👉 వివాదాస్పద పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మధ్య అవినీతి ఒప్పందంపై దర్యాప్తునకు ఆదేశించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్‌ను అభ్యర్థించారు. రాజ్‌భవన్‌లో బుధవారం ఆమె గవర్నర్‌ను కలసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. అదానీ, జగన్ మధ్య ముడుపుల బంధం వలన రాష్ట్రానికి తీవ్ర నష్టమని, వెంటనే ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని గవర్నర్‌ను కోరినట్టు తెలిపారు.
👉అదానీ వ్యవహారంపై స్పందించిన వైఎస్ జగన్..*
*అదానీపై నమోదైన కేసులో నా పేరు ఎక్కడా లేదు..*
*నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు..*
*తప్పుడు ఆరోపణలు చేసినవారిపై పరువునష్టం దావా వేస్తా.*సీఎంలు పారిశ్రామికవేత్తలను కలుస్తారు.*
*ఐదేళ్లకాలంలో నేను అదానీని అనేకసార్లు కలిశాను.*
*అదానీతో భేటీకి విద్యుత్ ఒప్పందాలకు సంబంధం లేదు.. నాపై తప్పుడు ప్రచారం చేసినవారికి లీగల్ నోటీసులు ఇస్తా-వైఎస్ జగన్*
👉 గడువు తేదీ ముగిసిన 10 లక్షల ఆహార ప్యాకెట్లు
ఫుడ్ సేఫ్టీ అధికారుల
తనిఖీల్లో పట్టుబడ్డ గుర్రం లింగయ్య జనరల్ స్టోర్స్
విజయవాడ, నవంబర్ 28.
విజయవాడ వన్ టౌన్ లాలిమా బార్ వద్ద కేబీఎన్ కాలేజ్ సమీపాన ఉన్న గుర్రం లింగయ్య జనరల్ స్టోర్స్ లో గురువారం ఫుడ్ సేఫ్టీ ఉన్నతాధికారులు పూర్ణచందర్రావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేశారు. 10 లక్షల విలువ చేసే గడువు తేదీ ముగిసిన (ఎక్స్పైర్ అయిన) ఆహార పొట్లాల ప్యాకెట్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు వారి తనిఖీలో వెలుగు చూసినవి. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సంబంధిత జనరల్ స్టోర్స్ అధినేత పై చర్యలు చేపట్టారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు ప్యాకెట్లు ఈ ఈ స్టోర్ లో లభ్యం అవ్వడంతో మిగిలిన ప్రాంతాల్లోనూ సోధాలు నిర్వహించారు.ప్రజా ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా ఉండే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.
👉కాకినాడ కలెక్టర్ సింగం హీరో లా సముద్రంలో ఛేజింగ్ సీన్..*సముద్రంలో సింగం-2 సీన్ రిపీట్*
*కాకినాడ నుంచి పశ్చిమ ఆఫ్రికా నౌకలో పేదల బియ్యం*
*సముద్రంలోకి వెళ్లి తనిఖీ చేసిన కాకినాడ కలెక్టర్*
*‘స్టెల్లా ఎల్’ షిప్‌లో 640 టన్నుల పీడీఎస్ బియ్యం గుర్తింపు*..*కాకినాడ పోర్టులో సోదాలు*
పేదల బియ్యం(పీడీఎస్) అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. కాకినాడ పోర్టు ద్వారా అడ్డదారిన విదేశాలకు తరలిపోతూనే ఉన్నాయి. ఇక్కడి యాంకరేజి పోర్టులో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పశ్చిమ ఆఫ్రికా వెళ్లేందుకు సిద్ధమైన స్టెల్లా ఎల్ నౌకలో 640 మెట్రిక్ టన్నుల పేదల బియ్యాన్ని గుర్తించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఈ సోదాలు చేపట్టారు. బార్జిలు నిలిపే ప్రాంతం నుంచి సముద్రంలో గంటపాటు ఓడలో కలెక్టర్ ప్రయాణించారు. ‘స్టెల్లా- ఎల్’ నౌక ఉన్న ప్రాంతానికి పోలీసు, పోర్టు, మెరైన్, రెవెన్యూ, పౌరసరఫరాల బృందంతో చేరుకున్నారు. నౌకలోని ఐదు గదుల్లో (హేచెస్) నిల్వ ఉంచిన బియ్యం నిల్వల నమూనాలు సేకరించారు. 3, 5 గదుల్లోకి దిగి ప్రత్యక్షంగా నిల్వలు పరిశీలించారు. అనుమానం ఉన్నవాటిని అక్కడికక్కడే రసాయనాలతో పరీక్షించారు. 52 వేల టన్నుల సామర్థ్యం ఉన్న నౌకలో 38 వేల టన్నుల బియ్యం లోడయ్యిందని.. అందులో 640 టన్నులు పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించామని కలెక్టర్ విలేకర్లకు తెలిపారు. గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సీజ్ చేసిన పేదల బియ్యాన్ని ఇటీవల బ్యాంకు గ్యారంటీతో విడుదల చేశామని..పట్టుకున్న బియ్యం నిల్వలు అలాగే ఉన్నాయని అనిపిస్తోందన్నారు. అక్కడున్న మిగిలిన నిల్వలు బాయిల్డ్ రైస్‌గా పేర్కొన్నారు. పీడీఎస్ బియ్యంపై రసీదులు తనిఖీ చేశాక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
కాకినాడ కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా సమాచారంతో గత 2 రోజులుగా తనిఖీలు సాగుతున్నాయి. సోదాల్లో స్వాధీనం చేసుకున్నది పేదల బియ్యమే అని అధికారులు చెబుతున్నా అక్రమాలపై పూర్తిస్థాయి స్పష్టత లేదు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ సుధీర్ మంగళవారం రాత్రి కరప మండలం నడకుదురులోని గోదాములో ఆకస్మిక తనిఖీలు చేసి ఐదు లారీల్లోని బియ్యాన్ని సీజ్ చేశారు. తెలంగాణ నుంచి వచ్చిన ఓ లారీలో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించి నమూనాలను పరీక్షలకు పంపారు. గురువారం కలెక్టర్ ఆధ్వర్యంలో పోర్టులో సోదాలు సాగాయి. ఈ రెండుచోట్లా పట్టుకున్నది ఇటీవల బ్యాంకు గ్యారంటీతో విడుదలైన పేదల బియ్యమే అనే అభిప్రాయం వినిపిస్తున్నా..ఆ ముసుగులో సరకు తరలిపోతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
*పోర్టు బార్జిలోనూ పేదల బియ్యం*
కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేసే నౌకలోకి ఎక్కించేందుకు వెళ్తున్న బార్జి ఐవీ0073లో 1,064 టన్నుల బియ్యం నిల్వలను అధికారులు బుధవారం రాత్రి గుర్తించారు. ఇవి లావణ్, సాయితేజ ఎక్స్‌పోర్ట్స్‌కు చెందినవిగా తేలింది. వీటి నమూనాలు పరీక్షిస్తే పీడీఎస్ ఆనవాళ్లు ఉన్నాయని చెప్పారు. ఇటీవల బ్యాంకు గ్యారంటీతో విడుదలచేసిన పీడీఎస్ నిల్వలని చెబుతున్నారని, పత్రాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని డీఎస్‌వో ప్రసాద్ తెలిపారు.
👉వితంతు పింఛనుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు*
ఏపీలో వితంతు పింఛనుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. వృద్ధాప్య పింఛను తీసుకునే భర్త మరణిస్తే వెంటనే భార్యకు పింఛను మంజూరు అయ్యేలా నిర్ణయించింది. భర్త ఒకటో తేదీ నుంచి 15 లోపు మరణిస్తే వెంటనే పింఛన్ ఇవ్వాలని, 15 నుంచి 30తేదీ లోపు చనిపోతే వచ్చే నెల నుంచి పింఛన్ అందజేయాలని స్పష్టం చేసింది.కుటుంబపెద్ద మరణిస్తే ఆర్థికంగా నలిగి పోకూడదని, ఆసరాగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది
👉విజయ్‌పాల్‌కు రిమాండ్ .. కస్టడీకి ఇవ్వాలని కోరిన పోలీసులు*
గుంటూరు: సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ను పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపర్చారు. 11 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టు ముందుంచిన పోలీసులు..
విజయ్‌పాల్‌ను రిమాండ్‌కు ఇవ్వాలని కోరారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని తెలిపారు. వాస్తవాలు రాబట్టేందుకు ఇంటరాగేషన్ అవసరమని పేర్కొన్నారు. రఘురామకు చిత్రహింసల కేసులో విజయ్‌పాల్ పాత్ర కీలకమని కోర్టు దృష్టికి తెచ్చారు. చిత్రహింసల వెనుక సూత్రధారులను కనుగొనాల్సి ఉందని పోలీసులు తెలిపారు. రిమాండ్ రిపోర్టు పరిశీలించిన న్యాయమూర్తి విజయ్‌పాల్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు..
👉చిత్తూరు ..కన్నతల్లి పై పోలీస్ కానిస్టేబుల్ దాష్టీకం.
తాగిన మత్తులో తల్లిపై దాడి చేసిన శంకర్ అనే కానిస్టేబుల్.
చికిత్స పొందుతూ మృతి చెందిన కానిస్టేబుల్ తల్లి వసంతమ్మ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చిత్తూరు టూ టౌన్ పోలీసులు.
👉ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు*
*జనవరి 14న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు*
*మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు*
*పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేత*
👉పేకాట స్థావరంపై దాడి – 9 మంది వ్యక్తులు అరెస్టు, రూ.72,100/- నగదు సీజ్.పల్నాడు జిల్లా పోలీస్…
*పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈరోజు మధ్యాహ్నం నరసరావు పేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంగుంట్ల గ్రామం లోని శ్రీ లక్ష్మి విజయ పార్కింగ్ రూంలో పేకాట ఆడుతున్న వారిని తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించిన నరసరావు పేట రూరల్ ఎస్సై కిషోర్…
పేకాట ఆదుచున్న 9మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి 72,100/ నగదు స్వాధీనం చేసుకోవడం జరిగినది.నరసరావు పేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
👉 ఎమ్మెల్యే ముత్తుములకు శుభాకాంక్షలు తెలిపిన రాచర్ల మైనార్టీ సోదరులు
*గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పిఏసి సభ్యులుగా నియమితులైన గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డిని రాచర్ల మైనార్టీ సోదరులు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వారికి పూలమాల శాలువా వేసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో రాచర్ల మండల పార్టీ అధ్యక్షుడు కటికే యోగానంద్,గోపిరెడ్డి జీవనేశ్వర్ రెడ్డి మరియు ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ సనాఉల్లా ఖాన్, షేక్ అబ్దుల్ రహిమాన్,షేక్ అక్బర్ సాహెబ్, పఠాన్ హాఫిజ్ ఖాన్, షేక్ అచ్చు కట్ల నబి రసూల్,డి ఖాదర్ వలి,ఖాజీ అబ్దుల్ రషీద్,గౌస్ ఖాన్,హబీబ్ బాషా,ఖాసీం పాల్గొన్నారు…ని.వర్గ రిపోర్టర్ సనావుల్లా ఖాన్..
👉తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జి గా ఎంపిక అయిన సత్తెనపల్లి యువతి రోషన్*
సత్తెనపల్లి పట్టణానికి చెందిన షేక్ కరిముల్లా ,సుజాత గార్ల ఏకైక కుమార్తె షేక్ రోషన్ 2024 లో విడుదల అయిన జూనియర్ సివిల్ జడ్జి నోటిఫికేషన్ లో దరఖాస్తు చేసుకున్నారు ,వివిధ దశల్లో జరిగిన విధానంలో సపళీకృతురాలు అయ్యారు.ఈమె తండ్రి ప్రవేటు ఉద్యోగి తల్లి సత్తెనపల్లి ప్రధాన జూనియర్ జడ్జి (సివిల్ డివిజన్)కోర్టు లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.షేక్ రోషన్ 1నుంచి 5 తరగతులు నెల్లూరు లోను,6నుంచి 10 వరకు సత్తెనపల్లి ప్రగతి విద్యాసంస్థల్లో ,ఇంటర్ గుంటూరులోను,అనంతరం క్లాట్ లో ర్యాంక్ సాధించటంతో విశాఖ లోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ లో 5 సంవత్సరాల లా విద్యను 2023 లో పూర్తి చేశారు.వెంటనే ఏ.పి బార్ కౌన్సిల్ లో న్యాయవాది గా ఎన్రోల్ అయ్యారు.వెను వెంటనే 2024 లో జూనియర్ సివిల్ జడ్జి నోటిఫికేషన్ విడుదల అవ్వటం ,తొలి నుంచి అన్నిట్లో ప్రథమ ర్యాంక్ లో నిలిచారు.తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జి గా ఎంపిక అవ్వటంతో ఆమె తల్లి దండ్రులు ఆనందానికి అవధులు లేవు.. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు ఆమెను అభినందించారు.
👉*మార్కాపురంలో మార్మోగిన జాబ్ మేళా*
*యువ నాయకుడి సారాధ్యం లో భారీ స్థాయిలో ఉద్యోగాలు పొందిన నిరుద్యోగులు*
ప్రకాశం జిల్లా ::మార్కాపురం ::
మార్కాపురంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు యువనాయకులు మాగుంట రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు ప్రకాశం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుండి 4800 మంది హాజరు అయినారు. వారిలో 2549 మందికి వివిధ ప్రముఖ కంపెనీల నుండి ఉద్యోగం పొందినారు. మరొక 150-200 మందికి రానున్న 6-7 రోజుల్లో మరి కొన్ని కంపెనీల నుండి ఉద్యోగాలు పొందనున్నారు.
వీరిలో TECH మహీంద్రా, విప్రో, గేర్ అప్ టెక్ సొల్యూషన్స్, టాటా స్ట్రైవ్, అమరా రాజా బ్యాటరీస్, వరుణ్ మోటార్స్, AXIS, HDFC, ICICI, IDFC, మహీంద్రా ఫైనాన్స్, పేటీఎం, అపోలో ఫార్మసీ, *UDYOGA SAMACHAR (ఉద్యోగ సమాచార్)*,SBI, Amazon, జస్ట్ డయల్, MRF టైర్స్, HERO కార్పొరేషన్,డైకిన్,రవితేజ మ్యాన్ పవర్,బజాజ్ ఫైనాన్స్,కెన్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్, RS ఫార్మా,TVS,మాళవిక డెవలపర్స్, BLUSTAR, VLR ఫెసిలిటీస్,ISUZU,Zepto, G4S సెక్యూరిటీస్, టెలిపర్ఫార్మెన్స్,కాగ్నెట్ ఈ సర్వీసెస్,Fluxtek సొల్యూషన్స్ పాల్గొన్నారు.. జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రహిమాన్
👉మూడో ప్రపంచ యుద్ధంపై వణికించే భవిష్యవాణి! మూడో ప్రపంచ యుద్ధంపై ఓ బిషప్ చెప్పిన భవిష్యవాణి ఇప్పుడు షాకింగ్ గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్, హమాస్, ఇరాన్, రష్యా, ఉక్రెయిన్, ఉత్తర కొరియా దేశాలు ఇప్పటికే యుద్ధంలో బిజీగా ఉన్న నేపథ్యంలో.. మరోపక్క అణ్వాయుధాలు సిద్ధం చేసుకుంటున్నాయనే కథనాలొస్తున్న తరుణంలో.. మూడో ప్రపంచ యుద్ధంపై ఓ బిషప్ చెప్పిన భవిష్యవాణి ఇప్పుడు షాకింగ్ గా మారింది. అవును… పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో.. రష్యా-ఉక్రెయిన్ వార్ అవిరామంగా కొనసాగుతూ, ఇటీవల తీవ్ర రూపం దాల్చినట్లు చెబుతున్న నేపథ్యంలో.. త్వరలో మూడో ప్రపంచ యుద్ధం తప్పదని పలువురు అభిప్రాయపడుతుంటే.. ఇప్పటికే మొదలైందని ఉక్రెయిన్ మాజీ సైనికాధికారి ఇటీవల షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చెందిన బిషప్ చెప్పిన భవిష్యవాణి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిడ్నీకి చెందిన బిషప్ మార్ మేరీ ఇమ్మాన్యుయేల్ మూడో ప్రపంచ యుద్ధం భారీ బీభత్సాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో లెక్కలేనంతమంది ప్రాణాలు కోల్పోతారని.. బ్రతికున్న వారు పశ్చాత్తాప పడతారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా ఎక్స్ లో ఓ స్పందించిన బిషప్ మార్ మేరీ ఇమాన్యుయేల్ తన వీడియో సందేశంలో మూడవ ప్రపంచ యుద్ధం గురించి షాకింగ్ విషయాలు తెలిపారు.ఈ యుద్ధం భారీ విధ్వంసాన్ని తెస్తుందని హెచ్చరించారు.ఈ యుద్ధంలో ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది కనుమరుగవుతారని తెలిపారు.ఇక మిగిలిన మూడింట రెండొంతుల మంది తాము ఇక పుట్టకూడదని కోరుకుంటారని అన్నారు.ప్రధానంగా ఈ యుద్ధంలో అణ్వాయుధాలను వినియోగిస్తారని ఫలితంగా ఈ స్థాయిలో ప్రాణనష్టం ఉంటుందని వెల్లడించారు.దీంతో బిషప్ చెప్పిన భవిష్యవాణి నెట్టింట వైరల్ గా మారాయి.
అదానీ జగన్ ల అవినీతి ఒప్పందంపై దర్యాప్తునకు ఆదేశించాలని గవర్నర్ కు షర్మిల వినతి .. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు- జగన్.. “సముద్రంలోకి వెళ్లి తనిఖీ చేసిన కాకినాడ కలెక్టర్ ..విజయ్‌పాల్‌కు రిమాండ్ .. కస్టడీకి ఇవ్వాలని కోరిన పోలీసులు ..పేకాట స్థావరంపై దాడి – 9 మంది వ్యక్తులు అరెస్టు (నరసరావుపేట)..జూనియర్ సివిల్ జడ్జి గా ఎంపిక అయిన సత్తెనపల్లి యువతి రోషన్..మార్కాపురంలో మార్మోగిన జాబ్ మేళా ..మూడో ప్రపంచ యుద్ధంపై వణికించే భవిష్యవాణి!..ఎమ్మెల్యే ముత్తుములకు శుభాకాంక్షలు తెలిపిన మైనార్టీ సోదరులు
Recent Posts