👉నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన..
నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కేబినెట్‌లో చోటు దక్కింది. ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. 25 మంత్రి పదవులకు అవకాశం ఉండగా.. ప్రస్తుత మంత్రివర్గంలో 24 మంది ఉన్నారు. కూటమి పొత్తులో భాగంగా ఆ ఒక్క స్థానం జనసేన నుంచే భర్తీ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నాగబాబును మంత్రి మండలిలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు.
👉 ‘పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!ఇంట్రస్టింగ్ పోస్ట్స్… ఇటీవల విడుదలైన పాన్ ఇండియా మూవీ “పుష్ప-2” సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుందని అంటున్నారు. ఇటీవల విడుదలైన పాన్ ఇండియా మూవీ “పుష్ప-2” సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుందని అంటున్నారు. రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ.. అన్ని భాషల్లోనూ హల్ చల్ చేస్తోందని చెబుతున్నారు.
ఈ సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ‘పుష్ప-2’ పోస్టర్స్ ని అటు ఆప్, ఇటు బీజేపీ ఫుల్ గా వాడేస్తున్నారు. అవును.. “పుష్ప-2” సినిమా ఏపీ రాజకీయాల్లో సరికొత్త సందడి తీసుకొచ్చిందని చెబుతున్న వేళ.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే ఢిల్లీలోనూ సందడి చేస్తుంది. ఇందులో భాగంగా.. ఆ సినిమా స్టిల్స్ తో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ల మధ్య పోస్టర్ వార్ మొదలైంది. దేశ రాజధాని అసెంబ్లీ ఎన్నికల సందడికి సిద్ధమవుతున్న వేళ రెండు రాజకీయ పార్టీలూ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా ప్రజలను ఆకర్షించేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలో ‘పుష్ప-2’ సినిమాలోని ఫేమస్ డైలాగ్స్ (తగ్గేదేలే, రప్పా రప్పా) ని ఫుల్ గా వాడేస్తున్నాయి. ఇందులో భాగంగా… ‘పుష్ప-2’ లోని హీరో ఫోజులో ఉన్న కేజ్రీవాల్… భుజంపై చీపురు పెట్టుకుని ఉన్నారు. నాలుగోసారి అధికారం తమదే అనే అర్ధంలో ఆ పోస్టర్ ను రూపొందించారు. ఈ సందర్భంగా… “కేజ్రీవాల్ ఝుకేగా నహీ (తగ్గేదేలే)” అంటూ పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరోపక్క ఆమ్ ఆద్మీకి ధీటుగా అన్నట్లుగా భారతీయ జనతాపార్టీ కూడా ఓ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో భాగంగా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ్ ను పుష్ప క్యారెక్టర్ తరహాలోనే కుర్చీలో కూర్చున్నట్లూ రూపొందించి.. “అవినీతిపరులను అంతం చేస్తామంటూ.. రప్పా – రప్పా” అని రాసి ఉన్న పోస్టర్ ను విడుదల చేసింది. దీంతో… ఢిల్లీ రాజకీయంలో ‘పుష్ప-2’ మేనియా ఆసక్తిగా మారింది. కాగా.. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా గెలుస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… 2013, 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. ఇదే క్రమంలో ఈసారి కూడా అధికారాన్ని కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు ఎన్నాళ్ల నుంచో అందని ద్రాక్షగా ఉన్న ఢిల్లీ పీఠాన్ని ఈసారైనా దక్కించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.
👉 అమరావతి: డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత..
అదే నంబర్ నుంచి రెండు రోజుల క్రితం హోంమంత్రికి కూడా కాల్.. పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్ రావడంతో నంబర్ చెక్ చేసిన హోంమంత్రి..
ఇద్దరు ఏపీ మంత్రులకు బెదిరింపు కాల్స్‌తో ఆగంతకుడి కోసం ముమ్మర గాలింపు
👉మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా…,
మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా
సౌర విద్యుత్ ఒప్పందం కొనుగోళ్లలో తనకు ముడుపులు అందాయంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురించిన, ప్రసారం చేసిన తప్పుడు, అసత్య కథనాలపై వైఎస్ జగన్ ఢిల్లీ హైకోర్టులో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. వెంటనే ఆ కథనాలు, వీడియోలు తొలగించి, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశారు. దీంతో కోర్టు ఆ సంస్థల ఎడిటర్లకు సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.
👉కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ*
*నిరసన చేస్తున్న ఆశా వర్కర్లపై ఏసిపి మరియు సీఐ చేతులు వేయడంతో, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన ఓ మహిళ*
కోటి చౌరస్తాలో ఈరోజు ఆశ వర్కర్లు పెద్ద సంఖ్యలో నిరసన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వాళ్లకు 18000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు, ఆ నిరసనలో పోలీసులు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారు, నిరసన తెలుపుతున్న మహిళలను ఏసీపీ మరియు సీఐ మహిళలపై చేతులు వేయడంతో ఆందోళనకు గురైన ఓ మహిళల పోలీస్ చంప చెల్లు మనిపించింది.
👉మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయా గూడెం శివారులో నిషేధిత 80 కేజీల గంజాయిని పట్టుకున్న మరిపెడ,సీరోల్ పోలీస్ లు..*
*గంజాయి విలువ 20 లక్షలు ఉంటుందని అంచనా..*
*ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని..వాహనం సీజ్ చేసిన పోలీస్ లు..*
*మరిపెడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో వివరాలను వెల్లడించిన తొర్రూరు డిఎస్పీ కృష్ణ కిషోర్..*
👉 కోఠి ఉమెన్స్ కాలేజీలో విద్యార్థినులపై దాడి చేసిన కుక్క..హైదరాబాద్ – కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థినులపై ఓ కుక్క దాడి చేసింది.
ఈ ఘటనలో డిగ్రీ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు గాయపడ్డారు. గాయపడిన వారిని విద్యార్థులు ఆసుపత్రికి తరలించారు.
👉 రహస్య భూగర్భ గృహంలో ఉన్న విజయవాడ కు చెందిన కరడు కట్టిన రౌడీ షీటర్ మరియు మాఫియా గ్యాంగ్స్టర్ వైయస్సార్ సిపి నాయకుడు పూనూరు గౌతమ్ రెడ్డి – అంతరంగికుల సమాచారం విజయవాడకు చెందిన ప్రముఖ ఎన్నారై గండి ఉమామహేశ్వర శాస్త్రి యొక్క ఇంటికబ్జా మరియు కాంట్రాక్ట్ హత్యాయత్నం తోబాటు 47 క్రిమినల్ కేసుల్లో నేరస్తుడుగా ఉన్న విజయవాడకు చెందిన కరలుగట్టిన రౌడీషీటర్ మరియు మాఫియా గ్యాంగ్ స్టార్ వైయస్సార్సీపీ నాయకుడు పూనూరు గౌతమ్ రెడ్డి ఎక్కడున్నా అరెస్టు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టడానికి పలు పోలీసు బృందాలు వివిధ రాష్ట్రాలలో తీవ్రంగా గాలిస్తున్న నేపథ్యం లో సదరు గౌతమ్ రెడ్డి మరికొందరు క్రిమినల్స్ తో హమాస్ హిస్బుల్లా హాఇది తరహాలో గౌతమ్ రెడ్డి మరియు లిఖిత రెడ్ల కు చెందిన స్వగృహాల్లో ముందుగానే నిర్మించుకొనిన రహస్య భూగర్భ గృహాల్లో ఉన్నట్లు అత్యంత అంతరంగీకవర్గాల సమాచారం
👉 అనంతపురం జిల్లా ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ పోలీసు వారు 65 లక్షలు విలువ గల గోవా మద్యాన్ని రాప్తాడు సమీపంలో గల రైల్వే గేట్ దగ్గర ఫామ్ హౌస్ లో ఉండ గా గుర్తించి సీజ్ చేయడం జరిగింది అందులో నలుగురు మద్యం తరలిస్తున్న వారిని కూడా పట్టుకోవడం జరిగింది
నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,
Recent Posts