2700 కోట్ల ఇల్లు.. రూ.10 లక్షల సూట్ ధరించే వారా విమర్శించేది? .. *పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్* .. *విజయవాడలో వెలుగు చూసిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం .. *చంద్రగిరి ‘బీసీ’ విద్యార్థినులకు మెరుగైన వైద్యం* *తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కు మంత్రి సవిత ఆదేశం*.. *ఆర్మీ వాహనం లోయలో పడి ఇద్దరు సైనికులు మృతి.. *పుత్తూరు సబ్ డివిజన్ పోలీసులు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు … మైలవరం లో మిక్సీంగ్ రాజకీయ సెగలు…! ..*రాజకీయ దుమారం రేపిన పాలడుగు దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే వసంత కలయిక… *ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ పోలీస్ సిబ్బంది జీవన విధానం ఉండాలి : ఐజి వి సత్యనారాయణ.. *పోలీసుల వేధింపులు తట్టుకోలేక హుజూర్‌ నగర్ పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం .. * డిగ్రీ విద్యార్థులకు కూడా తక్షణమే వర్తింప చేయండి..మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పివి శేషయ్య.

👉రూ.2700 కోట్ల ఇల్లు.. రూ.10 లక్షల సూట్ ధరించే వారా విమర్శించేది?.. అరవింద్ కేజ్రీవాల్.
అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ విడుదలవుతుందనగా, దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కింది. అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ విడుదలవుతుందనగా, దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కింది.శుక్రవారం ప్రధాని మోదీ బీజేపీ ప్రచార భేరి మోగించారు.ఈ సందర్భంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు మీడియా సమావేశం నిర్వహించిన కేజ్రీవాల్ ప్రధాని మోదీపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసం షేష్ మహల్ కోసం మాట్లాడుతున్న ప్రధాని మోదీ తన కోసం రూ.2,700 కోట్లతో బంగ్లా నిర్మించుకున్నారని ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రధాని రూ.8,700 కోట్ల విమానంలో తిరుగుతుంటారని, రూ.10 లక్షల సూట్ ధరిస్తారని ఆరోపించారు. పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఢిల్లీకి చేసిందేమీ లేదని,అయినా తమ ప్రభుత్వంపై ప్రధాని బురద జల్లుతున్నారని కేజ్రీవాల్ విమర్శించారు.అంతకుముందు రామ్ లీలా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఢిల్లీకి ఆప్ ఒక ఆపదగా అభివర్ణించారు. ఢిల్లీ ప్రజలు ఆ ఆపద నుంచి బయటపడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం వరుస కుంభకోణాలు, అవినీతికి పాల్పడుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఢిల్లీలో మురికివాడల్లో నివసిస్తున్న ప్రజల కోసం నిర్మించిన కాలనీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ఈ విమర్శలు చేయగా, ఆ సభ ముగిసిన వెంటనే కేజ్రీవాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఢిల్లీ ఎదుర్కొంటున్న ఆపద బీజేపీనే అంటూ ప్రధాని విమర్శలను తిప్పికొట్టారు. బీజేపీ విపత్తుకు కారణం ఒకటి సీఎం అభ్యర్థి లేకపోవడం, రెండో ఆ పార్టీకి దశ దిశ లేకపోవడం, మూడు ఢిల్లీ ఎన్నికలకు ఎలాంటి అజెండా లేకపోవడం అంటూ మండిపడ్డారు. ఢిల్లీ వాసులకు బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పారు. 2020 మ్యానిఫెస్టోలో 2020 నాటికి ఢిల్లీలో అందరికీ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిందని, కాని ఇప్పటివరకు కేవలం 4,500 ఇళ్లు మాత్రమే నిర్మించందన్నారు. ఢిల్లీలో నాలుగు లక్షల మురికివాడలు ఉన్నాయని, 15 లక్షల ఇళ్లు నిర్మించాల్సిన అవసరం ఉందని ఆప్ అధినేత చెప్పారు. బీజేపీ మ్యానిఫెస్టో ఐదేళ్లకు సంబంధించినది కాదని, 200 ఏళ్లకు హామీలిస్తుందని వ్యాఖ్యానించారు. Also Read – ఆ బీఆర్ఎస్ నేతలు జైలుకే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు ఢిల్లీలో వచ్చే నెల అసెంబ్లీ ఎన్నికలు జరగను న్నాయి.2013 నుంచి అక్కడ ఆప్ ప్రభుత్వం కొనసాగుతోంది.2014 నుంచి ఢిల్లీలో అన్ని పార్లమెంట్ స్థానాలను బీజేపీయే గెలుచుకుంటోంది. ఈ నేపథ్యంలో వచ్చేనెల జరిగే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోగా, తమ 12 ఏళ్ల పాలన విజయాలతో మళ్లీ గెలుస్తామని ఆప్ ధీమాగా ఉంది.

రెండు పార్టీలు ఎన్నికల్లో హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇప్పటికే 70 స్థానాలకు ఆప్ అభ్యర్థులను ప్రకటించింది. ప్రచారం కూడా ప్రారంభించింది.బీజేపీ ఇంకా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియనే మొదలుపెట్టలేదు. అయినా ప్రధాని మోదీ సభతో ఎన్నికల సమర శంఖం పూరించారు.
👉 *చంద్రగిరి ‘బీసీ’ విద్యార్థినులకు మెరుగైన వైద్యం*
*తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కు మంత్రి సవిత ఆదేశం*
*అమరావతి :* చంద్రగిరి ఇంటిగ్రేటెడ్ బాలిక హాస్టల్ విద్యార్థినులకు అస్వస్థతపై మంత్రి సవిత ఆరా తీశారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యమందించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ను ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. 27 మంది చంద్రగిరి ఇంటిగ్రేటెడ్ బాలిక హాస్టల్ విద్యార్థినులు వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వారిలో 18 బీసీ విద్యార్థినులు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తో మంత్రి సవిత ఫోన్ లో మాట్లాడారు. అస్వస్థతకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు. అస్వస్థతకు గురైన విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. హాస్టల్ లో మిగిలిన విద్యార్థినులంతా క్షేమంగా ఉన్నారని మంత్రికి కలెక్టర్ వెంకటేశ్వర్ వివరించారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచాలన్న మంత్రి.. హాస్టల్ లో వైద్య శిబిరం నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారమందించాలని రాష్ట్ర బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ ను మంత్రి సవిత ఆదేశించారు.
👉పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్
కాకినాడ జిల్లా వాకపూడి వద్ద సముద్రంలో అక్రమంగా తాబేళ్ల వేట యథేచ్చగా కొనసాగుతోంది. దీంతో తాబేళ్ల సంరక్షణపై డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో సముద్రంలో 5నెలల పాటు చేపలవేటపై నిషేధం విధించారు.తీరప్రాంతం 5 కిలోమీటర్ల మేర పెట్రోలింగ్ నిర్వహించారు.చేపల వేటకు వెళ్తున్న రెండు బోట్లను సీజ్ చేశారు..
👉 విజయవాడలో వెలుగు చూసిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం ..గత ప్రభుత్వంలో తనను బెదిరించి విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, కడియం ప్రాంతాల్లో విలువైన ఆస్తులను తన్ను బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన మాజీ ఇబ్రహీంపట్నం రిజిస్టర్ సింగ్
అక్రమ రిజిస్ట్రేషన్కు ఒప్పుకోకపోవడంతో తనను కిడ్నాప్ చేసి గోవాలో బంధించారని ఏసీబీకి ఫిర్యాదు చేసిన రిజిస్టర్ సింగ్
తన కుమారుడు వద్ద నుంచి కోటి రూపాయలు వసూలు చేసి తనను విడుదల చేసినట్లు ఫిర్యాదు
700 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను ఇబ్రహీంపట్నం రిజిస్టర్ సింగ్ ను బెదిరించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య భారతి, జగన్ పిఎ కె నాగేశ్వర్ రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్ అతని భార్య జబర్దస్త్ నటి వనం దివ్య @ రీతు చౌదరి పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఏసీబీకి ఫిర్యాదు చేసిన మాజీ రిజిస్టర్ సింగ్.
👉జమ్మూకశ్మీర్‌లోని బాందీపురా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. *ఆర్మీ వాహనం లోయలో పడి ఇద్దరు సైనికులు మృతి.. మరో ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం. *సమాచారం అందుకున్న అధికారులు గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
👉 14 ఏళ్ల బాలుడిని కత్తితో పొడిచి చంపిన క్లాస్‌మేట్
ఢిల్లీలోని ఓ స్కూల్లో ఎక్స్ట్రా క్లాస్ జరుగుతున్న సమయంలో జరిగిన గొడవతో 14 ఏళ్ల బాలుడిని సహచర విద్యార్థి కత్తితో పొడిచి చంపాడు. క్లాస్ ముగిసిన తర్వాత నిందితుడు ముగ్గురు- నలుగురు వ్యక్తులతో కలిసి స్కూల్ బయట గేట్ వద్ద 7వ తరగతి చదువుతున్న ఆ బాలుడిపై దాడి చేశారు. పాఠశాల సిబ్బంది వెంటనే అతడికి ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆ విద్యార్థి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
👉 తిరుపతి జిల్లా..జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు పుత్తూరు సబ్ డివిజన్ పోలీసులు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. పుత్తూరులో హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ రోజు ఉదయం పుత్తూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO), పుత్తూరు ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రత మరియు ప్రమాదాల సమయంలో గాయాలను నివారించడంలో హెల్మెట్‌లు కీలక పాత్ర పోషిస్తాయనే సందేశాన్ని వ్యాప్తి చేసే లక్ష్యంతో చురుకైన ప్రజల భాగస్వామ్యంతో మోటార్‌సైకిల్ ర్యాలీని ప్రదర్శించారు.
పౌరులకు అవగాహన కల్పించడంలో మరియు రోడ్లపై బాధ్యతాయుతంగా నడుచుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈలాంటి కార్యక్రమాలు చేపట్టారు.
👉 శేషాచలం వాటర్ ఫాల్స్ చూసి వస్తుండగా దారి తప్పిన బీటెక్ విద్యార్థులు ..తప్పిపోయిన ఆరుగురిలో అక్కడె ఉన్న వాగులో పడి ఒక విద్యార్ధి మృతి..మరో ఐదు మందిని రక్షించిన కోడూరు పోలీసులు.
👉యింటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం హర్షనీయం.. డిగ్రీ విద్యార్థులకు కూడా తక్షణమే వర్తింప చేయండి..మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పివి శేషయ్య.
ప్రభుత్వ జూనియర్ కళాశాల నందలి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ఈ నెల జనవరి ఒకటి 2025 నుండి అమలు చేసేందుకు జీవో నెంబర్ 40 విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా నాయకులు పివి శేషయ్య హర్షం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో డిగ్రీ విద్యార్థులకు వర్తింప చేయకపోవడం అన్యాయం అన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో ఇంటర్ విద్యార్థులకు ఈ సౌకర్యం కలిగించిందని, అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీనిని రద్దు చేయడం జరిగిందన్నారు. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన విద్యార్థి సంఘంగా మేము ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు 2024 ఆగస్టు 15 నుండి ప్రారంభమయ్యే అన్నా క్యాంటీన్ల నుండి మధ్యాహ్నము పూట భోజనం సరఫరా చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మరియు గౌరవ శాసనసభ్యులను కోరడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.తక్షణమే డిగ్రీ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం వర్తింపజేసి, ఆకలి సమస్యనుంచి వారిని కాపాడేలా ప్రభుత్వం మానవతను చాటాలని, పివి శేషయ్య ప్రభుత్వాన్ని కోరుచున్నారు..
👉మైలవరం లో మిక్సీంగ్ రాజకీయ సెగలు…!!
టీడీపీ లో భారీగా చేరుతున్న వైసీపీ కీలక నేతలు…!!
వైసీపీ నేతలు ఎమ్మెల్యే వసంత ను కలవడం పై రగడ…!!⭐దాడులు చేసి, కేసులు పెట్టిన నేతలే కావాలా అంటూ కొందరు టీడీపీ నేతల అభ్యంతరం…!!
పెత్తనం కోసం కొందరు నేతలు దిగజారి రాజకియం చేస్తున్నారు అంటూ విమర్శల పర్వం…!!
⭐వైసీపీ పదవులకు రాజీనామా చేయకుండా టీడీపీ, బీజేపీ సభ్యుత్వాలు ఇవ్వడం పై చర్చ….!!
*రాజకీయ దుమారం రేపిన పాలడుగు దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే వసంత కలయిక…!!
⭐ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటి పై దాడి కేసులో ముద్దాయిలను పార్టీలో ఎలా కలుపుకుంటారు అంటూ ప్రశ్నాస్త్రాలు…!!
నూతన సంవత్సర సందర్భంగా ఎమ్మెల్యే వసంతను పెద్ద ఎత్తున కలిసిన వైసీపీ కీలక నేతలు…!!
వారంతా పార్టీలోకి వచ్చేస్తున్నారు అంటూ సాంకేతాలు ఇచ్చినట్లు గ్రహించిన టీడీపీ శ్రేణులు…!!
వైసీపీ నేతల ఎంట్రీ తో మారిపోయిన మైలవరం టీడీపీ ముఖ చిత్రం…!!
మైలవరం మిక్సీంగ్ రాజకీయం పై ప్రత్యేక కథనం…!! *మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం*
*ప్రభుత్వ విఫ్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విలేకరుల సమావేశ వివరాలు*
*ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు*
👉సంక్షేమ పథకాల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు కానీ,జగన్ రెడ్డికి కానీ లేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘వైసీపీ నేతలు సూపర్ సిక్స్ అమలు గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. మీ పాలనలో నవరత్నాల్లో ఆరు నెలల్లో ఎన్ని అమలు చేశారు..? బహిరంగంగా చర్చకు సిద్ధమా..? జగన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి నెలలో రాజన్న బడిబాట అని ప్రకటన మాత్రమే చేసింది నిజం కాదా..? అగష్టు నెలలో వైఎస్సార్ రైతు దినోత్సవం ప్రకటన మాత్రమే విడుదల చేశారు. అదే నెలలో వైఎస్సార్ పెన్షన్ కానుక అంటూ ప్రకటన మాత్రమే విడుదల చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. రాజకీయ నాయకులు నిజాలు నిగ్గు తేల్చేలా ఉంటే.. దేనికైనా సరే పరిష్కరం లభిస్తుంది. పింఛన్ ను పెంచేందుకు మీకు ఆరు నెలలు సమయం పట్టింది. పతనం అంచునా ఉన్న ఆర్థిక వ్యవస్థను దిగజార్చిన పరిస్థితి నిజం కాదా..? వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా అభివృద్ది ఎలా ఉందో రోడ్లు చూస్తే అర్థం అవుతుంది. రోడ్లను దుస్థితి తీసుకువచ్చింది.. వైసీపీ ప్రభుత్వం కాదా..? మీ పాలన కాలంలో అభివృద్ధి ఎక్కడా ఉంది. 1950 తరువాత ఏపీలో అభివృద్ధే చేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం మాత్రమే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశ మొత్తం ఏపీ వైపు చూస్తుంది. సీఎం చంద్రబాబు సారధ్యంలో కూటమి ప్రభుత్వాన్ని చూసి పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద సంస్థలు క్యూ కడుతున్నాయి. మంత్రి నారా లోకేష్ సైతం యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నారు. మీ ప్రభుత్వం హయాంలో కనీసం ఒక్క ఐటీ కంపెనీని కూడా తీసుకువచ్చిన పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్ ను రూ.4000 చేశాం. దీపం-2 పథకాన్ని ప్రారంభించి రాష్ట్రంలోని 86 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేశాం. 203 అన్న క్యాంటీన్లను ప్రారంభించాం. అలాగే రైతుల నుంచి 26 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నాం. ఈ విధంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా జరిగిదా..? పాలనను గాలికి వదిలేసి.. వ్యవస్థలను నిర్వీర్యం చేసి.. రోడ్లను అతలాకుతలం చేసి.. పరిశ్రమలను పారిపోయేలా చేసింది వైసీపీ ప్రభుత్వం కాదా..? వైసీపీకి ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పాటానికి 2024 ఎన్నికలే నిదర్శనం.. ప్రజలు ఇతర దేశాల నుంచి వచ్చి మరి ఓటు వేసి వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. ప్రజాతీర్పును గౌరవించకుండా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోరడం ఎంత వరకు న్యాయం..? జగన్ రెడ్డి నిర్వహించిన ప్రజాదర్బర్ లో ప్రజలు ఇచ్చిన అర్జీలను తన సొంత నిధులతో పరిష్కరం చూపగలరా..? శాసనసభకు రానీ జగన్ రెడ్డి అర్జీలు తీసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం. 4 వైసీపీ ఎంపీలను ప్రజలు గెలిపించారు.. కానీ, అక్కడ మీకు ప్రతిపక్ష హోదా ఏదైనా ఉందా..? లోక్ సభకు వెళ్తున్న మీ పార్టీ వాళ్లు.. ప్రజలు 11 మంది గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రావడానికి ఎందుకు భయపడుతున్నారు..? 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న సీఎం చంద్రబాబుకు రాష్ట్ర అర్థిక పరిస్థితిని ఇలా ఎప్పుడు చూడలేదంటే.. మీ పాలన వైఖరికి అద్దం పడుతుంది. మన మాతృభాషను కించపరిచే విధంగా రోత పత్రికలో రాసుకోవడం బాధకరం. వర్క్ ఫ్రం హోం.. వర్క్ ఫ్రం ఫామ్ హౌస్ లకు కాలం చెల్లింది. అసెంబ్లీని అవమానించకుండా, రాష్ట్ర ప్రజలను అవమానించకుండా అసెంబ్లీకి పులివెందుల ఎమ్మెల్యే రావాలని మీడియా ముఖంగా కోరుతున్నా. జగన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదని సీఎం చంద్రబాబుకు నేను ఎప్పుడో చెప్పాను. జగన్ రెడ్డి పాలన ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది. కేవలం ఆర్థిక వ్యవస్థను మాత్రమే కాకుండా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేశారు. నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి.. అభివృద్ధి చేస్తున్న విషయం మీరు చూడలేకపోతున్నారా..?’’ అని అన్నారు.
👉నూతనంగా పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపిక అయి పోలీస్ విధులలోకి వచ్చే సిబ్బంది వారి తల్లీ దండ్రులు గ్రామాలలో తల్లెత్తుకొని జీవిస్తూ గర్వపడేలా ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ పోలీస్ సిబ్బంది జీవన విధానం ఉండాలనీ *మల్టిజోన్ ఐజీ వి.సత్యనారాయణ నూతన పోలీస్ సిబ్బందికి సూచించారు.
నిజామాబాద్, ములుగు, హైదరాబాదు జిల్లాలకు చెందిన TGSP రిక్రూట్ కానిస్టేబుల్స్ ఈ రోజు ఎర్రవల్లి లోని 10th BN లో 9 నెలల శిక్షణ అనంతరం *కమాండెంట్ సాంబయ్య* ఆద్వర్యంలో పాసింగ్ ఔట్ పరెడ్ నిర్వహించిన సందర్బంగా ఈ కార్యక్రమానికి మల్టీ జోన్-II ఐజీ *జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా మల్టీ జోన్ -II ఐజీ మాట్లాడుతూ పోటీ పరీక్షలలో లక్షల మంది తో పోటీ పడి నూతనంగా ఎన్నిక అయి 9 నెలల కఠోర శిక్షణను పూర్తి చేసుకొని ములుగు,హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 522 మంది కన్నుల పండుగా లా జరుగుతున్న దిక్షింత్ పరేడ్ కు తాను రావడం ఎంతో ఆనందంగా ఉందని, వారు అంత నేటి నుండి పోలీస్ కుటుంబ విదులలోకి వస్తునందను శుభాకాంక్షలు తెలియజేశారు.
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో L &O ఎంత పకడ్బందీ ఉంటుందో అప్పుడే అన్ని రంగాలలో పెట్టుబడులు వచ్చి యువతకు మర్రిన్ని అవకాశాలు వస్తాయని భావించి పోలీస్ రిక్రూట్ మెంట్ ప్రాసెస్ కు వెంట వెంటనే నోటిఫికేషన్ లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
పోలీస్ ఉద్యోగం ఎల్లప్పుడూ సవాళ్లు, త్యాగాలతో ముడి పడి ఇతర శాఖలకు భిన్నంగా ఉంటుందని అయినప్పటికీ ప్రజలు ఎల్లప్పుడూ పోలీస్ నుండి ఇంకా ఇంకా సేవలు కావాలని కోరుకుంటారని ఆ దిశగా మనం వారి అంచనాలను అందుకునేలా సేవలు అందించాలని అన్నారు. 9 నెలలుగా అవుట్ డోర్, ఇన్ డోర్, ఫైరింగ్ ఉత్తమ శిక్షణ పొంది నేడు విధులలో కి చేరడం జరుగుతుందని, ఈ శిక్షణ కాలం లో ఒక్కో సారి చిన్న చిన్న పనిష్మెంట్ లు ఇచ్చినా అవీ నిజ జీవితంలో సహనం తో ఉద్యోగం చేసేలా నేర్చుకునేందుకు ఉపయోగపడతాయని అన్నారు. పోలీస్ శాఖలో ఏ విభాగం చిన్న పెద్దా అనే తేడా ఉండదని దేని విలువ దానికే ఉంటుందనీ, అందరూ ప్రజలకు సేవ చేసేందుకే నని గుర్తించాలని అన్నారు. ప్రతిభ ఆధారంగా వివిధ విభాగాలలో నియమించడం జరుగుతుందని, ఒక్క సెకన్, ఒక్క మార్క్ తో ఉద్యోగం రాక మానసికంగా గురవుతున్న వాళ్ళను మీరూ ఎందరినో చూసి ఉంటారని వాళ్ల కన్న మీరు ఎంత అదృష్టవంతులో ఆలోచించాలని అన్నారు.
డబ్బు ఆశలతో అంతర్జాల ఆటలకు పోయి, వ్యసనాలకు అలవాటు అయి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకోవద్దని ప్రశాంత వాతావరణంలో ఉద్యోగాలు చేస్తూ మంచి కుటుంబాన్ని , ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవాలని ఆకాంక్షించారు. 10th బెటాలియన్ కమాండెంట్ ఎన్.సాంబయ్య మాట్లాడుతూ 9 నెలలు గా అన్ని ఆధునిక సౌకర్యాలు కల్పించి అవుట్ డోర్, ఇన్ డోర్, ఫైరింగ్ లలో ఉత్తమ శిక్షణ ఇవ్వడం జరిగిందని, అందుకు అర్. ఐ లు, అర్. ఎస్సై లు, శిక్షణ ఇచ్చే కానిస్టేబుల్స్ ఎంతో శ్రమించారని అన్నారు. రిక్రూట్మెంట్ కుటుంబ సభ్యుల సమక్షంలో 522 మంది తో నిర్వహించిన దీక్షింత్ పరేడ్ కన్నుల పండుగల జరిగింది, సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఉత్సాహపరిచాయీ, అనంతరం పరేడ్ కమాండర్, అవుట్ డోర్, ఇన్ డోర్, ఫైరింగ్, అల్ రౌండర్ లకు, శిక్షణ అందించిన అధికారులకు ఐ జీ, జిల్లా ఎస్పీ మెమోంటోస్ అందజేశారు.కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్,పాణి & RI,RSI లు బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.. హైదరాబాద్ ఇంచార్జ్ షేక్ అమీర్.
👉దశలవారీగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎస్ హామీ*అమరావతి..
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను దశల వారీగా పరిష్కరానికి కృషి చేస్తానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయనంద్ హామీ ఇచ్చినట్లు ఎస్సీ,ఎస్టి ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన కే.విజయానంద్ ను సురేష్ బాబు గజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ చైర్మన్ కె.వి.కృష్ణయ్యతో పాటు సచివాలయం లో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని, డిఎ,ఐఆర్ తదితర అంశాలపై దృష్టి పెట్టాలని సిఎస్ ను కోరారు. ఉద్యోగులు ప్రభుత్వంలో ప్రధానభాగం అని ఉద్యోగుల సమస్యలలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించడానికి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని ,ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందవలసిన పనిలేదని,ఈ అంశాలపై త్వరలో ఉద్యోగ సంఘాల తో సమావేశం నిర్వహిస్తామని సిఎస్ విజయానంద్ హామీ ఇచ్చినట్లు సురేష్ బాబు పేర్కొన్నారు.
👉కావలి పట్టణంలోని బాలక్రిష్ణ రెడ్డి నగర్ లో దారుణం.. నెల్లూరు జిల్లా..కావలి*
*👉సెల్ టవర్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన గుంటలో పడి నాలుగో తరగతి చదువుతున్న పొన్నమల్లి చక్రి (8) బాలుడు మృతి.*కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రూరల్ పోలీసులు..
👉పోలీసుల వేధింపులు తట్టుకోలేక హుజూర్‌ నగర్ పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం
సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్ పీఎస్ పరిధిలో రైతు వేదికలో ఎల్ఈడీ లైట్లు పోయాయని, చేయని దొంగతనాన్ని మీద వేసి ఊదరి గోపి అనే యువకుడిని వేధింపులకు గురి చేసిన పోలీసులుమూడు నెలలుగా కేసు ఉందంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటున్నారని, తాను దొంగతనం చేయలేదని పోలీస్ స్టేషన్ ముందు గన్నేరు కాయల రసం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఊదరి గోపి..
గోపిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు…
👉 చట్టం ఎవరికీ చుట్టం కాదు ” హాట్స్ ఆఫ్ బెజవాడ పోలీస్ ఎన్టీఆర్ జిల్లా,ప్రకాశం బ్యారేజ్
ప్రజలకైన … పోలీసులుకైన ఒకటే రూల్ అంటున్న బెజవాడ పోలీసులు.
ఏకంగా పోలీసులకే హెల్మెట్ లేదు అని ఫైన్ రాసిన పోలీస్ అధికారి.
బెజవాడ పోలీసుల ఫై ప్రశంశలు వెల్లువ.
విజయవాడ ప్రకాశం బ్యారేజి దగ్గర సాటి పోలీస్ లకి కూడా హెల్మెట్ లేకపోతే సిన్సియర్ గా చలానాలు రాస్తున్నారు.
కావున అందరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడుపవలసిందిగా కోరుతున్నాం.
👉*ఎన్టీఆర్‌ జిల్లా : వత్సవాయి మండలం.*తాళ్లూరులో ఉద్రిక్తత**ప్రేమజంట వ్యవహారంలో ఇరు కుటుంబాల ఘర్షణ*
యువతిని తీసుకెళ్లారంటూ బంధువుల ఆందోళన.
యువతి బంధువులపై యువకుడి బంధువుల దాడి.
6 కార్ల అద్దాలు ధ్వంసం, ఇద్దరికి గాయాలు.
తాళ్లూరు పీఎస్‌లో ఇరు వర్గాల ఫిర్యాదులు.
👉మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో అందరూ మరణించాడు అని అనుకొన్న వ్యక్తి ఊహించని విధంగా బతికి బట్టకట్టిన అరుదైన ఘటన జరిగింది. కొల్హాపూర్ కు చెందిన పాండురంగ్ అనే వ్యక్తి డిసెంబర్ 16న గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో… కుటుంబ సభ్యులు హుటాహుటిన దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.ఈ సమయంలో పాండురంగ్ ని పరిశీలించిన వైద్యులు.. అతడు మృతి చెందినట్లు చెప్పారు. దీంతో… కుటుంబ సభ్యులు, బంధువులు ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయారు. మరోపక్క అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. గ్రామస్థులు, స్నేహితులు,మొదలైనవారు పాండురంగ్ ఇంటికి చేరుకున్నారు. ఆస్పత్రి నుంచి మృతదేహం వచ్చిన అనంతరం అంత్యక్రియల కార్యక్రమం మొదలుపెట్టాలని నిర్ణయించుకుని.. పాండురంగ్ ని కడసారి చూడటం కోసం ఎదురు చూడసాగారు. ఈ సమయంలో… ఆస్పత్రి నుంచి స్వగ్రామానికి మృతదేహాన్ని అంబులెన్స్ లో తరలిస్తున్నారు. ఈ సమయంలో మార్గ మధ్యలో ఓ స్పీడ్ బ్రేకర్ వచ్చింది. అయితే.. ఆ విషయం అంబులెన్స్ డ్రైవర్ గమనించలేదు. ఆ స్పీడ్ బ్రేకర్ పై నుంచి రయ్ మంటూ అంబులెన్స్ ను పోనిచ్చాడు. దీంతో… ఒక్కసారిగా భారీ కుదుపుకు లోనయ్యింది అంబులెన్స్. దీంతో.. అందులో ఉన్న పాండురంగ్ శరీరంలో చలనం మొదలైందట. ఈ సమయంలో మరణించాడనుకున్న పాండురంగ్.. చేతులు కదపడం గమనించారంట కుటుంబ సభ్యులు. దీంతో… అదే అంబులెన్స్ లో హుటాహుటిన మరో ఆస్పత్రికి తరలించారంట. దీంతో… అక్కడ పాండురంగ్ ను పరిశీలించిన వైద్యులు.. అతడిని ఆస్పత్రిలో చేర్చుకుని, యాంజియోప్లాస్టీ సర్జరీ నిర్వహించారు. ఈ ఆపరేషన్ జరిగిన రెండు వారాల అనంతరం కోలుకున్న పాండురంగ్.. ఇటీవల ఇంటికి చేరుకున్నారు. దీంతో.. ఈ విషయం వైరల్ గా మారింది. “ఇది స్పీడ్ బ్రేకర్ పోసిన ప్రాణం” అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు! ఇదే సమయంలో ‘సింహ’ సినిమాలో చాలా కాలంగా కోమాలో ఉన్న విలన్ పాత్రధారి… బాలకృష్ణ కొట్టిన ఒకే ఒక్క దెబ్బకు లేచి కూర్చున్న సన్నివేశాన్ని గుర్తు చేస్తూ… పాండురంగ్ వ్యవహారంలో మాత్రం “స్పీడ్ బ్రేకరే బాలయ్య” అని మరికొంతమంది స్పందిస్తున్నారు.

7k network
Recent Posts

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి