👉 భోజనంలో పురుగులు రావడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్..
అమరావతి:గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో భోజనంలో పురుగులు రావడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బాధ్యుడైన హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..
దీంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి వారు ఆందోళనకు దిగారు. వర్సిటీలోని మహిళా హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి వెళ్లి వీసీ చాంబర్ ఎదుట బైఠాయించి పెద్దఎత్తున నినాదాలు చేశారు. భోజనం ఇలా ఉంటే ఎలా తినాలంటూ ప్రశ్నించారు. వందలాది మంది విద్యార్థినులు నిన్న రాత్రి 9 గంటల నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకూ ఆందోళన కొనసాగించారు. విషయం ఏపీ ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించింది. విచారణ నివేదికను వెంటనే ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది…
👉రెవెన్యూ అధికారులకు సీఎం చంద్రబాబు హెచ్చరిక!!!
రెవెన్యూ అధికారులకు సీఎం చంద్రబాబు హెచ్చరిక
గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కబ్జాలపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వస్తున్న వినతులు, వాటి పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. సత్వరమే వాటికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని వారికి సీఎం స్పష్టం చేశారు. వినతులుపై ప్రజలను అక్కడికి, ఇక్కడికి తిప్పే పరిస్థితి ఇకపై ఉంటే సహించేది లేదని అధికారులను సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
👉రాజ్ భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి .
👉కానిస్టేబుల్ ఇంట్లో గంజాయి స్వాధీనం*
మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలను అదుపు చేసే పోలీసుల వద్దే గంజాయి దొరికింది. కంచే చేను మేసింది అన్నట్లున్న ఈ సంఘటన కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించింది.
కాజీపేట పోలీసు డివిజన్ కరీంనగర్ రోడ్డులోని ఠాణాలో పనిచేస్తున్న నర్సంపేటకు చెందిన కానిస్టేబుల్ ఈ దందాకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. మత్తు పదార్థాల నివారణ కోసం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం పోలీసులు ఆయన ఇంట్లో గంజాయి ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. సదరు కానిస్టేబుల్ పనిచేస్తున్న ఠాణాలో గతేడాది టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. దాన్ని సీజ్ చేసి ఠాణాలో ఉంచారు. నిందితులపై కేసు నమోదు చేశారు. అందులో పనిచేస్తున్న కానిస్టేబుల్ దృష్టి దానిపై పడింది. దశలవారీగా దాంట్లో నుంచి మాయం చేస్తూ స్నేహితులు, బంధువుల ద్వారా విద్యార్థులకు విక్రయించడం ప్రారంభించాడు.
నర్సంపేట డివిజన్ పోలీసులు నర్సంపేట నుంచి వరంగల్‌కు వచ్చే మార్గంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈక్రమంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై అక్కడకు వచ్చారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంబడించగా ఇద్దరిలో ఒకరు దొరికారు. ఆయన వద్ద కొంత ఎండు గంజాయి లభించింది. విచారించగా కానిస్టేబుల్ వద్ద తీసుకొని వచ్చి విక్రయిస్తున్నట్లు చెప్పడంతో విషయం బయటపడింది. కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
👉ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీతో చంద్రన్న భరోసా*
*ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆదేశాలతో తెల్లవారు జామున 5 గంటలకు 28 డివిజన్ లో ఫించన్ పంపిణీ*
*టిడిపి నేత అబ్దుల్లా బుచ్చర్*
ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఫించన్ దారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి.
