👉 అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు: పవన్ కళ్యాణ్… *రేవ్ పార్టీకి ఏర్పాట్లు*.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. *కేంద్రం నుంచి హోం శాఖ‌కు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్ .. 👉అవార్డులను పంపిణీ చేసిన సిఐడి అడిషనల్ డి‌జి‌పి డా.ఏ.రవిశంకర్ ..*మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది … ఏపీలో ప్రభుత్వ అధికారులపై ఆగని దాడులు .. *మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీపై దాడి.. *పేకాట అడుతూ పట్టుబడ్డ ఆరుగురు మహిళలు.

👉అల్లు అర్జున్,రామ్ చరణ్,రేవంత్ రెడ్డి అందరు చిన్నప్పటి నుండి కలిసి తిరిగిన వాళ్లే..
రేవంత్ రెడ్డి వాళ్లకు సూపర్ సీనియర్ లాగా – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…
👉 అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు..
సమస్య మొత్తం అల్లు అర్జున్ మీద పెట్టి అతన్ని ఒంటరి వ్యక్తిని చేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…
👉పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన ఇద్దరు వైసీపీ నేతలు..జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ,ఆప్కో మాజీ ఛైర్మన్ గంజి చిరంజీవి..
👉 *రేవ్ పార్టీకి ఏర్పాట్లు*
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం బూరుగపూడి..
రేవ్ పార్టీపై సిఐ సత్యకిషోర్ కిషోర్ మాట్లాడుతూ…
బూరుగుపూడి నాగసాయి ఫంక్షన్ హాల్లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సోదాలు..రేవ్ పార్టీకి సిద్ధమైన 5గురు యువతులు,13 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నాము…ఫెర్టిలైజర్స్ ఏజెంట్స్ కి రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు నిర్ధారణ..నూతన సంవత్సర వేడుకలకు, ఈ రేవ్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు..
ఫెర్టిలైజర్స్ ఏజెంట్ గోపాలకృష్ణ ద్వారా ఫంక్షన్ హాల్ యజమాని సత్తి రాంరెడ్డి ద్వారా 18 వేలకు ఫంక్షన్ హాల్ బుకింగ్ చేసుకున్నారు..సంఘటన స్థలంలో మద్యం బాటిల్, సౌండ్ సిస్టం, టేబుల్లను స్వాధీనం చేసుకున్నారు..
ఫంక్షన్ హాల్ యాజమాన్యం ద్వారానే యువతులు కూడా అందుబాటులో ఉండడంతో ఫంక్షన్ హాల్ లో రేవ్ పార్టీ నిర్వహించారు. పరారీలో ఫంక్షన్ హాల్ హాల్ యజమాని..
61000 నగదు, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు… స్టేట్ కోఆర్డినేటర్ రజాక్ భాష
👉దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి మద్యం షాపులో నిద్ర పోయిన దొంగ..*
*మెదక్ జిల్లా:*
మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం సేవించి నిద్రపోయిన ఘటన నార్సింగిలోని కనకదుర్గ వైన్స్ లో జరిగింది.ఆదివారం రాత్రి వైన్ షాపు మూసేసి ఇంటికి వెళ్లిపోయాడు యజమాని.ఇదే అదునుగా భావించి దొంగతనానికి వచ్చిన దొంగ షాపులో దూరి కౌంటర్ లో ఉన్న నగదును,మద్యం బాటిళ్లను ఓ సంచిలో మూట కట్టుకున్నాడు.దొంగతనం తర్వాత మద్యాన్ని చూసేసరికి నోరూరి వెళ్ళేటప్పుడు ఫుల్లుగా మద్యం తాగి మత్తులోనే నిద్రపోయాడు.సోమవారం యదావిధిగా షాపు యజమాని షాపు తెరిచి చూడగా వైన్ షాపులో నిద్రపోయిన దొంగ చూసి కంగుతిన్నాడు..
