పులివెందుల కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది: టిడిపి ఎమ్మెల్సీ .. “వారు బియ్యం వ్యాపారం చేయడంలేదు: మంత్రి పయ్యావుల.. ఇరువర్గాల మధ్య కొనసాగుతున్న వార్.. పోలీసుల మోహరింపు.. “బూడిద కాదది…తగ్గనంటున్న జేసీ !.. పల్నాడు జిల్లాలో AP ఈగల్ టీమ్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ పర్యటన.. డిప్యూటీ సీఎం కలిసిన ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు,గెస్ట్ లెక్చరర్లు .. మహిళను బెదిరించి వైసీపీ నేత అత్యాచారం..విద్యార్థినులకు అసభ్యకర మెసేజులు చేస్తున్న శ్రీచైతన్య కాలేజీ వైస్ ప్రిన్సిపల్..ఏసీబీ వలలో చిక్కిన ముత్తుకూరు తాసిల్దార్ బాలకృష్ణారెడ్డి… సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం (బి పేట).. కిమ్స్ హాస్పటల్స్ లో బెంటాల్స్ సర్జరీ విజయవంతం.. పాము కాటుకు బాలుడు మృతి

👉ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం*
– సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం
– వివిధ ప్రభుత్వ పాలసీలకు మంత్రివర్గం ఆమోదం
– బియ్యం అక్రమ రవాణా అంశంపై చర్చ
– జల్ జీవన్ మిషన్ ఆలస్యం కావడంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. పలు రంగాల్లో ప్రభుత్వ విధానాలకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఏపీ మారిటైమ్ పాలసీ, టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీ, ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ (4.0)లకు రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.అంతేకాదు… పులివెందుల, ఉద్ధానం, డోన్ తాగునీటి ప్రాజెక్టులను క్యాబినెట్ ఆమోదించింది. హోమియోపతి, ఆయుర్వేద ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు కూడా నేటి సమావేశంలో ఆమోదం లభించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలు, ఇంటిగ్రేటెడ్ టూరిజం పాలసీ, క్రీడా విధానంలో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ క్యాబినెట్ భేటీలో బియ్యం అక్రమ రవాణా అంశం కూడా చర్చించారు. ప్రభుత్వానికి ఈ మాఫియా సవాల్ గా మారిందని, దీనికి అడ్డుకట్ట వేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. కాకినాడ పోర్టులో అరబిందో సంస్థ 41 శాతం వాటాను లాగేసుకుందని ఆరోపించారు. ఆస్తులు గుంజుకోవడం వైసీపీ హయాంలో ట్రెండ్ గా మారిందని వ్యాఖ్యానించారు. ఇక, కేంద్ర ప్రభుత్వ పథకం జల్ జీవన్ మిషన్ పథకం రాష్ట్రంలో అమలు చేయడంలో ఆలస్యం జరుగుతుండడం పట్ల చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ వంటి ప్రాధాన్య పథకం ఇంకా డీపీఆర్ స్థాయిని దాటకపోవడం ఏంటని అధికారులను ప్రశ్నించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, తాగునీటి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కూడా మాట్లాడారు. జల్ జీవన్ మిషన్ ను ఏపీ సద్వినియోగం చేసుకోవడంలేదని ఢిల్లీలో కూడా చెప్పుకుంటున్నారని వెల్లడించారు. అధికారుల ఉదాసీనత వల్లే ఈ పథకం ఆలస్యమవుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేశ్ కూడా ఈ పథకంపై స్పందించారు. ఇది అందరికీ చేరువయ్యే భారీ ప్రాజెక్టు అని… దీన్ని మిషన్ మోడ్ లో ముందుకు తీసుకెళ్లడం ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని స్పష్టం చేశారు.
👉ఏపీలో ఆ గృహాలు రద్దు.. క్యాబినెట్ కీలక నిర్ణయం..
ఏపీలో పలు కారణాలతో గత ఐదేళ్లలో నిర్మాణం మొదలు పెట్టని గృహాలను రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు ఓకే చెప్పింది. సమీకృత పర్యాటక, స్పోర్ట్స్ పాలసీ 2024-29, ఆయుర్వేద, హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. పొట్టిశ్రీరాములు వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 15న ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహిస్తామని ప్రకటించింది.
👉హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన.. ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి*
*మేడ్చల్ – జవహర్ నగర్ 16వ డివిజన్‌లో ఐదేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడి చేసిన పరమేష్(30) అనే వ్యక్తి.*
*ఏడుస్తూ ఇంటికి వచ్చిన చిన్నారికి రక్తస్రావం అవడం గమనించి పోలీసులను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు*
👉మహిళను బెదిరించి వైసీపీ నేత అత్యాచారం..
గుంటూరు జిల్లాలో వైసీపీ నేత దారుణానికి పాల్పడ్డాడు. వైసీపీ నేత దేవరకొండ నాగేశ్వరరావు అలియాస్ ఓంకార్ తనను అత్యాచారం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగ్నవీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ తనను బెదిరించి రెండేళ్లుగా అత్యాచారం చేశాడని.. తన భర్తపై పలుమార్లు హత్యాయత్నం చేయించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
👉 కాకినాడ పోర్ట్ వ్యవహారంలో కీలక పరిణామం..
కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ లో 41.12% వాటాను అరబిందో దక్కించుకోవడం పై CID కి ఫిర్యాదు
బెదిరించి, వేధింపులకు గురి చేసి, దౌర్జన్యంగా మేజర్ వాటా ను కైవసం చేసుకున్నారని ఫిర్యాదు చేసిన కాకినాడ పోర్ట్ యాజమాన్యం..CID చీఫ్ రవిశంకర్ ను కలిసి ఫిర్యాదు చేసిన కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ చైర్మన్ కేవీ రావు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్న CID.
#జనసేనాని ఆయన పార్టీ ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలి*..తిరుపతి ప్రెస్ క్లబ్ వద్ద జాప్ తో కలిసి మీడియా మిత్రుల డిమాండ్*
జనసేన పార్టీ పోలవరం ఎమ్మెల్యే అనుచరులు *జీ న్యూస్ రిపోర్టర్* పై దాడి చేయడాన్ని ఖండిస్తూ….. తిరుపతి ప్రెస్ క్లబ్ వద్ద *జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్* (జాఫ్). ఉమ్మడి చిత్తూరు జిల్లాఅధ్యక్షుడు విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జర్నలిస్టులకు పెద్దపీట వేసే “జనసేనాని” *రాష్ట్ర ఉప సియం పవన్ కళ్యాణ్* ఈ దాడి పై స్పందించి దాడికి పాల్పడిన వారిపై.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా ల వీడియో గ్రాఫర్లు , రిపోర్టర్లు పాల్గొన్నారు.
👉ఏపీ ప్రభుత్వానికి అరబిందో సంస్థ లేఖ..!*
104, 108 సర్వీస్ ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రభుత్వానికి లేఖ…ఇంకా రెండేళ్ల గడువు ఉన్నా ముందే తప్పుకున్న అరబిందో…సక్రమంగా సర్వీసులు అందించడంలేదని అరబిందోపై ప్రభుత్వ ఆగ్రహం…
సర్కార్ ఆగ్రహంతో 104, 108 సర్వీస్ ల నుంచి తప్పుకుంటున్నట్లు అరబిందో లేఖ… గత ప్రభుత్వంలో బిల్లులు విషయంలో ఇబ్బందులు పడ్డామన్న అరబిందో…
104, 108 సర్వీస్ లకు త్వరలో కొత్త టెండర్లను ఏపీ సర్కార్ పిలిచే చాన్స్.
👉 ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు,గెస్ట్ లెక్చరర్లు మంగళవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి తమ సమస్యలు చెప్పుకొన్నారు.
గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న తమను కాంట్రాక్టు లెక్చరర్లుగా మార్పు చేసి 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని కోరారు.
శాంక్షన్డ్ పోస్టుల్లోనే తాము సంవత్సరాల తరబడి పని చేస్తున్నామని,అతి తక్కువ జీతాలతో ఇస్తూ తమ శ్రమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసమస్య పట్ల పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు.పూర్తి పరిశీలన నిమిత్తం సంఘం నాయకులను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పిలిచి మాట్లాడారు.
👉పల్నాడు జిల్లాలో ఈగల్ టీమ్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ పర్యటన ..
జిల్లాలో గంజాయి నిర్ములనకు తీసుకోవాల్సిన చర్యలపై పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు,ఎక్సైజ్ అధికారులతో ప్రత్యేక భేటి..నిన్న నరసరావుపేటలో 400 గంజాయి చాక్లెట్లు పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు*AP ఈగల్ టీమ్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ*గంజాయి,డ్రగ్స్ సమూల నిర్ములనకు తగిన చర్యలు తీసుకుoటున్నాం..
రాష్ట్రంలో గంజాయి,మాధకద్రవ్యాలు ఎక్కడైనా ఉంటే 1972కి ప్రజలు సమాచారం ఇవ్వాలి..సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము..మాధకద్రవ్యాలు అమ్మినా,కలిగి ఉన్నా చట్ట రీత్యా నేరమే..గంజాయి నిర్ములనకు ప్రభుత్వం ఈగల్ అనే ఒక వ్యవస్థను తెచ్చింది..
గంజాయి చాక్లెట్లు పట్టుకున్నoదుకు నరసరావుపేట ఎక్సైజ్ పోలీసులకు అభినందనలు తెలిపారు.
Ap ఈగల్ డైరెక్టర్ రవికృష్ణ వెంట,ఈగల్ టీమ్ ఎస్పి నగేష్.
👉 ఇరువర్గాల మధ్య కొనసాగుతున్న వార్.. పోలీసుల మోహరింపు..
ఆర్టీపీపీ దగ్గర మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జేసీ లారీలకు ఫ్లైయాస్‌ను లోడ్ చేయకుండా జమ్మలమడుగు నేతలు అడ్డుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో లారీలు, టిప్పర్లను జేసీ వర్గీయులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఆదిపత్యపోరు నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. రెండు జిల్లాల నేతలు పట్టువదలడంలేదు. సీఎం చంద్రబాబు పంచాయతీ చేసినా కూడా వారు పట్టించుకోవడంలేదు..మళ్లీ యధాతథంగా ఎక్కడి వాహనాలు అక్కడ అడ్డుకోవడం జరిగింది.
ఇసుక కోసం జమ్మలమడుకు చెందిన లారీలు, టిప్పర్లు రాత్రి తాడిపత్రి వెళితే జేసీ వర్గీయులు అడ్డుకున్నారు. అలాగే ఫ్లైయాష్ బూడిద కోసం జేసీ వర్గానికి చెందిన లారీలు, టిప్పర్లను జమ్మలమడుగు వద్ద ఆదినారాయణ రెడ్డి వర్గీయలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. కాగా నిన్న (సోమవారం) ఇరు వర్గాల నేతలను సీఎం చంద్రబాబు పిలిపించారు. అయితే జ్వరం వచ్చిందని జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లలేదు. ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి వెళ్లారు. ఆ ఇద్దరికి చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. అయినా మంగళవారం మళ్లీ యధాతథంగా ఇరు వర్గాల మద్య ఉద్రిక్తత నెలకొంది. దీనిపై ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జమ్మలమడుగులో నియోజక వర్గ పరిధిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆర్టీపీపీ నుంచి ఫ్లైయాస్ పౌడర్ తాడిపత్రికి తరలించే విషయంలో జేసీ బ్రదర్స్ (vs) ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. మూడు రోజులుగా ఇరు వర్గల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. అటు తాడిపత్రి నుంచి జేసీ వర్గీయులు మళ్లీ వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా పోలీసు బలగాలు మొహరించాయి. అనంత పురం, కడప జిల్లా బోర్డర్ అయిన కొండాపురం మండలంలో చెక్ ఫోస్ట్ ఏర్పాటు చేశారు. ఆర్టీపీపీ నుండి ప్లయాస్ పౌడర్‌ను తాడిపత్రికి తరలించే విషయంలో జేసీ బ్రదర్స్ ఆదినారాయణ వర్గాల మధ్య వివాదం నడుస్తోంది.
