👉పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల రగడ కొనసాగుతూనే ఉంది. ప్రముఖ పారిశ్రామి కవేత్త అదానీపై అమెరికా లో కేసు నమోదైన నేప థ్యంలో ఆయనపై జేపీసీ విచారణ చేపట్టా లంటూ గత కొన్నిరోజులుగా పార్ల మెంటు లోపల, వెలుపల విపక్ష సభ్యులు ఆందోళ చేస్తున్న విషయం తెలిసిందే. మంగళవారంసైతం విపక్ష పార్టీల సభ్యులు తమ నిరసనను కొనసాగించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అదానీ చిత్రాలతో పాటు ‘మోదీ అదానీ భాయ్ భాయ్’ నినాదాలతో ముద్రించిన బ్యాగులు చేత్తో పట్టుకొని పార్లమెంటు వద్ద కాంగ్రెస్, విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు.
ప్రియాంక చేతిలోని ఆ బ్యాగును పరిశీలించి చూడండి ఎంత క్యూట్ గా ఉందో’ అంటూ రాహుల్ పేర్కొన్నారు. ఆ బ్యాగ్ పై ఒకవైపు మోదీ, మరోవైపు అదానీ బొమ్మ ఉంది. మోదీ అదానీ భాయ్ భాయ్ అని రాసిఉంది.
ఇంతలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. సభా కార్యక్రమాల్లో మేం పాల్గొనాలనుకుంటున్నాం. కానీ, ప్రభుత్వం చర్చను కోరుకోవడం లేదని అన్నారు. ఏదో ఒక సాకుతో సభా కార్యక్రమాలను వాయిదా వేస్తున్నారని ప్రియాంక అన్నారు.
👉వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం
108 ఎకరాల ప్రభుత్వ భూమి పేదప్రజల దగ్గరనుండి కొనుగోలు చేసిన విజయవాడకు చెందిన ప్రైవేటు వ్యక్తులు సి రామ శైలజ కెవిపి బసవేశ్వర రావు జి రవీంద్రనాథ్ బి ప్రభావతి మరియు త్రిపురనేని రాఘవ ప్రసాద్
కొండూరు గ్రామం లేపాక్షి మండలం అనంతపురం జిల్లా లో పేద ప్రజలకు పంచిన ప్రభుత్వ భూమిని అక్రమంగా కొనుగోలు చేసి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిస్తున్నారని అనంతపురం జిల్లా చిలుమత్తూరు కు చెందిన టి గోపాలకృష్ణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు
పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది *జడ శ్రవణ్ కుమార్*
ప్రభుత్వ భూమిని పేదలకు పంచామన్న నేపంతో వందల కోట్ల విలువైన భూమిని రాజకీయ పలుకుబడితో ప్రవేటు వ్యక్తులు పేరిట అధికారులు బదలాయించారన్న పిటీషనర్ న్యాయవాది *జడ శ్రవణ్ కుమార్*
ప్రైవేటు వ్యక్తుల పేరిట పేరిట బదలాయించబడిన భూమి ఇప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో ప్రభుత్వ భూమి గానే నమోదయిందన్న పిటీషనర్ న్యాయవాది
పిటిషనర్ వాదనను సమర్థిస్తూ 600 పేజీల ఆధారాలు హైకోర్టు సమర్పించిన న్యాయవాది *జడ శ్రవణ్ కుమార్*
వందలాది అసైన్మెంట్ భూములు పేద ప్రజలను మోసం చేస్తూ కొనుగోలు చేయడం చట్ట విరుద్ధం అన్న న్యాయవాది *శ్రవణ్ కుమార్*..న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ..తక్షణమే ప్రతివాతలు అందరికీ నోటీసులు జారీ చేస్తూ ఆదేశాలు ప్రిన్సిపల్ సెక్రెటరీ పంచాయతీరాజ్, రెవిన్యూ మరియు జిల్లా కలెక్టర్ ను కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశాలు
విచారణ నాలుగు వారాలకు వాయిదా
👉రూ.2 వేల కోసం లోన్‌యాప్ వేధింపులు.. ఉరివేసుకొని యువకుడు మృతి.. విశాఖ – అంగడి దిబ్బకు చెందిన నరేంద్ర(21)కు 40 రోజుల కిందే పెళ్లి జరిగింది.
అతను లోన్ యాప్ నుంచి అప్పు తీసుకోగా నగదు అంతా కట్టి చివరకు రూ.2 వేలు పెండింగ్లో ఉండగా లోన్‌యాప్ నిర్వాహకులు వేధించారు.తన ఫోటో, తన భార్య ఫోటోను మార్ఫింగ్ చేసి కుటుంబ సభ్యులకు, బంధువులకు పంపడంతో మనస్తాపానికి గురైన నరేంద్ర ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
👉 హైదరాబాద్: డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు.. ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నాను.. నా బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదు.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.. న్యాయం కోసం అందరిని కలుస్తా.. నా భార్యాపిల్లలకు రక్షణ లేకుండా పోయింది, అందుకే పోరాటం. -మంచు మనోజ్..
👉ఖమ్మం కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు😲😲😲
రూ.40 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన సీనియర్ అకౌంటెంట్ కట్టా నగేష్…ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తూ రిటైర్డ్ అయిన అటెండర్ భార్యకు రావల్సిన పెన్షన్ కోసం దరఖాస్తు ..లంచం కోసం డిమాండ్ చేసిన ఖమ్మం సబ్ ట్రెజరీ కార్యాలయంలో పని చేస్తున్న నగేష్ ఆడియో, వీడియో రికార్డులతో ఏసీబీని ఆశ్రయించిన బాధితులు రికార్డుల ఆధారంతో నిందితుడు నగేష్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు
👉 ఏపీకి త్వరలో కొత్త డీజీపీ !
కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త డీజీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు ఏడాది చివరిలో రిటైర్ కానున్నారు. ఆయన పదవికాలం పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకూ చీఫ్ సెక్రటరీ పదవీ కాలం పొడిగించేవారు కానీ డీజీపీ పదవి కాలాన్ని పొడిగించిన సందర్భాలు లేవు. ద్వారకా తిరుమలరావు పదవి కాలం పొడిగింపునకు చంద్రబాబు ప్రయత్నం చేస్తారా మరొకరికి చాన్సిస్తారా అన్నది త్వరలో తెలియనుంది. ఇప్పటికే ఆయన రిటైర్మెంట్ డేట్ పై సీఎఫ్ ఉత్తర్వులు జారీ చేశారు.ప్రస్తుతం ఉన్న ఐపీఎస్ అధికారుల్లో అత్యంత సీనియర్ ద్వారకా తిరుమలరావు, ఎన్నికల సంఘం ఎన్నికల సమయంలో రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా తప్పించింది.నిజానికి ఆయన సీనియార్టీలో టాప్ టెన్ లో లేరు.కానీ జగన్ రెడ్డి మనోజ్ అనుకుని ఆయనకు అందలం ఎక్కించారు. ఎన్నికల సమయంలో ఈసీ ఆయనను తప్పించి సీనియర్టీలో మొదటిస్థానంలో ఉన్న ద్వారకా తిరుమలరావును కూడా కాదని హరీష్ కుమార్ గుప్తాకు చాన్సిచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన తరవాత కొన్నాళ్లు గుప్తానే డీజీపీగానే ఉన్నారు కానీ తర్వాత ద్వారకా తిరుమలరావుకు చాన్సిచ్చారు.చంద్రబాబు డీజీపీ విషయంలో నిబంధనల ప్రకారం వెళ్తారు. సీనియార్టీకి గౌరవం ఇస్తారు. అదేసమయంలో సమర్తత చూస్తారు. సీనియార్టీ ఉన్నా.. అంచనాలకు అనుగుణంగా పని చేస్తారని అనుకోకపోతే పదవి ఇవ్వరు. ద్వారకా తిరుమలరావు తర్వాత మళ్లీ హరీష్ గుప్తాకే చాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎవరు డీజీపీగా ఉన్నా.. వైసీపీ హాయాంలో సవాంగ్, రాజేంద్రనాథ్ రెడ్డి తరహాలో విచ్చలవిడిగా వ్యవహరించే అవకాశం మాత్రం ఉండదని గుర్తు చేస్తున్నారు.
👉మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి బాబురావు…ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రేమ్ తరంగ అధ్యక్షతన “మత స్వేచ్ఛ – మన స్వేచ్ఛ” అనే అంశంపై జరిగిన విలేకరుల సమావేశంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి, CRII జాతీయ అధ్యక్షులు, డాక్టర్ కూచిపూడి బాబురావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
డాక్టర్ బాబురావు మాట్లాడుతూ, వ్యక్తిగత మతం మరియు దైవారాధనలు రాజకీయాలతో ముడిపెట్టడం వల్ల దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితి నెలకొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. విభిన్న మతాలు మరియు సంస్కృతులు గల భారతదేశంలో అన్ని మతాలను గౌరవించడమే నిజమైన సెక్యులరిజం ఉద్దేశమని, రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 25 పౌరులందరికీ సమాన స్వేచ్ఛ హామీ ఇస్తోందని పేర్కొన్నారు.
