ప్రియాంక గాంధీపై బీజేపీ నేత ర‌మేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల ప‌ట్ల‌ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మంత్రి సీత‌క్క‌*.. *నవీన్ కి చెక్ పెట్టినట్లే కేజ్రీవాల్ కి కూడా ?.. *ఈ ఫార్ములా రేసులో కొన్ని నిజాలు *.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మెన్ జంగా రాఘవ రెడ్డి … ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మంత్రి సత్య కుమార్ యాదవ్* …ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా దోచుకున్న ఓం నారాయణ పై చర్యలు : లంబాడి హక్కుల పోరాట సంఘం.. *పొదిలి మాదిరెడ్డిపాలెం వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా ఎర్రం రెడ్డి

👉 నవీన్ కి చెక్ పెట్టినట్లే కేజ్రీవాల్ కి కూడా ? 2024 ఎన్నికల్లో గెలిస్తే కనుక నవీన్ భారతీయ రాజకీయాల్లోనే తిరుగులేని చరిత్ర సృష్టించేవారు. ఒడిషా సీఎం గా ఈసారి కూడా గెలిస్తే దేశంలో అత్యధిక కాలం పాలించిన సీఎం గా నవీన్ పట్నాయక్ సరికొత్త రికార్డుని నెలకొల్పి ఉండేవారు. ఆయన వరసగా అయిదు సార్లు సీఎం గా గెలిచారు. దాదాపుగా 24 ఏళ్ల పాటు పనిచేశారు. 2024 ఎన్నికల్లో గెలిస్తే కనుక నవీన్ భారతీయ రాజకీయాల్లోనే తిరుగులేని చరిత్ర సృష్టించేవారు. అంటే దాదాపుగా మూడు దశాబ్దాల సీఎం అన్న మాట.
మరి ఆ ఖ్యాతి ఆయనకు దక్కకుండా సర్వశక్తులూ ఉపయోగించి బీజేపీ ఆయనను ఓడగొట్టింది. మాజీ సీఎం ని చేసింది. దాంతో ఆయన ఎనభయ్యేళ్ళ వయసుకు చేరువ అయిన వృద్ధ నేతగా రాజకీయాల్లో మిగిలిపోయారు. ఆయనను ఓడించేందుకు బీజేపీ అనేక వ్యూహాలను అమలు చేసింది. ప్రజలలో ఎంతో అనుబంధం పెనవేసుకున్న నవీన్ పట్నాయక్ జీవించి ఉన్నంతవరకూ సీఎం అని అంతా నమ్మిన దాన్ని కమల వ్యూహం వమ్ము చేసి పారేసింది. వైరల్ స్పిన్ లో అశ్విన్ ఓడేంతవరకూ కూడా నవీన్ పట్నాయక్ కూడా ఆ విషయాన్ని నమ్మలేని పరిస్థితి ఉంది అంటే బీజేపీ రాజకీయ పద్మవ్యూహం ఏ స్థాయిలో అమలు చేసిందో అన్నది అర్ధం చేసుకోవాలి. ఇపుడు అదే రాజకీయ తంత్రాన్ని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీద ప్రయోగిస్తోందని అంటున్నారు. ఈసారి కనుక ఆప్ ని ఓడిస్తే ఇక ఆ పార్టీకి రాజకీయంగా చావు దెబ్బ కొట్టినట్లే అన్నది బీజేపీ సిద్ధాంతకర్తల ఆలోచనగా ఉంది. ఎందుకంటే ఆప్ కి అసలైన ఆకర్షణ కేజ్రీవాల్. ఆయనకు ఈసారి ఎన్నికలు అతి ముఖ్యమైనవి. ఆయన మీద లిక్కర్ స్కాం ఆరోపణలు ఉన్నాయి. కొద్ది నెలల పాటు జైలుకు వెళ్ళి వచ్చారు. ఆయన సీఎం పదవికి రాజీనామా చేయడం వెనక కూడా వ్యూహం ఉంది. తాను ప్రజా కోర్టులో నిర్దోషిగా నిరూపించుకుని మళ్లీ సీఎం గా ప్రమాణం చేస్తాను అని చెప్పి జనంలోకి వచ్చారు. అందువల్ల ప్రజా కోర్టు కూడా ఆయనను దోషి అనాలంటే ఆయన కచ్చితంగా ఓడి తీరాలి. ఆ మీదట ఆయన న్యాయపరమైన కేసులను ఎటూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొత్తానికి రాజకీయంగా క్లిష్టమైన పరిస్థితులలో ఉన్న కేజ్రీవాల్ ని ఓడించడమే బీజేపీ పట్టుదలగా చెబుతున్నారు. అంతే కాదు ఈసారి కేజ్రీవాల్ గెలిస్తే ఆయన వరసగా ఐదోసారి ఢిల్లీకి సీఎం గా ఉంటారు. అది ఒక రికార్డు, ఢిల్లీని ఎక్కువ సార్లు పాలించిన నేతగా కేజ్రీవాల్ కి ఇప్పటికే ఒక పేరు ఉంది.