కాగా జేసీ దివాక‌ర్‌రెడ్డి, ఆదినారాయ‌ణ‌రెడ్డి.. ఇద్దరూ కూట‌మి నేతలే కావ‌డం విశేషం. జేసీ దివాక‌ర్‌రెడ్డి తాడిప‌త్రికి చెందిన టీడీపీ నాయ‌కుడు, ఆదినారాయ‌ణ‌రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే. వీళ్లిద్దరి మ‌ధ్య ప్లైయాష్ త‌ర‌లింపున‌కు సంబంధించిన ఒప్పందంపై విభేదాలు తలెత్తాయి. జ‌మ్మల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోకి ఆర్టీపీపీ వ‌స్తుంది. దీంతో త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జ‌రిగినా త‌మ క‌నుస‌న్నల్లోనే జరగాలని ఆదినారాయ‌ణ‌రెడ్డి భావిస్తున్నారు. అయితే తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలోని సిమెంట్ ప‌రిశ్రమ‌ల‌కు ఆర్టీపీపీ నుంచి జేసీ దివాక‌ర్‌రెడ్డి వ‌ర్గీయుల వాహ‌నాలు ప్లైయాష్ త‌ర‌లిస్తున్నాయి. దీనిపై ఒప్పందం కుద‌ర‌క‌పోవ‌డంతో జేసీ దివాక‌ర్‌రెడ్డి వాహ‌నాల్ని ఆర్టీపీపీకి ఎట్టి ప‌రిస్థితుల్లో రానివ్వకూడ‌ద‌ని ఆదినారాయ‌ణ‌రెడ్డి వ‌ర్గీయులు పంతం ప‌ట్టారని సమాచారం.
👉పులివెందుల కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది: మంత్రి మనోహర్ కు టీడీపీ ఎమ్మెల్సీ లేఖ*
– మనోహర్ కు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి లేఖ
– వేంపల్లి, ముదిగుబ్బ వైసీపీ నేతలు బియ్యం అక్రమ రవాణాలో కీలకంగా ఉన్నారన్న ఎమ్మెల్సీ
– మిత్రమనాయుడు అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించాడని ఆరోపణ
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి లేఖ రాశారు. పులివెందుల కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని లేఖలో ఆయన పేర్కొన్నారు. పులివెందుల… అనంతపురం జిల్లా సరిహద్దులలో ఉండడంతో అక్రమ రవాణాకు, బియ్యం నిల్వలకు వీలుగా ఉంటుందన్న కారణంతో స్మగ్లర్లు దీన్ని తమ స్థావరంగా మార్చుకున్నారని వివరించారు. 2019 నుంచి గత ప్రభుత్వ హయాంలో స్మగ్లింగ్ కు పాల్పడినవారే, ఇప్పుడు కూడా స్మగ్లింగ్ చేస్తున్నారని రాంగోపాల్ రెడ్డి వివరించారు. వేంపల్లి, ముదిగుబ్బ ప్రాంతానికి చెందిన వైసీపీ నేతలు ఈ అక్రమ రవాణాలో కీలకంగా ఉన్నారని చెప్పారు. ముదిగుబ్బకు చెందిన వైసీపీ నేత మిత్రమనాయుడు గత ఐదేళ్లుగా రేషన్ బియ్యం అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించాడని తెలిపారు. ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే ఈ స్మగ్లర్ల ఆదాయం నెలకు రూ.1 కోటి వరకు ఉందని తెలిపారు. అధికార యంత్రాంగం ఈ తంతును చూసీచూడనట్టు వదిలేస్తోందని, చిన్న చిన్న కేసులతో సరిపెడుతున్నారని వివరించారు. బియ్యం అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్లను కోరారు. పులివెందుల నుంచి అనంతపురం జిల్లాకు ఉన్న సరిహద్దులో నిఘా పెంచాలని విజ్ఞప్తి చేశారు. పులివెందుల ప్రాంతంలోని రైస్ మిల్లులు, బియ్యం గోడౌన్లపై నిత్యం నిఘా ఉంచాలని, అక్రమ రవాణా గురించి తెలిసినా పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని రాంగోపాల్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.
👉మా కుటుంబంతో వియ్యం ఏర్పడ్డాక వారు బియ్యం వ్యాపారం చేయడంలేదు: మంత్రి పయ్యావుల*
– కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా అంశం
– కూటమి, వైసీపీ నేతల మధ్యల మాటల యుద్ధం
– ఆర్థికమంత్రి వియ్యంకుడి హస్తం ఉందన్న పేర్ని నాని
– కావాలంటే చెక్ పోస్టు పెట్టి తనిఖీలు చేసుకోవచ్చన్న పయ్యావుల- చెక్ పోస్టు పెట్టుకుంటామంటే కుర్చీ, టెంట్ ఇస్తానని ఆఫర్.. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలివెళుతున్న వ్యవహారంలో అధికార కూటమి నేతలు, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బియ్యం అక్రమ రవాణా వెనుక ఉన్నది రాష్ట్ర ఆర్థికమంత్రి వియ్యంకుడేనని తమకు సమాచారం ఉందని వైసీపీ నేత పేర్ని నాని ఆరోపణలు చేశారు. దీనిపై రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. తన వియ్యంకుడి కుటుంబం మూడు తరాలుగా బాయిల్డ్ రైస్ ఎగుమతుల వ్యాపారంలో ఉందని స్పష్టం చేశారు. అయితే, తమ కుటుంబంతో వియ్యం ఏర్పరచుకున్న తర్వాత… వారు బియ్యం వ్యాపారం చేయడంలేదని వెల్లడించారు. ఎవరికైనా అనుమానం ఉంటే చెక్ పోస్ట్ పెట్టి ప్రతి గోనె సంచి తనిఖీ చేసుకోవచ్చని పయ్యావుల అన్నారు. చెక్ పోస్టు పెట్టుకుంటానంటే కుర్చీ, టెంట్ కూడా ఏర్పాటు చేస్తానని ఆఫర్ ఇచ్చారు. రేషన్ బియ్యం తరలింపునకు, తన వియ్యంకుడి వ్యాపారానికి సంబంధం లేదని స్పష్టం చేశారు.
👉 ఫుట్ బోర్డు పై ప్రయాణిస్తూ కాలుజారి బస్సు కిందపడిన విద్యార్థిని* మెదక్ జిల్లా: డిసెంబర్ 03
మెదక్ జిల్లాలోఈరోజు మధ్యాహ్నం విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కింద పడి విద్యార్థినికి తీవ్రగాయాలు అయ్యాయి.
దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి చౌరస్తాలో ఆర్టీసీ బస్సులో ఎక్కువ మంది ఎక్కడంతో ఫుట్‌బోర్డుపై నుండి బోడ అఖిల(16)అనే విద్యార్థిని బస్సు కింద పడగా..ఆమె కాళ్లపై నుండి బస్సు వెళ్లడంతో విద్యార్థినికి తీవ్ర గాయాలు కాగా..ఆమెతో పాటు మరో విద్యార్థికి కూడా గాయాలు అయ్యాయి. హుటాహుటిన స్థానికులు ఆసుపత్రి తరలించారు.
👉తిరుపతి జిల్లా..చిట్టమూరు మండలం..
*చిట్టమూరు మండలం తాగెడు గ్రామ సమీపంలో ఈ ఉదయం నీటి ప్రవాహంలో ఇద్దరు గల్లంతైన వారిలో మధు రెడ్డి అనే వ్యక్తి మృతదేహం లభ్యం,ఇంకా ఆచూకీ లభ్యం కానీ షారుక్..
*చిట్టమూరు మండలం తాగెడు గ్రామం వద్ద వరద లో మధు,షారుక్ అనే ఇద్దరు గల్లంతు*
👉 *నెల్లూరు జిల్లా*..ఏసీబీ వలలో చిక్కిన ముత్తుకూరు తాసిల్దార్ ఎల్.బాలకృష్ణారెడ్డి… 25 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎమ్మార్వో….వడ్లమూడి వెంకట రమణయ్య నాయుడు పొలానికి సంబంధించి 1B అడంగల్ కోసం 50 వేలు డిమాండ్ చేసిన MRO…25 వేలు డీల్ తో ఏసీబీ ని ఆశ్రయించిన రమణయ్య నాయుడు……
👉*సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం*
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట లోని యశ్వంత్ జూనియర్ కళాశాల, ఆల్ఫా, మరియు బాయ్స్ హైస్కూల్ లో మంగళవారం సీఐ మల్లికార్జున, ఎస్సై రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఇక విద్యార్థినీలకు బాల్య వివాహాలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే అంశాలపై వివరించి అప్రమత్తం చేశారు. మత్తు పదార్థాలకు బానిస కాకుండా బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. మీ తల్లిదండ్రులకు మేము ఇచ్చిన సూచనలు,సలహాలు వివరించి వారు సైబర్ నేరాల బారిన పడకుండా చూడాలని సీఐ మల్లికార్జున, ఎస్సై రవీంద్రారెడ్డి విద్యార్థులకు తెలిపారు.
👉 గత నెల 27న కాకినాడ యాంకరేజి పోర్టులో తనిఖీ చేసిన స్టెల్లా ఎల్ నౌకలో పిడిఎస్ బియ్యం గుర్తించిన నేపద్యంలో షిప్ లోడ్ చేసిన మొత్తం బియ్యాన్ని సమగ్రంగా తనిఖీ చేసేందుకు ఐదు ప్రభుత్వ శాఖల అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేసామని జిల్లా కలక్టర్ తెలియజేశారు.
👉సెకండ్ ఆల్ ఇండియా పెన్ కాక్ సిలాట్ చాంపియన్ షిప్-2024 లో కాంస్య పతకం సాధించిన బాపట్ల జిల్లా కానిస్టేబుల్*
*కానిస్టేబుల్ వీరంకి నరేంద్రను అభినందించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్*
👉విద్యార్థినులకు అసభ్యకర మెసేజులు చేస్తున్న శ్రీచైతన్య కాలేజీ వైస్ ప్రిన్సిపల్
హైదరాబాద్ – మదీనాగూడలోని శ్రీచైతన్య కాలేజీ వైస్ ప్రిన్సిపల్ శివ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఆందోళనకు దిగిన విద్యార్థినులు.
స్నాప్ చాట్లో వైట్ డ్రెస్సులో అందంగా ఉన్నావు. నీకు లవర్ ఉన్నాడా? నువ్వు హర్ట్ అయితే నేను ఉండలేను అంటూ విద్యార్థినులకు అసభ్యకర మెసేజ్లు చేసిన శ్రీచైతన్య కాలేజీ వైస్ ప్రిన్సిపల్ శివ..
👉 బూడిద కాదది…తగ్గనంటున్న జేసీ ! బూడిద అని లైట్ తీసుకోవడానికి లేదు. ఆ బూడిద చాలా డబ్బుని తెచ్చిపెడుతుంది.బూడిద అని లైట్ తీసుకోవడానికి లేదు. ఆ బూడిద చాలా డబ్బుని తెచ్చిపెడుతుంది. కోట్లను తెస్తుంది. అంతే కాదు అది రాజకీయంగా కూడా తమ అనుచరులను పటిష్టం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి ఎక్కడా తగ్గేదే లేదని అంటున్నారని టాక్.
ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా అనంతపురం సీఎం హోదాలో వస్తే ప్రభాకరరెడ్డి వెళ్లలేదు. దాని కంటే ముందు పిలిచి మాట్లాడదామంటే కూడా వెళ్లలేదు. ఇక ఆయన కొడుకు తాడిపత్రి ఎమ్మెల్యే అయిన అస్మిత్ రెడ్డిని పిలిచి బాబు చెప్పాల్సింది చెప్పేశారు.పార్టీని బజారున పెట్టరాదని కూడా ఆయన గట్టిగానే ఆదేశించారు. అయితే అక్కడ ఉన్నది పేరుకు బూడిద అయినా దాని వెనక ఉన్నది డబ్బు. అందుకే ఆ కాంట్రాక్టుల కోసం జేసీ చూస్తున్నారని అంటున్నారు. తమ వారికి ఇప్పించుకుంటామని చెబుతున్నారని అంటున్నారు. కడప ఆర్టీపీపీ బూడిత విషయంలో కాంట్రాక్టులు తన అనుచరులకు దక్కాల్సిందే అన్నది ఆయన పట్టుదలగా ఉందని అంటున్నారు. ఇక ఈ విషయంలో తాను తప్పు చేయలేదని ఆయన బలంగా నమ్ముతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో చూస్తే కనుక తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీకి ఫ్లై యాష్ ఎగుమతులపై ఇంకా సస్పెన్స్ అలా సాగుతొంది. ఇదిలా ఉంటే ఈ విషయంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో జేసీ డైరెక్ట్ ఫైట్ కి రెడీ అంటున్నారు. అక్కడ ఆదినారాయణరెడ్డి కూడా వెనక్కి తగ్గడం లేదు. ఆయన కూడా పట్టుదల మనిషే. ఇలా ఇద్దరు నేతలూ వెనక్కి వెళ్లేది లేదని భీష్మించుకుని కూర్చుంటే కూటమికే ఇబ్బంది అని అంటున్నారు. జేసీ ప్రభాకరరెడ్డి అయితే గత వైసీపీ ప్రభుత్వంలో అయిదేళ్ళ పాటు అనేక పోరాటాలు చేశామని ఎన్నో ఇబ్బందులు పడ్డామని గుర్తు చేస్తున్నారు. ఇపుడు మంచి రోజులు వచ్చాయని తమ ప్రభుత్వమే అధికారంలో ఉందని ఆయన అంటున్నారు. అయినా సరే ఈ తగ్గమని అంటే ఎలా అని ఆయన తన సన్నిహితులతో అంటున్నట్లుగా చెబుతున్నారు.
👉ఇక్కడ చిక్కుముడి ఏంటి అంటే కడప జిల్లాలో ఆర్టీపీపీ ఉండగా సిమెంట్ ఫ్యాక్టరీ మాత్రం జేసీ సొంత ఏరియా అయిన తాడిపత్రిలో ఉంది. దాంతో ఇద్దరికీ ఆధిపత్యం ఉందని అంటున్నారు. తామే బూడిదను ఎగుమతి చేస్తామని రెండు వర్గాలు పోటీ పడుతున్న నేపధ్యం ఉంది. అయితే బూడిద రాజకీయం ఇపుడే ఏమీ కాదని గతంలోనూ ఉందని అంటున్నారు. అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో జమ్మలమడుగు తాడిపత్రి ఎమ్మెల్యేలు ఇద్దరూ బూడిద విషయంలో పరస్పరం అంగీకారం అయి పంచుకున్నారని అంటున్నారు. అయితే ఇపుడు పంచుకోవడం కాదు సొంతం మాకే అని ఇద్దరు రెడ్లూ పట్టుబట్టి కూర్చుకున్నారు. దాంతోనే వివాదం వస్తోంది అని అంటున్నారు. పైగా బూడిద ఎగుమతి విషయంలో ఆదాయం పెద్ద ఎత్తున వస్తోందని అంటున్నారు. ఇదే ఇపుడు తెగేదాకా లాగెలా ఉందని అంటున్నారు.ఇకపోతే ఇద్దరూ కూటమిలో ఉన్నా జేసీ టీడీపీ అయితే ఆది నారాయణరెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా ఇద్దరూ పంతానికి పోతే చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకుంటారని కూడా అంటున్నారు. అపుడు కాంట్రాక్టులు ఎవరికీ దక్కకుండా పోయినా పోతాయని కూడా చెబుతు న్నారు.అయితే తన పలుకుబడితో ఎలాగైనా ఈ కాంట్రాక్టులు తెచ్చుకునేందుకే జేసీ చూస్తున్నారని అంటున్నారు.
👉*కిమ్స్ హాస్పటల్స్, ఒంగోలు నందు అత్యంత క్లిష్టతరమైన బెంటాల్స్ సర్జరీ విజయవంతం*
ప్రకాశం జిల్లాలో తొలిసారి గా కిమ్స్ హాస్పిటల్స్, ఒంగోలు నందు బెంటాల్స్ ఆపరేషన్ విజయవంతం అయినట్లు హాస్పిటల్ బృందం తెలిపింది.
55 సంవత్సరాల వయసు గల వ్యక్తి ఆయాసం, గుండె దడ తో బాధ పడుతూ కిమ్స్ హాస్పిటల్, ఒంగోలు నందు డా. లక్ష్మణ్ రెడ్డిని సంప్రదించడం జరిగింది. అతనికి ECHO, CT AORTOGRAM  మరియు Caronary Angiogram పరీక్షలు  చేసి అతనికి అయోర్టిక్  రీ గర్జిడేషన్, బైకస్ పిడ్ అయోర్టిక్ వాల్వ్ తో పాటుగా అసెండింగ్ అయోర్థి అన్యూర్థిజం అనే వ్యాధి తో బాధ పడుతున్నట్లు నిర్దారించడం జరిగింది.
ఇలాంటి వ్యాధి 1000 మంది లొ 1 లేదా 2 కి వచ్ఛే అవకాశం ఉంది. ఈ వ్యాది సిస్టమిక్ కనెక్టివ్ టిష్యూ డిసార్డర్  వల్ల వస్తుంది.ఈ వ్యాధి చికిత్స సమయం లొ ప్రాణాపాయ పరిస్థితులు ఎక్కువ. డా. లక్ష్మణ్ రెడ్డీ ప్రత్యేక శ్రద్దతో ఈ పేషెంట్ కు అయోర్టిక్ కవాటం, అయోర్థిక్ రూట్, గుండె కి రక్తం సరఫరా చేసే రక్త నాళం మరియు గుండె నుండి బయటికి వచ్ఛే ప్రధాన రక్త నాళం అన్నిటిని శస్త్ర చికిత్స ద్వారా కృత్రిమ కవాటం మరియు కృత్రిమ అయోర్థిక్ రూట్ ను విజయవంతం గా మార్చడం జరిగింది.పేషెంట్  త్వరగా కోలుకోవడం తో 5 వ రోజునే డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ శస్త్ర చికిత్స ను  విజయవంతం చేసిన డా. లక్ష్మణ్ రెడ్డీ, , డా. రామకృష్ణ  మరియు ఆపరేషన్ బృందం ను కిమ్స్ హాస్పిటల్ మెడికల్ సూపరెండెండెంట్ డా. శ్రీ హరి రెడ్డీ అభినందించారు. అన్ని రకాలైన అత్యాధునిక పరికరాలు, మెరుగైన సేవలు అందించటం లో కిమ్స్ హాస్పిటల్ ముందు ఉంటుందని ఈ డి. టి . గిరి నాయుడు తెలుపుతూ వైద్య బృందాన్ని అభినంచారు.
👉 గిద్దలూరు మండలం బురుజు పల్లి గ్రామంలో తురక మనోజ్ అనే బాలుడు పాము కాటుకు గురై గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.
👉పాల సేకరణ రేటును లీటరుకు రూ. 4 తగ్గించినందుకు విశాఖ డెయిరీని ముట్టడించిన పాడి రైతులు. అడ్డుకున్న పోలీసులు. రైతులు ప్రతిఘటించడంతో ఉద్రిక్తత.

7k network
Recent Posts

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి