👉 తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సినీ ప్రముఖులు
సీసీసీకి వచ్చిన దిల్‌రాజు, అల్లు అరవింద్..
మురళీమోహన్, నాగార్జున, త్రివిక్రమ్, హరీష్ శంకర్
కొరటాలశివ, వశిష్ఠ, సాయిరాజేష్, బోయపాటి, సి.కల్యాణ్
దిల్‌రాజు నేతృత్వంలో హాజరు 36 మంది సభ్యులు
21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు,11 మంది నటులు.సీసీసీకి హోంశాఖ సెక్రటరీ రవిగుప్తా,డీజీపీ జితేంద్ర👉ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యుత్ కోతలు!*
*వారంలోపే అర్థరాత్రి సమయంలో *రెండు సార్లు విద్యుత్ కోత*.. *బుధవారం అర్ధరాత్రి నుంచి ఇప్పటివరకూ విద్యుత్ సరఫరా లేని వైనం.*.
*పరీక్షల వేళ విద్యుత్ కోతతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు*.. *కొత్తగా పుట్టుకొస్తున్న సమస్యలపై విద్యార్థుల్లో ఆందోళన*.. *రాత్రి షిఫ్ట్ చేస్తున్న వారిపై అనుమానాలు**ట్రిపుల్ ఐటీలో అనుమానాస్పద చర్యలపై తల్లిదండ్రుల్లో గుబులు*
*కలెక్టర్ జోక్యం చేసుకోవాలని కోరుతున్న తల్లిదండ్రులు*..
👉 పల్నాడు జిల్లా.సత్తెనపల్లి.
⭐పేకాట స్థావరంపై సత్తెనపల్లి రూరల్ పోలీసుల దాడి
సత్తెనపల్లి రూరల్ మండల పరిధిలోని దూళిపాళ్ల గ్రామం జగనన్న కాలనీలో పేకాట స్థావరంపై సత్తనపల్లి రూరల్ పోలీసుల దాడి పేకాట రాయుళ్ల నుంచి ఏడు లక్షల 57 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్న సత్తెనపల్లి రూరల్ పోలీసులు..పోలీసుల దాడి లో సుమారు 13 మందిని అదుపులో తీసుకొన్నట్లుగా సమాచారం
👉వైఎస్ ఎఫెక్ట్.. వెంటాడిన పాపం.. సిరి కోల్పోయిన శ్రీలక్ష్మి!*
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే తొలిసారి ఒక మహిళా ఐఏఎస్ అధికారి సుదీర్ఘకాలం జైల్లో ఉండడం! కారణాలు ఏవైనా కూడా.. అవినీతి చుట్టూ అలుముకున్న పంజరంలో చిక్కిన శ్రీలక్ష్మి.. అక్రమాలకు ఒత్తాసు పలికారని.. అప్పట్లోనే సీబీఐ తేల్చింది. తర్వాత.. కేసులో అరెస్టు కావడం.. సుదీర్ఘ కాలం జైల్లోనే ఉండడం అప్పట్లో సంచలనాలు. అయితే.. ఇప్పుడు అవే శాపాలుగా మారాయి.
వైఎస్ రాజశేఖరరెడ్డి జమానాలో గనుల శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి చేసిన సంతకాలు.. తర్వాత కాలంలో ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టారు. ఏ కారణంతో కళ్లు మూసుకుని సంతకాలు పెట్టారో.. అని సీబీఐ తన చార్జిషీట్‌లో స్పష్టం చేసింది. అలా.. ఆమె చాలా రోజుల పాటు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత.. బయటకు వచ్చినా.. ఆమెకు తగ్గ పోస్టు అయితే దక్కలేదు. ఇక, రాష్ట్ర విభజన తర్వాత.. తొలి ఐదేళ్లపాటు అంటే 2019 వరకు తెలంగాణలోనే ఉన్నారు.
ఆతర్వాత.. ఏపీలో మళ్లీ వైఎస్ జగన్ పాలన ప్రారంభమైన తర్వాత.. ఆఘమేఘాలపై ఆమెను ఏపీకి తీసు కువచ్చారు. కీలక పదవిని కట్టబెట్టారు. మళ్లీ అక్రమాల ఆరోపణలే వినిపించాయి. ఇక, కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. శ్రీలక్ష్మి.. మళ్లీ పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఆమెకు ఇప్పటి వరకు కూటమి సర్కారు పోస్టింగు ఇవ్వలేదు. అయితే.. ఇప్పుడు అసలు కథ తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీరభ్ కుమార్ ప్రసాద్.. మరో వారంలో పదవీ విరమణ చేయనున్నారు.
మరి ఈయన తర్వాత.. అత్యంత కీలకమైన.. అధికార వర్గాన్ని, పాలనను కూడా ముందుకుతీసుకువెళ్లే.. స్థాయిలో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టును ఎవరికి ఇవ్వాలి? అనే ప్రశ్న వస్తే.. నీరభ్ కుమార్ తర్వాత.. స్థాయి, స్థానంలో శ్రీలక్ష్మే ఉన్నారు. ఇప్పుడున్న ఐఏఎస్ అధికారుల్లో ఆమే అత్యంత సీనియర్ అధికారి. దీంతో ఆమే తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కావాల్సి ఉంటుంది.
కానీ, ఆమె చేసుకున్న పాపం.. కేసుల్లో చిక్కుకున్న తీరు కారణంగా.. ఆమె పేరు పరిశీలనలోనే లేకుండా పోయింది. కనీసం.. ఆమె ఈ జాబితాలో ఎక్కడా లేకపోవడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. వైఎస్ ఎఫెక్ట్.. వెంటాడిన పాపం.. శ్రీలక్ష్మికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు లేకుండా చేసేసింది. జీవితంలో ఐఏఎస్‌లు.. ఈ పోస్టు కోసం ఎంతో శ్రమిస్తారన్న విషయం.. కలలు కంటారన్న విషయం తెలిసిందే.
👉 భూ సమస్యల పరిష్కారమే రెవిన్యూ సదస్సుల ధ్యేయం
కలెక్టర్ తమీమ్ అన్సారియా
భూ సమస్యల పరిష్కారమే రెవిన్యూ సదస్సుల ధ్యేయమని కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని బోడపాడు గ్రామంలో మార్కాపురం తహసిల్దార్ కే చిరంజీవి అధ్యక్షతన నిర్వహించిన రెవిన్యూ సదస్సు నందు ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా రైతుల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కువ శాతం అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే వస్తున్నాయ ని, ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం వాటి పరిష్కారానికి శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలి పారు. సాధ్యమైనంత వరకు అక్కడిక్కడే సమస్య లను పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అన్నిశాఖల అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులే ఆయా గ్రామాల వద్దకు వస్తున్నారు అని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, మార్కాపురం ఉప కలెక్టర్ సహదీద్ వెంకట త్రివినాగ్, వివిధ శాఖలకు చెందిన అధికారులు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
👉 క్రిస్మస్ సందర్భంగా నిరుపేదలకు ఆర్థిక సహాయం. ముగ్గురు మహిళలకు ఒక్కొక్కరికి 5000 చొప్పున అందించిన లాల్ ఫౌండేషన్. పొదిలి నగర పంచాయితీలోని నేతపాలెంలో జరిగే క్రిస్మస్ వేడుకలలో భాగంగా పొదిలి లాల్ ఫాండేషన్ వారు ప్రతి సంవత్సరం అనవాయితీగా ముగ్గురు నిరుపేదలను ఎన్నికచేసి ఒక్కొక్కరికీ ఐదువేల రూపాయల చొప్పున పదిహేను వేల రూపాయలను ఆర్ధిక సహాయంగా అందిస్తున్నారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ముగ్గురు మహిళలకు లాల్ ఫాండేషన్ తరపున షేక్ ఖాదర్ బాషా 5000 రూపాయలు వత్తున ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బండి అశోక్, అరిక రాము, బద్దిపూడి హాజరత్, నేతపాలెం యూత్ మరియు సంఘస్తులు పాల్గొన్నారు.
