👉 కేజీవాల్ కు అఖిలేష్ మద్దతు..
ఢిల్లీలో సమాజ్వాదీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి దూరంగా ఉండాలని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. బీజేపీని ఓడించే ఆప్ పార్టీకే తమ మద్దతు ఉంటుందని అఖిలేశ్ తెలిపారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రభావం చూపలేని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
👉కర్రలతో కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు..😲😲
హైదరాబాద్.. బీజేపీ ఆఫీస్‌పై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు..దీంతో కాంగ్రెస్ కార్యకర్తలపై ఎదురుతిరిగిన బీజేపీ నాయకులు..కర్రలతో ఒకరినొకరు కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు..ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిధూరీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆఫీస్‌పై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు..
👉వైఎస్ఆర్సిపి వైద్య విభాగ రాష్ట్ర కార్యదర్శి వైయస్ అభిషేక్ రెడ్డి మృతి..*కడప జిల్లా…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీప బంధువు, వైఎస్ ప్రకాష్ రెడ్డి మనుమడు వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి చెందినట్లు సమాచారం. అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లోని AIG హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి. ఈ విషయమై వైకాపా శ్రేణుల్లో అనిశ్ఛితి నెలకొంది. లింగాల మండల ఇన్చార్జి గా వైకాపా తరపున 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పనిచేశారు.
👉 *ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం జెసి అగ్రహారం గ్రామంలో కుక్కల స్వైర విహారం* రెండు రోజుల్లో ఏడు మందిని గాయపరిచి 30 కోళ్లను చంపిన వీధి కుక్కలు.. ఆందోళనలో గ్రామస్తులు ఇప్పటికైనా పంచాయతీ అధికారులు గ్రామ సింహాల బారి నుంచి ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నారు..
👉”ఇదేంటి పవన్ ఇలా అనేశారు”.. అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న లొసుగులు, పరిపాలనలో ఉన్న వ్యూహాలు తనకు తెలీవంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల కామెంట్లు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 2001లో పొలిటికల్ ఫిలాసఫీతో పాటు ప్రజల పరిపాలన ఎలా ఉండాలనే దానిపై అవగాహన పెంచుకోవడానికి నేను కొన్ని బుక్స్ చదివాను అని ఈ డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. పాలిటిక్స్ అనేది బాగా అర్థం చేసుకోవాలని ఓ పుస్తకం చదివినట్టు కూడా తెలిపారు. ఆ పుస్తకంలో అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రజల వద్దకు తప్పనిసరిగా వెళ్లాల్సిందే అనే ఒక వాక్యం తనకు బాగా నచ్చినట్లుగా పేర్కొన్నారు. మ్యారేజ్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, ఇలా ఏది కావాలన్నా ప్రభుత్వం నుంచి చాలా ఆలస్యంగా వస్తోందంటూ, అలా కాకుండా ప్రజల దగ్గరికి ఇవన్నీ వాటంతటవే ఆటోమేటిక్ గా వెళ్ళిపోయేటట్లు చేస్తే ప్రజలకు చాలా మేలు చేసినట్లు ఉంటుందని ఆయన అనుకున్నారట.
జోక్ ఏంటంటే, ఏపీ మాజీ సీఎం జగన్ ఆల్రెడీ పరిపాలనను ప్రజల దగ్గరకు తీసుకొచ్చారు.వాలంటీర్ల రూపంలో ఉప్పు, పప్పు, బియ్యం నుంచి అన్ని సేవలను ప్రజల ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు. దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పవన్ కళ్యాణ్ కూడా తనకి అదే కావాలని కోరుకుంటున్నట్టు ఇప్పుడు చెప్తున్నారు కానీ వాలంటీర్ వ్యవస్థని ఆపింది ఎవరు? పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు టీమే కదా? ఇప్పుడు పవన్ ఏమంటున్నారు.. ఉద్యోగులు సరిగా పనిచేయట్లేదు,అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా వరస్ట్ గా మారిందని గగ్గోలు పెడుతున్నారు. ఉద్యోగులు పని చేయారని చెప్పే జగన్ సచివాలయం అంటూ కొత్త వ్యవస్థలను తీసుకొచ్చారు.చాలామంది వాలంటీర్లను హైర్ చేసుకుని ప్రజలకు సేవలు అందించారు.ఇప్పుడు వారిని పక్కన పెట్టి మళ్ళీ ప్రజల దగ్గరకు పరిపాలన తీసుకెళ్లాలని అనడం తెలివి తక్కువ పని కాదా అని చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి లాజిక్ మిస్ అయిన మీరు ప్రభుత్వాన్ని ముందుకు నడిపించినట్లే అని ఎద్దేవా చేస్తున్నారు.సోషల్ మీడియాలో కూడా దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది.
