*మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత…*ఎన్నికల విధానం, ప్రక్రియ పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది: కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే .. *సొంత గడ్డపై జగనన్నకు షాక్…*లంచాల కేసు దృష్టి మళ్లించడానికే జగన్‌ ఛార్టీల నాటకాలు:చీఫ్ విప్ జీవీ*…*సినీ పరిశ్రమపై సీఎం సానుకూలంగా ఉన్నారు-దిల్‌రాజు ..*ఘనంగా మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహ వేడుకలు … *పంచాయతీ సెక్రటరీ పై వైసీపీ నాయకుడు దాడి..*భవానీ దీక్షల సందర్భంగా విజయవంతంగా బందోబస్తు నిర్వహించిన పోలీసు కమిషనర్ కు సన్మానం … *కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి బుధవారం ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టిన ఐజీ ..*13 వేల జీతం..అక్రమ రీతిలో 21 కోట్లు సంపాదించాడు.

👉మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత.*
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం కన్నుమూశారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఆరోగ్యం తీవ్రంగా విషమించి, ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో ఆయనను హుటాహుటిన ఎయిమ్స్ లో చేర్పించారు. కాగా 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, ఈ ఏడాది ప్రథమంలో రాజ్యసభ నుంచి రిటైర్ అయ్యారు.
👉 ఎన్నికల విధానం,ప్రక్రియ పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది.. సీఈసీ నిష్పాక్షికతపై అనుమానాలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.. కీలక వ్యవస్థలను తన కనుసన్నల్లో ఉంచుకోవాలని బీజేపీ సర్కార్‌ యత్నిస్తోంది.. సీఈసీ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థను తన గుప్పిట్లో ఉంచుకోవాలని బీజేపీ చూస్తోంది.. దీనిపై పోరాటాన్ని కొనసాగిస్తాం- కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే
👉 సొంత గడ్డపై జగనన్నకు షాక్….పులివెందుల ప్రజా దర్బార్ లో పెండింగ్ పనులు బిల్లులు చెల్లించాలంటూ వైసిపి శ్రేణులు రచ్చ..పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు….
👉 మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు..హైదరాబాదులో టీజీ భరత్ కుమార్తె వివాహం…వధూవరులను ఆశీర్వదించిన ఏపీ సీఎం
కొత్త దంపతులకు శుభాకాంక్షలు..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ ఎంపీ టి జి వెంకటేష్ మనవరాలు, మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహానికి హాజరయ్యారు.ఈ వివాహం గురువారం నాడు హైదరాబాద్ లో జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి విచ్చేసిన చంద్రబాబు వధూవరులు ఆర్యా పాన్య, వెంకట శ్రీ నలిన్‌ను ఆశీర్వదించారు.వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న కొత్త దంపతులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. టీజీ భరత్ గత ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు.48 ఏళ్ల టీజీ భరత్ ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ లో పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు. టీజీ భరత్ తండ్రి టీజీ వెంకటేశ్ సీనియర్ రాజకీయవేత్త అని తెలిసిందే.
⭐ ఈ వివాహ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్,ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి,డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు,మెగాస్టార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు..

👉సినీ పరిశ్రమపై సీఎం సానుకూలంగా ఉన్నారు-దిల్‌రాజు
బెనిఫిట్‌ షోలు, టికెట్‌ ధరల ప్రస్తావన రాలేదు
కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు-దిల్‌రాజు
బౌన్సర్ల విషయాన్ని మాకు డీజీపీ చెప్పారు
హైదరాబాద్‌కు ఐటీ, ఫార్మా రంగాలతో పాటు..
సినీ పరిశ్రమ కూడా అంతే కీలకమని సీఎం చెప్పారు
FDCతో అనుసంధానం చేసుకుని..గద్దర్ అవార్డ్స్‌ ఇవ్వాలని అన్నారు-దిల్‌ రాజు సామాజిక సేవా కార్యక్రమాల్లో..
సెలబ్రిటీలు పాల్గొనాలని సీఎం చెప్పారు-దిల్‌రాజు
👉లంచాల కేసు దృష్టి మళ్లించడానికే జగన్‌ ఛార్టీల నాటకాలు:చీఫ్ విప్ జీవీ*…పల్నాడు జిల్లా.వినుకొండ.
సౌర విద్యుత్ ఒప్పందాల లంచాల కేసులో అమెరికాలో అడ్డంగా ఇరుక్కున్నది కాక వైకాపా అధ్యక్షుడు జగన్ పోరుబాట పేరిట దృష్టి మళ్లించేందుకు తిప్పలు పడుతున్నారని మండిపడ్డారు ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. అయిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు 9సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి, దిగిపోతూ కూడా భారం వేసి, ఆ భారంపై ఇప్పుడు దొంగ దీక్షలకు దిగడమే అందుకు నిదర్శమని ఆయన దుయ్యబట్టారు. క్విడ్‌ ప్రో కోను విద్యుత్ రంగానికి కూడా విస్తరించి అడ్డగోలుగా దోచుకున్న జగన్ రాష్ట్రానికే తీరని అన్యాయం చేశారని వాపోయారు. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ ఛార్జీలపై పోరుబాట అన్న వైకాపా నిర్ణ యంపై గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో జగన్ తీరును తూర్పార బట్టారు జీవీ. ఒక్కసారి అధికారం ఇచ్చిన పాపానికి ఒక్కొక్క కుటుంబంపై సగటున రూ. 4వేల కోట్లు భారం వేసింది, అయిదేళ్లలో మొత్తం రూ.20వేల కోట్లు భారం వేసింది మరిచిపోయారా అని నిలదీశారు.ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌కు మంగళం పాడింది, విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాల్ని 1.14 లక్షల కోట్లకు చేర్చి అప్పుల్లో ముంచి దివాళ తీయించింది… ఎవరని సూటిగా ప్రశ్నించారు. పరిశ్రమలకు పవర్‌ హాలిడేలు, రైతులకు వద్దన్నా మీటర్లు పెట్టి విద్యుత్ రంగాన్ని చిమ్మచీకట్లలోకి నెట్టిన వ్యక్తి మళ్లీ అదే ముసుగులో ఆందోళనలకు పిలుపునివ్వడాన్ని ఏమనాలో కూడా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు జీవీ. సరిగ్గా దిగిపోవడానికి రెండు నెలల ముందు కూడా పన్నెండున్నర వేల కోట్ల రూపాయల భారానికి సంబంధి ంచి నిర్ణయం తీసుకుని, ఆ నెపం కొత్తగా ఏర్పడే ప్రభుత్వంపైకి నెట్టేసిన చావు తెలివితేటలు అందరూ గమనిస్తున్నారని అన్నారు. ఇదే విద్యుత్‌ రంగంలో అయినవారికి దోచిపెట్టడంలో, ఆ దోపిడీలో లంచాల పేరిట అవినీతిచేసి అంతర్జాతీయస్థాయిలో పరువు తీసిన వ్యక్తి జగన్‌, అలాంటి వ్యక్తిని ప్రజలు ఇంకా నమ్ముతారని అనుకుంటున్నారని చురకలు వేశారు. జగన్ తీరు చూస్తుంటే ప్రజలపై ప్రేమ, విద్యుత్ ఛార్జీల విషయంలో బాధ కంటే ఈ పేరిట పార్టీలో మిగిలింది ఎవరో, మిగిలినవారిలోనూ తన మాట వినేది ఎవరో తెలుసుకోవాలన్న ఆత్రుతే కనిపిస్తోందన్నారు. మొన్నటికి మొన్న రైతు సమస్యల పేరిట పోరుబాట ఇలానే అట్టర్ ఫ్లాప్ అయిందని, అయినా ఇంకా దింపుడు కళ్లెం ఆశలతో విద్యుత్ పేరిట దీక్షలని సొంత పార్టీనేతలకే జగన్ పరీక్ష పెడుతున్నారన్నారు. రాయలసీమలో, సొంత జిల్లా కడపలో పట్టుమని పదిమందిని ఆందోళనలకు పోగు చేయలేని వ్యక్తి ఇంకా వైకాపా పార్టీని నడపడం, కాపాడుకోవడం కూడా అనుమానంగానే కనిపిస్తోందన్నారు ప్రభుత్వచీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు.
👉 పంచాయతీ సెక్రటరీ పై వైసీపీ నాయకుడు దాడి..
పల్నాడు జిల్లా ..వినుకొండ మండలం..కొప్పుకొండ గ్రామం పంచాయతీ సెక్రెటరీ ఎన్ శ్రీను పై గురువారం గ్రామ ఉప సర్పంచ్,వైసీపీ నాయకుడు కోళ్ల వీరాంజి దాడి చేసినట్టు సమాచారం.
👉 భవానీ దీక్షలు సందర్భంగా విజయవంతంగా బందోబస్తు నిర్వహించిన విజయవాడ పోలీసు కమిషనర్
విజయవాడ నగరంలో జరిగిన భవాని దీక్షల విరమణ ముగింపు సందర్భంగా గురువారం పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయం నందు ఇతర జిల్లాల నుండి భవాని దీక్ష విరమణ బందోబస్త్ నిర్వహించడానికి వచ్చిన పోలీస్ అధికారులతో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈ ఓ మాట్లాడుతూ…. ఈ భవాని దీక్షలు విజయవంతం చేయడం లో కీలకంగా వ్యవహరించిన పోలీస్ కమీషనర్ కు హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేసారు.ఈ భవాని దీక్ష యాప్ వలన సూదూర ప్రాంతాల నుండి వచ్చిన భవాని భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అమ్మవారి దర్శనం ముగించుకుని విరుముడిని సమర్పించుకున్నారు.ఈసారి ఎటువంటి చిన్న సంఘటనలు జరుగకుండా ప్రశాంత వాతావరణంలో కార్యక్రమం ముగిసిందని,భవాని దీక్ష విరమణ బందొబస్త్ కు వచ్చిన అధికారులందరికి కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ….. ఈ సారి భవాని దీక్షల కార్యక్రమం విజయవంతంఅవడానికి ముఖ్య కారణం హోల్డింగ్ ఏరియా, ఈవో గారికి మనం ఏది అయితే చెప్పామో దానికంటే బాగా హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేసారు కావున టెంపుల్ ఈ.ఓ.ని అధికారులను అభినందిస్తున్నాను, అదేవిధంగా ఈ క్రమంలో భవాని దీక్ష యాప్, చైల్డ్ మానిటరింగ్ సిస్టం యాప్, అస్త్రం మొదలైన యాప్ ల ద్వారా మానిటరింగ్ చేయడం వలన మరియు దర్శనాలను కొంచెం త్వరితగతిన ప్రారంబించడం వలన ఎక్కడా భవానీలు ఆగకుండా దర్శనం చేసుకున్నారు. ఈ సారి కొత్తగా గిరిప్రధక్షణ అనంతరం రధం సెంటర్ నుండి వినాయక టెంపుల్ కు వచ్చి క్యూలైన్ లో కలవాలి కాని ఈ సారి రధం సెంటర్ వద్ద ఓపెన్ చేసి క్యూలైన్ లలోకి పంపడం వలన ఇంకా చాలా వరకు భక్తుల రద్దీ అనేది ఎక్కడా కనిపించలేదు. కమాండ్ కంట్రోల్ లో అన్ని శాఖల సిబ్బంది అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వలన చాల విజయవంతం అయ్యింది. ఈ ఐదు రోజుల జరిగిన భవాని దీక్ష విరమణ నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్వా నగర ప్రజలకు ట్రాఫిక్ క్రమబద్దీకరిస్తూ, ఎక్కడా కూడా దొంగతనాలు జరుగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలకు అస్కారం లేకుండా అంకిత భావంతో, బాధ్యతగా విధులు నిర్వహించి, భవానిదీక్ష విరమణ కార్యక్రమానికి విజయ వంతంగా నిర్వహించుటలో తోడ్పాటు నందించిన దేవాదాయశాఖ, రెవిన్యూ, వివిధ ప్రభుత్వ శాఖలవారికి మరియు ప్రజా ప్రతినిధులకు, స్వచ్ఛంద సంస్థల వారికి, భవానీ భక్తులకు, మీడియా ప్రతినిధులకు మరియు అన్ని విభాగాల వారికి, వివిధ జిల్లాల నుండి వచ్చిన పోలీస్ అధికారులకు, లోకల్ పోలీసు అధికారులు మరియు సిబ్బందికి హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు.
అనంతరం ఇతర జిల్లాల నుండి భవాని దీక్ష విరమణ బందోబస్త్ నిర్వహించడానికి వచ్చిన పోలీస్ అధికారులకు మరియు లోకల్ అధికారులకు నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు కనకదుర్గ అమ్మవారి శేష వస్త్రం, ఫోటో మరియు లడ్డు ప్రసాదం అందించి అభినందనలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో డి.సి.పి.లు గౌతమీ షాలి, తిరుమలేశ్వర రెడ్డి,ఉమామహేశ్వర రాజు, ఎ.బీ.టి.ఎస్.ఉదయరా, కృష్ణమూర్తి నాయుడు , ఎస్.వి.డి.ప్రసాద్ ,ట్రైనీ ఐ. పి. ఎస్. మనీషా, ఏ.డి.సి.పి. గుణ్ణం రామ కృష్ణ ,ఏ. వి. ఎల్ ప్రసన్న కుమార్ , టెంపుల్ ఈ ఓ కె. ఎస్.రామారావు , బందొబస్త్ కు వచ్చిన ఇతర ఏ.డి.సి.పి.లు, ఏ.సి.సి.లు,ఇన్స్పెక్టర్లు,ఎస్. ఐ.లు,సిబ్బంది పాల్గొన్నారు.
👉 మ‌హారాష్ట్రకు చెందిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌గా చేస్తున్న హ‌ర్ష‌ల్ కుమార్ అనే వ్య‌క్తి భారీ మోసానికి పాల్ప‌డ్డాడు. 13 వేల జీతం తీసుకునే ఆ వ్య‌క్తి.. అక్ర‌మ రీతిలో 21 కోట్లు సంపాదించాడు. ఆ డ‌బ్బుతో అత‌ను ల‌గ్జ‌రీ కార్లు కొన్నాడు. ఇంకా త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌కు 4బీహెచ్‌కే ఫ్లాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఛ‌త్ర‌ప‌తి సంభాజిన‌గ‌ర్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కాంట్రాక్టు స్టాఫ్‌గా చేస్తున్న హ‌ర్ష‌ల్ కుమార్ అక్ర‌మార్జ‌న‌కు తెగించాడు. అత‌నితో పాటు ఉద్యోగం చేసే య‌శోదా శెట్టిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె భ‌ర్త బీకే జీవ‌న్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
23 ఏళ్ల హ‌ర్ష‌ల్ చాలా చాక‌చ‌క్యంగా డ‌బ్బును కాజేశాడు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు చెందిన ఓ పాత లెట‌ర్‌హెడ్ ద్వారా బ్యాంకుకు ఈమెయిల్ చేశాడు.అకౌంట్‌తో లింకున్న ఈమెయిల్ అడ్రాసును మార్చాల‌ని కోరాడు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ అకౌంట్‌తో స‌రిపోయే రీతిలో ఉన్న‌ కొత్త ఈమెయిల్ అకౌంట్ ఓపెన్ చేశాడు. కేవ‌లం ఒక్క అక్ష‌రం తేడా ఆ అకౌంట్ తెరిచాడు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ బ్యాంక్ అకౌంట్‌తో లింకున్న ఆ అడ్ర‌స్‌తో .. లావాదేవీల‌కు అవ‌స‌ర‌మైన ఓటీపీల‌ను హ‌ర్ష‌ల్ ఓపెన్ చేసేవాడు. ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ సౌక‌ర్యాన్ని యాక్టివేట్ చేశాడు. జూలై ఒక‌టి నుంచి డిసెంబ‌ర్ 7వ తేదీ వ‌ర‌కు బ్యాంకు ఖాతా నుంచి 21.6 కోట్లు కాజేసి వాటిని 13 బ్యాంకు అకౌంట్ల‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేశాడు.
ఆ డ‌బ్బుతో అత‌ను 1.2 కోట్లు ఖ‌రీదైన బీఎండ‌బ్ల్యూ కారు కొన్నాడు. 1.3 కోట్లతో మ‌రో ఎస్‌యూవీ తీసుకున్నాడు. 32 ల‌క్ష‌ల ఖ‌రీదైన బీఎండ‌బ్ల్యూ బైక్ కూడా కొన్నాడు. ఛ‌త్ర‌పతి సంభాజిన‌గ‌ర్ విమానాశ్ర‌యం వ‌ద్ద ఉన్న విలాస‌వంత‌మైన 4 బీహెచ్‌కే ఫ్లాట్‌ను గ‌ర్ల్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చిన‌ట్లు పోలీసులు విచార‌ణ‌లో గుర్తించారు. ఈ కేసులో మ‌రికొంత మంది ఉంటార‌ని పోలీసులు భావిస్తున్నారు. డ‌బ్బు లావాదేవీల‌కు చెందిన ఇత‌ర అకౌంట్ల‌ను ప‌రిశీలిస్తున్నారు. ల‌గ్జ‌రీ కార్ల‌ను ఇప్ప‌టికే సీజ్ చేశారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ అకౌంట్లో అక్ర‌మాలు జ‌రుగుతున్న‌ట్లు ఓ అధికారి గుర్తించి ఫిర్యాదు ఇవ్వ‌డంతో హ‌ర్ష‌ల్ బాగోతం బ‌య‌ట‌కు వ‌చ్చింది.
ప్ర‌ధాన నిందితుడు హ‌ర్ష‌ల్ ప్ర‌స్తుతం పరారీలో ఉన్నాడు. మ‌రో ఇద్ద‌ర్ని ఇప్ప‌టికే అరెస్టు చేశారు. కొన్ని బంగారు ఆభ‌ర‌ణాల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
👉 వికారాబాద్ జిల్లా: పరిగిలో తెలంగాణ ఐజీ సత్య నారాయణ ప్రెస్ మీట్
*కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి బుధవారం ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టిన ఐజీ
నరేందర్ రెడ్డికి కోర్టు ఇచ్చిన బెయిల్ షరతులతో కూడినది
ఆయనపై నమోదైన కేసు ఆక్రమమని నరేందర్ రెడ్డి బుధవారం ప్రెస్ మీట్లో చెప్పాడు. అది తప్పు… విచారణ అనంతరం అన్ని ఆధారాలతోనే కేసు నమోదు చేశాం..దాడికి ముందు రోజే పట్నం నరేందర్ రెడ్డి, సురేష్ లు దాడి చేయాలని పథకం పన్నారు..సురేష్ కావాలనే కలెక్టర్ దృష్టి మరల్చి గ్రామంలోకి తీసుకెళ్ళాడు..సురేష్ మాటలు నమ్మి మంచి జరుగుతుందని సదుద్దేశంతో కలెక్టర్ గ్రామంలోకి వెళ్ళారు..పథకం ప్రకారం సురేష్ అనుచరులు రాళ్ళు కర్రలతో కలెక్టర్, అధికారులపై దాడి చేశారు.. కలెక్టర్ సౌమ్ముడు… పోలీసులు వస్తామంటే వద్దన్నాడు
దాడికి వారం ముందే పట్నం నరేందర్ రెడ్డి ఆయా గ్రామాల్లో తిరిగి దాడి చేయాలని రెచ్చగొట్టారు..అది సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యింది..సురేష్, మహేష్ లు ఇద్దరు ఆ తర్వాత అధికారులపై దాడి చేయాలని పథకం పన్నారు..ఆ పథకం ప్రకారమే దాడి చేశారు…
అక్రమంగా కేసులు పెట్టారు అనేది తప్పు… నిఘా వైఫల్యం కానేకాదు..అన్ని జాగ్రత్తలు తీసుకొని పోలిసు బందోబస్తు తోనే అక్కడికి వెళ్ళాం..దాడిలో పాల్గొన్న నిందితులను ఎవ్వరినీ పోలీసులు కొట్టలేదు.. జడ్జి ముందు కూడా చెప్పలేదు..నరేందర్ రెడ్డి తన ఫోన్ పాస్వర్డ్ చెప్పకుండా విచారణకు సహకరించడంలేదు..
సురేష్ తన సిమ్ కార్డు విరిచి ఏదో వాహనంలో పడేశానని చెబుతున్నాడు..ఇద్దరు పోలీసుల విచారణకు సహకరించడం లేదు..నిందితుడికి బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్ళిన ఘటనలో జైలు అధికారులపై చర్య తీసుకోవడం జరిగింది
సురేష్ సంబంధించిన కొన్ని ఆడియోలు తమ వద్ద ఉన్నాయి.. సమయమొచ్చినప్పుడు బయటపెడుతాం
దాడికి ముందు రోజు లిక్కర్ ఎక్కడి నుండి వచ్చింది.. దాడి ప్లాన్ లో ఎవరెవరు అనేది దర్యాప్తు చేస్తున్నాం
అన్ని కోణాల్లో దర్యాప్తు చేశాకే ఎఫ్ఐఆర్ లో పేర్లు చేర్చాం..
ప్రెస్ మీట్ పెట్టి కోర్టులో విచారణ లో ఉన్న కేసు పై నరేందర్ రెడ్డి మాట్లాడటం తగదు..పోలీసులు శాంతిభద్రతల కోసమే పని చేస్తారు..ఈ కేసులో అమాయకులు ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు..
👉మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల మాగుంట సంతాపం*..భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణ వార్త నాకు ఎంతో దిగ్భాంతి కలిగించినది.
మన్మోహన్ సింగ్ భారత ప్రధాని గా ఎన్నో గొప్ప సేవలు అందించి, భారత దేశాన్ని ఇటు ప్రగతి బాట లోను, అటు అభివృద్ధికి గాను ఎంతగానో కృషి చేశారు. వారు ప్రధాని గా ఉన్నప్పుడు నేను పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్ లో ఉండడం, వారి నుంచి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నాను. నాతో మరియు నా సహచర పార్లమెంట్ సభ్యులతో చాలా కలివిడిగా ఉండేవారు.
వారి కుటుంబానికి మా కుటుంబానికి ఎంతో సానిహిత్యం ఉంది, మంచితనానికి -మానవత్వానికి ఆయన నిలువెత్తు నిదర్శనం..ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రఘాడ సానుభూతి తెలియజేయుచున్నాను.

ఇట్లు
మాగుంట శ్రీనివాసులురెడ్డి
పార్లమెంటు సభ్యులు, ఒంగోలు

7k network
Recent Posts

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి