👉 పార్లమెంటులో వాయిదాల స్టంటు: అదానీ దుమారం ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీపై నమోదైన కేసుల వ్యవహారంపై చర్చకు పట్టుబడుతూ.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు లోక్‌సభలో నోటీసులు ఇచ్చాయి. పార్లమెంటు ఉభయ సభల్లోనూ వాయిదాల స్టంటు నడుస్తోంది. ప్రతిపక్ష సభ్యులు అదానీ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టడం.. ఆ వెంటనే రెప్పపాటు కాలం కూడా వెయిట్ చేయకుండానే సభలను వాయిదా వేసేయడం కామన్‌గా మారిపోయింది. గతంలోనూ ఇలానే జరిగిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం అటు లోక్‌సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ వాయిదాలే నడిచాయి. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీపై నమోదైన కేసుల వ్యవహారంపై చర్చకు పట్టుబడుతూ.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు లోక్‌సభలో నోటీసులు ఇచ్చాయి. సభ ప్రారంభం అవుతూనే అదానీపై చర్చ కోరుతూ స్పీకర్ ఓం బిర్లాకు విపక్ష సభ్యులు నోటీసులు ఇచ్చారు. అయితే, ఈ నోటీసులను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించడంతో పాటు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీంతో విపక్ష సభ్యులు తమ తమ స్థానాల్లో లేచి నిలబడి బిగ్గరగా నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. అయినప్పటికీ సభను సజావుగా నడిపించేందుకు స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించినా.. సభ్యులు శాంతించలేదు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అయితే.. తిరిగి 12 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్ష సభ్యులు శాంతించకపోవడంతో సభను స్పీకర్ ఓం బిర్లా రేపటికి వాయిదా వేశారు.ఇక, రాజ్యసభలోనూ వాయిదాల పర్వమే నడిచింది.తొలుత ఈ రోజు ఉదయం సభ ప్రారంభం కాగానే చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ మాట్లాడుతూ..75వ రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించుకున్న విషయాన్ని ప్రస్తావించారు.ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు పెద్దల సభకు మరింత గౌరవాన్ని,మర్యాదను ఇనుమడింప జేయాలని కోరారు.
సభా సంప్రదాయాలను పాటించాలని చైర్మన్ సూచించారు. చైర్మన్ స్థానంలో కూర్చున్న వారు సభను సజావుగా నడిపించాలన్న భావనతో ఉన్నారన్న విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. వివాదాలకు, ఆందోళనలకు సమయం కాదని తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి నోటీసులను అనుమతించడం లేదని చెప్పారు. నిర్మాణాత్మక విధానంలో చర్చలు చేపట్టాలని, నిబంధనలు పాటించాలని సూచించారు. అయితే, తాము ఇచ్చిన నోటీసులపై చర్చ చేపట్టాలని కోరుతూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో చైర్మన్ ధన్‌ఖడ్ సభను తొలుత ఈ రోజు ఉదయం 11 గంటల 30 నిమిషాల వరకు వాయిదా వేశారు. తిరిగి 11 గంటల 30 నిమిషాలకు సభ ప్రారంభమైన తర్వాత కూడా పలువురు సభ్యులు చర్చకు పట్టుబట్టడంతో పాటు తమ తమ స్థానాల్లో నిలబడి ఆందోళన చేశారు. దీంతో చైర్మన్ సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తంగా.. పార్లమెంటు సమావేశాలకు ముందు ఏదో ఒక సమస్య తెరమీదికి రావడం.. దానిపైనే చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో సభలు ఒక స్టంటుగా మారిపోయాయన్న వాదన వినిపిస్తుండడం గమనార్హం.
👉 ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుని కుమార్తె వివాహ వేడుకలు..
ఈరోజు హైదరాబాదులో జిఎంఆర్ అరేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుని కుమార్తె వివాహానికి హాజరై నూతన వధువరులకు శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ,తెలంగాణ ఇంచార్జి దీప దాస్ ముంషి, ప్రభుత్వ సలహాదారులు వెం నరేందర్ రెడ్డి,పీసీసీ సభ్యులు దేపా భాస్కర్ రెడ్డి,టీపీసీసీ తెలంగాణ ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
👉రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం*
గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నార్కోటిక్స్ నియంత్రణపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి లోకేశ్ ఈ నిర్ణయం ప్రకటించారు. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ కు *ఈగల్* గా నామకరణం చేశారు. *స్కూళ్లు, కాలేజీలు, సచివాలయాల పరిధిలో 10 మందితో ఈగల్ కమిటీలు* ఏర్పాటు చేయాలని ఆదేశించారు.వీటిల్లో మహిళా సంఘాలు, ఆశా వర్కర్లను భాగస్వామ్యం చేయాలన్నారు.
👉 కూకటి వేర్లు కాదు.. ఆకును కూడా పీకలేడు.. కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత ఆగ్రహం తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలను ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తే.. దానికి కాంగ్రెస్ నేతలు ప్రతికౌంటర్ ఇస్తూనే ఉన్నారు. దాంతో రాజకీయాలు వాడీవేడిగా మారాయి. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలను ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక కామెంట్స్ చేశారు. కేటీఆర్‌కు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. ‘కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకిలిస్తా అని అంటున్నావు. కాంగ్రెస్ వయసు 140 ఏళ్లు. నీ వయసు 50 ఏళ్లు. మా పార్టీకి ఉన్న వయసు, త్యాగాల ముందు నీ వయసు పావలా వంతు లేదు. కాంగ్రెస్‌ను కూకటి వేళ్లతో పీకేంత శక్తి నీకు ఎక్కడిది’ అంటూ కేటీఆర్‌పై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ వ్యూహాల ముందు కేటీఆర్ ఎంత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కల్ప వృక్షం లాంటిదని, తమ పార్టీ వేర్లు వెతకడానికే వయసు సరిపోదని అన్నారు. పార్టీ కూకటి వేర్లు కాదు.. ఆకును కూడా కేటీఆర్ పీకలేడని హెచ్చరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చారన్న విషయాన్ని కేటీఆర్ మరిచిపోతున్నాడని, ఆయనకు మరోసారి గుర్తు చేస్తున్నామని జగ్గారెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే.. ఇక్కడ ఇప్పటికీ కాంగ్రెస్ లేదంటే టీడీపీ అధికారంలోకి వచ్చుండేవన్నారు. తెలంగాణ వంట చేసింది కాంగ్రెస్ అయితే.. వడ్డించుకున్నది మాత్రం కేసీఆర్ అని ఎద్దేవాచేశారు. తల్లిపాలు తాగి కొమ్ము కోసినట్లుగా కేటీఆర్ మాటలు ఉన్నాయని, సోనియా తెలంగాణ ఇస్తేనే కేసీఆర్ సీఎం అయ్యాడన్న విషయం మరువకూడదని సూచించారు. కాంగ్రెస్ అనే కల్పవృక్షం నుంచే కేసీఆర్ యూత్ కాంగ్రెస్ నేతగా ఎదిగాడన్న సంగతి మరిచిపోకూడదని జగ్గారెడ్డి హితవు పలికారు. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఇంకా 20 ఏళ్లపాటు బతకాలన్నారు. తాము అధికారంలో ఉన్నా.. లేకున్నా హూందాగా ఉంటామని చెప్పారు. బీఆర్ఎస్‌ను జాతీయ పార్టీ అన్నారని, మహారాష్ట్ర, ఒడిసా, ఏపీలకు వెళ్లి కండువాలు కప్పారని, కర్ణాటకలోనూ కాలు పెట్టావని, తర్వాత ఏమైందని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డిని గోకడం.. తన్నించుకోవడం కేటీఆర్‌కు అలవాటుగా మారిందన్నారు. కేటీఆర్, హరీశ్‌రావులు కోతలరాయుళ్లు అని విమర్శించారు. తమను తిట్టినా ఊరుకుంటామేమో కానీ.. సోనియాను, రాహుల్ గాంధీని తిడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
👉 ఢిల్లీలో రోడ్డు, రవాణా మరియు రహదారుల శాఖా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి .
ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలోని పలు సమస్యలను, అభివృద్ధి పనులను ఆయన దృష్టికి తీసుకు వెళ్ళినారు.
1. కంభం – పాపినేనిపల్లి రోడ్డు ..2. మార్కాపురం- తర్లుపాడు రోడ్డు ..3. యర్రగొండపాలెం – దుర్గి రోడ్డు
4. ఊళ్ళపాలెం- వేములపాడు రోడ్డు ..5. SK రోడ్డు- భైరవకోన రోడ్డు
6. కనిగిరి- గుడిపాడు రోడ్డు ..7. కురిచేడు- దొనకొండ రోడ్డు ..8. నాయుడుపాలెం- ఒంగోలు/ నంద్యాల రోడ్డు
9. కారుమంచి- ఈతముక్కల- మోటుమాల రోడ్డులో బుకింగ్ హామ్ కెనాల్ పై హై లెవెల్ బ్రిడ్జ్ ఏర్పాటు
10. త్రోవగుంట- చదలవాడ బైపాస్ రోడ్డు లో విద్యుత్ దీపాల ఏర్పాటు11. శానికవరం గ్రామం, దోర్నాల- కుంట నేషనల్ హైవే నుండి సర్వీస్ రోడ్ ఏర్పాటు తదితర అంశాలను కేంద్రం మంత్రి గట్కారి దృష్టికి ఆయన తీసుకెళ్లారు
👉 డిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ని ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి.. జిల్లా స్టాపర్ ఎస్ రహేమాన్.
