👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన,సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..సూర్యాపేట జిల్లా .
హోంగార్డ్ తమకు గౌరవ వేతనం, ఇతర సదుపాయాలు పెంచినందుకు గాను కృతజ్ఞతగా సూర్యాపేట జిల్లా హోమ్ గార్డ్స్ ఈరోజు ఇందిరమ్మ కాలనీ నందు గౌరవ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలభిషేకం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి హోంగార్డ్ జీతాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని హోంగార్డ్స్ చాలా సంతోషాలను వ్యక్తం చేస్తూ వారి వారి కార్యాలయాలలో పాలాభిషేకాలు చేశారు
హోంగార్డ్స్ పట్ల ఆత్మీయతను చాటుతూ, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు ఈ క్రింది విధంగా వున్నాయి.
👉 హోంగార్డుల దినభత్యం రూ. 921 నుండి రూ. 1000కి పెంపు.
👉 వీక్లీ పరేడ్ అలవెన్స్ నెలకు రూ. 100 నుండి రూ. 200కి పెంపు.
👉 విధుల నిర్వహణలో సహజమరణం పొందినా లేదా ప్రమాదవశాత్తు మరణం కలిగిన హోం గార్డ్స్ కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయడం.
👉 ఇవేకాకుండా, ఆరోగ్యశ్రీ Health Scheme ను హోం గార్డ్స్ కు వర్తింపచేసే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నది.
👉 ఇవన్ని కూడ జనవరి నెల 2025 నుండి అమలు లోనికి వస్తాయి.
👉నెల రోజుల్లో 89 మిస్సింగ్ కేసులను చేదించిన పోలీసులు
ఎన్టీఆర్ జిల్లా,, నెలరోజుల వ్యవధిలో 89 మిస్సింగ్ కేసులను విజయవాడ పోలీసులు చేధించారు. ఈ కేసుల విచారణకు పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసి రికార్డు సమయంలోనే ఎక్కువ మిస్సింగ్ కేసులను చేధించినట్లు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఎస్సై హైమావతితో కలిసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సోమవారం వెల్లడించారు. బాధితులను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు స్పష్టం చేశారు.
👉విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్.. మూడేళ్లల్లో రూ.12వేల కోట్లు పీడీయస్ బియ్యం ఎగుమతి చేశారు..*రేషన్ మాఫియా పై ఉక్కు పాదం..
*బియ్యం అక్రమ రవాణా ప్రక్షాళనలో భాగంగా అధికార యంత్రాంగం మీడియాతో కలిసి పనిచేస్తాం..
*మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి*
విశాఖపట్నం:- ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉక్కుపాదం మోపామని రాష్ట్ర ఆహార మరియు పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.సోమవారంనాడు ఆయన విశాఖ పోర్టును ఆకస్మిక తనిఖీ చేశారు.
బియ్యం స్మగ్లింగ్‌కు గేట్ వే గా వైజాగ్ పోర్ట్ మారిందని వస్తున్న ఆరోపణల నేపధ్యంలో మంత్రి మనోహర్ అకస్మిక తనిఖీల్లో అక్రమ రవాణా పెద్ద ఎత్తున బయటపడింది.
కంటైనర్ ఫ్రైట్ స్టేషన్‌లో ఎగుమతికి సిద్ధంగా ఉన్న 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం ప్రత్యేక బృందాలు సీజ్ చేసినట్లు మంత్రి మీడియాతో మాట్లాడుతూ, తెలిపారు. కాకినాడ పోర్టులో నిఘా పెరగడంతో రెండు నెలలుగా విశాఖ పోర్ట్‌ను ఎంచుకున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో ఊహించని విధంగా కాకినాడ పోర్టులో కోటి 38లక్షల మెట్రిక్ టన్నులు, అదేవిధంగా విశాఖపట్నంలో దాదాపు 36వేల మెట్రిక్ టన్నులు రేషన్ బియ్యాన్ని మూడు సంవత్సరాలలో ఎగుమతి చేశారని తెలిపారు. సుమారుగా అంచనా వేసుకుంటే అక్రమంగా తరలించిన బియ్యం విలువ రూ.12వేల కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.
కాకినాడ పోర్టులో నిఘా పెంచడంతో విశాఖ పోర్టు నుండి గత రెండు నెలల కాలంలో 70వేల మెట్రిక్ టన్నుల బియ్యం తరలించినట్లు తెలిపారు. ఇటీవల అధికారుతో సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్‌ను అప్రమత్తం చేశామన్నారు. పక్కా సమాచారం ఆధారంగానే తనిఖీలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
రెండు పోర్టుల్లో నిఘాను పెంచామని ఈ క్రమంలో పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడిందన్నారు.
అనకాపల్లిలో కూడా తనిఖీలు జరుపుతామన్నారు. రాబోయే రోజుల్లో రేషన్ బియ్యం అక్రమాలను అడ్డుకునేందుకు ఉక్కుపాదంతో ముందుకు వెళుతున్నామని అందులో భాగంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి రేషన్ బియ్యం అక్రమాలను అరికడతామన్నారు. దాదాపుగా కోటి 48లక్షల కార్డుదారులకు ప్రభుత్వం సరఫరా చేయాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించి క్వాలిటీ ఆఫ్ రైస్ ప్రాక్ట్ ఆఫ్ ఇండియా పేరుతో ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారని తద్వారా వేల కోట్లు సంపాదించుకుంటున్నారని తెలిపారు. ఫలితంగా రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. ఇతర దేశాలలో చాలామంది పేదలు ఈ బియ్యాన్ని తీసుకునే విధంగా అక్రమార్కులు తెగబడుతున్నారని చెప్పారు.
అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఐడీ ద్వారా సిట్‌ను ఫామ్ చేశారని తెలిపారు. విశాఖలో పట్టుబడ్డ బియ్యం అక్రమ రవాణాపై సిట్‌కు నివేదిక అందజేస్తామన్నారు.
బియ్యం అక్రమ రవాణా సాగకుండా ప్రక్షాళన చేయడంలో అధికార యంత్రాంగం, మీడియాతో కలిసి పనిచేస్తామన్నారు. మన దేశం గురించి, భద్రత గురించి అందరం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు దాదాపు రూ.12,800 కోట్ల మేర ఖర్చు పెడుతున్నట్లు చెప్పారు. ఎట్టి పరిస్తితుల్లోనూ రేషన్ బియ్యం ఎగుమతి కాకుండా అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు*
👉నేడు (09/12/2024) తాడిపత్రి మున్సిపల్ చైర్ పర్సన్ జెసి ప్రభాకర్ రెడ్డి పెద్ద పప్పూరు మండలంలోని అశ్వర్థ నారాయణ స్వామి సన్నిధి పరిసర ప్రాంతాల నందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు…
ఈ సందర్బంగా పప్పూరు మండల టీడీపీ నాయకులు, జెసి అనుచరులతో కలసి జెసి ప్రభాకర్ రెడ్డి అభివృద్ధి పనులను దగ్గర ఉండి పర్యవేక్షించారు…
👉 మార్కాపురం మాజీ శాసనసభ్యులు కెపి కొండారెడ్డి ని సోమవారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కంభం మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పరామర్శించారు.
👉.మార్కాపురం పట్టణంలో
మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఈరోజు మార్కాపురం పట్టణంలోని బైపాస్ రోడ్ లో ఉన్న బోడపాడు జంక్షన్ వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇసుక నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఇసుక స్టాక్ యార్డ్ ప్రారంభించారు. ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించిన టన్ను ఇసుక ధర 1280 రూపాయలకే లభిస్తుంది.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.
👉 మోహన్ బాబు విద్యాసంస్థల వద్ద మీడియా ప్రతినిధుల పైన బౌన్సర్లు దాడి..
తిరుపతి జిల్లా, చంద్రగిరి..
యాంకర్..: చంద్రగిరి మండలం ఏ. రంగంపేట మోహన్ బాబు విద్యాసంస్థల వద్ద న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళిన మీడియా ప్రతినిధులు జర్నలిస్ట్ ఉమాశంకర్, కెమెరామెన్ నరసింహ ల పై విచక్షణ రహితంగా దాడి. గాయాలైన ఇరువురిని స్థానిక చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స..
మీడియా ప్రతినిధుల పై దాడి చేయాడాన‌్ని ఖండిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తిరుపతి ప్రెస్ క్లబ్ నాయకులు, సభ్యులు..జర్నలిస్టులపై భౌతిక దాడి చేయడమే, కాక కెమెరాలను, సెల్ ఫోన్ లను లాక్కొని ధ్వంసం చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జర్నలిస్టుల సంఘాలు..
దాడికి కారకులైన బౌన్సర్లు పిఆర్ఓ లపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రగిరి సీఐ సుబ్బరామిరెడ్డి కోరిన ప్రెస్ క్లబ్ నాయకులు, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మరియు వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు..
ప్రజాస్వామ్యంలో మీడియాపై దౌర్జన్యం చేయటం సహించరాని చర‌్య అని దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలని కోరిన మీడియా సంఘాల ప్రతినిధులు
👉అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి..*
బట్టలు ఆరేస్తుండగా జరిగిన ఘటన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.. ఒకేసారి ఏకంగా ముగ్గురు మృతి చెందారు.. తల్లి, ఇద్దరు పిల్లలు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం విషాదంగా మారింది..
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పెదబయలు మండలం కిముడుపల్లెలో విద్యుత్ షాక్ తో తల్లి, కుమారుడు, కుమార్తె.. ఇలా ముగ్గురు ఒకేసారి ప్రాణాలు విడిచారు.. కుమారుడు సంతోష్(13) తీగపై బట్టల ఆరబెడుతుండగా కరెంట్ షాక్ తగిలింది.. అయితే, ఊహించని పరిణామంతో తన కుమారుడిని రక్షించేందుకు ప్రయత్నించింది తల్లి.. కానీ, తల్లి కోర్ర లక్ష్మి (36) కూడా విద్యుత్ షాక్‌కు గురైంది.. ఆ తర్వాత కుమార్తె అంజలి(10) రావడంతో.. ఆ చిన్నారిని కూడా ప్రాణాలు విడిచింది.. ఇలా ఒకేసారి తల్లి, కుమారుడు, కుమార్తె.. విద్యుదాఘాతంలో ప్రాణాలు విడిచిన ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే, మృతురాలికి మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.. ఆ చిన్నారులను పట్టుకుని.. వాళ్ల నాన్నమ్మ కన్నీరు పెట్టడం అందరి హృదయాలను కదలించివేసింది..
👉రైతుల సమస్యల పరిష్కారానికే “మీ భూమి – మీ హక్కు” రెవెన్యూ సదస్సులు*..
మండలం లోని లక్ష్మికోట గ్రామంలో సోమవారం జరిగిన రెవిన్యూ సదస్సులో ఎమ్మెల్యే ముత్తుముల*
రైతుల సమస్యల పరిష్కారానికే “మీ భూమి – మీ హక్కు” రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం కంభం మండలం, లక్ష్మికోట గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన రెవిన్యూ సదస్సులో పాల్గోన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రైతాంగం అనేక ఇబ్బందులకు గురైందని, మోటార్లకు మీటర్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి రైతు వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి రైతులను నయవంచన చేసిందన్నారు. నాడు ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీల్లో భాగంగా సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయటం జరిగిందని, మోటార్లకు మీటర్లు బిగించే ప్రక్రియకు స్వస్తి చెప్పామన్నారు. ఎన్దీయే రైతుల సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వమని గ్రామాల్లో రైతుల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఉద్దేశంతో ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేశామని ప్రతి రైతు తమ సమస్యను అర్జీ రూపంలో తెలియచేస్తే, వాటిని నిర్ణిత సమయంలో అధికారులు పరిష్కారం చేస్తారన్నారు. అనంతరం రైతులు ఇచ్చిన అర్జీలను తీసుకొని వాటిని త్వరితగతిన పరిష్కారం చేయాలని ఆదేశించారు.* కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు మండల తహసీల్దార్ ఏ కిరణ్, మండల అధికారులు తదితరులు పాల్గోన్నారు.*
👉వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
కంభం వైద్యశాలను సందర్శించిన ఎమ్మెల్యే ముత్తుముల..
ప్రభుత్వ వైద్యులు ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సూచించారు. సోమవారం మధ్యాహం కంభం ప్రభుత్వ వైద్యశాలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు సందర్శించారు. ఈ సందర్బంగా వైద్యశాలలో ప్రజలకు అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. వైద్యం పొందుతున్న ప్రజలతో మాట్లాడి వైద్యశాలలో అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు వైద్యం అందించే విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్, మరియు వైద్య సిబ్బంది, మండల నాయకులు తదితరులు పాల్గోన్నారు..*
సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..
Recent Posts