రాజ్యసభలో డబ్బుల దుమారం.. వైసీపీ ట్రూత్ బాంబ్… తెరపైకి ఘోరమైన వీడియో! .. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పీఏ సహా 11 మంది అరెస్ట్‌ !..మాజీ మంత్రి విడదల రజనిపై గురువారం యడవల్లి దళిత రైతులు ఫిర్యాదు …కోట్ల రూపాయలు తీసుకొని ఎన్నారైలను మోసం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ – విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి…గృహ నిర్బంధంలో మాజీ మంత్రి హరీష్ రావు.. నంద్యాలలో ఆర్య వైశ్య కుటుంబం అదృశ్యం.. కలకలం సృష్టిస్తున్న సెల్ఫీ..ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని దారుణంగా హింసిస్తున్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ … పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల, మార్కాపురం ఎమ్మెల్యే కందుల..

👉 ఢిల్లీ: రాజ్యసభలో డబ్బుల దుమారం..
ఎంపీ అభిషేక్‌ మను సంఘ్వీ సీటు దగ్గర దొరికిన డబ్బులు.. విచారణ జరుగుతోందని ప్రకటించిన రాజ్యసభ చైర్మన్‌.. డబ్బు ఎవరిది అనే కోణంలో విచారణ జరుగుతోంది.. రూ.500 నోట్లు దాదాపు వంద ఉన్నట్లు గుర్తింపు-రాజ్యసభ చైర్మన్‌..
👉 వైసీపీ ట్రూత్ బాంబ్… తెరపైకి ఘోరమైన వీడియో! ఈ సమయంలో తాజాగా వైసీపీ ఈ రోజు ఉదయం 11:55కి “బ్రేకింగ్ న్యూస్” అంటూ ఓ పోస్ట్ పెట్టింది. మధ్యాహ్నం 1:01 వదిలింది! ఆ పోస్ట్ లోని వీడియో వైరల్ టాపిక్ గా మారుతోంది. ఈ మధ్యకాలంలో న్యూస్ ఛానల్స్ మాదిరిగా మరి కాసేపట్లో బ్రేకింగ్ న్యూస్ అనే టైపులో రాజకీయ పార్టీల సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా చేస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ సమయంలో తాజాగా వైసీపీ ఈ రోజు ఉదయం 11:55కి “బ్రేకింగ్ న్యూస్” అంటూ ఓ పోస్ట్ పెట్టింది.మధ్యాహ్నం 1:01 వదిలింది! ఆ పోస్ట్ లోని వీడియో వైరల్ టాపిక్ గా మారుతోంది.
అవును… “బ్రేకింగ్ న్యూస్! ఇంతకాలం దాగి ఉన్నది చివరకు వెలుగు చూసింది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు ట్రూత్ బాంబ్ పడనుంది.. చూస్తూనే ఉండండి # బిగ్ ఎక్స్ పోజ్ ” అని పేర్కొంది. అన్నట్లుగానే మధ్యాహ్మం 1:01కి ఓ ఫోటోతో పాటు ఒక వీడియోను విడుదల చేసింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడి అనుచరుడి అరాచకాలంటూ రాసుకొచ్చింది. ఇందులో భాగంగా… శ్రీకాకుళంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరుడి ఘరానా మోసం బట్టబయలు అయ్యిందని మొదలుపెట్టి.. “ఇండియన్ ఆర్మీ కాలింగ్” అనే సెంటర్ ను స్థాపించి.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి దగ్గర నుంచి రు.5 – 10 లక్షల వరకూ వసూళ్లకి పాల్పడ్డాడు బసవ రమణ అనే వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ క్రమంలో… శిక్షణ పేరుతో సెంటర్ కి వచ్చిన అమ్మాయిల గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి, వీడియోలు రికార్డ్ చేసి, వాటిని అడ్డుపెట్టుకుని స్నేహితులతో కలిసి అమ్మాయిలను వేధింపులకు గుర్తిచేస్తున్నారని.. ఈ విషయాన్ని