👉సాయిరాం పాప్ & ఇంటీరియల్ వర్క్స్ ప్రారంభోత్సవంలో పాల్గోన్న ఎమ్మెల్యే సోదరుడు
*గిద్దలూరు పట్టణంలోని, కొమరోలు బస్టాండ్ సమీపంలో నల్లగుంట్ల గ్రామానికి చెందిన చల్లా అశోక్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన సాయిరాం పాప్ & ఇంటీరియల్ వర్క్స్ షాపును గిద్దలూరు ఎమ్మెల్యే సోదరుడు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈసందర్బంగా వారి వ్యాపారం అభివృద్ధి చెంది లాభాలతో ముందుకు సాగాలని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియచేశారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి పాల్గోన్నారు. ని.వర్గ రిపోర్టర్ సనావుల్లా ఖాన్..
👉కొండాపురం మండలం సుగమంచిపల్లి వద్ద రోడ్డుపై భారీగా పోలీసుల మోహరింపు…కడప, అనంతపురం బార్డర్ వద్ద పోలీసులు ముమ్మర తనిఖీలు…కడప జిల్లా..
జెసి ప్రభాకర్ రెడ్డి కడపకు వస్తే అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్న పోలీసులు…కడప జిల్లా బార్డర్ సుగమంచి పల్లె వద్ద అడ్డుకొని ,అక్కడి నుంచి వెనక్కు పంపేఅవకాశం…
👉ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో బెంగళూరుకు చెందిన ఇద్దరు మహిళలు…కడప జిల్లా.
ఆర్థిక లావాదేవీల్లో పొద్దుటూరుకు పిలిపించిన దువ్వూరు మండలం గోపులాపురానికి చెందిన రమణారెడ్డి, అలియాస్ వడ్ల వ్యాపారి రామారావు..
బెంగళూరు చెందిన ఇద్దరు మహిళలు రామారావుకు డబ్బులు బాకీ ఉన్న విషయంపై రప్పించిన రామారావు…
బెంగళూరు నుంచి వచ్చిన మహిళలు బాడుగకు తెచ్చుకున్న కారును డ్రైవర్ను కొట్టి లాక్కెళ్ళిన రామారావు అనుచరులు…మహిళలను మంగళవారం ఉదయం నుంచి ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టి పంచాయతీ చేస్తున్న రామారావు
రాత్రి 9:00 అవుతున్న ఇద్దరు మహిళలు పోలీస్ స్టేషన్ లోనే..కారు ఎత్తుకెళ్లిన వారిపై కేసు నమోదు చేయకుండా సివిల్ పంచాయతీలో టూ టౌన్ పోలీసులు…ప్రొద్దుటూరు ఎమ్మెల్యే పేరు చెప్పి డబ్బు కట్టకపోతే మహిళలను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్తానని బెదిరిస్తున్న ప్రొద్దుటూరు వినాయక గార్మెంట్స్ రాజశేఖర్ రెడ్డి, రామారావు
👉అప్పుల భారం.. వరంగల్, మెదక్ జిల్లాల్లో మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య
వరంగల్ – దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన హింగె శోభన్ బాబు (48) మిర్చి, ఇతర పంటలు సాగు చేస్తున్నాడు. సుమారు 10 లక్షల వరకు అప్పులు అయ్యాయి.
అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు గురయ్యాడు.. దీంతో మిర్చి తోట వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి, పెద్ద కుమార్తె రవళికి ఫొన్ చేసి చెప్పాడు.. చికిత్స పొందుతూ మృతిచెందాడు.
మెదక్ – రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్‌కు చెందిన చాకలి దుర్గోల్ల బాలేశ్ (28)కు రెండెకరాల భూమి ఉన్నది.
అందులో బోరుబావులు తవ్వించినా చుక్కనీరు పడలేదు. వేసిన పంట వేసినట్టే ఎండి పోవడంతో తీవ్రంగా కలత చెందాడు.. దీంతో ఇంట్లో దూలానికి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
👉లగచర్ల లొల్లి మరువకముందే దిలావర్‌పూర్‌లో మొదలైంది..ఆర్డీవో రత్న కళ్యాణి కారు మీద దాడి చేసి ఎత్తి పడేసిన రైతులు..
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆర్డీవో రత్న కళ్యాణి వచ్చి ఆందోళన విరమించాలని ఆమెను ఆరు గంటలు పైగా రైతులు నిర్బంధించారు.128 రోజులుగా చేస్తున్న తమ ఉద్యమానికి మద్దతు తెలిపిన విజయ్ కుమార్ అనే ప్రధానోపాధ్యాయుడును సస్పెండ్ చేయగా అయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించమని రైతులు భీష్మించుకుని ఉండగా వెళ్లిపోవాలని ప్రయత్నించిన ఆర్డీవో రత్న కళ్యాణిని అడ్డుకున్నారు.
ఒకానొక సందర్భంలో ఆమె బీపీతో అస్వస్థతకు గురి కాగా భారీ పోలీసు బందోబస్తు నడుమ జిల్లా ఎస్పీ ఆమెను రక్షించేందుకు యత్నించగా మహిళలు దాడి చేయబోయారు.. అనంతరం ఆమెను ఎస్పీ తన కారులో ఆసుపత్రికి తరలించారు.ఆర్డీవో వెళ్లిపోయిన తరువాత ఆందోళనకారులు ఆమె కారు మీద దాడి చేసి ఎత్తి పక్కన పడేశారు.
💥టపాతోపు వద్ద హిజ్రా లీడర్ హాసిని దారుణ హత్య తో పెద్ద ఎత్తున నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న హిజ్రాలు..*💥నెల్లూరు జిల్లా…
*👉ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు*
*👉హాసినిది తిరుపతి కావడంతో తిరుపతి నుంచి నెల్లూరు నుంచి వందల సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుంటున్న హిజ్రాలు*
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపు వద్ద దారికాచి హిజ్రా నాయకురాలు హాసిని ని కొందరు దుండగులు కత్తులతో పొడిచి దారుణ హత్య, పోస్టుమార్టం నిమిత్తం హాసిని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి వద్దకు తరలించారు, దీంతో ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా లలోని హిజ్రాలు భారీ ఎత్తున నెల్లూరు ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకొని నేలపై బైఠాయించి నిరసన తెలియజేశారు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకొని పరిస్థితిని అదుపులో ఉంచుతున్నారు.. హాసినిది స్వస్థలం తిరుపతి కావడంతో తిరుపతి నుండి కూడా భారీగా హిజ్రాలు ఆమె తరపు వారు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారు…
👉కదిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా పై కేసు నమోదు..*నకిలీ ఇంటి పట్టాల తయారీ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా పై కేసు నమోదు చేసిన పోలీసులు..
👉గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న 7వ తరగతి విద్యార్థి*..వనపర్తి – మదనాపురం బాలుర గురుకులంలో దుప్పటితో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న కొన్నురు గ్రామానికి చెందిన 7వ తరగతి విద్యార్థి ప్రవీణ్.
👉బాల్య వివాహాలు నేరమంటూ కొవ్వొత్తులతో భారీ ర్యాలీ…..
*పొదిలిలో బాల్య వివాహాలు నేరమంటూ బాల్య వివాహాల రహిత భారతదేశం కావాలని కోరుతూ మండల పరిషత్ కార్యాలయం నుండి విశ్వనాధపురం సెంటర్ వరకు విద్యార్థులతో కలిసి కొవ్వొత్తులతో భారీ ర్యాలీ……*
ర్యాలీని ప్రారంభించిన తహసిల్దార్ కృష్ణారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, యస్సై వేమన, ఎంపిడిఓ శోభన్ బాబు .
అనంతరం విశ్వనాధపురం సెంటర్లో మానవహారం నిర్వహించి ప్రజలకు బాల్య వివాహాల పట్ల ఐసిడిఎస్ అధికారులు అవగాహన కల్పించారు.బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమంటు సుమారు ఎనిమిది వేల మందికి పైగా విద్యార్థులతో, ఉపాధ్యాయులతో, పలు అధికారులతో సంతకాలు సేకరించిన ఐసిడిఎస్ అధికారులు
కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు,సచివాలయం మహిళా పోలీస్,విద్యాశాఖ అధికారులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పార్లమెంటులో వాయిదాల స్టంటు: అదానీ దుమారం..కూకటి వేర్లు కాదు.. ఆకును కూడా పీకలేడు.. కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత ఆగ్రహం..కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఎంపి మాగుంట..కదిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా పై కేసు నమోదు.. గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న 7వ తరగతి విద్యార్థి(వనపర్తి).. ఆర్డీవో రత్న కళ్యాణి కారు మీద దాడి చేసి ఎత్తి పడేసిన రైతులు (దిలావర్ పూర్) ..హిజ్రా అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య (తెలంగాణ)..లీడర్ హాసిని దారుణ హత్య( నెల్లూరు).. పొదిలిలో ర్యాలీ
Recent Posts