👉ఆందోళనగా ఉంది!😲😲😲..పెళ్ళుబుక్కుతున్న మత విద్వేష సునామి..
⭐భారత దేశాన్ని విద్వేష సునామీ ముంచెత్తుతోందని అంతర్జాతీయ సమాజం మరోసారి ఘోషిస్తుంది. సామాజిక జీవనంలో మతవిద్వేషం బుసలు కొడుతున్న దేశాల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ తాజా నివేదిక స్పష్టం చేస్తోంది.198 దేశాల్లో ‘సామాజిక వర్గాల మధ్య శత్రుత్వ భావన (ఎస్‌హెచ్‌ఐ)’ అన్న అంశంపై అధ్యయనం చేసిన ప్యూ సంస్థ తాజా ఇండెక్స్ ప్రకారం భారత్ 9.3 పాయింట్లతో తొలి స్థానంలో ఉండటం అత్యంత విషాదం. ఇలాంటి పరిస్థితుల్లో ”సామాజిక సహకారానికి, భిన్న వర్గాల మధ్య సామరస్యానికి చిచ్చు పెట్టే క్లిష్ట ప్రసంగాలు సమర్ధనీయం కానే కాదు. ఎక్కడికక్కడ కుల, మత, ప్రాంతీయ విభేదాలు రాజేస్తూ ఓట్ల చలి మంటలు కాచుకునే విద్వేష ప్రసంగీకుల్ని అణచివేయని పక్షంలో రాజ్యాంగ విలువలు చచ్చుబడిపోతాయి” అని సర్వోన్నత న్యాయస్థానం వ్యక్తం చేసిన ఆందోళనను మరోసారి గుర్తుచేసుకోవాలి.
⭐మనుషుల్ని కులం పేరిట, మతం పేరిట, ఆహారం పేరిట ఇంకా సవాలక్ష మౌఢ్యాలతో హింసిస్తూ దేశభక్తుల ముసుగులో తిరగడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అసలైన దేశభక్తి మనుషులను ప్రేమించడంలో ఉందని వందేండ్ల కిందటే మహాకవి గురజాడ చెప్పిన మాటలు ఇంకా మతోన్మాదుల బుర్రకెక్కలేదు. అందుకే ఈ మహా వాక్యానికి ఇంకా ప్రాసంగిత ఉంది. మనుషుల్ని ప్రేమించడం, మానవ శ్రమతో దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవడం, స్వయం సమృద్ధిని సాధించడం, కులమత మౌఢ్యాల నుంచి విముక్తమై ”అన్నదమ్ముల వలెను జాతులు/ మతములన్నీ మెలగవలెనోయి/మతం వెరైతేను యేమోయి/ మనసులోకటై మనుషులుంటే”అని కాంక్షించిన గురజాడ దృష్టిలో దేశభక్తి అంటే ఇది. కానీ,దేశంలో అలాంటి పరిస్థితులే కరువయ్యాయని తాజా నివేదిక స్పష్టం చేస్తుంది.
⭐మొన్నటికి మొన్న సాక్షాత్తు పార్లమెంటులోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత మీదే అక్కసు వెళ్లగక్కారు. దేశంలోని ముస్లింలు, ఇతర మైనారిటీలకు వ్యతిరేకంగా స్వయంగా మోడీనే విద్వేష ప్రసంగాలు చేసిన సందర్భాలు కోకొల్లలు.”ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా” అన్నట్టు ప్రభుత్వ అధినేతలే విద్వేష పూర్వక ప్రసంగాలు చేస్తుంటే వారి పరివారం కట్టడి చేయడం సాధ్యమేనా? తినే తిండి మీద ఆంక్షలు, కట్టుకునే బట్టమీద ఆంక్షలు, భావ ప్రకటన పైనా ఆంక్షలు, పుట్టిన నేలపై స్వేచ్ఛగా జీవించాలన్నా ఆంక్షలు.చివరకు బతుకు దెరువు కోసం చేసే పని మీద కూడా ఆంక్షలే! అసలు దేశం ఎటు పోతోంది? ఏమైపోతున్నది? సగటు భారతీయుని ఆవేదన ఇది.
⭐ఓవైపు ఆధునిక ప్రపంచం అంతరిక్షంలో కూడా పరిశోధనలు చేసే స్థాయికి దూసుకుపోతుంటే, దేశాన్ని మరోవైపు మతవిద్వేషాలు, మూఢనమ్మకాలు, అశాస్త్రీయ భావాలమయం చేస్తున్న తీరును ఏమనాలి? పాలకులు దేశానికి ఏం చెబుతున్నట్టు? ఏం సూచిస్తున్నట్టు? ఈ దేశం ‘మీది కాదు మాది’ అంటే భిన్నత్వంలో ఏకత్వంలా కలిసుండే ప్రజలు ఎక్కడివెళ్లాలి? ఇది విచ్చిన్న విధానం. ఇదే వ్యవస్థ ఇప్పడు దేశంలో అమలవడం చూస్తుంటే ఆందోళనగా ఉన్నది.
⭐మరోవైపు… చరిత్ర పుటలను మతం రంగు పులిమిన కళ్లద్దాలతో చూసేవాళ్లు… ఉత్తుత్త పుకార్లను చరిత్రగా నమ్మేవాళ్లు..చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు. బడిలో ”భారతదేశం నా మాతృభూమి/ భారతీయులందరూ నా సహోదరులు” ప్రతిజ్ఞ చేశాం. ఇప్పుడా ప్రతిజ్ఞకు తిలోదకాలిచ్చి ఒకరినొకరు చంపుకునే దుస్థితికి దిగజారిపోయాం. మణిపూర్‌లో ఏడాదిన్నరగా జరుగుతుందదే. విద్వేష భావజాలం వెళ్లగక్కి సౌభ్రాతృత్వాన్ని చావు దెబ్బ తీసేవాళ్లపై ప్రభుత్వాలు చర్యలకు పూనుకొని ఉంటే నేడు ఇలా అగ్నిగుండంలా మారుతుందా? ఒకరికొకరై అందరొక్కటై కుల మత ప్రాంతీయ భాషా భేదాలకు అతీతంగా ఒకే జాతిగా భారతీయులు ప్రగతి పథాన పురోగమించాలని అలనాటి రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారు.. జరుగుతున్నదేమిటి? ఉమ్మడి భావన బీటలు వారుతోంది. సంకుచిత భావజాల ప్రచారం విభేదాలకు, సామాజిక అశాంతికి, చీలికలకు పాలుపోస్తోంది. జన సమూహాల నడుమ కత్తులు దూసుకునే శత్రుత్వాలకు, నెత్తుటేళ్లు పారించే వైషమ్యాలకు అంటుకడుతోంది. ఈ దుష్ప్రచారాన్ని క్షణాల వ్యవధిలో అసంఖ్యాకులకు చేరవేయడంలో వాట్సాప్ మాధ్యమాల యూనివర్సిటీ విద్యార్థులు తలమునకలై ఉన్నారు.
⭐అశ్లీల, అసభ్య సమాచార వాహికలుగా భ్రష్టు పట్టి పరువు మోస్తున్న సామాజిక మాధ్యమాలు విద్వేష వ్యాఖ్యల పంపిణీ ఏజెన్సీలుగా దిగజారి కలుషిత సాగరాల్ని తలపిస్తున్నాయి. తద్వారా వాటిల్లే విపరీత నష్టాల తీవ్రతను ముందుగానే ఊహించి కావచ్చు. అసహనం, భావజాలపరమైన ఆధిపత్యం, దురభిప్రాయాల కుదుళ్ల నుంచి పుటుకొచ్చే విద్వేష నేరాలను ఏమాత్రం సహించరాదు. విభజించు, పాలించు నినాదంతో మత, విద్వేష పాలన సాగిస్తున్న కేంద్రం విధానాల్ని ఎదుర్కోవడం ప్రస్తుతం దేశ లక్ష్యం. లౌకిక ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న శక్తులకు మద్దతు నివ్వడం, వారిబాటలో అడుగులేయడం ప్రజల కర్తవ్యం. చీకట్లోకి నెడుతున్న భారతావనికి వెలుగులు చూపడం అందరి బాధ్యత. ఇక ఆలోచించాల్సింది పౌర సమాజమే.. నవతెలంగాణ సౌజన్యంతో..
