👉ఏపీలో రేపటి నుంచి ఉచిత ఓపీ సేవలు బంద్ …* విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్..😲… *విశాఖ సెంట్రల్‌ జైల్ ను సందర్శించిన రాష్ట్ర హోం మంత్రి .. అగ్ని ప్రమాదాల పై అవగాహన సదస్సు.. *ఉచిత బస్సు కంటే ఇతర సంక్షేమ పథకాలకు ఖర్చు పెడితే బెటరేమో ! .. *అధికారులను సత్కరించిన పొదిలి పట్టణ టిడిపి అధ్యక్షుడు. . *నిలిచిపోయిన కాపు భవనాలను పునఃప్రారంభించాలి: బలిజ సేవ సంఘం డిమాండ్ .

👉ఏపీలో రేపటి నుంచి ఉచిత ఓపీ సేవలు బంద్
నెట్‌వర్క్‌ హాస్పిటల్‌లో ఉచిత ఓపీ సేవలు బంద్
పెండింగ్‌ బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్
రేపటి చర్చల తర్వాత నిర్ణయం తీసుకోనున్న..
నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్
👉 విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్..😲😲😲
గత నెల 9న కంటైనర్ టెర్మినల్ లో తనిఖీలు చేసిన మంత్రి నాదేండ్ల..*కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో 259 టన్నుల రేషన్ బియ్యం గుర్తించినట్లు ప్రకటించిన మంత్రి నాదేండ్ల..
వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బియ్యం తీసుకొచ్చిన సంస్థపై కేసు నమోదు చేసినట్లు హడావిడి చేసిన మంత్రి నాదేండ్ల..*నెల రోజుల తర్వాత అవి రేషన్ బియ్యం కాదంటూ ధృవీకరణ..*వాటిని బిబో సంస్థకి ఎగుమతి కోసం అప్పగిస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు…*రేపోమాపో చైనాకి బియ్యంని తరలించేందుకు ఏర్పాట్లు..
👉 ఉచిత బస్సు కంటే ఇతర సంక్షేమ పథకాలకు ఖర్చు పెడితే బెటరేమో !!!…

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. అయితే ఈ పథకం మీద గత కొన్ని నెలలుగా చర్చలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎంతవరకు అవసరం అన్న విషయం ఏపీ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు అసలు ఈ పథకం వల్ల నిజంగానే లబ్ధి కలిగేది ఎవరికీ అన్న విషయం కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ పథకం కేవలం మహిళలకు మాత్రమే ప్రకటించడం జరిగింది.
మహిళల విషయానికే వస్తే కాలేజీకి వెళ్లే విద్యార్థులకు ప్రస్తుతం సపరేట్గా కొన్ని బస్సులు ఉన్నాయి. దీంతో వారు ఈ బస్సుల కోసం వెయిట్ చేసే అవకాశం ఉండదు. ఇక మిగిలిన మహిళలు కూడా నిత్యం తిరిగే చోట సిటీలలోనే అన్నట్టుగా తెలుపుతున్నారు. ప్రైవేటు ఉద్యోగం చేసుకొనే మహిళలకు ఈ పథకం కొంతవరకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పథకం కంటే ఎక్కువగా ఆర్థిక ప్రయోజనాల కలిగించే పథకాల మీద మక్కువ చూపుతున్నారట ఏపీ మహిళలు. ఈ పథకం కోసం బస్సులు కొని మరి మహిళలను అందులో ప్రయాణింప చేసేలా ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోందట.
అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టడంతో ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనదారులకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా తమ ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోతాయని వాపోతున్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి నష్టం జరుగుతుందట. ఉచిత బస్సు ప్రయాణం మీద మహిళలకు పెద్దగా ఇష్టం లేదని అసహనాన్ని తెలియజేస్తున్నట్లుగా తెలుస్తోంది..అందుకు ఉదాహరణగా మొదట కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజే సూపర్ సిక్స్ హామీలను ప్రకటిస్తామని చెప్పిన.. ఆ రోజు నుంచి ఉచిత బస్సు అని పోస్ట్ ఫోన్ చేస్తూనే ఉన్నారు.. కానీ మహిళలు మాత్రం.. మహిళలకు 1500 రూపాయలు,అమ్మఒడి, పింఛన్ పెంపు,ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి వాటికే ఎక్కువ మక్కువ చూపారు.. కానీ ఉచిత బస్సు విషయానికి చూపించలేదు..అందుకే ఏపీ ప్రజలు సీఎం చంద్రబాబు కి ఈ ఉచిత బస్సు ప్రయాణం పైన షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు.ఈ ఉచిత బస్సు ప్రయాణం ఖర్చు కూడా ప్రతి ఏడాది రూ.300 కోట్లకు పైగా అవుతుందట. వీటి కంటే ఇతర సంక్షేమ పథకాల పైన దృష్టి పెడితే బాగుంటుందని మహిళలు కూడా సీఎం చంద్రబాబుకు విన్నవించుకుంటున్నారు. ఇప్పటికే చాలాచోట్ల ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి.మరి సీఎం చంద్రబాబు ఎలా ఆలోచిస్తారో చూడాలి.
👉 విశాఖ సెంట్రల్‌ జైల్ ను సందర్శించిన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత..జైల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులను అడిగితెలుసుకున్న హోం మంత్రి.
విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫారా ఆరోపణలు వచ్చాయి..పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం.
గత ప్రభుత్వం తప్పిదాల వలనే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చింది..ఖైదీల రక్షణే ముఖ్యం.
ఇటీవలే జైల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయి..
సెల్ ఫోన్లు బయటపడిన చోట కూడా పరిశీలించాము.
విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటాం.
ఫోన్ లో ఎవ్వరెవ్వరు మాట్లాడారో వారి పై కూడా చర్యలు తీసుకుంటాం..జైల్ లో గంజాయి మొక్క కనిపించింది.
విధులు సమర్థవంతంగా నిర్వహించకపోతే,సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం..ఎవ్వరిని ఉపేక్షించేది లేదు.
విచారణ చేసిన తర్వాతే విశాఖ సెంంట్రల్ జైల్ లో ఉద్యోగులను బదీలిలు చేసాం..ఎవ్వరిని సస్పెండ్ చేయలేదు..యూనిఫాం సర్విస్ లో ఉన్నవారు ధర్నాలో,బంద్ లో పాల్గొనకూడదు.
కొత్త సూపరింటెండెంట్ సెంట్రల్ జైల్ ను ప్రక్షాళన చేస్తున్నారు..టెక్నాలజీని కూడా ఉపయోగగించుకుంటాం.
సెంట్సల్ లో జైల్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం.
పదిరోజులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం.
విశాఖ సెట్రల్ జైల్ నుండి కొంతమంది ఖైదీలను రాజమండ్రి జైల్ కు తరలిస్తున్నాం..
గత ఐదు సంవత్సరాలు సెంట్రల్ జైల్ ను విజిట్ చేసిన దాఖలాలు లేవు.టెక్నాలజీ నుండి ఎవ్వరు తప్పించుకోలేరు.
పది,పదిహేను రోజుల్లో సెల్ ఫోన్ వ్యవహరంలో విచారణ రిఫోర్ట్ వస్తుంది..జైల్లో సిబ్బందిని పెంచుతాం.
👉 అధికారులను సత్కరించిన పట్టణ టిడిపి అధ్యక్షుడు. పొదిలి గ్రామీణ నీటి సరఫరా విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మణ్ నాయక్, ఏఈ నారాయణ స్వామిలను శనివారం పట్టణ టిడిపి అధ్యక్షులు ముల్లా ఖుర్దూస్ కలిసి పూలమాలవేసి,శాలువా కప్పి, మెమొంటోలను అందించి నూతన సంవత్సర,సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మైనారిటీ సెల్ యువ నాయకులు ముల్లా ఖయ్యూం పాల్గొన్నారు.
👉అగ్ని ప్రమాదాల పై అవగాహన సదస్సు.. ప్రకాశం జిల్లా కంభం మండలం తురిమెళ్ళ గ్రామంలో అటవీ శాఖ రేంజ్ ఆఫీసు నందు ఈరోజు డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ నిషా కుమారి ఆదేశానుసారం ఎఫ్ .ఆర్. ఓ మధు ప్రియాంక ఆధ్వర్యంలో అడవులకు నిప్పు పెట్టుటవలన కలుగు నష్టం మరియు అడవులలో అగ్ని ప్రమాదాలపై గిద్దలూరు అగ్నిమాపక శాఖ మరియు అటవీశాఖ కలయికలో వర్కషాప్ నిర్వహించారు. అగ్ని మాపక శాఖ అధికారి హరిబాబు ముఖ్య అతిధిగా వారి పర్యవేక్షణలో అటవీ శాఖ అధికారులకు అగ్ని ప్రమాదాల నివారణపై ప్రయోగాత్మక అవగాహన సదస్సు నిర్వహించారు.అంతేకాకుండా అడవులలో అగ్ని ప్రమాదం సంభవిస్తే చెట్లకు నిప్పు అంటుకోకుండా ఎలా నియంత్రించాలనే అంశాలపై అవగాహన కల్పించారు.అడవిలో చిన్నగా మంట కనిపించినా వెంటనే ఆర్పివేయాలన్నారు. అనంతరం ఎఫ్ ఆర్ ఓ మధు ప్రియాంక మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు అడవుల సంరక్షణకు పాటుపడాలన్నారు. అడవులే మానవ కోటికి జీవనాధారమని ఎవరైనా అడవులకు నిప్పు పెడితే అటవీశాఖ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేంజ్ స్టాఫ్, ప్రొటెక్షన్ వాచర్స్, అగ్నిమాపక సిబ్బంది, గ్రామ సర్పంచ్ వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.
👉నిలిచిపోయిన కాపు భవనాలను పునఃప్రారంభించాలి*
శ్రీ కృష్ణదేవరాయ బలిజ సేవ సంఘం ABC సంఘం నాయకులు నిలిచిపోయిన కాపు భవన స్థలంను పరిశీలించారు.
ఈ సందర్బంగా బలిజ సేవ సంఘం అధ్యక్షులు పగిడి వెంకట రమణ మాట్లాడుతూ 2014 వ సంవత్సరంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రాబాబు నాయుడు గారు కాపులకు పెద్ద పీట వేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మండలంలో కాపు భవనాలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని, దానిలో భాగంగా గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి చొరవ తీసుకొని కంబం గ్రామ పంచాయితీ పరిధిలో అనకాలమ్మ తిప్పా దగ్గర కాపుభవనానికి స్థలం కేటాయించడం జరిగింది. అది బేస్మెంట్ లెవెల్ వరకు వచ్చిన తరువాత గత ప్రభుత్వం అధికారం లోనికి వచ్చిన తరువాత కాపు భవనానికి తగినన్ని నిధులు కేటాయించక పోవడం వల్ల ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయినాయని, గత ప్రభుత్వం కాపు భవనం నిర్మాణానికి ఒక రూపాయి కూడా కేటాయించకపోవడం చాలా దుర్మాఘం అని అన్నారు. అంతే కాకుండా కాపు భవనానికి కేటాయించిన కొంత స్థలంలో రైతు భరోసా కేంద్ర, సచివాలయం ఏర్పాటు చేసి కాపు భవనానికి కేటాయించిన స్థలం కు గండి కొట్టారని వాపోయారు.డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కాపులు / బలిజలు పెద్దన్న పాత్ర పోషించి NDA కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించుకున్నామని. ఇప్పటికైనా ప్రభుత్వం, శాసనసభ్యులు సభ్యులు స్పందించి కాపు భవనం చుట్టూ కాంపౌండ్ గోడ, భవనం నిర్మాణానికి తగినన్ని నిధులు కేటాయించి కాపు, బలిజలకు ఆగిన తొడ్పాటు ఇచ్చి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమం లో శ్రీ కృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం ABC మండలాల ప్రధాన కార్యదర్శి ఉదయగిరి మల్లిఖార్జున రావు,సోమిశెట్టి నారాయణ,ఓబుళరెడ్డి మాధవ,చెన్ను రవి కుమార్,గజ్జెల పాండు,మార్తోట ప్రసాద్,మునగాల బాలకృష్ణ తదితరులు ఉన్నారు

7k network
Recent Posts

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి