👉రష్యాపై ఉక్రెయిన్ 9/11 తరహా దాడి.. 6 భవనాలపై డ్రోన్లతో ఎటాక్😱😱😱
రష్యాపై ఉక్రెయిన్ వరస బాంబు దాడులతో విరుచుకుపడుతోంది. రష్యాపై 9/11 తరహా దాడిని ప్రారంభించింది. కజాన్‌లోని 6 భవనాలపై ఉక్రెయిన్ సైన్యం డ్రోన్ దాడి చేసింది. దాడి అనంతరం ఆ ప్రాంతమంతా గందరగోళం నెలకొంది. ప్రజలు భవనాలను ఖాళీ చేశారు. దాడి జరిగిన ప్రాంతలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మరి ఈ దాడులకు రష్యా రియాక్షన్ ఏమిటనేది తెలియాల్సి ఉంది.
అగ్ర రాజ్యం అమెరికా సమయంలో ఉక్రెయిన్ నిరంతరం రష్యా పై విరుచుకుపడుతోంది. రష్యాలోని ప్రధాన నగరాలపై బాంబు దాడి చేస్తోంది. విధ్వంసక క్షిపణులను ఉపయోగించడానికి బిడెన్ ప్రభుత్వం నుంచి అనుమతులు రావడమే కాదు… ఉక్రెయిన్ కు ఆయుధ సహాయం కూడా చేస్తోన్నట్లు తెలుస్తోంది. దీంతో ఉక్రెయిన్ మరింత ఘోరంగా రష్యాపై విరుచుకుపడుతోంది. నివేదికల ప్రకారం.. క్రెయిన్ శనివారం రష్యాపై 9/11 తరహా దాడి చేసింది. ఉక్రెయిన్ ఆర్మీ కజాన్‌లోని 6 భవనాలపై డ్రోన్ దాడి చేసింది. ఈ దాడి తరువాత ఈ మొత్తం ప్రాంతమంతా గందరగోళం నెలకొంది.
దాడి తర్వాత భవనాలను ఖాళీ చేయించారు. పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు. దాడి తర్వాత సహాయక చర్యలు జరుగుతున్నప్పుడు కూడా మళ్ళీ దాడి జరిగింది. సమీపంలోని విమానాశ్రయం మూసివేయబడింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఉక్రెయిన్ సైన్యం సుమారు 8 డ్రోన్లతో కజాన్‌లోని 6 భవనాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ నిరంతర దాడుల కారణంగా ఈ నగరంలోని ప్రజలు భూగర్భ ఆశ్రయాలలో నివసించవలసి వస్తుంది. ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని కజాన్ నగర మేయర్ కోరారు.
*దాడి ఎక్కడ జరిగింది?
ప్రాథమిక సమాచారం ప్రకారం డ్రోన్‌లు కమలేవ్ అవెన్యూ, క్లారా జెట్‌కిన్ స్ట్రీట్, యుకోజిన్స్‌కయా, ఖాదీ తక్తాష్ , క్రాస్నాయా పొజిట్సియాలోని భవనాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఓరెన్‌బర్గ్‌స్కీ ట్రాక్ట్ స్ట్రీట్‌లోని ఓ భవనాన్ని మరో రెండు డ్రోన్‌లు టార్గెట్ చేశాయి.ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు అయినట్లు సమాచారం లేదు.దాడి ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు.
దాడి తరువాత రష్యాలోని టాటర్స్తాన్ ప్రాంతం ప్రభుత్వం రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని సామూహిక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయంతో ఉక్రెయిన్ చేస్తోన్న దాడులను రష్యా తేలిగ్గా తీసుకోవడం లేదని, భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడులు జరుగుతాయనే భయం కనిపిస్తోందని అంటున్నారు. అయితే ప్రతి దాడికి తగిన సమాధానం చెబుతామని రష్యా ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఉక్రెయిన్ చేసిన ఈ దాడికి రష్యా ఏం సమాధానం చెబుతుందో అనే ఆందోళన సర్వత్రా నెలకొంది.
👉 ‘పుష్ప-2’ ఘటనపై పూసగుచ్చినట్లు వివరణ… రేవంత్ సంచలన వ్యాఖ్యలు! ఇందులో భాగంగా… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆరెస్స్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిలసాట ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రాజకీయంగానూ తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఇందులో భాగంగా… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆరెస్స్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
టాఫ్ నుంచి చేతులు ఊపుతూ సంధ్య థియేటర్ వద్దకు చేరుకున్నారని.. ఆ సమయంలో తమ అభిమాన నటుడిని చూడాలనే ఉద్దేశ్యంతో చుట్టుపక్కల అభిమానులంతా ఇక్కడికే వచ్చారని అన్నారు. ఆ సమయంలో సదరు హీరో కారు థియేటర్ లోపలికి పంపించేందుకు గేటు తెరిచారని.. దీంతో ఒక్కసారి వందల సంఖ్యలో అభిమానులందరూ థియేటర్ లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారని.. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోయారని.. ఈ సమయంలోనే ఆమె కుమారుడు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని వివరించారు. ఆ సమయంలో పరిస్థితి చేయిదాటిపోయిందని.. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అల్లు అర్జున్ కు పోలీసులు చెప్పాలని ప్రయత్నించారని.. ఈ సమయంలో అల్లు అర్జు వద్దకు వెళ్లకుండా థియేటర్ యాజమాన్యం పోలీసులను బ్లాక్ చేశారని..
ఈ క్రమంలో ఏసీపీ వెళ్లి అల్లు అర్జున్ కు పరిస్థితి వివరించారని.. అక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పారని స్పష్టం చేశారు. అయినప్పటికీ… సినిమా చూసే వెళ్తానని అల్లు అర్జున్ అన్నట్లు సిటీ కమిషనర్ తనతో చెప్పారని రేవంత్ పేర్కొన్నారు. ఈ సమయంలో ఏదోవిధంగా పోలీసులు బలవంతం చేసి థియేటర్ నుంచి పంపించే ఏర్పాట్లు చేస్తే.. మరోసారి రూఫ్ టాప్ ద్వారా చేతులు ఊపుతూ వెళ్లారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్ తో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేశారని అన్నారు. ఈ క్రమంలో… తొక్కిసలాటలో మహిళ చనిపోయి, కుమారుడు చావుబతుకుల్లో ఉన్నా 11 రోజుల తర్వాత వరకూ ఆ సినిమా హీరో, ప్రొడ్యూసర్ ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదని.. ఆస్పత్రిలో ఉన్న పిల్లాడిని పరామర్శించడానికి వెళ్లలేదని.. బెయిల్ పై విడుదలైన నటుడిని పరామర్శించడానికి మాత్రం సినీ ప్రముఖులు అతని ఇంటి వద్ద క్యూ కట్టారని రేవంత్ ఘాటుగా స్పందించారు.
ఇందులో భాగంగా… ఈ ఘటనలో హీరో కన్ను పోయిందా, కాలు పోయిందా, కిడ్నీ పోయిందా, ఏమి పోయింది.. అతన్ని పరామర్శిస్తున్నారు, ప్రభుత్వాన్ని తిడుతున్నారు అని అన్నారు. ఇలా హీరో ఇంటికి క్యూ కట్టారు కానీ.. ఆస్పత్రిలో ఉన్న పిల్లగాడిని పరామర్శించడానికి ముందుకురాలేదని రేవంత్ మండిపడ్డారు! ఈ సందర్భంగా… సినిమా ప్రముఖులకు ఒక్కటే చెబుతున్నా అని మొదలుపెట్టిన రేవంత్… “సినిమాలు తీసుకోండి.. వ్యాపారం చేసుకోండి.. డబ్బులు సంపాదించుకోండి.. ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు తీసుకోండి.. షూటింగ్ లకు సంబంధించి అనుమతులు కూడా తీసుకోండి.. కానీ… ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.. నేను కుర్చీలో ఉన్నంత వరకూ ఇలాంటి ఘటనలు ఉపేక్షించను” అని స్పష్టం చేశారు.
👉 ఆర్జీవీకి వడ్డీతో కలిపి షాకిచ్చిన ఫైబర్ నెట్… వాట్ నెక్స్ట్? ఇందులో భాగంగా… ‘వ్యూహం’ సినిమా కోసం రూల్స్ విరుద్ధంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందటంపై ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నోటీస్ పంపించింది. ‘వ్యూహం’ సినిమాకు గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ చెల్లింపులు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ వ్యవహారంలో ఓ న్యూస్ ఛానల్ లో కథనాలు రాగా.. వాటికి ఎక్స్ వేదికగా ఆర్జీవీ స్పందించారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి ఈ విషయంపై సీరియస్ గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అవును… సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ సినిమాకు గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ ద్వారా లబ్ధి చేకూరిందనే ఆరోపణలు ఇటీవల తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో జలక్ ఇచ్చింది. ఈ సందర్భంగా కీలక నోటీసులు పంపించింది. ఇందులో భాగంగా… ‘వ్యూహం’ సినిమా కోసం రూల్స్ విరుద్ధంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందటంపై ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నోటీస్ పంపించింది. ఈ సందర్భంగా… ‘వ్యూహం’ సినిమాకు వ్యూస్ లేనప్పటికీ ఫైబర్ నెట్ రూ.1.15 కోట్ల అనుచిత లబ్ధి పొందటంపై లీగల్ నోటీసులు ఇచ్చింది.
ఈ క్రమంలో… ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాల మేరకు నాటి ఫైబర్ నెట్ ఎండీతో పాటు 5 మందికి నోటీసులు జారీ చేశారని అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందుకు గానూ పదిహేను రోజుల్లోగా వడ్డీతో సహా మొత్తం కట్టాలని ఆదేశించారని తెలుస్తోంది. దీంతో… ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా… సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ అబ్ధుల్ నజీర్ ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ.. జగన్ కు విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా… “వెరీ హ్యాపీ బర్త్ డే అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వైఎస్ జగన్ గారూ” అని మొదలుపెట్టిన ఆర్జీవీ… “రాబోయే ఏడాది మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయాలని ఆశిస్తున్నాను” అని ట్వీట్ చేశారు.
👉రెవెన్యూ సదస్సులతోనే స్వత్వర భూ సమస్యల పరిష్కారం- రాష్ట్ర మంత్రివర్యులు డోల బాల వీరాంజనేయ స్వామి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. శనివారం స్థానిక పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన రెవిన్యూ సదస్సులో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో దాదాపు 70% కు పైగా భూ సమస్యల పైన అర్జీలు వస్తున్నాయని అది గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఆలోచించి ప్రతి గ్రామంలో రెవిన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలు పరిష్కారారం చూపించాలని ఆదేశించారని గుర్తు చేశారు.
వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందని జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని కానీ యుద్ధ ప్రాతిపదికన పనులు ఇప్పటినుండి చేపడితేనే రెండు సంవత్సరాల కాలం పడుతుందని గత ప్రభుత్వంలో ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడానికి వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని ఎద్దేవ చేశారు. మార్కాపురం శాసనసభ్యులు నారాయణరెడ్డి మాట్లాడుతూ ఇక పొదిలి లో ఉన్న 79 ఎకరాలు చిన్న చెరువును భూ బకాసురులు అన్యాక్రాంతం చేసి ఫ్లాట్లు వేసి విక్రయించారని ఇటువంటి భూకబ్జాదారులకు త్వరలోనే శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఈ విషయంపై సదస్సులో పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ తక్షణమే ఈరోజే మూడు టీములతో చిన్న చెరువు సర్వే కు ఆదేశాలు ఇచ్చారు. పొదిలి దాహర్తి తీర్చడానికి త్వరలోనే దర్శి ఎన్ఎస్ పి కాలువ నుండి పొదిలి పెద్ద చెరువుకు నీటిని నింపడానికి టెండర్లు పిలుస్తామని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో కేవలం కమిషనర్ కోసం అధికార పార్టీ నాయకులు కాంట్రాక్టు దగ్గర కమిషన్ తీసుకుని హడావిడిగా మొదలు మొదలు పెట్టించారన్నారు. ఈ పనులకు అధికారికంగా ఆర్థిక శాఖ మంత్రి లేదని అందుకోసం త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. త్వరలోనే పొదిలి పట్టణమునకు బైపాస్ లైన్ మంజూరుకు అంచనాలు తయారుచేసి అది కూడా సాకారం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కనిగిరి ఆర్డీవో, స్థానిక తహసీల్దారులు,అధికారులు తెలుగుదేశం నాయకులు, అర్జీదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. *ఆక్రమణల పై వెల్లువెత్తిన అర్జీలు* పొదిలి పట్టణంలో భూ అక్రమాలపై అర్జీలు వెల్లువెత్తాయి. పొదిలి చిన్న చెరువులను 79 ఎకరాలలో 20 ఎకరాలు ఆక్రమించి ప్లాట్లు వేసి విక్రయించడాన్ని ఎమ్మెల్యే తీవ్రంగా ఆక్షేపించారు. ఒక భూ బకాసురుడు ఈ దురాగతానికి పాల్పడ్డారని ఈ కార్యక్రమంలో వీటిపై సమగ్ర విచారణ చేసి ఆక్రమణదారుల జరిపి పంపాలన్నారు. టైలర్స్ కాలనీలో ఒక మహిళ తనకు చెందిన ఇంటిని రాముడు అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో దౌర్జనంగా ఆక్రమించి గొడవ చేస్తున్నాడని అధికారులకు ఫిర్యాదు చేసింది. టిడిపి నాయకుడు సురేష్ ముగ్గురాళ్ల వాగు ఆక్రమణలపై అధికారులకు ఫిర్యాదు చేశారు.
👉గత 5 ఏళ్లలో వైసీపీ భూ మాఫియా ముఠా రాష్ట్రంలో వేలాది ఎకరాలు కొట్టేసింది..*డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి*
అధికారాన్ని అడ్డుపెట్టుకుని గత 5 ఏళ్లు వైసీపీ భూ మాఫియా ముఠా రాష్ట్రంలో వేలాది ఎకరాలు కొట్టేసిందని, నేడు రెవిన్యూ సదస్సుల్లో వైసీపీ అరాచకాలు బయటికి వస్తున్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.శనివారం ప్రకాశం జిల్లా మర్రిపూడి, మండలం,అయ్యపురాజు పాలెం, పొదిలి మండలం పొదిలిలో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో మంత్రి స్వామి పాల్గొన్నారు.ఈ సందర్భంగా భూ సమస్యలపై వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరింఛి సంబంధిత సమస్యల గురించి సవివరంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి మాట్లాడుతూ….భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందన్నారు.ఎక్కువ శాతం అర్జీలు రెవెన్యూ, భూ సమస్యలపైనే వస్తున్నాయని, ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఉద్దేశ్యం తో రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. జిల్లాలోని అన్నీ రెవెన్యూ గ్రామాల్లో సదస్సులను నిర్వహిస్తామని చెప్పారు. అన్ని శాఖల అధికారులను రెవెన్యూ సదస్సులవద్ద అందుబాటులో వుంచి తక్షణం పరిష్కరించ దగ్గ ఆర్జీలను పరిష్కరిస్తూ, తక్షణం పరిష్కారం చూపలేనివి నిర్దిష్ట గడువులోపు పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. వారసత్వంగా వచ్చిన భూ హక్కు సంబంధిత వారసులకు అందిచడమే లక్ష్య మన్నారు. అవసరమైతే ఈ సదస్సుల నిర్వహణ గడువును పొడిగించడానికి కూడా తమ ప్రభుత్వం వెనుకాడదన్నారు. రెవెన్యూ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, సి.సి.ఎల్.ఏ. జనవరి మొదటి వారంలో మన జిల్లాలోని రెండు నియోజకవర్గాలలో పర్యటిస్తారని మంత్రి తెలిపారు. పొదిలి మండలంలో 9400 ఎకరాలను ఫ్రీహోల్డ్ చేస్తే వాటిలో 706 ఎకరాలలో అక్రమాలు జరిగాయన్నారు. తమపై కుటుంబాలు ఆధారపడిన విషయాన్ని గుర్తెరిగి అధికారులు అక్రమాలకు ఆస్కారం లేకుండా పనిచేయాలని మంత్రి చెప్పారు. వేణుగోపాల స్వామి భూముల వల్ల సర్వే నెం.251 లోని ప్రజల భూములు కూడా నిషేధిత జాబితాలో ఉన్నందున రిజిస్ట్రేషన్ చేయలేని సమస్య తలెత్తిందని, దీని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అన్యాక్రాంతమైన ఆరామక్షేత్రం విషయంలో సర్వే చేసి బి.సి. లకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పొదిలిలోని పృధులగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి భూముల్లో గోశాల నిర్మిస్తే అభ్యంతరం లేదని, ఇతర నిర్మాణాలు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా దేవాలయానికి ఆదాయం వచ్చేలా కళ్యాణ మండపం వంటి నిర్మాణాలు చేపట్టడాన్ని పరిశీలిస్తామన్నారు. వచ్చే మూడు ఏళ్లలోపే తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఈ దిశగా అన్ని జిల్లాల అధికారులతో ఉప ముఖ్యముఖ్యమంత్రి శ్రీ. కె.పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చర్చించినట్లు మంత్రి తెలిపారు. గతంలో జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రజలవద్దకే పరిపాలన తీసుకువచ్చిన ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు తాజాగా రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతోనే అధికారులను ప్రజల వద్దకు చేర్చి రెవెన్యూ సదస్సులు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. పొదిలి – మర్రిపూడి రోడ్డును 2018లో తమ ప్రభుత్వంలో మంజూరు చేయించామని, అనంతరం ప్రభుత్వం మారిందని,మళ్లీ తామ అదే కాంట్రాక్టరుతో మొదలు పెడుతున్నామని మంత్రి చెప్పారు.వచ్చే నెలలో నే పనులు ప్రారంభమవుతాయని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.
👉మార్కాపురంలో అట్టహాసంగా *జగనన్న జన్మదిన వేడుకలు..*మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలను శనివారం మార్కాపురం పట్టణంలో ఘనంగా నిర్వహించారు.*
*పార్టీ సమన్వయకర్త,మాజీ శాసనసభ్యులు అన్నా రాంబాబు ఆధ్వర్యంలో YSRP శ్రేణులు స్థానిక గడియారం స్తంభం కూడలిలో మరియు తూర్పు వీధిలో ఉన్న డా.వైఎస్ ఆర్ విగ్రహాలకు పూల మాలలు సమర్పించి,నివాళులు అర్పించారు.*
*రెండు చోట్లా భారీ కేకులను కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి జేజేలు పలుకుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.*
*ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్షేమం,అభివృద్ధిని చూపిన జగన్మోహన్ రెడ్డి వందేళ్లు వర్ధిల్లాలని అభిలషించారు.
*కార్యక్రమంలో మార్కాపురం మాజి శాసన సభ్యులు జంకే వెంకటరెడ్డి తదితర నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.*
**పొదిలిలో అట్టహాసంగా…*జగనన్న జన్మదిన వేడుకలు..*మాజీ ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పొదిలి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త,మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పార్టీ నాయకులు,కార్యకర్తలు,
అభిమానుల నడుమ కేక్ కట్ చేసి మరియు భోజనాలు ఏర్పాటు శుభాకాంక్షలు తెలిపారు.
రష్యాపై ఉక్రెయిన్ 9/11 తరహా దాడి .. “ఆర్జీవీకి వడ్డీతో కలిపి షాకిచ్చిన ఫైబర్ నెట్… ‘పుష్ప-2’ ఘటనపై పూసగుచ్చినట్లు వివరణ… రేవంత్ సంచలన వ్యాఖ్యలు! … వైసీపీ భూ మాఫియా ముఠా రాష్ట్రంలో వేలాది ఎకరాలు కొట్టేసింది : మంత్రి డోలా శ్రీ, ఎమ్మెల్యే కందుల ఆరోపణలు… మార్కాపురం పొదిలి లలో ఘనంగా జగనన్న జన్మదిన వేడుకలు
Recent Posts