👉చిక్కడపల్లి స్టేషన్ లో ‘పుష్ప’… ఆ మూడున్నర గంటల్లో ఏమి జరిగింది? అయితే… విచారణకు సహకరించలేదని పోలీసులు చెప్పే అవకాశం లేదని చెబుతున్నారు. ఆ అవకాశం ఇవ్వకుండా ఈ రోజు అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఇందులో భాగంగా.. పోలీసులు తనకు ఇచ్చిన నోటీసుల మేరకు అల్లు అర్జున్, తన లాయర్ తో కలిసి ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా… అల్లు అర్జున్ పోలీసు విచారణకు హాజరయ్యారు. ఉదయం 11:05 గంటల ప్రాంతంలో విచారణకు హాజరుకాగా.. మధ్యాహ్నం 2:47 గంటల వరకూ అంటే.. సుమారు 3:30 గంటల పాటు ఈ విచారణ జరిగింది! ఈ సమయంలో దాదాపు 20 ప్రశ్నలు అల్లు అర్జున్ పై పోలీసులు సంధించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా విచారణలో అల్లు అర్జున్ తో పాటు అతని తరుపు న్యాయవాది పాల్గొనగా.. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, ఏసీపీ రమేష్, సీఐ రాజు నాయక్ లు విచారించారని తెలుస్తోంది. ప్రధానంగా.. ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై స్పందించిన రోజు రాత్రి బెయిల్ పై వచ్చిన అల్లు అర్జున్ మీడియా ముందు మాట్లాడారు. ఈ సందర్భంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని.. తనకు చాలా బాదగా ఉందని వ్యాఖ్యనించారు.ఇదే సమయంలో… తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయారనే విషయం తనకు అప్పుడు తెలియదని.. ఆ విషయం తరువాత రోజు తెలిసి తాను షాక్ అయ్యాయని.. థియేటర్ లో ఉన్నప్పుడు తనవాళ్లు వచ్చి బయట క్రౌడ్ ఎక్కువగా ఉందని చెబితే తాను వెళ్లిపోయానని.. తనను థియేటర్ లో పోలీసులు ఎవరూ కలవలేదని చెప్పుకొచ్చారు!
అయితే… తొక్కిసలాటలో మహిళ చనిపోయారని, బాలుడు తీవ్రంగా గాయపడ్డారని.. పరిస్థితి అదుపు తప్పిందని.. ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ ని కలిసి చెప్పామని.. అయినప్పటికీ… సినిమా చూసిన తర్వాతే వెళ్తానని చెప్పారని.. ఏసీపీ రమేష్ వెల్లడించారు. సరిగ్గా ఇదే విషయం కేంద్రంగా ఈ రోజు విచారణ జరిగిందని అంటున్నారు.ప్రధానంగా.. తొక్కిసలాటలో రేవతి చనిపోయిందనే విషయం మీకు తెలుసు కదా..? తర్వాత రోజు వరకూ తెలియదని మీడియాకు ఎందుకు చెప్పారు..? థియేటర్ లో బెనిఫిట్ షోకి రావడానికి అనుమతి ఉందని మీకు ఎవరు చెప్పారు..? మీరు సుమారు 2:30 గంటల పాటు థియేటర్ లో ఉన్నది నిజం కాదా..? రోడ్ షో ఎందుకు చేశారు..? వంటి మొదలైన ప్రశ్నలు అడిగారని అంటున్నారు. అయితే.. వీటిలో పలు ప్రశ్నలకు అల్లు అర్జున్ సైలంట్ గా ఉన్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. దీంతో… ఈ విచారణలో భాగంగా… అల్లు అర్జున్ ఇచ్చిన సమాధానాలతో పోలీసులు సంతృప్తి చెందారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు అదే కీలకం కాబోతుందని అంటున్నారు. పోలీసులు సంతృప్తి చెందకపోతే…?: గత కొన్ని రోజులుగా సంధ్య థియేటర్ ఘటనపై ప్రభుత్వ పెద్దల కామెంట్లు, మంత్రుల