👉ఎంఎస్‌పీ పంజాబ్‌కే కాదు.. దేశమంతటికీ అవసరమే ..*తెలుగు తమ్ముళ్లకు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా.😲 ..హుస్నాబాద్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల లో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ … ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటులను పర్యవేక్షించిన జిల్లా అధికారులు ..*ఆత్మకూరులో ఇస్తేమ పనులను పర్యవేక్షించిన మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ .. *

👉ఎంఎస్‌పీ పంజాబ్‌కే కాదు.. దేశమంతటికీ అవసరమే✊✊✊
*కేంద్ర ప్రభుత్వానికీ విషయం తెలిసేలా చేయండి* …
*నిరశన దీక్ష చేస్తున్న రైతు నేత దలేవాల్‌ సందేశం*
చండీగఢ్: పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కు చట్టబద్ధత కేవలం పంజాబ్‌కే కాదు, దేశంలోని రైతులందరికీ అవసరమేనని నిరాహార దీక్ష చేస్తున్న పంజాబ్‌ రైతు నేత జగ్జీత్‌ సింగ్‌ దలేవాల్‌(70) పేర్కొన్నారు.
ఈ విషయం కేంద్రానికి తెలిసేలా చేయాలన్నారు. ఈ పోరాటంలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల రైతులు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పంజాబ్‌-హరియాణా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద దలేవాల్‌ చేపట్టిన దీక్షకు శనివారంతో 40 రోజులు పూర్తయ్యాయి.
దీన్ని పురస్కరించుకుని ఖనౌరీలో ఏర్పాటైన ‘కిసాన్‌ మహాపంచాయత్‌’నుద్దేశించి దలేవాల్‌ మాట్లాడారు. వేదికపైకి దలేవాల్‌ను స్ట్రెచర్‌పై తీసుకువచ్చారు.బెడ్‌పై పడుకుని సుమారు 11 నిమిషాలపాటు మాట్లాడారు. ‘ఎంఎస్‌పీ పంజాబ్‌ రైతులకు మాత్రమే దేశమంతటికీ అవసరమే. ఎంఎస్‌పీకి గ్యారెంటీ సహా మనం చేస్తున్న డిమాండ్లు సాధారణమైనవి కావన్న విషయం నాకు తెలుసు. వీటిని సాధించుకోవడం ఏ ఒక్కరి వల్లో అయ్యే పనికాదు కూడా. ఇప్పటి ఆందోళనల్లో రెండు రైతు సంఘాలు మాత్రమే పాలుపంచుకుంటున్నాయి.పంజాబ్‌ ఈ పోరాటాన్ని ముందుండి నడిపిస్తోంది. ఇతర రాష్ట్రాల రైతులు కూడా ఈ పోరులో పాల్గొనాలి. ఇది కేవలం పంజాబ్‌ డిమాండ్‌ మాత్రమే కాదు, యావద్దేశానిది. అనే సందేశాన్ని కేంద్రానికి వినిపించేలా చేయాలని చేతులు జోడించి వేడుకుంటున్నా’అని ఆయన పేర్కొన్నారు.
‘మనం గెలుస్తామనే విశ్వాసం నాకుంది. బల ప్రయోగం చేసేందుకు ప్రభుత్వం ప్రయతి్నంచినా మనల్ని మాత్రం ఓడించలేదు. నాకేమైనా పట్టించుకోను. మళ్లీ రైతులు ఆత్మహత్యలకు పాల్పడే అవసరం రాకూడదనే నా ప్రయత్నమంతా’అని వివరించారు. ‘దలేవాల్‌ ప్రాణాలు ముఖ్యమని సుప్రీంకోర్టు అంటోంది. నేనూ మనిషిని సరే, దేశవ్యాప్తంగా బలవన్మరణాలకు పాల్పడిన 7 లక్షల మంది సంగతేమిటని గౌరవ సుప్రీంకోర్టును అడుగుతున్నా’అని దలేవాల్‌ అన్నారు.
👉తెలుగు తమ్ముళ్లకు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా.😲😲😲…కాసుల వర్షం కురుస్తున్న సి.అర్. పి.బదిలీలు…బదిలీలు నిలిపివేస్తాం…2 లక్షలు ఇచ్చుకోండి….ప్రతి వార్డుల్లో తెలుగు తమ్ముళ్ళ సమావేశాలు….అంత ఇచ్చుకోలేము…దయచూడండి అంటున్న కొందరు సి.అర్. పి లు.
