయితే గురువారం ఛార్జింగ్ తగ్గడం తో ఇంటి ఆవరణలో ఉన్న ఫ్లగ్ లో ఛార్జింగ్ పెట్టారు తిరుపతి రెడ్డి. పెట్టిన కొద్దీ నిమిషాల్లో బైక్ పెళ్లిపోయింది, మంట లు వ్యాపించాయి.. ఇంటి కి మంటలు అంటుకున్నాయి. ఇళ్ళు ముందు భాగం కాలిపోయింది.**బైక్ తోపాటు బైక్ డిక్కీ లో ఉన్న లక్ష 90 వేయిల రూపాయలు కాలి బూడిదయ్యాయి..దీంతో.. ప్రాణాలు కాపాడుకోవ డానికి కుటుంబ సభ్యులు పరుగులు తీశారు.బైక్ కొనుగోలు చేసి కేవలం 40 రోజులు అయిందని ఇంత లోనే ఇలా పేలిపోవటంతో బాధితులు బోరు మంటున్నారు. బైక్ డీలర్ తో వాగ్వాదానికి దిగారు. బైక్‌తోపాటు డిక్కీలో కాలిపోయిన డబ్బులు కూడా తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. వరి దాన్యం అమ్మగా వచ్చిన డబ్బులు బైక్ డిక్కీ లో దాచి పెట్టామని తిరుపతిరెడ్డి, వాదన..ఈ డబ్బులన్నీ కాళిపో యాయి.. తమకు పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు బాధితుడు తిరుపతి రెడ్డి,మరి తిరుపతి రెడ్డికి ఎటువంటి న్యాయం జరుగుతుందో చూడాలి…
👉విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తేలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, టీజీ భరత్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ అంశాన్ని త్రికరణ శుద్ధిగా ఆపి ఉంటే ఈ రోజు ఆ ప్రశ్నే వచ్చేదే కాదని శాసనమండలిలో వైసీపీ సభ్యులకు పవన్ కల్యాణ్ చురక వేశారు. గురువారం మండలిలో స్టీల్ ప్లాంట్ అంశంపై వాడివేడిగా చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, దువ్వాడ శ్రీనివాస్, పాలవలస విక్రాంత్ మాట్లాడారు. ప్రైవేటీకరణ కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ఉద్దేశమే లేదన్నారు. ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ప్రకటన చేయాలని మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు సూచించారు. దీంతో సభలో పవన్ మాట్లాడారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తేలేదని, ప్రైవేటీకరణ చేయవద్దని తాను కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసి కోరానని చెప్పారు. కాగా ప్లాంట్ భూములు వేలం వేసేందుకు ఇప్పటికే ప్రకటనలు జారీ చేశారని విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు.
👉 జగన్ వచ్చాక కొన్ని కంపెనీలు ఒక్క రాష్ట్రాలకు తరలి వెళ్లాయి.. రాష్ట్ర విభజన అనంతరం 2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కష్టపడి పారిశ్రామిక, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ కంపెనీలను తీసుకొచ్చిందని… కానీ,జగన్ వచ్చాక ఆ కంపెనీలు రాష్ట్రం వదిలిపోయేలా చేశారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో 27 కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలివెళ్లాయని చెప్పారు. శాసనసభలో గురువారం జీరో అవర్ తర్వాత మంత్రి లోకేశ్ ఎలకా్ట్రనిక్స్, డేటా పాలసీలపై ప్రకటన చేశారు. ఎంతో కష్టపడి తాము టీసీఎల్‌ను రాష్ట్రానికి తీసుకురాగా, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే.. టీసీఎల్‌లో పనిచేసే ఓ అధికారిని భోజనానికి పిలిచి నిర్బంధించారన్నారు. ఎలకా్ట్రనిక్ తయారీ యూనిట్లు, డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తే పెట్టుబడి రాయితీ, తక్కువ ధరకే వసతులు కల్పిస్తామని మంత్రి చెప్పారు. ఉత్పత్తి రంగంలో ఏపీని నం.1 స్థానంలో నిలబెడతామని చెప్పారు.
ఆదాని గ్రూపుపై తక్షణమే కేసు నమోదు చేయాలి-సిపిఎం డిమాండ్ … అదాని కంపెనీకి అనుకూలంగా ఉన్న స్మార్ట్ మీటర్లు విధానాన్ని వ్యతిరేకిస్తూ ఒంగోలులో నిరసన..జగన్ రాష్ట్రాన్ని బ్లాంక్ చెక్ లా అదానీ కి రాసి ఇచ్చారు -వైఎస్ షర్మిల..విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తేలేదని పవన్ కల్యాణ్, మంత్రులు .. జగన్ వచ్చాక కొన్ని కంపెనీలు రాష్ట్రం వదిలిపోయేలా చేశారు-మంత్రి లోకేశ్ .. కొంపముంచిన ఎలక్ట్రిక్ బైక్..
Recent Posts