రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?

👉 టీ-బిస్కెట్లిచ్చి.. పూలు జల్లి.. రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!!
ఆపై బాష్ప వాయు గోళాలు, జల ఫిరంగులతో దాడి చేసి..
చలో ఢిల్లీ పాదయాత్ర చేపట్టిన అన్నదాతలపై దాష్టీకం
పలువురికి గాయాలు.. తాత్కాలికంగా యాత్ర నిలిపివేత
👉 న్యూఢిల్లీ, డిసెంబర్‌ 9: తమ డిమాండ్ల సాధనకు రైతులు ఆదివారం ఢిల్లీకి కొనసాగించిన పాదయాత్రను పోలీసులు మరోసారి భగ్నం చేశారు. పంజాబ్‌-హర్యానా సరిహద్దు శంభు వద్ద శుక్రవారం రైతులు ప్రారంభించిన పాదయాత్రపై పోలీసులు బాష్ప వాయు గోళాలు ప్రయోగించడంతో పలువురు గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం నాటి ఆందోళనలో హర్యానా పోలీసులు చాలా నాటకీయంగా వ్యవహరించారు. 101 మంది రైతులు తిరిగి యాత్ర ప్రారంభించగా,వారికి పోలీసులు టీ, బిస్కెట్లు పంచి ఆశ్చర్చపరిచారు.అంతేకాకుండా వారిపై పూల రేకలను కూడా చల్లడంతో రైతులు విస్తుపోయారు.

*రైతులు ఢిల్లీ వైపు వెళ్లడానికి ప్రయత్నించగా, అప్పటి వరకు తాము ఆడిన డ్రామాకు తెరదించిన పోలీసులు వారిని అడ్డుకోవడం ప్రారంభించారు. రైతులను చెదరగొట్టడానికి నిర్దాక్షిణ్యంగా బాష్పవాయు గోళాలు,జల ఫిరంగులు ప్రయోగించారు. ఈ ఘటనలో 8 మంది రైతులు గాయపడగా,ఒకరిని దవాఖానకు తరలించినట్టు రైతు నేత శర్వణ్‌ సింగ్‌ పాంథేర్‌ తెలిపారు. రైతు పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్టు ఆయన ప్రకటించారు. తదుపరి కార్యాచరణను సోమవారం నిర్ణయిస్తామని చెప్పారు.
👉నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష*
నోయిడాలో ఆందోళన చేయడంతో అరెస్టయి జైలులో ఉన్న రైతులు తమ డిమాండ్ల సాధనకు జైలులో నిరాహార దీక్ష ప్రారంభించినట్టు సంయుక్త కిసాన్‌ మోర్చా ఆదివారం తెలిపింది. ప్రస్తుతం గౌతమబుద్ధ నగర్‌ జైలులో ఉన్న రైతులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల సాధనకు ఈ దీక్ష చేపట్టారని పేర్కొంది. ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉన్నా డిమాండ్లు నెరవేరే వరకు దీక్ష చేస్తామని రైతులు స్పష్టం చేశారన్నారు.
👉 VEE RUN FOR TIRUPATI 10k,5k’3k లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్ధిని, విద్యార్థులు.*
తిరుపతి పోలీస్, ఈగల్ యూనిట్, మరియ SAP లు సంయుక్తంగా పాల్గొన్న కార్యక్రమం.*
జిల్లా ఎస్పి ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్.,
డ్రగ్స్ వ్యతిరేకంగా నిర్వహించిన వీ రన్‌ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పి ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు ఈ వీ రన్ ఫర్ తిరుపతి కార్యక్రమం యూనివర్సిటీ తారకరామా స్టేడియం నుండి తాటి తోపు అక్కడ నుండి తారకరామా స్టేడియం వరకు కొనసాగింది.
వి రన్ ఫర్ తిరుపతి 10k,5k,2k లో పాల్గొని ప్రతిభ కనబరిచిన విజేతలకు మెడల్స్, జ్ఞాపికలను జిల్లా ఎస్పీ మరియు నిర్వాహకులు చేతులమీదుగా ప్రదానం చేశారు.
కార్య్రమంలో ఎస్వియు విసి ఆచార్య అప్పారావు, రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు SAP చైర్మన్ రవి నాయుడు, ఈగల్ ఎస్పీ నగేష్ తిరుపతి అదనపు ఎస్పీలు శాంతిభద్రతలు రవి మనోహర్ ఆచారి, క్రైమ్ నాగభూషణం,సాయుడదలం శ్రీనివాసులు, డిఎస్పి లు ఎస్బి గిరిధర, వెంకటనారాయణ తిరుపతి,చంద్రగిరి ప్రసాద్ మరియు అధికారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
👉 రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం..
AP: రాష్ట్రంలో ఆదివారం వేర్వేరు చోట్ల చోటు చేసుకున్న రెండు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం చెందారు. నెల్లూరుకు చెందిన ఎనిమిది మంది ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే బాపట్ల జిల్లా వాడరేవులో సముద్ర తీరానికి ఆటవిడుపుగా వచ్చిన తల్లీకూతురు, అల్లుడు బైక్పై తిరిగి ఇంటికి వెళ్తుండగా.. టిప్పర్ ఢీకొట్టింది. దాంతో వారూ మరణించారు.
👉 దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు *వైరాలో* సంఘటన..
వైరా పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి ఊటుకూరు నర్సింహారావు సైబర్‌ నేరగాళ్ల ఉచ్చుకు చిక్కాడు.
ఈనెల 6న దిల్లీ నుంచి వాట్సాప్‌ కాల్‌ చేసిన ఓ వ్యక్తి ‘నీ పేరిట దిల్లీ నుంచి ప్రయాణించేందుకు ఐదు విమాన టికెట్లు బుక్‌ చేశారని ఒకే వ్యక్తి ఒకే సమయంలో ఐదు ప్రదేశాలకు ఎలా వెళ్తారు’ అని ప్రశ్నించారు. అప్పటికే అవాక్కయిన నర్సింహారావు తేరుకునేలోపు ‘లైన్‌లో ఉండు.. నీపై అనుమానం ఉంది.. సీబీఐకి కనెక్ట్‌ చేస్తున్నాం’ అని చెప్పారు. వెంటనే తాము సీబీఐ అధికారులమని చెప్పి బాధితుడితో మాటలు కలిపారు. అనంతరం వీడియో కాల్‌ చేసి వారు కనపడకుండా ప్రశ్నలు సంధించారు. ‘నీ ఆధార్‌ నెంబర్‌తో దిల్లీలోని ఓ బ్యాంకులో ఖాతా ఉంది.. దానిలోకి రూ.కోట్ల హవాలా సొమ్ము వచ్చింది.. నిన్ను అరెస్టు చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం నుంచి సమన్లు వచ్చాయి’ అని చూపించారు. భయపడిన నర్సింహారావు నేనేమి తప్పు చేయలేదని చెబుతూనే ఆందోళనకు గురయ్యారు. హవాలా సొమ్ము దుబాయ్‌తోపాటు ఇతర దేశాలకు వెళ్లిందని ఇక నువ్వు తప్పించుకోలేవని గంటల కొద్ది మాట్లాడుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని హెచ్చరించడంతో విషయాన్ని బాధితుడు బయటకు వెల్లడించలేదు.
*నగదు పంపించి ఆపై తేరుకుని..*
సైబర్‌ నేరస్తులు శనివారం ఉదయం 7 గంటలకు మళ్లీ ఫోన్‌ చేసి కట్‌ చేయవద్దని హెచ్చరించారు. ఒకరు ఆంగ్లం, మరొకరు హిందీ, మరో ఇద్దరు తెలుగులో మాట్లాడుతూ భయపెట్టసాగారు. ‘నిన్ను వెంటనే అరెస్టు చేయాలి. రెండు నెలలపాటు బెయిల్‌ రాదు’ అన్నారు. ‘సరే ప్రస్తుతానికి న్యాయస్థానం ఆడిటర్‌కు రూ.15 లక్షలు ఇవ్వాల్సి ఉంది.. అంత మొత్తం మేము చెప్పిన ఖాతాకు బదిలీ చేస్తే విచారించి తప్పు లేకుంటే మళ్లీ నీ ఖాతాకు తిరిగి పంపించేయవచ్చు’ అంటూ నమ్మబలికారు. అప్పటికే మాట్లాడుతున్న మోసగాళ్లలో ఒకరు కోపంగా వెంటనే అరెస్టు చేయండంటూ హుకుం జారీ చేశారు. భయపడిన బాధితుడు వైరాలోని ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో సైబర్‌ నేరగాళ్లు ఇచ్చిన కోల్‌కతాలోని ఓ ఖాతాకు తన ఖాతా నుంచి రూ.15 లక్షలు బదిలీ చేశాడు. మరో రూ.5 లక్షలు బదిలీ చేయాలని మోసగాళ్లు ఒత్తిడి చేయడం ప్రారంభించారు. అప్పుడు వాస్తవాన్ని గ్రహించి మోసపోయానేమోనని భావించి తేరుకుని పోలీసులను బాధితుడు ఆశ్రయించాడు. రెండు గంటల సమయంలో ఫిర్యాదు చేయడంతో వైరా ఎస్సై వంశీకృష్ణ భాగ్యరాజు కేసు నమోదు చేసి రాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు తెలియజేశారు. సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న వారు గంటలో తేరుకుంటే జీరో అవర్‌లో ఎంతోమంది బాధితులకు నగదు ఇప్పించిన సంఘటనలు ఇటీవల వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో తాజా సంఘటన ఆసక్తి రేకెత్తిస్తోంది. బాధితుడు నగదు బదిలీ చేసిన లావాదేవీల వివరాలను బ్యాంకు సిబ్బంది ఉన్నతాధికారులకు పంపించారు.
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు
👉విజయవాడ,, బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కుటుంబ సభ్యుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సత్యనారాయణపురం పోలీసుల వివరాల మేరకు.. ఓ బాలిక ఇంటి వద్ద ఆడుకుంటుంది. వరుసకు బాబాయ్ కొడుకు అయినా కార్తీక్ అనే యువకుడు తన ఇంట్లోకి తీసుకెళ్లి బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడని ఆ బాలిక తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
👉ఎవరిదీ పాపం.. ఆ బిడ్డకు ఎందుకీ శాపం!
ఓ మిషనరీ వసతిగృహంలో ఉంటూ ఇంటర్ చదువుతున్న బాలిక గర్భం దాల్చడం ఏలూరులో చర్చనీయాంశమైంది. ఆదివారం ఓ బిడ్డను బయటకు విసరడం పక్కనున్న అపార్టుమెంట్లోని ఓ మహిళ కంటపడింది. దాంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేసుకున్న పోలీసులు పసిబిడ్డ విగతజీవిగా ఉండటాన్ని గుర్తించారు. మిషనరీ వసతి గృహంలో విద్యార్థినితో పాటు ఆమె స్నేహితులను పోలీసులు విచారించారు. ఓ మిషనరీ బ్రదర్పై అనుమానాలున్నాయి. దర్యాప్తు జరుగుతోంది.
👉ములుగు: మావోయిస్టుల బంద్ తో హై అలర్ట్,
మావోయిస్టులు సోమవారం రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో ములుగు జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏటూరునాగారం ఏజెన్సీలో పోలీసులు ఆదివాసీ గూడాలు, అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. పోలీసులు పలు వాహనాలు, లాడ్జీల్లో తనిఖీలు చేపట్టారు. ఎవరైన గుర్తు తెలియని వ్యక్తులు లాడ్జీల్లో ఉన్నారా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిఘా పెంచారు.
👉టీచర్‌ను చంపిన కేసులో విద్యార్థుల అరెస్ట్..
టీచర్‌ను చంపిన కేసులో విద్యార్థుల అరెస్ట్
అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా పరిష‌త్ స్కూలులో టీచర్‌ను కొట్టి చంపిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఇద్దరు మైనర్లు కావడంతో అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్‌కు తరలించారు. 9వ తరగతి విద్యార్థులకు పాఠం చెబుతుండగా అల్లరి చేస్తుండడంతో సదరు ఉపాధ్యాయుడు వారిని మందలించాడు. దీంతో కోపోద్రికులైన విద్యార్థులు క్లాస్ రూమ్‌లోనే టీచర్ ఛాతీపై బలంగా దాడి చేయడంతో ఉపాధ్యాయుడు మరణించిన సంగతి తెలిసిందే.
👉 జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం….
జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ఇసుక లారీ ని వెనుక నుంచి వ్యాన్ ఢీకొట్టిన సంఘటనలు మంటలు చెలరేగాయి. వ్యాను ముందు భాగంలో చిక్కుకున్న వ్యాన్ క్లీనర్ మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యాడు. హైవేపై భోగాపురం సమీపంలో నారు పేట పెట్రోల్ బంకు వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న వ్యాన్ వెళ్తోంది. నారు పేట వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న ఇసుక లారీ ని ఢీ కొట్టింది. దీంతో వ్యాన్లో ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఢీకొట్టిన సమయంలో వ్యాన్లో చిక్కుకున్న క్లీనర్ బయటికి రాలేకపోవడంతో సజీవ దహనం అయ్యాడు. సిఐ ప్రభాకర్, ఎస్సై లు పాపారావు, సూర్య కుమారి, హైవే సిబ్బంది చేరుకొని జాతీయ రహదారిపై వెళ్తున్న మిగతా వాహనాలకు మనుషులు తగలకుండా చర్యలు తీసుకున్నారు. గాయపడిన వ్యాన్ డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు.
