👉యువతకు ఉద్యోగాలివ్వడం చేతకాని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఉద్యోగ నియామక దరఖాస్తు ఫారాలపైనా జీఎస్టీ వసూలు చేస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ మండిపడ్డారు.
* అగ్నివీర్‌తో సహా మిగిలిన ఉద్యోగ నియామకాల దరఖాస్తు ఫారాలపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తోందని ‘ఎక్స్’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కల్యాణ్ సింగ్ సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లోని పలు ఖాళీల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను షేర్ చేసి పోస్టు చేశారు.అందులో దరఖాస్తు ఫీజుతో పాటు దానిపై జీఎస్టీ వేసిన విషయాన్ని ప్రస్తావించారు.నోటిఫికేషన్‌లో అన్ రిజర్వ్‌డ్,ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీల వారికి 1,000, ఎస్సీ/ఎస్టీలకు రూ.600 దరఖాస్తు ఫీజు ఉండగా.. దానిపై జీఎస్టీ 18% ఉంది. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చెమటోడ్చి తమ పిల్లలను చదివిస్తున్నారని,కానీ బీజేపీ ప్రభుత్వం వారి కలలను కల్లలు చేస్తోందని ప్రియాంక విమర్శించారు. కేంద్రం పేదల ఆశలను పెట్టుబడిగా మార్చుకుంటోందని దుయ్యబట్టారు. ఫీజు కట్టి పరీక్షలు రాస్తే, చివరికి పేపర్ లీకేజీలతో అవినీతి జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
👉 వీఆర్వో వ్యవస్థ.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం…
వీఆర్వో వ్యవస్థ.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
రెవెన్యూ శాఖకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వీఆర్వో అధికారిని నియమించడానికి చర్యలు చేపట్టింది. దీంతో పాత ఉద్యోగులను మళ్లీ వీఆర్వో లుగా విధుల్లోకి తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నెల 28 వరకు వీఆర్వోలు,వీఆర్ఏల పునరుద్ధరణకు గడువు విధిస్తూ తెలంగాణ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.
👉అంబేద్కర్ ని అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో నిరసన ప్రదర్శన.
హైదరబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభమైన నిరసన ర్యాలీలో టిపిపిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ , ఏఐసీసీ నాయకులు కొప్పుల రాజు , ఎంపి అనిల్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షలు రోహిన్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, నూతి శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ట్యాంకుబండ్ వద్దకు బారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు.
👉ఏపీ ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఏసీబీ కేసు*
అగ్నిమాపక శాఖ డీజీగా పని చేసిన కాలంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని సంజయ్‌పై అభియోగం…
సంజయ్‌పై ఏసీబీ విచారణకు ఆమోదం తెలిపిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…పనులు జరగకపోయినా కాంట్రాక్ట్ సంస్థలకు నిధుల చెల్లింపులు…
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ సీఐడీ మాజీ చీఫ్ ఎన్ సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదైంది. గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీగా సంజయ్ పని చేసిన సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. దీనిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏసీబీ అధికారులు లేఖ రాశారు. సీఎస్ అనుమతి లభించడంతో సంజయ్‌పై కేసు నమోదైంది. ఏ 1గా సంజయ్, ఏ 2గా సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రా, ఏ 3గా క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.
అగ్నిమాపక శాఖలో నిరభ్యంతర పత్రాలు ఆన్‌లైన్‌లో జారీ చేసేందుకు అగ్ని – ఎన్వోసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్‌లు సరఫరా కాంట్రాక్టును సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రా సంస్థకు సంజయ్ అప్పగించారు. ఎలాంటి పనులు జరగకపోయినా ఆ సంస్థకు రూ.59.93 లక్షల బిల్లులు చెల్లించేశారు. సీఐడీ తరపున ఎస్సీ, ఎస్టీ, ఎట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్టును క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌కు ఇచ్చి రూ.1.19 కోట్లు చెల్లించారు.
అయితే సదస్సులు మొత్తం సీఐడీ అధికారులే నిర్వహించారు. క్రిత్వ్యాప్ సంస్థ అసలు సదస్సులే నిర్వహించకపోయినా బిల్లుల పేరిట దోపిడీ చేశారని, ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.2 కోట్ల మేర నష్టం కలిగించారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ప్రభుత్వానికి రెండు వేర్వేరు నివేదికలు సమర్పించింది. వాటి ఆధారంగా ఇప్పటికే సంజయ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయగా, తాజాగా ఏసీబీ కేసు నమోదు చేసింది. సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రా, క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ సంస్థల ఖాతాల్లో జమ అయిన సొమ్ము ఎవరు విత్ డ్రా చేశారు? అంతిమంగా ఎవరి వద్దకు చేరిందనే దానిపై ఏసీబీ విచారణ చేయనుంది.
👉 విషాదం.. పురిటినొప్పులతో గర్భిణీ మృతి.,
ఆంధ్రప్రదేశ్ : అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో మంగళవారం పురిటినొప్పులతో ఓ గర్భిణీ ప్రాణాలు విడిచింది. ఎస్.రాయవరం మండలం చిన్నగుమ్ముటూరుకు చెందిన దేవి (30), నానాజీది మతాంతర వివాహం. దేవికి మొదటి కాన్పు సాధారణంగానే జరిగింది. రెండో కాన్పు కోసం ఏరియా ఆస్పత్రిలో చేరారు. అయితే రాత్రి ఆమెకు విపరీతమైన నొప్పులు వచ్చాయి. ఆపరేషన్ చేయమని చెప్పినా వైద్యులు పట్టించుకోలేదు. దాంతో కడుపులో బిడ్డతో సహా గర్భిణీ మరణించారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధితులు ఆందోళనకు దిగారు.
👉 ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు రిసెప్షన్ కు హాజరై వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
👉 హైదరాబాదు అన్వయ కన్వెన్షన్ హాల్ లో మంగళవారం _భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీ.వీ సింధు వెంకట దత్త సాయి వివాహ మహోత్సవంలో పాల్గొనివధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపి,నూతన దంపతులను ఆశీర్వదించిన మాజీ క్రీడా శాఖ మంత్రి . ఆర్కే. రోజా .
👉 బన్నీ ఇంటి చుట్టూ పరదాలు ఏర్పాటు
ఒకవైపు చిక్కడపల్లి పీఎస్లో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతుండగా మరోవైపు ఆయన ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఆయన ఇంటి చుట్టూ పరదాలు ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. ఇటీవల బన్నీ ఇంటిపై ఓయూ జేఏసీ నాయకులు దాడి చేసి విషయం తెలిసిందే. ఈక్రమంలోనే మరోసారి దాడి జరగకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
👉 విషాదం..షూ లేస్‌తో ఉరి వేసుకుని బాలుడు ఆత్మహత్య..విశాఖ-అక్కయ్యపాలెం ఎన్జీవోస్ కాలనీలో ఘటన..
షూ లేస్‌తో ఉరి వేసుకున్న 13 ఏళ్ల బాలుడు
ఆన్‌లైన్ గేమ్స్, హర్రర్ వీడియోలు చూడవద్దని తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపంతో బాలుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
👉జమ్ముకశ్మీర్: పూంచ్ దగ్గర లోయలోపడ్డ ఆర్మీ వాహనం
*ఐదుగురు సైనికులు మృతి
*350 అడుగుల లోయలోపడ్డ ఆర్మీ వాహనం
*ప్రమాదం జరిగిన సమయంలో 18 మంది సైనికులు
👉 శ్రీతేజ్ కోలుకుంటున్నాడు. కేసు వాపసు తీసుకుంటానని చెప్పాను. సంధ్య థియేటర్ లోపల ఏమైందో నాకు కూడా తెలియదు. రేవతి, శ్రీతేజ్.. నేను, నా కూతురు థియేటర్‌లో రద్దీతో విడిపోయాం. శ్రీతేజ్‌కు ట్రీట్‌మెంట్ చేస్తామని ఆసుపత్రివాళ్లు చెప్పారు. పుష్ప ప్రొడ్యూసర్ 50 లక్షలు, అల్లు అర్జున్ 10 లక్షలు ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రూ.25 లక్షలు ఇచ్చారు. -శ్రీతేజ్ తండ్రి భాస్కర్
👉 కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం మరోసారి రచ్చరచ్చ అయింది. కార్పొరేషన్ వేదికపై మేయరు సురేశ్‌బాబు పక్కనే సీటు కేటాయించాలంటూ ఎమ్మెల్యే మాధవి, ఆమె మద్దతుదారులైన కార్పొరేటర్లు నిరసనకు దిగారు. గత భేటీ మాదిరిగా ఈసారి కూడా వేదికపై మేయరు కుర్చీ మాత్రమే ఏర్పాటు చేశారు. దీంతో కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తొలుత తన కుర్చీ కథ తేల్చిన తర్వాతే సమావేశం మొదలుపెట్టాలని పట్టుబట్టారు. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 8 మంది కార్పొరేటర్లు కూడా ఆమెకు మద్దతుగా నిల్చారు. మేయరుకు మద్దతుగా వైసీపీ కార్పొరేటర్లు పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. ఎమ్మెల్యేకు మద్దతుగా కార్పొరేటర్లు.. ‘అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా, మహిళలంటే చిన్నచూపా’ అనే ప్లకార్డులను ప్రదర్శించారు. మాధవికి మద్దతుగా ఉన్న కార్పొరేటర్లు ముక్కెర సుబ్బారెడ్డి, మానస, నాగేంద్ర, ఎ. లక్ష్మీశ్రీదేవి, కె. సూర్యనారాయణ, జఫ్రుల్లా, చల్లా స్వప్న, కట్టమీద అరుణలను మేయరు సస్పెండ్ చేశారు. సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. తిరిగి 3 గంటలకు మేయరు, కార్పొరేటర్లు వచ్చారు. అప్పటికే వేదికపై నిలబడి ఉన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘‘మేయరు, కార్పొరేటర్లకేమో చికెన్ ముక్కలు, బిరియాని.. పోలీసులకు, పాత్రికేయులకు పప్పన్నం పెడతారా?’’ అని మండిపడ్డారు. చివరకు అజెండాలో పొందుపరిచిన 52 అంశాలకు కార్పొరేటర్లంతా ఏకగ్రీవంగా ఆమోదించారంటూ తీర్మానం చేసి మేయరు సమావేశం ముగించారు.
👉 సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసానికి యత్నం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు.
విజయవాడ : ఏపీ క్రికెటర్ రికీ భుయ్‌కు స్పాన్సర్ చేయాలని, క్రికెట్ కిట్లు కొనుగోలు చేసేందుకు డబ్బులు పంపమంటూ ముఖ్యమంత్రి పీఏ పేరుతో పలువురికి వాట్సాప్ మేసేజ్‌లు పంపుతున్న బుడుమూరి నాగరాజు అనే మాజీ రంజీ క్రికెటర్‌పై విజయవాడ సైబర్ క్రైం పోలీసులు సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు.పెండ్యాల శ్రీనివాస రావు పేరుతో నాగరాజు మోసాలకు పాల్పడుతున్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం..పెండ్యాల శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. బుడుమూరి నాగరాజు తాను ముఖ్యమంత్రికి పర్సనల్ సెక్రటరీని అంటూ… శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుతో కలసి ఉన్న ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టి గతంలో పలువురికి ఫోన్లు చేశాడు. క్రికెటర్ రికీ భుయ్‌కు స్పాన్సర్ చేయాలని డబ్బులు పంపమనేవాడు. పలు కార్పొరేట్ కంపెనీలకు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్న విషయం శ్రీనివాసరావుకు తెలిసింది. నాగరాజుపై సైబర్ క్రైం పోలీసులకు శ్రీనివాసరావు ఫిర్యాదు చేయగా.ఈ ఏడాది జులై 3న కేసు నమోదైంది..
⭐మళ్లీ అదే తరహాలో.. నాగరాజు తాజాగా ఇదే తరహాలో శ్రీనివాసరావు పేరుతో క్రికెటర్ రికీ భుయ్‌కు స్పాన్సర్ చేయాలంటూ పలువురికి బ్యాంకు ఖాతా వివరాలు పంపి డబ్బులు వేయాలని కోరుతున్నాడు. విషయం బయటకు పొక్కడంతో అతనిపై చర్యలు తీసుకోవాలంటూ మరోసారి సైబర్ క్రైం పోలీసులకు శ్రీనివాసరావు ఫిర్యాదు చేయగా… కేసు నమోదు చేశారు..స్టాఫ్ రిపోర్టర్ రహిమాన్..
ఉద్యోగాలివ్వడం చేతకాని బీజేపీ ప్రభుత్వం .. ఉద్యోగ నియామక దరఖాస్తు ఫారాలపైనా జీఎస్టీ వసూళ్లపై మండిపడ్డ ప్రియాంకా గాంధీ … VRO వ్యవస్థ.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం…ఏపీ ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఏసీబీ కేసు… అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో నిరసన ప్రదర్శన (హైదరాబాద్)… ఏపీ ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఏసీబీ కేసు … అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో పురిటినొప్పులతో ఓ గర్భిణీ మృతి …షూ లేస్‌తో ఉరి వేసుకుని బాలుడు ఆత్మహత్య … కడప సర్వసభ్య సమావేశంలో మళ్లీ రచ్చ … సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసానికి యత్నం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు.
Recent Posts