ఢీల్లీ పీఠం కూడా షేక్ అవుతుంది..సీఎం జగన్..లోపాలు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి..జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్.. అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత..గిద్దలూరు కంభం మార్కాపురంలో టీడీపీ, వైసీపీ విస్తృత ప్రచారం….

👉అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నల ఓట్లతో ఢీల్లీ పీఠం కూడా షేక్ అవుతుంది -ఇచ్చాపురుం బహిరంగ సభలో సీఎం జగన్..

ఇప్పటికే కొనసాగుతున్న, బడ్జెట్ కేటాయించిన పథకాలను అడ్డుకుని మీ బిడ్డను ఇబ్బందిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. మీ బిడ్డ ముఖ్యమంత్రిగా మీకు పథకాలను అందించేందుకు కోర్టుకు వెళ్లి పోరాడుతున్నాడంటే ఆలోచన చేయండి, ఏస్థాయిలో కుట్రలు చేస్తున్నారో..ఇన్ని సంవత్సరాలుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నారు, చివరి రెండు నెలలు పింఛన్ సోమ్ము ఇంటికి రాకపోతే అవ్వాతాతలకు ఈ కుట్రలు, క్రమంతప్పకుండా అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటూ, ఆఖరి రెండు నెలలు బటన్ నోక్కినా కూడా సోమ్ము రాకుండా ఎవరు కుట్ర చేస్తున్నారని అక్కచెల్లెమ్మలకు తెలియకుండా ఉంటుందా..వీళ్లు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన పైన దేవుడు చూస్తున్నాడు, ప్రజల దీవెనలు ఉన్నాయి, జరుగుతున్న పరిస్థితులను అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మలు, రైతన్నలు గమనిస్తున్నారన్నారు..ఓటు అనే ఆయుధంతో వీరు కొట్టబోయే దెబ్బతో ఢీల్లీ పీఠం కూడా కదులుతుందనడం పై ముందు ఏం జరగబోతుందన్న విషయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

👉లోపాలు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి..జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్.. మార్కాపురం..కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఏ.ఎస్.దినేష్ కుమార్ మంగళవారం మార్కాపురంలో పర్యటించారు. ఎస్.వీ.కె.పీ. కాలేజీలో ఏర్పాటు చేసిన ఈ.వి.ఎం.ల స్ట్రాంగ్ రూమును ఆయన పరిశీలించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాలను భద్రపరిచిన తీరును అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. వీటికి కల్పిస్తున్న భద్రత ఏర్పాట్ల పైనా కలెక్టర్ ఆరా తీశారు. ఇదే ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఒంగోలు లోక్ సభ ఎన్నికలలో ఉపయోగించే ఈ.వి.ఎం.ల కమిషనింగ్ ప్రక్రియను కూడా కలెక్టర్ పరిశీలించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు.ఈ ప్రాంగణంలో లైటింగ్, బ్యారికేడ్ల ఏర్పాటు విషయంలో స్థానిక రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనా కు ఆయన పలు సూచనలు చేశారు.అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ కేంద్రంలో కల్పించిన మౌలిక సదుపాయాలు, పోలింగ్ జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులందరూ వాళ్లకి కల్పించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు కోసం ఒక ఉద్యోగికి యు.పీ.ఐ. విధానంలో ఒకరు డబ్బులు పంపినట్లు వచ్చిన వార్తలపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆయన తెలిపారు.ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఉద్యోగి స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు… 👉 పోలింగ్ కేంద్రాల పరిశీలన…మార్కాపురం మండలంలోని పెద్ద నాగులవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, నికరంపల్లె ప్రాథమికోన్నత పాఠశాల, జమ్మనపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, కొలభీమునిపాడు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.విధుల్లో పాల్గొనేందుకు వచ్చే సిబ్బందికి వసతి కల్పించేందుకు చేస్తున్న ఏర్పాట్లపై ఆరా తీశారు.ఈ దిశగా కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై అధికారులకు ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ రాహుల్ మీనా,తహసిల్దార్ రవికుమార్,సెక్టార్ ఆఫీసర్ డి.శ్రీనివాసులు అధికారులు ఉన్నారు.

👉మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి మండలంలో ఆముదాలపల్లి గ్రామంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మార్కాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు  పాల్గొన్నారు. గడపగడప తిరుగుతూ వారి ప్రేమానురాగాలు ఆదరణలు ఇస్తూ ఆహ్వానించారు ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మార్కాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అభ్యర్థి అన్నా వెంకట రాంబాబుకి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

*అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత..అంబేద్కర్ కోనసీమ జిల్లా..ఆలమూరు మండలం.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామంలో 216(ఏ) నెంబరు గల జాతీయ రహదారిపై నిర్వహిస్తున్న తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఎస్సై శ్రీను నాయక్ నేతృత్వంలో స్టాటిక్ సర్వ్యులేషన్ టీం ఇంచార్జ్ కె.నాగేశ్వరరావు తెలిపిన వివరాలు ప్రకారం రాజానగరం నుండి అమలాపురం వైపుగా ఏపీ 39 ఎల్ క్యూ 77 నెంబరు గల కారులో 15,600 రూపాయల విలువ గల 180ML సామర్థ్యంతో ఉన్న 104 కోటర్ బాటిల్స్ ను స్వాధీనపరుచుకున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై తెలియజేశారు. అలాగే చట్టం దృష్టిలో అందరూ సమానులేనని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం, నగదు వంటి తదితర వస్తువులను సరైన ఆధారాలు లేకుండా తరలించినచో కఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఏఎస్ఐ సూర్యచంద్రరావు, సిఐఎస్ఎఫ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు….👉 చిత్తూరు జిల్లా..కర్ణాటక నుంచి కంటైనర్ ద్వారా తరలిస్తున్న మద్యం సీజ్ ..బంగారుపాళ్యం వద్ద పోలీసులు పట్టుకున్న పోలీసులురు..50 లక్షలు విలువ చేసే 720 కేసులు గా గుర్తింపు.. తిరుపతి రాజకీయ నాయకులకు చెందినది గా అనుమానిస్తున్న పోలీసులు

👉కంభం జోరుగా సైకిల్ ప్రచారం..

కంభం గ్రామ పంచాయతీ పరిధిలోని 54 పోలింగ్ కేంద్రంలో జోరుగా సైకిల్ ప్రచారం చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి అనీష్ అహ్మద్(అన్ను )కార్యనిర్వహక కార్యదర్శి (దాదా) బూత్ కన్వీనర్ నాగూర్ ఖాన్ ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించడం అలాగే రేపు 13వ తారీకు జరగబోయే ఎన్నికల్లో ముత్తుముల అశోక్ రెడ్డి నీ పార్లమెంటు కు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో షుకూర్. ఫజల్. ఫయాజ్. మరియు ముస్లిం యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

👉యువ‌త‌కు బంగారు భ‌విష్య‌త్తు అందించేందుకు ఎంతో కృషి చేసిన జగనన్న..మార్కాపురం టౌన్ లో టీడీపీని వీడి 30 మంది యువత ఎమ్మెల్యే అన్నా సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిక*..రాష్టంలో యువ‌త‌కు బంగారు భ‌విష్య‌త్తు అందించేందుకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గ‌త ఐదేళ్లుగా ఎంతో కృషి చేశార‌ని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నా రాంబాబు అన్నారు.

మంగళవారం మార్కాపురం పట్టణంలోని 18వ వార్డుకు చెందిన 30 మంది టిడిపికి చెందిన యువకులు టీడీపీని వీడి 18 వ వార్డు కౌన్సిలర్ కరీముల్లా, నాయకులు టి. వెంకటరావు, బెల్లకొండ గోపీ,కంభం వెంకట రమణల ఆధ్వర్యంలో మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మార్కాపురం పట్టణం, జవహర్ నగర్ లోని ఎమ్మెల్యే అన్నా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబుని కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన వారికీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా పార్టీ కండువాలు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ జగనన్న చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై వైసీపీ లో చేరామన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నా రాంబాబు విజయానికి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయానికి కృషి చేస్తామన్నారు. పార్టీ లో చేరిన వారిలో ఏనుగుల సాయి, ఏనుగుల శివ, ఏనుగుల ప్రవీణ్, భూపని కిరణ్, ఇవి వెంకట్, సాయి, అశోక్, శివారెడ్డి, శేఖర్, అజయ్, విష్ణు, మౌలాలి, హరి, కాశీ, మహీంద్రా, మహేష్, ఉమా మహేష్, రేవంత్, మోహన్, అరవింద్, రంగా, మనోజ్, శివ, గోపీ, ఇమ్రాన్ తదితరులు ఉన్నారు.*

👉 ఫ్యాను గుర్తుపై ఓటు వేసి,కుందురు,చెవిరెడ్డి లను గెలిపించండి..జంగంగుంట్ల గ్రామంలో ఇంటింటి ప్రచారంలో నాగార్జున రెడ్డి కుటుంబ సభ్యులు..నియోజకవర్గ అభివృద్ధి చెయ్యడమే నాగార్జున రెడ్డి లక్ష్యం*….

గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి గెలుపే లక్ష్యంగా వారి తమ్ముడు కుందురు కృష్ణ మోహన్ రెడ్డి సతీమణి కుందురు కోమలతా రెడ్డి మంగళవారం సాయంత్రం వరుసగా జంగంగుంట్ల గ్రామంలో ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాల అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు….ఎల్లప్పుడు గిద్దలూరు ప్రజల సంక్షేమం, కార్యకర్తల బాగోగులు చూసే తత్వం,నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా నాగార్జున రెడ్డి పనిచేస్తరన్నారు*…నియోజకవర్గ అభివృద్ధి కోసం తపన పడే నాగార్జున రెడ్డికి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు మద్దతుగా నిలవాలన్నారు…మే 13న జరిగే ఎన్నికల్లో గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న కుందురు నాగార్జున రెడ్డి మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు…కార్యక్రమంలో జంగంగుంట్ల సర్పంచ్ మాసాని సుజాత,ఎంపీపీ తులసమ్మ ఓబుల్ రెడ్డి, కంభం మండల వైయస్సార్ సీపీ కన్వీనర్ గొంగటి చెన్నారెడ్డి, కంభం మండల మాజీ మార్కెట్ చైర్మన్ నెమలిదిన్నె చెన్నారెడ్డి, ఎంపీటీసీ పాలగిరి శరభారెడ్డి,కంభం మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు….

7k network
Recent Posts

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి

*మృతుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం:CBN …* జగన్ ది అక్రమ సంబంధం’…వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు. షర్మిల షాకింగ్ కామెంట్స్! .. 👉తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఇద్దరు అధికారులు సస్పెండ్, ముగ్గురు బదిలీ* .. 👉ఆరు శవాలు – వైసీపీకి ఎంత బలమో !*.. *రికార్డుల కోసం భక్తుల ప్రాణాలతో చెలగాటం*… 👉జి డీ సి సి బ్యాంక్ లో 5 కోట్ల రూపాయల వరకు స్క్మాం …*గిద్దలూరు: నీటి సమస్యపై అత్యవసర సమావేశం..

తప్పు జరిగింది.. క్షమించండి: పవన్ .. *తొక్కిసలాట ఘటనలో డీఎస్పీని బకరాను చేస్తున్నారు: బీవీ రాఘవులు..*తొక్కిసలాట ఘటనకు సీఎం బాధ్యత వహించాలి: రోజా* 👉 టీటీడీ తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు.. .. *ఫార్ములా ఈ కారు రేసులో దూకుడు – ఆయన అనుమతితోనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాం… *పేట’ప్రిన్సిపల్ వేధింపులతోనే విద్యార్థి ఆత్మహత్య*.. *సిరిసిల్లలో కదులుతున్న భూకబ్జాలు డొంక..!.