గంటన్నర ఆలస్యంగా చేరుకున్న ఫైర్ ఇంజన్
ప్రమాదం జరిగిన విషయాన్ని వెంటనే పోలీసులతో పాటు స్థానికులు ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇచ్చారు. హైవేపై ఉన్న విశాఖ జిల్లా చిట్టవలస అగ్నిమాపక కేంద్రానికి అటు విజయనగరం అగ్నిమాపక కేంద్రానికి తెలియజేశారు. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిట్టవలస నుంచి కానీ 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయనగరం నుంచి గాని ఫైర్ ఇంజన్లు చేరుకోలేదు. చివరకు విజయనగరం నుంచి గంటన్నర ఆలస్యంగా ఫైర్ ఇంజన్ చేరుకుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
👉కేంద్ర ప్రభుత్వం కొత్త పాన్ కార్డ్*
*PAN 2.0 🪪* వెర్షన్‌ని ప్రకటించింది. అయితే దీని కోసం మీరు ఏమీ చేయనవసరం లేదు, కొత్త అప్‌డేట్ చేసిన పాన్ కార్డ్‌ని ప్రభుత్వం నేరుగా మీ చిరునామాకు పంపుతుంది.
*జాగ్రత్తగా ఉండండి: * పాన్ కార్డ్ అప్‌డేట్ కోసం ఎటువంటి ఫోన్, మెసేజ్, మెయిల్‌లకు సమాధానం ఇవ్వవద్దు లేదా ఏదైనా సమాచారం లేదా OTP ఇవ్వవద్దు. జాగ్రత్త వహించండి, సైబర్ మోసాన్ని నివారించండి…🪪
👉ఆధార్ ఫ్రీ అప్డేట్ కి గడువు ఇంకా ఆరు రోజులే!
ఆధార కార్డు అప్డేట్ కోసం.. ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా’ పలుమార్లు గడువును పెంచుకుంటూ వస్తూనే ఉంది. కాగా ఇప్పుడు పొడిగించిన గడువు (డిసెంబర్ 14) సమీపిస్తోంది. ఈ లోపు ఏదైనా మార్పులు, చేర్పులు చేయాలనుకునేవారు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.డిసెంబర్ 14 లోపల ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్‌ చేసుకుంటే.. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్‌డేట్‌ చేసుకుంటే మాత్రం.. రూ. 50 అప్లికేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మరో మారు గడువును పొడిగిస్తారా అనే విషయం మీద ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు పూర్తయిన వారు, ఇప్పటి వరకు స్థాన చలనం చేయకుండా ఉంటే.. లేదా వ్యక్తిగత వివరాలలో ఎలాంటి అప్‌డేట్‌ అవసరం లేకుంటే.. అలాంటి వారు తప్పకుండా అప్‌డేట్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ బయోమెట్రిక్, ఫోటో వంటివి అప్డేట్ చేసుకోవడం ఉత్తమం. దీని వల్ల మోసాలను నివారించవచ్చు.
👉ఆన్‌లైన్‌లో ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవడం ఎలా?*
మైఆధార్ పోర్టల్‌ ఓపెన్ చేయండి.లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి.. మీ 16 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, దానికింద క్యాప్చా కోడ్‌ ఎంటర్ చేయాలి.నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి.రిజిస్టర్ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.అక్కడే డాక్యుమెంట్స్ అప్డేట్, అడ్రస్ అప్డేట్ వంటివన్నీ కనిపిస్తాయి.మీరు ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.అవసరమైనవన్నీ అప్డేట్ చేసుకున్న తరువాత మీరు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ పొందుతారు. దీని ద్వారా డాక్యుమెంట్ అప్‌డేట్‌ను ట్రాక్ చేయవచ్చు.ఆధార్ కార్డును అప్డేట్ చేయడానికి.. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాన్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదైనా డాక్యుమెంట్స్ అవసరం.
👉ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?

నంద్యాల జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. నందికొట్కూరులోని బైరెడ్డి నగర్ కు చెందిన ఇంటర్ విద్యార్థినిపై ప్రేమించలేదనే కారణంతో ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు…
ఆ తరువాత తాను కూడా నిప్పంటించుకున్నాడు. అయితే, ఈ ఘటనలో బాలిక తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణిం చగా.. ప్రేమోన్మాదికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
స్థానికులు తెలిపిన సమా చారం ప్రకారం.. బైరెడ్డి నగర్ కు చెందిన ఓ విద్యార్థి ని ఇంటర్ చదువుతుంది. కొద్దికాలంగా ఓ యువకుడు ప్రేమపేరుతో విద్యార్థిని వెంటపడుతున్నాడు. అతడి ప్రేమను యువతి అంగీకరించలేదు.
దీంతో ఆ యువకుడు నందికొట్కూరు లోని అమ్మమ్మ ఇంట్లో ఉన్న బాలిక సమాచారం తెలుసుకొని ఆదివారం రాత్రి బాలిక నిద్రిస్తున్న సమయంలో ఆమెపై పెట్రోల్ పోసిపోసి నిప్పంటిం చాడు.. ఆ తరువాత తానూ నిప్పంటించుకున్నా డు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన విషయాలపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ దారుణ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేపట్టారు.

7k network
Recent Posts

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి