👉 యుటిఎఫ్ ప్రచార యాత్రకు ఘనస్వాగతం : కాకినాడ యుటిఎఫ్ స్వర్ణోత్సవాలు జయప్రదం చేయాలని కోరుతూ శ్రీకాకుళంలో ప్రారంభమైన ప్రచార యాత్ర మంగళవారం కనిగిరి చేరుకుని అక్కడి నుంచి బేస్తవారిపేట మార్కాపురం మీదుగా సాయంకాలం పొదిలికి వచ్చింది. ఈ సందర్భంగా స్థానిక యుటిఎఫ్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
జూనియర్ కాలేజీ రోడ్లో యుటిఎఫ్ ప్రధాన కార్యాలయం వద్ద జెండాను విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఏ బాదుల్లా,జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ రవి, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు పిల్లి రమణారెడ్డిలు ఆవిష్కరించారు. ఉపాధ్యాయ ఉద్యమానికి దిశా నిర్దేశం చేసిన యూటీఎఫ్ సంఘం స్వర్ణోత్సవాలు జయప్రదం చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పి బాల వెంకటేశ్వర్లు,జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు బి బుచ్చిబాబు,పొదిలి,కొనకన మిట్ల మండలాల ప్రధాన కార్యదర్శులు పి వెంకటేశ్వర్లు,కే కామేశ్వర రావు,సీనియర్ నాయకులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
👉 నూతన సంవత్సరం సందర్భంగా నెల్లూరు లోని మాగుంట కార్యాలయంలో పుట్టా విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఈ సందర్భంగా పలువురు నాయకులు, మాగుంట అభిమానులు ఎంపీ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
👉 నూతన సంవత్సరం సందర్భంగా ఒంగోలు లోని మాగుంట కార్యాలయంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన సరస్వతి విద్యాసంస్థలు చైర్మన్ AV రమణారెడ్డి, తాత ప్రసాద్, బెల్లం సత్యం, ఆత్మకూరి బ్రహ్మయ్య, కుమార్.
👉 నూతన సంవత్సరం సందర్భంగా ఒంగోలు లోని మాగుంట కార్యాలయంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి చేతుల మీదగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ట్రెజరీ ఉద్యోగస్తులు షేక్.అబ్దుల్ ఖాదర్,పీవీ.నారాయణ, kv.కెనడి,కొండల రావు,విజయకుమార్,దర్విన్,రాజ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.*స్టాఫ్ రిపోర్టర్ రహిమాన్..
👉 సిఎల్ఆర్ విద్యాసంస్థల క్యాలెండర్ ఆవిష్కరణ*
కంభం పట్టణంలోని సిఎల్ఆర్ డిగ్రీ కళాశాలలో మంగళవారం నాడు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కళాశాల క్యాలెండర్ ను ఆ కళాశాల కరస్పాండెంట్ సయ్యద్ షా అలీ భాష,మరియు విద్యావేత్త బొల్లా గురవారెడ్డిలు కేక్ కట్ చేసి నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ అలీ భాష గారు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ కళాశాల డైరెక్టర్ సిరిగిరి బ్రహ్మం, సిఎల్ఆర్ డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం భూపని నారాయణ గుండాల ముక్తేశ్వరరావు, ఏనుగుల రవికుమార్, సిహెచ్ నారాయణ,ఎం శ్రీనివాస్ రెడ్డి,వనజ,బ్యూలా,డేవిడ్ పాలిశెట్టి నవీన్,ఉప్పు నారాయణ,అరుణ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
👉 శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను కంభం పట్టణంలోని ఉదయగిరి బృందావన కళ్యాణ మండపంలో సంఘ ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఉదయగిరి మల్లికార్జునరావు మాట్లాడుతూ అర్ధవీడు, కంభం, బెస్తవారిపేట మండలం లోని బలిజలు అందరూ సంఘంలో సభ్యత్వం తీసుకోవాలని ప్రభుత్వం ద్వారా అండవలసిన పథకాలు అందకపోతే సంఘం దృష్టికి తీసుకొని వస్తే వాటిని పరిష్కార దిశగా పోరాడతామని, బలిజ కులస్తులలో పేదవారు మరణిస్తే ఆ కుటుంబానికి అండగా నిలవడానికి పదివేల రూపాయలు మట్టి ఖర్చులకు సంఘం ద్వారా అందీయబోతున్నామని తెలియజేసారు.తల్లిదండ్రులు లేని పిల్లకు విద్యకు సంబంధించి వారికీ సంఘం ద్వారా తోడ్పాటు కల్పిస్తామని చెప్పారు.కార్యక్రమంలో అధ్యక్షుడు పగిడి వెంకటరమణ,కార్యదర్శి ఉదయగిరి మల్లిఖార్జునరావు, తాడవ వేంకటేశ్వర్లు,సోమిశెట్టి నారాయణ,కాల్వ బాల రంగయ్య,MPP మెడూరి వేంకటరావు, పగడాల పాండు, సంగ రమణ,ఆకుల మురళి, కోళ్ల రమణ,పత్తి రంగనాయకులు,పార్శ ఆదయ్య,పార్శ సుబ్బయ్య,కాకర్ల నరేంద్ర,కంఠ రామాంజనేయలు, మార్తోట ప్రసాద్,గంజి శ్రీనివాసులు,యన్నం కోటేశ్వరరావు,అన్నం నలబుల వెంకటేశ్వర్లు,ప్రసాద్,సందు నారాయణ,తాటిశెట్టి ప్రసాద్, కాకర్ల నరేంద్ర,పులి హర్ష,మునగాల బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
👉ఖుర్ఆన్ పఠనం ద్వారా బాల్యం నుంచే ఆధ్యాత్మిక, నైతిక విలువలు : UFQS & JIH
డిసెంబర్ నెల 29 వ తేదీన మార్కాపురంలో యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ & జమాఅతె ఇస్లామి హింద్ సంయుక్తంగా నిర్వహించిన పదవ ఖుర్ఆన్ కంఠస్థ క్వార్టర్ ఫైనల్ లో ప్రకాశం జిల్లాకు చెందిన 200 మంది విద్యార్థులలో 11 మంది విద్యార్థులు జనవరి 5వ తేదీన నెల్లూరులో జరిగే సెమీఫైనల్స్ కు ఎంపికయ్యారు. వారిలో కంభం పట్టణానికి చెందిన నలుగురు విద్యార్థినీ విద్యార్థులు ఎంపిక కావడం ఎంతో గర్వనీయమని జమాఅతే ఇస్లామి హింద్ పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ గౌస్ ఖాన్ కొనియాడారు.మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పార్క్ స్ట్రీట్ నుండి తన్సియా, ఆల్ఫా ఉన్నత పాఠశాల నుండి సాఖిబ్ మహమ్మద్ ఖాన్,కృపామృత ఉన్నత పాఠశాల నుండి ఉమామ పర్వీన్, వాసవి విద్యాసంస్థల నుండి ఆతికా తబస్సుమ్ లను జమాఅతే ఇస్లామీ హింద్ కంభం శాఖ సభ్యులు మొహమ్మద్ రఫీ, యం. రసూల్ బేగ్, పఠాన్ ఆసిఫ్ ఖాన్, రషీదుల్లా ఖాన్ జనాబ్ సద్దాం హుస్సేన్, షేక్షావలి తదితరులు పాల్గొని సన్మానించడం జరిగింది.
👉మిరప రైతులకు శిక్షణ కార్యక్రమం.. ప్రకాశం జిల్లా కంభం మండలంలోని లింగోజిపల్లి గ్రామంలో మిరప రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు .కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి రవీంద్రబాబు సీనియర్ సైంటిస్ట్ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ దర్శి వారు మాట్లాడుతూ మిరపలో సస్యరక్షణ, సమగ్ర పోషక యాజమాన్య చర్యల గురించి వివరించారు.ఇందులో భాగంగా పంట మార్పిడి తప్పనిసరి అని, ఒకే పంట పలుమార్లు వేయడం వలన పురుగు ఉధృతి ఎక్కువవుతుందని అన్నారు. సేంద్రియ ఎరువుల వాడకం పెంచి, నత్రజని ఎరువుల వాడకం తగ్గించాలని చెప్పారు. పురుగు మందులు చిట్కాలు పురుగు మందులు పిచికారి చేసేటప్పుడు సరైన సమయంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఆకులు తడిచేటట్లు స్ప్రే చేయాలని తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మిరప తోటలో తామర పురుగు ఉధృతి ఎక్కువగా ఉందని తెలిపారు. సిఫార్సు చేసిన మందులను మార్చి మార్చి పిచికారి చేసుకోవాలని, సూచించిన మోతాదుని పిచికారి చేయాలని తెలిపారు. చలి వాతావరణ పరిస్థితుల్లో సూక్ష్మ పోషకాల లోపాలు ఎక్కువ కనిపించే అవకాశం ఉన్నందున ఏదైనా సూక్ష్మ పోషక మందులను 2,3 సార్లు10 రోజుల వ్యవధిలోపిచికారి చేయవలెను సూచించారు. పూజలో తామర పురుగు ఉధృతి తగ్గించుకోవడానికి బ్రో ప్లాన్ లైట్, ఫ్లూక్స మెటా మైడ్, స్పైరో టెట్రామ్యట్ వంటి పురుగుమందులను మార్చి మార్చి పిచికారి చేసుకోవాలి అని సూచించారు. తామర పురుగులు ఉధృతి ఎక్కువ ఉన్నట్లయితే మాస్ ట్రాఫిక్ పద్ధతిలో ఎకరానికి 100 నుండి 150 జిగురు అట్టలు పెట్టవలెనని చెప్పారు. నీటి తడులు వ్యత్యాసం లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ శిక్షణ కార్యక్రమం అనంతరం మాగుటూరు గ్రామంలోని మిరప మరియు బత్తాయి తోటలను పరిశీలించడం జరిగినది. ఉద్యాన అధికారి మాట్లాడుతూ వేసిన ప్రతి పంట పంట నమోదు మరియు పంటల భీమా చేయించుకోవాలని తెలిపారు.కార్యక్రమంలో ఉద్యాన అధికారి డి శ్వేత,ఉద్యాన విస్తరణ అధికారి వై సి హెచ్. శేషగిరి, వ్యవసాయ సహాయకులు శ్రీమంతు,మరియు రైతులు పాల్గొన్నారు.
*యుటిఎఫ్ ప్రచార యాత్రకు ఘనస్వాగతం :*ఎంపీ మాగుంట చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ట్రెజరీ ఉద్యోగస్తులు : *సి ఎల్ ఆర్ విద్యాసంస్థల క్యాలెండర్ ఆవిష్కరణ : *బలిజ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ :* మిరప రైతులకు శిక్షణ (కంభం) : *ఖుర్ఆన్ కంఠస్థ పోటీలలో ప్రతిభ చాటిన కంభం విద్యార్థులు..
Recent Posts