ఆయన మాట్లాడుతూ, “దేశానికి మతం ఉండదు; అన్ని మతాలు సమానమే. చట్టం ముందు అందరూ సమానమని రాజ్యాంగం స్పష్టం చేసినా, మత నిరోధక చట్టాల పేరుతో క్రైస్తవులపై వివక్ష జరుగుతోంది. ఇది రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధం. ఈ చట్టాలను సమీక్షించి రద్దు చేయడం అవసరం.” అని సూచించారు.
అదేవిధంగా, 1950 రాష్ట్రపతి ఉత్తర్వు దళితుల మత స్వేచ్ఛను నెరపకుండా, వారిని హిందూ మతంలో బంధించేందుకు ఉపయోగించిన మార్గంగా అభివర్ణించారు. 74 ఏళ్ల గణతంత్ర దేశంలో కూడా దళితులు తమ స్వేచ్ఛను పొందలేకపోతున్నారని, మత సంకెళ్లు వారిని నిర్బంధిస్తున్నాయని విమర్శించారు.
ఆయన క్రైస్తవ మతం గురించి మాట్లాడుతూ, “క్రైస్తవం కేవలం మతమే కాదు, అది జీవన విధానం మరియు పరలోకానికి దారి చూపే మార్గం” అని అన్నారు. మతాల మధ్య విభేదాలను పక్కనబెట్టి మానవత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా మెరుగైన సమాజ నిర్మాణం సాధ్యమని యువతను సేవారంగంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ప్రముఖ సామాజిక-రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పులిగుజ్జు సురేష్ పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
👉ప్రకాశం జిల్లా* …కంభం మండలం రావిపాడు గ్రామానికి చెందిన వరికుంట్ల వెంకటసుబ్బయ్య అనే జవాన్ 25వ రాష్ట్రీయ రైపిల్స్ హవల్ధారుగా జమ్మూ కాశ్మీర్ విధులు నిర్వహిస్తుండగా మందు పాతర పేలి మృతి
👉ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…**డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ*
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ఇవ్వాలని దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి స్పష్టం చేశారు. తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి రైతులను దగా చేస్తే సంబంధిత వ్యాపారులపై అధికారులు చర్యలు తీసుకుంటారని ఆమె అన్నారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల రైతులు ధాన్యం అమ్మకాలు జరపాలని ఆమె కోరారు. ఇప్పటికే దర్శి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు చేసేందుకు టొబాకో బోర్డు ద్వారా లంకోజనపల్లి లో నాలుగు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు డాక్టర్ లక్ష్మీ తెలిపారు. త్వరలో మరికొన్ని ఏజెన్సీల ద్వారా కూడా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నియోజకవర్గంలో ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా గారు, జెసి ఆర్ గోపాలకృష్ణ గారు హామీ ఇచ్చినట్లు డాక్టర్ లక్ష్మీ వివరించారు. ఏజెన్సీల ద్వారా రైతు భరోసా కేంద్రాలు, కోపరేటివ్ సొసైటీలలో త్వరలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయని ఆమె వివరించారు. ఈ మేరకు దర్శి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు పై జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్, మార్కెటింగ్ అధికారులతో మాట్లాడడం జరిగిందని డాక్టర్ లక్ష్మీ వివరించారు. వ్యాపారులు రైతులను దగా చేస్తే వారిపై కేసు నమోదు చేస్తామని కలెక్టర్ గారు హామీ ఇచ్చినట్లు లక్ష్మి చెప్పారు. కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, వ్యాపారుల వలలో రైతులు పడి విలవిలలాడొద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు గారు ఇప్పటికే సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగిందని ఆమె వివరించారు. తుఫాను వర్షాలతో రైతులు ధాన్యం తడిచి నష్టపోయిన విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తీవ్రంగా తీసుకొని రైతులకు నష్టం జరగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసే కార్యక్రమాన్ని చేపట్టిందని ఆమె వివరించారు. ఈరోజు ఒక పత్రికలో రైతు ధాన్యం కొనుగోలులో దగా అని వార్త చూశాను, రైతులు కి అన్యాయం జరిగితే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. అవసరమైతే రైతులు పక్షాన నేను నిలబడతానని ఆమె స్పష్టం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి దర్శి నియోజకవర్గంలో ప్రతి గింజ ధాన్యాన్ని కొనాలని ఆమె కోరారు.
👉అనంతపురం….GO.No.145 రద్ధు చేయాలనే న్యాయవాదుల నిరసన కు మద్దతు తెలిపిన- బిఎస్పీ అనంతపురం నియోజకవర్గం కమిటీ….
నేడు అనంతపురం జిల్లా కోర్టు వెలుపల అనంతపురం బార్ న్యాయవాదులు గత కొన్ని రోజులుగా N.D.P.S కోర్టు అనంతపురం నుంచి తిరుపతికి తరలించాలని ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించిన G.O.No.145 కు వ్యతిరేకంగా చేపట్టిన రిలే నిరాహారదీక్షలు నిరసన కార్యక్రమానికి ఈరోజు బిఎస్పీ పార్టీ నాయకులు జిల్లా ఇంఛార్జి కాసాని నాగరాజు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అంకె కుళ్ళాయప్ప, నియోజకవర్గం అధ్యక్షులు హరిప్రసాద్, నగర ఉపాధ్యక్షులు జిలాన్ భాషా పాల్గొని నిరసన కార్యక్రమానికి మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాది హనుమన్న అధ్యక్షత వహించిన నిరసన కార్యక్రమాన్ని ఉద్ధేశించి బిఎస్పీ నాయకులు కాసాని నాగరాజు మాట్లాడుతూ ప్రజలు నాయకులకు ఓట్లు వేసి గెలిపించినది వారికి సేవ చేయాలని వారికి, అందుబాటులో అన్ని రకాల సేవలు అందించాలని, మరీ ముఖ్యంగా న్యాయ సేవలు, న్యాయస్థానాలు ప్రజలకు, కక్ష్యదారులకు, న్యాయవాదులకు, పోలీసు అధికారులు అందరికీ అందుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని,
అలా కాకుండా అందరికీ అందుబాటులో లేకుండా అనంతపురం లో ఉన్న N.D.P.S. కోర్టు ను అనంతపురం నుంచి తిరుపతికి తరలించడం మరియు CID కోర్టు ను కర్నలుకు తరలించడం అత్యంత దారుణమైన విషయం అని, చాలా మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనారిటీ బహుజన కులాలకు చెందిన అమాయకులు కేసులో ఇరుక్కుని జైలులో మగ్గుతున్న వారే అధికంగా ఉన్నారని, ఇలాంటి GO.No.145 N.D.P.S. కోర్టు, CID కోర్టులు తరలించడం వలన తీవ్రంగా నష్టపోయేది బడుగు, బలహీనవర్గాల వారు మరియు వారికి న్యాయం కోసం వాదించే న్యాయవాదులేననీ కావున బిఎస్పీ న్యాయవాదుల నిరసన కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ G.O.No.145 ను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కావున వెంటనే ప్రభుత్వం పునరాలోచన చేసి G.O.No.145 ను రద్దు చేయాలని, లేని పక్షంలో అనంతపురం న్యాయవాదుల తరుపున G.O.No.145 రద్దు చేసేవరకు వారి తరుపన బిఎస్పీ కూడా పోరాడుతుందని తెలియజేశారు.
👉పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ ఓ ఆగంతకుడు పేషీకి ఫోన్ కాల్స్ చేయడం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ ఓ ఆగంతకుడు పేషీకి ఫోన్ కాల్స్ చేయడం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇలా ఫోన్ కాల్స్ చేసి బెదిరించడంతో పాటు మెసేజ్ లు కూడా పంపించాడని అంటున్నారు. ఈ వ్యవహారంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను చంపేస్తామంటూ ఓ ఆగంతకుడు ఫోన్ కాల్స్ చేయడం, మెసేజ్ లు పెట్టడం తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారాన్ని ఆయన పేషీలోని సిబ్బంది పవన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం.. పోలీసు ఉన్నతాధికారులకు వెల్లడించారు. దీంతో… కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఈ బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి మల్లికార్జునరావును అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే… నిందితుడు మద్యం మత్తులో ఉండి బెదిరింపు కాల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఇతన్ని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారని కథనాలొస్తున్నాయి. పవన్ కల్యాణ్ పేషీకి కాల్ వచ్చిన నెంబర్ 95055 05556 అని గుర్తించిన పోలీసులు.. ఈ నెంబర్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన మల్లికార్జున రావు పేరుతో ఉందని తేల్చారట. ఇదే సమయంలో కాల్ వచ్చిన టవర్.. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దది అని తేలిందని అంటున్నారు.అయితే… ఈ వ్యవహారంపై టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, లా అండ్ ఆర్డర్ విభాగాలకు చెందిన పోలీసులతో నాలుగు బృందాలను ఏర్పాటు చేసినా.. గుర్తించడం కష్టంగా మరిందని అంటున్నారు. దానికి కారణం.. ఫోన్ స్విచ్చాఫ్ చేయడమే అని తెలుస్తోంది. ఈ సమయంలో నిందితుడిని గిరువూరులో అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఏపీ హోంమంత్రి అనిత పేషీకి ఈ నెంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని.. ఈ విషయాన్ని అనిత పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారని అంటున్నారు! దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.
Recent Posts