నంద్యాల.. నంద్యాలలో కొందరు తెలుగు తమ్ముళ్లకు సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టు సంబరపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తెలుగు తమ్ముళ్లు ఆడింది ఆట..పడింది పాటగా మారిందని తెలుస్తోంది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల బదిలీలు కొందరి నేతలకు చీకటి ఒప్పందాలు కలిసివచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.వివిధ ప్రభుత్వ శాఖల్లో అధికారుల హోదాకు తగ్గ చీకటి ఒప్పందాలు జరిగినట్టు సమాచారం.చీకటి ఒప్పందాలతో పోస్టింగ్ తెచ్చుకున్న అధికారులు వారు చెప్పినట్టు లంచాలు ఇవ్వకుంటే ఒక్క పని కూడా జరిగే పరిస్థితులు కనిపించడంలేదు.నంద్యాలలో ఏ ప్రభుత్వ కార్యాలయంలో చిన్న పని కావాలన్నా మినిమం అధికారులకు 30 వేలు ఇస్తే కానీ పని జరగడం లేదని కొందరు భాదితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రచార మాధ్యమాల్లో ఆధారాలతో సహా బహిర్గతం చేస్తున్న కూటమి ప్రభుత్వంలో అధికారులపై చర్యలు లేకపోవడంతో భాదితులు ఇబ్బందులు పడుతున్నారు.కొందరు అధికారులు పత్రికలు,టివిలు,సోషల్ మీడియా,గ్రూపుల్లో వచ్చినా మాకేమీ కాదు,ఎన్ని రాసుకున్నా పై స్థాయిలో,నేతలకు లక్షలు ఇచ్చి పోస్టింగ్స్ తెచ్చుకున్నాం మాకేమీ కాదు,మా పై చర్యలు ఉండవని అన్ని కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు చెప్పకనే చెపుతున్నారు.వివరాల్లోకి వెళితే ప్రజలకు మంచిసుపరిపాలన అందించాలని కూటమి ప్రభుత్వం అన్ని శాఖలు ప్రక్షాళన చేయాలని తలంచింది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని శాఖల్లో అయిదు ఏళ్ళు పని చేసిన అధికారులను బదిలీ చేశారు.ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమయంలో మెప్మా లో పని చేస్తున్న సి.అర్.పి.లు కొందరు వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బుజానికి వేసుకొని కొందరు పనిచేశారనే ఆరోపణలు వచ్చాయి.రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ప్రభుత్వం కొందరు సి.అర్. పి.లను బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చినట్టు సమాచారం.ఉత్తర్వులు వచ్చాయో లేదో ఎవరికి తెలియని పరిస్తితి.ఉత్తర్వులు బహిర్గతం చేయకుండా ప్రస్తుతం పనిచేస్తున్న సి.అర్. పి లతో కొందరు తెలుగు తమ్ముళ్లు సమావేశాలు నిర్వహిస్తున్నారు.బదిలీ కాకుండా చేస్తాం మాకు నజరానాగా 2 లక్షలు ఇస్తే బదిలీలు నిలిపివేస్తామని చర్చలు సాగిస్తున్నారు.కొందరు సి.అర్. పి లు మాత్రం మాకు మీకంటే పెద్దస్తాయి రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయి మమ్మల్ని కదిలించలేదు అని కొందరు,మరి కొందరు అంతా ఇచ్చుకోలేమూ,మాపై దయవుంచి కానికరించందని మరి కొందరు తెలుగు తమ్ముళ్ళతో చెప్పుకున్నట్టు తెలుస్తోంది.ఇక్కడే ఎందుకు ఉండాలని పట్టుబట్టడానికి కారణం అన్ని శాఖల్లో లేని ఆదాయం సి.అర్. పి లకు ఉండడమే ప్రధాన కారణం.ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పొదుపు సంఘాల ఏర్పాటు చేశారు.సంఘాలను బలోపేతం చేయడానికి మెప్మ కార్యాలయం ఏర్పాటు చేసి సి.ఎం.ఎం…సి.ఓ..సిఐ.అర్. పి లను నియమించారు.పట్టణంలో అన్ని వార్డుల్లో దాదాపు 4 వేల గ్రూపులు ఏర్పడ్డాయి.ఒకొక్క గ్రూపులో 10 మంది సభ్యులు ఉంటారు.గ్రూపు సభ్యులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చే సౌకర్యం కలిగింది.మహిళలు బ్యాంక్ ల్లో రుణాలు తీసుకొని వారి స్థాయికి తగ్గ వ్యాపారాలు చేసుకొని హాయిగా ఉండే వారు.గ్రూపులు పెరిగిపోవడం,బ్యాంక్ రుణాలు ఇవ్వడం,ప్రభుత్వాలు అధికారం కోసం రుణ మాఫీలు ప్రకటించడంతో కొందరు మహిళలకు రుణ మాఫీ వరంగా మారింది.ఈ నేపథ్యంలోనే సి.అర్. పి.లకు కనిపించని ఆదాయం లక్షల్లో కనిపించింది.ఒక గ్రూప్ కు బ్యాంక్ అధికారులు 10 లక్షలు లోన్ ఇస్తే ఆ గ్రూప్ కు చెందిన సి.అర్.ఫి కి 10 లక్షల లోన్ కు 10 వేలు గ్రూపు సభ్యులు అందరూ లంచం ఇవ్వాల్సిందే.లంచం ఇవ్వకపోతే లోను ఇప్పించారని గ్రూప్ సభ్యులు వారికి వచ్చే లోని ఆధారంగా వారికి లంచాలు ఇస్తున్న విషయం అందరికి తెలిసిన విషయమే.లక్షలు గడుస్తున్న సి.అర్. పి లు ఇతర ప్రాంతాల్లో నంద్యాల మాదిరిగా గ్రూపు లు ఉండవని ఆదాయం పోతుందని గ్రహించినట్లు సమాచారం.ఈ విషయాన్ని తెలుగు తమ్ముళ్లు కనిపెట్టి సమావేశాలు ఏర్పాటు చేసి భేర సారాలు మొదలు పెట్టారు.నాయకులకు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా చేస్తుండడం విశేషం.నిన్న ఒక ప్రాంతంలో జరిగిన సమావేశంలో ఒక సి.అర్. పి.బదిలీ విషయంలో తెలుగు తమ్ముళ్ళ మధ్య విభేదాలు రావడంతో అసలు విషయం బయట పడింది.ప్రధానంగా నంద్యాల పట్టణంలో ఉన్న సి.అర్. పి లకు అందరి కంటే ఆ సి.అర్. పి కి రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నాయని,వారు చెప్పిందే విధంగా నడుస్తుందనే గుస,గుసలు వినిపిస్తున్నాయి.కొన్ని ప్రాంతాల్లో సమావేశాలకు సి.ఎం.ఎం.తో పాటు సి.ఓ లు హాజరయ్యి సి.అర్. పి.ల బదిలీల్లో తెలుగు తమ్ముళ్లకు సహాయ సహకారాలు అందిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.సమావేశాల ఫోటోలు కె.ఎస్.కె.న్యూస్ వద్ద ఉన్న సమావేశాల్లో అందరూ మహిళలు కావడంతో ఫోటోలు పెట్టడం లేదు.ఏది ఏమైనా తెలుగు తమ్ముళ్లకు సంక్రాంతి పండుగకు ముందే సి.అర్. పి ల బదిలీలు తెలుగు తమ్ముళ్లకు ముందే సంక్రాంతి పండుగ వచ్చినట్టు అయ్యింది.పని ఒత్తిడి వల్ల నిన్న ఇవ్వాల్సిన వార్త ఈ రోజు ఇస్తున్నాను.ముఖ్యంగా ఈ వార్తకు సంబంధించిన ఆధారాల ఫోటోల కోసం వేచి ఉన్నాను….రైతుల వద్ద ముక్కు పిండి లంచాలు వసూళ్లు చేస్తున్న ఒక శాఖపై కె.ఎస్.కె.న్యూస్ లో త్వరలో మీ కోసం.
👉నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని తబ్లీగి ఇస్తేమా ముసలిమడుగు గ్రామస్తులు ఏర్పాటు చేసిన దావత్ కార్యక్రమంలో ఆంధ్రరాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ గ్రామస్తుల ఆహ్వామం మేరకు ముఖ్య అతిధిగా పాల్గొని ,తబ్లీగి ఇస్తేమా యొక్క పనుల గురించి మేనేజ్మెంట్ అమీర్ సాబ్ హాబీబుల్లా , ఇంజనీర్ ఇషాక్ సాబ్ లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు ఇస్తేమాలో నమాజ్ చేసుకొనే స్థలంలో స్వయంగా వారే గులక రాళ్ళ ఏరివేసి , వజుఖనా కోసం తవ్విన పైపులైను డోజర్ సహాయంతో మన్ను వేయడం జరిగింది అలాగే ఇస్తేమా స్థలం వద్ద కంకర చిప్స్ లను వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైనార్టీస్ నాయకులు రషీద్, బుచ్చి, సత్తార్, మరియు ఇస్తేమా మేనేజ్మెంట్ వలమాలు ,ముసలిమడుగు కూటమి నాయకులు షఫీవుల్లా ,రహీం ఖాన్ ,ఇక్బాల్ మరియు గ్రామస్తులు ,యువకులు తదితరులు పాల్గొన్నారు.
👉సీఎంఆర్ కాలేజ్ హాస్టల్ ఘటన.. ఇద్దరు అరెస్ట్*
*బాత్రూం వీడియోల కేసులో బీహార్ రాష్ట్రానికి చెందిన కిశోర్, గోవింద్ అనే ఇద్దరు వ్యక్తులు అరెస్ట్*
ఈ ఇద్దరూ దురుద్దేశపూర్వకంగా బాత్రూంలోకి తొంగిచూసినట్లు, అమ్మాయిల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్టు గుర్తింపు.*కాలేజ్ చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డి, వార్డెన్ ప్రీతితో సహా మరో ఏడుగురిపై కేసు నమోదు*

👉 రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వివిధ పోలీసు స్టేషన్లలో అధికారులు మరియు సిబ్బంది పనితీరు,సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించడానికి కమిషనర్ సుధీర్ బాబు ఆదివారం భువనగిరి_రూరల్_పోలీస్ స్టేషన్ సందర్శించారు.ఈ సందర్భంగా స్టేషన్ లోని రికార్డులను పరిశీలించడంతో పాటు రిసెప్షన్,పెట్రోలింగ్ స్టాఫ్ వంటి పలు విభాగాల పనితీరు, సీసీటీవీల_నిర్వహణ వంటి అంశాలను సమీక్షించారు. సమస్యాత్మక ప్రాంతాల సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
👉హుస్నాబాద్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల లో ఆకస్మిక తనిఖీలు చేసిన తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్!*
పెంచిన డైట్ చార్జీలు అమలవుతున్న తరువాత కామన్ మెనూ పై ఆరా తీయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన
విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన తర్వాత జీవితంలో లక్ష్య సాధనలో ఎలా విజయం సాధించవచ్చని విద్యార్థినులకు స్టోరీస్ చెప్పి చదువుల్లో మాత్రమే కాకుండా ఆటలు ,సైన్స్ ఇన్నోవేషన్ లో సైతం రాణించాలని విద్యార్థినులకు సూచించారు.విద్యార్థినుల ఆరోగ్యపరమైన అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.మంత్రి..సివిల్స్ ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్ హైదరాబాద్ కలెక్టర్ తో విద్యార్థినులతో మాట్లాడించారు.
👉చిత్తూరు జిల్లా పులిచర్ల సమీపంలోని తురక పేట వద్ద రూ. 16 లక్షల విలువ గల ఎర్రచందనం పట్టివేత. తమిళనాడుకు చెందిన స్మగ్లర్ అరెస్ట్.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పీలేరు ఫారెస్ట్ లైన్స్ డి ఎఫ్ ఓ గురు ప్రభాకర్….
👉రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జనవరి 6,7 తేదీలలో చిత్తూరు జిల్లా కుప్పం పర్యటన కు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది….*
*ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పూర్తిస్థాయి లో పర్య వేక్షిస్తూ అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ ముఖ్య మంత్రి రాక కు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ ఛందోలు,జిల్లా జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి,కడప పిడి వికాస్ మర్మత్…. పగడ్బందీగా ఏర్పాట్లు ను చేసి పరిశీలిస్తున్నారు..*
*జనవరి 6వ తేదీ కుప్పం నియోజక వర్గం గుడిపల్లి మండలం, ద్రావిడ యూని వర్సిటీ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ సిద్ధమైంది దీనితోపాటు ద్రావిడ యూనివర్సిటీ సమావేశపు మందిరం, నడమూరు సౌర విద్యుత్ ,శీగలపల్లి ప్రకృతి వ్యవసాయం. సిద్ధమయ్యాయి..*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు – చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్.మణికంఠ చందోలు,
❇️ఈ నెల 6,7 మరియు 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటన నిమిత్తం ఏ.ఎస్.ఎల్ (అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెన్) నిర్వహణ.
❇️ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగినంత పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాం.
❇️ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది కలుగకుండా కొన్ని ప్రాంతాలలో ట్రాఫిక్ మళ్ళింపు ఉంటాయి.
❇️ఈ బందోబస్తులో సుమారు 1200 మంది పోలీసు సిబ్బంది పాల్గొంటారు.
❇️బందోబస్తు విధులలో పాల్గొనే అధికారులకు మరియు సిబ్బందికి దిశానిర్దేశం చేసిన ఎస్పీ గారు.
❇️ప్రతి ఒక్కరు వారికి కేటాయించిన విధులలో ఎటువంటి అలసత్వం వహించకుండా ఉద్యోగాన్ని నిర్వర్తించాలి.
❇️ఈ నెల 6,7 మరియు 8వ తేదిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడానికి కుప్పం విచ్చేయుచున్న నేపద్యంలో ఈరోజు హెలిపాడ్ లు, ద్రవిడియన్ యూనివర్సిటీ ఆడిటోరియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, మరియు R&B గెస్ట్ హౌస్ మరియు ఇతర పర్యటన ప్రదేశాలలో వద్ద భద్రత పరమైన ముందస్తు ఏర్పాట్లపై (ASL) ను జిల్లా ఎస్పి వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపీఎస్., మరియు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి భద్రతా పరమైన అంశాలపై చర్చించారు.
❇️సమీక్షలో ఉన్నతాదికారులు మాట్లాడుతూ బందోబస్తు పటిష్టంగా ఉండాలని పోలీసులకు సూచనలు చేశారు. అలాగే గౌరవ సిఎం గారు తిరుగు ప్రయాణం అయ్యే వరకూ ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా గట్టి భద్రత కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైద్య శాఖ స్పెషలిస్ట్ డాక్టర్ల ఏర్పాటు, అంబులన్స్, సేఫ్ హౌస్, సేఫ్ హాస్పిటల్, ఫైర్ అధికారులు ఫైర్ సేఫ్టీ చర్యలు, ఫుడ్ సేఫ్టీ తదితర శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.
❇️బందోబస్తు అధికారులు మరియు సిబ్బందికి సూచనలు చేస్తూ రూట్ మ్యాప్ ను ప్రదర్శించి సి.యం గారి పర్యటనను గూర్చి క్షుణ్ణంగా వివరించారు.
❇️కాన్వాయ్ లో ఉన్న సిబ్బంది అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఎటువంటి పొరపాటుకు తావివ్వకూడదని వివరించారు.
❇️మీటింగ్ ప్లేస్, హెలిప్యాడ్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటుచేయాలని, అధికారులు, ముఖ్య నాయకుల వాహనాలకు మరియు ఇతరుల వాహనాలనకు పార్కింగు స్థలాలు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని పోలీసు అధికారులను ఎస్పీ గారు ఆదేశించారు.

7k network
Recent Posts

👉కర్రలతో కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ..* కేజీవాల్ కు అఖిలేష్ మద్దతు.. ”ఇదేంటి పవన్ ఇలా అనేశారు” .. *కుప్పం టీడీపీ కార్యాలయంలో ‘జన నాయకుడు’ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు .. ప్రకాశం జిల్లాలో కుక్కల స్వైర విహారం *గంజాయి గూచుల వద్ద 120 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న ఏసిపి..*ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే వారు స్వయంగా కంపోస్టు ఎరువు తయారు చేయండి:*కమిషనర్ ఎన్.మౌర్య*..👉 ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు: గిద్దలూరు సీఐ సురేష్ .. *ఆక్రమణకు గురైన మూడు ఎకరాల ప్రభుత్వ భూమి అప్పగింత* .. *ఆన్‌లైన్‌ బెట్టింగులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్…*రామ్ చరణ్, బాలయ్య సినిమాలపై హైకోర్టులో పిల్* 👉 బీజీపీ నేతలకు అద్దంకి దయాకర్ సవాల్ …*గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్? (కరీంనగర్).. * వైయస్ అభిషేక్ రెడ్డి మృతి..*

ప్రియాంక గాంధీపై బీజేపీ నేత ర‌మేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల ప‌ట్ల‌ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మంత్రి సీత‌క్క‌*.. *నవీన్ కి చెక్ పెట్టినట్లే కేజ్రీవాల్ కి కూడా ?.. *ఈ ఫార్ములా రేసులో కొన్ని నిజాలు *.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మెన్ జంగా రాఘవ రెడ్డి … ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మంత్రి సత్య కుమార్ యాదవ్* …ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా దోచుకున్న ఓం నారాయణ పై చర్యలు : లంబాడి హక్కుల పోరాట సంఘం.. *పొదిలి మాదిరెడ్డిపాలెం వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా ఎర్రం రెడ్డి

👉ఎంఎస్‌పీ పంజాబ్‌కే కాదు.. దేశమంతటికీ అవసరమే ..*తెలుగు తమ్ముళ్లకు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా.😲 ..హుస్నాబాద్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల లో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ … ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటులను పర్యవేక్షించిన జిల్లా అధికారులు ..*ఆత్మకూరులో ఇస్తేమ పనులను పర్యవేక్షించిన మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ .. *

👉ఏపీలో రేపటి నుంచి ఉచిత ఓపీ సేవలు బంద్ …* విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్..😲… *విశాఖ సెంట్రల్‌ జైల్ ను సందర్శించిన రాష్ట్ర హోం మంత్రి .. అగ్ని ప్రమాదాల పై అవగాహన సదస్సు.. *ఉచిత బస్సు కంటే ఇతర సంక్షేమ పథకాలకు ఖర్చు పెడితే బెటరేమో ! .. *అధికారులను సత్కరించిన పొదిలి పట్టణ టిడిపి అధ్యక్షుడు. . *నిలిచిపోయిన కాపు భవనాలను పునఃప్రారంభించాలి: బలిజ సేవ సంఘం డిమాండ్ .

2700 కోట్ల ఇల్లు.. రూ.10 లక్షల సూట్ ధరించే వారా విమర్శించేది? .. *పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్* .. *విజయవాడలో వెలుగు చూసిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం .. *చంద్రగిరి ‘బీసీ’ విద్యార్థినులకు మెరుగైన వైద్యం* *తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కు మంత్రి సవిత ఆదేశం*.. *ఆర్మీ వాహనం లోయలో పడి ఇద్దరు సైనికులు మృతి.. *పుత్తూరు సబ్ డివిజన్ పోలీసులు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు … మైలవరం లో మిక్సీంగ్ రాజకీయ సెగలు…! ..*రాజకీయ దుమారం రేపిన పాలడుగు దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే వసంత కలయిక… *ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ పోలీస్ సిబ్బంది జీవన విధానం ఉండాలి : ఐజి వి సత్యనారాయణ.. *పోలీసుల వేధింపులు తట్టుకోలేక హుజూర్‌ నగర్ పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం .. * డిగ్రీ విద్యార్థులకు కూడా తక్షణమే వర్తింప చేయండి..మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పివి శేషయ్య.

*రెవిన్యూ అధికారులకు పై సియం సీరియస్*…*ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు, కేసులు పెట్టే వారికి రక్షణ కల్పించేలా సర్కార్‌ చర్యలు.. *పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు పటిష్ట చర్యలు ; రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా…*కాంస్య పతకం సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఓరుగ‌ల్లు ముద్దుబిడ్డ .. *నితీష్ కి కన్ను గీటిన లాలూ..ఎన్డీయేలో కలవరమేనా ? ..*అమెరికాలో విచిత్రం ఇస్తున్న నోరో వైరస్ …*చైనాలో మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