👉సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో చేతులకు సంకెళ్లతో టీచర్ల నిరసన..
జోగులాంబ గద్వాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు తమకు న్యాయం చేయాలని, సంకెళ్లు వేసుకొని నిరసన తెలుపుతున్న సమగ్ర శిక్ష అభియాన్ టీచర్లు.
👉 బిఆర్ఎస్ అక్రమాలపై విరుచుకుపడ్డ 💥ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కోట్ల రూపాయలు గోల్ మాల్ చేసిన కేటీఆర్*
*💥 ఓఆర్ఆర్ టోల్ లీజు అక్రమాలపై ఎంక్వయిరీ చేయాలి*
*💥IRB ఇన్ ఫ్రా సంస్థకు 30 ఏళ్లు కట్టబెట్టింది కూడా పెద్ద స్కామే*
*💥BRS పాలనలో క్విడ్ ప్రోకో తో ఎన్ క్యాష్ మెంట్!
*💥ACB, ED లతో విచారణ జరిపించాలి*
*💥ఫార్ములా ఈ రేస్ పై ఫిర్యాధు ఇచ్చిన దాన కిషోర్ ORR టోల్ లీజు అక్రమాలపై కూడా ACB & ED లకు ఫిర్యాధు చేయాలి*…బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్*..బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్, హైదరాబాద్..
ఫార్ములా ఈ రేస్ మాత్రమే కాదు…ఓఆర్ఆర్ టోల్ లీజుపై కూడా ఎంక్వయిరీ చేయాలని, IRB ఇన్ ఫ్రా సంస్థకు 30 ఏళ్లు కట్టబెట్టింది కూడా పెద్ద స్కామే అని, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కోట్ల రూపాయల గోల్ మాల్ చేసిన బిఆర్ఎస్ నేత కేటీఆర్ పై ఎసిబి మరియు ఈడి కేసులు నమోదు చేసి దర్యాప్తు జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అనుమానాస్పద క్విడ్ ప్రోకో లావాదేవీలు, ప్రభుత్వ కార్యాలయ దుర్వినియోగం మరియు మౌలిక సదుపాయాల ఒప్పందాలకు సంబందించి తీవ్రమైన ఆర్థిక అక్రమాలు జరిగాయన్నారు.
ఏప్రిల్ 27, 2023న, తెలంగాణ ప్రభుత్వం 30 సంవత్సరాల పాటు ఔటర్ రింగ్ రోడ్ (ORR)ని నిర్వహించడం కోసం IRB ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్‌కు లీజుకు ఇచ్చిందన్నారు.
కొంతకాలం తర్వాత, జూలై 4, 2023న, IRB ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ 25 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్‌లను కొనుగోలు చేసి బిఆర్ఎస్ పార్టీకి ఇస్తే..వీటిని జూలై 13, 2023న భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ ఎన్ క్యాష్ చేసిందనారు.
ప్రభుత్వ కాంట్రాక్టు మరియు ఎలక్టోరల్ బాండ్ క్యాష్‌మెంట్ యొక్క సామీప్యత క్విడ్ ప్రోకో లావాదేవీలపై బలమైన అనుమానాలను లేవనెత్తుతున్నాయని, గణనీయమైన ఆర్థిక సహకారాల కోసం రాజకీయ అనుకూలతలు మార్పిడి చేయబడ్డాయని ఆరోపించారు.
జూన్ 16, 2023న, తెలంగాణ ప్రభుత్వం వరంగల్‌లోని కైటెక్స్ గార్మెంట్స్ మొదటి యూనిట్ కార్యాచరణ స్థితిని ప్రకటించిందని, ఆతరువాత కైటెక్స్ గార్మెంట్స్ జూలై 5, 2023న 15 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్‌లను కొనుగోలు చేసిందని, వీటిని BRS పార్టీ జూలై 17, 2023న ఎన్ క్యాష్ చేసిందన్నారు.
అదేవిధంగా, సెప్టెంబర్ 28, 2023న రంగారెడ్డి జిల్లాలో రెండవ యూనిట్‌ని స్థాపించిన తర్వాత, కైటెక్స్ అక్టోబర్ 12, 2023న 10 కోట్ల విలువైన బాండ్‌లను కొనుగోలు చేసిందని, అక్టోబర్ 16, 2023న BRS పార్టీ ద్వారా క్యాష్ చేయబడిందన్నారు.
గణనీయమైన బాండ్ కొనుగోళ్లను అనుసరించే అనుకూలమైన ప్రభుత్వ చర్యల యొక్క దగ్గరి క్రమం క్విడ్ ప్రోకో ఏర్పాట్ల నమూనాను సూచిస్తుందని, ఇక్కడ ఆర్థిక సహకారాన్ని పొందేందుకు రాజకీయ ప్రభావం దుర్వినియోగం చేయబడిందని అన్నారు.
ఆర్థిక లాభాలకు బదులుగా నిర్దిష్ట కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వ కార్యాలయాన్ని దుర్వినియోగం చేయడం జరిగిందని, మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 (PMLA) ప్రకారం నేరంగా పరిగణించబడే రాజకీయ విరాళాల ముసుగులో నిధుల స్వభావం మరియు మూలాన్ని దాచే ప్రయత్నం చేశారన్నారు.
ఈ లావాదేవీలు ప్రజల విశ్వాసం మరియు పారదర్శకత యొక్క నైతిక పాలన సూత్రాలను ఉల్లంఘించడం మరియు ప్రభుత్వ కార్యాలయ సమగ్రతను దెబ్బతీశాయన్నారు.
ప్రజా జవాబుదారీతనం మరియు పాలనలో పారదర్శకత ఉండేలా, సమగ్ర దర్యాప్తు పూర్తయ్యేవరకు ఈ ఒప్పందాల తదుపరి అమలును నిలిపివేయాలని కోరారు.
ఈ విషయంపై శనివారం సిఎం రేవంత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ,ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఫిర్యాధు చేశామన్నారు.
ఫార్ములా ఈ రేస్ పై ఫిర్యాధు చేసిన మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, ఓఆర్ఆర్ టోల్ లీజు అక్రమాలపై కూడా ఎసిబి,ఈడి లకు ఫిర్యాధు చేయాలని కోరారు.కార్యక్రమంలో సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అధ్యక్షులు గాలిగల్ల సాయిబాబా,బిసి పొలిటికల్ జేఏసీ నాయకులు వెంకటన్న గౌడ్,మహేందర్ నాయుడు,దేవర శివ,గౌతమ్ శంకర్ గౌడ్,పూల నవీన్ తదితరులు పాల్గొన్నారు.
👉ప్రకాశం జిల్లా మార్కాపురం హెల్మెట్ ధరించు నీ కుటుంబాన్ని విషాదం నుండి కాపాడుకో..
హెల్మెట్ ని నిర్లక్ష్యం చేస్తే అది మీ ప్రాణాలను నిర్లక్ష్యం చేస్తుంది..మార్కాపురం డిఎస్పి నాగరాజు.
వాహనదారులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణాలు కొనసాగించాలని మార్కాపురం డి.ఎస్.పి నాగరాజు తెలియజేశారు. ఆదివారం మార్కాపురం టౌన్ పోలీస్ స్టేషన్ నందు పోలీస్ సిబ్బందికి మరియు పాత్రికేయులకు హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ వారందరికీ, సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హెల్మెట్ లను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించుకొని మీ కుటుంబాన్ని విషాదం నుండి కాపాడుకోవాలని హెల్మెంటును నిర్లక్ష్యం చేస్తే అది మీ ప్రాణాలను సైతం నిర్లక్ష్యం చేస్తుందని కాబట్టి ప్రతి వాహనదారుడు హెల్మెట్ ఉపయోగించుకోవాలని డి.ఎస్.పి నాగరాజు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ సుబ్బారావు, టూ టౌన్ ఎస్ఐ డాక్టర్ రాజమోహన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
👉జర్నలిస్టుల సమస్యలపై ప్రకాశం జిల్లా మార్కాపురం లోని ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించిన ఏపీయుడబ్ల్యూజే అధ్యక్షులు ఐవి సుబ్బారావు….*
*ఈ సందర్భంగా ఐ వి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..* జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించాలి :ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి. సుబ్బారావు … కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా ఉండడం అభినందననియం…. గత ప్రభుత్వంలో జర్నలిస్టులపై ఇచ్చిన జీవో లను తొలగించి జర్నలిస్టులందరికీ వెంటనే అక్రిడేషన్స్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని…. జర్నలిస్టులు చనిపోతే వారి భార్య కు వితంతు పెన్షన్ కింద పదివేల రూపాయలు ఇవ్వాలని….
– జర్నలిస్టుల సంక్షేమ నిధికి నిధులు మంజూరు చేయాలని….జర్నలిస్టులకు హౌస్ సైట్స్ ప్రక్రియను వెంటనే అమలు చేయాలని….జర్నలిస్టులకు సమాచారం అందించేందుకు సీఎంఓ కార్యాలయం లో ప్రతినిధిని ఏర్పాటు చేయాలని…. జర్నలిస్టుల సంక్షేమంతో పాటు సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు డిమాండ్ చేశారు.
👉పోలీస్స్టేషన్లో గుండెపోటుతో న్యాయవాది మృతి*
పోలీసులు కేసు విచారణ చేస్తుండగా లాయర్ గుండెపోటుతో మృతి..అనంతపురం* సీఐ మందలింపే కారణమని న్యాయవాద సంఘాల ఆరోపణ
అనంతపురం నగరంలోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఘటన ..అనంతపురం నగరంలోని మూడో పట్టణ నికి చెందిన సీనియర్ న్యాయవాది శేషాద్రికి, అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో సివిల్ వివాదం
అయితే దీనిపై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు
కేసు విచారణ చేస్తున్న సమయంలో లాయర్ శేషాద్రి (58) ఒత్తిడి భరించలేక పోలీస్ స్టేషన్లో గుండెపోటుతో మృతి.
👉 ఈరోజు హైదరాబాద్ మియపూర్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన Signature Spice kitchen రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఢిల్లీ అధికార ప్రతినిధి,క్రీడల సలహాదారు,రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఏపి జితేందర్ రెడ్డి …
👉 హన్మకొండ జిల్లా : మడికొండ పద్మశాలి ఫంక్షన్ హాల్ లో మడికొండ యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు లుమేష్ కూతురు మొదటి పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన *తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి..* చిన్నారి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నిండా నూరేళ్లు పాటు జీవితం తో పాటు సమాజ అభివృద్ధి లో భాగం కావాలని జంగా రాఘవ రెడ్డి చిన్నారిని అశ్విరదించారు.లుమేష్ దంపతులకు అభినందనలు తెలిపారు.చైర్మన్ వెంట మాజీ కార్పొరేటర్.. సీనియర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు తోట్ల రాజు.. కార్పొరేటర్ కాంటెస్ట్ విజయ్,యూత్ కాంగ్రెస్ నాయకులు,జంగా అభిమానులు పాల్గొన్నారు. * హైదరాబాద్ ఇంచార్జ్ అమీర్ భాష*
👉 నకిలీ ఐపీఎస్ ప్రకాశరావుకు 14 రోజుల రిమాండ్ విధించిన సాలూరు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు
బొబ్బిలి జైలుకు తరలింపు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఐపీఎస్ ఆఫీసర్ గా హల్చల్ చేసిన ప్రకాశరావు
👉వేధిస్తున్నాడని కొడుకును హత్య చేసిన తండ్రి!*
అనకాపల్లి జిల్లా…నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని వెంకునాయు డుపేట శివారు లక్ష్మీ నగర్లో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకును తండ్రి మద్యం మత్తులో హత్య చేసిన ఘటన ఆదివారం ఉదయం కలకలం రేపింది.
కొఠారి రమణ అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి, తన కన్న కొడుకు కొఠారి భాస్కర్ ను సన్నికాలి రాయితో తల మీద కొట్టి హత్య చేశాడు. టౌన్ సిఐ గోవిందరావు తెలిపిన వివరాలు ప్రకారం….
కొఠారి రమణ ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యాడు. ఆయన భార్య మరణించి చాలా కాలమైంది. ఆయన కి ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివా హం జరిగి నర్సీపట్నంలో వేరే దగ్గర కాపురం ఉంటుంది. కుమారుడు భాస్కర్ ఖాళీగా ఉంటూ తండ్రి మీద ఆధారపడి జీవిస్తున్నాడు.అయితే గత కొద్దికాలంగా భాస్కర్ దుబారా ఖర్చు చేస్తున్నాడని తండ్రి కొడు కుల మధ్య కొద్దికాలంగా గొడవలు జరుగుతున్నా యి. శనివారం సాయంత్రం భాస్కర్ తన మిత్రుడుతో కలిసి బయట మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. తిరిగి ఇంట్లో తండ్రితో సహా భాస్కర్ స్నేహితుడితో కలిసి మద్యం సేవించాడు.
రాత్రి 10 గంటల సమయం లో మిత్రుడు వెళ్లిపోయిన తర్వాత తండ్రి కొడుకులు మధ్య పెద్ద వాగ్వాదం నడిచింది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి ఘర్షణ జరగడంతో తండ్రి ఆవేశం తో ఇంట్లో ఉన్న రాయితో భాస్కర్ తల మీద కొట్టాడు. దీంతో భాస్కర్ అక్కడక్కడే మరణించాడు. అయితే భాస్కర్ మరణించిన విషయం తెలియని తండ్రి నిద్రపోయాడు.ఇంట్లో తండ్రి కొడుకు మాత్రమే ఉండడంతో ఆదివారం ఉదయం పని మనిషి వచ్చి చూసేంతవరకు విషయం వెలుగులోకి రాలేదు. పనిమనిషి ఇచ్చిన సమాచారంతో నిందితుడు రమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు…
👉చేతులకు సంకెళ్లతో టీచర్ల నిరసన..👉బిఆర్ఎస్ అక్రమాలపై ధ్వజమెత్తిన బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్*.. 👉పోలీస్స్టేషన్లో గుండెపోటుతో న్యాయవాది మృతి* .. *నకిలీ ఐపీఎస్ ప్రకాశరావుకు 14 రోజుల రిమాండ్ .. *జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించాలి :ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి… *హెల్మెట్ ని నిర్లక్ష్యం చేస్తే అది మీ ప్రాణాలను నిర్లక్ష్యం చేస్తుంది..మార్కాపురం డిఎస్పి నాగరాజు.
Recent Posts