👉*మృతుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం: CBN*
తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని సిఎం చంద్రబాబు వెల్లడించారు.
ఇక మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వనుండగా తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి రూ.5 లక్షలు, గాయపడ్డ 33 మందికి రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి (33+2 మంది) రేపు ప్రత్యేకంగా వైకుంఠ దర్శనం కల్పిస్తామన్నారు.
👍 జగన్ ది అక్రమ సంబంధం’… షర్మిల షాకింగ్ కామెంట్స్! ఈ క్రమంలో ఆ కామెంట్లకు బలం చేకూరుస్తూ మరోసారి జగన్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. సమయం ఏదైనా, సందర్భం మరేదైనా, అంశం ఎలాంటిదైనా… వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, తన సోదరుడు జగన్ పై నిప్పులు చెరిగే విషయంలో షర్మిల ఏమాత్రం తగ్గరనే కామెంట్లు ఇటీవల వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ కామెంట్లకు బలం చేకూరుస్తూ మరోసారి జగన్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.
తాజాగా ప్రధానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపనలు చేశారు. అయితే.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాత్రం నోరు మెదపలేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ విషయంపై స్పందిస్తూ జగన్ పై విమర్శలు గుప్పించారు షర్మిల. ఇందులో భాగంగా… ప్రధాని తన తాజా పర్యటనలో విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఏమీ మాట్లాడకపోయినా.. రాష్ట్రంలోని కూటమితో పాటు జగన్ కూడా మౌనంగా ఉండిపోయారని షర్మిల విమర్శించారు. కేంద్రంలోని బీజేపీతో రాష్ట్రంలో ఎన్డీయే కూటమిది సక్రమ సంబంధం అని చెప్పిన షర్మిల… జగన్ ది మాత్రం అక్రమ సంబంధం అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో… వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ అయ్యి ఉండి జగన్ బీజేపీతో అంటకాగుతున్నారని విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మోడీ మాట్లాడకపోయినా మౌనంగా ఉండటంపై అటు ఏపీ కూటమి ప్రభుత్వాన్ని, జగన్ ను ప్రశ్నించారు.ఈ నేపథ్యంలోనే నేడు విశాఖలో మౌనదీక్ష చేస్తున్నట్లు తెలిపారు.ఈ క్రమంలో విశాఖలో పర్యటిస్తున్న షర్మిల…జై భీమ్, జై బాపూజీ, జై సంవిధాన్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సమయంలో కాంగ్రెస్ అంబేద్కర్ జపం చేస్తే తప్పేమిటని ఆమె ప్రశ్నించారు. అంబేద్కర్ కోసం మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారని భారతీయ జనతాపార్టీపై విమర్శలు గుప్పించారు. అంబేద్కర్ ను బీజేపీ అవమానపరిచిందని మండిపడ్డారు. ఇదే సమయంలో… కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే రిజర్వేషన్స్ ఉండవని.. రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారని సంచలన ఆరోపణలు చేసిన షర్మిల… అంబేద్కర్ ను అవమానించిన హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని.. లేకపోతే ప్రధాని మోడీ ఆయనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
*👉వైఎస్ షర్మిలా రెడ్డి ఏపీ సి సి చీఫ్.. విజయవాడ
వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు..గోవింద నామాలు ప్రతిధ్వనించాల్సిన చోట ఘోరమైన మృత్యుఘోష..లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా … కనీస ఏర్పాట్లు చేయకపోవడం పాలన యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనం.
ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి.
చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం అన్యాయం.
ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించాలి.
వారి ఇంట్లో అర్హులు ఉంటే ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నాం..మొన్న లడ్డు కల్తీ.. నేడు తొక్కిసలాట..కోట్లాది హిందువుల ఆరాధ్య దేవుడు, కలియుగ దైవం వెంకన్న క్షేత్రానికి మచ్చ తెచ్చి పెట్టాయి.
రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తొక్కిసలాట ఘటనపై వెంటనే అత్యున్నత విచారణ జరిపించి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
👉తొక్కిసలాట సంఘటనపై దర్యాప్తు చేయండి*
*ఏకాదశి టోకెన్ల సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట సంఘటనలో ఆరుగురు మృతి చెందటం మహా విషాదమని, సంఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు.వేలాదిగా భక్తులు తరలివస్తారని తెలిసి కూడా జాగ్రత్తలు తీసుకోకపోవటం, ఆయా శాఖలు సమన్వయంతో పని చేయకపోవటం విమర్శలకు అవకాశం ఇస్తోందని చెప్పారు. కొండమీద దేవదేవుని దర్శనం ప్రాణాంతకంగా మారటాన్ని భక్తులు జీర్ణించుకోలేరని తెలిపారు. టోకెన్లు పంపిణీ కొండ క్రిందే కౌంటర్లు పెట్టి చేయాల్సిన పని లేదని, ఆయా జిల్లాల వారీగా కూడా భక్తులకు అందజేసేలా చర్యలు తీసుకుంటే తొక్కిసలాటలు జరగవని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవటం తోపాటు, మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం తక్షణం ఆర్థిక సహాయం చేయాలని బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు.*
👉*ఆరు శవాలు – వైసీపీకి ఎంత బలమో !*
తిరుపతిలో జరిగిన ఓ దుర్ఘటన వేదికగా వైసీపీ రెచ్చిపోతోంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు రోజా, అంబటి, వైవీ సుబ్బారెడ్డి లాంటి ఉద్దండులు మీడియా ముందుకు వచ్చి రెచ్చిపోతున్నారు. రాజీనామాలు చేయాలని సవాల్ చేస్తున్నారు. తమ హయాంలో తిరుమలలో భ క్తుల్ని దోచుకుని దర్శన టిక్కెట్లతో లక్షలు సంపాదించుకున్న రోజా.. ఇప్పుడు ఆ ఆటను టీటీడీ జేఈవో వెంకయ్య చౌదరి సాగనీయడం లేదు. దాంతో ఆమె.. వెంకయ్యచౌదరిని టార్గెట్ చేశారు. ఆయనను తప్పించాలని డిమాండ్ చేశారు. అసలు జరిగిన ఘటన ఏంటి.. టీటీడీ జేఈవోను తొలగించాలని డిమాండ్ చేయడం ఏమిటి ?
అంబటి రాంబాబు,వైవీ సుబ్బారెడ్డి వంటి వారు కూడా మీడియా ముందుకు వచ్చి తమ శవరాజకీయ ప్రదర్శన చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. అక్కడేం జరిగిందో చెప్పడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. కానీ కూటమి ప్రభుత్వమే ఈ తొక్కిసలాటకు కారణం అని.. వెంటనే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీలో ఎప్పుడూ కనిపించనంత ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ ఆఫీసులో రోజాకు ఇటీవలి కాలంలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఇవ్వలేదు. శ్యామలకూ చాన్సిచ్చారు కానీ రోజాకు ఇవ్వలేదు. కానీ ఈ విషయంలో మాత్రం రోజాకు అవకాశం ఇచ్చారు.శవరాజకీయాలు చేయడంలో వైసీపీకి ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. తిరుమలలో తాము చేసిన తప్పిదాలన్ని ఒకటొకటిగా బయటపడుతూండటంతో.. వాటిని కప్పి పుచ్చుకునేందుకు ఈ తొక్కిసలాట ఘటనను ఉపయోగించుకుని తెరమీదకు వచ్చి ప్రభు్త్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
👉*రికార్డుల కోసం భక్తుల ప్రాణాలతో చెలగాటం*
తిరుమల శ్రీవారి దర్శనం రికార్డుల కోసం టిటిడి ధర్మకర్తల మండలి ఛైర్మన్, ఇవో, అదనపు ఇవోలు పాకులాడుతున్నారన్నారని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల మందికి దర్శనం చేయిస్తే తమ పేరు మీద రికార్డులు ఉంటాయనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. రోజుకు లక్ష మందికి దర్శనం చేయించడం కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు24 గంటల వ్యవధిలో లక్ష మందికి దర్శనం చేయించాలంటే ఒక్కో భక్తుడికి కసీసం అర సెకను కూడా దర్శన భాగ్యం కలగదని తెలిపారు. విఐపిల సేవలో తరిస్తూనే సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
*టిటిడి ఛైర్మన్ చేసిన ప్రకటనే ఈ ఘటనకు కారణం*
వైకుంఠ ఏకాదశితో పాటు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలంటే టోకెన్లు ఉండాల్సిందేనని, టోకెన్లు లేకపోతే దర్శనం ఆశించవద్దని టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు చేసిన ప్రకటనతోనే భక్తులు పెద్ద సంఖ్యలో టోకెన్ల కోసం బారులు తీరారని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టోకెన్లు లేకపోతే తిరుమలకు వెళ్లలేమనే ఆందోళనతోనే భక్తులు ఒక రోజు ముందు నుంచే టోకెన్ల కోసం క్యూ లైన్లలోకి వచ్చారని తెలిపారు. సామాన్య భక్తులకు దర్శనం కోసం నిర్బంధ టోకెన్ల విధానం పెట్టడం సరికాదన్నారు. టిటిడి ఛైర్మన్ ఆ ప్రకటన చేయకపోతే ఈ ఘటన జరిగేది కాదన్నారు రామచంద్రయాదవ్.
👉*వైసిపి ప్రభుత్వ విధానాలనే కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం*
గతంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పేరుతో రెండు రోజులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉండేదని, వైసిపి ప్రభుత్వ హయాంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు శ్రీకారం చుట్టి, తిరుపతిలో టోకెన్ల విధానాన్ని ప్రవేశ పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇదే విధానాలపై విమర్శలు గుప్పించి అధికారంలోకి వచ్చాక వాటిని కొనసాగించడం దేనికి నిదర్శనమో చెప్పాలన్నారు. శ్రీవాణి టిక్కెట్ల విషయంలో కూడా రాద్దాంతం చేసిన కూటమి పెద్డలు… అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేయలేదని గుర్తు చేశారు. ప్రక్షాళన చేయాల్సింది వ్యవస్థలను కాదని, ప్రభుత్వ పెద్దల ఆలోచనలని ఆయన దుయ్యబట్టారు.
👉*రేవంత్ రెడ్డి రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలు అడిగారు: మాజీ మంత్రి కేటీఆర్* హైదరాబాద్: జనవరి 09
ఫార్ములా -ఈ కేసులో కేటీఆర్ విచారణ ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లంచ్ బ్రేక్ మినహా ఏడు గంటల పాటు ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు.
ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు తనకు తెలిసిన సమాచారం ఇచ్చాను. వాళ్లు ఎన్నిసార్లు విచార ణకు పిలిచినా వస్తానని చెప్పిన. ఇదో చెత్త కేసు.. ప్రభుత్వ ఒత్తిడిలో మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియడం లేదు అని చెప్పిన..రాజకీయ కక్ష సాధింపుల కోసం రేవంత్ పెట్టిన ఈ కేసుతో సాధించేది ఏమీ లేదు. ”రేవంత్ రెడ్డి రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలను తిప్పితిప్పి 40 రకాలుగా ప్రశ్నించారు. మేము ఇక్కడి నుంచి పైసలు పంపినం.. వాళ్లకు అక్కడ పైసలు ముట్టినయి.. ఇక్కడ కరప్షన్ ఎక్కడుం దని నేను అడిగిన.. వాళ్లదగ్గర సమాధానం లేదు.” అన్నారు. పోలీసు లతో తీరుపై కేటీఆర్ అసహనం మీడియాతో మాట్లాడితే పోలీసులకు ఎందుకు భయమని కేటీఆర్ ప్రశ్నించారు.
తన విచారణ ముగిసిన తర్వాత ఏసీబీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన కేటీఆర్ అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈక్రమంలోనే పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవాలనిసూచించారు.
మీడియా ప్రతినిధులు అక్కడే ప్రశ్నలు అడుగు తుండటంతో పోలీసులు తోసేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసుల తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. తాను అక్కడ మాట్లాడు తంటే ఎందుకు అంత భయమని ప్రశ్నించారు. అన్ని బారికేడ్లే పెట్టి ట్రాఫిక్ అలో చేస్తామని చెప్పడం ఏమిటని నిలదీశారు.
👉 తిరుపతి వైకుంఠ ఏకాదశి టికెట్ల కౌంటర్ల వద్ద తొక్కిసలాట ఘటనలో అధికారులపై వేటు..
ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు,,సి.వి.ఎస్.ఓ, శ్రీధర్ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌతమి బదిలీ….. గోశాల హరినాథ్ రెడ్డి సస్పెండ్
తిరుపతి డి.ఎస్.పి రమణ కుమార్ సస్పెండ్
👉జి డీ సి సి బ్యాంక్ లో 5 కోట్ల రూపాయల వరకు స్క్మాం
(గుంటురు జిల్లా):- గుంటూరు జి డీ సి సి బ్యాంక్ లో 5 కోట్ల రూపాయల వరకు స్క్మాం జరిగినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ గుంటూరు జి డీ సీ సీ బ్యాంక్ అక్రమాలు లో 18 కేసులు నమోదు చేసామని, 30 మంది అనుమానితులు గుర్తించామని, 11 మంది నిందితులను అరెస్టు చేశాం, మరో 19 మంది నీ విచారణ చేయాలిసి ఉంది, అక్రమాల కేసులో విచారణ చేయాలిసిన 19 మంది లో వీఆర్వో , రెవెన్యూ శాఖ అధికారులు లు సైతం ఉన్నారని. తప్పుడు భూముల సర్వేల ద్వారా ఆన్లైన్లో భూములు ఎక్కించడం వల్ల, భూముల పాస్ పుస్తకాలు ఉండడంవల్ల బ్యాంకు రైతులకు నిధులు కేటాయించిందని, విచారణలో ఫేక్ ఆధార్ కార్డు సృష్టించి రైతులు కానీ వారికి నిధులు కేటాయించారు. జి డీ సి సి బ్యాంక్ లో 5 కోట్ల రూపాయల వరకు స్క్మాం జరిగివుంటుందని బాపుతున్నామని అన్నారు. నిందితుల్లో మాజీ బ్రాంచ్ మేనేజర్ కీలక పాత్రధారి రవి కుమార్ నీ అరెస్టు చేసామని, బ్యాంక్ అక్రమాలు చోటు చేసుకున్న ఘటనలో సాధ్యమైన మేర నిధులు రికవరి చేస్తామని, జి డీ సి సి బ్యాంక్ లో అక్రమాల భాగోతం పై సహకార సంఘాల సీఈఓ లను సైతం విచారణ చేస్తామని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
👉*బాధితులకు అండగా బిసివై పార్టీ.. మృతుల కుటుంబాలకు రూ.50 వేలు, క్షతగాత్రులకు తక్షణ ఆర్థిక సాయం అందజేసిన రామచంద్రయాదవ్*
*ప్రభుత్వ పరిహారానికంటే ముందే బాధితులకు సాయం అందజేత
*రామచంద్రయాదవ్ వద్ద బోరున విలపించిన మృతుల కుటుంబ సభ్యులు
*ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన రామచంద్రయాదవ్
*టిటిడి బోర్డును రద్దు చేయాలి
-స్థానికంగా నివాసం ఉంటేనే ధర్మకర్తల మండలిలో చోటు కల్పించాలి-టిటిడి బోర్డు సభ్యుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలి..*మృతుల సంఖ్యను బయటపెట్టాలి
-బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి
-బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ డిమాండ్
గోవిందనామ స్మరణతో మార్మోగాల్సిన పవిత్ర పుణ్య క్షేత్రం…మరణ ఘోషతో విలపించడం చాలా బాధాకరమన్నారు భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్. వైకుంఠ ఏకాదశి టోకెన్ల పంపిణీలో జరిగిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలతో పాటు క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. గురువారం ఆయన తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి వారికి తక్షణ ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం రుయా మార్చురీ వద్ద మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 వేల రూపాయల సాయాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటన జరగడం చాలా దారుణమన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్ధం వచ్చిన భక్తుల పట్ల ఇలా వ్యవహరించడం క్షమించరాని నేరమన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. టిటిడి ధర్మకర్తల మండలి విఐపిల సేవలో తరిస్తోందని దుయ్యబట్టారు. ఆధ్యాత్మిక చింతన, అనుభవం లేని వారికి టిటిడి ధర్మకర్తల మండలిలో చోటు కల్పిస్తే ఇలాంటి పరిస్థితులే తలెత్తుతాయన్నారు. వెంటనే టిటిడి ధర్మకర్త మండలిని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టిటిడి ధర్మకర్తల మండలిలో చోటు కల్పించే సందర్భంలో సభ్యుల నుంచి స్థానికంగా నివాసం ఉంటామని డిక్లరేషన్ తీసుకోవాలన్నారు. రాజకీయ నాయకులకు, కార్పోరేట్లకు టిటిడిని పునరావాస కేంద్రంగా మార్చేస్తున్నారని
👉రికార్డుల కోసం భక్తుల ప్రాణాలతో చెలగాటం*
తిరుమల శ్రీవారి దర్శనం రికార్డుల కోసం టిటిడి ధర్మకర్తల మండలి ఛైర్మన్, ఇవో, అదనపు ఇవోలు పాకులాడుతున్నారన్నారని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల మందికి దర్శనం చేయిస్తే తమ పేరు మీద రికార్డులు ఉంటాయనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. రోజుకు లక్ష మందికి దర్శనం చేయించడం కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు24 గంటల వ్యవధిలో లక్ష మందికి దర్శనం చేయించాలంటే ఒక్కో భక్తుడికి కసీసం అర సెకను కూడా దర్శన భాగ్యం కలగదని తెలిపారు. విఐపిల సేవలో తరిస్తూనే సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
👉టిటిడి ఛైర్మన్ చేసిన ప్రకటనే ఈ ఘటనకు కారణం*
వైకుంఠ ఏకాదశితో పాటు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలంటే టోకెన్లు ఉండాల్సిందేనని, టోకెన్లు లేకపోతే దర్శనం ఆశించవద్దని టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు చేసిన ప్రకటనతోనే భక్తులు పెద్ద సంఖ్యలో టోకెన్ల కోసం బారులు తీరారని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టోకెన్లు లేకపోతే తిరుమలకు వెళ్లలేమనే ఆందోళనతోనే భక్తులు ఒక రోజు ముందు నుంచే టోకెన్ల కోసం క్యూ లైన్లలోకి వచ్చారని తెలిపారు. సామాన్య భక్తులకు దర్శనం కోసం నిర్బంధ టోకెన్ల విధానం పెట్టడం సరికాదన్నారు. టిటిడి ఛైర్మన్ ఆ ప్రకటన చేయకపోతే ఈ ఘటన జరిగేది కాదన్నారు రామచంద్రయాదవ్.
👉తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఇద్దరు అధికారులు సస్పెండ్, ముగ్గురు బదిలీ*
*సిఎం చంద్రబాబు సమీక్షలో కీలక నిర్ణయాలు*
▪️డీఎస్పీ రమణకుమార్ బాధ్యత లేకుండా పనిచేశారు. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిని సస్పెండ్ చేస్తున్నాం.
▪️ఎస్పీ సుబ్బారాయుడు, జేఈవో గౌతమి, టీటీడీ ముఖ్య భద్రతాధికారి శ్రీధర్‌ను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం.
▪️తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ విచారణ చేయిస్తాం.
👉 ప్రకాశం జిల్లా మద్దిపాడులో మినీగోకులం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నరాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా.శ్రీ బాల వీరాంజనేయస్వామి ,సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్.విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా. స్టాఫ్ రిపోర్టర్ రహమాన్..
👉*అవినీతి తో మసకబారుతున్న ప్రకాశం జిల్లా…?*
*అడ్డు అదుపు లేకుండా ప్రతి దాని మీద రాజకీయ కప్పం వసూళ్లు…?..*కొందరు ఎమ్మెల్యే ల తీరు పై ప్రజలలో వ్యతిరేకత…చీమకుర్తి గ్రానైట్ టన్నులో 8,000/- వరకూ కప్పం…? రేషన్ బియ్యం అక్రమ తరలింపులో కప్పం…?
అనదికారికంగా వేల కొద్ది ఫ్లెక్స్ బోర్డులు ఏర్పాటు…
ఉచిత ఇసుకలో టన్నుకు 400/- వరకూ కప్పం…?
మద్యం వ్యాపారుల నుండి అనైతిక కప్పం…?
ట్రాన్స్ఫర్ ల లో భారీ స్థాయిలో కప్పం…?
బి. ఎడ్ కాలేజీ ల అక్రమాలు కప్పి పుచ్చడానికి కప్పం…?
ఇంకా మరెన్నో కప్పాలు…?
*పోలీస్ నిఘా వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అక్రమాలు చేరావేయడం లేదా…?*విస్తృత ప్రజా ప్రయోజనాలే మా లక్ష్యం…
👉*మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి…*ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర కమిటీ*
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విడుదల నేపథ్యంలో తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడం మమ్మల్ని తీవ్ర మనోవేదనకు గురిచేసింది..టీటీడీ విజిలెన్స్, పోలీసుల వైఫల్యం పై విచారణ చేయాలి..మృతుల కుటుంబాలకు టీటీడీ లో శాశ్వత ఉద్యోగం కల్పించాలి..గాయపడిన వారికి మెరుగైన వైద్యం కల్పించి, ఆర్థిక సహాయం చేయాలి.
ఇటువంటి అవాంచనీయ ఘటనలకు తావీయకుండా టిటిడి మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి.మృతి చెందిన భక్తుల కుటుంబాలకు ప్రభుత్వం, టీటీడీ అండగా ఉండాలి..
👉గిద్దలూరు: నీటి సమస్యపై అత్యవసర సమావేశం
గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయంలో కమీషనర్ వెంకట దాసు శుక్రవారం నీటి సమస్యపై సంబంధిత అధికారులు సిబ్బందితో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో నీటి సమస్య తర్వాత కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వారికి వివరించారు. గుండ్ల మోటు నుంచి పట్టణానికి నీటి సరఫరా చేసే మూడు మోటర్లు చెడిపోయినట్లుగా కమిషనర్ దృష్టికి వారు తీసుకువెళ్లారు. వెంటనే సమస్య పరిష్కరించాలని కమిషనర్ అన్నారు.