👉హిందువులు శంఖం ఊదాల్సింది అందుకు కాదు, మరెందుకు?* *తెల్సుకుందాం*
*హిందూ మతాన్ని నమ్మి అనుసరించే కోట్లాది మంది రైతులు తమ భూముల్ని దున్ని పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. వారికి రుణమాఫీ లేదు. వారి ఆత్మహత్యలు ఆగలేదు. ఎన్నికల్లో వారికిచ్చిన హామీలు అమలు జరగడం లేదు. ఐనా హిందూమతాన్ని అనుసరిస్తూ నష్టపోయే రైతుల మేలు కోసం పోరాడతామని నిన్న హిందూ శంఖారావ సభలో హిందూ మత సంస్థలు ఎందుకు శంఖం ఊదలేదు?..
*హిందూ దేవుళ్ల పట్ల భక్తిపరులై, హైందవ మతం పట్ల విధేయులై, తాము హిందువులుగా చాటిచెప్పుకునే అశేష కార్మిక, శ్రామిక జనాల హక్కుల్ని ‘హైర్ & ఫైర్’ పేరిట నేడు సర్కార్లు కాలరాస్తున్నాయి. పర్మినెంట్ ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ నియమకం చేస్తున్న స్థితి వుంది. 8 గంటల పనిదినాన్ని 12 గంటల పనిదినంగా మార్చేస్థితి వుంది. లేబర్ కోడ్లతో లేబర్ ని బజారు పాలు చేసే పరిస్థితి వుంది. రాముణ్ణి కొలిచే మెజార్టీ హిందు మత కార్మికులు పని చేసే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీతో సహా రైల్వే, టెలికాం, భీమా, కోల్, స్టీల్ వంటి విలువైన ప్రభుత్వ సంస్థల్ని బడా కార్పొరేట్లకి అమ్మివేసే పరిస్థితి వుంది. ఐనా వీటి పరిరక్షణ కోసం బాదిత హిందువుల తరపున పోరాటం చేస్తామని హిందూ మత సంస్థలు శంఖం ఎందుకు ఊదలేదు?*
*హిందూ మతస్తులైన లక్షాలది మంది టీచర్స్, లెక్చరర్స్, ఉద్యోగులు, సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కష్టార్జితమైన వేతనాల నుండి హిందూ మతం పేరు చెప్పుకొని ఢిల్లీ పీఠం ఎక్కి పాలిస్తున్న మోడీ సర్కార్ లక్షల కోట్ల ఆదాయ పన్ను వసూలు చేస్తున్నది. హిందూ ఉద్యోగవర్గాల నుండి ఇలా పన్నుల్ని లూటీ చేసే విధానానికి వ్యతిరేకంగా హిందూ మత సంస్థలు ఎందుకు శంఖం పూరించలేదు?*
*దేవాలయ భూముల్ని తరతరాలుగా దున్ని సేద్యం చేసే హిందూ మతానికి చెందిన పేద కౌలు రైతుల్ని భూముల నుండి వెళ్లగొట్టడానికి ఇటీవల వ్యూహాలు తెల్సిందే. ఆ భూముల పరిరక్షణ కోసం వారు జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. వారికి ఆ భూములకు పట్టాలు ఇవ్వాలంటూ హిందూ మత సంస్థలు ఎందుకు శంఖం ఊదలేదు?*
*దళిత భజగోవిందం పేరిట దళిత వాడల్లో కూడా రామాలయాల్ని నిర్మించే పనిని హిందూ మత సంస్థలు ఇటీవల చేపట్టాయి. దళితులు కూడా హిందువులలో అంతర్భాగమని అవి చెబుతున్నాయి. ఐతే హిందూ దేవాలయాల్లో దళితులకి కూడా ప్రవేశ హక్కు కోసం ఎందుకవి శంఖం ఊదలేదు?*
*కల్యాణ వానవాసి పేర శ్రీరాముడు నడిచిన అడవులకు సైతం వెళ్లి ఆదివాసీల్ని ఆర్గనైజ్ చేసే కర్తవ్యాన్ని ఇటీవల హిందూ మత సంస్థలు చేపట్టాయి. ఆదివాసీ తెగలు కూడా హిందూ మతంలో భాగమని చెబుతున్నాయి. పైగా అవి రాముడు చెలిమి చేసిన తెగలని, వారే అరణ్యవాస జీవితంలో రాముణ్ణి కాపాడారని వారిని ఉత్సాహపరిచి హిందువులలో కలిపే ప్రక్రియ చేపట్టాయి. ఆ రాముడు నడిచిన దండకారణ్యం నేడు రక్తసిక్తమౌతోంది. ఆ రాముణ్ణి కాపాడిన ఆ ఆదివాసీల మనుగడ ప్రమాదంలో పడింది. ఆ దండకారణ్య శాంతి కోసం, ఆదివాసీ తెగల పరిరక్షణ కోసం నిన్నటి హిందూ శంఖారావ సభలో అవి ఎందుకు శంఖం పూరించలేదు?*
*సీత పుట్టిన నేలపై సీతమ్మ చెరలు ఎవరికీ రాకూడదని ప్రచారం చేసే హిందూ సంస్థలు నిర్భయ నుండి అభయ వరకు స్త్రీలపై కొనసాగే వరస అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని ఎందుకవి శంఖం ఊదలేదు?*
సామాన్య హిందువులు అడిగే ఇలాంటి ప్రశ్నలకు నిన్న గన్నవరం సమీపాన భారీ స్థాయిలో జరిగిన హిందూ శంఖారావ సభా నిర్వాహక సంస్థలు ఈ తరహా జవాబులు ఇచ్చి వుండాల్సింది. ఎందుకు అవి ఇవ్వలేదని ప్రశ్నలు అడగడం నేడు బాదిత హిందూ మత ప్రజల వంతు కావడం సహజం.
*కొసమేరుపు*
మేము ఏ మతానికి చెందిన వాళ్ళం కాదు. అన్ని మతాల సారం ఇంచుమించు ఒకటే అని నమ్మిన వాళ్ళం. అదే సమయంలో ప్రజలకు వ్యక్తిగతంగా తాము నమ్మిన దేవుళ్ళతో పాటు మతాల్ని అనుసరించే హక్కు ఉందని నమ్మిన ప్రజాస్వామిక వాదులం. నిన్నటి శంఖారావ సభకి గల ఎజెండా గూర్చి మా అభిప్రాయాలు మాకు ఉన్నాయి. ఆ ప్రశ్నల్ని హిందూ సంస్థలకు మేం సంధించడం లేదు. అవి ప్రజల్ని చైతన్య పరచడం కోసం వినియోగిస్తాం. ఒకే ఒక్కమాటలో చెబితే ఇది హిందూ దేవుళ్ళ పవిత్రత కోసం, హిందూ మత పరిరక్షణ కోసం చేసేది కాదని చెప్పగలం. ఇది ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమల ప్రైవేటీకరణ తో వేలకోట్ల సంపాదన రుచి మరిగిన కార్పొరేట్ శక్తుల కోసమేననీ, ఇది దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్వాహణలో గల లక్షల ఎకరాల విలువైన భూముల్ని, సత్రాల్ని, ఆలయాల స్థలాల్ని, ఆస్తుల్ని, ఆభరణాల్ని, ధన కనక వస్తు రాశుల్ని, హిందూ మత భక్తకోటి నుండి అందే అపురూప కానుకల్ని ప్రభుత్వ రంగం నుండి కబ్జాచేసే లక్ష్యంతో అంబానీ, ఆదానీ వంటి బడా కార్పొరేట్లు తెర వెనక ఉండి నడిపించే ప్రైవేటికరణ ప్రక్రియ అని చెప్పగలం. ఇది చివరకు హిందూ శంఖారావ సభా వేదికపై నుండి గర్జించిన హిందూ పీఠాధిపతుల్ని కూడా అరటితొక్కగా వాడుకొని ఆదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలు కబ్జా చేస్తాయని స్పష్టంగా చెప్పగలం. మా మాటను పక్కకు పెట్టండి. హిందూ శంఖారావ సభ నిర్వహించిన హిందూ మత సంస్థల దృష్టిలో అన్యమతస్తులైన ముస్లిం క్రిస్టియన్లు, బౌద్ద, జైన్ల, పార్సీల మాటల్ని కూడా పక్కకు పెట్టండి. హిందూ సంస్థల ప్రతినిధులు నిన్న సభలో ఏ హిందూ మత ఉద్దరణ కోసం శంఖం ఊదారో అదే హిందూ మతాన్ని అనుసరించే కార్మిక, కర్షక, కూలీ వంటి వర్గాల ప్రజలతో పాటు బడుగు, బలహీన, దళిత, ఆదివాసీ, స్త్రీ సమూహల ప్రజలకు జవాబుదారీ తనంతో స్పందించాల్సి వుంది. ఆ సంస్థల బాధ్యత ఏదైనా హిందూ మతాన్ని నమ్మి అనుసరించే ప్రజలతో సహా సమస్త ప్రజలకు మనకు తెల్సిన నిజాల్ని చెప్పి చైతన్యపరుద్దాం .. పి ప్రసాద్ (పిపి)
👉మోసపోయిన తెలుగు వారు … చంపేస్తారు సార్ కాపాడండి 😱😱😱*
*యూరప్: వైజాగ్*
▪️ఏజెంట్ల చేతిలో మోసపోయి యూరప్‌లో చిక్కుకుని డబ్బులు లేక రోడ్ల మీద బ్రెడ్ తింటూ బతుకుతున్న తెలుగు యువకులు..ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.5 లక్షలు తీసుకొని యూరప్‌లో రోడ్డు మీద వదిలేసిన ఏజెంట్లు.
▪️వైజాగ్‌లో ఆటో నగర్లో సాయి ప్లేస్మెంట్స్ ఇన్‌స్టిట్యూట్ పేరిట యువకులను మోసం చేస్తున్న విజయదుర్గ, మోహన్, అఖిల్, రామ్ బాబు, వినోద్ అనే వ్యక్తులు.
▪️పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఫ్యామిలీని చంపేస్తామని బెదిరిస్తున్న ఏజెంట్లు.
▪️తిండిలేక, డబ్బులులేక యూరప్ రోడ్ల మీద సాయం కోసం ఎదురుచూస్తున్న యువకులు.
👉తెలంగాణలో ప్రతీకార రాజకీయం కొనసాగుతోంది*
రాజకీయాల్లో తొడగొట్టే సంస్కృతి ఏమాత్రం మంచిది కాదు
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు..ఫార్ములా ఈ లో ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను తప్పుబట్టకూడదు!..దురుద్దేశం లేకుండా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని రాద్దాంతం చేయడం తగదు!.. ప్రస్తుతం ఆర్భాటపు పాలన కొనసాగుతోంది తప్ప ప్రజాస్వామ్య పాలన లేదు..లోక్ సత్తా అధినేత డా. జయప్రకాశ్ నారాయణ్
👉*కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్*
ప్రధాని మోదీ విశాఖ పర్యటన సందర్బంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ ఆపాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులతో మద్దిలపాలెం జంక్షన్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ధర్నాకు దిగారు, ఈ సందర్బంగా పోలీస్ వారు అరెస్ట్ చేసి ఎం వి పి పోలీస్ స్టేషన్ కి తరలించారు, అరెస్ట్ అయిన వారిలో జాతీయ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ మరియు ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ మమతా నాగిరెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు, రాష్ట్ర కార్యదర్శి చినిబిల్లి శివ కుమార్ , విశాఖ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లిపిల్లి సతీష్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.
👉రుయా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుకు అన్ని విధాల చర్యలు*
*పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించాలనే ప్రభుత్వ ఉన్నత ఆశయానికి అనుగుణంగా వైద్య సేవలు అందించాలి :జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్*
తిరుపతి, జనవరి 08 :రుయా ఆసుపత్రిలో మెరుగైన పలు సౌకర్యాల ఏర్పాటుకు కమిటీ ఆమోదిస్తూ, పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించాలనే ప్రభుత్వ ఉన్నత ఆశయానికి అనుగుణంగా వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులను, సిబ్బందిని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు ఆదేశించారు.
బుధవారం స్థానిక ఎస్వీ వైద్య కళాశాల పాలన భవనం కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ హోదాలో అధ్యక్షత వహించి సంబంధిత కమిటీ సభ్యులతో సమీక్షలో పాల్గొని రుయా ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశాన్ని నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో SVRR ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ సమావేశంలో ఎన్. మౌర్య, మునిసిపల్ కమీషనర్, డా.పి.ఎ. చంద్రశేఖరన్, ఎస్.వి. మెడికల్ కళాశాలపిన్సిపాల్, ఎం.శివరామి రెడ్డి, ఎ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,డా॥ వి.బాలకృష్ణ నాయక్, తిరుపతి జిల్లా ఆరోగ్య & వైద్యాధికారి, డా॥ ఎస్. ఆనంద మూర్తి, జిల్లా డి.సి.హెచ్.ఎస్. మరియు రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా॥ జి రవి ప్రభు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు వారి సిబ్బంది, ఇంజనీర్లు మరియు ఇతర అధికారులు సమన్వయంతో పనిచేసి ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.
ఈ సందర్భంగా రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ రవి ప్రభు మెంబర్ కన్వీనర్ హోదాలో ముందుగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై తీసుకున్న చర్యలను కమిటీకి వివరించారు. అనంతరం అజెండా అంశాలపై కమిటీకి నివేదించారు. కమిటీలో మునుపటి HDS సమావేశం (18-10-2024) నాడు తీసుకొన్న తీర్మానాల స్థితిని తిరిగి సమీక్ష నిర్వహించగా మునుపటి సమావేశములో చర్చించిన విషయాలు దాదాపు పూర్తిగా అయ్యాయని తెలుపగా మిగిలిన వాటిని త్వరగా పూర్తి చేయవలసినదిగా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా నేటి బుధవారం సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు…డైట్ కాంటీన్ వద్ద పారిశుధ్య పైప్ లైన్స్ రిపైర్స్ మరియు ఇతర మరమ్మతులు కోసం రూ. 2.5౦ లక్షలు కేటాయించుటకు ఆమోదము తెలపడమైనది. గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ నందు భవన మరియు ఇతర మరమ్మతులు కోసం రూ. 7.5౦ లక్షలు కేటాయించుటకు ఆమోదము తెలపడమైనది. అలాగే TBC మరియు DST లాబరేటరీలో మరియు ఇతర మరమ్మతులు కోసం రూ. 9.5౦ లక్షలు కేటాయించుటకు ఆమోదము తెలపడమైనది. అవసరం మేరకు కార్యాలయము నందు పనిచేయు సిబ్బందికి కంప్యూటర్స్ మరియు UPS కొనుగోలు చేయుటకు ఆమోదము తెలిపారు. పిడియాట్రిక్ సర్జరీ OT నందు అనస్తీషియా వర్క్ స్టేషన్ కొనుటకు రూ. 1.35 లక్షలు కేటాయించుటకు కమిటీ ఆమోదించింది.
ICU మంచాలు- 10 కొనుటకు ఆమోదము తెలుపడమైనది.హెచ్.డి.యస్ చైర్మన్ గారు HDS కమిటీ కొరకు ఇద్దరు సభ్యులను ఎన్నుకోవడము జరిగినది.
ఈ కార్యక్రమంలో పలు విభాగాల వైద్య అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
👉జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు తదితర ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్*
⭐తిరుపతి,జనవరి 08: జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు, తిరుపతి రేణిగుంట బైపాస్ రోడ్డుకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలపై, నిర్మాణ పనులపైఎన్హెచ్ఎఐ, రెవెన్యూ సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మరింత వేగవంతం చేసి గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
బుధవారం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జాతీయ రహదారులకు, రైల్వే ప్రాజెక్ట్ పనులకు, తిరుపతి రేణిగుంట బైపాస్ రోడ్డు తదితరాలకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలపై, నిర్మాణ పురోగతిపై జెసి శుభం బన్సల్ తో కలిసి వారం వారం సమీక్షలో భాగంగా వర్చువల్ విధానంలో ఎన్హెచ్ఎఐ పిడి లు, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా,ఆర్డీఓ లు తిరుపతి, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి రామ్మోహన్,కిరణ్మయి,భాను ప్రకాష్ రెడ్డి సంబంధిత మండలాల తాసిల్దార్లు తదితర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి కొరకు చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్న కడప – రేణిగుంట , తిరుపతి – మదనపల్లి , రేణిగుంట – నాయుడుపేట 6 లేన్ వంటి రహదారులు నిర్మాణం, తిరుపతి బైపాస్ వేగవంతం చేయాలని, రేణిగుంట నుండి చెన్నై వరకు 4 లేన్ల రహదారి విస్తరణ పనులు కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని భూ సేకరణలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
భూసేకరణ పెండింగ్ అవార్డులు త్వరిత గతిన నిబంధనల మేరకు చేపట్టేలా ఉండాలని తెలిపారు. ప్యాకేజీ 2,3,4 జాతీయ రహదారి పనులు సాగరమాల కింద చేపట్టిన వాటిని పెండింగ్ లేకుండా రెవెన్యూ డివిజనల్ అధికారులు ఎన్ హెచ్ అధికారులు సమన్వయంతో నిర్దేశించుకున్న లక్ష్యాలను త్వరిత గతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
రైల్వే ప్రాజెక్టులు నడికుడి శ్రీకాళహస్తి ప్రాజెక్ట్ కు సంబంధించిన భూ సేకరణలో ఇబ్బందులు లేకుండా ఆర్డీఓ లు, తాశిల్దార్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుపతి పాకాల రైల్వే ట్రాక్ డబుల్ లైన్ కు సంబంధించిన భూ సేకరణ పనులలో పురోగతి ఉండాలని తెలిపారు. అలాగే తిరుపతి రేణిగుంట బైపాస్ సంబంధించిన పెండింగ్ భూ సమస్యలను పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ లను ఆదేశించారు.
ఈ సమావేశంలో పిడి ఎన్హెచ్ఎఐ లు తిరుపతి వెంకటేష్, నెల్లూరు ఎంకే చౌదరి, చెన్నై రవీంద్రరావు, తాసిల్దార్లు కలెక్టరేట్ విభాగం డిటి భాస్కర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
👉తెలంగాణకు కింగ్‌ఫిషర్ బీర్ల సరఫరా నిలిపివేత
టీజీ బీసీఎల్ బకాయిలు చెల్లించకపోవడంతో..
బీర్ల సరఫరా నిలిపివేసిన యునైటెడ్ బ్రూవరీస్
సెబీకి లేఖ ద్వారా తెలిపిన యునైటెడ్ బ్రూవరీస్
2019 నుంచి ధరలను సవరించకపోవడంతో..
భారీ నష్టాలు వస్తున్నాయన్న యునైటెడ్ బ్రూవరీస్
👉వంద కేజీల గంజాయి స్వాధీనం.. ఆరుగురు అరెస్ట్ : ఎస్పీ సుబ్బరాయుడు…
తిరుపతి ప్రతినిధి: తిరుపతి జిల్లాలో పోలీసులు గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపారు. ఒకే రోజు 100 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని 10మంది స్మగర్లను అరెస్ట్ చేశారు. ఎస్పీ సుబ్బరాయుడు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారంతో తడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీసిటీ జీరో పాయింట్ వద్ద సీఐ మురళీకృష్ణ, ఎస్ కొండప్ప నాయుడు, సిబ్బంది కాపుకాశారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఒక కారులో చెన్నైకి తరలించేందుకు సిద్ధంగా ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 28కిలోల గంజాయి, కారును తడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న వాటి విలువ సుమారు రూ.9.5లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. నిందితులు తమిళనాడులోని గుమ్మడిపూండికి చెందిన కె.షారుఖ్ ఖాన్ (24), జి.ఆరుళ్ (24)గా గుర్తించారు.షారుఖ్ ఖాన్‌పై ఇప్పటికే హత్య కేసు, నార్కోటిక్ డ్రగ్స్ కేసు, పలు గొడవల కేసుల్లో ముద్దాయిగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు. విచారణలో పసుపులేటి గిరిబాబు, మోహన్ మదన్ కుమార్, పంజనాథన్ అజయ్, మునుసుందరం కీరుబాకరణ్ నుంచి నిందితులు గంజాయి కొనుగోలు చేసి తమిళనాడు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
చిల్లకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో…
మండల పరిధిలోని కోట క్రాస్, కడివేడు గ్రామం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో రెండు కార్లను అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు తనిఖీలు చేశారు. సుమారు రూ.16లక్షల విలువ చేసే 72కేజీల గంజాయి గుర్తించి కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందిలను అరెస్ట్ చేశారు. విచారణలో కాకినాడ జిల్లా తుని ప్రాంతానికి వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, చెన్నై సమీపంలోని గుమ్ముడిపూండి, పుత్తూరు పరిసర ప్రాంతాలలో విక్రయిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుల్లో ముగ్గురు తమిళనాడు వాసులు కాగా ఒకరు పుత్తూరుకు చెందిన వారు ఉన్నారు.
నిందితులు తమిళనాడుకు చెందిన మోహన్ మదన్ కుమార్ (30), పంజనాథన్ అజయ్ (24), మునిసుందరం కీరుబాకరన్ (18), పుత్తూరుకు చెందిన పసుపులేటి గిరిబాబు (41)గా గుర్తించారు. గిరిబాబు గతంలో హోమ్ గార్డుగా పనిచేసినట్లు పోలీసుల నిర్ధారించారు.
కఠిన చర్యలు తప్పవు…
ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ… గంజాయి అక్రమ రవాణా, సంబంధిత నేరాలపై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని ఈ తరహా చర్యలు నిరంతరం కొనసాగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి రవాణా, విక్రయాలపై సమాచారం తెలిసిస్తే హెల్ప్‌లైన్ నెంబర్ 80999 99977, లేదా డయల్ 100 లేదా డ్రగ్స్ టోల్ ఫ్రీ నెంబర్ 14446 కు సమాచారం ఇవ్వాలని కోరారు. సురక్షితమైన, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకుందామని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కేసులో ఉత్తమ ప్రతిభ కనుబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవిమనోహరాచారి, డీఎస్పీలు రమణ కుమార్, చెంచు బాబు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
👉 రూ.1.89 కోట్ల గంజాయి కాల్చివేత..
ఖమ్మం జి ల్లాలోని మూడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో 71 కేసుల్లో పట్టుబ డిన 757 కేజీల గంజాయిని బుధవారం కాల్చివేశారు. కాల్చివేసిన గంజాయి విలువ రూ.1.89 కోట్లు ఉంటుందాని అంచనావేశారు.
ఖమ్మం ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ జనార్థన్‌రెడ్డి అదేశాల మేరకు ఖమ్మం 2, వైరా, సింగరేణి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు నాగేందార్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డిలతోపాటు అసిస్టేంట్ కమిషనర్ జి.గణేష్‌లు ఈ కాల్చివేత కార్యకమ్రంలో పాల్గోన్నారు.ఈ గంజాయిని ఖమ్మం జిల్లా గోపాల్ పేట గ్రామం,తల్లాడ మండలంలోని ఉన్న ఏ డబ్ల్యు ఎం కన్సటింగ్ లిమిటేడ్‌లో కాల్చివేశారు.
👉లంచం డిమాండ్ చేసిన ఎమ్మార్వో, వీఆర్వో, ఆర్ ఐ ల పై వేటు వేసిన జిల్లా కలెక్టర్ ..
👉ప్రకాశం జిల్లా కనిగిరి తహశీల్దార్ సిహెచ్.అశోక్ కుమార్ రెడ్డి, విఆర్ ఓ రాధ లపై లంచం డిమాండ్ చేసినందుకు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా వేటు వేశారు.._
*మ్యుటేషన్ అర్జీదారుని పట్ల దురుసుగా ప్రవర్తించిన ఆర్.ఐ. పురుషోత్తమరెడ్డి పై వేటు పడింది.._
*పునుగోడు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో అర్జీదారు ఫోన్ కాల్ రికార్డింగ్ కలెక్టర్ కు వినిపించగా, ఆరోపణల నేపథ్యంలో వారిపై విచారణకు ఆదేశించిన కలెక్టర్..
*విచారణ అనంతరం వారిపై నేడు వేటు వేసిన జిల్లా కలెక్టర్.. దీనిపై ప్రాథమిక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సరియా తెలిపారు.
(స్టాఫ్ రిపోర్టర్ రహమాన్)
*పెళ్ళుబుక్కుతున్న మత విద్వేష సునామి.. హిందువులు శంఖం ఊదాల్సింది అందుకు కాదు, మరెందుకు?* .. *విశాఖలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్* …రుయా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుకు అన్ని విధాల చర్యలు*జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు తదితర ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి: తిరుపతి జిల్లా కలెక్టర్ * ..*యూరప్ లో మోసపోయిన తెలుగు వారు …ప్రతీకార రాజకీయం కొనసాగుతోంది_డా. జయప్రకాష్ నారాయణ .. లంచం డిమాండ్ చేసిన ఎమ్మార్వో, వీఆర్వో, ఆర్ ఐ ల పై వేటు వేసిన జిల్లా కలెక్టర్ .. ఖమ్మం తిరుపతి జిల్లాలలో భారీగా గంజాయి పట్టివేత
Recent Posts