👉మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం*…
*మన్మోహన్ సింగ్ మృతి ఈ దేశానికి తీరని లోటు *దేశం ఓ విశిష్ట వ్యక్తిని కోల్పోయింది ప్రధాని మోదీ*….
*ఒక గొప్ప గురువును కోల్పోయాను- ఎంపీ రాహుల్ గాంధీ*…సీఎం రేవంత్ రెడ్డి…
*భారత దేశ అభివృద్ధిలో మన్మోహన్ సింగ్ పాత్ర మరవలేం- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్*…
*దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం- సీఎం చంద్రబాబు*..*మన్మోహన్ సింగ్ నిజాయితీ తరతరాలకు ఆదర్శం- ఎంపీ ప్రియాంక గాంధీ*
*దేశం ఇప్పటివరకు సృష్టించిన రాజనీతిజ్ఞులలో మన్మోహన్ సింగ్ ఒకరు .. మెగాస్టార్ చిరంజీవి*
👉మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సానుభూతిని తెలియజేశారు. నివాళులు అర్పించిన వారిలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు,ఎంపీలు,ప్రజాప్రతినిధులు ఉన్నారు.
***స్టేట్ కోఆర్డినేటర్ రజాక్ భాష
👉మంత్రులుగా ‘నాగబాబు, పల్లా’???..జనవరి 8న ప్రమాణస్వీకారం.!!..*ఇద్దరు ‘యువ మంత్రులు’ అవుట్.?_
ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్దీకరణకు *సీఎం చంద్రబాబు* సిద్దమవుతున్నారు..ఏపీ కేబినెట్లో ప్రస్తుతం ‘ఒకే ఒక్క’ మంత్రి పదవి ఖాళీగా ఉంది. దీన్ని *నాగబాబు* కు ఇచ్చేందుకు చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించారు.
మరో పదవిని అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు *పల్లా శ్రీనివాస్* కు మంత్రి పదవి ఇచ్చేందుకు … ‘చంద్రబాబు’ సిద్దమవుతున్నారు.కేబినెట్లో ఉన్న మంత్రుల్లో అంచనాలను అందుకోని *ఇద్దరిపై వేటు* కు సిద్దమైనట్లు తెలుస్తోంది. వారిలో *వాసంశెట్టి సుభాష్,కొండపల్లి శ్రీనివాస్* పేర్లు బలంగా వినిపిస్తున్నాయి..*మంత్రివర్గ* విస్తరణ తర్వాత ఇక ఎపీ ను అగ్రస్థానంలో నిలిపేందుకు గాను, అభివృద్ధి లో వేగంగా…పరుగులు తీసేందుకు *చంద్రబాబు* సమాయత్తం కాబోతున్నారు..
👉అన్నమయ్య జిల్లాలో ఉద్రిక్తత*
➤ ఎంపీడీవో జవహర్‌బాబుపై వైసీపీ నేతల దాడి..
➤ చాంబర్ తాళాలు ఇవ్వలేదని దాడి చేసిన సుదర్శన్‌రెడ్డి..
➤ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంపీడీవో జవహర్‌బాబు..
➤ వైసీపీ నేత సుదర్శన్‌రెడ్డి, అనుచరుల అరెస్ట్..
*అనంతపురం జిల్లాలో గంజాయి ముఠా అరెస్ట్*
➤ అనంతపురంలో 10 మంది గంజాయి ముఠా అరెస్ట్..
➤ 4 కిలోలకు పైగా గంజాయి స్వాధీనం..
➤ గంజాయి పీల్చి ఇంట్లో దొరకకుండా ఉండేందుకు వాడే మౌత్ ఫ్రెషనర్, ఐ డ్రాప్స్, ఖాలీ ఓసీలు స్వాధీనం..
➤ మహారాష్ట్ర షోలాపుర్ నుంచి తక్కువ ధరకు గంజాయి దిగుమతి..
➤ కాలేజ్ విద్యార్థులే టార్గెట్ గా గంజాయి బ్యాచ్ విక్రయాలు..
👉 ఆత్మహత్యలా… హత్యలా…!
ముగ్గురి ఆత్మహత్యల కేసులో వీడని మిస్టరీ…
కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు…
ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మరణాలపై అనేక అనుమానాలు….మృతుల సెల్ ఫోన్ డాటా, వాట్స్ ఆప్ చాటింగ్స్ పరిశీలిస్తున్న పోలీసులు….ఉదయం 11 గంటలకు బైక్ పై బయలుదేరిన నిఖిల్….ఆపరేటర్ నిఖిల్ తన బైక్ ని ఎక్కడ పెట్టాడనేది సస్పెన్షన్…మృతదేహాలపై స్వల్ప గాయాలు…కీలకంగా మారనున్న ఎస్ఐ సాయికుమార్ భార్య వాంగ్మూలం…ఇవాళ ఎస్ఐ సాయికుమార్ స్వగ్రామం కు దర్యాప్తు బృందం…
భిక్కనూరు,కామారెడ్డి బిబిపేట, చెరువు సమీపంలోని హోటల్ లలలోని సీసీ ఫుటేజ్ లను పరిశీలించనున్న దర్యాప్తు బృందం…కీలకం కానున్న పోస్టుమార్టం రిపోర్టులు….విచారణకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సదాశివనగర్ సీఐ సంతోష్, ఎస్సై రంజిత్ లతో కూడిన ప్రత్యేక బృందం ఏర్పాటు.
👉ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగా కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా తరలివస్తున్నాయి. తాజాగా రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి ఖరారైంది. రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సిద్ధమైన బీపీసీఎల్ ఏపీలో దశలవారీగా రూ.95,000ల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
👉 మచిలీపట్నంలో దొంగ నోట్ల కలకలం 😲😲😲
మచిలీపట్నం వైన్ షాప్ లో మద్యం కొని దొంగ నోట్లు ఇచ్చారని చిలకలపూడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైన్స్ యాజమాన్యం. 500 రూపాయల దొంగ నోట్ల మొత్తం విలువ 12 వేలు…. దొంగ నోట్ల కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం….. వీరికి రాజకీయ పార్టీలకు చెందిన ద్వితీయశ్రేణి సభ్యులు పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారా?…నోట్ల మార్పిడి భారతదేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తోంది…దొంగ నోట్లో మార్పిడి వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని వ్యాపారస్తులు డిమాండ్.
👉 తండ్రి తీసుకున్న డబ్బులకు పోలీసులు తనను వేధిస్తున్నారని ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థిని
తండ్రితో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండకపోయినా.. డబ్బుల కోసం తననే వేధిస్తున్నారని సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్న దీప్తి
హైదరాబాద్లోని – నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో నాచారం సరస్వతి నగర్ కాలనీకి చెందిన పులివర్తి సంగీత్ రావు కుమార్తె దీప్తి (29) ఐఐసీటీలో పీహెచ్‌డీ చేస్తోంది.
వీరి ఇంటి ఎదురుగా ఉండే కానిస్టేబుల్ అనిల్.. తన భార్యకు ఐఐసీటీలో ఉద్యోగం ఇప్పిస్తానని సంగీత్ రావు 2022లో రూ.15 లక్షలు తీసుకొని మోసం చేశాడని నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
దీంతో అనిల్ కి రూ.8 లక్షలు తిరిగి ఇచ్చినట్లు దీప్తి కుటుంబ సభ్యులు తెలిపినప్పటికీ డబ్బుల కోసం తన కూతురు దీప్తిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తప్పుడు కేసులు పెట్టారని సంగీత్ రావు ఆరోపణ.
కేసు విత్ డ్రా చేసుకోవాలంటే రూ.35 లక్షలివ్వాలని అనిల్ మామ సోమయ్య, భార్య అనిత, అనిత సోదరుడు సైదులు దీప్తిని డిమాండ్.
ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని.. డబ్బు తన తండ్రి తీసుకున్నాడని, ఆయన తమతో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండడం లేదని సమాధానం చెప్పింది.
అయినా ఆమె ఎంత చెప్పినా వినకుండా కేసులు పెట్టి పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు పిలిచి బెదిరించిన అనిల్.
దీంతో మనోవేదనకు గురై ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న దీప్తి.
తాను ఇంత కఠిన నిర్ణయం తీసుకోవటానికి పోలీసులు వేధింపులే కారణమని ఆరోపిస్తూ మొబైల్లో వీడియో రికార్డ్ చేసుకొని ఆత్మహత్య చేసుకున్న దీప్తి.
👉ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై కొనసాగుతున్న సస్పెన్స్.*
ఇప్పటికే పెంచిన ఛార్జీల ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచిన అధికారులు.
ప్రతి ఏడాది ఆగస్ట్ 1న ఛార్జీల పెంపు నిర్ణయం అమలు.
ఈ ఏడాది జనవరి 1 నుంచి పెంపు నిర్ణయం వాయిదాకు ప్రభుత్వానికి వినతులు. వచ్చే సోమవారం రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై క్లారీటీ వచ్చే అవకాశం.
👉 సైలెంట్‌గా సినిమా చూసి వస్తే ఈ ఘటన జరిగి ఉండేది కాదు.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై..నాలుగు కార్లలో వెళ్లాలని, రోడ్ షో చేయాలని అనుకోవడమే ఇలాంటి వాటికి కారణమన్న తమ్మారెడ్డి..
గతంలో చిరంజీవి, బాలకృష్ణ వంటివారు హడావుడి లేకుండా అభిమానులతో కలిసి చూశారన్న నిర్మాత..
కలెక్షన్లతో కాకుండా పెర్ఫార్మెన్స్ పరంగా తెలుగు వారికి గర్వకారణంగా నిలవాలని హీరోలకు సూచన..
హీరోలు కూడా మనుషులేనని అనుకుంటే ఇలాంటి ఘటనలు జరగవన్న భరద్వాజ…
పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. హీరోలు ఎక్కడికి వెళ్లినా నాలుగు కార్లలో వెళ్లాలని, రోడ్ షో చేయాలని భావిస్తున్నారని, ఈ మధ్య కాలంలో ఇలాంటివి సర్వ సాధారణంగా మారిపోయాయని విమర్శించారు. సైలెంట్‌గా వెళ్లి సినిమా చూసి వచ్చేస్తే ఇలాంటి ఘటనలు జరగడానికి ఆస్కారం ఉండదని అభిప్రాయపడ్డారు.
గతంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలు కూడా అభిమానులతో కలిసి సినిమాలు చూసేందుకు వెళ్లేవారని, కాకపోతే వారు తగిన జాగ్రత్తలు తీసుకునే వారని గుర్తుచేశారు. వారు సైలెంట్‌గా ఏదో ఒక మల్టిప్లెక్స్‌కు వెళ్లి సినిమా చూసేవారని, బయటకు వచ్చే సమయంలో అక్కడున్న వారితో కాసేపు ముచ్చటించేవారని తెలిపారు. సింగిల్ స్క్రీన్ థియేటర్‌కు వెళ్లాల్సి వచ్చినా ఇదే ఫాలో అయ్యేవారని తెలిపారు.
సోషల్ మీడియా వల్ల ఏ హీరో ఎక్కడ ఉంటున్నాడన్న విషయం ఇప్పుడు అభిమానులకు తెలిసిపోతోందని తమ్మారెడ్డి అన్నారు. దీంతో వారిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నట్టు చెప్పారు. ఫ్యాన్స్, ప్రజా శ్రేయస్సు కోసం కూడా హీరోలు ఆలోచించాలని సూచించారు. హీరోలు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా సిద్ధమవుతున్నారని తెలిపారు. దీంతో టికెట్ రేట్లు పెంచి ప్రజల మీద భారం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్షన్ల పరంగా కాకుండా పెర్ఫార్మెన్స్ పరంగా తెలుగు వారికి గర్వకారణంగా నిలవాలన్న విషయాన్ని హీరోలు అర్థం చేసుకోవాలని కోరారు. హీరోలు కూడా సాధారణ మనుషులేనని భావిస్తే ఇలాంటి హడావుడి ఉండదని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు.
👉 రూ. 15 లక్షలు మద్యం పట్టివేత
• డ్యూటీ ఫ్రీ మద్యం ముసుగులో లిక్కర్ వ్యాపారం.
• పట్టుబడ్డ కానిస్టేబుల్ హోంగార్డ్.
• మూడు కార్ల స్వాధీనం..• అయిదుగురుపై కేసు నమోదు
శంషాబాద్ ఎయిర్పోర్టులో పనిచేస్తున్న కానిస్టేబుల్ హోంగార్డులు కలిసి డ్యూటీ పై లిక్కర్ను ఎక్సైజ్ బృందం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి.. నూతన సంవత్సరం వేడుకల కోసం భారీగా కొనుగోలు చేసిన రూ. 15 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
వీఐపీలు వచ్చినప్పుడు ప్రోటోకాల్ లో భాగంగా విధులు నిర్వహించినటువంటి ఈ కానిస్టేబుల్, హోంగార్డు మరి కొంతమంది కలిసి ఎయిర్పోర్టులో ఉండే డ్యూటీ ఫ్రీ లిక్కర్ దుకాణాల నుంచి మద్యాన్ని పలువురు ప్యాసింజర్ల పేరుతో కొనుగోలు డ్యూటీ ఫ్రీ మద్యం బాటిలను అమ్మకాలు చేపడుతూ లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టినటువంటి ఎక్సైజ్ డిటిఎఫ్ పోలీసులు డ్యూటీ ఫ్రీ మద్యం అమ్మకాలు జరుపుతుండగా మూడు కార్లను, వాటిలో లభించిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పట్టుకున్న మద్యం విలువ రూ. 15 లక్షలు ఉంటుందని శంషాబాద్ ఎక్సైజ్ సూపర్డెంట్ కృష్ణప్రియ తెలిపారు.
ఇలా చేయడం వల్ల ఎక్సైజ్ ఆదాయానికి చాలా గండి పడుతుందని సమాచారం మేరకు ఈ మద్యం బాటీలను పట్టుకున్నట్లు తెలిపారు.
👉గుంటూరు…తెనాలి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోర్టుకు హాజరు*
ఎన్నికల సమయంలో అన్నాబత్తుని శ్రావణ్ కుమార్ తెనాలిలో ఓటరుపై దాడి కేసు విషయం లో నేడు గుంటూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు-2కు హాజరు…
*2025 జనవరి16వ తారీకు మరల కోర్టుకు హాజరు కావాలని అన్నాబత్తుని శివకుమార్ ఆదేశించిన జడ్జి*
18మంది ముద్దాయిలతో సంతకాలు చేయించి వాయిదా వేసిన కోర్టు …
👉 చనిపోయిందని బన్నీకి చెప్పినా సినిమా చూశాకే వెళ్తానన్నాడు: ఏసీపీ రమేశ్..
TG: తొక్కిసలాట తర్వాత థియేటర్ నుంచి వెళ్లిపోవాలని అల్లు అర్జున్కు ఎంత చెప్పినా వినిపించుకోలేదని చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ వెల్లడించారు. ‘ఒక లేడీ చనిపోయింది, పిల్లాడు గాయపడ్డాడని అల్లు అర్జున్ మేనేజర్కు చెప్పాం. ఆయన మమ్మల్ని బన్నీతో మాట్లాడనివ్వలేదు. కాసేపటికి నేనే వెళ్లి బన్నీకి చెప్తే సినిమా చూశాకే వెళ్తానన్నాడు. 10-15 ని. టైమిచ్చాం. ఆ తర్వాత DCPతో కలిసి హీరోను బయటకు తీసుకువచ్చాం’ అని తెలిపారు.
💥లా కాలేజీలో ర్యాగింగ్ భూతం.💥*నెల్లూరు…*
👉పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన విద్యార్థి సంఘం నాయకుడే నీచ ప్రవర్తన*
👉న్యాయ దేవత వారసులుగా ఇప్పటి నుండే క్రమశిక్షణ,సమాజం పట్ల బాధ్యత,న్యాయం పక్షం నిలిచే మంచి పౌరులుగా వుండాలిసింది పోయి క్రూరంగా పోకిరీలు,వీధి రౌడీలు లాగా వుంటే రేపు వీరు లాయర్లు జడ్జీలు ఐతే పరిస్థితి ఏంటి?*
👉విద్యార్థి సంఘం నాయకుడికి రాజకీయ అండ,నాయకులు తోడు తో అసలు నిజాలు కప్పిపుచ్చేలా ప్రయత్నాలు*
*👉తాట తీయాల్సిన పోలీసులు విద్యార్థి భవిష్యత్తు అంటూ రాచ మర్యాదలు చేస్తే ఎలా?*
శుక్రవారం నెల్లూరు లా కాలేజీలు ర్యాగింగ్ భూతం పడగలు విప్పింది,అమానుష ఘటన చోటుచేసుకుంది,నూతన లా విద్యార్థిని లైబ్రరీలో ఉండగా ఒక విద్యార్థి సంఘం నాయకుడు వేధింపులకు గురి చేశాడు,ఫోన్ నెంబర్ కావలి అంటూ ఇబ్బంది పెట్టడం అమ్మాయి మాట్లాడక పోయేసరికి బలవంతంగా ఫోన్ లాక్కొవడం,తప్పించుకుని వెళుతున్న విద్యార్థినికి అడ్డగా చేతులు పెట్టడం అన్ పార్లమెంట్ పదాలు వాడడం తో భయాందోళనకు గురైన విద్యార్థిని తన కుటుంబ సభ్యులకు జరిగిన ఘటనపై సమాచారం తెలియచేయడం తో కుటుంబ సభ్యులు హుటాహుటిన కాలేజీకి చేరుకుని విద్యార్థిని పై జరిగిన ర్యాగింగ్ ఘటనపై రాతపూర్వకంగా లా కాలేజీ ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు,అనంతరం కుటుంబసభ్యులు వెళ్లిపోగా ఈ విషయం తెలుసుకున్న ర్యాగింగ్ చేసిన విద్యార్థి సంఘం నాయకుడు తిరిగి విద్యార్థిని వద్దకు వచ్చి పరుష పదజాలంతో ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చేస్తే ఏమీ అవుతుందంటూ చెప్పలేని పదాలు వాడుతో దూషణలకు దిగడంతో పాటు అసభ్యకర రీతిలో ప్రవర్తించాడు అని ఈ సమాచారం తిరిగి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు ఆ విద్యార్థి సంఘం నాయకుడిని కాలేజి లో నిలదీయగా అతను అమ్మాయి కుటుంబ సభ్యులు పై దురుసుగా ప్రవర్తించడం ఇంతలో అక్కడ ఉన్న తన అనుచరులతో విద్యార్థిని యొక్క బంధువులపై దాడికి దిగడంతో ప్రతిఘటించిన అమ్మాయి తరపు బంధువులపై దాడికి దిగారు,ఈ వ్యవహారం లో కొంత మంది అమ్మాయిలు బాధిత విద్యార్థినికి అండగా నిలవగా కొందరు విద్యార్థి సంఘం వైపు నిలబడి అమ్మాయిలు కూడా కొట్లాట కు దిగడం చెప్పులతో కొట్టుకోవడం శోచనీయం , విద్యార్థి సంఘం నాయకుడు మరి కొంతమంది రాజకీయ నాయకుల పలుకుబడి సిఫార్సులతో దగ్గర్లోని చిన్న బజారు పోలీస్ స్టేషన్ కు వెళ్లి బాధిత విద్యార్థిని బందువులు పైనే ఫిర్యాదులు చేశాడని, ఒకవైపు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మహిళల పట్ల ఎక్కడ అన్యాయం జరిగినా ఉక్కుపాదంతో అణిచివేయాలని,కాలేజీల్లో ర్యాగింగ్ లాంటి వాటికి పాల్పడితే ఒప్పుకొమని చెప్తూ ఉంటే నెల్లూరులో లా కాలేజీ వద్ద జరిగిన ఘటనలో విద్యార్థినితో పాటు వారి కుటుంబ సభ్యులు వేధింపులకు గురవుతూ ఉండడం చర్చి నియాంశం, ఇదే సమయంలో చిన్న బజారు పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో కనుచూపు మేరలో ఉన్న లా కాలేజీలో ర్యాగింగ్ పేరుతో విద్యార్థి సంఘం నాయకుడు చేసిన అరాచకం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం రేపుతుంది…ఈ కేసు వ్యవహారంలో పోలీసుల వైఖరి కూడా స్పష్టంగా ఉండాలని రాజకీయ ఒత్తిళ్లకు విద్యార్థి సంఘం నాయకుల ఒత్తిళ్లకు పోయి బాధితులకు అన్యాయం జరగకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు…ఇదే సమయంలో అమ్మాయిలను ఎవరు వేదించినా తాట తీయాలని పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మంత్రులుగా ‘నాగబాబు, పల్లా’ !!! ..సైలెంట్‌గా సినిమా చూసి వస్తే ఈ ఘటన జరిగి ఉండేది కాదు.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తమ్మారెడ్డి.. *చనిపోయిందని బన్నీకి చెప్పినా సినిమా చూశాకే వెళ్తానన్నాడు: ఏసీపీ.. *రూ.15 లక్షలు మద్యం పట్టివేత • డ్యూటీ ఫ్రీ మద్యం ముసుగులో లిక్కర్ వ్యాపారం… *లా కాలేజీలో ర్యాగింగ్ భూతం (నెల్లూరు) .. మచిలీపట్నంలో దొంగ నోట్ల కలకలం … తండ్రి తీసుకున్న డబ్బులకు పోలీసులు తనను వేధిస్తున్నారని ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థిని …
Recent Posts