నారా చంద్రబాబు నాయుడు ముందు చుాపు ఆలోచనతో ప్రభుత్వ విప్ గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి ఆర్.మాధవీరెడ్డి ఆదేశాల మేరకు 30 వ తేదీ శనివారం ముందస్తు పింఛన్ ల పంపిణీ పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నామని డివిజన్ టీ.డీ.పి నేత అబ్దుల్లా బుచ్ఛర్ అన్నారు వర్షం కురుస్తున్నా మంచి జరిపించేదుకు ఫించన్ పంపిణీ చేశామన్నారు. వందశాతం పథకాల అమలుతో 2025నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతామన్నారు ఫించన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 28 వ డివిజన్ లోని సాతు చెంగన్న వీధి,గాజుల వీధి,కటిక వీధి, వాటర్ ట్యాంకు విధి,హాబీబుల్లా స్ట్రీట్ లలో అబ్దుల్లా,సచివాలయ సిబ్బంది,మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు
👉 ఈ రోజు విజయవాడ పశ్చిమ,54 డివిజన్ సభ్యత్వం ఎన్రోల్ కార్యక్రమం డోర్ టో డోర్ ప్రెసిడెంట్ సయ్యద్ సలీమ్, షేక్ తాజుద్దీన్, ఖాదర్ స్ట్రీట్
👉ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం*
*ఒకటవ తారీఖు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం*
*సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండల కేంద్రంలోని దర్గా వీధిలో ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పింఛన్ పంపిణీ చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జోలి శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు* ..
👉ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీతో చంద్రన్న భరోసా*
*ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆదేశాలతో తెల్లవారు జామున 5 గంటలకు 28 డివిజన్ లో ఫించన్ పంపిణీ*
*టిడిపి నేత అబ్దుల్లా బుచ్చర్*
ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఫించన్ దారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి.
నారా చంద్రబాబు నాయుడు ముందు చుాపు ఆలోచనతో ప్రభుత్వ విప్ శాసనసభ్యురాలు ఆర్.మాధవీరెడ్డి ఆదేశాల మేరకు 30 వ తేదీ శనివారం ముందస్తు పింఛన్ ల పంపిణీ పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నామని డివిజన్ టీ.డీ.పి నేత అబ్దుల్లా బుచ్ఛర్ అన్నారు వర్షం కురుస్తున్నా మంచి జరిపించేదుకు ఫించన్ పంపిణీ చేశామన్నారు. వందశాతం పథకాల అమలుతో 2025నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతామన్నారు ఫించన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 28 వ డివిజన్ లోని సాతు చెంగన్న వీధి,గాజుల వీధి,కటిక వీధి, వాటర్ ట్యాంకు విధి,హాబీబుల్లా స్ట్రీట్ లలో అబ్దుల్లా,సచివాలయ సిబ్బంది,మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు
👉 25 రోజులుగా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని పరమేశ్వరి నగర్ నందు జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం షాపును తొలగించాలని స్థానిక ముస్లిం మహిళలు వారికి మద్దతుగా స్థానికంగా ఉన్న ముస్లిం సంఘాలు ఇతర ప్రజా సంఘాలు బహుజన సమాజ్ పార్టీ ఎస్ డి పి ఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ తదితర సంఘాల మద్దతుతో కొనసాగుతున్న ఈ నిరసన ధర్నా ఈరోజు రూపం మార్చుకుని నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో భాగంగా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో వివిధ ప్రజాసంఘాలు పార్టీలు పాల్గొన్నాయి మరియు బహుజన్ సమాజ్ పార్టీ కూడా పాల్గొని వారికి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీఎస్పీ నుండి ఎంబేటి శ్రీనివాసులు కొవ్వూరు నియోజకవర్గ నాయకులు కడింపాటి అనిల్ డక్క రమణయ్య కోవూరు నియోజకవర్గ బీసీ నాయకులు గుడి వెంకయ్య మహిళా కార్య కర్త అరుణ కట్టమంచి ఊటుకూరు శ్రీనివాసులు ( ఆకుతోట) దానం టోని బాబు విజయ తదితరులు పాల్గొనడం జరిగింది.
గత 25 రోజులుగా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని పరమేశ్వరి నగర్ నందు జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం షాపును తొలగించాలని స్థానిక ముస్లిం మహిళలు వారికి మద్దతుగా స్థానికంగా ఉన్న ముస్లిం సంఘాలు ఇతర ప్రజా సంఘాలు బహుజన సమాజ్ పార్టీ ఎస్ డి పి ఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ తదితర సంఘాల మద్దతుతో కొనసాగుతున్న ఈ నిరసన ధర్నా ఈరోజు రూపం మార్చుకుని నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో భాగంగా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో వివిధ ప్రజాసంఘాలు పార్టీలు పాల్గొన్నాయి మరియు బహుజన్ సమాజ్ పార్టీ కూడా పాల్గొని వారికి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నుండి ఎంబేటి శ్రీనివాసులు కొవ్వూరు నియోజకవర్గ నాయకులు కడింపాటి అనిల్ డక్క రమణయ్య కోవూరు నియోజకవర్గ బీసీ నాయకులు గుడి వెంకయ్య మహిళా కార్య కర్త అరుణ కట్టమంచి ఊటుకూరు శ్రీనివాసులు ( ఆకుతోట) దానం టోని బాబు విజయ తదితరులు పాల్గొనడం జరిగింది
👉 V2 స్పా సెంటర్ పై పోలీసుల దాడి*..
దాడిలో గంజాయి ప్యాకెట్లు ,కండోమ్ ప్యాకెట్స్ లభ్యం అవ్వటంతో నిర్వాహకుడి పై కేసు నమోదు చేసిన పోలీసులు…ప్రకాశం జిల్లా..ఒంగోలు పార్వతమ్మ గుడి దగ్గరలోని V2 స్పా సెంటర్ లో అసాంఘిక కార్యకలాపాలు…పక్క సమాచారంతో రైడ్ చేసిన ఒంగోలు వన్ టౌన్ పోలీసులు..V2 స్పా సెంటర్ పై రైడ్ జరిగిన సమయంలో పురుషుడు ఓ మహిళ తో మసాజ్ చేయించు కుంటున్నాడు…అలానే గంజాయి ప్యాకెట్లు, కండోమ్స్ ప్యాకెట్లు దొరకటంతో నిర్వహుడి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు….
👉ఏపీలో రూ.40 కోట్ల క్రిప్టో మోసం … ఎలా జరిగిందంటే..? వివరాళ్లోకి వెళ్తే… డోన్ పట్టణాన్నికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి.. కేవ ఇండస్ట్రీస్ పేరుతో ఆన్ లైన్ వ్యాపారం ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు, వివిధ యాప్ లలో మోసాలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రజలను మోసం చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త సంస్థలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.. వాటి మాయలో పడి ప్రజలు మోసపోతూనే ఉంటున్నారు. పోలీసులు ఎంత హెచ్చరించినా.. ప్రజలు వారి బాడిన పడుతూనే ఉన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం.. అతి తక్కువ సమయంలోనే డబ్బు రెట్టింపు వంటి ప్రకటనలకు అట్రాక్ట్ అవ్వడం.. అనంతరం అది మోసం అని తెలిసిన తర్వాత లబోదిబో అనడం ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో తాజాగా 200 మంది ప్రజలు కర్నూలు జిల్లాలో ఇలానే నమ్మారు.. దెబ్బ తిన్నారు! అవును… ఇలాంటి మోసాలు ఎన్నో జరుగుతున్నప్పటికీ ప్రజలు మోసపోతూనే ఉంటున్నారు. అలా మాయలో పడి సుమారు 200 మంది ప్రజలు బాధితులుగా మారిన తాజా ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. నంద్యాల సమీపంలోని డోన్ లో క్రిప్టో కరెన్సీ పేరు చెప్పి నడిచిన ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. వివరాళ్లోకి వెళ్తే… డోన్ పట్టణాన్నికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి.. కేవ ఇండస్ట్రీస్ పేరుతో ఆన్ లైన్ వ్యాపారం ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు. అయితే… క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ స్థానికలకు ఆశ చూపించాడు. దీంతో అతడి మాటలు నమ్మిన జనం.. భారీగానే డబ్బులు పెట్టారు. వేరుకుంపటి ప్రయాణమా? అయితే… గత కొంతకాలంగా సదరు రామాంజనేయులు ఫోన్ ఎత్తడం మానేశాడట. దీంతో.. అనుమానం వచ్చిన వారు అతడి కార్యాలయానికి చేరుకోగా.. తలుపుకి తాళం దర్శనమిచ్చిందంట. ఈ పరిణామాల నేపథ్యంలో తాము నిలువునా మోసపోయామని గ్రహించినవారు పోలీసులను ఆశ్రయించారు! బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సుమారు 200 మంది బాధితులు రూ.40 కోట్ల వరకూ రామాంజనేయులు వద్ద పెట్టుబడిగా పెట్టారని చెబుతున్నారు. మరోవైపు అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
👉దేశంలో అత్యధిక ఫింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే..రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ..కొండపి;
దేశంలో అత్యధిక పింఛన్లుస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం నాడు కొండపి మండలంనెన్నూరుపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు ఫించన్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…..ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్క సంతకంతో పింఛను రూ.4 వేలకు పెంచడం జరిగిందన్నారు. లబ్ధిదారులు ఇబ్బందులు పడకూడడని ప్రభుత్వ సెలవు వస్తే ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నారు. రెండు నెలలు తీసుకోకపోయినా తర్వాత నెలలో 3 నెలల ఫించన్ ఒకేసారి తీసుకునేలా వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం 2 లక్షల 86 వేల 34 మందికి ఈ రోజు 122 కోట్ల 22 లక్షల రూపాయలు పింఛన్ కింద ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొండపి మండలంలో 6,268 మందికి 2 కోట్ల లక్షల 80 వేల రూపాయలు, నెన్నూరుపాడు గ్రామంలో 241 మందికి 10.20 లక్షలు రూపాయలు ఎన్టీఆర్ భరోసా పధకం కింద పింఛన్లు అందచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అర్హులైన వారందరికీ త్వరలో ఇళ్ల స్థలాలు, ఇల్లు మంజూరు చేస్తామన్నారు. నూతన పింఛన్లు జనవరి నుంచి మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. పింఛన్లు తొలగించామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అర్హులైన వారందరికీ ఫించన్ అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత ఐదు ఏళ్ళ పాలనలో అన్ని కార్పొరేషన్లు నిర్వీర్యం అయ్యాయని, కార్పొరేషన్ల ద్వారా త్వరలో అర్హులందరికీ స్వయం ఉపాధికి రుణాలు అందిస్తామని మంత్రి తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచి ఇస్తున్నాం, దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా అందిస్తున్నాం. పేదలకు ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాం, ఆరోగ్యశ్రీ వర్తించన వారికి సీఎం ఆర్.ఎఫ్ ద్వారా సాయం చేస్తున్నామన్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప గత పాలనలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యమన్నారు. నెన్నూరుపాడు గ్రామంలో 2014 – 19 లోనే సిసి రోడ్లు, లైట్లు వేయించాం, గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశామన్నారు. మర్రిచెట్లపాలెం, ఉప్పల పాలెం కలుపుతూ రోడ్లు వేయించాను. అన్నీ మన హయాంలో వేసినవే. కొండపి నియోజకవర్గానికి సాగర్ నీరందిస్తామని…వచ్చే వేసవిలో పనులు ప్రారంభిస్తామని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.
ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మా నాయక్, ఎస్ సి కార్పొరేషన్ ఈడి శ్రీ అర్జున్ నాయక్, మండల పరిధిలోని అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
👉 శిoగరాయకొండలో నూతనంగా మంజూరైన కోర్టుని పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ కే మన్మధరావు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి కందుకూరు సీనియర్ సివిల్ జడ్జి శోభారాణి ఇన్చార్జి మేజిస్ట్రేట్ భరత్ చంద్ర నూతనంగా ఏర్పాటు చేస్తున్న కోర్టును పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. త్వరగా కోర్టు పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కోరారు.
👉సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలి: సి.ఐ మల్లికార్జున రావు..
సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సీఐ మల్లికార్జున రావు అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాలలో నూతన పోకడలు,గంజాయి, డ్రగ్స్ దుర్వినియోగం, మహిళలు,బాలికలపై అఘాయిత్యాలు, బాల్య వివాహాలు మరియు రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కలిగించారు.విద్యార్థి దశలో ఆకర్షణలకు లోనుకాకుండా చదువుపై శ్రద్ధ పెట్టాలన్నారు. సైబర్ నేరగాళ్ల మోసాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలనీ,గంజాయి, డ్రగ్స్ తదితర దురలవాట్లకు బానిసలు కావద్దన్నారు, ఎస్ఐ నరసింహారావు మాట్లాడుతూ విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సమయస్ఫూర్తితో సక్సెస్ సాధించాలన్నారు, పురాణాలలోని కొన్ని కథలను ఉదహరిస్తూ విద్యార్థులలో స్ఫూర్తిని నింపారు. బాల్య వివాహాలు బాలికల భవితకు గొడ్డలిపెట్టులాంటివని, అవి బాలికల ఆరోగ్యంతో బాటు వారి ఆశలను,ఆశయాలను హరిస్తాయని, బాల్య వివాహాల దుస్పరిణామాలను విద్యార్థులకు వివరించారు. చిన్నారులకు బ్రతుకు పాఠాలను వివరిస్తూ పుస్తక పఠనంతో జీవిత పాఠాలను సమన్వయం చేసుకుని సాగిపోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో, ప్రధానోపాధ్యాయుడు బి.మాల్యాద్రి,సీఆర్పి, ఉపాధ్యాయులు పోలీసు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
👉 ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన నేషనల్ హైవే పిడి విద్యాసాగర్.ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలు అభివృద్ధి పనులపై చర్చించినారు.
👉ఒంగోలు పట్టణంలోదిశ కమిటీ సమావేశం,20 సూత్రాల అమలు కమిటీ సమావేశం.పాల్గొన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి,రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ,మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి,20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ .లంక.దినకర్,సంయుక్త కలెక్టర్ ఆర్.గోపాలక్రిష్ణ ఇతర ప్రజాప్రతినిధులు,అధికరులు..
👉పల్నాడు జిల్లా…*సత్తెనపల్లిలో వృద్ధుడి మెడలో బంగారు గొలుసు లాక్కెళ్ళిన దుండగుడు* ..పట్టణంలోనే సంఘం బజార్లో జరిగిన ఘటన…పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు.. *దొంగతనం జరిగిన నాలుగు గంటల వ్యవధిలోనే కేసును చేదించిన పోలీసులు..పోలీసులు తీసుకున్న చొరవ పట్ల హర్షం వ్యక్తం చేసిన బాధితుడు
👉 ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్.యం*
*ఆర్టీసీ బస్టాండ్ లోని సమస్యలను డి.ఎం సుందరరావు అడిగి తెలుసుకున్న ఆర్.ఎం సుధాకర్ బాబు….*
*పొదిలి ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి డిపోలో ప్రయాణికుల దగ్గర నుండి సమస్యలను అడిగి తెలుసుకున్న ఆర్.ఎం సుధాకర్ బాబు..
ఆర్టీసీ బస్టాండ్ లో జరిగే చోరీలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపిన ఆర్.ఎం సుధాకర్ బాబు…
ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణం సురక్షితం కాదనీ,అనుభవజ్ఞులైన ఆర్టీసీ సిబ్బందితోనే ఆర్టీసీ ప్రయాణం సురక్షితం…
జిల్లాలోని ప్రధానమైన అతి ముఖ్యమైన ఆర్టీసీ బస్టాండ్ పొదిలి బస్టాండ్ అని పొదిలి బస్టాండ్ కు ప్రత్యేకంగా తనిఖీకు రావడం జరిగిందని తెలిపిన ఆర్ఎం సుధాకర్ బాబు…..ప్రయాణికుల పట్ల మరియు ప్రమాదాల నివారణకు అవగాహనా కార్యక్రమాలలో పాల్గొంటు అంకిత భావంతో పనిచేస్తున్న ఆర్టీసీ డిఎం సుందరావును అభినందించిన ఆర్ ఎం సుధాకర్ బాబు…..
ఆర్టీసీ బస్టాండ్ లో ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి ప్రయాణికులకు ఉద్దేశించి చెప్పిన ఆర్ ఎం సుధాకర్ బాబు
భోజనంలో పురుగులు రావడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్..రెవెన్యూ అధికారులకు సీఎం చంద్రబాబు హెచ్చరిక..కానిస్టేబుల్ ఇంట్లో గంజాయి స్వాధీనం..V2 స్పా సెంటర్ పై పోలీసుల దాడి..ఏపీలో రూ.40 కోట్ల క్రిప్టో మోసం ..నూతనంగా మంజూరైన కోర్టుని పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి..సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలి: సి.ఐ మల్లికార్జున రావు..ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్.యం..ఒంగోలు పట్టణంలో దిశ కమిటీ సమావేశం
Recent Posts