ఈసారి గెలిస్తే ఇక ఎవరూ అందుకోలేని రికార్డు ఆయన సొంతం అవుతుంది. అంతే కాదు ఏకంగా దశాబ్దన్నర కాలం పైగా సీఎం గా ఉన్న వారిగా మరో రికార్డు సృష్టిస్తారు.అందుకే ఆయన రికార్డుకు బ్రేకులు వేస్తూ ఆయన ఆశలకు చెక్ పెడుతూ బీజేపీ దూకుడు చేస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ పెద్దలంతా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఒక విధంగా చావో రేవో అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే వరసగా అక్కడ అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ పాలనలో అభివృద్ధి ఏమీ జరగలేదని కూడా విమర్శిస్తున్నారు. మొత్తానికి చూస్తే ఆప్ అధినేత అరవింద్ ఈసారి కూడా గెలిచి బీజేపీ రాజకీయ పద్మవ్యూహం చేదించిన అభిమన్యుడు అవుతారా లేక ఒడిషా నవీన్ పట్నాయక్ మాదిరిగా ఎన్నికల రణక్షేత్రంలో చతికిలపడతారా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.
👉20 సెకన్ల పాటు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి: సీఎం చంద్రబాబు..
HMPV వైరస్ నేపథ్యంలో ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ప్రజలంతా శుభ్రత పాటించాలని.. ఎప్పటికప్పుడు 20 సెకన్ల పాటు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఐసీఎంఆర్ అధీకృత వైరాలజీ ల్యాబ్‌లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 3 వేల HMPV టెస్టింగ్ కిట్లను, ఔషధాలను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు.
👉 *కాంగ్రెస్ అగ్ర‌నేత,ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నేత ర‌మేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల ప‌ట్ల‌ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మంత్రి సీత‌క్క‌*..*ఆదిలాబాద్
ప్రియాంకా గాంధీ మీద చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నా.. ర‌మేష్ బిధూరి వ్యాఖ్య‌లు యావ‌త్ మ‌హిళా లోకానికే అవ‌మానక‌రం అని మంత్రి సీతక్క ఖండించారు..ర‌మేష్ బిధూరి వ్యాఖ్య‌ల‌ను అంతా ఖండించాలి..ఆయ‌న బేషరతుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి..ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన బిధూరిని పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేయాలి…ఇలాంటి వాల్ల‌కు టికెట్లు ఇస్తే మ‌హిళ‌లు స్వేచ్చ‌గా, నిర్బ‌యంగా తిర‌గ‌గ‌ల‌రా? …
మ‌హిళా వ్య‌తిరేక‌త‌ను బీజేపీ అనువ‌నువునా నింపుకుంది..