విమర్శలకు తోడు పోలీసులు దూకుడు పెంచారని అంటున్నారు. ప్రధానంగా ఇటీవల మీడియా సమావేశం పెట్టిన అల్లు అర్జున్ చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలు ఆ ఘటన జరిగిన సమయంలో పోలీసుల వ్యవహారశైలిని తప్పుబట్టినట్లుగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే… అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని, తమ కస్టడీలోకి తీసుకోవాలని గనుక పోలీసులు భావిస్తే… ప్రధానంగా నిందితుడు విచారణకు సహకరించలేదని.. ఇటీవల ప్రెస్ మీట్ లో.. బాధితుడికి ఆర్థిక సాయం చేస్తున్నట్లు అల్లు అరవింద్ స్టేట్ మెంట్ ను పోలీసులు పరిగణలోకి తీసుకుని.. కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అయితే… విచారణకు సహకరించలేదని పోలీసులు చెప్పే అవకాశం లేదని చెబుతున్నారు. ఆ అవకాశం ఇవ్వకుండా ఈ రోజు అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. సుమారు 3:30 గంటలు విచారణలో పాల్గొన్నారు. అయితే… సమాధానాలు సరిగ్గా చెప్పలేదని కోర్టుకు చెప్పే అవకాశం మాత్రం పోలీసులకు ఎప్పుడూ ఉంటుందని అంటున్నారు. సమాధానాలు సరిగ్గా చెప్పలేదు అంటే ఏమిటి..? అనే విషయంలో పోలీసులు చెప్పే విషయాలపై న్యాయస్థానం కన్విన్స్ అవ్వాల్సి ఉంటుందని.. అలా కానిపక్షంలో బెయిల్ రద్దుకు కోర్టు అంగీకరించదని చెబుతున్నారు.మరి… విచారణలో అల్లు అర్జున్ చెప్పిన సమాధానాలతో పోలీసులు కన్వినెస్ అయ్యారా లేదా అనేది తెలియాల్సి ఉంది.ఇదే సమయంలో విచారణ నేటితో ముగిసిందా,లేక పార్ట్- 2 ఉంటుందా అనేది తెలియాల్సి ఉంటుందని అంటున్నారు.
👉అమిత్ షా దిష్టిబొమ్మ దహనం…
అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా..
డిసిసి అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఇలియాస్ ఆధ్వర్యంలో నిరసన…
కామారెడ్డి పట్టణంలో ఏఐసీసీ మరియు ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం..కామారెడ్డి పట్టణంలోని కమాన్ రోడ్డు వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా కైలాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ
డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అమిత్ షా కించపరిచడంతోపాటు ప్రతిపక్షాలను తక్కువ చేసే విధంగా వ్యవహరించారని అన్నారు.అమిత్ షా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దుచేసి అనర్హుడిగా ప్రకటించాలనీ,రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అమిత్‌షా అవమానిస్తే ఆయనకు మద్దతుగా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పోస్ట్‌లు పెట్టడంబాధాకరమన్నారు.
రాష్ట్రపతి ద్రౌపదిముర్ము వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.వెంటనే కేంద్రమంత్రులు పార్లమెంట్ ఎదురుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.
లేనియెడల ఆందోళనలు ఉదృతం చేసి బిజెపి నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.
👉పుష్ప-2′ తరహాలోనే తెలంగాణ సీఎంను దించబోతున్నారా..? 😲😲😲
ఈ సమయంలో తాజాగా మీడియా ముందుకు వచ్చిన హైకోర్టు సీనియర్ న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.’పుష్ప-2′ సినిమాలో తాను ఫోటో దిగడానికి అంగీకరించలేదనే కారణంతో రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్చేస్తాడు పుష్పరాజ్. దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేసి డబ్బులు సంపాదిస్తాడు..ఫైనల్ గా సీఎం పీఠాన్ని కదిలించి, తనకు నచ్చిన వ్యక్తికి ఆ కుర్చీ ఎక్కిస్తాడు.అయితే…తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డిపై అలాంటి ప్లానే నడుస్తుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ లాయర్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి.. తాజాగా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి విచారణలో పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఈ సమయంలో తాజాగా మీడియా ముందుకు వచ్చిన హైకోర్టు సీనియర్ న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇందులో భాగంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారని హీరో అల్లు అర్జున్ వెనుక ఓ మహా శక్తి ఉందని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ అరెస్టును కొంతమంది తమ రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకుంటున్నారని పుష్ప సినిమాలో చేసినట్లుగా రేవంత్ సర్కార్ ను కూల్చాలని చూస్తున్నారని అన్నారు.ఇందులో భాగంగా… గడిచిన 48 గంటలుగా ఈ వ్యవహారంపై పెద్ద కుట్ర జరుగుతుందని, అల్లు అర్జున్ వెనుక ఓ శక్తి ఉందని,రేపటి నుంచి వారం రోజుల్లో రేవంత్ సర్కార్ ను కూల్చడానికి ప్లాన్ చేశారని ఈ వారం రోజుల్లోనే బీఆరెస్స్, బీజేపీ లు తాము అనుకున్న పనిని చేయాలనుకుంటున్నాయని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
ఇదే సమయంలో అల్లు అరవింద్ ఫ్యామిలీని కాపాడటానికి
ప్రతిపక్షాలూ ఉన్నాయని.. కాని, బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సింది మాత్రం తెలంగాణ సమాజమేనని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
*ఈ సమయంలో.. సినిమా ఇండస్ట్రీ పక్షాన నిలబడిన వారు తెలంగాణ ద్రోహులుగా మిలిగిపోతారని.. బాధితులకు అండిగా నిలిచివారే నిజమైన తెలంగాణ వాదులని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతు..ఈ ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదు అయ్యి, జైలుకు వెళ్లి వచ్చారని.. ఆయనకు బెయిల్ కొద్ది రోజులకు మాత్రమే వచ్చిందని.. అది కూడా మరో రెండు మూడు రోజుల్లో రద్దు అవుతుందని అల్లు అర్జున్ మళ్లీ జైలుకు పోవడం ఖాయమని అడ్వకేట్ తెలిపారు!..**స్టేట్ కోఆర్డినేటర్ రజాక్ భాష
👉 మార్కాపురం లో గుప్త నిధుల కోసం గాలిస్తున్న గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు….
నల్లములలో గుప్తనిధులు ఉంటాయని పెట్టుబడి పెడితే 10 రెట్లు ఇస్తామని ఒక వ్యక్తిని మోసగించి 6 లక్షలు కాజేసిన గుప్త నిధుల ముఠా…వారి మాటలు విని మోసపోయి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వ్యక్తి….బాధితుడి ఫిర్యాదుతో 13 గంటల్లో కేసును చేదించిన పోలీసులు…
గుప్తనిధుల ముఠాలో ఆరు మంది నిందితులను అరెస్ట్ చేయగా మరొకరు పరార్.
👉 రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఎస్. కె. జైను లాబ్ధిన్ అన్నారు.మంగళవారంమండలంలోని సూదనగుంట మరియు తుమ్మగుంట గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది.అందులో భాగంగా ముందుగా మండల వ్యవసాయాధికారి షేక్ జైనులాబ్దిన్ రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వలన కంది పంటకు ఎలాంటి నష్టం వాటిల్లుతుందని రైతులను అడిగి తెలుసుకోవడం జరిగింది. వర్షాలు అధికమైతే కంది పంట పూత రాలి దిగబడి తగ్గుతుందని రైతులు తెలిపారు. కందిలో పూతరాలకుండా ఫ్లోనోఫ్లిక్స్ 2 మిలీ,లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలని తెలపడం అయినది.అలాగే ఇతర పురుగులు ఆశించకుండా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులు కోరడమైనది. ఎన్.పి.ఎస్. ఎస్. యాప్ కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన మొబైల్ యాప్ దీనిలో రైతు తన పంటను ఆశించిన ఫోటోను పెట్టినట్లయితే వెంటనే పురుగు నివారణ చర్యలు రైతుల మొబైల్ నందు కనపడటం జరుగుతుంది. తద్వారా రైతులు సరియైన మందులు సరైన మోతాదులో వాడటానికి వీలు పడుతుంది అని తెలియజేశారు.సి ఎల్ ఎస్ & పి.డి.ఎస్.ఎస్ యాప్ ఇది రాష్ట్ర ప్రభుత్వం వారు పైన తెలిపిన రెండు మొబైల్ యాప్ లను తీసుకురావడం జరిగింది. రైతులు తమ మొబైల్ ఫోన్ల నందు పై రెండు యాప్లను ఇన్స్టాల్ చేసుకుని పొలంలో చీడపీడలను ఫోటోల ద్వారా పంపినట్లయితే వాటిని శాస్త్రవేత్తలు పరిశీలించి పురుగు ఉధృతి ఏ స్థాయిలో ఉందో తెలుసుకొని నివారణ చర్యలను రైతులు మొబైల్ ఫోన్కు పంపడం జరుగుతుంది. అలాగే వ్యవసాయ శాఖ గ్రామ వ్యవసాయ సహాయకులు ఎప్పటికప్పుడు క్షేత్ర పరిశీలన చేసి పురుగులు మరియు తెగుళ్లు ఫోటోలను సి ఎల్ ఎస్ & మరియు పిడిఎస్ ఎస్ యాప్ నందు అప్ లోడ్ చేసి పురుగు ఉధృతిని గమనించి రైతులకు క్షేత్రస్థాయిలో సరైన నివారణ చర్యలు తెలపవలసిందిగా ఆదేశించడం అయినది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి షేక్ జైనులాబ్దీన్,గ్రామ వ్యవసాయ సహాయకులు ఆ గ్రామ రైతులు పాల్గొన్నారు.**జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రహిమాన్..
*👉 మున్సిపాలిటీ కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన*”అన్నా”*మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మార్కాపురం పురపాలక సంఘంలో పనిచేస్తున్న సుమారు 200మంది పారిశుధ్య కార్మికులకు మాజీ ఎమ్మెల్యే,వైసిపి సమన్వయకర్త అన్నా రాంబాబు పంపిణీ చేశారు.
*మాజీ ఎమ్యెల్యే,ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త, వైసిపి రాష్ట్ర నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సౌజన్యంతో దుస్తులను అందచేశారు.కార్యక్రమంలో రాంబాబు మాట్లాడుతూ పేద ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న జగనన్న ప్రజల ఆశీస్సులు,భగవంతుని దయతో వందేళ్లు వర్ధిల్లుతారాని చెప్పారు.కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ పరిధి లోని వైసిపి నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.
👉 పల్లెబోయిన పోలయ్య మృతికి నివాళులర్పించిన మాజి ఎమ్మెల్యే అన్నా*
*మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో పల్లెబోయిన పోలయ్య హార్ట్ స్టోక్ తో మృతి చెందగా పోలయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.పొలయ్య కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమనవ్యయకర్త అన్నా రాంబాబు
చిక్కడపల్లి స్టేషన్ లో ‘పుష్ప’… ఆ మూడున్నర గంటల్లో ఏమి జరిగింది? … పుష్ప-2’ తరహాలోనే తెలంగాణ సీఎంను దించబోతున్నారా..? …అమిత్ షా దిష్టిబొమ్మ దహనం… మార్కాపురం లో గుప్త నిధుల కోసం గాలిస్తున్న గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు… మున్సిపాలిటీ కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన*”అన్నా”
Recent Posts