*రెవిన్యూ అధికారులకు పై సియం సీరియస్*…*ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు, కేసులు పెట్టే వారికి రక్షణ కల్పించేలా సర్కార్‌ చర్యలు.. *పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు పటిష్ట చర్యలు ; రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా…*కాంస్య పతకం సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఓరుగ‌ల్లు ముద్దుబిడ్డ .. *నితీష్ కి కన్ను గీటిన లాలూ..ఎన్డీయేలో కలవరమేనా ? ..*అమెరికాలో విచిత్రం ఇస్తున్న నోరో వైరస్ …*చైనాలో మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ

👉క్యాబినెట్ సమావేశంలో రెవిన్యూ అధికారులకు పై సియం సీరియస్*
క్యాబినెట్ సమావేశంలో రెవిన్యూ అధికారులకు పై సియం చంద్రబాబు సీరియస్ అయ్యారు. రెవిన్యూ సదస్సుల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రభుత్వానికి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఎప్పుడు పరిష్కారం అవుతాయి, ఎందుకు కావడం లేదు అని ప్రశ్నించారు సీఎం. అయితే త్వరలోనే పరిష్కారం అవుతాయని చెప్పారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా. మనకు ఓపిక ఉంది.. ప్రజలకు ఓపిక ఉండాలి కదా? ప్రజలు ఎన్ని రోజులు ఎదురు చూస్తారు అని ప్రశ్నించిన సీఎం.. 22A భూములు, ఇళ్ళ స్థలాలు వెంటనే ఎందుకు పరిస్కరించలేదు అని ప్రశ్నించారు. ఇక మొత్తం సమస్యలు పరిష్కారం చేసి ఒక రిపోర్ట్ ఇస్తామని చెప్పారు మంత్రి సత్యప్రసాద్..
👉 ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.* *ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు, కేసులు పెట్టే వారికి రక్షణ కల్పించేలా సర్కార్‌ చర్యలు..*లంచగొండి అధికారులపై కేసులు పెట్టే వారికి రక్షణ కోసం..
*ఏడీజీపీ స్థాయి అధికారికి ఏపీ ప్రభుత్వం బాధ్యతలు.*
*నోడల్‌ అధికారిగా ఇంటెలిజెన్స్‌ ఏడీజీపీ మహేష్‌ చంద్ర లడ్డా నియామకం.*
జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి, CRPFI ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ జాయింట్ సెక్రెటరీPR. డి. సురేష్, 9133366449. మరియు మండల సమాచార కేంద్రం,MCIC ఇంచార్జ్ ఎం నర్సింగరావు బొబ్బిలి విజయనగరం జిల్లా. Crpfi. గౌరవాధ్యక్షులు. ప్రజలు అవినీతి అంతం వైపు అడుగులు వేయండి చేయి చేయి కలపండి.. భావితరాల భవిష్యత్తు కోసం.💐💐💐
👉మహిళ పోలీస్‌ భారతి బాయిపై క్రిమినల్‌ కేసు నమోదు*
జమ్మలమడుగు : పట్టణంలోని 19, 20 సచివాలయ వార్డు మహిళ పోలీస్‌ భారతి బాయిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బి.రామక్రిష్ణ తెలిపారు.
పట్టణంలోని 19, 20 వార్డులో పింఛన్‌ ఇచ్చేందుకు లబ్ధిదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆమైపె ఫిర్యాదులు రావడంతో నగర పంచాయతీ కమిషనర్‌ కె.వెంకటరామిరెడ్డి మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆమైపె ఉన్నతాధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు.
👉జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్*
గుంటూరు జిల్లా కాకుమాను ఎంపీడీవో ఆఫీసులో మినిట్స్ పుస్తకం చించివేతపై ఉన్నతాధికారులు స్పందించారు. ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ వినోద్ ని సస్పెండ్ చేస్తూ జడ్పీ డిప్యూటీ సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన జరిగి నెలరోజులు దాటినా చర్యలు తీసుకోకపోవడంపై ఎమ్మెల్యే రామాంజనేయులు సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు. స్పందించిన అధికారులు చర్యలు చేపట్టారు.
👉అంగన్వాడి టీచర్ సస్పెండ్*
*చిన్నారులకు కోడిగుడ్లు పెట్టకపోవడంతో అధికారులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు*
*విచారణ చేపట్టి సస్పెండ్ చేసిన అధికారులు*
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్న చిన్నారులకు కోడిగుడ్లు పెట్టకపోవడంతో తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో విచారణ చేపట్టిన అధికారులు అంగన్వాడీ టీచర్ను సస్పెండ్ చేశారు
👉 పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించేలా గురుకులాల నిర్వహణ.-జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా..
⭐పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు పటిష్ట చర్యలు.రెసిడెన్షియల్ పాఠశాలలు, ⭐సంక్షేమ హాస్టల్స్ పర్యవేక్షణ పై సమీక్ష నిర్వహించిన కలెక్టర్.
రాజన్న సిరిసిల్ల జిల్లా : పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించేలా జిల్లాలోని గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్ కేజీబీవీలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్ పర్యవేక్షణ పై అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్, ఏకలవ్య మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇక నుంచి జిల్లా యంత్రాంగం పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని ప్రతి కేజీబీవి నిర్వహణలో ఆయా మండలాల ప్రత్యేక అధికారులు, తహసిల్దారులు, ఎంపిడిఓలు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని బాలికా రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవి లలో మహిళా సిబ్బంది మాత్రమే విధులు నిర్వహించేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. రానున్న 15 రోజులలో రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రభుత్వ హాస్టల్స్ లో చదివే విద్యార్థులకు హెల్త్ చెక్ అప్ నిర్వహణకు షెడ్యూల్ తయారు చేయాలని, ప్రతి నెల విద్యార్థులకు చెక్ అప్ జరగాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. హాస్టల్స్ లో పిల్లలకు అవసరమైన కనీస సదుపాయాల కల్పన చర్యలు చేపట్టాలని, డార్మంటరీలో పిల్లల సంఖ్య అనుగుణంగా అవసరమైన మంచాలు, దుప్పట్లు అందుబాటులో ఉండేలా చూడాలని, పిల్లలకు డైనింగ్ ఏర్పాట్లు, హాస్టల్స్ పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని అన్నారు. పిల్లల అకాడమిక్ సంబంధించి గణితం, సైన్స్, ఆంగ్ల భాష పై అధికంగా శ్రద్ధ పెట్టాలని అన్నారు. కేజిబీవి లోని విద్యార్థులకు ఈ సబ్జెక్టు ఆన్ లైన్ ద్వారా కోచింగ్ అందిస్తున్నామని, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సంతాప దినాలు ముగిసిన తర్వాత ఈ కోచింగ్ సౌకర్యాన్ని మిగిలిన రెసిడెన్షియల్ పాఠశాలలకు విస్తరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లోని స్టోర్ రూమ్, క్లీనింగ్ ఏరియా , వంట గది పరిసరాలు సంపూర్ణ పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. గురుకులాలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీ లను పారిశుద్ధ్య పర్యవేక్షణకు ఫార్మాట్ తయారు చేయాలని కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారికి సూచించారు. పిల్లలకు అందించే ఆహార నాణ్యత అంశంలో రాజీ పడడానికి వీలు లేదని, ఒక సారి వినియోగించిన నూనె మరొక సారి వాడ వద్దని అన్నారు. ఉపాధ్యాయులు కొరత ఎక్కడ ఉన్నా వెంటనే తెలియజేయాలని, పిల్లలు విద్యలో ఎక్కడ వెనుక పడవద్దని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కామన్ డైట్ ప్రకారం సరుకులు సరఫరా చేయని పక్షంలో కాంట్రాక్టర్ ను చేంజ్ చేయాలని అన్నారు. గురుకులాల నిర్వహణ సంబంధించి ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను ఎప్పటి కప్పుడు మండల స్థాయిలో పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో వేములవాడ రెవెన్యూ డివిజన్ అధికారి రాజేశ్వర్, జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, ఎస్.డి.సి. రాదాబాయి, మండల ప్రత్యేక అధికారులు ఆర్ సి ఓ లు ప్రిన్సిపల్ లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
👉 పారిస్‌ లో జరిగిన పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఓరుగ‌ల్లు ముద్దుబిడ్డ, పారా అథ్లెట్ దీప్తి జీవాంజికి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డు ప్రకటించడం పట్ల మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు. మానసిక సామర్థ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, కుంగిపోకుండా, విధిని ఎదిరించి తన శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటిన అథ్లెట్ దీప్తి జీవాంజి ప్రస్థానం ఎందరికో స్ఫూర్తినిచ్చిందని మంత్రి సురేఖ అన్నారు. దీప్తి జీవాంజికి తమ సహకారం ఎల్లవేళలా వుంటుందని మంత్రి తెలిపారు. దీప్తి మరెన్నో కీర్తి శిఖరాలను అధిరోహించాలని మంత్రి సురేఖ ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడారంగంలో అత్యున్నతంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నదని మంత్రి సురేఖ తెలిపారు. ఈ కార్యాచరణలో భాగంగా ఈ మధ్యే యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. సీఎం కప్ పేరుతో పోటీలు నిర్వహించి గ్రామీణుల్లో దాగిన ప్రతిభను వెలికితీస్తున్నామని అన్నారు. త్వరలోనే అత్యుత్తమ క్రీడాపాలసీని తీసుకువచ్చి దేశంలోనే క్రీడల రాజధానికిగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.
👉 హోసూరు బెంగళూరు జాతీయ రహదారి కర్ణాటక లోని బొమ్మసంద్ర పారిశ్రామిక వాడాలో బారి అగ్నిప్రమాదం.
వెయ్యిమందికి పైగా కార్మికులు పనిచేస్తున్న గార్మెంట్స్ కంపెనీలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించినట్లు సమాచారం…7 అగ్నిమాపక వాహనాలతో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది…కోట్ల విలువచేసే దుస్తులు అగ్నికీ ఆహుతైనట్లు తెలిసింది…ప్రాణనష్టం ఏమి లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్న యాజమాన్యం….
👉నితీష్ కి కన్ను గీటిన లాలూ..ఎన్డీయేలో కలవరమేనా ? కానీ ఆయన రాజకీయ జీవితంలో పార్టీలను మారుస్తూ కొత్త బంధాలను ఎప్పటికపుడు పెనవేసుకుంటూ సాగిన ధోరణులను మాత్రం అంతా వ్యతిరేకిస్తూనే ఉంటారు బీహార్ సీఎం నితీష్ కుమార్ నిజాయతీని ఎవరూ శంకించాల్సిన పని అయితే లేదు. కానీ ఆయన రాజకీయ జీవితంలో పార్టీలను మారుస్తూ కొత్త బంధాలను ఎప్పటికపుడు పెనవేసుకుంటూ సాగిన ధోరణులను మాత్రం అంతా వ్యతిరేకిస్తూనే ఉంటారు. దేశంలో ఇంతలా పార్టీలను మార్చే నేత మరొకరు ఉన్నారా అనిపీంచేలా నితీష్ కుమార్ అటూ ఇటూ మారుతూ తన రాజకీయ నీతి విషయంలో సందేహాలే మిగిల్చారు. ఆయన 2020లో బీహార్ లో ఎన్డీయే తరఫున ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ అయిదేళ్ల కాలంలోనే ఆయన బీజేపీ నుంచి ఇండియా కూటమికి వెళ్లారు. ఒక విధంగా చూస్తే ఇండియా కూటమి ఏర్పాటు వెనక నితీష్ కుమార్ ఉన్నారని చెప్పాల్సిందే. ఆయన ఇదంతా చేసింది ఇండియా కూటమికి సారధి కావాలని ఆ మీదట అవకాశం ఉంటే దేశానికి ప్రధాని కావాలని భావించారు.అయితే ఆయనకు ఇండియా కూటమిలో కీలక స్థానం దక్కకుండా చేసింది తోటి బీహారీ నేత ఒకనాటి సహచరుడు ఆర్జేడీ అధినేత అయిన లలూ ప్రసాద్ యాదవ్ నే అని అంటారు. ఆయన రాహుల్ గాంధీని కాంగ్రెస్ ని వెనకేసుకుని వస్తూ వారికే పెద్ద పీట ఉండాలని కోరుకుంటూ వచ్చారు. దాంతో నితీష్ కి ఇండియా కూటమిలో ఉంటే ఏమి జరుగుతుందో సీన్ మొత్తం అర్ధం అయింది. దాంతో ఆయన చేసేది లేక మళ్లీ గో టూ పెవిలియన్ అన్నట్లుగా ఎన్డీయే కూటమిలోకి వచ్చారు. అలా నితీష్ గత ఏణ్ణర్ధ కాలంగా ఎన్డీయే కూటమితోనె ఉన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో ఎన్డీయే అత్యధిక స్థానాలు సాధించింది. అంతే కాదు కేంద్రంలో మూడవసారి అధికారం అందుకుంది. నితీష్ నాయకత్వంలోని జేడీయూ కూడా కీలక మంత్రి పదవులు తీసుకుంది. ఎన్డీయేలో మూడవ అతి పెద్ద పార్టీగా జేడీయూకి గుర్తింపు ఉంది ఇక 2025 అక్టోబర్ లో బీహార్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ పేరునే ప్రకటిస్తారు అంటున్నారు. దాంతో ఆయన కూడా ఆ వైపునే ఉండి ఎన్నికల్లో పోరాడాలని చూస్తున్నారు.
⭐ఈ నేపథ్యంలో తాజాగా మాజీ సీఎం లాలూ యాదవ్ నితీష్ కుమార్ కి కన్ను గిటారు.ఇండియా కూటమిలోకి నితీష్ కి ఆహ్వానమని అన్నారు.ఆయన ఎపుడు వచ్చినా తలుపులు తెరచే ఉంటాయని కూడా రెడ్ కార్పెట్ ని పరచారు రాజకీయంగా చూస్తే ఇవి ఎన్డీయేని కలవరపరచే వ్యాఖ్యలే అంటున్నారు.కేంద్రంలో బొటాబొటీ మెజారిటీతో ఎన్డీయే సర్కార్ ఉంది.నితీష్ కుమార్ మద్దతు చాలా కీలకంగా మారింది. ఆ ఊతకర్రను లాగేయాలని ఇండియా కూటమి చూస్తోందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇపుడు నితీష్ ని తమ వైపు తిప్పుకుంటే కేంద్రంలో మోడీ సర్కార్ కి కష్టాలు తప్పవని అంటున్నారు. అందుకే తెలివిగా నితీష్ కి తలుపులు తెరచి ఉంచామని లాలూ చెప్పారని అంటున్నారు.
⭐అయితే దానికి బదులుగా నితీష్ కుమార్ ఏమి చెబుతున్నారు లాలూ అంటూ గట్టిగానే మాట్లాడారు. తాను ఎన్డీయే కూటమిలోనే ఉంటాను అని చెప్పారు. కానీ గతంలో రెండు సార్లు ఎన్డీయే కూటమి నుంచి ఫిరాయించి బయటకు వచ్చిన నితీష్ పట్ల అందరిలోనూ సందేహాలు ఉన్నాయి. మరి నితీష్ కుమార్ ని ముందు పెట్టి ఎన్డీయే కూటమికి భారీ షాక్ ని ఇచ్చేందుకు ఇండియా కూటమి కొత్త ఏడాదిలో సరికొత్త వ్యూహాలకు తెర తీస్తోందా అన్న చర్చ అయితే సాగుతోంది. మొత్తానికి 2025లో అడుగుపెడుతూనే లాలూ బాంబు పేల్చారు. నితీష్ వైపే ఇపుడు ఎన్డీయే పెద్దల చూపులు ఉన్నాయని అంటున్నారు.
👉 అమెరికాలో విజృంభిస్తున్న”నోరో ”వైరస్‌ అధికారుల వార్నింగ్‌ బెల్స్‌..!!
అమెరికాలో నోరో వైరస్‌ విజృంభిస్తోంది. డిసెంబర్‌ మొదటి వారంలో 91 కొత్త కేసులు నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
యూఎస్‌ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుండి వచ్చిన కొత్త డేటా ప్రకారం, నోరో వైరస్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. నవంబరు మొదటి వారంలో 69 కేసులు నమోదు కాగా, డిసెంబర్‌ తొలివారంలో ఈ సంఖ్య 91 కి పెరిగింది. వాంతులు , విరేచనాలకు కారణమయ్యే అంటువ్యాధి వైరస్ పెరుగుదలపై ఆరోగ్య అధికారులలో ఆందోళన మొదలైంది.
*నోరో వైరస్ అంటే ఏమిటి?
నోరోవైరస్. దీన్నే కడుపు ఫ్లూ లేదా కడుపు బగ్ అని పిలుస్తారు. జీర్ణకోశానికి సోకే ఈ వ్యాధి వాంతులు, విరేచనాలు కలిగించి రోగులను డీహైడ్రేట్ చేసి మరిన్ని ఆరోగ్య సమస్యల బారిన పడేస్తుంది. వాంతులు , విరేచనాలతో మొదలై కడుపు లేదా ప్రేగులలో మంటకు దారితీస్తుంది. ఈ పరిస్థితిని అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటిస్ అంటారు. చాలా మంది వ్యక్తులు 1-3 రోజుల్లో కోలుకుంటారు. కానీ వ్యాప్తి బాగా ఉంటుంది. నోరో వైరస్ సోకిన వారి నుంచీ ఇది నేరుగా సోకే అవకాశముంది.
లక్షణాలు వైరస్‌ సోకిన సాధారణంగా 12 -48 గంటల తర్వాత కనిపిస్తాయి. అతిసారం, వాంతులు, వికారం, కడుపు నొప్పి, జ్వరం, తలనొప్పి బాడీ నొప్పులు ఉంటాయి. మూత్రం సరిగారాకపోవడం, నోరు పొడిబారడం, కళ్లు తిరగడం, అసాధారణమైన నిద్ర లేదా గందరగోళం లాంటి లక్షణాలుంటాయి. వైరస్‌ సోకిన రెండు రోజులపాటు తీవ్రత అధికంగా ఉంటుంది. తర్వాత తగ్గుముఖం పడుతుంది.
నోరో వైరస్ ప్రధానంగా జీర్ణ కోశాన్ని ప్రభావితం చేస్తుంది. జీర్ణాశయం, తర్వాత కొనసాగింపుగా ఉండే పేగులపై అటాక్ చేస్తుంది. అందుకే ఇది సోకగానే కడుపులో మంట, వాంతి వచ్చేట్టు, కడుపులో తిప్పినట్టూ అవుతుంది. అనారోగ్యంతో ఉన్నవారు, పిల్లలు, సీనియర్‌ సిటిజన్స్‌ల్లో ఈ కేసులు ఎక్కువగా కనిపిస్తాయి.
👉*నివారణ, చికిత్స*⭐
నోరోవైరస్ అంటువ్యాధి కనుక ఈ వైరస్ వ్యాప్తికి పరిశుభ్రంగా ఉండటమే పెద్ద చికిత్స. ఆల్కహాల్ బేస్డ్ లిక్విడ్స్‌ కరోనా వైరస్‌ను చంపినట్టు నోరో వైరస్‌ను చంపలేవు.
ఆహారం తీసుకునే ముందు చేతులు శుభ్రంగా సబ్బు, నీటితో కడుక్కోవాలి.టాయిలెట్ యూజ్ చేసిన తర్వాత కూడా సబ్బుతో కాళ్లు,చేతులు శుభ్రం చేసుకోవాలి.క్లోరినేట్ చేసిన నీటిని వినియోగించుకోవాలి. ఎప్పటికప్పుడు ఉపరితలాలను శుభ్రం చేసుకోవాలి.పండ్లు, కూరగాయలను కడగాలి. బట్టలను కూడా వేడి నీటితో ఉతకడం మంచిది.*కాచి చల్లార్చిన నీటినే తాగడానికి వినియోగించాలి.**హైడ్రేటెడ్ గా ఉండేందుకు ఇంట్లోనే ఉండి, విశ్రాంతి తీసుకోవాలి..*వ్యాధి తీవ్రతను బట్టి IV ఫ్లూయిడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది.*
చాలా మంది వ్యక్తులు తదుపరి చికిత్స తీసుకోవలసిన అవసరం లేకుండా కొన్ని రోజుల వ్యవధిలో కోలుకుంటారు.
👉మరోసారి చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ..!!
మరోసారి చైనా వైరస్‌ల బారిన చిక్కుకుని విలవిలలాడుతుంది. పలు రకాల వైరస్‌ల వ్యాప్తితో చైనా ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల పాలవుతుండటంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
చైనాలో మల్టిపుల్ వైరస్‌ల మూకుమ్మడి వ్యాప్తి నేపధ్యంలో ఆ దేశంతో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. కోవిడ్-19తో పాటు ఇన్‌ఫ్లుయెంజా-A, HMPV, మైకోప్లాస్మా న్యూమోనియా వంటి వైరస్‌లు చైనాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతు న్నాయి.వైరస్ ల బారిన పడిన పేషెంట్లతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. మరోసారి దేశంలో వైరస్ కారక మరణాలు పెద్ద సంఖ్యలో సాగుతున్నాయని తెలుస్తోంది. హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించిన చైనా ప్రభుత్వం వైరస్‌ల వ్యాప్తిని అరికట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అక్కడి అధికార యంత్రాంగం వైరస్ ల నివారణ కోసమే అప్రకటిత యుద్ధమే చేస్తున్నారు.

7k network
Recent Posts

2700 కోట్ల ఇల్లు.. రూ.10 లక్షల సూట్ ధరించే వారా విమర్శించేది? .. *పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్* .. *విజయవాడలో వెలుగు చూసిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం .. *చంద్రగిరి ‘బీసీ’ విద్యార్థినులకు మెరుగైన వైద్యం* *తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కు మంత్రి సవిత ఆదేశం*.. *ఆర్మీ వాహనం లోయలో పడి ఇద్దరు సైనికులు మృతి.. *పుత్తూరు సబ్ డివిజన్ పోలీసులు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు … మైలవరం లో మిక్సీంగ్ రాజకీయ సెగలు…! ..*రాజకీయ దుమారం రేపిన పాలడుగు దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే వసంత కలయిక… *ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ పోలీస్ సిబ్బంది జీవన విధానం ఉండాలి : ఐజి వి సత్యనారాయణ.. *పోలీసుల వేధింపులు తట్టుకోలేక హుజూర్‌ నగర్ పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం .. * డిగ్రీ విద్యార్థులకు కూడా తక్షణమే వర్తింప చేయండి..మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పివి శేషయ్య.

*రెవిన్యూ అధికారులకు పై సియం సీరియస్*…*ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు, కేసులు పెట్టే వారికి రక్షణ కల్పించేలా సర్కార్‌ చర్యలు.. *పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు పటిష్ట చర్యలు ; రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా…*కాంస్య పతకం సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఓరుగ‌ల్లు ముద్దుబిడ్డ .. *నితీష్ కి కన్ను గీటిన లాలూ..ఎన్డీయేలో కలవరమేనా ? ..*అమెరికాలో విచిత్రం ఇస్తున్న నోరో వైరస్ …*చైనాలో మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్

*భవిష్యత్తు తెలుగు ప్రజలదే: సీఎం చంద్రబాబు … *పవన్ ను బీజేపీ యూజ్ మాత్రమే చేసుకుంటుందా? .. *జనసేన పార్టీ కార్యకర్త పై రౌడీ షీటర్ కత్తులతో రాడ్లతో దాడి! ..అమెరికాలో తెలుగు ముఠా బ్లాక్ మెయిలింగ్ ..అదనంగా రూ.6 వేల కోట్లు.. భారీగా టోల్ ట్యాక్స్ వసూళ్లు … శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు ఎంపీ మాగుంట, మంత్రి డోలా శ్రీ .. శుభాకాంక్షలు తెలిపిన మెహతాజ్ బేగం.(రైల్వే కోడూరు..అన్నమయ్యజిల్లా)*కావలిలో మహిళ దారుణ హత్య!

*యుటిఎఫ్ ప్రచార యాత్రకు ఘనస్వాగతం :*ఎంపీ మాగుంట చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ట్రెజరీ ఉద్యోగస్తులు : *సి ఎల్ ఆర్ విద్యాసంస్థల క్యాలెండర్ ఆవిష్కరణ : *బలిజ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ :* మిరప రైతులకు శిక్షణ (కంభం) : *ఖుర్ఆన్ కంఠస్థ పోటీలలో ప్రతిభ చాటిన కంభం విద్యార్థులు..

👉 అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు: పవన్ కళ్యాణ్… *రేవ్ పార్టీకి ఏర్పాట్లు*.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. *కేంద్రం నుంచి హోం శాఖ‌కు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్ .. 👉అవార్డులను పంపిణీ చేసిన సిఐడి అడిషనల్ డి‌జి‌పి డా.ఏ.రవిశంకర్ ..*మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది … ఏపీలో ప్రభుత్వ అధికారులపై ఆగని దాడులు .. *మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీపై దాడి.. *పేకాట అడుతూ పట్టుబడ్డ ఆరుగురు మహిళలు.