👉చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్.. ప్రతిచోటా భారతీయులు.. మరి సిరియాలో? దాదాపు మూడేళ్ల కిందట ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలుపెట్టిన సమయంలో ఆ దేశంలో భారీగా ఉన్న భారతీయులను హుటాహుటిన తీసుకొచ్చారు.ఐదేళ్ల కిందట చైనాలో కొవిడ్ వ్యాప్తి మొదలైన సమయంలో వేలాది మంది భారతీయులను అక్కడి నుంచి తరలించారు.. ముఖ్యంగా వీరిలో వైద్య విద్యార్థులు అధికంగా ఉన్నారు.. కొవిడ్ కేంద్ర స్థానంగా భావిస్తున్న వూహాన్ మెడికల్ యూనివర్సిటీ వందల మంది భారత్ కు క్షేమంగా తీసుకొచ్చారు. దాదాపు మూడేళ్ల కిందట ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలుపెట్టిన సమయంలో ఆ దేశంలో భారీగా ఉన్న భారతీయులను హుటాహుటిన తీసుకొచ్చారు. వీరిలోనూ అత్యధికులు వైద్య విద్యార్థులే. 14 నెలల కిందట గాజా నుంచి ఇజ్రాయెల్ పై దాడికి దిగారు హమాస్ మిలిటెంట్లు.దీంతో ఇజ్రాయెల్ కూడా ప్రతి దాడులు మొదలు పెట్టింది.ఆ దేశం నుంచి వందల మంది భారతీయులను వెనక్కుతీసుకొచ్చారు. గాజాలోనూ ఒక భారతీయుడు ఉన్నట్లు తర్వాత కథనాలు వచ్చాయి. కానీ, అవి నిర్ధారణ కాలేదు. ఇప్పుడు సిరియా వంతు తాజాగా మరో పశ్చిమాసియా దేశం సిరియాను హస్తగతం చేసుకున్నాయి తిరుగుబాటు దళాలు. దీంతో అధ్యక్షుడు బషర్-అల్ అసద్ కుటుంబంతో పాటు దేశాన్ని వీడారు. ఈ నేపథ్యంలో అక్కడున్న భారతీయులను రప్పించేందుకు విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా 75 మంది భారత పౌరులను సిరియా రాజధాని డమాస్కస్ నుంచి లెబనాన్ కు తీసుకొచ్చారు. వీరిలో 44 మంది కశ్మీర్ కు చెందిన జైరిన్ (యాత్రికులు) అని ప్రభుత్వం తెలిపింది. వాణిజ్య విమానాల్లో లెబనాన్ నుంచి త్వరలోనే ఢిల్లీకి వస్తారని పేర్కొంది. సిరియాలో భారీగానే భారతీయులు పశ్చిమాసియా దేశాల్లో కాస్త మంచి పేరున్న సిరియాను అంతర్యుద్ధం బాగా దెబ్బకొట్టింది. దీంతో 6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని లక్షల మంది ప్రవాస జీవితం గడుపుతున్నారు. మరోవైపు సిరియాలో ఇంకా అనేకమంది భారతీయులు ఉన్నారని ప్రభుత్వం తెలిపింది.
⭐ఇజ్రాయెల్- హమాస్ ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ వరుస దాడులు పాలస్తీనా పౌరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజాగా గాజాలో టెల్‌అవీవ్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 26 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈమేరకు పాలస్తీనా వైద్య అధికారులు వెల్లడించారు.
మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ సరిహద్దులోని బీట్ లాహియాలో దాడులు జరిగాయి. దీంతో ప్రజలు స్థానభ్రంశం అయ్యారు. ఈక్రమంలో ఆయా ప్రజలు ఆశ్రయం పొందుతున్న ఓ ఇంటిపైన కూడా దాడి జరగడంతో 19 మంది మరణించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఉండటం గమనార్హం. మరోవైపు సెంట్రల్ గాజాలోని ఓ శరణార్థి శిబిరంపై దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు కమాల్ అద్వాన్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే, ఈ దాడికి సంబంధించి టెల్‌అవీవ్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేయడంతో సుమారు 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని మిలిటెంట్ సంస్థ బందీలుగా తీసుకెళ్లింది. దాంతో ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తోంది. టెల్‌అవీవ్ దాడులతో ఇప్పటివరకు 44వేల మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
👉రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు*
వెలగపూడి సచివాలయంలో డిసెంబర్ 11, 12 తేదీల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరగనుంది. విజన్-2047 డాక్యుమెంట్, కొత్త పాలసీలు, రానున్న నాలుగున్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశాలపై 26 జిల్లాల కలెక్టర్లు, 40శాఖల అధిపతుల అభిప్రాయాన్ని సీఎం తెలుసుకోనున్నారు.RTGS,వ్యవసాయం, వాట్సాప్ గవర్నెన్స్, పట్టణాభివృద్ధి, CRDA, శాంతి భద్రతలు, హార్టీకల్చర్ సహా పలు అంశాలపై చర్చిస్తారు.
👉విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు..*
* విశాఖలోని ఓ స్కానింగ్ సెంటర్లో మహిళను సిబ్బంది వేధింపులకు గురిచేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్..
* మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు..
* నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సెంట్రల్ జైలుకు తరలింపు..
విశాఖపట్నం నగరంలోని ఓ హాస్పిటల్ లో స్కానింగ్ కోసం వచ్చిన మహిళపై అక్కడి సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తలకు గాయం తగిలిన మహిళపై అసభ్యంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా అసభ్యంగా ప్రవర్తించిన స్కానింగ్ సెంటర్ సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన 3వ టౌన్ పోలీసులు సదరు స్కానింగ్ సెంటర్ ఇన్ ఛార్జ్ ప్రకాష్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పీఎన్‌సీ 74, 76 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి రిమాండ్ విధించగా విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.
👉గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ : డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను పురస్కరించకొని లబ్ధిదారులకు త్వరలో ‘క్రిస్మస్ కానుక’ అందిస్తామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకం ప్రారంభిస్తామన్నారు. ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ తిరిగి అందిస్తామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా డిసెంబర్, జనవరి నెలల్లోనే రుణాలు అందిస్తామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు.
👉 మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?
మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?
మంచు ఫ్యామిలీ వివాదం రచ్చకెక్కింది. అయితే మోహన్‌బాబు ఇంట్లో పని చేసే పనిమనిషి అసలు ఆ కుటుంబంలో ఏం జరిగిందో చెబుతున్న వీడియో ఒకటి బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. తనకు జరగరానిది ఏదైనా జరుగుతుందని భావించిన ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
⭐విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ ..విడదల రజనీ మంత్రి పదవిని అడ్డం పట్టుకుని పోలీసు, మైనింగ్ అధికారులతో కలిసి వ్యాపారుల్ని బెదిరించి డబ్బులు దండుకున్న పాపాలు పండిపోయాయి. అధికారం పోవడంతో డబ్బులు ఇచ్చిన వారు ప్రభుత్వానికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ ఇలా ఓ వ్యాపారి చేసిన ఫిర్యాదుపై విజిలెన్స్ దర్యాప్తు చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చిలుకలూరిపేట నియోజకవర్గంలో స్టోర్ క్రషర్ నిర్వహిస్తున్న యాజమాన్యానికి ముందుగా కప్పం కట్టాలని సమాచారం పంపారు. వారు కట్టలేమనడంతో అక్రమ మైనింగ్ చేశారని అధికారులతో రూ. 50 కోట్ల ఫైన్ వేయించారు. దాంతో ఆ వ్యాపారులు కాళ్ల బేరానికి వచ్చారు. పోలీసు ఆఫీసర్ అయిన జాషువా వారిని బెదిరించారు. అందరూ కలిసి రెండు కోట్ల ఇరవై లక్షలు వసూలు చేసుకున్నారు. ఇందులో రెండు కోట్లు విడదల రజని, పది లక్షలు ఆమె పీఏ, మరో పది లక్షలు పోలీసు అధికారి జాషువా తీసుకున్నారు. విజిలెన్స్ దీన్ని నిర్దారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
ప్రభుత్వం ఇప్పుడు విజిలెన్స్ నివేదికపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేసులు పెట్టి క్రిమినల్ చర్యలు తీసుకుంటే.. జైలుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకా ఆమెపై చాలా ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల డబ్బులు తిరిగి ఇచ్చారు. కానీ ఇంకా పదికిపైగా ఫిర్యాదులపై విచారణ జరగాల్సి ఉంది.
⭐ జవాన్ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి డా. డోలా బాలవీరాంజనేయ స్వామి.
జమ్మూలో ల్యాండ్ మైన్ పేలి ప్రాణాలు కోల్పోయిన కంభం మండలం రావిపాడుకు చెందిన జవాన్ వరికుంట్ల సుబ్బయ్య.
ఆర్మీ జవాన్ వెంకట సుబ్బయ్య మృతి అత్యంత బాధాకరం.
30 మంది తోటి జవానుల ప్రాణాలు కాపాడి సుబ్బయ్య వీరమరణం పొందారు.తనను తాను త్యాగం చేసుకుని తోటి జవానుల కాపాడిన తీరు స్పూర్తిదాయకం.
సుబ్బయ్య పోరాట స్పూర్తికి యావత్ దేశం గర్విస్తోంది.
సుబ్బయ్య కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి.
సుబ్బయ్య ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్ధిస్తున్నాను: మంత్రి డోలా.
👉 వినయ్ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు తలెత్తాయని సినీనటుడు మంచు మనోజ్ అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్‌ను కలిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. కూర్చొని సామరస్యంగా సమస్య పరిష్కరించుకునేందుకు తాను సిద్ధమని తెలిపారు. తాను ఆస్తి అడిగే వ్యక్తిని కాదని.. ఆ విషయం మీకూ తెలుసని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
‘‘అప్పట్లో విద్యాసంస్థలను మా నాన్న హైదరాబాద్‌లో పెట్టొచ్చు. కానీ.. పేద ప్రజలు ఎక్కువగా ఉండే చంద్రగిరి ప్రాంతం అభివృద్ధి చెందాలని అక్కడ నెలకొల్పారు. కానీ ఆ ప్రాంత ప్రజలను మా నాన్న వరకు రీచ్ కానివ్వడం లేదు. అది ఆయనకు తెలియపరచాలని ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారు. తిరుపతిలో వినయ్ వ్యవహార శైలి నాకు నచ్చడం లేదు. వాటికి సమాధానం చెప్పాలి. ప్రస్తుతం మా అమ్మ ఆస్పత్రిలో లేరు.. ఇంట్లోనే ఉన్నారు.ఈ వివాదానికి కారణం మా నాన్న కాదు’’ అని మనోజ్ అన్నారు.
👉మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన*
సినీ నటుడు మోహన్ బాబు విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులపై ఒక టీవీ ఛానల్ లోగో వైర్ తో విచక్షణారహితంగా దాడి చేసిన దురుసు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యప్ప దీక్షలో ఉన్న రిపోర్టర్, మరో కెమెరామెన్ పై జరిగిన ఈ దాడిపై వెంటనే స్పందించి మోహన్ బాబుపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. డీజీపీ కలుగజేసుకొని సంబంధిత పోలీస్ ఏసీపీ, ఇన్స్ పెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి..మానవ హక్కుల కమిషన్ కూడా మీడియాపై జరిగిన ఈ దాడిపై సూమోటోగా స్పందించి పూర్తిస్థాయి విచారణకు ఆదేశించేలా ప్రభుత్వానికి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కు సూచనలు ఇవ్వాలని విన్నపం..
*మోహన్ బాబుపై వెంటనే పోలీస్ కేసు నమోదు చేయకపోతే మెరుపు ఆందోళనకు సైతం వెనుకాడేది లేదు*
*ది తెలంగాణా జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ [తెలంగాణా హౌసింగ్ సొసైటీ]*
👉తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు…!*
కడప, మంగళవారం 10 : విదుల్లో చేరకుండా.. ఉద్యోగ నియమ,నిబంధనలను ఉల్లంఘించి, ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేసిన తహశీల్దార్ యు. దస్తగిరయ్యను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సాధారణ బదిలీల్లో భాగంగా.. తహశీల్దార్ యు. దస్తగిరయ్యను తిరుపతి జిల్లా నుండి వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయంలోని కెఆర్ఆర్ సి తహశీల్దార్ గా.. ఉన్నతాధికారులు బదిలీ చేశారు. నిర్ణీత గడువు లోగా జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సి వుండగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. వెంటనే విధులలో చేరాలని ఫోన్ ద్వారా చెప్పడమే కాకుండా, జిల్లా కలెక్టర్ మెమో కూడా జారీ చేశారు. అయినా కూడా ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. విధులలో చేరకుండా .. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్న తహశీల్దార్ యు.దస్తగిరయ్యను ఏపీ సివిల్ సర్వీసెస్ (సి.సి.&ఏ) రూల్స్, 1991 రూల్ 8, సబ్ రూల్ (1) మేరకు సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను జారీ చేశారు. విధుల్లో అలసత్వం వహించినా, ఉన్నతాధికారుల ఆదేశాలను ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
👉టీడీపీ కేంద్ర కార్యాలయానికి పోటెత్తిన భూ బాధితులు*
•వినతులు అందిస్తూ సమస్యలపై నేతలకు మొరపెట్టుకున్న అర్జీదారులు*
•అర్జీలు స్వీకరించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని, ఎమ్మెల్సీ వేపాడ, AMUDA చైర్మన్ స్వామి నాయుడు*
భూ ఆక్రమణలు, ఆన్ లైన్ మోసాలు, తప్పుడు డాక్యుమెంట్ లతో భూ మార్పిడీలు, భూ సమస్యలపై నేడు పెద్ద ఎత్తున అర్జీదారులు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు పోటెత్తారు. భూ సమస్యలను పట్టించుకోని అధికారులు, భూ భకాసురలకు కొమ్ముకాస్తున్న అధికారలపై ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా అర్జీలు స్వీకరించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, AMUDA చైర్మన్ స్వామి నాయుడులు అర్జీలు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాపాల కారణంగా ఎప్పుడూ లేనంతగా రాష్ర్టంలో భూ సమస్యలు పుట్టకొచ్చాయన్నారు. గత ఆరు నెలల కాలంలో వచ్చిన 67 వేల రెవెన్యూ ఫిర్యాదులు, రీ సర్వే పై వచ్చిన 2 లక్షల 67 వేలకు పైగా ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని.. ప్రజలు ప్రభుత్వ కార్యాయాల చుట్టూ తిరిగే పనిలేకుండా చూస్తామని చెప్పారు. రెవెన్యూ సదస్సుల్లో అక్కడికక్కడే పరిష్కరించగల్గిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు. పరిష్కరించలేని వాటిని ఎందుకు పరిష్కరించలేకపోతున్నామో కూడా ప్రజలకు తెలియచేయాలన్నారు. దేశంలో ఎక్కడా జరిగని విధంగా గొప్పగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 👉ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! …అల్లూరి జిల్లా దేవిపట్నం మండలం చినరమణయ్యపేట, దండంగి, కోయిల వీరవరం గ్రామాల్లో వైసీపీ నేతలు ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని గిరిజనులకు చెందకుండా.. 6 కోట్లకు పైగా కొట్టేశారని.. దీనిపై విచారిస్తే.. భారీ దోపిడీ బయటకు వస్తుందని.. చినరమణయ్యపేట గ్రామానికి చెందిన మట్టా మెహర్ బాబా గౌడ్ నేతలకు విజ్ఞప్తి చేశాడు. ..•కృష్ణా జిల్లా గన్నవరంలోని తన స్థలానికి నకిలీ డాక్యుమెంట్ లు సృష్టించి తన స్థలాన్ని కబ్జాచేసేందకు కుట్ర చేస్తున్న మూల్పూరి విజయ తులసీ రాణి, చల్లపల్లి జయశ్రీ, సూరపనేని అనీల్ కుమార్, సముద్రాల వెంకట శివరామకృష్ణలపై చర్యలు తీసుకొని తన భూమిని తనకు దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
•చిలకలూరిపేట మండలంలోని గోవిందాపురం గ్రామంలో ఉన్న తమ భూమిని ఆక్రమించుకున్న వారికి అధికారులు కొమ్ముకాస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకొని విచారించి తమ భూమి తమకు దక్కేలా చూడాలని బాపట్ల జిల్లా యుద్దనపూడి మండలం అనంతవరం గ్రామానికి చెందిన సవరపు ఆరోగ్యం విజ్ఞప్తి చేశారు.
•వైద్య ఆరోగ్య శాఖలో 2002 లొ డీఎస్సీ ద్వారా నియమించబడి.. గత 22 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ విధానంలో పనిచేయుచున్న తమను ( ఎం. పి. హెచ్ ఏ) తొలగించేందుకు ఉత్తర్వులు ఇచ్చారని.. దాంతో తమ కుటుంబాలు రోడ్డున పడతాయని.. దయ చేసి తమకు ఉద్యోగ భరోసా కల్పించి ఉద్యోగాల్లో కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేశారు.
•కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పాప వినాశనం గ్రామానికి చెందిన పలువురు విజ్ఞప్తి చేస్తూ.. ఎస్సీ ఎస్టీలమైన తమకు ప్రభుత్వం గతంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పట్టాలు కూడా ఇచ్చారని.. కాని స్థలాలు చూపించడంలేదని.. స్థలాలు చూపించాలని వారు విజ్ఞప్తి చేశారు.
•అధికారులకు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా తమ సమస్యను పట్టించుకోవడంలేదని.. తన ఇంటిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవడంలేదని.. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన రామయ్య అనే వ్యక్తి నేడు గ్రీవెన్స్ లో నేతలకు ఫిర్యాదు చేశాడు
•తాము గత 40 సంవత్సరాల నుండి సాగులో ఉన్న భూమిని ఆక్రమించుకుని దేవర బండ గ్రామానికి చెందిన సుభాన్ అనే వక్తి క్రసర్ ఫ్యాక్టరీని పెట్టాడని.. దీనిపై విచారించి తమకు న్యాయం చేయాలని కర్నూలు జిల్లా దేవనకొండ మండలం మాచాపురం గ్రామానికి చెందిన ఉప్పరి దానమ్మ విజ్ఞప్తి చేశారు.
👉ఆధార్ ఉన్న వారికి శుభవార్త*
ఆధార్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజలు సులభంగా ఆధార్ సేవలు వినియోగించుకునేలా వెయ్యి ఆధార్ కిట్ల కొనుగోలుకు రూ.20 కోట్లు మంజూరు చేస్తూ CM చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. *వీలైనంత త్వరగా గ్రామ-వార్డు సచివాలయాల్లో వెయ్యి ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.* అటు జనన-మరణ ధ్రువపత్రాలు పొందేందుకు JAN 1న కొత్త వెబ్సైటును ప్రారంభించాలన్నారు.
👉గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ : డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను పురస్కరించకొని లబ్ధిదారులకు త్వరలో ‘క్రిస్మస్ కానుక’ అందిస్తామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకం ప్రారంభిస్తామన్నారు. ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ తిరిగి అందిస్తామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా డిసెంబర్, జనవరి నెలల్లోనే రుణాలు అందిస్తామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు.
👉 మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?
మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?
మంచు ఫ్యామిలీ వివాదం రచ్చకెక్కింది. అయితే మోహన్‌బాబు ఇంట్లో పని చేసే పనిమనిషి అసలు ఆ కుటుంబంలో ఏం జరిగిందో చెబుతున్న వీడియో ఒకటి బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. తనకు జరగరానిది ఏదైనా జరుగుతుందని భావించిన ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉ఈరోజు విజయవాడ అసెంబ్లీ నందు తెలుగుదేశం పార్టీ తరుపున రాజ్యసభ సభ్యులుగా ఎంపికై నామినేషన్లు వేస్తున్న సందర్బంగా బీద మస్తాన్‌రావు, సానా సతీష్ గార్లను టీడీపీ ప్రజా ప్రతినిధులతో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసిన గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారు*
👉టిడిపి: *ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కొరకు పాదయాత్ర చేపట్టిన టిడిపి కార్యకర్తలు*
ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి వీర అభిమానులు టిడిపి నాయకులు దూదేకుల దస్తగిరి, పిడతల రవి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి గిద్దలూరు పట్టణం లోని రాచర్ల గేట్ దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి పాదయాత్ర చేపట్టారు. మంగళవారం నాటికి వీరి యాత్ర యర్రగొండపాలెం నియోజకవర్గంలోని చిన్న దోర్నాలకు చేరుకుంది. 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా ముత్తుముల అశోక్ రెడ్డి విజయం సాధిస్తే శ్రీశైలానికి కాలినడకన వచ్చి మల్లన్నను దర్శించుకుంటామని మొక్కు పెట్టుకున్నట్లుగా వీరు తెలిపారు. అదివారం గిద్దలూరు పట్టణంలోని రాచర్ల గేట్ సెంటర్ నుంచి వీరు పాదయాత్ర ప్రారంభించారు. మరో 24 గంటల్లో శ్రీశైలం చేరుకొని మొక్కు తీర్చుకుంటామని టిడిపి కార్యకర్తలు దూదేకుల దస్తగిరి, పీడతల రవి అన్నారు.
👉శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*నంద్యాల జిల్లా: శ్రీ మల్లికార్జున స్వామి వారు వెలసిన శ్రీశైల క్షేత్రాన్ని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి బుధవారం ఉదయం టీడీపీ శ్రేణులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్బంగా పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు.
👉బండారు వారి వివాహా కార్యక్రమంలో పాల్గోన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*శ్రీశైలం క్షేత్రంలోని వాసవీ సత్రం కళ్యాణ మండపంలో గిద్దలూరు పట్టణానికి చెందిన డాక్టర్ బండారు వెంకట రంగారావు కుమారుడు “చి. విరించి మరియు చి.ల.సౌ పావని” లకు జరిగిన వివాహ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
⭐ కంభం మండలంలో పొలం పిలుస్తుంది..
ప్రజాశక్తి కంభం రూరల్ ..పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని చిన్న కంభం గ్రామంలో మొక్కజొన్న కంది పంట లను మండల వ్యవసాయ అధికరి డి . స్వరూప పరిశీలించారు . మొక్క జొన్న పంటలో కత్తెర పురుగు గమనించి ,వీటి నివారణకు పలు సూచనలు ఇచ్చారు .అలాగే *పంటల భీమా ఈనెల 15వ* తారీకు లోపు రైతులు ప్రీమియం చెల్లించాలని తెలియజేశారు. వ్యవసాయ సహాయకులు నరసింహులు రైతులు పాల్గొన్నారు
⭐**బెల్ట్ షాపుపై దాడులు నిర్వహించిన కంభం ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్*
• _8 క్వార్టర్ బాటిళ్లు సీజ్.. ఒకరు అరెస్టు…_
ప్రజాశక్తి*కంభం రూరల్:* ప్రకాశం జిల్లా అర్ధవీడు గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బెల్ట్ షాపుపై ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి వారి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డి. అల్లూరమ్మ (పాపినేని పల్లి) అనే మహిళను అదుపులోకి తీసుకుని ఆమె వద్ద నుండి 8 క్వార్టర్ (180 ఎంఎల్) బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కొండారెడ్డి మాట్లాడుతూ ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహించినా, అక్రమంగా మద్యం తరలించినా, అక్రమంగా మద్యం కలిగి ఉన్నా, అమ్మినా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ వారికి వెంటనే సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.