👉అక్రమంగా తరిలిపోతున్న ఖనిజ సంపద…*
*బాపట్ల సూర్యలంక ఆదర్శనగర్ అటవీ ప్రాంతం లో రాత్రి సమయంలో సిలికా ఇసుకను అక్రమంగా అటవీ ప్రాంతం నుంచి సిలికా అక్రమ రవాణా మరో ఇసుక మాఫియాను తలపిస్తోంది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో సిలికాకు డిమాండ్… ఉండటంతో సిలికా అక్రమార్కులు నిబంధనలు తుంగలో తొక్కి యథేచ్ఛగా రవాణా సాగిస్తున్నారు. సిలికా తవ్వకాలపై హైకోర్టు నిషేధం విధించినా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంతో సిలికా మాఫియా బరితెగిస్తోంది. ఏపీలో బాపట్ల జిల్లా, నెల్లూరు జిల్లా గూడూరు లో సిలికా అధిక సంఖ్యలో ఉన్నాయి.సిలికా మైన్స్ నుంచి ఖనిజ సంపద తరిలిపోతుంది…
👉 మంగళగిరి లోని సి ఐ.డి ప్రధాన కార్యాలయంలో సిఐడి అడిషనల్ డి‌జి‌పి డా.ఏ.రవిశంకర్ ఆదేశాల మేరకు మొట్టమొదటి సారిగా ఆన్యువల్ రోలింగ్ అవార్డులు బహుకరించడం జరిగినది. కార్యక్రమం లో ఉత్తమ ప్రతిభ అద్భుతమైన పనితీరు కనబరిచిన వ్యక్తుల కృషికి గుర్తింపుగా షీల్డు, ప్రశంస పత్రాలు నగదు బహుమతులు అందజేత…
👉 కేంద్రం నుంచి హోం శాఖ‌కు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్
స‌చివాలయంలో హోంమంత్రి అనిత తో భేటీ
పోలీస్ శాఖ‌లోని ప‌లు శాఖ‌ అధికారుల‌తో స‌మీక్షా సమావేశం
విజ‌య‌వాడ‌ : తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయి పది సంవత్సరాలు కావస్తోన్నప్పటికీ కేంద్రం నుండి రావాల్సిన 118 కీలక శిక్షణ సంస్థల ఏర్పాటు జరగలేదు. విపత్తు నిర్వహణకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన రూ.1150 కోట్ల తాత్కాలిక నిధులను కూడా రాబట్టాల్సి ఉంది. అలాగే పోలీస్ స్టేషన్లు, జైళ్ళ ఆధునికీకరణకు కేంద్రం నుంచి పెండింగ్ నిధులు తీసుకువ‌చ్చేందుకు కృషి చేస్తాన‌ని కేంద్ర హోంశాఖ కమిటిలో సభ్యుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్ చెప్పారు.
కేంద్ర హోంశాఖ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడైన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)తో కలిసి సోమవారం రాష్ట్ర సచివాలయంలో హోం, విపత్తు నిర్వహణ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు. త‌న పేషీకి వ‌చ్చిన ఎంపి కేశినేని శివ‌నాథ్ కు మంత్రి అనిత సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ఎంపి కేశినేని శివ‌నాథ్ మంత్రి అనిత‌కు పుష్ప‌గుచ్చం అందించి శాలువాతో స‌త్క‌రించ‌టంతో పాటు శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి కొండ ప‌ల్లి బొమ్మ‌ను బ‌హుక‌రించారు.
ఈ స‌మావేశం అనంత‌రం ఎంపి కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ టెక్నాలజీ పెరుగుతూ నేర స్వరూపం మార్చుకుంటోన్న నేపథ్యంలో పోలీస్ స్టేష‌న్స్, జైళ్లు ఆధునీక‌రించేందుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం హోం మినిస్ట‌ర్ అనిత‌తో క‌లిసి కృషి చేస్తాన‌ని తెలిపారు. కేంద్ర హోంశాఖ కమిటిలో సభ్యుడిగా ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను హోంమంత్రి అనిత నేతృత్వంలో జనవరి 8,9 తేదీల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి త్వరలో వివరిస్తామన్నారు. అలాగే గ్రేహౌండ్స్,అప్పా వంటి కీలక సంస్థలను నెలకొల్పేందుకు కృషి చేస్తాన‌న్నారు.
ఈ సమీక్షా సమావేశంలో హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి , ఐజీ విజయకుమార్, ‘ఈగల్’ చీఫ్ ఆకే రవికృష్ణ, ఎస్పీ ఎస్ఐబీ, గీతాదేవి, జైళ్ల శాఖ అడిషనల్ ఎస్పీ రఘు, డీజీ ఫైర్ మాదిరెడ్డి ప్రతాప్, విపత్తునిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్, రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్ బ్రిగేడైర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
కడప జిల్లా S.P., కడప జిల్లా అడిషనల్ SP మరియు కడప సబ్ డివిజన్ DSP ల ఆదేశాల మేరకు తేది. 31.12.2024 న నూతన సంవత్సరం వేడుకల సంబంధించిన ఈ క్రింది సూచనలను జారీచేయడమైనది.
కమలాపురం సర్కిల్ (కమలాపురం మరియు వల్లూరు మండలాలు) పరిధిలో 30 Police Act అమలులో ఉంది.డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10.00 గంటల నుంచి ఉదయం 5.00 గంటల వరకు కమలాపురం మరియు వల్లూరు పొలీసు స్టేషన్ ఆధ్వర్యంలో, అన్ని ప్రధాన కూడళ్ళలో డ్రంక్ &డ్రైవ్ మరియు వాహన తనిఖీలు చేయబడుతుంది.మద్యం తాగి వాహనం నడపడం మోటర్ వాహనాల చట్టం 185 ప్రకారం నేరం. దానికి రూ.10,000/- జరిమానా లేక 6 నెలల జైలు శిక్ష.
డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు లేదా శాశ్వతంగా సస్పెండ్ చేయబడుతుంది.
కమలాపురం మండల పరిథి లోని సంబటూరు బస్టాండ్, కడప – కమలాపురం రోడ్ లోని నిర్మాణం లో ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుండి కమలాపురం అడ్డ రోడ్ వరకు, వల్లూరు మండలం లోని గణేషపురం నందు రాత్రి 10.00 గంటల నుంచి ఉదయం 3.00 గంటల వరకూ పోలీసుల గస్తీ ఉంటుంది.బైకులు అకారణంగా రోడ్లపైకి అనుమతించారు .మద్యం షాపులు గవర్నమెంట్ అనుమతించిన సమయం వరకే తెరచి వుంచాలి.
👉 తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం
న్యూఇయర్‌ సందర్భంగా రేపు రాత్రి ఉచిత రవాణా సదుపాయం హైదరాబాద్, సైబరాబాద్ రాచకొండ పరిధిలో..
ఉచిత రవాణా సదుపాయం అందిస్తామని వెల్లడి
500 కార్లు,250 బైక్ టాక్సీలు అందుబాటులో ఉంటాయని..తెలంగాణ ఫోర్‌ వీలర్స్‌ అసోసియేషన్‌ ప్రకటన
హైదరాబాద్ ఇంచార్జ్ అమీర్ షేక్..
👉మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది. జల్‌పల్లిలోని అడవిలో అడవి పందులను వేటాడిన విష్ణు సిబ్బంది.. అడవి పందులను వేటాడి తీసుకువెళ్లిన మేనేజర్ కిరణ్.. వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్లిన ఎలక్ట్రిషన్ దేవేంద్ర ప్రసాద్.. అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
👉 పట్నం నరేందర్‌రెడ్డికి పోలీసుల నోటీసులు.. ఎల్లుండి విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్న బొంరాస్‌పేట పోలీసులు.. రోటిబండ తండా ఘటనలో పట్నం నరేందర్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు.. బెయిల్‌పై ఉండి షరతులను ఉల్లంఘిస్తూ ప్రెస్‌మీట్‌ పెట్టారని నోటీసులు..వికారాబాద్‌:
👉 ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్‌ భరోసా ఫించన్లు పంపిణీ.. 63,77,943 మందికి ఫించన్ల పంపిణీ కోసం రూ.2,717 కోట్లు విడుదల.. నూతన సంవత్సరం నేపథ్యంలో 31వ తేదీనే ఫించన్లు పంపిణీ.. ఇప్పటి వరకు 80 శాతం మందికి ఫించన్ల పంపిణీ పూర్తి
👉ఏపీలో ప్రభుత్వ అధికారులపై ఆగని దాడులు
పెనమలూరు MPDO కార్యాలయంలో ఈవోపీఆర్డీపై దాడి
ఈవోపీఆర్డీ శ్రీనివాస్‌పై దాడి చేసిన బద్రి నారాయణ
పెనమలూరు పంచాయతీలో జరిగిన పనులు..నిధుల కేటాయింపుపై అర్జీలు వేసిన బద్రి నారాయణ
అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వలేదని దాడి చేశాడు-ఈవోపీఆర్డీ బొమ్మసాని శ్రీనివాస్
👉*ప్రొద్దుటూరులో ఎస్సై పై దాడి*
➤ ఓ ఎస్‌ఐపై స్టేషన్లోనే దాడికి పాల్పడిన ఘటన ప్రొద్దుటూరులో కలకలం రేపింది.
➤ కడప జిల్లా ప్రొద్దుటూరు గ్రామీణ ఠాణాలో మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీపై దాడి..
➤ ఎస్సై పై చేయి చేసకున్న రాజపాళెంకు చెందిన లింగమయ్య, అతని బంధువులు..
➤ ఎస్‌ఐ ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసిన సీఐ యుగంధర్‌..
👉భారతదేశంలోని ముఖ్యమంత్రులలో అత్యంత సంపన్నులుగా ఏపీ సీఎం చంద్రబాబు నిలిచారు.*
*అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం.. సీఎం చంద్రబాబు రూ.931 కోట్ల ఆస్తులతో తొలి స్థానంలో ఉన్నారు.*పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రూ.15కోట్ల ఆస్తులతో చివరి స్థానంలో ఉన్నారు.*ఇక మొత్తం 31 మంది సీఎంల ఆస్తుల విలువ రూ.1,630 కోట్లు అని నివేదిక వెల్లడించింది.*
👉పేకాట అడుతూ పట్టుబడ్డ ఆరుగురు మహిళలు.అరెస్ట్ కేసు నమోదు…*సత్యసాయి జిల్లా*
కదిరి టౌన్, పూల బజార్, బెస్త స్ట్రీట్ లోని డోర్ నెంబర్ 7/119 అను ఇంటిలో చింతలకుంట చెన్న కేశవులు, వయస్సు: 44 సంవత్సరాలు, అను వ్యక్తి తన స్వంత ఇంటిలో తాను, తన భార్యతో సహా మరో ఇదు మంది మహిళలు మొత్తము ఏడు మంది కలిసి జూదము ఆడుతూ ఉండగా ఈ దినము అనగా సాయత్రము సుమారు 4 గంటల సమయములో ఎస్సై, కె. బాబా జాన్ తన సిబ్బందితో కలిసి రైడ్ చేసి వారిని అరెస్టు చేసి వారి వద్ద నుండి మొత్తము 50,220/- రూపాయలు స్వాదీనము చేసుకొని వారిపై కేసు నమోదు చేయడము జరిగినది.
అలాగే మరొక చోట పేకాట ఆడుతున్న 11 మంది పేకాట రాయళ్ళు అరెస్ట్ కేసు నమోదు….కదిరి టౌన్, కుటాగుల్ల గ్రామ శివారులో ఉన్న పులివెందుల రోడ్ ప్రక్కన ఉన్న వాటర్ టాంక్ వద్ద పేకాట ఆడుతున్న కుటాగుల్ల గ్రామానికి చెందిన షేక్ రియాజ్ బాషా, వీర నారాయణ, శంకర, చలపతి, శ్రీరాములు, సూర్యనారాయణ, పూల ఉత్త్తన్న, మోహన్ రావు, గాలివీటి నారాయణ, ఫరూకి ఇమ్రాన్, ఓరకంటి కృష్ణా రెడ్డి అను వారిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 8,470/-లను స్వాధీనము చేసుకని కేసు రిజిస్టర్ చేయడము జరిగినది..*స్టాఫ్ రిపోర్టర్ రహిమాన్..

7k network
Recent Posts

2700 కోట్ల ఇల్లు.. రూ.10 లక్షల సూట్ ధరించే వారా విమర్శించేది? .. *పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్* .. *విజయవాడలో వెలుగు చూసిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం .. *చంద్రగిరి ‘బీసీ’ విద్యార్థినులకు మెరుగైన వైద్యం* *తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కు మంత్రి సవిత ఆదేశం*.. *ఆర్మీ వాహనం లోయలో పడి ఇద్దరు సైనికులు మృతి.. *పుత్తూరు సబ్ డివిజన్ పోలీసులు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు … మైలవరం లో మిక్సీంగ్ రాజకీయ సెగలు…! ..*రాజకీయ దుమారం రేపిన పాలడుగు దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే వసంత కలయిక… *ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ పోలీస్ సిబ్బంది జీవన విధానం ఉండాలి : ఐజి వి సత్యనారాయణ.. *పోలీసుల వేధింపులు తట్టుకోలేక హుజూర్‌ నగర్ పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం .. * డిగ్రీ విద్యార్థులకు కూడా తక్షణమే వర్తింప చేయండి..మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పివి శేషయ్య.

*రెవిన్యూ అధికారులకు పై సియం సీరియస్*…*ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు, కేసులు పెట్టే వారికి రక్షణ కల్పించేలా సర్కార్‌ చర్యలు.. *పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు పటిష్ట చర్యలు ; రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా…*కాంస్య పతకం సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఓరుగ‌ల్లు ముద్దుబిడ్డ .. *నితీష్ కి కన్ను గీటిన లాలూ..ఎన్డీయేలో కలవరమేనా ? ..*అమెరికాలో విచిత్రం ఇస్తున్న నోరో వైరస్ …*చైనాలో మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్

*భవిష్యత్తు తెలుగు ప్రజలదే: సీఎం చంద్రబాబు … *పవన్ ను బీజేపీ యూజ్ మాత్రమే చేసుకుంటుందా? .. *జనసేన పార్టీ కార్యకర్త పై రౌడీ షీటర్ కత్తులతో రాడ్లతో దాడి! ..అమెరికాలో తెలుగు ముఠా బ్లాక్ మెయిలింగ్ ..అదనంగా రూ.6 వేల కోట్లు.. భారీగా టోల్ ట్యాక్స్ వసూళ్లు … శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు ఎంపీ మాగుంట, మంత్రి డోలా శ్రీ .. శుభాకాంక్షలు తెలిపిన మెహతాజ్ బేగం.(రైల్వే కోడూరు..అన్నమయ్యజిల్లా)*కావలిలో మహిళ దారుణ హత్య!

*యుటిఎఫ్ ప్రచార యాత్రకు ఘనస్వాగతం :*ఎంపీ మాగుంట చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ట్రెజరీ ఉద్యోగస్తులు : *సి ఎల్ ఆర్ విద్యాసంస్థల క్యాలెండర్ ఆవిష్కరణ : *బలిజ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ :* మిరప రైతులకు శిక్షణ (కంభం) : *ఖుర్ఆన్ కంఠస్థ పోటీలలో ప్రతిభ చాటిన కంభం విద్యార్థులు..

👉 అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు: పవన్ కళ్యాణ్… *రేవ్ పార్టీకి ఏర్పాట్లు*.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. *కేంద్రం నుంచి హోం శాఖ‌కు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్ .. 👉అవార్డులను పంపిణీ చేసిన సిఐడి అడిషనల్ డి‌జి‌పి డా.ఏ.రవిశంకర్ ..*మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది … ఏపీలో ప్రభుత్వ అధికారులపై ఆగని దాడులు .. *మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీపై దాడి.. *పేకాట అడుతూ పట్టుబడ్డ ఆరుగురు మహిళలు.