👉 చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలను చెరువులో నుండి వెలికితీసిన గజ ఈతగాళ్లు
ఎస్సై సాయికుమార్ ఆచూకీ మాత్రం లభించలేదు
చెరువు కట్ట వద్ద ఎస్సై సాయి కుమార్ పర్సనల్ కారు, పాదరక్షలు, నిఖిల్ పాదరక్షలు లభ్యం
ఘటనా స్థలంలో శృతి, నిఖిల్ మొబైల్ ఫోన్లు మాత్రమే ఉండి సాయి కుమార్ ఫోన్ లేకపోవడం స్విచ్చాఫ్ వస్తుండటంతో ఎక్కడికైనా పరారయ్యారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం, అడ్లూర్‌లో ఎల్లారెడ్డి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన మహిళా కానిస్టేబుల్ శృతి, బిక్కనూరు ఎస్సై సాయి కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్
👉 మైసూర్‌పాక్.. రసగుల్లా!.. ‘టచ్’లో ఉన్న వారి పేర్లు చూసి కంగుతిన్న పోలీసులు *శ్వేతాగౌడ*
అందమైన ఆమె సెల్‌ఫోన్.. పోలీసుల విచారణకు అవసరమొచ్చింది. ‘మీ సెల్‌ఫోన్ ఓసారి ఇస్తారా?’ అంటూ తీసుకుని పరిశీలిస్తే.. ఆమెతో ‘టచ్’లో ఉన్న వారి పేర్లు చూసి కంగుతున్నారు. మాజీ మంత్రి వర్తూరు ప్రకాశ్‌తో తనకున్న స్నేహాన్ని అడ్డుపెట్టుకుని వంచనకు పాల్పడిన శ్వేతా గౌడ విచారణను బెంగళూరు కమర్షియల్ స్ట్రీట్, భారతినగర ఠాణా పోలీసులు కొనసాగిస్తున్న క్రమంలో వెలుగు చూస్తున్న వాస్తవాలు విస్మయం గొలుపుతున్నాయి. ఆమె తన ఫోన్లో వర్తూరు ప్రకాశ్ పేరును మైసూరు పాక్‌గా నమోదు చేసుకుంది. మరో భాజపా నాయకుడి పేరును గులాబ్ జామూన్‌గా, ఇంకో స్థానిక నేత పేరును రసగుల్లాగా పెట్టుకుంది. ఇలానే మరికొందరికి ‘తీపి’ నామధేయాలు తగిలించింది. శ్రీమంతులను లక్ష్యంగా చేసుకుని నగదు సంపాదన కోసం ఆమె గాలం వేసేదని అనుమానిస్తున్నారు.
ఇప్పటికే వంచనలతో కూడగట్టుకున్న సొమ్ముతో కొనుగోలు చేసుకున్న విలాసవంతమైన కారులో తిరుగుతూ, పరపతి, పలుకుబడి ఉండేవారితో స్నేహాన్ని సంపాదించేది.
👉షేక్ హసీనాను అప్పగింత ఇష్యూ…మోడీ సర్కార్ ఏం చేస్తుంది ? ఆమె భారత్ కి వచ్చి దాదాపు అయిదు నెలలు కావస్తోంది. ఒకనాడు బంగ్లాదేశ్ ని విజయవంతంగా పాలిస్తూ భారత్ కి రాచ మర్యాదలతో గౌరవప్రదమైన అతిధిగా వచ్చిన మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ రోజు భారత్ లో తలదాచుకుంటున్నారు. ఆమె భారత్ కి వచ్చి దాదాపు అయిదు నెలలు కావస్తోంది. ఆమెని పదవీచ్యుతురాలిని చేసింది అక్కడ అంతర్యుద్ధం.అనంతరం తాత్కాలిక ప్రభుత్వం ఏలుబడిలోకి బన్ల్గాదేశ్ వెళ్ళిపోయింది. తాత్కాలిక ప్రభుత్వం భారత్ తో శత్రువు మాదిరిగా వ్యవహరిస్తోంది. బంగ్లాదేశ్ ఏర్పాటు వెనక భారత్ పోరాటం ఏమీ పెద్దగా లేదని తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్న వారు కానీ అక్కడ రాజకీయ నాయకులు కానీ అంటూ భారత్ పట్ల తమ ద్వేషాన్ని చాటుకుంటున్నారు.ఈ నేపధ్యంలో ఇపుడు అసలైన అగ్ని పరీక్షగా మోడీ సర్కార్ ముందు ఒకటి వచ్చి పడింది. భారత్ లో ఉంటున్న షేక్ హసీనాను తమకు అప్పగించాలని తాజగా బంగ్లాదేశ్ నుంచి ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది. దీనిని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహాదారు మహ్మద్ తౌహిద్ హుస్సేన్ అధికారికంగా ధృవీకరించారు. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాను వెనక్కి పంపాలని దౌత్య ప్రక్రియ ద్వారా భారత ప్రభుత్వానికి సందేశం పంపామని ఆయన చెప్పారు. తమ దేశానికి ఆమె కనుక వస్తే తాము మెను ప్రాసిక్యూట్ చేయాలనుకుంటున్నామని కూడా స్పష్టం చేశారు. అందువల్ల ఆమె బంగ్లాకు తిరిగి రావాలని డిమాండ్ చేస్తున్నామని కూడా చెప్పారు. మరో వైపు చూస్తే ఈ ఏడాది అక్టోబర్ 17న బంగ్లాదేశ్‌లోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ ఉత్తర్వును అమలు చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకుంటామని బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది. అంతే కాదు బంగ్లాదేశ్ భారత్ ల మధ్య ఉన్న పరస్పర అప్పగింతల ఒప్పందాల మేరకు మాత్రమే షేక్ హసీనాను తమ దేశానికి
అప్పగించాలని కోరుతున్నామని చెబుతోంది. ఈ అప్పగింతల ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య నేరస్తులను అప్పగించుకునేందుకు వీలుంది. 2013లో ఈ ఒప్పందం ఆనాటి యూపీఏ ప్రభుత్వం బంగ్లా ప్రభుత్వం ల మధ్య కుదిరాయి. ఆ సమయంలో బంగ్లాకు ప్రధానమంత్రిగా షేక్ హసీనా ఉన్నారు. మరి ఇపుడు అదే ఒప్పందం చూపించి ఆమెను బంగ్లాదేశ్ కి పంపించాలని కోరుతున్నారు.అయితే ఈ అప్పగింతల ఒప్పందంలో నేరస్తులు హత్యలు చేసిన వారు ఇతరమైన దారుణాలకు పాల్పడిన వారిని మాత్రమే పరస్పరం అప్పగించుకోవాలని ఉంది అని అంటున్నారు. అంతే తప్ప రాజకీయ నేరాలు లేక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఈ అప్పగింతల ఒప్పందం వర్తించదని అంటున్నారు. ఒప్పందంలోకి ఆర్టికల్ 6 ప్రకారం ఒకరిని అప్పగించలేని పరిస్థితులు కూడా ఆయా దేశాలు పేర్కొనవచ్చు అని అంటున్నారు. మరి దీని ప్రకారం చూస్తే భారత్ షేక్ హసీనాను వెనక్కి పంపించకపోవచ్చు అని అంటున్నారు. ఈ రోజున చూస్తే బంగ్లాదేశ్ భారత్ మీద విషం చిమ్ముతోంది. హసీనా పాలనలో భారత్ తో మంచి సంబంధాలు ఉండేవి. అందువల్ల భారత్ బంగ్లాలో పరిస్థితులు గమనిస్తోంది. అవి సర్దుబాటు అయ్యేలా చూడాలని అనుకుంటోంది. ఇక 2025 జనవరి 20న అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేయబోతున్నారు. ఆయన బంగ్లాదేశ్ వ్యవహారాల మీద ఫోకస్ పెడతారు అని అంటున్నారు. షేక్ హసీనా పట్ల ఆయనకు సానుభూతి ఉందని అంటున్నారు. దాంతో అమెరికా ఆలోచనలు అన్నీ చూసిన మీదట భారత్ దౌత్య పరంగా లేక ఇతర మార్గాల ద్వారా బంగ్లాదేశ్ విషయంలో నిర్ణయాలు తీసుకుంటుంది అని అంటున్నారు. అందువల్ల బంగ్లాదేశ్ కోరిన వెంటనే షేక్ హసీనాను ఇప్పట్లో పంపించకపోవచ్చు అని అంటున్నారు.చూడాలి మరి ఏమి జరుగుతుందో.
👉కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు.*
*ప్రస్తుతం సోనియా చికిత్స పొందుతున్నారు…తల్లి సోనియా వెంట ప్రియాంకా గాంధీ ఉన్నారు.*
*ఇదిలా ఉంటే గురు, శుక్రవారాల్లో కర్ణాటకలోని బెలగావిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి.*ఈ సమావేశాలకు సోనియా, ప్రియాంక హాజరుకావాల్సి ఉంది. *కేవలం రాహుల్ మాత్రమే సమావేశంలో పాల్గొన్నారు.*
👉ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా కలెక్టర్ తో కలిసి స్థల పరీశీలన చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్*
పల్నాడు జిల్లా నరసరావు పేట మండలం యలమంద గ్రామంలో సామాజిక ఫించన్ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుయలమంద గ్రామం నందు సభకు అనువైన స్థలం,హెలిపాడ్ మరియు పార్కింగ్ కు అనువైన స్థలాలను పరిశీలించిన ఎస్పీ సీఎం పర్యటన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ గారు అధికారులకు తగు సూచనలు చేసినారు.ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు , జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు , జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే తో పాటు నరసరావు పేట RDO పాల్గొన్నారు.
👉 నా వల్ల తప్పు జరిగితే హోంగార్డుకైనా సారీ చెబుతా: సీవీ ఆనంద్ఇటీవల నేషనల్ మీడియాపై పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తీవ్ర వ్యాఖ్యలు
సంధ్య థియేటర్ ఘటనకు మద్దతిస్తున్నారంటూ విమర్శలు
సీవీ ఆనంద్ పై నేషనల్ మీడియా ఆగ్రహం
క్షమాపణ చెప్పిన సీవీ ఆనంద్
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇటీవల జాతీయ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటనకు నేషనల్ మీడియా సంస్థలు మద్దతిస్తున్నట్టుగా ఉందని ఆయన అసహనం వెలిబుచ్చారు. అయితే తన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు రావడంతో ఆయన క్షమాపణ చెప్పారు.
దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ… చేసిన తప్పును అంగీకరించడం గొప్ప విషయమని, అదే మిమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టిందంటూ సీవీ ఆనంద్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. నరేశ్ అనే వ్యక్తి చేసిన ఆ ట్వీట్ ను సీవీ ఆనంద్ రీట్వీట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“ఎప్పుడైనా నేను తప్పు చేశానని భావిస్తే నా హోంగార్డుకైనా సరే క్షమాపణ చెప్పేందుకు వెనుకాడను. ఈ గుణం నాలో చిన్నప్పటి నుంచి ఉంది. బహుశా క్రికెట్ ఆడడం వల్ల వచ్చి ఉంటుంది.క్రికెట్ ఆడడం అనేది నన్ను మెరుగైన వ్యక్తిగా మలిచింది.నా అహాన్ని వదిలేయడం ద్వారా నేను అందరిలో ఒకడిగా ఉండాలనుకుంటాను.ఓ వ్యక్తిని పరిపూర్ణ మానవుడిగా మలిచేందుకు జట్టుగా ఆడే క్రీడలు చాలా ముఖ్యమని భావిస్తాను.కానీ కార్పొరేట్ తరహా విద్యా వ్యవస్థలో ఇటువంటి అవకాశం లేకుండా పోవడం దురదృష్టకరం” అని సీవీ ఆనంద్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
👉 *ప్రపంచ స్థాయి సినిమాలు తీయాలంటే భారీ ఖర్చు తప్పదని ఓ ఇంటర్వ్యూలో సినీ నటుడు మురళీమోహన్ అన్నారు. అదనపు షోలు వేయడం అన్ని చిత్ర పరిశ్రమల్లో ఉందని.. సినిమా విడుదలైన వారంరోజుల్లోనే ఖర్చులు రాబట్టుకోవాలన్నారు. *చిత్ర పరిశ్రమ సమస్యలు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.సీఎం సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.ఫస్ట్‌షోకు చిత్రయూనిట్ వెళ్లలేకపోతే ఆ చిత్రాన్ని అంచనా వేయలేమని అన్నారు.*
*ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యుత్ కోతలు! …*సోనియా గాంధీకి అస్వస్థత .. ”వైఎస్ ఎఫెక్ట్.. వెంటాడిన పాపం.. సిరి కోల్పోయిన శ్రీలక్ష్మి! … ”సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ..’నా వల్ల తప్పు జరిగితే హోంగార్డుకైనా సారీ చెబుతా: పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ .. ” పేకాట స్థావరంపై సత్తెనపల్లి రూరల్ పోలీసుల దాడి … *సినిమా విడుదలైన వారంరోజుల్లోనే ఖర్చులు రాబట్టుకోవాలట: మురళి మోహన్ …షేక్ హసీనాను అప్పగింత ఇష్యూ…మోడీ సర్కార్ ఏం చేస్తుంది … పేకాట స్థావరంపై సత్తెనపల్లి రూరల్ పోలీసుల దాడి
Recent Posts