👉 స్నేహితుల అభివృద్ధి కోసమే మోడీ ప్రభుత్వం: ప్రియాంక గాంధీ..కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ వాద్రా మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రజల హక్కులను నిర్వీర్యం చేసే శక్తులకు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తుంటే.. ప్రధాని మాత్రం తన స్నేహితుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం మనంతవాడిలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. మనదేశ సంస్థలను నాశనం చేయడానికి యత్నిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు
👉 అప్పటి వరకు భారత ఆర్థిక వ్యవస్థ మారదు: రాహుల్ గాంధీ..
భారత జీడీపీ రెండేళ్ల కనిష్ట స్థాయి 5.4 శాతానికి పడిపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కొంతమంది బిలియనీర్లు మాత్రమే లబ్ది పొందినంత మాత్రాన ఆర్థిక వ్యవస్థలో పురోగతి ఉండదని వ్యాఖ్యానించారు. రిటైల్ ద్రవ్యోల్బణం 6.21 శాతానికి చేరిందని, కూరగాయల ధరలు 50% పెరిగాయని చెప్పారు. నిరుద్యోగం 45 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిందని, రూపాయి కనిష్ట స్థాయి 84.50కి చేరిందని ఆయన ట్వీట్ చేశారు.
👉మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.*
*ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు లిక్కర్ అమ్మే షాపులపై చర్యలకు రంగం సిద్ధం.*
*ఎమ్మార్పీ ఉల్లంఘనలకు పాల్పడితే రూ.5 లక్షల జరిమానా.*
*రెండోసారి కూడా అదే జరిగితే సదరు బార్ లేదా లిక్కర్ షాపు లైసెన్స్ రద్దు*
👉 జగన్ స్కామ్ ను సాక్షి తప్ప అన్ని జాతీయ, అంతర్జాతీయ పత్రికలు ప్రచురించాయి: యనమల*
– అదానీ కంపెనీల నుంచి జగన్ కు ముడుపులు ముట్టాయన్న యనమల..- ఈ విషయాన్ని ఎఫ్బీఐ స్పష్టం చేసిందన్న యనమల – పత్రికా స్వేచ్ఛకు జగన్ భంగం కలిగిస్తున్నారని విమర్శ..
సౌర విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో అదానీ కంపెనీల నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్ కు రూ. 1,750 కోట్ల ముడుపులు ముట్టాయని… ఈ విషయాన్ని అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) స్పష్టం చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్ లంచం వ్యవహారంపై ఏసీబీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరాధార వాదనలు చేస్తూ పత్రికా స్వేచ్ఛకు జగన్ భంగం కలిగిస్తున్నారని యనమల విమర్శించారు. జగన్ స్కామ్ ను సాక్షి పత్రిక తప్ప… జాతీయ, అంతర్జాతీయ పత్రికలు ప్రచురించాయని చెప్పారు. ప్రపంచమంతా గుర్తించిన నేరాన్ని జగన్ సమర్థించుకుంటున్నారని అన్నారు. జగన్ తప్పు చేయకపోతే… ఎఫ్బీఐ, జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలపై ఎందుకు దావా వేయడం లేదని ప్రశ్నించారు.
👉ఏపీ నుంచి రాజ్యసభకు మూడు సీట్లల్లో రెండు టీడీపీ కీ ఒకటి బిజెపి కీ నాగబాబు కు నో ఛాన్స్..
ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఏపీ నుంచి రాజ్యసభకు మూడు సీట్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వైసీపీకి చెందిన ముగ్గురు సభ్యుల రాజీనామాతో ఆ సీట్ల భర్తీకి ఎన్నికలు జరుగుతున్నాయి.
అసెంబ్లీలో కూటమికి పూర్తి బలం ఉండటంతో మూడు స్థానాలు కూటమి పార్టీలకే దక్కనున్నాయి. తొలుత మూడు పార్టీలు ఒక్కో స్థానం పంచుకునేలా ప్రతిపాదన వచ్చింది. దీంతో, జనసేన నుంచి నాగబాబు కు ఖాయమని భావించారు. కానీ, ఇప్పుడు లెక్కలు మారాయి. ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే ముగ్గురి పేర్లు దాదాపు ఫైనల్ అయ్యాయి.
**ఢిల్లీతో చర్చలు – ఖరారు
ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాల భర్తీ పైన కసరత్తు జరుగుతోంది. కూటమి పార్టీలకే మూడు సీట్లు దక్కనుండటంతో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ముందుగా మూడు పార్టీలు ఒక్కో సీటు దక్కించుకునేలా ప్రతిపాదనల పైన చర్చ జరిగింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మూడు స్థానాలకు రాజీనామా చేసిన ముగ్గురూ బీసీ నేతలే కావటంతో నిర్ణయం మారింది. బీసీల స్థానాల్లో ఇతర వర్గాలకు అవకాశం ఇవ్వటం ద్వారా విమర్శలు వచ్చే అవకాశం ఉందనే చర్చ తెర మీదకు వచ్చింది. అదే సమయంలో వైసీపీకి రాజీనామా చేసే సమయంలో వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సి వస్తోంది. దీంతో, ఇప్పుడు అభ్యర్ధుల ఖరారులో లెక్కలు మారాయి.
బీజేపీ నుంచి ఆర్ క్రిష్ణయ్య
జనసేన నుంచి రాజ్యసభకు నాగబాబు కు ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం సాగింది. పవన్ తాజా ఢిల్లీ పర్యటనలోనూ నాగబాబుకు పెద్దల సభకు ఎంపిక చేసే అంశం పైన చర్చలు చేసారనే కథనాలు వచ్చాయి. కానీ, తాజాగా బీజేపీ నాయకత్వం ఏపీ నుంచి ఎంపిక చేసే మూడు స్థానాల్లో ఒక స్థానం తమ పార్టీ అభ్యర్దిగా ఆర్ క్రిష్ణయ్యకు తిరిగి నామినేట్ చేయాలని నిర్ణయించింది. అదే విధంగా బీదా మస్తాన రావుకు ఇచ్చిన హామీ మేరకు టీడీపీ తిరిగి ఆయన్నే ఒక స్థానం నుంచి రాజ్యసభకు పంపనుంది. దీంతో.. ఇక మిగిలిన ఒక్క స్థానం పైన ప్రస్తుతం తర్జన భర్జనలు సాగుతున్నాయి. తెలంగాణలో ఆర్ క్రిష్ణయ్య సేవలు రాజకీయంగా పార్టీకి వినియోగించుకోవాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగా క్రిష్ణయ్య వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసారు. తిరిగి ఇప్పుడు బీజేపీ అభ్యర్దిగా రాజ్యసభకు వెళ్లనున్నారు.
👉రెండు టీడీపీ – ఒకటి బీజేపీ
ఇక, మూడో స్థానం సైతం టీడీపీకే దక్కేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సీటు కోసం టీడీపీ నుంచి పలువురు రేసులో ఉన్నారు. వీరిలో కంభంపాటి రామ్మోహన్‌రావు, భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్, వర్ల రామయ్య, సానా సతీశ్ పేర్లు ఉన్నాయి. పవన్ తన సోదరుడు నాగబాబుకు సీటు కోసం పట్టుబడితే లెక్కలు మారే అవకాశం ఉంది. కానీ, తాజాగా నాగబాబు చేసిన ట్వీట్ తో ఆయన ఈ పోటీకి దూరంగా ఉన్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో, రెండు స్థానాలు టీడీపీ..ఒకటి బీజేపీ దక్కించుకోవటం దాదాపు ఖాయమైంది. కాగా, ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాల పదవీకాలం విషయానికి వస్తే మోపిదేవి 2026 జనవరి వరకు, మస్తాన్, కృష్ణయ్య పదవీకాలం 2026 జూన్ వరకు ఉన్నాయి. ఇక..ముగ్గురు అభ్యర్ధుల పైన సోమవారం అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
👉 *అమరావతిలో ఈఎస్ఐ ఆసుపత్రి కోసం స్థలాలను పరిశీలించిన అధికారులు*
అమరావతి :ఏపీ రాజధాని అమరావతిలో ఈఎస్ఐ ఆసుపత్రి, మెడికల్ కళాశాల ఏర్పాటుకు 20 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ మంత్రివర్గ ఉపసంఘం ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో నెక్కల్లు సమీపంలో ఈ-8 రహదారి పక్కన సర్వేనంబరు 20లో ఉన్న స్థలాన్ని ఈఎస్ఐ, సీఆర్డీఏ అధికారులు పరిశీలించారు.కేటాయించిన స్థలంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, వైద్య, నర్సింగ్, ఫార్మసీ కళాశాలలు నిర్మించాల్సి ఉందని తెలిపారు.
👉 ‘ఓయో’లో డ్రగ్స్ పార్టీ.. కొరియోగ్రాఫర్ అరెస్టు
హైదరాబాద్:మాదాపూర్ ఓయో రూమ్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. డ్రగ్స్ పార్టీలో కొరియోగ్రాఫర్ కన్హా మహంతి పట్టుబడ్డారు. కన్హమహంతితో పాటు ప్రముఖ ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డిని కూడా పోలీసులు పట్టుకున్నారు..
ప్రియాంకరెడ్డి ఇచ్చిన పార్టీలో కన్హా మహంతి పాల్గొన్నట్లు తెలుస్తోంది.ప్రముఖ టీవీ షోలలో కన్హా మహంతి కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ డ్యాన్స్‌షోలలో చాలా కాలం పాటు పనిచేసిన కన్హా మహంతి పలుమార్లు విజేతగా నిలిచారు. మహంతి, ప్రియాంక రెడ్డి బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి పార్టీ చేసుకుంటున్నట్లు సమాచారం.
పార్టీలో పాల్గొన్న నలుగురిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.పార్టీ జరిగిన ప్రదేశం నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌తో పాటు మరో రెండు రకాల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
👉ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు..
నిన్న రాత్రి తన ప్రియురాలితో హరిత రిసార్ట్‌కి వెళ్ళిన వాజేడు ఎస్సై హరీష్ఈ నెల 14న హరీష్ ఎంగేజ్మెంట్ జరగనుంది.. దీంతో పెళ్లి వ్యవహారంతోనే మనస్థాపానికి గురై గన్‌తో కాల్చుకొని చనిపోయాడని సమాచారం.
👉 బట్టబయలవ్వుతున్న ప్రొద్దుటూరులో సబ్ రిజిస్టర్ గా పనిచేసిన రామలక్షుమ్మ బాగోతం.
కడప జిల్లాలో దళితుల భూముల ఆక్రమణ పై వైసీపీ నేతలకు బిగిస్తున్న ఉచ్చు ….
తమ భూముల అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారంటూ బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మేడిమాల సుశీల…
బద్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామిపై బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు ….
చెన్నంపల్లి రెవిన్యూ విలేజ్ సర్వేనెంబర్ 1754/2 లో భూమిని కాజేసి కోట్ల రూపాయలను గోపాల్ స్వామి ..దళితులకు ఇచ్చిన డీకేటీ భూమిని ఆధార్ కార్డు ట్యాంపరింగ్ తో తన పేరుపై రిజిస్టర్ చేసుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్…మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి, సబ్ రిజిస్టర్ రామలక్ష్మమ్మ తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు…..బద్వేల్ సబ్ రిజిస్టర్ రామలక్ష్మమ్మ వైస్ చైర్మన్ గోపాలస్వామి వద్ద నుండి లక్షల రూపాయలు లంచం తీసుకొని సహకరించినట్లు పట్టణంలోని ప్రజలు పలుచోట్ల చర్చించుకుంటున్నారు…సబ్ రిజిస్టర్ రామలక్ష్మి మరి ఇంకా ఎంతమంది నాయకులకు సహకరించుంటుందని జిల్లాలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి….
👉 దువ్వూరులో దారుణ హత్య..వైయస్సార్. జిల్లా….
➤దువ్వూరు మండలం కానగూడూరులో తండ్రి చేతిలో కొడుకు హత్య..➤ కుమారుడు పీరయ్య గారి హుస్సేన్ భాష (23 )ను హత్య చేసిన తండ్రి మాబు షరీఫ్..➤నిత్యం తాగి ఇంట్లో వారిని వేధిస్తుండగా.. రోకలితో తలపై కొట్టిన తండ్రి.. ➤ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మద్యం లో హుస్సేన్ భాష మృతి..➤సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..➤హత్యపై కేసు నమోదు చేసిన దువ్వూరు పోలీసులు….
కొంతమంది బిలియనీర్లు మాత్రమే లబ్ది పొందినంత మాత్రాన ఆర్థిక వ్యవస్థలో పురోగతి ఉండదు రాహుల్ గాంధీ ..స్నేహితుల అభివృద్ధి కోసమే మోడీ ప్రభుత్వం: ప్రియాంక … ఏ పీ నుంచి రాజ్యసభకు మూడు సీట్లల్లో రెండు టీడీపీ కీ ఒకటి బిజెపి కీ నాగబాబు కు నో ఛాన్స్..ఈఎస్ఐ ఆసుపత్రి కోసం స్థలాలను పరిశీలించిన అధికారులు..బట్టబయలవ్వుతున్న ప్రొద్దుటూరులో సబ్ రిజిస్టర్ గా పనిచేసిన రామలక్షుమ్మ బాగోతం.. దువ్వూరులో దారుణ హత్య
Recent Posts