👉 కాంగ్రెస్- సోరోస్ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభ స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను బుధవారం స్వయంగా కలిసిన రాహుల్ గాంధీ.. సభ సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీకి హంగేరికి చెందిన బిలియనీర్ జార్జి సోరో్‌సకు సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, సంబిత్ పాత్రా డిసెంబరు 5న ఆరోపించారు.
ఆ మరుసటి రోజున నిషికాంత్ దూబే లోక్‌సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హస్తం సోరోస్ చేతిలో ఉందని, అమెరికా ప్రభుత్వం, జార్జి సోరోస్ ఇచ్చే నిధులతో పని చేసే ఓసీసీఆర్‌పీ(ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు)తో కాంగ్రె్‌సకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. భారత్ జోడో యాత్ర కోసం రాహుల్ గాంధీ.. సోరోస్ దగ్గర డబ్బు తీసుకున్నారా ? అని ప్రశ్నించారు. తీవ్ర దుమారం రేపిన ఈ వ్యాఖ్యలనే రికార్డుల నుంచి తొలగించాలని రాహుల్ కోరారు. అయితే, తాను చేసిన విజ్ఞప్తికి సభాపతి సానుకూలంగా స్పందించారని, తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని స్పీకర్‌తో భేటీ అనంతరం రాహుల్ గాంధీ విలేకరులతో అన్నారు. అదానీ అంశంపై చర్చ జరగకూడదనే లక్ష్యంతో బీజేపీ ఎంపీలు తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
⭐ఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్
అమరావతి :
ఏపీలో వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు
అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందని మంత్రి లోకేశ్ తెలిపారు.ప్రభుత్వసమాచారం మంతా ఒకే వెబ్సైట్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్పై కలెక్టర్లతో సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యాశాఖలో అపార్ ఐడీ జారీలో ఇబ్బందులను పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం యూఏఈ ప్లాట్ఫాం ఒక్కటే పౌరసేవలు అందిస్తోందని పేర్కొన్నారు.
👉 మంచి విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన రాచకొండ సీపీ..
దాదాపు గంటన్నర సేపు మంచు విష్ణును విచారించిన సీపీ సుధీర్ బాబు.నాలుగు రోజులుగా మంచు కుటుంబంలో నెలకొన్న వివాదాలపై ఆరా..మరోసారి గొడవలు పునరావృతం అయితే చట్టపరమైన చర్యలు ఉంటాయి..
శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దని హెచ్చరిక..శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న సీపీ..
మరోసారి ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దని సీపీ ఆదేశం..జల్‌పల్లి నివాసంలో ఉన్న ప్రైవేటు సెక్యూరిటీని పంపించాలని విష్ణును ఆదేశించిన సీపీ..జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో బాండ్ పేపర్ల పై విష్ణు సంతకాలు తీసుకున్న సీపీ.
👉 రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్ ధన్కర్ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం
– ఉభయసభలు వాయిదా
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై 11 రోజులు దాటినా…
ప్రధాని మోడీ సభలో గానీ బయటగానీ అదానీ వ్యవహారంలో నోరు విప్పడం లేదు. పార్లమెంట్ ఆవరణలో ప్రతి పక్షాలు అదానీ..మోడీ భాయ్ భాయ్ అంటూ వినూత్న ఆందోళనలు చేస్తున్నా నిమ్మకు నీరెత్తిన్నట్టు వ్యవహరిస్తున్నారు. న్యూఢిల్లీ బ్యూరో
రాజ్యసభ చైర్మెన్ జగ్‌దీప్ ధన్కర్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఆయన వ్యవహరిస్తున్న తీరు ఏకపక్షంగా ఉంటోందని ప్రతిపక్ష ఎంపీలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే ఇటీవల కూడా ఆయన తీరును ప్రదర్శిస్తూ ప్రతిపక్షాలను ఉద్దేశించి విమర్శలు చేస్తున్నా రాజ్యసభ నుంచి తాము తరచూ వాకౌట్ చేయాల్సిన పరిస్థితికి చైర్మెన్ ధన్కర్ వైఖరే కారణమని ప్రతిపక్ష ఎంపీలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం చైర్మెన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై ఇండియా బ్లాక్‌కు చెందిన కాంగ్రెస్, టీఎంసీ, సీపీఐ(ఎం), ఆప్, ఎస్‌పీ, డీఎంకెే, ఆర్‌జేడీ, సీపీఐ తదితర పార్టీలకు చెందిన 50 మందికిపైగా ఎంపీలు సంతకాలు చేశారు. ఈ సంతకాలు చేసిన నోటీసులను రాజ్యసభ సెక్రెటేరియట్‌కు సమర్పించారు. చైర్మెన్‌కు వ్యతిరేకం గా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం దేశ పార్లమెంటరీ చరిత్రలోనే ఇది మొదటిసారి. కాగా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేందుకు లేచి నిలబడినపుడు చైర్మెన్ ఆయనకు అవకాశం ఇవ్వాలని, కానీ సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే లేచి నిలబడగానే చైర్మెన్ మైక్రోఫోన్‌ను తరచూ కట్ చేస్తున్నారని ప్రతిపక్ష ఎంపీలు విమర్శించారు. పార్లమెంటరీ నిబంధనలు, సాంప్రదాయాల ప్రకారం సభ నడవాలని, ఈ విషయమై తాము ఫిర్యాదు చేసిన ప్రతిసారి తమను ఛాంబర్‌లోకి పిలిచి సర్దుబాటు చేసేందుకు చైర్మెన్ ప్రయత్నిస్తున్నారే తప్ప నిబంధనలను పాటించాలని భావించడం లేదని తెలిపారు. ఈ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానానికి ఆమోదం లభించడం సాంకేతికంగా సాధ్యం కాదని, 14 రోజుల నోటీస్ పీరియడ్ ఉండాలని, శీతాకాల సమావేశాలు ముగియడానికి ఇప్పుడు కేవలం ఎనిమిది రోజులే ఉందని అధికార పార్టీకి చెందిన వారు చెబుతున్నారు. అదానీపై చర్చకు భయపడుతున్న బీజేపీ అదానీ అంశంపై చర్చకు బీజేపీ భయపడుతోందని ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. ఉభయ సభలు నేటికి వాయిదా పడిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ”నేను పార్లమెంటుకు కొత్త సభ్యురాలిని. ఇప్పటి వరకు పార్లమెంటులో ప్రధానమంత్రి కనిపించ లేదు. మనం ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తకూడదు?” అని అన్నారు. మరోపక్క పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఉభయ సభలు అదానీ వ్యవహారంపై ప్రతిపక్ష ఎంపీల ఆందోళనతో మధ్యాహ్నం 12 గంటలకే వాయిదా పడ్డాయి. తిరిగి ప్రారంభమైనా ఎలాంటి మార్పు లేకపోవడంతో నిమిషాల వ్యవధిలోనే బుధవారానికి వాయిదా పడ్డాయి.
👉పురుగుల మందు తాగుతూ మహిళా…. సెల్ఫీ వీడియో*గుంటూరు….
తెనాలిలో పురుగుల మందు తాగి కోటేశ్వరమ్మ అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మంగళవారం జరిగింది.
ఇందుకు సంబంధించి మహిళ పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకుంది.
అదే గ్రామానికి చెందిన విజయ వద్ద రూ. 3 లక్షలు అప్పు తీసుకొని వడ్డీతో సహా… చెల్లించానని ఐనా ఇంకా కట్టాలని వేదిస్తున్నట్లు వీడియోలో తెలిపింది.
తనకు మాజీ మంత్రి అలపాటి న్యాయం చేయాలని కోరింది.
ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
⭐పోలీసులతో ఫోన్‌లో మాట్లాడిన భూమా మౌనిక…
నా పిల్లల జోలికొస్తే నేను ప్రైవేట్ కేసు వేస్తా: భూమా మౌనిక..
దెబ్బలు మనోజ్‌కే తగిలాయి
ఈ వ్యవహారంలో న్యాయంగా వ్యవహరించండి: భూమా మౌనిక
👉రూ.2.25 లక్షల గంజాయి పట్టి వేత…
రెండు కేసుల్లో 8.598 కేజీల గంజాయి స్వాధీనం😲😲😲
దుండిగల్ ప్రాంతంలోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు గంజాయి అమ్మకాలు జరుపతున్నారనే సమాచారం మేరకు రంగారెడ్డి stf బి టీమ్ సీఐ సుబాష్ టీమ్ రెండు కేసుల్లో రూ. 2.25 లక్షల విలువ చేసే గంజాయిని మంగళవారం రాత్రి పట్టుకున్నారు.
పోచంపల్లి ప్రాంతానికి చెందిన దీపక్ కుమార్, మహమ్మమద్ షరిష్ ఇస్మాల్ అనే వ్యక్తులు గంజాయి అమ్మకాలు జరుపుతుండగా వారి వద్ద నుంచి 7.460 కేజీల గంజాయిని పట్టుకున్నారు.
మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద బీహర్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు గంజాయి అమ్మకాలు జరుపతుండగా1.138కేజీల గంజాయిని పట్టుకున్నారు.
గంజాయి అమ్మకాలు జరుపుతూ పట్టుబడిన వారిలో బీహర్‌కు చెందిన మిలాన్‌కుమార్, మనీష్ కుమార్, అఖిలేష్ కుమార్‌లు ఉన్నారు.గంజాయిని పట్టుకున్న టీమ్‌లో stf బి టీమ్ సీఐ సుబాష్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, అఖిల్, కానిస్టేబుళ్లు సుధాకర్, రవి, మోహన్‌రావు, సుదీప్ రెడ్డి ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌ను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి. కమలాసన్‌రెడ్డి, అసిస్టేంట్ కమిషనర్ ఆర్. కిషన్ ఏఈఎస్ జీవన్ కిరణ్‌లు అభినందించారు.
⭐ గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి తీవ్ర గాయాలు..
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం దోస పహాడ్ గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి గుడిసెలు దగ్దం
ఆరుగురికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు.. భారీగా ఆస్తి నష్టం
👉 పిల్లల ప్రాణాలంటే లెక్క లేదా?
జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…
అదే కేంద్రంలో చికిత్స పొందుతున్న అస్వస్థతకు గురైన కస్తూర్బా విద్యార్థినులు..కాలం చెల్లిన మందులిచ్చి తమ పిల్లలను ఏం చేయాలనుకుంటున్నారంటూ తల్లిదండ్రుల ఆందోళన..మాతా శిశు కేంద్రం సిబ్బందిని నిలదీసిన తల్లిదండ్రులు.. మందులను చెత్తబుట్టలో పడేసిన సిబ్బంది
👉 పది మందిని కాపాడి.. ప్రాణాలొదిలిన ప్రకాశం జిల్లాకు చెందిన హవల్దార్ వెంకటసుబ్బయ్య..
మృతదేహం అనంతపురం జిల్లా నార్పల గ్రామానికి చేరిక..
అధికార లాంఛనాలతో నేడు అక్కడ అంత్యక్రియలు..
స్వగ్రామమైన కంభం మండలం రావిపాడులో విషాదం..
కన్నీరుమున్నీరవుతున్న తల్లి.. మంత్రి స్వామి ఎమ్మెల్యేల దిగ్ర్భాంతి..నివాళి అర్పించిన మంత్రి డోలా..
వెంకటసుబ్బయ్య మృతిపట్ల మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి బుధవారం తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు…30 మంది తోటి జవాన్ల ప్రాణాలు కాపాడి ఆయన వీరమరణం పొందారని తెలిపారు..
ఆయన త్యాగం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు…
కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు..
వెంకటసుబ్బయ్య మృతికి ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయ్‌కుమార్ నివాళులర్పించారు.
⭐⭐ నార్పలలో పదిమందిని కాపాడిన వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప*
నార్పల చేరుకున్న వీరజవాన్ సుబ్బయ్య పార్థివ దేహం
గురువారం ఉదయం మిలిటరీ హానర్స్ తో వీర జవాను సుబ్బయ్య అంత్యక్రియలు.
అనంతపురము, డిసెంబర్ 11: ఈ నెల 9 న జమ్ము ఫూంచ్ సెక్టార్ మన దేశ సరిహద్దు ప్రాంతంలో సైనిక విధుల్లో పహారా కాస్తూ తన తోటి 30 మంది సైనికుల ప్రాణాలను కాపాడి, ముష్కరుల మైనింగ్ బ్లాస్ట్ లో ప్రాణత్యాగం చేసిన మన సైనికుడు ప్రకాశం జిల్లా రావిపాడు నివాసి వరికుంట్ల సుబ్బయ్య పార్థివ దేహం బుధవారం రాత్రి తన భార్య పిల్లలు నివాసం ఉంటున్న అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రానికి బెంగళూరు ఎయిర్ పోర్టు నుండి మిలిటరీ అంబులెన్సు లో చేరుకుంది. నార్పల క్రాస్ నుండి పోలీస్ ఎస్కార్ట్ తో గ్రామస్థుల మధ్య ర్యాలీ తో వీర జవాన్ పార్థివ దేహం మృతుని కొత్త ఇంటి వద్దకు చేరుకుంది. గురువారం ఉదయం కుటుంబ ఆచారం ప్రకారం కార్యక్రమాలు పూర్తి అయిన అనంతరం వీరజవాన్ కుటుంబ సభ్యుల సమక్షంలో వారి ఆచారం ప్రకారం నార్పల లో మృతుని తోటలో మిలిటరీ హానర్స్ తో అంత్యక్రియలు జరుగుతాయని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ అధికారులు, జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, డైరెక్టర్ సైనిక సంక్షేమ శాఖ తరఫున జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప,జిల్లా కలెక్టర్ తరఫున ఆర్డీవో కేశవ నాయుడు, ఎస్పీ తరఫున స్థానిక పోలీసు అధికారులు , మిలిటరీ అధికారులు వీరజవాన్ అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు.
బుధవారం సాయంత్రం నార్పలకు వెళ్లి వీరజవాను సుబ్బయ్య తల్లి చిన్న గాలెమ్మ, సతీమణి లీలావతి, పిల్లలు లాస్యప్రియ, సాయి, వారి కుటుంబ సభ్యులను అనంతపురము ఉమ్మడి జిల్లా సైనిక సంక్షేమ అధికారి పి. తిమ్మప్ప పరామర్శించి, ఓదార్చి, ధైర్యం చెప్పారు. సైనిక సంక్షేమ శాఖ, మద్రాసు రెజిమెంట్ ఆర్మీ కార్యాలయం నుండి రావాల్సిన ఫ్యామిలీ పెన్షన్, ఇతర ఆర్ధిక సహాయాన్ని త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని తిమ్మప్ప వీరజవాన్ కుటుంబ సభ్యులకు తెలిపారు. అలాగే అంత్యక్రియలు నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలించి, ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్థానిక సిఐ కౌతాలయ్య, ఎస్ ఐ సాగర్, మాజీ సైనిక సంఘం నాయకులు పి. విశ్వేశ్వర రావు, మాజీ సైనికులు పెద్ధి రెడ్డి, జిల్లా సైనిక కార్యాలయం సిబ్బంది గిరీష్ తదితరులు పాల్గొన్నారు
కాంగ్రెస్- సోరోస్ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్ ధన్కర్ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్ ధన్కర్ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..
Recent Posts