*పవన్ కి అంత తెలివే ఉంటే చదువుల్లో ఎందుకు ఫెయిలవుతాడు అని కొంతమంది దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.రెండు లక్షల పుస్తకాలు చదివిన మేధావి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు అబ్బా అంటూ ఆట పట్టిస్తున్నారు.
👉పులివెందులలో ఘాతుకం .. పులివెందుల నియోజక వర్గంలోని తొండూ రు మండలం తేలూరు తుమ్మల పల్లి గ్రామంలో భార్య,కూతురిని నరికి చంపిన కసాయి తండ్రి.
👉 ప్రపంచాన్ని వణికించిన వైరస్‌లు ఇవే..
ప్రపంచాన్ని వణికించిన వైరస్‌లు ఇవే..
కరోనాను మరవకముందే hMPV వైరస్ భారత్‌ను కలవరపెడుతోంది. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే, కరోనాకు ముందే వివిధ కాలాల్లో ప్రపంచాన్ని కొన్ని వైరస్లు వణికించగా, కొన్ని ఇప్పటికీ ప్రాణాలు తీస్తున్నాయి. రోటా వైరస్, స్మాల్ పాక్స్, మీజిల్స్ (తట్టు), డెంగ్యూ, ఎల్లో ఫీవర్, ఫ్లూ, రేబిస్, హెపటైటిస్- బీ&సీ, ఎబోలా, హెచ్ఐవీ.
అమెరికాలో తొలి బర్డ్ ఫ్లూ మరణం.. కలకలం రేపుతోన్న వైరస్..అమెరికాలో తొలి బర్డ్ ఫ్లూ మరణం చోటు చేసుకుంది. డిసెంబర్ నెలలో ఆస్పత్రిలో చేరిన వృద్దుడు.. చికిత్స పొందుతూ మరణించాడు. లూసియానాలో ఈ వైరస్ సోకిన 65 ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్వాస కోశ సమస్యతో డిసెంబరు నెల మధ్యలో అతడు ఆస్పత్రిలో చేరాడు.
చలికాలం ప్రభావం చూపుతోంది. వివిధ రకాల వైరస్‌లు మానవాళిపై పంజా విసురుతున్నాయి. ఓవైపు చైనాలో కొత్తగా మొదలైన హెచ్‌ఎంపీవీ వైరస్.. నెమ్మదిగా ప్రపంచదేశాలవైపు పయనిస్తోంది. ఆందోళన అవసరం లేదని అధికారులు ప్రకటించిన కొన్ని గంటల్లోనూ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది హెచ్‌ఎంపీవీ వైరస్. కరోనా లక్షణాలతో మానవాళికి మరోసారి మాస్క్ అవసరాన్ని గుర్తుచేస్తోంది. తాజాగా అమెరికాలో బర్డ్ ఫ్లూ పడగవిప్పుతోంది. ఇప్పటి వరకూ పక్షులు, కోళ్లు, జంతువుల్లో మాత్రమే కనిపించే ఈ వైరస్ తొలిసారి మనుషుల్లో కనిపించింది. అమెరికాలో బర్డ్ ఫ్లూతో తొలిమరణ నమోదయింది.
