*భవిష్యత్తు తెలుగు ప్రజలదే: సీఎం చంద్రబాబు … *పవన్ ను బీజేపీ యూజ్ మాత్రమే చేసుకుంటుందా? .. *జనసేన పార్టీ కార్యకర్త పై రౌడీ షీటర్ కత్తులతో రాడ్లతో దాడి! ..అమెరికాలో తెలుగు ముఠా బ్లాక్ మెయిలింగ్ ..అదనంగా రూ.6 వేల కోట్లు.. భారీగా టోల్ ట్యాక్స్ వసూళ్లు … శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు ఎంపీ మాగుంట, మంత్రి డోలా శ్రీ .. శుభాకాంక్షలు తెలిపిన మెహతాజ్ బేగం.(రైల్వే కోడూరు..అన్నమయ్యజిల్లా)*కావలిలో మహిళ దారుణ హత్య!

👉భవిష్యత్తు తెలుగు ప్రజలదే: సీఎం చంద్రబాబు
AP: తెలుగు వారికి, భారతీయులు అందరికీ సీఎం చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై మాట్లాడుతూ.. “ప్రజల దర్శనం చేసుకున్నాక, దుర్గమ్మ దర్శించుకున్నాను. రాష్ట్రం అభివృద్ధి చెందేలా దుర్గమ్మ చల్లనిచూపు మనపై ఉంది. అందరికీ ఆదాయం పెరిగి, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా. ప్రజలకు మంచి జరిగేలా అనేక కార్యక్రమాలు చేపట్టాం. భవిష్యత్తు తెలుగువాళ్లదే, త్వరలోనే మరింత మంచిని చూస్తారు” అని పేర్కొన్నారు.
👉అమెరికాలో తెలుగు ముఠా*
*లక్ష డాలర్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్*
*అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో తెలుగు రెస్టారెంట్లు, షాపులు టార్గెట్ చేసి తూనికలు సరిగా లేవంటూ బెదిరిస్తూ లక్ష డాలర్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్*
*రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ తెలుగు యువకులు*
👉 అదనంగా రూ.6 వేల కోట్లు.. భారీగా టోల్ ట్యాక్స్ వసూళ్లు దేశంలో టోల్ గేట్ల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. గత ఏడాది కంటే అదనంగా రూ. 6 వేల కోట్లు సమకూరినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. దేశంలో టోల్ గేట్ల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. గత ఏడాది కంటే అదనంగా రూ. 6 వేల కోట్లు సమకూరినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2023 డిసెంబర్ 31 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న టోల్ గేట్ల ద్వారా రూ.62,293.4 కోట్లు వసూలైతే 2024 డిసెంబర్ 31 నాటికి ఈ మొత్తం రూ.68,037.60 కోట్లకు చేరింది. అంటే ఒక్క ఏడాదిలో దాదాపు రూ. 6 వేల కోట్లు అదనపు ఆదాయం వచ్చింది. దేశంలో మొత్తం 1040 టోల్ గేట్లు ఉన్నాయి. సుమారు 46,884 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులపై ఈ టోల్ గేట్లను ఏర్పాటు చేశారు. ఫాస్ట్ ట్యాగ్ ద్వారా వాహనాల నుంచి ఈ టోల్ గేట్లలో ట్యాక్స్ వసూలు చేస్తుంటారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది అదనంగా 4,289 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించి 94 టోల్ గేట్లు ఏర్పాటు చేశారు. దీంతో టోల్ ఆదాయం కూడా బాగా పెరిగింది. గత ఏడాది రోజుకు సగటున రూ.170.66 కోట్లు వసూలైతే, ఈ ఏడాది ఆ మొత్తం సగటున రూ.191.14 కోట్లకు చేరింది. ఫాస్ట్ ట్యాగ్ విధానం అమలులోకి తెచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్న నుంచి ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరుగుతోంది. అదేసమయంలో పన్ను ఎగవేతలు కూడా తగ్గిపోయాయి. రహదారులపై వాహనాలు గంటలకొద్దీ వేచిచూడాల్సిన అవసరం లేకపోయింది. రవాణా మెరుగు అవ్వడంతో పర్యాటక రంగం, దాని అనుబంధ రంగాలు బాగా అభివృద్ధి చెందాయి. ఫలితంగా టోల్ ట్యాక్స్ వసూళ్లు గణనీయంగా పెరిగినట్లు చెబుతున్నారు. టోల్ గేట్ల ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం పెరిగినా, ఆ మేరకు సౌకర్యాలు పెరగడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని జాతీయ రహదారుల్లో కనీస సౌకర్యాలు ఉండటం లేదని, అదేవిధంగా రహదారుల నిర్వహణ అధ్వానంగా ఉంటోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
👉 పవన్ ను బీజేపీ యూజ్ మాత్రమే చేసుకుంటుందా? మోడీ సర్కారులో పవన్ కల్యాణ్ కు ఉన్న పలుకుబడి అంతా ఇంతా కాదన్నట్లుగా ప్రచారం జరుగుతుంటుంది. ప్రముఖులు మాట్లాడే మాటలకు ఎందుకంత ప్రాధాన్యం అంటే.. వారి నోటి నుంచి అప్రయత్నంగా వచ్చే మాటలు విలువైన సమాచారాన్ని అందిస్తాయి. కాకుంటే.. వారి మాటల్లోని మర్మాన్ని.. ఒక మాటకు.. మరో మాటకు మధ్యనున్న లింకును అర్థం చేసుకోగలిగితే కొన్ని అంశాలపై క్లారిటీ వచ్చేస్తుంది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తన మాటలతో ఇప్పటివరకు కొన్ని అంశాల మీద కన్ఫ్యూజన్ ను క్లియర్ చేయటమే కాదు.. మరికొన్ని అంశాల మీద క్లారిటీ ఇచ్చేశారని చెప్పాలి. మోడీ సర్కారులో పవన్ కల్యాణ్ కు ఉన్న పలుకుబడి అంతా ఇంతా కాదన్నట్లుగా ప్రచారం జరుగుతుంటుంది. ఇటీవల మహారాష్ట్రలో ముగిసిన ఎన్నికల్లో బీజేపీ గెలుపులోనూ పవన్ పాత్ర ఉందని.. ఆయనకారణంగా కమలం పార్టీ మరిన్ని సీట్లను సొంతం చేసుకున్నట్లుగా జాతీయ మీడియా సైతం ప్రచారం చేసింది. ఈ సందర్భంగా ఎన్డీయే కూటమిలో పవన్ ఎంత కీలకమన్నట్లుగా వార్తలు వచ్చాయి. పవన్ కు మోడీ అమితమైన ప్రాధాన్యతను ఇస్తారని చెబుతారు. అయితే.. ఆ మాటల్లో నిజం ఎంతన్న విషయం పవన్ తాజా మాటలు అసలు విషయాల్ని చెప్పేస్తాయి. తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి అంశంపై అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇవ్వటమే కాదు.. ఆయన ఎమ్మెల్సీ అయ్యాకే.. మంత్రి అవుతారని స్పష్టం చేశారు. దీంతో.. పదవుల విషయంలో తమకు మరీ అంత కక్కుర్తి లేదన్న విషయాన్ని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తన చుట్టు ఉన్న వారికి సంబంధించిన కులాలు తెలియవని చెప్పిన పవన్ కల్యాణ్.. నాగబాబుకు అర్హత కారణంగానే మంత్రి అవుతున్నారే తప్పించి.. తన సోదరుడు కావటం వల్ల మాత్రం కాదని స్పష్టం చేయటం ఆసక్తికరంగా మారింది. దీనికి మించిన మరో ఇంట్రస్టింగ్ అంశం ఏమంటే.. నాగబాబుకు రాజ్యసభ సీటు కట్టబెట్టేందుకు పవన్ ప్రయత్నించారంటూ కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి.
తాజాగా ఆ విషయాన్ని పవన్ కన్ఫర్మ్ చేశారని చెప్పాలి.నాగబాబు ఎన్నో త్యాగాలు చేశారని.. గత ఎన్నికల్లో తాము పక్కాగా గెలిచే అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాల్సి ఉన్నా.. బీజేపీ కోరటంతో వదులుకున్నట్లు చెప్పారు. బీజేపీ కోసం పవన్ త్యాగాల పర్వం అక్కడితో ఆగలేదు. రాజ్యసభ అభ్యర్థిత్వం వస్తుందని అనుకున్నానని.. కానీ బీజేపీ వారి ఇబ్బందుల వల్ల ఇవ్వటం కుదర్లేదని చెప్పటం చూస్తే.. ప్రతి అంశంలోనూ పవన్ ను బీజేపీ వాడుకోవటమే తప్పించి.. ఆయనకు ఉపయోగపడిన వైనం కనిపించదు. తమకెంతో చేస్తున్న పవన్ కోరినట్లుగా రాజ్యసభ సీటు ఇవ్వకపోవటం దేనికి నిదర్శనం? మోడీ అనుకోవాలే కానీ.. పవన్ కోరిన రాజ్యసభ సభ్యత్వాన్ని కేటాయించటం పెద్ద కష్టం కాదు. కానీ.. అదేమీ జరగలేదంటే.. ఏమిటి అర్థమన్నదే అసలు పాయింట్. ఆ విషయం పవన్ మాటల కారణంగా అందరికి తెలిసిందని చెప్పాలి.
👉 *జనసేన పార్టీ కార్యకర్త పై రౌడీ షీటర్ కత్తులతో రాడ్లతో దాడి!* ఏలూరు జిల్లా*
*నూజివీడు మండలం, మర్రిభందం గ్రామం*
*జనసేన సైనికుడు* *దోనవల్లి వెంకట్రావు పై కత్తులతో రాడ్లతో దాడికి పాల్పడిన లేడీ రౌడీ షీటర్!*
*పాత కక్షలు గొడవ నేపథ్యంలో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న వెంకటరావు పై కత్తులతో రాడ్లతో జన సైనికుడిపై దాడికి పాల్పడిన వైనం!*
*వెంకట్రావుని కత్తితో నరకడంతో చేతి పై కత్తితో నరికి చంపడానికి ప్రయత్నించారంటూ సమాచారం!*
*జనసేన పార్టీ నాయకులు* *దొనవల్లి వెంకట్రావుని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళుతున్నా కుటుంబ సభ్యులు!* *పూర్తి వివరాలు తెలియాల్సింది* .
👉 నూతన సంవత్సరం సందర్భంగా ఒంగోలు లోని లాయరపేట లోనున్న శ్రీ శ్రీ షిరిడి సాయి బాబా మందిరం లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు,ఈ సందర్భంగా పెద్దలు సదా శివయ్య స్వామిని సన్మానించుకున్నారు. కార్యక్రమంలో తాతా ప్రసాద్,ఆత్మకూరి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు…* స్టాఫ్ రిపోర్టర్ రహిమాన్..
👉 ఒంగోలు V. I. P రోడ్ లో నున్న పద్మాలయాస్ బేకరీ సిబ్బంది తో కలిసి 2025 నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు యాజమాన్యం,సిబ్బంది తదితరులు ఈ సందర్భంగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు.
👉టంగుటూరు మండలం నాయుడుపాలెం గ్రామంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రివర్యులు డోలబాల వీరాంజనేయ స్వామి స్వగృహం నందు కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి,తాత ప్రసాద్ శ్రీనివాస రావు,బెల్లం సత్యం,శ్రీనివాసరావు (చంటి) మద్దెల శివ పాల్గొన్నారు.

👉 నూతన సంవత్సరం సందర్భంగా ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ను కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినారు.
👉 నూతన సంవత్సరం సందర్భంగా ఒంగోలు లోని మాగుంట కార్యాలయంలో అభిమానులు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్నారు.
👉 నూతన సంవత్సరం సందర్భంగా ఒంగోలు లోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఏ ఆర్ దామోదర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి.

👉తెలుగుదేశం పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్చార్జి ముక్క రూపానంద రెడ్డికి,మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్ రాయుడుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సయ్యద్ మెహతాజ్ బేగం.(రైల్వే కోడూరు…అన్నమయ్యజిల్లా)
👉వృద్ధురాలి ప్రాణాలు కాపాడిన పోలీసులు.*
దుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన అచ్చయమ్మ అనే వృద్ధురాలు
దర్శనం నిమిత్తం క్యూ లైన్‌లో వేచి ఉండగా కళ్లు తిరిగి పడిపోయిన వృద్ధురాలు
వెంటనే అప్రమత్తమై సంరక్షణ చర్యలకు పూనుకున్న వన్ టౌన్ పోలీసులు .వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్సను అందించడంతో ప్రస్తుతం వృద్ధురాలు సురక్షితం….
👉నెల్లూరు జిల్లా..కావలి పట్టణం లోని గాయత్రీ నగర్ లే అవుట్ లో ఓ ఇంట్లో అన్షిత బిస్వాల్ (24)అనే మహిళ అర్థరాత్రి దారుణ హత్య… రాత్రి నూతన సంవత్సరం వేడుకలు చేసుకొని ఇంట్లోనే అందరూ పడుకుని ఉండగా హత్య. బిశ్వాల్ కుటుంబం కలకత్తా రాష్ట్రానికి చెందిన వారు.మొలలకు మందు ఇచ్చే క్లినిక్ నడుపుతున్న బిశ్వాల్ కుటుంబం .వారి క్లినిక్ లో పనిచేసే యువకుడే బి ను హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్న స్థానికులు.
కావలి వన్ టౌన్ పోలీసులు అదుపులో నిందితుడు వున్నట్టు సమాచారం.

7k network
Recent Posts

2700 కోట్ల ఇల్లు.. రూ.10 లక్షల సూట్ ధరించే వారా విమర్శించేది? .. *పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్* .. *విజయవాడలో వెలుగు చూసిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం .. *చంద్రగిరి ‘బీసీ’ విద్యార్థినులకు మెరుగైన వైద్యం* *తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కు మంత్రి సవిత ఆదేశం*.. *ఆర్మీ వాహనం లోయలో పడి ఇద్దరు సైనికులు మృతి.. *పుత్తూరు సబ్ డివిజన్ పోలీసులు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు … మైలవరం లో మిక్సీంగ్ రాజకీయ సెగలు…! ..*రాజకీయ దుమారం రేపిన పాలడుగు దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే వసంత కలయిక… *ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ పోలీస్ సిబ్బంది జీవన విధానం ఉండాలి : ఐజి వి సత్యనారాయణ.. *పోలీసుల వేధింపులు తట్టుకోలేక హుజూర్‌ నగర్ పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం .. * డిగ్రీ విద్యార్థులకు కూడా తక్షణమే వర్తింప చేయండి..మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పివి శేషయ్య.

*రెవిన్యూ అధికారులకు పై సియం సీరియస్*…*ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు, కేసులు పెట్టే వారికి రక్షణ కల్పించేలా సర్కార్‌ చర్యలు.. *పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు పటిష్ట చర్యలు ; రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా…*కాంస్య పతకం సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఓరుగ‌ల్లు ముద్దుబిడ్డ .. *నితీష్ కి కన్ను గీటిన లాలూ..ఎన్డీయేలో కలవరమేనా ? ..*అమెరికాలో విచిత్రం ఇస్తున్న నోరో వైరస్ …*చైనాలో మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్

*భవిష్యత్తు తెలుగు ప్రజలదే: సీఎం చంద్రబాబు … *పవన్ ను బీజేపీ యూజ్ మాత్రమే చేసుకుంటుందా? .. *జనసేన పార్టీ కార్యకర్త పై రౌడీ షీటర్ కత్తులతో రాడ్లతో దాడి! ..అమెరికాలో తెలుగు ముఠా బ్లాక్ మెయిలింగ్ ..అదనంగా రూ.6 వేల కోట్లు.. భారీగా టోల్ ట్యాక్స్ వసూళ్లు … శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు ఎంపీ మాగుంట, మంత్రి డోలా శ్రీ .. శుభాకాంక్షలు తెలిపిన మెహతాజ్ బేగం.(రైల్వే కోడూరు..అన్నమయ్యజిల్లా)*కావలిలో మహిళ దారుణ హత్య!

*యుటిఎఫ్ ప్రచార యాత్రకు ఘనస్వాగతం :*ఎంపీ మాగుంట చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ట్రెజరీ ఉద్యోగస్తులు : *సి ఎల్ ఆర్ విద్యాసంస్థల క్యాలెండర్ ఆవిష్కరణ : *బలిజ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ :* మిరప రైతులకు శిక్షణ (కంభం) : *ఖుర్ఆన్ కంఠస్థ పోటీలలో ప్రతిభ చాటిన కంభం విద్యార్థులు..

👉 అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు: పవన్ కళ్యాణ్… *రేవ్ పార్టీకి ఏర్పాట్లు*.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. *కేంద్రం నుంచి హోం శాఖ‌కు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్ .. 👉అవార్డులను పంపిణీ చేసిన సిఐడి అడిషనల్ డి‌జి‌పి డా.ఏ.రవిశంకర్ ..*మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది … ఏపీలో ప్రభుత్వ అధికారులపై ఆగని దాడులు .. *మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీపై దాడి.. *పేకాట అడుతూ పట్టుబడ్డ ఆరుగురు మహిళలు.