అదానీపై అమెరికాలో కేసు… కేంద్రం నుంచి ఇంట్రస్టింగ్ రియాక్షన్! ..రాష్ట్ర జైలు అధికారులపై సీఎం సీరియస్ ..కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు అడ్డాగా మార్చేశారు-dy cm పవన్ కళ్యాణ్ ..లేడీ టీచర్ భారీ మోసం.. ..మైనార్టీ శాఖ సలహాదారులు ఎం ఏ షరీఫ్ కు సన్మానం..ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తాం .. నాణ్యమైన విద్య, మౌలిక వసతుల కల్పనే ఎన్దీయే లక్ష్యం..ఎమ్మెల్యే ముత్తుముల ..ప్రజా సమస్యలు పరిష్కరించాలి-ఎమ్మెల్యే కందుల.. మొబైల్ అడిగినందుకు భర్తను కత్తితో పొడిచిన భార్య!..

👉అదానీపై అమెరికాలో కేసు… కేంద్రం నుంచి ఇంట్రస్టింగ్ రియాక్షన్! అవును… అదానీ సంస్థపై ఇటీవల వచ్చిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. సోలార్ పవర్ ప్రాజెక్టులు దక్కించుకోవడంలో భాగంగా అదానీ గ్రూపు రూ.2,100 కోట్ల భారత అధికారులకు లంచం ఇవ్వజూపిందన్న ఆరోపణల వ్యవహారం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో… దాని గురించి ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై స్పందించిన అదానీ గ్రూప్… తమపై వచ్చిన ఆరోపణలను తోసి పుచ్చింది. కాంట్రాక్టులు దక్కించుకోవడానికి లంచం ఇవ్వజూపారంటూ వచ్చిన అభియోగాలాను అసత్యాలని, నిరాధారమైనవని కొట్టి పారేసింది. చట్టాలకు లోబడి తమ గ్రూపు నడుచుకుంటోందని వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో… కేంద్రం స్పందించింది! అవును… అదానీ సంస్థపై ఇటీవల వచ్చిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఇందులో భాగంగా.. ఇది పుర్తిగా ప్రైవేటు సంస్థలు, కొంతమంది వ్యక్తులతో పాటు అమెరికా న్యాయశాఖకు సంబంధించిన వ్యవహారం అని పేర్కొంది. ఇదే సమయంలో… ఈ వ్యవహారానికి సంబంధించి అమెరికా నుంచి భారత ప్రభుత్వానికి ముందస్తుగా ఎలాంటి సమాచారం రాలేదని స్పష్టం చేసింది. ఇటువంటి కేసుల్లో అనుసరించాల్సిన విధానాలు, చట్టపరమైన మార్గాలూ స్పష్టంగా ఉన్నాయంటూ భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ తెలిపారు. ఇదే సమయంలో… అదానీ కేసులో భారత్ కు అమెరికా నుంచి సమన్లు లేదా వారెంటుకు సంబంధించి ఎలాంటి విజ్ఞప్తీ రాలేదని స్పష్టం చేశారు.దీంతో అదానీ వ్యవహారంలో కేంద్రం వైఖరిపై ఒక క్లారిటీ వచ్చేసినట్లే అని అంటున్నారు పరిశీలకులు.
👉విజయవాడతో పాటు రాష్ట్ర జైలు అధికారులపై సీఎం సీరియస్.* *బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని జైళ్ల శాఖ డీజీకి ఆదేశం.* *APMDC మాజీ ఎండీ వెంకటరెడ్డికి జైలులో సకల రాజభోగాలపై నివేదిక తెప్పించుకున్న సీఎం చంద్రబాబు.* *వెంకటరెడ్డికి జైలులో కొత్త ఫ్రిజ్, టీవీ సమకూర్చారని నివేదిక.*బయట నుంచి రోజూ భోజనం ఎలా తెచ్చారని నిలదీసిన సీఎం.
*విద్యుత్ శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సౌరవిద్యుత్ ప్రోత్సాహంలో భాగంగా చేపట్టిన సోలరైజేషన్ కార్యక్రమంపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు.

👉కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు అడ్డాగా మార్చేశారు..
* అధికారుల నిర్లక్ష్యంతో దేశభద్రతకు తీవ్ర ముప్పు
* మొత్తం నెట్‌ వర్క్‌ను బ్రేక్‌డౌన్‌ చేస్తాం
* పీడీఎస్ బియ్యంతో ఉన్న షిప్ సీజ్ చేయండి
* కాకినాడ పోర్టులో పట్టుబడిన అక్రమ రేషన్ బియ్యం సందర్భంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం ..
‘కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు అడ్డాగా మార్చేశారు. ఇక్కడ నుంచి ఇంత భారీగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నార’ని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. తీర ప్రాంతంలో అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందితే అది దేశ భద్రతకే భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘పోర్టు నుంచి ఇంత పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు… భవిష్యత్తులో పేలుడు పదార్థాలు, మత్తు పదార్ధాలు అక్రమ రవాణా దిగుమతి కావని గ్యారంటీ ఏంటి? ఈ అక్రమ మార్గాల్లో కసబ్ వంటి ఉగ్రవాదులు వచ్చే ప్రమాదం ఉండదా?’ అని అధికారులను నిలదీశారు. కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న అక్రమ రవాణా కార్యకలాపాలపై కేంద్రం, దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. శుక్రవారం కాకినాడ యాంకరేజ్‌ పోర్టులో రేషన్ బియ్యంతో పట్టుబడిన స్టెల్లా ఎల్ నౌక వద్దకు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రితో నాదెండ్ల మనోహర్ తో కలిసి ప్రత్యేక బోట్‌లో వెళ్లి పరిశీలించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “కాకినాడ పోర్టు అంటే స్మగ్లర్లకు స్వర్గధామంగా మారిపోయింది. బియ్యం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలి అని చెబుతున్నా క్షేత్ర స్థాయి అధికారులకి ఇంకా మెతగ్గా ఉంటున్నారు. స్మగింగ్ చేసేవాడు ఒక్క బియ్యంతో ఆగడు. మత్తు పదార్థాలు, పేలుడు పదార్థాలను కూడా స్మగ్లింగ్ చేస్తాడు. రాజకీయ ఒత్తిళ్లు అని అధికారులు నిర్లక్ష్యం వహిస్తే అది దేశ భద్రతకే పెనుముప్పు గా మారుతుంది.
* ప్రతిసారీ ప్రజా ప్రతినిధులు వచ్చి ఆపాలా..?
కాకినాడ చుట్టు పక్కల చాలా జాతీయ సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. అక్రమ రవాణా మార్గాల్లో ప్రమాదకర శక్తులు వస్తే ఆయా సంస్థలు, కంపెనీల రక్షణకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉంటే ఉగ్రవాదులను రెడ్ కార్పెట్ వేసి పిలిచినట్లే. ప్రతిసారీ ప్రజాప్రతినిధులు వస్తేనే బియ్యం అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటారా..? రేషన్ బియ్యం మాఫియా వెనుక ఉన్న బోటు ఓనర్లు, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులు, దీని వెనకున్న శక్తులపై కేసులు నమోదు చేయండి. దీని వెనుక ఉన్నది ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలి.
• కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్ గా మార్చేశారు
కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు అడ్డాగా మార్చేశారు. పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని కొంత మంది అక్రమార్కులు స్మగ్లింగ్ చేస్తూ కోట్లు కూడబెడుతున్నారు. రేషన్‌ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టం. మొత్తం నెట్‌ వర్క్‌ను బ్రేక్‌ డౌన్‌ చేస్తాం. రేషన్‌ బియ్యం పేదప్రజలకు మాత్రమే అందాలి. ప్రైవేట్ పోర్టు అయితే ఏదైనా చేయవచ్చు అనుకుంటున్నారేమో? కూటమి పాలనలో అటువంటివి కుదరవు.*నేను వస్తున్నాను అంటే ఎస్పీ సెలవు మీద వెళ్లిపోయారు..రేషన్ బియ్యం ఒక్కటే ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుందో… ఇంకేదైనా జరుగుతున్నాయో ఎవరికి తెలుసు? ఇక్కడ నుంచి ఎంత గంజాయ్ బయటకు వెళ్తుందో ఎవరికి తెలుసు? అక్రమార్కులపై స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా దృష్టి సారించాలి. షిప్ సీజ్ చేసి దీని వెనుక ఉన్నదెవరు నివేదిక ఇవ్వాల”ని అధికారులను ఆదేశించారు.
👉 ఏపిలో గంజాయి, డ్రగ్స్ అనేది కనిపించకూడదు. దీని వెనుక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా “ఈగల్” వదిలి పెట్టదు. ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించమని మాకు ఆదేశాలు ఇచ్చింది. రాజకీయ నాయకులే కాదు, ఇంకా పెద్ద వ్యక్తులు ఉన్నా సరే, వారిని “ఈగల్” వెంటాడుతుందని ఈగల్ చీఫ్ ఐజి రవికృష్ణ హెచ్చరించారు…
👉ప్రజా సమస్యలు పరిష్కరించాలి..పొదిలి మండల సర్వసభ్య సమీక్ష సమావేశంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి..
ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది ప్రజలకు చక్కని సేవలు అందించాలని కార్యాలయాల చుట్టూ ప్రజలను తిప్పుకోవద్దని వీలైనంత త్వరగా ప్రజా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు.
తదనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గత వైసిపి ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలు అయిందని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి వరులు పవన్ కళ్యాణ్,మంత్రివర్యులు నారా లోకేష్ బాబు ,బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాష్ట్రాన్ని తిరిగి బాగు చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారని ఈ ఐదేళ్లు రాష్ట్రానికి పెట్టుబడుల వరద వస్తేనే రాష్ట్రం తిరిగి గాడిలో పడుతుందన్నారు..
ఇప్పటికే ఈ ఐదు నెలల పాలనలో ఎన్డీఏ ప్రభుత్వం 150 పైగా హామీలు నెరవేర్చామని, 93% స్ట్రైక్ రేట్ తో ప్రజలు ఎన్డీఏకు పట్టం కట్టడం జరిగిందని ప్రజల రుణం తీర్చుకోవ డానికి రాబోయే ఐదేళ్లు మరింత శ్రమిస్తామని అన్నారు. ఇక పొదిలి లోని చిన్న చెరువు కబ్జాదారులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకోమని,పొదిలి కి సాగర్ త్రాగునీటి నీరు అందించడానికి త్వరలో టెండర్లు ఆహ్వానిస్తామని తద్వారా పొదిలి పట్టణానికి త్రాగునీరు అందిస్తామని చెప్పారు. త్వరలో బేస్తవారిపేట నుండి ఒంగోలు పట్టణానికి నేషనల్ హైవే నిర్మిస్తామని పొదిలి పట్టణానికి బైపాస్ రోడ్డు నిర్మించి ట్రాఫిక్ కష్టాలు తీరుస్తామని ప్రజలందరూ ఆ కార్యక్రమానికి సహకరించాలని అన్నారు.సమావేశంలో పొదిలి మండలం అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు…* డివిజన్ ఇంచార్జ్ అస్లాం బేగ్
👉నాణ్యమైన విద్య, మౌలిక వసతుల కల్పనే ఎన్దీయే లక్ష్యం..గిద్దలూరు సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణి చేసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..
విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలికవసతుల కల్పనే ఎన్దీయే ప్రభుత్వ లక్ష్యమని, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. గిద్దలూరు పట్టణం, పి.ఆర్ కాలనీలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుప్పట్లు బెడ్ షీట్ .కార్పేట్ పంపిణి కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు బాల్యం నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లల పై పెట్టుకున్న కళలను నిజం చేయాలని, ఒక క్రమశిక్షణతో కూడిన జీవన విధానం జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేధించేందుకు ఉపయోగపడతాయని ప్రతి ఉపాద్యాయుడు వసతి గృహంలో ఉన్న ప్రతి విద్యార్థిని తమ పిల్లలుగా భావించి, వారికీ నాణ్యమైన ఆహారం, విద్యను అందించి వారిని తీర్చిదిద్దాలని అన్నారు.అనంతరం విద్యార్థులకు ఎమ్మెల్యే దుప్పట్లు పంపిణి చేశారు.కార్యక్రమంలో జిల్లా సాంఘిక శాఖ అధికారి నాయక్,గిద్దలూరు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు,పట్టణ టీడీపీ కౌన్సిలర్లు, విద్యార్థులు పాల్గోన్నారు.. ని. వర్గ రిపోర్టర్ సనావుల్లా ఖాన్
👉కడప జిల్లాలో లేడీ టీచర్ భారీ మోసం..
రైస్ పుల్లింగ్ పేరుతో కడప జిల్లాలో భారీ మోసం జరిగింది. బెంగళూరుకు చెందిన అపర్ణ, కడప ప్రభుత్వ టీచర్ శోభారాణి బియ్యాన్ని ఆకర్షించే పాత్ర ఉంటే జీవితం మారిపోతుందని దువ్వూరుకు చెందిన మూలే వెంకట రమణారెడ్డిని నమ్మించారు. ఆయన విడతల వారీగా రూ.1.37 కోట్లు చెల్లించారు. మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపర్ణతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశామని ప్రొద్దుటూరు టూటౌన్ సీఐ యుగంధర్ వెల్లడించారు.
👉కేజీబీవీ పాఠశాలను సందర్శించిన ఇంచార్జి గొట్టిపాటి లక్ష్మీ..*విద్యార్ధినుల తో కలిసి భోజనం చేసిన ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ*
మండల కేంద్రమైన కురిచేడు లోని కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలలో శుక్రవారం మన దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ సందర్శించి అక్కడి విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసి విద్యార్థినులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజనం రుచి, శుభ్రత, డైలీ మెనూ పై ఆరా తీశారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి విద్యార్థినిలతో కలిసి భోజనం చేయడం నాకెంతో ఆనందంగా ఉందని ఆనాటి స్కూల్ రోజుల గుర్తొస్తున్నాయని డాక్టర్ లక్ష్మి అభిప్రాయపడ్డారు. భోజనం రుచి పై డాక్టర్ లక్ష్మీ సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పప్పు నీరుగా ఉందని సరి చేసుకోవాలని, విద్యార్థులకు పెట్టే భోజనంలో రాజీ పడకుండా నాణ్యత పాటించాలని ప్రభుత్వం ఇచ్చిన మెనూ తప్పనిసరిగా అమలు చేయాలని ఆమె సిబ్బందిని కోరారు. మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ,ముఖ్యంగా మన విద్య ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్, మన జిల్లా మంత్రివర్యులు సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి విద్య పట్ల పాఠశాలలో అందుతున్న వస్తువుల పట్ల,మధ్యాహ్న భోజనము గురుకుల పాఠశాలలో ఆహార ఏర్పాట్లు పట్ల శ్రద్ధ వహిస్తున్నారని ఆమె వివరించారు. మన కూటమి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పేద బడుగు బలహీన వర్గాల లో ఉన్న నైపుణ్యతను గుర్తించి గురుకుల పాఠశాలల ద్వారా ఉన్నత చదువులకు ఎదిగి ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు అన్ని విధాలా మన ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె వివరించారు. అందుకు అనుగుణంగా స్థానిక సిబ్బంది కూడా వస్తువుల పట్ల విద్యార్థులకు పెట్టే ఆహారం పట్ల శ్రద్ధ కనబరచాలని కోరారు. అక్కడ విద్యార్థులను,సిబ్బందిని సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు త్వరలో నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తామని అందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ తో,మంత్రితో చర్చించడం జరిగిందని,ఇప్పటికే మనం ప్రతిపాదనలు కూడా పంపామని తెలిపారు.అదే విధంగా పాఠశాలలో అవసరమైన కంప్యూటర్లను ఏర్పాటు చేసేందుకు కూడా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.డాక్టర్ లక్ష్మితో పాటు ఇన్చార్జి స్పెషల్ ఆఫీసర్ పివి నాగలక్ష్మి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
👉 సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ శాఖ సలహాదారులు ఎం ఏ షరీఫ్ పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పొదిలికి చెందిన పలువురు మైనార్టీ నాయకులు వారిని కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ నాయకులు,షేక్ కపిల్ భాష,రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపా ధ్యక్షులు..షేక్ రఫీ,రాష్ట్ర అధికార ప్రతినిధి మైనార్టీ సెల్ షేక్ రసూల్ మొహమ్మద్,ప్రకాశం జిల్లా ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మోమిన్,రాష్ట్ర అధికార ప్రతినిధి ముస్లిం మైనార్టీ సెల్ ముల్ల షబ్బీర్ భాష,జిల్లా మైనార్టీ నాయకులు. పాల్గొన్నారు.*జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రహమాన్..
👉ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తాం : గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..
*గిద్దలూరు నగర పంచాయతీలోని ప్రతి ఇంటికీ తాగు నీరందిస్తామని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు అన్నారు. శుక్రవారం స్థానిక నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశంలో పాల్గోన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రెండు సంవత్సరాలలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తామని, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కూడా ఇంటింటికి తాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కోరడం కూడా జరిగిందని అన్నారు. అలాగే గిద్దలూరు పట్టణానికి తాగు నీరు అందించడానికి దగ్గరలో ఉన్న రామన్న కతువా నుండి నీరు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రానున్న వేసవిలో కూడా నీటి ఎద్దడిని నివారించే చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో గిద్దలూరుకి మరిన్ని నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని అన్నారు. అలాగే గిద్దలూరు నగర పంచాయతీని ఆదర్శమైన నగర పంచాయతీగా తీర్చిదిద్దెందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దీనికి కౌన్సిలర్లు, నగర పంచాయతీ అధికారులు కూడా కృషి చేయాలనీ తెలిపారు. త్వరలో ప్రజా సమస్యల పరిష్కారానికి తాను కూడా ప్రతి వార్డులో అన్ని శాఖల అధికారులతో కలిసి పర్యటన చేస్తానని, పట్టణంలో ట్రాఫిక్, పరిశుభ్రత పై అధికారులు దృష్టి సారించాలని,అధికారులు కూడా అన్ని వార్డులలో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు పరిష్కారించాలని,నగర పంచాయతీ అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా బాధ్యతగా మెలగాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, కమిషనర్ వెంకటదాస్,నగర పంచాయతీ కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు..ని. వర్గ రిపోర్టర్ సనావుల్లా ఖాన్
👉 నిన్ను చంపే పోతా.. మొబైల్ అడిగినందుకు భర్తను కూరగాయల కత్తితో పొడిచిన భార్య!..
నిన్ను చంపే పోతా.. భర్తను కూరగాయల కత్తితో పొడిచిన భార్య!..తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామంలో ఓ వివాహిత తన భర్తను కూరగాయల కత్తితో కడుపులో క్రూరంగా పొడిచింది. తప్పించుకుని ఇంట్లో నుంచి బయటికి పరిగెత్తినా వదలకుండా పలుచోట్ల గాయపరిచింది. అయితే తన భార్య లక్ష్మి వాడుతున్న మొబైల్ ఇవ్వమని అడిగానని.. ఇవ్వకుండా గొడవ పడి తనపై కత్తితో దాడి చేసిందని కత్తిపోట్లకు గురైన పొరల రవి చెబుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?