మనుషుల్లో తొలి బర్డ్ ఫ్లూ H5N1 మరణం అమెరికాలో నమోదైంది. లూసియానాలో ఈ వైరస్ సోకిన 65 ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతోపాటు పలు ఇతర సమస్యలతో డిసెంబరు నెల మధ్యలో ఆయన ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారించారు. దేశంలో ఇదే తొలి సీరియస్ బర్డ్ ఫ్లూ కేసు అని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఇటీవల ప్రకటించింది. తాజాగా ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. పెరట్లో ఉన్న అడవి పక్షులు, మందకు దగ్గరగా వెళ్లడం వల్లే ఆయన ఈ వైరస్ బారినపడినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆయన నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టుగా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. కాగా, గతేడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అమెరికాలో 66 బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి.
👉 బీజీపీ నేతలకు అద్దంకి దయాకర్ సవాల్ !!!
కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసే ముందు బీజేపీ నేత రమేష్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని సోషల్ మీడియా వేదికగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. ప్రియాంక గాంధీపై సామాజిక దాడి చేసిన రమేష్ బిథుర్‌పై చర్యలు తీసుకున్నారా అని నిలదీశారు. మహిళలను కించపర్చేలా మాట్లాడిన మీ నేతలను వదిలేసి.. బీజేపీ ఆఫీసుపై దాడి జరిగిందని, వారిని అరెస్టు చేయాలని అంటున్నారు. మీకు చేతనైతే రమేశ్‌ను అరెస్ట్ చేయండని సవాల్ విసిరారు.
👉కుప్పం టీడీపీ కార్యాలయంలో ‘జన నాయకుడు’ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు చెప్పుకుని వినతి పత్రాలు సమర్పించేందుకు వీలుగా ఈ ‘జన నాయకుడు’ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సమస్యలు, ఫిర్యాదులను ‘జన నాయకుడు’ పోర్టల్‌లో రిజిస్టర్ చేసేలా వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు. ప్రజల ఫిర్యాదులను తీసుకుని, ఏ విధంగా ఆన్‌లైన్ చేసి ట్రాక్ చేస్తారనే విధానంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు అందుకుని సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
👉*అన్నమయ్య జిల్లా*
రాజంపేట పట్టణం గాంధీ బొమ్మ సమీపంలోని ఏకే జువెలరీ షాప్ యజమానికి బురిడీ కొట్టించిన ఇద్దరు టక్కరి మహిళలు…నకిలీ బంగారాన్ని ఇచ్చి లక్షా 75 వేలా ఖరీదు గల అసలు బంగారం కొనుగోలు….వారు వెళ్లిన తర్వాత బంగారాన్ని మరింత క్షుణ్ణంగా పరిశీలించి మోస పోయానని గ్రహించిన యజమాని ఇబ్రహీం..సి.సి.ఫుటేజ్ ఆధారంగా పోలీసులను ఆశ్రయించిన జువెలరీ షాప్ యజమాని…
👉 శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అర్జున్
TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో
గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ను అల్లు అర్జున్ పరామర్శించారు. అలాగే మృతి చెందిన రేవతి భర్తను పరామర్శించారు. అల్లు అర్జున్ వెంట దిల్ రాజ్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. కాగా, కిమ్స్ ఆస్పత్రికి వెళ్లేటప్పుడు తమకు సమాచారం ఇవ్వాలని రాంగోపాల్పేట పోలీసులు అల్లు అర్జున్కు నోటీసులు ఇచ్చారు.
👉మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్?*..*23 మంది విద్యార్థులకు అస్వస్థత*
కరీంనగర్ జిల్లా:జనవరి 07
రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ పరంపర కొనసాగుతూనే ఉంది. సీఎం, మంత్రులు గురుకులాల బాట పట్టినా విద్యార్థుల హాస్టల్స్‌లో ఎలాంటి మార్పులు రావడం లేదు. రోజు రోజుకు విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతూ పిట్టల్లా రాలిపోతున్నారు.
తాజాగా కరీంనగర్ పట్టణం శర్మ నగర్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 12గంట లకు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో 19 మంది ని పాఠశాల సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.కాగా, రాష్ట్రంలోని గురు కుల, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ కేసులు రోజురోజుకు పెరు గుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆరోపి స్తున్నారు. ఈ ఘటన సంబంధించిన మరింత సమాచారం తెలియవలసి ఉంది
👉ప్రపంచ తెలుగు సమాఖ్య లో సీఎం పేరు మర్చిపోయిన యాంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపి చామల*
తెలుగు మహా సభల్లో పేరు మర్చిపోయిన యాంకర్ మీద విరుచుకుపడ్డ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
ముఖ్యమంత్రి పేరు చెప్పకపోవడం వెనక ఎదో కుట్ర ఉంది..
ఎవడయ్యా ఆ తెలుగు మహా సభలు పెట్టింది..
తెలుగు మహాసభలు పెట్టిన వాడికి బుద్ధి లేదా.. ముఖ్యమంత్రే తెలవని వాళ్లు యాంకర్ అవుతారా – ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
👉 ఆన్‌లైన్ బెట్టింగులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్…
ఆశ ఉండొచ్చు తప్పు లేదు.. అత్యాశ, దురాశ ఉంటే బాధ, దుఃఖమే మిగులుతాయని హితవు
రూ.వెయ్యి పెట్టుబడికి చిటికెలో రూ.లక్ష రాబడి.. నమ్మశక్యంగా ఉందా? అంటూ పోస్ట్ ..
నోట్ల కట్టలు చూపించగానే నిజమే అనుకుని అత్యాశకు పోవద్దని హెచ్చరిస్తూ ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియో షేర్ చేసిన సజ్జనార్..చేతులు కాలాక ఆకులు పట్టుకునే కన్నా.. ముందే అప్రమత్తంగా ఉండటం ఉత్తమమని సూచన
ఆన్‌లైన్ బెట్టింగులు చేసేవాళ్ల గురించి సమాచారం ఉంటే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ట్వీట్
👉ఆక్రమణకు గురైన మూడు ఎకరాల ప్రభుత్వ భూమి అప్పగింత..*కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో అందజేత*
*మీడియా సమావేశంలో వివరాలు వెల్లడి*
రాజన్న సిరిసిల్ల, జనవరి -7
జిల్లాలో ఆక్రమణకు గురైన మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన
సున్చుల కుమారస్వామి తిరిగి ప్రభుత్వానికి అప్పగించడం జరిగిందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం లో ప్రభుత్వ భూమి అప్పగింత పై ఎస్పీ అఖిల్ మహజన్ తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ* తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన సంచుల కుమారస్వామి గ్రామ సర్వే నెంబర్ 464లో గల 3 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసుకుని సాగు చేసుకుంటున్నాడని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి నిర్ణయించారని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో ఎవరైనా భూ ఆక్రమణలకు పాల్పడి ఉంటే సదురు భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని, ఈ భూములను పేద ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తామని, పేద ప్రజలకు ఇంటి పట్టాల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు.
2018 నుంచి 2023 వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంటూ రైతు బంధు, పీఎం కిసాన్ మొదలైన ప్రభుత్వ పథకాలు లబ్ది పొందినందుకు ఆ సొమ్ము రికవరి కోసం డిమాండ్ నోటీసు జారీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటిదాకా దాదాపు 250 ఎకరాలు ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
👉ఆంధ్రప్రదేశ్ : రామ్ చరణ్, బాలయ్య సినిమాలపై హైకోర్టులో పిల్.. సంక్రాంతికి విడుదల కానున్న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, బాలయ్య ‘డాకు మహరాజ్’ సినిమాల టికెట్ ధరల్ని పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. అది నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. ప్రతివాదులుగా ఆ రెండు సినిమాల మూవీ టీమ్‌లను చేర్చారు.