అందుకే ర‌మేష్ బిధూరిని బీజేపీ వెన‌కేసుకొస్తుంది..ఒక మహిళ శరీరాన్ని రోడ్లతో పోల్చి త‌న‌ దుర్బుద్ధిని, పురుష దురంకారాన్ని బీజేపీ బ‌య‌ట‌పెట్టుకుంది..త‌న వికృత చేష్ట‌ల‌తో ఆడ‌వాల్ల‌ను బీజేపీ అవ‌మాన ప‌రుస్తోంది..బీజేపీకి మ‌హిళ‌లు బుద్ది చెప్ప‌డం ఖాయం..మను ధర్మ శాస్త్రాన్ని అవలంబించడమే బిజెపి మూల సిద్ధాంతం.మను ధర్మ శాస్త్రంలో మహిళలను గౌరవించిన చరిత్ర లేదు..మ‌హిళ‌ల‌ను గౌర‌వించ‌డం బీజేపీకి తెలియ‌దనీ ఆరోపించారు.
👉 ప్రజా భవన్ లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మెన్ జంగా రాఘవ రెడ్డి,ఈ సందర్బంగా ఢిల్లీ లో జరగానున్న ఖోఖో వరల్డ్ కప్ 2025 జనవరి 13 నుండి 19 తారీకులో జరిగే ఈ వేడుకలో సుమారు 600 మంది క్రీడాకారులు మొత్తం 24 దేశాల నుండి పాల్గొనున్నారు,ఇందిరా గాంధీ స్టేడియం కాంప్లెక్స్ లో అట్టహాసంగా జరగానున్న ఈ ఇంటర్నేషనల్ వేడుకకు ఉపముఖ్యమంత్రిని ఆహ్వానించించారు. కార్యక్రమంలో సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి,ఖో ఖో తెలంగాణ సెక్రటరీ కృష్ణ మూర్తి గౌడ్ పాల్గొన్నారు…….
👉*HMP వైరస్ కలకలం,*
**ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మంత్రి సత్య కుమార్ యాదవ్**
ఏపీలో ఇప్పటివరకు ఎటువంటి హెచ్ఎంపీ వైరస్ కేసులు నమోదు కానందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ అన్నారు.
కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లో హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఏపీలో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులను ఆదేశించారు మంత్రి సత్యకుమార్ యాదవ్.
ల్యాబ్స్, కిట్లు, యాంటీ వైరల్ మందులు సిద్ధం చేసుకోవాలని ఆదేశం..
ఆయా రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యల గురించి వైద్య ఆరోగ్య శాఖల కార్యదర్శులతో మాట్లాడి తెలుసుకోవాలని స్పెషల్ సీఎస్ కృష్ణబాబును ఆదేశించారు మంత్రి సత్యకుమార్‌ యాదవ్. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు వైజాగ్‌లో ఉన్న మంత్రి సత్యకుమార్ యాదవ్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో ఉన్న 10 ఐసీఎంఆర్‌, 9 వీడీఆర్ఎల్ ల్యాబులను సన్నద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. అవసరాన్ని బట్టి టెస్టులకు కావాల్సిన కిట్లు, యాంటీ వైరల్ మందుల లభ్యతపై అంచనాలు తయారు చేయాలన్నారు.
పరిస్థితిని బట్టి ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవాలో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలక అనుగుణంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై విధివిధానాలను రూపొందించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు మంత్రి సత్యకుమార్ యాదవ్. రాష్ట్రంలో ఉన్న తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు అందించాలని అధికారులను ఆదేశించారాయన.
అటు దేశంలో HMPV కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా హ్యుమన్ మెటా న్యుమో వైరస్ కేసుల సంఖ్య 6 కి పెరిగింది. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, పశ్చిమ బెంగాల్ లో HMP వైరస్ కేసులు నమోదయ్యాయి. బెంగుళూరులో 2, చెన్నైలో 2 కేసులు నమోదయ్యాయి. అహ్మదాబాద్ లో ఒకటి, కోల్ కతాలో ఒక కేసు వెలుగు చూశాయి.
*చైనాలో వేగంగా వ్యాపిస్తున్న వైరస్ లు..
HMPV కేసులపై WHO తో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. అటు.. చైనా అత్యవసర ఆరోగ్య పరిస్థితిని ప్రకటించింది.చైనాలో ఇన్‌ఫ్లూయెంజా A, HMPV, మైకోప్లాస్మా న్యుమోనియా, COVID-19తో సహా పలు వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.
👉 ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా దోచుకున్న ఓం నారాయణ పై చర్యలు తీసుకొని, భూమిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి……….!*
– *లంబాడి హక్కుల పోరాట సంఘం* (ఎల్ హెచ్ పీఎస్) రాష్ట్ర అధ్యక్షులు *గుగులోతు భీమా నాయక్ …. *107 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు తొలగింపు పై మానుకోట జిల్లా జాయింట్ కలెక్టర్ లెనిన్ వత్సవ్ తొప్పో కి వినతి పత్రం అందజేసిన ఎల్ హెచ్ పీఎస్ జిల్లా బృందం……..*
*సంబంధిత RDO ని పిలిపించి విచారణకు అదేశించి, ప్రభుత్వ భూమి అని తేలితే గుంజుకుంటామని, ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు..
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దాదాపు 1000 కోట్ల ప్రభుత్వ భూమి ఆస్తిని అక్రమంగా కబ్జా చేసి ఆక్రమ కట్టడాలు చేసిన వ్యక్తి పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని లంబాడి హక్కుల పోరాట సంఘం (ఎల్ హెచ్ పీఎస్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో *జిల్లా జాయింట్ కలెక్టర్ లెనిన్ వాత్సవ్ తొప్పుకు వినతి పత్రం అందజేశారు *స్పందించిన జాయింట్ కలెక్టర్ వెంటనే RDO గారిని పిలిపించి విచారణకు ఆదేశించి ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు.* ఈ సందర్భంగా ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు *గుగులోతు భీమా నాయక్* మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ సమీపంలోని 107 సర్వేనెంబర్ లో ప్రభుత్వ భూమి 1.34 గుంటలు తో పాటు,గ్రీన్ ల్యాండ్ అప్పనంగా దోచుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అతని పై కఠినమైన చర్యలు తీసుకోవాలని,అదే విధంగా ఆ అక్రమ కట్టడాలను హైడ్రా తరహాలో కూల్చివేయాలని,అట్టి భూమిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రియమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీలాంటి గొప్ప వ్యక్తి జైలుకు వెళ్లి వచ్చారు,కానీ ఇతను ప్రభుత్వ ఆస్తిని అక్రమంగా దోచుకొని వందల కోట్ల విలువ చేసే ఆస్తిని దోచుకున్నాడు, అలాంటి వ్యక్తిని ఎందుకు జైలుకు పంపకూడదు అని…..మీరు జైలుకు వెళ్లినప్పుడు ఈ వ్యక్తి 10 సంవత్సరాలు టిఆర్ఎస్ లో కీలకంగా వున్నాడు,మొత్తం పెట్టుబడులు పెట్టినాడు……….
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాగానే కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు……..ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తే మీకే ప్రమాదం అని,దయచేసి మీ ఎమ్మెల్యే లకు చెప్పాలని భీమా నాయక్ సూచించారు………
గత ప్రభుత్వంలో వున్నప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఏ కు ప్రధాన అనుచరుడు గా వున్నాడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ ఎంఎల్ఏ లకు అనుచరుడు గా మారాడు,కానీ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టి గెలిపించిన కార్యకర్తలకు ఏమో తగిన గుర్తింపు ఇవ్వడం లేదని అన్నారు……….
మానుకోట జిల్లా అప్పటి కలెక్టర్ ప్రీతి మీనా గారు ఓం నారాయణ ఆక్రమించుకున్న సర్వేనెంబర్ 107 లో ప్రభుత్వ భూమి ఎకరం 1-34 గుంటల ఆక్రమించిన విషయం పై ప్రభుత్వ భూమి యందు నిర్మిస్తున్న అక్రమ కట్టడాల మీద వెంటనే విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాల్సిందే ఆదేశించారు…కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం అని అన్నారు.
ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో అక్రమ కట్టడాలను కులుస్తున్నారు,కానీ మానుకోట లో సైతం కూల్చాలని అని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు…….
*ప్రియమైన రేవంత్ రెడ్డి మీరు ప్రపంచ బ్యాంకు నుండి అప్పు తేవాల్సిన అవసరం లేదని, మీరు గనక మానుకోటలో ఉన్న 107 సర్వే నెంబరు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటే మానుకోట నుండే మీకు ఆదాయం ఇస్తామని భీమా నాయక్ స్పష్టత ఇచ్చారు. *ప్రభుత్వ అధికారులు స్పందించకపోతే ఈ పోరాటం మానుకోటకే పరిమితం కాకుండా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరపత్రాలు పంచుతామని, ప్రభుత్వ భూమిని కాపాడుకునేంతవరకు, ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి అప్పజెప్పేంతవరకు మా పోరాటం దశలవారీగా కొనసాగిస్తామని తెలిపారు…. కార్యక్రమంలో *ఎల్ హెచ్ పీఎస్ జిల్లా ప్రధాన సలహాదారుడు బాణోత్ విష్ణు నాయక్,LSO జిల్లా అధ్యక్షుడు శివ వర్మ నాయక్, వికలాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాందాస్ నాయక్,కార్యదర్శి బాలు నాయక్,పట్టణ బాధ్యుడు సోమోజి నాయక్,కురవి మండల అధ్యక్షులు శ్రీను నాయక్,బయ్యారం మండల బాధ్యుడు చంద్రశేఖర్ ఆజాద్ నాయక్,కొప్పుల కిరణ్,భూక్యా చిట్టి నాయక్,జవహర్లాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు……….*
👉 దీని భావమేమి ‘తిరుకేషా’….*ఈ ఫార్ములా రేసులో కొన్ని నిజాలు *…ఈ ఫార్ములా రేసు నిర్వహించిన
గ్రీన్ కో కంపెనీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయల లబ్ధి.. ఎన్నికల బాండ్ల రూపంలో 49 కోట్లు చెల్లించిన గ్రీన్ కో కంపెనీ ..గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు 41 సార్లు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో చందాలు ..
రేసుకు సంబంధించిన చర్చలు మొదలయినప్పటి నుండే ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసిన గ్రీన్ కో సంస్థ..
2022, 8 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్లను కొనుగోలు చేసినట్లు సమాచారం..
ప్రతి సారి రూ. కోటి విలువ చేసే బాండ్లు కొనుగోలు చేసిన
గ్రీన్ కో కంపెనీ..మొత్తమ్మీద రూ. 49 కోట్లను ఎన్నికల బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కు చెల్లించిన గ్రీన్ కో సంస్థ..
రోజు పొదిలి పట్టణం లోని ప్రభుత్వ జూనియర్ కాలేజి ప్రాంగణం లో పొదిలి యువకులు ముల్లా బాజీ వారి మిత్రులు ప్రారంభించిన క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వరికుంట్ల అనిల్ పండు, టీడీపీ అధ్యక్షులు మీగడ ఓబులరెడ్డి, మాజీ సర్పంచ్ కాటూరి నారాయణ ప్రతాప్, ఎండీ. గౌస్, ముల్లా రబ్బానీ తదితర టీడీపీ నాయకులు.
👉 పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం( మాదాలవారిపాలెం) వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా మల్లవరం గ్రామానికి చెందిన సీనియర్ టిడిపి నాయకులు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి పేరు ఖరారు ఖరారు చేసినట్లు సమాచారం.

7k network
Recent Posts

👉కర్రలతో కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ..* కేజీవాల్ కు అఖిలేష్ మద్దతు.. ”ఇదేంటి పవన్ ఇలా అనేశారు” .. *కుప్పం టీడీపీ కార్యాలయంలో ‘జన నాయకుడు’ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు .. ప్రకాశం జిల్లాలో కుక్కల స్వైర విహారం *గంజాయి గూచుల వద్ద 120 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న ఏసిపి..*ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే వారు స్వయంగా కంపోస్టు ఎరువు తయారు చేయండి:*కమిషనర్ ఎన్.మౌర్య*..👉 ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు: గిద్దలూరు సీఐ సురేష్ .. *ఆక్రమణకు గురైన మూడు ఎకరాల ప్రభుత్వ భూమి అప్పగింత* .. *ఆన్‌లైన్‌ బెట్టింగులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్…*రామ్ చరణ్, బాలయ్య సినిమాలపై హైకోర్టులో పిల్* 👉 బీజీపీ నేతలకు అద్దంకి దయాకర్ సవాల్ …*గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్? (కరీంనగర్).. * వైయస్ అభిషేక్ రెడ్డి మృతి..*

ప్రియాంక గాంధీపై బీజేపీ నేత ర‌మేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల ప‌ట్ల‌ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మంత్రి సీత‌క్క‌*.. *నవీన్ కి చెక్ పెట్టినట్లే కేజ్రీవాల్ కి కూడా ?.. *ఈ ఫార్ములా రేసులో కొన్ని నిజాలు *.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మెన్ జంగా రాఘవ రెడ్డి … ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మంత్రి సత్య కుమార్ యాదవ్* …ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా దోచుకున్న ఓం నారాయణ పై చర్యలు : లంబాడి హక్కుల పోరాట సంఘం.. *పొదిలి మాదిరెడ్డిపాలెం వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా ఎర్రం రెడ్డి

👉ఎంఎస్‌పీ పంజాబ్‌కే కాదు.. దేశమంతటికీ అవసరమే ..*తెలుగు తమ్ముళ్లకు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా.😲 ..హుస్నాబాద్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల లో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ … ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటులను పర్యవేక్షించిన జిల్లా అధికారులు ..*ఆత్మకూరులో ఇస్తేమ పనులను పర్యవేక్షించిన మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ .. *

👉ఏపీలో రేపటి నుంచి ఉచిత ఓపీ సేవలు బంద్ …* విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్..😲… *విశాఖ సెంట్రల్‌ జైల్ ను సందర్శించిన రాష్ట్ర హోం మంత్రి .. అగ్ని ప్రమాదాల పై అవగాహన సదస్సు.. *ఉచిత బస్సు కంటే ఇతర సంక్షేమ పథకాలకు ఖర్చు పెడితే బెటరేమో ! .. *అధికారులను సత్కరించిన పొదిలి పట్టణ టిడిపి అధ్యక్షుడు. . *నిలిచిపోయిన కాపు భవనాలను పునఃప్రారంభించాలి: బలిజ సేవ సంఘం డిమాండ్ .

2700 కోట్ల ఇల్లు.. రూ.10 లక్షల సూట్ ధరించే వారా విమర్శించేది? .. *పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్* .. *విజయవాడలో వెలుగు చూసిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం .. *చంద్రగిరి ‘బీసీ’ విద్యార్థినులకు మెరుగైన వైద్యం* *తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కు మంత్రి సవిత ఆదేశం*.. *ఆర్మీ వాహనం లోయలో పడి ఇద్దరు సైనికులు మృతి.. *పుత్తూరు సబ్ డివిజన్ పోలీసులు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు … మైలవరం లో మిక్సీంగ్ రాజకీయ సెగలు…! ..*రాజకీయ దుమారం రేపిన పాలడుగు దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే వసంత కలయిక… *ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ పోలీస్ సిబ్బంది జీవన విధానం ఉండాలి : ఐజి వి సత్యనారాయణ.. *పోలీసుల వేధింపులు తట్టుకోలేక హుజూర్‌ నగర్ పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం .. * డిగ్రీ విద్యార్థులకు కూడా తక్షణమే వర్తింప చేయండి..మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పివి శేషయ్య.

*రెవిన్యూ అధికారులకు పై సియం సీరియస్*…*ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు, కేసులు పెట్టే వారికి రక్షణ కల్పించేలా సర్కార్‌ చర్యలు.. *పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు పటిష్ట చర్యలు ; రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా…*కాంస్య పతకం సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఓరుగ‌ల్లు ముద్దుబిడ్డ .. *నితీష్ కి కన్ను గీటిన లాలూ..ఎన్డీయేలో కలవరమేనా ? ..*అమెరికాలో విచిత్రం ఇస్తున్న నోరో వైరస్ …*చైనాలో మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