👉హరికృష్ణ కూతురు సుహాసినికి రాజ్యసభ టికెట్ ?ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ప్రస్తుతం ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల ఈ రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారు అయింది. డిసెంబర్ 20వ తేదీన ఈ రాజ్యసభ స్థానాలకు పోలింగ్ కూడా జరగనుంది. వైసీపీ పార్టీ కి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. *ఈ లిస్టులో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య లాంటి కీలక నేతలు ఉన్నారు. ఈ ముగ్గురు నేతలు వైసిపి పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇందులో మోపిదేవి వెంకటరమణ అలాగే బీద మస్తాన్ రావు ఇద్దరు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అటు ఆర్ కృష్ణయ్య మాత్రం బీసీ ఉద్యమం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఖాళీ అయిన మూడు స్థానాలను కచ్చితంగా తెలుగుదేశం కూటమి దక్కించుకునే ఛాన్సులు ఉంటాయి. వాళ్లకు మాత్రమే ఈ ఆఫర్ ఉంది.
అయితే మూడు రాజ్యసభ స్థానాలలో… తెలుగుదేశం, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీలలో ఎవరికి ఏ స్థానం దక్కుతుందో అని అందరిలోనూ టెన్షన్.. ఉంది. వాస్తవంగా.. తెలుగుదేశం పార్టీకి రెండు రాజ్యసభ స్థానాలు వస్తాయని అంటున్నారు. ఒకటి జనసేన లేదా బిజెపి పార్టీకి వెళ్తుందని చెబుతున్నారు. ఒకవేళ జనసేన పార్టీకి వస్తే నాగబాబుకు రాజ్యసభ టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇటు తెలుగుదేశం పార్టీలో.. ఆ టికెట్ కోసం పోటీపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.
గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్రావు, అశోక్ గజపతిరాజు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది… లిస్టులో ఉన్నారు. ఇది… ఇలా ఉండగా హరికృష్ణ కూతురు సుహాసిని కి… రాజ్యసభ టికెట్ ఇస్తారని కొంత ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆమెతో చర్చలు కూడా చేస్తున్నారట చంద్రబాబు నాయుడు. ఆమె ఓకే అంటే కచ్చితంగా ఆమెకు రాజ్యసభ టికెట్ వస్తుందని చెబుతున్నారు.
😯 ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మూడు స్థానాలు కూడా వైసీపి నుంచి రాజ్యసభ ఎంపీలుగా గెలిచి వారు రాజీనామా చేసినవే కావడం విశేషం. వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీలుగా గెలిచిన బీద మస్తాన్ రావు – మోపిదేవి వెంకట రమణ తో పాటు తెలంగాణ కు చెందిన బీసీ సంఘాల నేత ఆర్. కృష్ణయ్య సైతం ఎంపీలుగా ఎన్నికయ్యారు. అయితే ఈ యేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. ఆ పార్టీకి మొత్తం 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. పార్టీ ఓడిపోయిన ఐదు నెలలకే ఏకంగా ముగ్గురు దూరమయ్యారు. ఇక తెలుగుదేశం పార్టీ పుట్టాక ఆ పార్టీకి రాజ్యసభలో ప్రాథినిత్యం లేకపోవడం ఇదే ఫస్ట్ టైం. అలాంటిది ఇప్పుడు ఐదు నెలల్లోనే అలా అధికారం వచ్చిందో లేదో వెంటనే మళ్లీ టీడీపీకి రాజ్యసభ సీటు దక్కనుంది.
ఇక ఈ మూడు సీట్లలో రెండు సీట్లు టీడీపీ తీసుకుని ఒకటి జనసేనకు ఇస్తుందని టాక్ ? టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావుతో పాటు వర్ల రామయ్య పేర్లు దాదాపు ఖరారు అయ్యాయని అంటున్నారు. వీరిలో బీద మస్తాన్ రావు వైసీపీ నుంచి వచ్చి ఆయన రాజ్యసభ సీటు వదులు కోగా ఆయన సీటునే తిరిగి ఇప్పుడు ఆయనకు ఇస్తున్నారు. ఇక వైసీపీ నుంచే వచ్చి రాజ్యసభ సీటు వదులుకున్న మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణకు ఎమ్మెల్సీ ఇస్తారని టాక్ ? ఇక జనసేన కు ఇచ్చిన సీటు నుంచి నాగబాబు ఎంపీ కాబోతున్నారట. నాగబాబు జనసేన నుంచి ఎంపీగా వెళితే జనసేన నుంచి రాజ్యసభకు వెళ్లిన తొలి ఎంపీగా ఆయన రికార్డుల్లోకి ఎక్కుతారు. అలా జనసేన హిస్టరీలో తొలి రాజ్యసభ ఎంపీ అయిన క్రెడిట్ ఆయన పేరు మీద ఉండిపోతుంది.
👉 డిసెంబర్ 7న నిర్వహించబోయే తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని రాజకీయాలకు అతీతంగా విజయవంతం చేయాలని మంత్రి నారా లోకేష్ పిలుపు..
ప్రజాప్రతినిధులు, దాతలు, పూర్వవిద్యార్థులు, స్వచ్చంద సంస్థలను ఆహ్వానిస్తూ లేఖ విడుదల చేసిన మానవవనరులు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్..
పాఠశాల విద్యావ్యవస్థకే అతి పెద్ద పండుగగా రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీన నిర్వహించనున్న తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం (PTM)లో పాల్గొని విజయవంతం చేస్తారని కోరుతున్నాను. ఈ సమావేశం పాఠశాలల బలోపేతానికి, విద్యార్థి వికాసానికి, సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా నిలుస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు,తల్లిదండ్రుల మధ్య ఓ ఆత్మీయ వారధిని నిర్మిస్తుంది.ఎడ్యుకేట్, ఎంగేజ్,ఎంపవర్ లక్ష్యాలతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రమంతా ఒకేసారి డిసెంబర్ 7న విద్యార్థుల తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల సమావేశం పండుగ వాతావరణంలో నిర్వహించాలని నిర్ణయించామన్నారు.
ఇందులో వార్డు సభ్యుల నుంచి పార్లమెంటు సభ్యుల వరకూ సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకూ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనాలని కోరారు.
👉 దర్యాప్తు కోసం వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. కుర్చీలు, ఫర్నీచర్‌తో భౌతిక దాడికి తెగబడటంతో ఓ అధికారి గాయపడ్డారని ఈడీ అధికారులు ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ ఘటన ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతంలో జరిగింది. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, క్యూఆర్ కోడ్ చీటింగ్ వంటి సైబర్ మోసాల కేసులో ముడిపడి ఉన్న చార్టెడ్ అకౌంటెంట్స్ లక్ష్యంగా గురువారం దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో బిజ్వాసన్ ప్రాంతంలోని అశోక్ శర్మ అనే సీఏ ఫామ్‌హౌ్‌సపై అధికారులు దర్యాప్తుకు వెళ్లారు. సోదాలు నిర్వహిస్తున్న వారిపైౖ అశోక్, అతడి సోదరుడు చేతికి దొరికిన ఫర్నీచర్, కుర్చీలతో దాడికి దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.
👉హైదరాబాద్లో ఉంటున్నారా.?.. అయితే బయట తిరిగేటప్పుడు అది ధరించకుంటే ప్రాణాలు గాల్లో కలిసినట్టే..!…హైదరాబాద్..
జీహెచ్ఎంసీ, రవాణా, వ్యవసాయ, విద్య తదితర విభాగాలు పీసీబీ సూచనలను పెడచెవిన పెట్టడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని పర్యావరణవేత్తలు అంటున్నారు. పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలపై చెస్ట్ హాస్పిటల్ డాక్టర్లు ఏమంటున్నారో తెలుసా? స్వచ్ఛమైన వాతావరణంలో, గాలిలో సూక్ష్మ దూళి కణాల స్థాయి క్యూబిక్ మీటర్‌కు 50 మైక్రోగ్రాముల లోపు ఉండాల్సి ఉండగా సనత్ నగర్ పారిశ్రామిక ప్రాంతంలో 255 నుంచి 300 మైక్రోగ్రాములుగా నమోదవుతుంది. దీంతో ఈ ప్రాంతంలో ఎక్కువ మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు బొల్లారం పారిశ్రామిక వాడలో 118, హెచ్‌సీయూ ప్రాంతంలో 128, పటాన్ చెరువులో 151, పాశమైలారంలో 126, సోమాజిగూడలో 121, జూపార్కు వద్ద 102 మైక్రో గ్రాములు ఉంటున్నట్లు అధికారిక లెక్కలు చెపుతున్నాయి.కాలుష్యాన్ని నివారించేందుకు నగరం లోపల, వెలుపల ఉన్న పరిశ్రమలతో వాయు కాలుష్యానికి సంబంధించిన పర్యావరణానికి అనుకూలమైన టెక్నాలజీని ఉపయోగించాలి. సోలార్, విండ్ పవర్ వంటి పునరుత్పత్తి వనరులను ప్రోత్సహించాలి.
దీని ద్వారా ప్రతి సంవత్సరం వాయు కాలుష్యాన్ని నివారించేందుకు వీలవుతుందని వాతావరణ కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు చెబుతున్నారు. కాలం చెల్లిన పాత వాహనాలకు రహదారపై తిరగకుండా చూడడం, కొత్త వాహనాలకు ఎమిషన్ ప్రమాణాలను కఠినంగా అమలు చేయడం అవసరమని పీసీబీ సృష్టం చేసింది. నగరంలో మొక్కలు నాటడం, పచ్చని ప్రదేశాలను పెంపొందించడం ద్వారా వాయు నాణ్యత మెరుగుపరవచ్చని తెలిపింది. ప్రజలకు వాయు కాలుష్యం వల్ల జరిగే హాని, దాని ప్రభావాలు, నివారణ మార్గాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. ట్రాఫిక్ నిబందనలను కఠినంగా అమలు చేయాలని పీసీబీ హెచ్చరిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని, పాత పరిశ్రమలను ఆధునికీకరించి కాలుష్యాన్ని తగ్గించడానికి మార్పులు చేయాలని సూచించింది.
సనత్ నగర్ ఏరియాలలో ఈ నెల 22, 23, 24, 25 తేదీల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది. ఆ తేదీల్లో 254, 253, 274, 298 గా నమోదైంది. మరో వైపు సిటీలోని ఇతర ప్రాంతాల్లోనూ ఎయిర్ క్వాలిటీ పడిపోతుంది. కొన్ని ఏరియాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మోడరేట్‌గా నమోదవుతున్నది. వాస్తవానికి గాలివాటాన్ని బట్టి గాలి నాణ్యత పెరగడం, తగ్గడం ఉంటుంది. ఒకచోట నమోదయ్యే వాల్యూస్ ఆ ప్రాంత చుట్టుపక్కల నాణ్యతను కూడా సూచిస్తాయి. ఈ లెక్కన నగరంలో చలికాలం గాలి నాణ్యత సరిగ్గా ఉండడం లేదని చెప్పవచ్చు.
వాయు కాలుష్యం వల్ల వచ్చే సమస్యల గురించి చెస్ట్ హాస్పిటల్ ఇన్చార్జి సూపర్డెంట్ ప్రమోద్ కుమార్ వార్తా ప్రపంచం కు వివరించారు. ” పొల్యూషన్ వల్ల ముఖ్యంగా శ్వాసకోశ ఇబ్బందులు ఎక్కువగా వస్తుంటాయి. ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు ఉండే ఫ్రాంక్ ఐటీసీ లెన్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పొల్యూషన్లో కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ వంటివి ఉంటాయి. పార్టీ ప్లేట్ మేటర్స్ పీలుస్తున్నప్పుడు అప్పర్ రెసిపీలో ఫిల్టర్ అవుతుంటాయి. వింటర్ సీజన్లో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దాంతో కార్బన్ డయాక్సైడ్ ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ అవుతూ ఉంటుంది. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ గాని, రెగ్యులర్‌గా డ్రైవింగ్ చేసేవారు కానీ, రోడ్డుపై వీధి వ్యాపారాలు చేసేవారు కానీ పొల్యూషన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. వారు ఎక్కువగా జాగ్రత్తగా ఉండటం మంచిదని” డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు.
ఎక్కువగా పొల్యూషన్ బారిన పడే వారికి ఎలర్జిక్ రైనాయిటీస్ అనే ఒక జబ్బు ఎక్కువగా వస్తూ ఉంటుంది. తుమ్ములు రావడం, ముక్కు కారడం, ముక్కలు బ్లాక్ కావడం లాంటి సింటమ్స్ ఉంటాయి. ఒకసారి ఎక్కువ రోజులు ఉండటం వల్ల వేరే ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. లంగ్స్‌లో బ్లాక్ ఐటీస్ అనేది కూడా వస్తుంది. ఆ తర్వాత ఊపిరితిత్తులలో నిమోనియాగాని, సీఓపీడీ గాని వచ్చే అవకాశాలు ఉన్నాయి. తేమ ఎక్కువగా ఉండటం వల్ల చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్‌లు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ చలికాలం బ్యాక్టీరియా ఎక్కువగా గాల్లో తేలాడుతూ ఉంటుంది ఆ సమయంలో ఆ గాలి పీల్చడం వల్ల ఇన్ఫెక్షన్లు ఆల్రెడీ జబ్బు ఉన్న వాళ్లపై ఎక్కువ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. చిన్నపిల్లలలో ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పిల్లలకు ఎలర్జీ ప్రాబ్లమ్‌లు కూడా ఎక్కువగా ఈ మధ్య వస్తున్నాయి. పిల్లలలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండటంలో ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనాలజీ డిసీజ్ ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళకి వస్తుంది. స్మోకింగ్ చేస్తూ ఇటువంటి పొల్యూషన్ ఎక్కువైనప్పుడు ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. పొల్యూషన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. తప్పకుండా కంటిన్యూగా ఎక్స్పోజింగ్ అయ్యే వాళ్ళు మాస్క్ ఖచ్చితంగా ధరించాలని డాక్టర్ ప్రమోద్ కుమార్ సూచించారు.
*బెల్ట్ షాపుపై దాడులు నిర్వహించిన కంభం ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్
• 14 క్వార్టర్ బాటిళ్లు సీజ్.. ఒకరు అరెస్టు…_
*కంభం:* ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం బేస్తవారిపేట గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బెల్ట్ షాపుపై ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో N.నరేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 14 క్వార్టర్ (180 ఎంఎల్) బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కొండారెడ్డి మాట్లాడుతూ ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహించినా, అక్రమంగా మద్యం తరలించినా, అక్రమంగా మద్యం కలిగి ఉన్నా,అమ్మినా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ వారికి వెంటనే సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.
👉 ఓరి మీ దుంపల తెగ.. ఏకంగా సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కే ఎసరు..!!! హైదరాబాద్..
సైబర్ నేరస్తులు రోజురోజుకి పెట్రేగిపోతూ సొమ్ము కాజేయడమే పరమావధిగా పెట్టుకున్నారు. విభిన్న మార్గాల్లో జనాల్ని గుళ్ల చేస్తున్నారు. అలాంటి సైబర్ నేరగాళ్లకి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 1930 లాంటి టోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతోంది. వెనువెంటనే కంప్లైంట్స్ తీసుకోవడం.. నగదు బదిలీ అయిన అకౌంట్స్‌ను ఫ్రీజ్ చేయడం వంటివి ఈ నంబర్ ద్వారానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ టోల్ ఫ్రీ నెంబర్‌ను సైతం సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా వినియోగించుకోవడం చర్చనీయాంశమైంది.
సాధారణంగా సైబర్ నేరగాళ్లు మోసం చేయడానికి కొన్ని తెలిసిన పద్ధతులను అనుసరిస్తారు. ఒకటి కొరియర్ ఫ్రాడ్.. మరొకటి డిజిటల్ అరెస్ట్ ఈ రెండు స్కీం లను ఉపయోగించి రీసెంట్‌గా ఎన్నో కోట్ల రూపాయలు దోచుకున్నారు. తాజాగా సైబర్ ఫ్రాడ్‌పై కంప్లైంట్ చేసే 1930ను కూడా తమకు అనుగుణంగా వాడుతున్నారు కేటుగాళ్లు. ముందుగా మీ పేరు మీద ఒక పార్సిల్ వచ్చిందంటూ నమ్మిస్తారు. ఆ పార్శిల్‌లో అనుమాన్పద వస్తువులు ఉన్నాయని కట్టు కథ అల్లుతారు. డ్రగ్స్, వెపన్స్, పాస్‌పోర్ట్‌లు ఉన్నాయని భయపెట్టి మభ్యపెడతారు. ఒకవేళ సైబర్ నేరగాళ్లు, వారి నేర ధోరణిపై ముందుగానే అవగాహన ఉంటే వెంటనే బాధితుడు అలెర్ట్ అవుతాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తా అంటే.. ఆ అవసరం మీకు లేదు మేమే 1930 కు కాల్ కలుపుతాం అంటూ.. వారే పోలీసుల్లా మాట్లాడుతూ సైబర్ క్రైమ్‌కు పాల్పడుతున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల ఇలాంటి కంప్లైంట్స్ కూడా రిసీవ్ చేసుకున్నారు.
కాగా డిజిటల్ అరెస్ట్‌ల రూపంలో ఎన్నో వందల కోట్ల రూపాయాలు కాజేసారు. డిజిటల్ అరెస్ట్‌లపై కేంద్ర ప్రభుత్వం సైతం అవగాహన కల్పించే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. డిజిటల్ అరెస్టుల రూపంలో బాధితులుగా ఉన్నవారు దేశ వ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పోలీస్ యూనిఫామ్ ధరించి ముంబై పోలీస్ లోగోని వెనకాల పెట్టి కేవలం స్కైప్ కాల్‌లో మాట్లాడి బాధితుడుని మాటల్లో పెట్టి ఏదో పెద్ద నేరం జరిగిందని వారిని నమ్మించి వారికి సహాయం చేస్తున్నట్టు నటిస్తున్నారు సైబర్ నేరస్తులు. ఇలాంటి మోసాలు చేసినవారిని ఇతర రాష్ట్రానికి వెళ్లి అనేకమంది నిందితులను అరెస్ట్ చేసి తెలంగాణకు తీసుకొస్తున్నారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు.
తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని రాజకీయాలకు అతీతంగా విజయవంతం చేయాలి -మంత్రి లోకేష్ పిలుపు..హరికృష్ణ కూతురు సుహాసిని కి రాజ్యసభ టికెట్ ?.. జనసేన నుంచి రాజ్యసభకు వెళ్లిన తొలి ఎంపీగా ఆయన రికార్డు ..హైదరాబాద్లో ఉంటున్నారా.?.. అయితే బయట తిరిగేటప్పుడు అది ధరించకుంటే ప్రాణాలు గాల్లో కలిసినట్టే..ఏకంగా సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కే ఎసరు..బెల్ట్ షాపుపై దాడులు(కంభం)
Recent Posts