👉 ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు: సీఐ సురేష్ .. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్, చిన్న మసీదు వీధి వద్ద ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న వాహనదారులను, షాప్ యజమానులను గిద్దలూరు అర్బన్ సిఐ సురేష్ మందలించారు. రోడ్డుకు ఇష్టానుసారంగా అడ్డంగా పెట్టిన వాహనాలను తొలగింప చేశారు. పట్టణంలో ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా ఉన్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అర్బన్ సీఐ సురేష్ ప్రజలను వాహనదారులను హెచ్చరించారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించరాదని స్థానిక దుఖాణదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
👉ఎన్టీఆర్ జిల్లా నందిగామ*
*గంజాయి గూచుల వద్ద 120 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న ఏసిపి..*నందిగామ జాతీయ రహదారి పక్కన పొలాల్లో గంజాయితో ఉన్న కారును మంగళవారం దుండగులు వదిలి వెళ్లారు.*
*కారులో సుమారు 120 కేజీల గంజాయి ఏజెన్స ప్రాంతం నుంచి నిందితులు మహారాష్ట్రకు తరలిస్తున్నారని ఏసీపీ తిలక్ చెప్పారు.*అనంతరం ఆ కారును సీజ్ చేసి నందిగామ పోలీస్ స్టేషన్ కు తరలించారు.*నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని ఏసీపీ వెల్లడించారు.*ఈ కార్యక్రమంలో నందిగామ పట్టణ సిఐ వైవియల్ నాయుడు మరియు పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.*
👉ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే వారు స్వయంగా కంపోస్టు ఎరువు తయారు చేయండి.*.**కమిషనర్ ఎన్.మౌర్య*
నగరంలో ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్స్ (బల్క్ జనరేటర్స్) వారు తడిచెత్తను స్వయంగా కంపోస్టు ఎరువుగా మార్చుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. నగరంలో చెత్త ఎక్కువ ఉత్పత్తి చేసే వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలతో మంగళవారం సాయంత్రం కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హోటల్స్, అపార్ట్మెంట్స్, రెస్టారెంట్ల వారు100 కేజీల కంటే ఎక్కువ చెత్తని ఉత్పత్తి చేస్తున్నారని అన్నారు. ఎవరైతే 100 కేజీల కంటే ఎక్కువ చెత్తని ఉత్పత్తి చేస్తున్నారో వారంతా తడిచెత్తను వాళ్ళ పరిధిలోనే కంపోస్ట్ ఎరువుగా మార్చుకోవాలని అన్నారు. పొడిచెత్తను నగరపాలక సంస్థ సిబ్బందికి అందించాలనే ప్రభుత్వ నిబంధన ఉందన్నారు. కావున ఈ తడిచెత్తను మెకనైజ్డ్ సిస్టం, బయో గ్యాస్ సిస్టం ద్వారా గాని లేదా ఇంకా ఇతర పద్ధతుల ద్వారా అయినా తడిచెత్తని వాళ్ళ పరిధిలో ఎరువు(కంపోస్టు) గా మార్చుకోవచ్చునని అన్నారు.ఈ ఎరువును వారే చెట్లకి, గార్డెన్స్ కి ఉపయోగించుకోవాలని అన్నారు.ప్రభుత్వ నిబంధనలు పాటించని వారికి అపరాధరుసుము విధిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య,సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్,శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య,సుమతి,మస్తాన్,అజయ్ తదితరులు పాల్గొన్నారు.
👉కర్రలతో కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ..* కేజీవాల్ కు అఖిలేష్ మద్దతు.. ”ఇదేంటి పవన్ ఇలా అనేశారు” .. *కుప్పం టీడీపీ కార్యాలయంలో ‘జన నాయకుడు’ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు .. ప్రకాశం జిల్లాలో కుక్కల స్వైర విహారం *గంజాయి గూచుల వద్ద 120 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న ఏసిపి..*ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే వారు స్వయంగా కంపోస్టు ఎరువు తయారు చేయండి:*కమిషనర్ ఎన్.మౌర్య*..👉 ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు: గిద్దలూరు సీఐ సురేష్ .. *ఆక్రమణకు గురైన మూడు ఎకరాల ప్రభుత్వ భూమి అప్పగింత* .. *ఆన్‌లైన్ బెట్టింగులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్…*రామ్ చరణ్, బాలయ్య సినిమాలపై హైకోర్టులో పిల్* 👉 బీజీపీ నేతలకు అద్దంకి దయాకర్ సవాల్ …*గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్? (కరీంనగర్).. * వైయస్ అభిషేక్ రెడ్డి మృతి..*
Recent Posts