అమ్మాయిల ఇంట్లో చెప్పిన నలుగురు కుర్రాళ్లని బంధించి, చిత్రహింసలకు గురిచేశారని తెలిపింది. ఈమెను అడిగితే తెలుస్తుంది! శ్రీకాకుళంలో మంత్రి రామ్మోహన్ నాయుడి పేరు చెప్పి.. బసవ రమణ దందాలు చేస్తున్నాడని.. ఇందులో భాగంగా షాపింగ్ మాల్స్, బార్స్ కి వెళ్లి బిల్లులు చెల్లించకుండా వేదిరిస్తున్నాడని.. “ఎన్నో ఏళ్లు” నుంచి ఇలా దుర్మార్గాలకి పాల్పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ కి ఇతడు సన్నిహితుడని పేర్కొంది. ఈ సందర్భంగా… పాలన చేతగాకపోతే ఊరూరా ఇలాంటి దుర్మార్గులే రాజ్యమేలుతారు అనేదానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా చంద్రబాబు అంటూ ఎక్స్ పో ఓ పోస్ట్ పెట్టింది. దీనికి సాక్ష్యంగా అన్నట్లుగా… సదరు రమణ అనే వ్యక్తి.. రామ్మోహన్ నాయుడితో దిగిన ఫోటోలు.. అతడు ఓ కుర్రాడిని చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ… “”ఎన్నో ఏళ్లు” నుంచి ఇలా దుర్మార్గాలకి పాల్పడుతున్నా” అనే పాయింట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కూడా కానప్పుడు.. గత ఐదేళ్లు అధికారంలో ఉన్నది తమరే కదా అంటు కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు! ఆ వాఖ్యాన్ని సెల్ఫ్ గోల్ గా అభివర్ణిస్తున్నారు! ఆ సంగతి అలా ఉంటే… ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో జరిగిన దారుణం ఏమాత్రం క్షమించరాని చర్య అనే అంటున్నారు నెటిజన్లు! ఈ ఆటవిక చర్యను, రాక్షస వ్యవహారాన్ని, మూర్ఖపు దాడిని ఏమాత్రం క్షమించరాదని.. ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించాలని.. నిజానిజాలు నిగ్గు తేల్చి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాకానిపక్షంలో… ఇలాంటి విషయాలు ఇలా పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత కూడా చర్యలు తీసుకోకుండా వదిలేసిన అపవాదు కూటమి ప్రభుత్వంపై పడుతుందని అంటున్నారు
👉మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పీఏ సహా 11 మంది అరెస్ట్‌..!!!
ఎన్టీఆర్‌ జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వైసీపీ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నిందితులుగా ఉన్న వంశీ పీఏ రాజా సహా 11 మందిని శుక్రవారం తెల్లవారుజామున అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు. విజయవాడ గ్రామీణం, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరుకు చెందిన మరికొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశముంది.
👉కర్నూలు జిల్లా చెల్లెలచెల్లెమ్మ గ్రామంలో ఉద్రిక్తత.
బాలికపై యువకుడు అత్యాచారయత్నం… కేకలు వేయడంతో యువకుడిని పట్టుకొని దేహశుద్ధి చేసిన గ్రామస్తులు. అత్యాచారానికి ప్రయత్నించిన యువకుడి ఇంటికి నిప్పు పెట్టిన గ్రామస్తులు.
👉నంద్యాల జిల్లా కేంద్రంలో ఆర్య వైశ్య కుటుంబం అదృశ్యం*..*కుటుంబంతో సహా ఆత్మహత్య తప్పదని సెల్ఫీ వీడియో విడుదల*
కుటుంబ జీవనం కోసం దుకాణాలను అద్దెకు ఇస్తే ఆరు నెలలుగా బాడుగ చెల్లించకుండా బెదిరింపులు..
తాజాగా నాగరాజు కుటుంబ సభ్యులను ఇంట్లోకి వెళ్లనీయకుండా అడ్డగింపు..కొద్ది రోజుల నుంచి నాగరాజు కుటుంబసభ్యుల ఫోటోలు, వీడియోలు తీసి తప్పుగా సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తానని వేధింపులు..
న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరిగి అలసి పోయిన నాగరాజు కుటుంబం..
దుకాణాల్లో అద్దెకు ఉన్న అరుణ్ తప్పుడు పత్రాలతో కోర్టులో కేసు వేశారని ఆరోపిస్తున్న నాగరాజు..దుకాణాలు 2022 లో నిర్మాణం జరిపితే 2018 లో బాడుగకు ఇచ్చినట్లు తప్పుడు పత్రాలు సృష్టించినట్లు ఆరోపిస్తున్న నాగరాజు..
కోర్టులో కేసు ఉండటంతో చేతులు ఎత్తేసిన పోలీసులు
తన ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోలేదని నాగరాజు ఆరోపణ..నాగరాజు వీడియో బయటకు రావటంతో ఇంటి వద్దకు వెళ్లిన పోలీసులు..ఇంటికి తాళం వేసి ఉండటంతో నాగరాజు ఆచూకీకోసం వివరాలు సేకరిస్తున్న పోలీసులు
*నాగరాజు విన్నపం*
దుకాణాలు బాడుగకు ఇవ్వడం మేము చేసిన తప్ప, కాలి చెయ్యమని అడిగినందుకు చంపుతామని బెదిరింపులు న్యాయం జరగకపోవడంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాము. మా సమస్య పరిష్కారం కాకపోవడంతో సెల్ఫీ వీడియోతో మీ ముందుకు వచ్చాము.. మా కుటుంబ సభ్యులకు ఏమి జరిగినా మా దుకాణంలో బాడుగకు ఉన్నవారే బాధ్యులు.ముఖ్య గమనిక ప్రజలు దుకాణాలు బాడుగకు ఇచ్చే సమయంలో అన్ని సరిచూసుకుని ఇవ్వాలని కోరుతున్నాననీ నాగరాజు ఆవేదన వ్యక్తం చేశాడు.
👉మాజీ మంత్రి విడదల రజనిపై గురువారం యడవల్లి దళిత రైతులు పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు…*తమ భూములను అన్యాయంగా, అక్రమంగా లాగేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు… *రజినీ పైన, అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పైన కేసు నమోదు చేయాలని వారు కోరారు. *తమను మభ్యపెట్టి విలువైన గ్రానైట్‌ నిక్షేపాలున్న భూములను చేజిక్కించుకున్నారన్నారు.
👉 అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విశాఖ పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు .
👉 కోట్ల రూపాయలు తీసుకొని ఎన్నారైలను మోసం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ..విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి..ఎన్నారైలను నమ్మించి, కోట్ల రూపాయలు తెచ్చుకొని..మళ్లీ దొరగడీలో కూర్చున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..ఇదేం రాజకీయం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..?
విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి
👉గృహ నిర్బంధంలో మాజీ మంత్రి హరీష్ రావు
ఇంటి చుట్టూ పోలీసుల పహారా
వచ్చి పోయే వారిని అడ్డుకుంటున్న పోలీసులు
పోలీసుల తీరుతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు
👉 ‘గన్ను చూపించి కాకినాడ సెజ్‌, పోర్టులో వాటాలు రాయించుకున్న కేసులో మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని ఏ-1గా చేర్చాలి. ఈ కబ్జా వ్యవహారాల్లో మొత్తం కర్త, కర్మ, క్రియ ఆయనే. ఈ దుర్మార్గాలకు జగన్‌ను ప్రాసిక్యూట్‌ చేయాలి’ అని ఆక్వా అథారిటీ వైస్‌ చైర్మన్‌, టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో 2వ అతి పెద్దదైన కాకినాడ సెజ్‌పై నాటి సీఎం జగన్‌ కళ్లు పడ్డాయి. విజయసాయి రెడ్డి, విక్రాంత్‌ రెడ్డి, శరత్‌ చంద్రారెడ్డిని ముందు పెట్టి కాకినాడ సెజ్‌, పోర్టు కంపెనీల్లో ప్రధాన భాగస్వామిగా ఉన్న కేవీ రావును తీవ్రంగా బెదిరించి మెజారిటీ వాటాలు రాయించుకున్నారు. కాకినాడ సెజ్‌లో రూ.2,000 కోట్ల విలువైన 4,000 ఎకరాల భూమిని కేవలం రూ.12 కోట్లకు రాయించుకున్నారు. కాకినాడ డీప్‌ సీ పోర్టును ఇంకా ఘోరంగా కొట్టేశారు. ఈ ఒక్క సంవత్సరమే ఈ పోర్టు ఆదాయం రూ.450 నుంచి రూ.530 కోట్ల మధ్యలో ఉంది. ఇందులో కేవీ రావుకు చెందిన 59% వాటాను రూ.494 కోట్లకు తీసుకున్నారు. ఈ వాటా కింద ఒక్క గత సంవత్సరంలోనే డివిడెండ్లు, ఐసీడీ డిపాజిట్ల రూపంలో రూ.380 కోట్లు వచ్చాయి’ అని ఆనం అన్నారు
👉 తనపై లుకౌట్‌ నోటీసులు జారీ చేసినందుకు సీఎం చంద్రబాబు, కేవీ రావులపై వచ్చేవారం పరువునష్టం దావా వేస్తానని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై లుకౌట్‌ నోటీసులు జారీచేయడాన్ని ప్రశ్నించారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికే చేశారని ఆరోపించారు. ‘2028లో ఎన్నికలు జరుగుతాయి. మేం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. అప్పటి వరకు చంద్రబాబు బతికుంటే అరెస్టు చేస్తాం. టీడీపీ ఎమ్మెల్యేలందరికీ చెబుతున్నా. మీ నాయకుడికి కులం తప్ప.. పరిపాలన తెలియదు. ముఖ్యమంత్రిని మార్చండి. చంద్రబాబు, లోకేశ్‌ కంటే పవన్‌ కల్యాణ్‌ మంచి నాయకుడు. కేవీ రావుకు అన్యాయం జరిగి ఉంటే అప్పుడే కోర్టులను ఆశ్రయించి ఉండాల్సింది. ఆయన్ను విక్రాంత్‌రెడ్డి భయపెట్టాడని ప్రచారం చేస్తున్నారు. రావుకు ఫోన్‌ చేసినట్లు, బెదిరించినట్లు ఆధారాలు ఉన్నాయా? కాకినాడ పోర్టు వ్యవహారంపై 1997 నుంచీ సీబీఐ దర్యాప్తు జరపాలి’ అని డిమాండ్‌ చేశారు.
[👉 కాకినాడ పోర్టు నుంచి బియ్యం తీసుకువెళుతున్న స్టెల్లా నౌకను అణువణువూ తనిఖీ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన తనిఖీల తరువాతే కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై స్పష్టత వచ్చింది. సీబీసీఐడీ విచారణకు ఆదేశించాం. మరిన్ని విషయాలు బయటకు వస్తాయి. గత ప్రభుత్వ హయాంలో గడిచిన మూడేళ్లలో 1.31లక్షల టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా ఎగుమతి చేశారు. కాకినాడ పోర్టును స్మగ్లింగ్‌ డెన్‌గా మార్చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ మాఫియాపై ఉక్కుపాదం మోపుతు న్నాం. నిబందనలు అతిక్రమించిన వారిపై ఇప్పటి వరకూ 1066 కేసులు నమోదుచేసి, 729 మందిని అరెస్టు చేశాం. 62 వేల టన్నుల బియ్యాన్ని సీజ్‌ చేశాం’ అని మంత్రి నాదెండ్ల వివరించారు.
👉ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని దారుణంగా హింసిస్తున్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్..శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.5,00,000 నుండి 10,00,000 వరకు డబ్బులు తీసుకొని, మోసం చేస్తున్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బసవ రమణ..ఆ డబ్బులను జల్సాలకు ఉపయోగించి.. విద్యార్థులు ఉద్యోగం గురించి అడగగా, వారి కుటుంబ సభ్యులను తిడుతూ బెల్ట్‌తో దారుణంగా కొడుతున్న వీడియో ప్రస్తుతం నెట్ ఇంట్లో సంచలనం సృష్టిస్తుంది.
👉ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు…..*
*ముఖ్యఅతిథిగా పాల్గొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు….పొదిలి ఏబీయం స్కూల్ కాంపౌండ్ ఆధ్వర్యంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా పూలమాలవేసి నివాళులర్పించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు……
అంబేద్కర్ గురించి పలు అంశాలు సమావేశంలో తెలియజేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎంఈఓ శ్రీనివాసరెడ్డి,ఎస్సై వివేమన..అంబేద్కర్ కు నివాళులర్పించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సై టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వరికుంట్ల అనిల్ కుమార్, ఎమ్మార్పీఎస్ మరియు ఎంఈఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు…..అనంతరం ప్రజలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన నాయకులు తదితరులు
👉పెద్దనాగులవరం గ్రామంలో రెవిన్యూ సదస్సు కార్యక్రమం*
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్దనాగులవరంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, మున్సిపల్ కమీషనర్ నారాయణ,సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్, ఎమ్మార్వో చిరంజీవి మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
👉ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం పట్టణంలోని చెరువు కట్టపై ఇరువైపులా ఉన్న కంప చెట్లను తొలగించడానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నాళ్ళనుండో చెరువు కట్టపై కంపచెట్లతో నెలకు 10 లేక 15 యాక్సిడెంట్లు జరుగుతున్నాయని కంపచెట్ల తొలగింపుతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని త్వరలోనే చెరువు కట్టను ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దుతామని అన్నారు.కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట్, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. డివిజన్ రిపోర్టర్ అస్లాం బేగ్..

👉పుష్ప 2 థియేటర్‌లో పెప్పర్‌ స్ప్రే
కొట్టిన దుండగులు‌.. పలువురికి అస్వస్థత
ముంబై – బాంద్రా ఏరియాలో ఉండే గెలాక్సీ థియేటర్‌లో పుష్ప 2 సినిమా ప్రదర్శిస్తూ ఉండగా ఇంటర్వెల్ సమయంలో గుర్తు తెలియని దుండగులు పెప్పర్‌ స్ప్రే కొట్టడంతో ప్రేక్షకులు ఊపిరి ఆడక, దగ్గుతో థియేటర్‌ నుంచి బయటకు పరుగులు తీశారు.
👉నూతన బస్సు సర్వీసులను ప్రారంభించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*గిద్దలూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో నూతనంగా 6 బస్సు సర్వీసులను ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోని రిబ్బన్ కట్, పచ్చ జెండా ఊపి నూతన బస్సు సర్వీసులను ప్రారంభించారు. నూతన బస్సు సర్వీసులు తిరుపతికీ 2 విజయవాడకు 4 బస్సు సర్వీసులను ప్రారంభించినట్లు ఆర్టీసీ డి.ఎం తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డి.ఎం చంద్రశేఖర్, టీడీపీ పట్టణ అధ్యక్షులు సయ్యద్ శానేషా వలి, పట్టణ టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.
👉రాజన్న సిరిసిల్ల జిల్లా*
*వేములవాడలో మాయలేడి హోంగార్డు అరెస్టు*
*బ్లాక్ మెయిల్ తో మోసానికి పాల్పడడంతో కేసు నమోదు*
*బాదితులు ఎవరైనా ఉంటే పోలీసులకు పిర్యాదు చేయాలి- వేములవాడ సిఐ*
ఓ మహిళా హోంగార్డు “కి”లాడిగా మారింది. బ్లాక్ మెయిల్ తో మోసం చేసింది. వేములవాడ టెంపుల్ రిటైర్డ్ ఉద్యోగి ఆమె వలలో పడి మోసపోయాడు. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో కిలాడి హోంగార్డును అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహిళా హోంగార్డు అనూష రూటే సపరేటు అన్నట్లుగా ఉంది. వేములవాడకు వచ్చే భక్తులకు రక్షణగా నిలువాల్సిన హోంగార్డు బ్లాక్ మెయిల్ తో మోసాలకు తెరలేపింది.‌ తన భర్త ఆరోగ్యం సరిగా లేదని డబ్బున్న వాళ్ళను వలలో వేసి అందినంత దోచుకునే పనిలో నిమగ్నమయ్యింది. చివరకు వేములవాడ టెంపుల్ రిటైర్డ్ ఉద్యోగి ద్వారకా శేఖర్ మాయ లేడి హోంగార్డు వలలో పడ్డాడు. తన భర్త ఆరోగ్యం బాగాలేదని శేఖర్ వద్ద 3 లక్షల 50 వేల రూపాయలు అప్పుగా తీసుకుంది మహిళా హోంగార్డు. ఆరు నెలల్లో తిరిగి ఇస్తానని చేప్పిన ఆ మాయ లేడిని అప్పు డబ్బులు అడిగితే బ్లాక్ మేయిల్ కు పాల్పడింది.
శేఖర్ ఫోటోను మార్ఫింగ్ చేసి పెళ్లి పత్రిక తయారు చేసి అతను తనను పెళ్లి చేసుకున్నాడని అసత్య ప్రచారంతో బ్లాక్ మెయిల్ చేస్తూ ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఫోటోలను పెళ్లి పత్రికను బయటపెడుతానని బెదిరించింది. ఆ పోటోలు బయటకు వస్తే పరువు పోతుందని భయపడిన శేఖర్ ఐదు లక్షల రూపాయలు మాయలేడి హోంగార్డుకు ముట్టజెప్పాడు. ఇలా అవసరం ఉన్నప్పుడల్లా డబ్బులు డిమాండ్ చేసి అందినకాడికి దండుకునే పనిలో నిమగ్నమైంది. తాజాగా మరో రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరించింది. విసిగిపోయిన శేఖర్ వేములవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మహిళా హోంగార్డు అనూషను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. గతంలో వేములవాడ కు చెందిన వ్యక్తి వద్ద 40 లక్షలు తీసుకుని మోసం చేయడంతో అప్పట్లో కేసు నమోదు అయిందని వేములవాడ సిఐ వీర ప్రసాద్ తెలిపారు. మహిళా హోంగార్డు బ్లాక్ మెయిల్ తో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని సిఐ కోరారు..
👉గుంటూరు ..
లక్ష్మీపురంలోని *తుర* స్పా సెంటర్ పై పోలీసుల దాడి.
గతంలో ఔరా ఈ స్పా సెంటర్ కు పేరు..
వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసిన పోలీసులు.అదనపు ఎస్పీ సుప్రజ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తనిఖీలు.పలవురు అమ్మాయిలు, అబ్బాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.స్పా లోపల ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు.
👉 ప్రకాశం జిల్లా,, గిద్దలూరు పట్టణంలోని 12 వార్డు రజక వీధిలో బాడుగ ఇంట్లో ఉన్న మహిళపై కత్తితో దాడి చేసి పారిపోయిన గుర్తు తెలియని వ్యక్తి.
స్థానికులు గుర్తించి 108 ఆలస్యం కావడంతో మహిళను బైకుపై ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
మహిళకు భర్త లేడు ఇద్దరు పిల్లలు ఉన్నారు
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

7k network
Recent Posts

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి